అమెరికా నేవీకి ట్రంప్ కీలక ఆదేశాలు | trump order us navy shoot kill any boat mines strait of hormuz | Sakshi
Sakshi News home page

అమెరికా నేవీకి ట్రంప్ కీలక ఆదేశాలు

Apr 23 2026 7:14 PM | Updated on Apr 23 2026 7:34 PM

  trump order us navy shoot kill any boat mines strait of hormuz

అమెరికా- ఇరాన్‌ రెండో విడత చర్చలుకు రాయబారం నడుస్తోన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా ఆ జలసంధిని బ్లాకేడ్‌ చేసిన నేపథ్యంలో జలసంధిలో మందుపాతరలు పెట్టడానికి యత్నిస్తున్న ఏ నౌకలైనా   పేల్చిపడేయాలని తెలిపారు. ఈ మేరకు యుఎస్‌ నేవీని ఆదేశించినట్లు ప్రకటన విడుదల చేశారు.

పశ్చిమాసియాలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఓ వైపేమో శాంతి చర్చల ప్రస్థావన తెస్తూనే మరోవైపు అమెరికా- ఇరాన్ రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. కొద్ది సేపటి క్రితమే హర్ముజ్‌ జలసంధిలో తొలిసారిగా పన్నువసూలు చేసినట్లు ఇరాన్‌ పేర్కొంది. అమెరికా బ్లాకేడ్‌కు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం డొనాల్డ్‌ ట్రంప్ సైతం హర్ముజ్ విషయంలో తీవ్రంగా స్పందిచారు.

ట్రంప్ తన ట్రూత్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌లో ఈ మేరకు పోస్ట్ చేశారు."హార్ముజ్ జలసంధి ప్రయాణిస్తున్న ఏ నౌకలైనా సరే  ఏ బోట్‌లనైనా, అవి చిన్నవైనా పెద్దవైనా (వారి నౌకాదళ నౌకలన్నీ, మొత్తం 159 కూడా సముద్ర గర్భంలోనే ఉన్నాయి. పేల్చిపడేయాలని  నేను యునైటెడ్ స్టేట్స్ నేవీని ఆదేశించాను. ఇందులో ఎటువంటి సంకోచం ఉండకూడదు." అని ఆదేశించినట్లు తెలిపారు.

అయితే ప్రస్తుతం జలసంధిలో అమెరికా మైన్-క్లియరింగ్ (గనుల తొలగింపు) కార్యకలాపాలు ఇప్పటికే కొనసాగుతున్నాయని, ఆ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. అదనంగా మరిన్ని మైన్ 'స్వీపర్లు' హర్ముజ్‌కు తరలించాలని దానిని మూడు రెట్లు పెంచాలని  అమెరికా నేవీని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement