వాషింగ్టన్‌ డీసీ ‘తెర’లపై ట్రంప్‌-ఎప్‌స్టీన్‌ వీడియోలు! | Trump And Epstein Videos Projected Onto Washington DC Buildings | Sakshi
Sakshi News home page

వాషింగ్టన్‌ డీసీ ‘తెర’లపై ట్రంప్‌-ఎప్‌స్టీన్‌ వీడియోలు!

Apr 25 2026 6:56 PM | Updated on Apr 25 2026 7:14 PM

Trump And Epstein Videos Projected Onto Washington DC Buildings

వాషింగ్టన్‌ డీసీ.. అమెరికా రాజధాని. ఇది చారిత్రకంగా వాస్తు శిల్ప పరంగా అత్యంత ప్రసిద్ధి చెందిన భవనాలతో నిండిన నగరం. ముఖ్యంగా వైట్ హౌస్, కాపిటల్ బిల్డింగ్, వాషింగ్టన్ మాన్యుమెంట్ వంటి నిర్మాణాలు ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందాయి. వాషింగ్టన్‌డీసీలో గోడలపై సాధారణంగా కళా ప్రదర్శనలు, రాజకీయ నినాదాలు, సామాజిక ఉద్యమాల పోస్టర్లు కనిపిస్తాయి.

అయితే  ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- లైంగిక నేరస్థుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌ వీడియోలు  వాషింగ్టన్‌ డీసీలో బిల్డింగ్‌ గోడలపై ప్రదర్శితమయ్యాయి. వాషింగ్టన్‌ డీసీ వెలుగుల్లోట్రంప్‌-ఎప్‌స్టీన్‌లు కలిసి ఉన్న వీడియోలను  ప్రదర్శించారు నిరసనకారులు.

అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లు.. మైనర్‌ బాలికలపై లైంగిక వేధింపుల సంబంధాన్ని మరింత ముడిపెడుతూ పలు దృశ్యాలను, దాంతో పాటు కొన్ని పత్రాలను వాషింగ్టన్ హిల్టన్ భవనం ముఖ భాగంపై ప్రదర్శించారు నిరసనకారులు.  ఈ వీడియోలలో ఎప్‌స్టీన్‌కు సంబంధించి ఫోటోలు, పత్రాలతో పాటు, అతని ఈ-మెయిళ్లను చదివి వినిపించనట్లుగా ఉన్న ఆడియో కూడా ఉంది.   వీటిని వాషింగ్టన్‌ డీసీ గోడలపై ప్రదర్శించిన కాసేపటికే జనం గుమిగూడిపోయి అలా చూస్తూ ఉండిపోయారు. ఎప్‌స్టీన్‌ ఫైళ్ల గురించి జనానికి తెలిసినా ఆ వీడియోలను మరొకసారి ఆసక్తిగా తిలకించారు జనం. 

అయితే వాషింగ్టన్‌ డీసీలో ఒక ముఖ్యమైన కార్యక్రమానికి  ట్రంప్‌ హాజరు కానున్న ఒక రోజు ముందు ఈ వీడియోలు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. వాషింగ్టన్‌ డీసీలో అధ్యక్ష హోదాలో ఏర్పాటు చేసిన విందుకు ట్రంప్‌ తొలిసారి హాజరు కానున్నారు. 

వైట్ హౌస్‌ కరస్పాండెంట్స్‌ అసోసియేషన్‌ నిర్వహించే ఈ విందు కార్యక్రమంలో సంప్రదాయంగా పదవిలో ఉన్న అధ్యక్షుడు కూడా పాల్గొంటారు. ఇది మీడియా స్వేచ్ఛను జరుపుకునే దీర్ఘకాలిక సంప్రదాయం. ప్రతి అధ్యక్షుడు తన పదవీకాలంలో కనీసం ఒకసారి హాజరయ్యారు. అయితే ట్రంప్ మాత్రం తన మొదటి పదవీకాలమంతా, అలాగే 2025లో కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. తాజాగా దీనికి హాజరయ్యే సందర్భంలో ఇలా వాషింగ్టన్‌ డీసీలో బిల్డింగ్‌ల ముఖభాగాలపై ఎప్‌స్టీన్‌తో కలిసి ఉన్న వీడియోలను నిరసన కారులు ప్రదర్శించడం ఇప్పుడు ట్రంప్‌కు మరింత తలనొప్పిగా మారింది. 

ఇటీవలే మీడియాపై ట్రంప్‌ చిందుకు తొక్కారు. తనపై మీడియా కక్ష కట్టిందని,  చెడ్డ వాడిగా ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తుందంటూ తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ట్రూత్‌లో రాసుకొచ్చారు ట్రంప్‌. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement