గన్‌ ఫొటోతో ఇరాన్‌కు వార్నింగ్‌ ఇచ్చిన ట్రంప్ | Donald Trump warning to Iran over nuclear deal | Sakshi
Sakshi News home page

గన్‌ ఫొటోతో ఇరాన్‌కు వార్నింగ్‌ ఇచ్చిన ట్రంప్

Apr 29 2026 3:09 PM | Updated on Apr 29 2026 4:21 PM

Donald Trump warning to Iran over nuclear deal

వాషింగ్టన్‌: పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుందనే ఊహాగానాల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఇకపై తాను మంచిగా ఉండదలచుకోవడం లేదంటూ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్‌లో ట్రంప్ గన్నుతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘ఇకపై నేను మంచిగా ఉండాలనుకోవడం లేదు. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ తన వైఖరి మార్చుకోవాలి. అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో వారికి తెలియదు. లేకపోతే దీర్ఘకాలిక ఆర్థిక, సైనిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది’అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో హర్మూజ్ జలసంధిలో దీర్ఘకాలిక బ్లాకేడ్ వ్యూహాన్ని అమలు చేయాలని ఆదేశించారు.

వైట్ హౌస్లో ట్రంప్‌ వ్యాఖ్యలు
వైట్ హౌస్‌లో ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా ఇప్పటికే పశ్చిమాసియాలో తన శత్రువులను సైనికంగా ఓడించిందని పేర్కొన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను అభివృద్ధి చేయడానికి అనుమతించబోమని ఆయన పునరుద్ఘాటించారు.

ఇరాన్ ప్రతిస్పందన
ఇరాన్ తాజాగా అమెరికాకు కొత్త ప్రతిపాదనను పంపింది. ఇందులో హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, యుద్ధాన్ని ముగించడం వంటి అంశాలు ఉన్నాయి. అణు చర్చలను తరువాత దశకు వాయిదా వేయాలని కోరింది. అమెరికా మాత్రం ఇరాన్ కనీసం 10 సంవత్సరాలపాటు యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ నిలిపివేయాలని, ఇప్పటికే ఉన్న ఎన్‌రిచ్‌డ్ యురేనియం తొలగించాలని డిమాండ్ చేస్తోంది.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement