ఇండియా గ్రేట్‌ కంట్రీ | USA President Donald Trump Praises PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ఇండియా గ్రేట్‌ కంట్రీ

Apr 24 2026 5:14 AM | Updated on Apr 24 2026 5:14 AM

USA President Donald Trump Praises PM Narendra Modi

మాట మార్చిన ట్రంప్‌ 

న్యూఢిల్లీ: ట్రూత్‌ సోషల్‌లో తాను చేసిన రీపోస్టు వివాదాస్పదంకావడం, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నష్టనివారణ చర్యలకు దిగారు. డ్యామేజ్‌ను కంట్రోల్‌ చేసే పనిలో పడ్డారు. భారత్‌ చాలా గొప్ప దేశమని ప్రశంసించారు. ఆ దేశానికి తన మంచి మిత్రుడు(నరేంద్ర మోదీ) నాయకత్వం వహిస్తున్నాడని పేర్కొన్నారు. భారత్‌పై మోదీ ప్రశంసల వర్షం కురిపించినట్లు ఢిల్లీలోని అమెరికన్‌ ఎంబసీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ మేరకు గురువారం సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. అయితే, ఇండియా గ్రేట్‌ కంట్రీ అంటూ ట్రంప్‌ ఎక్కడ, ఎప్పుడు వ్యాఖ్యానించారో స్పష్టం చేయలేదు.   

Advertisement
 
Advertisement
Advertisement