ఇరాన్‌కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా? | China Jinping Interesting Comments On Strait of Hormuz | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?

Apr 21 2026 9:16 AM | Updated on Apr 21 2026 9:52 AM

China Jinping Interesting Comments On Strait of Hormuz

ఇరాన్‌, అమెరికా యుద్ధంలో నేపథ్యంలో ప్రస్తుతం అన్ని దేశాల దృష్టి హార్మూజ్‌ జలసంధిపైనే ఉంది. జలసంధిని తెరిచి నౌకల రాకపోకలు జరగాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. కానీ, ఇరాన్‌ మాత్రం.. హార్మూజ్‌ అంతర్జాతీయ జలమార్గం కాదని.. అది తమ భూభాగానికి చెందిన సముద్ర ప్రాంతమంటూ కొత్త పలుకు ఎత్తుకుంది. అందువల్ల నౌకలు వెళ్లడానికి ఇరాన్‌ అనుమతి అవసరమని, అలాగే టోల్‌ వసూలు చేసే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. ఇలాంటి తరుణంలో మొట్టమొదటి సారిగా హార్మూజ్‌ అంశంపై ఇరాన్‌ మిత్ర దేశం చైనా స్పందించింది. ఇరాన్‌కు షాక్‌ ఇచ్చే విధంగా జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు.

హార్మూజ్‌పై ఇరాన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌.. హర్మూజ్‌​ను అంతర్జాతీయ జలమార్గంగా అభివర్ణించారు. హార్మూజ్ జలసంధిని సాధారణ రాకపోకలకు తెరిచి ఉంచాలి. వెంటనే జలసంధిని తెరవాలని ఇరాన్‌కు సూచించారు. ఇది ప్రాంతీయ దేశాలు, అంతర్జాతీయ సమాజ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. తక్షణ, సమగ్ర కాల్పుల విరమణను చైనా సమర్థిస్తుందన్నారు. శాంతిని పునరుద్ధరించడానికి దోహదపడే అన్ని ప్రయత్నాలకు చైనా మద్దతు ఇస్తుంది. రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని సూచిస్తోందని పేర్కొన్నారు. కాగా, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం, ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన తర్వాత చైనా అధ్యక్షుడు తొలిసారిగా ప్రకటన చేయడం విశేషం.

అయితే, హార్మూజ్​ జలసంధి మూసివేత ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియాలో తీవ్రమైన ఇంధన కొరతకు దారితీసింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇరాన్ చమురును ప్రధానంగా దిగుమతి చేసుకునే చైనా, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

నౌకపై దాడులు.. చైనా ఆందోళన
మరోవైపు అమెరికా నావికా దిగ్బంధాన్ని ధిక్కరిస్తూ, చైనా నుంచి ఇరాన్ ఓడరేవుకు వెళ్తున్న ఒక సరకు రవాణా నౌకపై అమెరికా నేవీ కాల్పులు జరపడంపైనా చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటాయని, ఘర్షణలను రెచ్చగొట్టడం, ఉద్రిక్తతలను పెంచడం వంటివి మానుకుంటాయని భావిస్తున్నాం. అలాగే హార్మూజ్​ జలసంధిలో సాధారణ నౌకాయానాన్ని పునఃప్రారంభించడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తాయని మేము ఆశిస్తున్నాం’ అని పేర్కొంది.

హార్మూజ్‌ మూసివేతతో చైనాకు నష్టాలు
👉ఎనర్జీ సరఫరా అంతరాయం: చైనా క్రూడ్ ఆయిల్‌లో సుమారు 50% గల్ఫ్ దేశాల నుండి వస్తుంది. హార్మూజ్‌ మూసివేయడం లేదా దాడులు పెరిగితే, చైనాకు రోజుకు లక్షల బ్యారెల్స్‌ ఆయిల్‌ సరఫరా ఆగిపోతుంది.

👉ఆర్థిక ప్రభావం: ఇంధన ధరలు పెరగడం వల్ల చైనా పరిశ్రమలు, రవాణా, విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. ఇది GDP వృద్ధిని మందగింపజేస్తుంది. చైనా ఆర్థిక వృద్ధి 0.5–1% వరకు తగ్గే అవకాశం ఉంది.

👉వాణిజ్య నష్టం: ఇరాన్, గల్ఫ్ దేశాలతో చైనా వాణిజ్యం 40–50% వరకు తగ్గింది. ఇది చైనా ఎగుమతులు, దిగుమతులపై నేరుగా ప్రభావం చూపుతోంది. వాణిజ్యం తగ్గడం వల్ల చైనాకు బిలియన్ల డాలర్ల నష్టం జరుగుతుంది.

👉జియోపాలిటికల్ ఒత్తిడి: అమెరికా-ఇరాన్ ఘర్షణల కారణంగా హార్మూజ్‌ అస్థిరత పెరిగింది. చైనా తన నౌకలు, వాణిజ్య మార్గాలను రక్షించుకోవడానికి అదనపు ఖర్చు పెట్టాలి.

చైనా ప్రధాన ప్రత్యామ్నాయ మార్గాలు..
1. పైప్‌లైన్‌లు

  • రష్యా–చైనా పైప్‌లైన్‌లు: సైబీరియా నుండి చైనాకు నేరుగా ఆయిల్‌, గ్యాస్‌ సరఫరా.

  • మధ్య ఆసియా పైప్‌లైన్‌లు: కజకిస్తాన్, టుర్క్‌మెనిస్తాన్ నుండి గ్యాస్‌ సరఫరా. ఇవి హార్మూజ్‌ మీద ఆధారాన్ని తగ్గిస్తాయి.

2. ఆర్కిటిక్ సముద్ర మార్గం

  • రష్యా "నార్తర్న్ సీ రూట్" ద్వారా చైనాకు ఆయిల్‌, LNG సరఫరా పెరుగుతోంది. ఈ మార్గం హార్మూజ్‌, మలక్కా వంటి "చోక్‌పాయింట్‌"లను తప్పించగలదు.

3. స్ట్రాటజిక్ రిజర్వులు

  • చైనా వద్ద 90 రోజులకు సరిపడే ఆయిల్‌ రిజర్వులు ఉన్నాయి. హార్మూజ్‌ మూసివేత వంటి తక్షణ షాక్‌లను ఎదుర్కోవడానికి వీటిని ఉపయోగిస్తోంది.

4. ఎనర్జీ డైవర్సిఫికేషన్

  • పునరుత్పాదక శక్తి (సోలార్‌, విండ్‌)లో భారీ పెట్టుబడులు.

  • సూపర్‌గ్రిడ్‌ ప్రాజెక్ట్‌: దేశీయ విద్యుత్‌ ఉత్పత్తి పెంచి, ఆయిల్‌ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం వంటి చ‍ర్యలు తీసుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement