మ‌లి విడ‌త చ‌ర్చ‌లు.. పాక్‌కు అమెరికా ప్ర‌తినిధులు! | USA-Iran Talks: Kushner-Witkoff Will Head To Pakistan JD Vance StandBy | Sakshi
Sakshi News home page

మ‌లి విడ‌త చ‌ర్చ‌లు.. పాక్‌కు అమెరికా ప్ర‌తినిధులు!

Apr 25 2026 12:30 AM | Updated on Apr 25 2026 1:04 AM

USA-Iran Talks: Kushner-Witkoff Will Head To Pakistan JD Vance StandBy

పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మ‌లి విడ‌త శాంతి చ‌ర్చ‌ల కోసం అమెరికా ప్ర‌తినిధులు బ‌య‌ల్దేరి వెళ్ల‌నున్నారు. ఈ నేప‌థ్యంలో అమెరికా ప్ర‌త్యేక రాయ‌బారి స్టీవ్ విట్కాఫ్‌, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్న‌ర్‌లు పాకిస్తాన్‌కు వెళ్ల‌నున్నారు. అయితే అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ వీరితో క‌లిసి వెళ్ల‌డం లేద‌ని అమెరికా వ‌ర్గాలు తెలిపాయి. 

ఇరాన్‌తో జ‌రిగే చ‌ర్చ‌ల్లో పురోగ‌తి క‌నిపిస్తే వాన్స్ పాకిస్తాన్‌కు వెళ్తార‌ని అధికారులు తెలిపారు. కాగా మ‌లి విడ‌త చ‌ర్చ‌ల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇప్ప‌టికే ఇస్లామాబాద్ చేరుకున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న పాకిస్తాన్‌కు బ‌య‌ల్దేరి వెళ్ల‌డానికి ముందు పాకిస్తాన్ డిప్యూటీ సీఎం, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ఫోన్‌లో చ‌ర్చించిన‌ట్లు  తెలుస్తోంది. 

దీంతో వ‌రుస హెచ్చ‌రిక‌ల‌తో ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకుంటున్న ఇరాన్‌, అమెరికాకు చెందిన ప్ర‌తినిధులు పాక్‌కు చేరుకోవ‌డం చూస్తుంటే రెండో విడ‌త శాంతి చ‌ర్చ‌లు ఉంటాయ‌నే అంచ‌నాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement