ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు | Rasi Phalalu: Daily Horoscope On 22-04-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి వాహన, గృహయోగాలు

Apr 22 2026 3:51 AM | Updated on Apr 22 2026 4:56 AM

Rasi Phalalu: Daily Horoscope On 22-04-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.పంచమి ఉ.6.11 వరకు తదుపరి షష్ఠి రా.3.54 వరకు, నక్షత్రం: ఆరుద్ర రా.3.07 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: ప.12.31 నుండి 2.01 వరకు, దుర్ముహూర్తం: ప.11.33 నుండి 12.23 వరకు, అమృత ఘడియలు: సా.5.45 నుండి 7.14 వరకు.

సూర్యోదయం : 5.44
సూర్యాస్తమయం : 6.12
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం..... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం..... రుణయత్నాలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. అనారోగ్యం.

మిథునం..... శుభకార్యాలకు హాజరవుతారు. మీసేవలకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి.

కర్కాటకం... కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో తొందరపాటు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం.

సింహం.... ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్థిలాభం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సన్మానాలు, పురస్కారాలు.

కన్య..... చేపట్టిన పనులు పూర్తి. సంఘంలో గౌరవం. సోదరులు, మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. వాహన, గృహయోగాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

తుల.... ఇంటాబయటా ఒత్తిడులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.

వృశ్చికం... కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

ధనుస్సు... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆహ్వానాలు రాగలవు.

మకరం.... వ్యవహారాలు సానుకూలమవుతాయి. బంధువుల కలయిక. విందువినోదాలు. ఆస్తిలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కుంభం.... ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. పనుల్లో జాప్యం. బంధువులు, మిత్రులతో వివాదాలు. గృహ నిర్మాణయత్నాలు వాయిదా. వ్యాపారాలు మందగిస్తాయి.

మీనం.... ఇంటాబయటా బాధ్యతలు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement