ట్రంప్‌ వల్లే యుద్ధం ఆగలేదు.. యూఎస్‌ రాయబారుల రాజీనామా! | Ex-US Envoy Says Trump Favoured Putin Over Ukraine After Step Down Amid Policy Dispute | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ వల్లే యుద్ధం ఆగలేదు.. యూఎస్‌ రాయబారుల రాజీనామా!

Apr 30 2026 8:57 AM | Updated on Apr 30 2026 9:38 AM

Ex-US envoy says Trump favoured Putin Over Ukraine

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు మరో బిగ​్‌ షాక్‌ తగిలింది. ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారుల పదవీ విరమణలు, మార్పుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రంప్‌ విధానాల వల్లే తాము రాజీనామాలు చేస్తున్నట్టు సదరు వ్యక్తులు ఆరోపించడం గమనార్హం. ఉక్రెయిన్‌ విషయంలో ట్రంప్‌.. పుతిన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపణలు చేయడం ఇక్కడ పెద్ద ట్విస్ట్‌. అందుకే ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం ఆగడంలేదని పరోక్షంగా చెప్పుకొచ్చారు.

ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారుల పదవీ మార్పులు తరచూ జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. బ్రిడ్జెట్ బ్రింక్ (2022–2025) అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. ఆమె తరువాత బాధ్యతలు చేపట్టిన జూలీ డేవిస్ కూడా 2026 జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ మార్పులు అమెరికా, ఉక్రెయిన్ సంబంధాల్లో అస్థిరతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయబారులు ఇద్దరూ ట్రంప్‌ విధానాలను వ్యతిరేకించడం సంచలనంగా మారింది.

బ్రిడ్జెట్ బ్రింక్ 2022 నుండి 2025 వరకు కీవ్‌లో పనిచేశారు. తాజాగా ఆమె.. మిచిగాన్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు పదేపదే అనుకూలంగా వ్యవహరించడం వల్లే తాను తన పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. నియంతల పక్షం వహించడం మన నైజం కాదంటూ ఘాటు విమర్శలు చేశారు. మన ప్రజాస్వామ్య భాగస్వామి కంటే పుతిన్‌కు ట్రంప్ పదేపదే వత్తాసు పలుకుతున్నప్పుడు నేను ఉక్రెయిన్ యూఎస్ రాయబారి పదవికి రాజీనామా చేశాను అన్నారు. ఈ పదవిలో ఏడాది లోపే పనిచేసిన తన వారసురాలు జూలీ డేవిస్ కూడా ఇలాంటి కారణాలతోనే వైదొలుగుతున్నారని ఆమె ఆరోపించారు. ఇదిలా ఉండగా, డేవిస్ ఈ ఏడాది చివర్లో పదవి నుంచి వైదొలిగి, మూడు దశాబ్దాల దౌత్య వృత్తికి ముగింపు పలుకుతూ పదవీ విరమణ చేస్తారని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

ట్రంప్ పరిపాలనలో ఉక్రెయిన్ విధానానికి వ్యతిరేకంగా మే 2025లో రాజీనామా చేసిన బ్రింక్ స్థానంలో, డేవిస్ గత ఏడాది మేలో తాత్కాలిక ప్రాతిపదికన బాధ్యతలు స్వీకరించారు. ఆమె కూడా.. పుతిన్‌కు ట్రంప్‌ మద్దతు ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ట్రంప్‌పై వీరిద్దరూ విమర్శలు చేయడాన్ని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ ఖండించారు. ఇదంతా నిజం కాదన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాశ్వత శాంతిని నెలకొల్పడానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు రాయబారి డేవిస్ గట్టి మద్దతుదారుగా ఉన్నారని కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement