breaking news
Crime
-
‘నువ్వు చిన్న పిల్లవి కాదు.. నన్ను అర్థం చేసుకో’.. బీఈడీ విద్యార్థినితో లెక్చరర్
భువనేశ్వర్: లెక్చరర్ వేధింపుల కారణంగా ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఒడిశా రాష్ట్రం బాలాసోర్ విద్యార్థిని మృతి ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థిని వేధించిన ఇంటిగ్రేటెడ్ బీఈడీ విభాగ అధిపతి, లెక్చరర్ సమీర్ రంజన్ సాహూపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థిని ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్న ఫకీర్ మోహన్ కాలేజీ అంతర్గత ఫిర్యాదు కమిటీ (ఐసీసీ) సభ్యులు లెక్చరర్ సమీర్ రంజన్ సాహూను విధుల నుంచి తొలగించాలని యాజమాన్యానికి సిఫార్స్ చేసింది. కాలేజీ విద్యార్థుల నుంచి లెక్చరర్ సాహుపై వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ సమన్వయ కర్త జయశ్రీ మిశ్రా వెల్లడించారు. అయినప్పటికీ, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్యానల్ సభ్యులు సైతం ఇప్పటికే విద్యార్థినుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, క్లాసులు చెప్పే విధానం మార్చుకోవాలని లెక్చరర్ సాహూకు సూచించింది. ఈ సందర్భంగా విద్యార్థినుల పట్ల లెక్చరర్ సాహూ ఒడిగట్టిన ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అంతర్గత ఫిర్యాదు కమిటీ (ఐసీసీ) సభ్యురాలు మినాటీ సేథీ లెక్చరర్‌పై ఆరోపణలు చేశారు. క్లాసు జరిగే సమయంలో విద్యార్థినులు ఏ చిన్న తప్పు చేసినా తరగతి గది బయట నిలబెట్టేవారు. అలా లైగింక వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బాధిత విద్యార్థినిని కూడా అలాగే క్లాసు బయట నిలబెట్టారు. ఇదే విషయంపై లెక్చరర్ తీరును ప్రశ్నిస్తూ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుతో జూన్ 30న కాలేజీలో జరిగిన సెమిస్టర్ పరీక్షలను విద్యార్థినిని రాయనీవ్వలేదు. దీంతో ఆమె బాగా కృంగిపోయింది. ఎప్పుడైతే లెక్చరర్‌పై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిందో.. ఆ మరుసటి రోజు నుంచి విద్యార్థిని మానసికంగా, లైంగిక వేధింపులు గురైంది.దుర్ఘటనకు ముందు లెక్చరర్ సాహూకు.. మృతి చెందిన విద్యార్థిని మధ్య సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో సాహూ తనకు ఫేవర్ చేయమని నన్ను అడిగారు. అందుకు నేను .. మీకు ఏ విధమైన ఫేవర్ కావాలని అడిగాను. అలా నేను అడిగినప్పుడు నాకు ఎలాంటి ఫేవర్ కావాలో అర్ధం చేసుకోలేనంత చిన్నపిల్లవి కావు నువ్వు’ అని నన్ను అన్నారంటూ ప్యానల్‌కు ఫిర్యాదు చేసింది’అని సేథి అన్నారు.ఐసీసీ సభ్యులపై విద్యార్థిని తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. నా కుమార్తె మరణానికి ఐసీసీ సభ్యులే బాధ్యులు. నా కుమార్తె మరణంపై పక్షపాతంగా నివేదిక తయారు చేశారని అన్నారు. జులై 12న ఒడిశాలోని బాలాసోర్ ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన 20 ఏళ్ల బీఈడీ విద్యార్థిని ఆత్మహత్య ఆ రాష్ట్రాన్ని కలచివేసింది. కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ విభాగ అధిపతి, లెక్చరర్ సమీర్ రంజన్ సాహూ తనని మానసికంగా,లైంగికంగా వేధిస్తున్నారంటూ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తనని తాను నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యాయత్నంతో 95 శాతం కాలిన గాయాలైన విద్యార్థిని తోటి విద్యార్థులు ఎయిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ జూలై 14 రాత్రి మరణించారు. కాగా, విద్యార్థిని ఫిర్యాదు చేసిన సమీర్ కుమార్ సాహూపై కళాశాల అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) అతనికి క్లీన్ చిట్ ఇవ్వడంపై దుమారం చెలరేగింది. -
గండికోట బాలిక కేసులో మరో కొత్త మలుపు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: గండికోటలో బాలిక హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ప్రియుడు లోకేష్.. బాలికను హత్య చేయలేదని కర్నూలు రేంజ్ డీఐజీ తేల్చి చెప్పారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. మరో వైపు బాలిక సోదరుడే హత్య చేశాడంటూ చేస్తున్న ప్రచారం దారుణమని తల్లిదండ్రులు అన్నారు. ఎవరైనా చెల్లిని వివస్త్రను చేసి హత్య చేస్తాడా అంటూ ప్రశ్నించారు. బాలిక సోదరుడు సురేంద్ర పరువు కోసం హత్య చేశాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సురేంద్ర పాత్రను తల్లిదండ్రులు కొట్టి పారేస్తున్నారు.లోకేష్‌ని ఎన్కౌంటర్ చేయాలి: వైష్ణవి తల్లితన బిడ్డను హత్య చేసిన వారిని ఎన్కౌంటర్ చేయాలంటూ వైష్ణవి తల్లి పసుపులేటి దస్తగిరమ్మ అన్నారు. నా బిడ్డను కోల్పోయిన బాధలో నేనున్నా.. కొన్ని మీడియా ఛానళ్లు మా పై పనిగట్టుకొని వార్తలు రాస్తున్నాయి. మేమి చెప్పినవి వేయడం లేదు. ఇష్టం వచ్చినట్లు మాపై నిందలు వేస్తున్నారు. పాప కనిపించడం లేదని తెలిస్తే వెతుకులాడటం మేము చేసిన తప్పా.సొంత చెల్లెలిని అన్న చంపుతాడా? సొంత చెల్లెలిని అన్న చంపుతాడా? మరీ ఇంత క్రూరంగా వివస్త్రను చేసి చంపుకుంటామా...? అత్యాచారం జరగలేదంటే పాప ఒంటిపై గాయాలు ఎలా వచ్చాయి.?పోలీసులు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరపాలి. నిజానిజాలు తెలియపరచాలి. మాకు న్యాయం జరగాలి. అనుమానితున్ని తెలియపరిచాం. లోకేషే నా బిడ్డను చంపాడు. మాకు న్యాయం జరగాలంటే లోకేష్‌ని ఎన్కౌంటర్ చేయాలి. నాకు జరిగిన అన్యాయం ఇంకో తల్లికి జరగకూడదు’’ అంటూ వైష్ణవి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.కర్నూల్ రేంజీ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న గండికోటలో విద్యార్థి వైష్ణవి హత్య కేసులో ప్రియుడు లోకేష్ పాత్ర లేదని.. బాలికపై ఎటువంటి హత్యాచారం జరగలేదన్నారు. మాకు ఇవాళ కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభించాయి. రాత్రి 9.00 గంటలకు జిల్లా ఎస్పీ, జమ్మలమడుగు డీఎస్పీ పూర్తి వివరాలు మీడియాకు తెలియజేస్తారు’’ అని ఆయన తెలిపారు. -
బస్సులో ప్రసవం.. బయటకు విసిరి పారేసిన తల్లి
నెలలు నిండిన ఓ యువతి బస్సెక్కింది. సరిగ్గా ప్రయాణంలో ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. చప్పుడు కాకుండా ప్రసవించిన ఆమె.. ఆ బిడ్డను గుడ్డలో చుట్టి రోడ్డు మీదకు విసిరి పారేసింది. దీంతో ఆ పసిగుడ్డు అక్కడికక్కడే మరణించింది.మహారాష్ట్ర పర్బానీలో దారుణం జరిగింది. బస్సుల్లోనే బిడ్డను ప్రసవించిన ఓ యువతి.. ఆపై దారుణానికి ఒడిగట్టింది. కళ్లు తెరవని ఆ పసికందును రోడ్డు మీదకు విసిరి ప్రాణం తీసింది. ఈ వ్యవహారంలో 19 ఏళ్ల ఆ యువతితో పాటు భర్తగా చెప్పుకున్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పర్బానీ నుంచి పుణే వెళ్తున్న స్లీపర్ బస్సులో ఓ జంట ఎక్కింది. మంగళవారం ఉదయం 6.30గం. ప్రాంతంలో బస్సు సేలు రోడ్డుకు చేరుకోగానే.. బస్సులోంచి ఓ చిన్నమూట బయటకు పడింది. కిటికీలోంచి అది చూసిన డ్రైవర్.. అనుమానం వచ్చి బస్సును ఆపి ప్యాసింజర్ల దగ్గరకు వచ్చి ఆరా తీశాడు. అయితే..తన భార్యకు బస్సు జర్నీ పడలేదని.. వాంతి చేసుకుందని.. దానిని గడ్డలో చుట్టి పడేశామని సదరు వ్యక్తి చెప్పాడు. అయితే బస్సు ఎక్కే సమయంలో ఆమె గర్భంతో ఉన్న విషయం గమనించిన ఓ ప్రయాణికురాలికి ఈ వ్యవహారం అనుమానంగా తోచింది. తోటి ప్రయాణికులను అప్రమత్తం చేసింది. వాళ్లు విసిరేసిన గుడ్డ మూటను విప్పి చూడగా.. అందులో ఓ పసికందు కనిపించింది. దీంతో.. ప్రయాణికులంతా ఆ జంటను నిలదీశారు. తమ పేర్లు రితికా ధిరే, అల్తాఫ్ షేక్‌గా చెప్పుకున్న ఆ జంట.. ఏడాదిన్నరగా పుణేలో కాపురముంటున్నామని చెప్పారు. అయితే బిడ్డను పెంచి పోషించే స్తోమత తమకు లేదని.. అందుకే ఇలా చేశామని ఆ ఇద్దరు చెప్పారు. ఆపై ఎమర్జెన్సీ నెంబర్ 112 ద్వారా పోలీసులను ఈ సమాచారం అందించారు.పార్తీ స్టేషన్ పోలీసులు వచ్చి విచారణ జరపగా.. ఆ జంట భార్యభర్తలే అని నిరూపించేందుకు తగిన ఆధారాలు చూపించలేకపోయింది. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. డెలివరీ అయిన యువతిని ఆస్పత్రికి.. సదరు వ్యక్తిని జైలుకి తరలించారు. డిశ్చార్జి తర్వాత ఆ జంటను కలిపి విచారణ జరిపే యోచనలో పోలీసులు ఉన్నారు. మరణించిన ఆ మగశిశువుకు పోలీసులే అంత్యక్రియలు జరిపించారు. -
గండికోట: వైష్ణవిది హత్యా? పరువు హత్యా?
సాక్షి, వైఎస్సార్ కడప జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న వైష్ణవి(17) సోమవారం కాలేజీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరి విగతజీవిగా కనిపిచింది. ఇప్పటిదాకా తేలిన వివరాల ప్రకారం.. ఉదయం 8గంటలకు తన ప్రియుడు లోకేశ్‌తో బైక్‌పై గండికోటకు బయలుదేరింది. వీరు మధ్యలో పాలకోవ సెంటర్ వద్ద ఆగి కోవా తీసుకుని గండికోట టోల్ గేట్‌కు చేరుకున్నట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. అక్కడ 2 గంటల పాటు తిరిగి 10:47 నిమిషాలకు బైక్‌పై లోకేశ్ ఒక్కడే బయలుదేరినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది.వైష్ణవి కాలేజీకి రాలేదని యాజమాన్యం ఫోన్ చేసి చెప్పిందని, తాము కాలేజీకి వెళ్లి ఆరా తీస్తే వైష్ణవి గండికోటకు వెళుతున్నానని తన స్నేహితులకు చెప్పినట్లు తెలిసిందని మృతురాలి సోదరుడు సురేంద్ర పోలీసులకు చెప్పాడు. దీంతో తాము గండికోటకు వెళ్లి గాలించగా.. మంగళవారం ఉదయం తన సోదరి మృతదేహం కనిపించిందని పేర్కొన్నాడు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు లోకేష్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు.హత్యా? పరువు హత్యా.?సోమవారం ఉదయం 10:28 నిమిషాల వరకు వైష్ణవి, లోకేశ్ కలిసే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే సోమవారం ఉదయమే వైష్టవిని హత్య చేసి ఉంటే శరీరం డీకంపోజ్ అయ్యేదని, మృతదేహం చూస్తే రాత్రి చంపినట్లు ఉందని పోలీసులు గుర్తించారు. నిర్జన ప్రాంతంలో బాలిక బంధువులు మృతదేహం ఉందని గుర్తించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీంతో నిజంగా ఇది హత్యా లేక పరువు హత్యా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
ఐదు నెలలు.. 7000 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేవలం 5 నెలల వ్యవధిలో అక్షరాలా రూ.7వేల కోట్లను దేశ ప్రజల నుంచి కొట్టేశారు. దీనిని బట్టి చూస్తే మే– జూలై మధ్యలో సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తం రూ.10వేల కోట్ల వరకు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటీపీ ఫ్రాడ్ మొదలు డిజిటల్ స్కాం వరకు ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా మోసం చేస్తున్న నేరగాళ్లు లక్షల రూపాయిలు కొల్లగొడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేరాలు చేసే వారంతా ఆగ్నేయాసియా దేశాల వాళ్లు కాగా చేయించేది మాత్రం చైనీయులేనని నిఘా విభాగం స్పష్టం చేసింది.ఐ4సీ ఏం చెబుతోందంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని వివిధ దేశాలకు చెందిన సైబర్ నేరాలకు వివిధ దేశాలకు చెందిన వారు పాల్పడుతున్నారని హోంశాఖ గుర్తించింది. వివిధ మార్గాల్లో డబ్బు కొట్టేస్తున్న వాళ్లంతా మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్‌లకు చెందిన వారేనని ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) డేటా తేలి్చంది. వీరి వెనుక ఉన్నది మాత్రం చైనీయులేననేది ఐ4సీ స్పష్టం చేస్తోంది. నెలకు రూ. వెయ్యి కోట్ల వసూళ్లే లక్ష్యంగా వీరు అమాయకులను ఉచ్చులోకి దించుతున్నట్లు తెలిపింది.డబ్బంతా వెళ్లేది అటే.. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్(సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) డేటా ప్రకారం దేశంలో జనం నుంచి కొట్టేసిన డబ్బంతా ఆగ్నేయాసియా దేశాలకు వెళుతున్నట్లు వెల్లడైంది. జనవరిలో రూ.1,192 కోట్లు, ఫిబ్రవరిలో రూ.951 కోట్లు, మార్చిలో రూ.1,000 కోట్లు, ఏప్రిల్‌లో రూ.731 కోట్లు, మేలో రూ.999 కోట్లు కొట్టేసినట్లు సమాచారం. ఓటీపీ ఫ్రాడ్స్, డిజిటల్ స్కాం, పోలీసులమని చెప్పి కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడటం, క్రిప్టో కరెన్సీ, లాటరీ స్కాం, క్రెడిట్ కార్డు పాయింట్స్ క్లెయిం, ఈ నెంబర్‌పై ఆఫర్ ఉంది కారు గిఫ్ట్‌గా వస్తుందని చెప్పడం, పెళ్లి చేసుకోవడానికి యూఎస్ నుంచి వస్తున్నట్లు నమ్మబలకడం, లింకులు పంపి డబ్బు కొట్టేయడం తదితర మార్గాల్లో జనం నుంచి లాగేస్తున్నారు.మన వాళ్లే ఏజెంట్లు సైబర్ నేరాల పేరుతో అమాయకుల నుంచి డబ్బు కొట్టేసేందుకు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మనవాళ్లను ఏజెంట్లుగా నియమించుకోవడం గమనార్హం. ఇటీవల ఈ విషయాలు వివిధ రాష్ట్రాల పోలీసుల దర్యాప్తులు తేలాయి. మహారాష్ట్ర, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వందల కొద్దీ ఏజెంట్లు సైబర్ నేరగాళ్ల సహకరిస్తున్నారు. చైనా నుంచి కీలక వ్యక్తుల సూచనలు.. మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్‌లకు దేశాల నేరగాళ్ల ఆదేశాలతో మనవాళ్లు నేరాల్లో ప్రత్యక్షంగా భాగస్వాములుగా మారుతున్నట్లు గుర్తించారు. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని, వీరి ఉచ్చులో పడొద్దని కేంద్రం పదేపదే హెచ్చరిస్తున్నా కేటుగాళ్లఉచ్చులో జనం పడుతుండటం గమనార్హం. -
డ్రగ్స్ పెడ్లర్లుగా పోలీసుల సుపుత్రులు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు మాదక ద్రవ్యాల రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటే.. మరోవైపు వారి కొడుకులే డ్రగ్స్ పెడ్లర్లుగా దందా నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఓ డీసీపీ కుమారుడు మోహన్‌ను డ్రగ్స్ కేసులో సైబరాబాద్ ఈగల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ వింగ్ (ఎస్ఐబీ) ఓఎస్డీ కొడుకు రాహుల్తేజను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇటీవల అరెస్టయిన కొంపల్లిలోని మల్నాడు కిచెన్ యజమాని, అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ సూర్య అమ్మినేని సెల్‌ఫోన్ కాల్ డేటా, ఇతరత్రా సాంకేతిక ఆధారాలను విశ్లేషించగా.. వీరికి సూర్యతో సత్సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వా«దీనం చేసుకున్న ఈగల్ బృందం వాటిని విశ్లేíÙస్తోంది. వీరికి ఎంతమంది సెలబ్రిటీలు, ప్రముఖులతో లింక్‌లు ఉన్నాయో ఈగల్ పోలీసులు రట్టు చేసే పనిలో పడ్డారు.గుట్టు రట్టయిందిలా.. డ్రగ్స్ కేసులో సూర్యతో సహా అరుగురిని అరెస్టు తర్వాత పోలీసులు వారి నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టారు. సాంకేతిక ఆధారాలను ముమ్మరం చేయగా ఈ క్రమంలో ఎస్ఐబీ అధికారి కొడుకు రాహుల్‌తేజ పాత్ర తెరపైకి వచ్చింది. డ్రగ్స్ వ్యవహారంలో తేజ పాత్రపై లోతుగా దర్యాప్తు చేయగా, మరికొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. గతేడాది జనవరిలో డ్రగ్స్ కేసులో నిజామాబాద్ పోలీసులు నాగ్‌పూర్–హైదరాబాద్ మార్గంలో కొకైన్, ఎండీఎంఏ రవాణా చేస్తుండగా విక్రం, ఖాజా మొహిద్దీన్‌లను పట్టుకున్నారు. వీరిని విచారించగా.. ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లకు చెందిన ప్రధాన మాదక ద్రవ్యాల సరఫరాదారులకు తేజనే నిందితులకు పరిచయం చేశాడని ఆ ఇద్దరూ అంగీకరించారు. దీంతో నిజామాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్లోనూ ఏ–3గా తేజ పేరును చేర్చారు. కానీ, ఎప్పుడూ అరెస్టు చేయలేదు. పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. తేజ హైదరాబాద్‌లో ఒక రెస్టారెంట్‌ను సైతం నడుపుతున్నాడు. ముందస్తు బెయిల్ కూడా లేదు.. రాహుల్‌తేజ ఎస్ఐబీ ఓఎస్డీ కొడుకు కావడంతోనే గతంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయకుండా జాప్యం చేశారనే విషయాన్ని సైబరాబాద్ ఈగల్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులపై న్యాయస్థానంలో చార్జీషీట్ దాఖలు చేసిన నిజామాబాద్ పోలీసులు.. తేజపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికే ఏ–3గా తేజ ఉన్నా, కనీసం బెయిల్ లేదా ముందస్తు బెయిల్ కూడా తీసుకోలేదంటే నిందితుడికి పోలీసులు ఎలా సహకరించారో స్పష్టమవుతుందని ఈగల్ అధికారులు అంటున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అతడిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. అయితే, తాజాగా సూర్య అమ్మినేని కేసులో అరెస్టు చేస్తారా లేదా నిజామాబాద్ కేసులలో అరెస్టు చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
నెలకు రూ.1,000 కోట్లకుపైనే
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్–పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్, టాస్క్, పెట్టుబడి.. ఎంచుకున్న విధానం ఏదైనా విదేశీ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో భారతీయులు చిక్కుతున్నారు. తద్వారా ప్రతి నెల సగటున రూ.1,000 కోట్లకుపైగా దోపిడీకి గురవుతున్నారు. భారతీయులను లక్ష్యంగా చేసుకుని అత్యధికంగా ఆగ్నేయాసియా కేంద్రంగా ఈ సైబర్ మోసాలు జరుగుతున్నాయని కేంద్ర హోం శాఖ (ఎంహెచ్ఏ) గుర్తించింది. భారతీయులతో సహా అక్రమ రవాణాకు గురైన వ్యక్తులతో ఈ కేంద్రాల్లో బలవంతంగా మోసాలు చేయిస్తున్నారు.ఈ ఏడాది జనవరి నుండి మే వరకు ఆన్ లైన్ స్కామ్‌ల వల్ల భారతీయులు కోల్పోయిన మొత్తం సుమారు రూ.7,000 కోట్లు. ఇందులో సగానికి పైగా మోసాలకు మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయిలాండ్ నుండి పనిచేస్తున్న నెట్వర్క్లే కారణమని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఎంహెచ్ఏ అనుబంధ విభాగమైన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) రూపొందించిన డేటా ప్రకారం.. అధిక భద్రత కలిగిన ప్రదేశాల నుండి సైబర్ నేరగాళ్లు ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నెట్‌వర్క్‌లను చైనీస్ ఆపరేటర్లు నియంత్రిస్తున్నారు.బాధితులే ఉద్యోగులు..విదేశాల్లో ఉద్యోగాల ఆశతో మానవ అక్రమ రవాణాకు గురై.. ఆయా దేశాల కేంద్రాల్లో వీరితో బలవంతంగా పనిచేయిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కరీంనగర్ జిల్లాతోపాటు పలువురు యువకులు ఉపాధి కోసం థాయ్‌లాండ్ వెళ్లి అక్కడి సైబర్ కేఫ్‌లలో బందీలుగా చిక్కుకున్నారు. దీనిపై వార్తల నేపథ్యంలో స్పందించిన కేంద్రం అక్కడి 539 భారతీయ బందీలను విడిపించి, మార్చి 11న సురక్షితంగా భారత్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఇలా చాలామందిని నిఘా సంస్థలు రక్షించాయి. వీరి సాయంతో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కంబోడియాలో కనీసం 45, లావోస్‌లో ఐదు, మయన్మార్‌లో ఒక కేంద్రాన్ని గుర్తించాయి. బాధితుల్లో భారతీయులతో పాటు, ఆఫ్రికా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా, దక్షిణాసియా, మధ్య ఆసియా, పశ్చిమాసియా దేశాలు, యూరప్/ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా నుండి వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆగ్నేయాసియా నుండి పనిచేస్తున్న సైబర్ నేరగాళ్లు ప్రధానంగా మూడు రకాల మోసాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. వీటిలో స్టాక్ ట్రేడింగ్/పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, టాస్క్ ఆధారిత, పెట్టుబడి ఆధారిత మోసాలు ఉన్నాయి.ఘోస్ట్ సిమ్ కార్డులతో..ప్రభుత్వ అంచనాల ప్రకారం ప్రస్తుత సంవత్సరం మార్చికి ముందు ఆరు నెలల్లో భారతీయులు కనీసం రూ.500 కోట్ల మేర మోసపోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. బ్యాంకింగ్, ఇమిగ్రేషన్, టెలికం రంగాలలో ఉన్న లొసుగులను ప్యానెల్ గుర్తించింది. నకిలీ, దొంగిలించిన గుర్తింపులతో సిమ్‌లను జారీ చేశారనే ఆరోపణలపై వివిధ రాష్ట్రాల్లోని పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నకిలీ, ఇతరుల గుర్తింపుతో జారీ అయిన ఈ ఘోస్ట్ సిమ్‌లను పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు సైబర్ నేరస్తులకు విక్రయిస్తున్నారు. మోసపూరితంగా సిమ్ జారీ కావడంతో నేరస్తులను గుర్తించడం కష్టమవుతోంది.బాధితులే ఉద్యోగులు..సైబర్ నేరాల కోసం వ్యక్తులను నియమించుకుంటున్న అనేక మంది ఏజెంట్లను భారత ప్రభుత్వం గుర్తించింది. వీరిలో మహారాష్ట్ర నుంచి 59 అత్యధికంగా మంది ఉన్నారు. తమిళనాడు 51, జమ్మూ కాశ్మీర్ 46, ఉత్తర ప్రదేశ్ 41, ఢిల్లీ నుంచి 38 మంది ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏజెంట్లు లావోస్, మయన్మార్, కంబోడియాలకు ఎక్కువ మందిని నియమించుకుంటున్నారు. 5,000 మందికిపైగా భారతీయులు కంబోడియాలో చిక్కుకున్నట్టు సమాచారం. నేరగాళ్లు వీరిని నిర్బంధించి, బలవంతంగా సైబర్ మోసాలు చేయిస్తున్నారు. దేశాలను దాటి..సైబర్ నేరస్తుల చెర నుంచి రక్షించిన బందీలు, తిరిగి వచ్చిన వ్యక్తుల వాంగ్మూలాలను ప్రభుత్వం నమోదు చేసింది. భారత్ నుంచి కంబోడియాకు బాధితులను తరలిస్తున్న తీరు నిఘా సంస్థల విచారణలో బయటపడింది. తొలుత దుబాయ్.. అక్కడి నుండి చైనా, కంబోడియాకు; తమిళనాడు నుండి కంబోడియా; మహారాష్ట్ర నుండి థాయిలాండ్, కంబోడియా; జైపూర్ నుండి థాయిలాండ్, కంబోడియా; జైపూర్ నుండి వియత్నాం.. అక్కడి నుండి బ్యాంకాక్, కంబోడియాకు; ఢిల్లీ నుండి బ్యాంకాక్, కంబోడియా, లక్నో నుండి బ్యాంకాక్, కంబోడియా; కేరళ నుండి వియత్నాం, కంబోడియా; కేరళ నుండి సింగపూర్, కంబోడియాకు తరలిస్తున్నారు. ఇక కోల్‌కతా నుండి వియత్నాం, కంబోడియాకు రోడ్డు మార్గం ద్వారా చేరవేస్తున్నట్లు తేలింది. ఆధునిక మోసాలు..: తప్పుదోవ పట్టించి రహస్య సమాచారాన్ని తెలుసుకోవడం, నకిలీ యాప్‌లు, ఫిషింగ్ హెచ్చరికలు, వంచన వంటి వివిధ పద్ధతులను సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్నారు. కేవైసీ అప్డేట్ పేరుతో ఒత్తిడికి గురిచేయడం, లాభదాయక రాబడి పేరుతో వల వేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ కారణంగా 2025లోనే రూ.210 కోట్లకుపైగా నష్టాలు నమోదయ్యాయి. సైబర్ నేరస్తులు గ్రామీణులతోపాటు నగరవాసులనూ లక్ష్యంగా చేసుకుని మరింత ఆధునిక మోసాలకు తెరలేపుతున్నారు.కాల్ 1930..: సైబర్ నేరం మీ దృష్టికి వచ్చినా.. ఎవరైనా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అనుమానం వచ్చినా వెంటనే 1930కి కాల్ చేయండి. cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయండితక్షణ నివారణ చర్యలు తీసుకోకపోతే మొత్తం నష్టాలు వచ్చే ఏడాది కాలంలో రూ.1.2 లక్షల కోట్లకు మించి ఉండవచ్చని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ హెచ్చరించింది. -
కళ్లలో కారం చల్లి కాల్చి చంపారు
సాక్షి, హైదరాబాద్/మలక్‌పేట: సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ అలియాస్ చందు నాయక్ (50) దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ మలక్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని శాలివాహననగర్ పార్కులో వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా దుండగుల కాల్పుల్లో చనిపోయారు. కళ్లలో కారం చల్లిన నిందితులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఆయన శరీరంలోకి మూడు తూటాలు దూసుకుపోయాయి. ఈ హత్యలో నలుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు.. పరోక్షంగా సహకరించిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. మూడేళ్ల క్రితం ఎల్బీనగర్ ఠాణాలో నమోదైన హత్య కేసులో చందు నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీకారం, భూ వివాదాలతోపాటు వివాహేతర సంబంధం కోణాన్ని పరిగణనలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, హతుడి కుటుంబీకులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వసూళ్లు అడ్డుకోవడంతో వివాదాలు నాగర్‌కర్నూల్ జిల్లా నర్సాయిపల్లికి చెందిన చందు.. భార్య నారీబాయి, కుమారుడు సిద్ధు, కుమార్తె సింధులతో కలిసి దిల్సుఖ్నగర్ సమీపంలోని విద్యుత్‌నగర్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం సిద్ధు కెనడాలో ఎంటెక్ చదువుతుండగా... సింధు గ్రూప్స్‌కు సన్నద్ధమవుతోంది. చందు విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో, కారి్మక నాయకుడిగా సీఐటీయూలో పని చేశారు. ఎల్బీనగర్ ఏరియా సీపీఎం నాయకుడిగా నాగోల్ శ్రీ సాయినగర్‌లోని స్థలాల్లో పేదలతో గుడిసెలు వేయించారు. 2010లో సీపీఐలో చేరి భూపోరాటం చేసి పట్టాలు ఇప్పించారు. సీపీఐ (ఎంఎల్) నాయకుడు రాజేష్ తో కొన్నాళ్లుగా చందుకు విభేదాలున్నాయి. కుంట్లూర్ రావినారాయణరెడ్డి నగర్‌లోని మూడెకరాల భూమిలో గుడిసెలు వేసుకున్న వారి నుంచి రాజేష్ తదితరులు డబ్బులు వసూలు చేస్తుండటాన్ని చందు అడ్డుకున్నారు. దీంతో రాజేష్ , సుధాకర్, మున్నా, రాయుడుతో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వాకింగ్ చేసిన పార్కు బయటే... రాజేశ్‌తోపాటు మరికొందరు సోమవారం రాత్రి కారులో చందు ఇంటి సమీపంలో సంచరించడాన్ని నారీబాయి గమనించి చందును హెచ్చరించారు. మంగళవారం ఉదయం భార్య, కుమార్తెతో కలిసి చందు శాలివాహననగర్ పార్కులో వాకింగ్ చేశారు. 7.30 గంటల ప్రాంతంలో బయటకు రాగా.. అక్కడే కారులో రాజేష్ కనిపించడంతో నారీబాయి హెచ్చరించారు. ‘నాకేం కాదు. ఏం భయం లేదు. మీరు ఇంటికి వెళ్లండి’అంటూ భార్య, కుమార్తెను పంపేశాడు. పార్కు వెస్ట్ గేట్ నుంచి కుడి వైపు రోడ్డులో కారు వద్దకు వెళ్తుండగా అందులోంచి దిగిన ఇద్దరు చందు కళ్లలో కారం కొట్టారు. అప్రమత్తమైన ఆయన తప్పించుకోవడానికి వెనక్కు పరిగెత్తగా.. పార్కు గేటు వద్ద ఉన్న ఇసుకలో కాలు జారి పడిపోయారు. సమీపంలోకి వచ్చిన ఇద్దరు పిస్టల్‌తో అతని ఛాతీ, పొట్ట భాగాల్లో కాల్చారు. రక్తం మడుగులో ఉన్న అతడిని కాలుతో వెనక్కు తిప్పి తలపై మరో రౌండ్ కాల్చి కారులో పారిపోయారు. సెల్ఫ్ డ్రైవింగ్ కారు అద్దెకు తీసుకుని... ఘటనాస్థలి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దుండగులు స్విఫ్ట్ (టీఎస్ 08 హెచ్‌డబ్ల్యూ 0875) కారులో వచి్చనట్లు గుర్తించారు. ఇది పీర్జాదిగూడకు చెందిన ఓ మహిళ పేరుతో రిజిస్టరై ఉంది. ఆమె దీన్ని కొత్తపేట కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఏజెన్సీకి కాంట్రాక్టుకు ఇచ్చారు. సోమవారం ఆన్లైన్లో ఆ కారును బుక్ చేసుకున్న ఏడుకొండలు అనే వ్యక్తి తీసుకుని వెళ్లారు.అతడితోపాటు రాజేష్ , ప్రశాంత్, మరొకరు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏడుకొండలు కారు తీసుకెళ్లి అద్దెకు ఇచ్చిన సంస్థకు అప్పగించి పారిపోయారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలిలో మూడు ఖాళీ క్యాట్రిడ్జ్‌లు, రెండు పేలని తూటాలను స్వాధీనం చేసుకుంది. పేలింది నాటు తుపాకీ అని, తూటాలు 7.65 ఎంఎం క్యాలిబర్‌కు చెందినవిగా తేల్చారు. భానుచందర్ హత్య కేసులో నిందితుడు... చందు 2022లో జరిగిన రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి పదిర భానుచందర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. భూ వివాదాల నేపథ్యంలో నాగోలుకు చెందిన భాను చందర్‌ను, మన్సూరాబాద్‌కు చెందిన సీపీఐ నాయకుడు కందుల సుధాకర్, చందు తదితరులు ఆ ఏడాది ఏప్రిల్ 16న కిడ్నాప్ చేశారు. యాదాద్రి జిల్లా తిరుమలగిరి వద్ద అతడిని హత్య చేసి మృతదేహాన్ని ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ సమీపంలో పడేశారు. ఈ కేసులో పోలీసులు చందుతోపాటు మిగిలిన నిందితులను అరెస్టు చేశారు. రంగంలోకి పది ప్రత్యేక బృందాలు హత్య విషయం తెలిసిన వెంటనే సౌత్ఈస్ట్ డీసీపీ ఎస్.చైతన్యకుమార్, అదనపు డీసీపీ కె.శ్రీకాంత్, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు ఘటనాస్థలికి వచ్చారు. సీపీఐ నాయకులు అజీజ్‌పాషా, ఈటీ నర్సింహా, ఛాయాదేవి తదితరులు ఘటనాస్థలికి తరలివచ్చారు. చందు భార్య, కుమార్తె మృతదేహం వద్ద కన్నీరు మున్నీరయ్యారు. ఏడాదిన్నర నుంచి చందుకు ప్రాణహాని ఉందని రాజేష్ తదితరులే చంపారని ఆమె ఆరోపించారు. చందు మృతితో నాగర్‌కర్నూల్ జిల్లాలోని స్వగ్రామం నర్సాయిపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. చందు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. నిందితులను పట్టుకోవడానికి పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చైతన్య కుమార్ చెప్పారు. మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో పాలుపంచుకున్నట్లు అనుమానిస్తున్న నలుగురిని పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెంటల్ ఏజెన్సీ నుంచి నిందితులు వాడిన కారును స్వా«దీనం చేసుకున్నారు. -
చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
సాక్షి, యాదాద్రి : భర్త వేధింపులతో విసిగిపోయిన ఆమె.. తన సోదరుడు, ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసింది. కారుతో ఢీకొట్టి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి.. చివరకు పోలీసులకు దొరికిపోయారు. మంగళవారం భువనగిరి డీసీపీ ఆకాంష్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(36)కి ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన పొట్టెపాక మహేశ్ సోదరి స్వాతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. స్వామి భువనగిరిలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్‌గా పనిచేసేవాడు. భార్య స్వాతి భువనగిరి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉద్యోగం చేసే క్రమంలో తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గుంటిపల్లి సాయికుమార్‌తో పరిచయం ఏర్పడింది. గొడవలు ఇలా.. స్వాతి సోదరుడు మహేశ్‌కు ఇద్దరు భార్యలు. తన బావ తన భార్యతోనే వి వాహేతర సంబంధం పె ట్టుకున్నాడని మహేశ్ స్వామిపై కోపం పెంచుకున్నాడు. ఈ విషయాన్ని స్వాతితో చెప్పగా, ఆమె భర్తను నిలదీసింది. దీంతో స్వాతిని స్వామి వేధించడం మెదలు పెట్టాడు. ఇదిలావుంటే.. గత సంవత్సరం ఫిబ్రవరిలో స్వాతి మోత్కూరుకు వెళ్లి సాయికుమార్‌ను కలిసి తన భర్త వేధింపులను సాయికుమార్‌కు వివరించింది. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. అక్క వివాహేతర సంబంధానికి మహేశ్ కూడా సహకరించాడు. తమను వేధిస్తున్న స్వామిపై ఎలాగైనా పగతీర్చుకోవాలని స్వాతి, మహేశ్ నిర్ణయించుకున్నారు. కారు అద్దెకు తీసుకుని.. ఈనెల 13న స్వామి భువనగిరికి పనిమీద వస్తున్న విషయాన్ని స్వాతి.. సాయికుమార్, మహేశ్‌లకు చెప్పింది. దీంతో వారు స్వామి కదలికలపై నిఘా పెట్టారు. స్వామిని హత్య చేసేందుకు సాయికుమార్, తన స్నేహితుడు చీమల రామలింగస్వామి సహాయంతో భువనగిరిలో కారును అద్దెకు తీసుకున్నారు. స్వామి భువనగిరిలో పని ముగించుకుని రాత్రి వేళ స్నేహితుడు వీరబాబుతో కలిసి బైక్‌పై బయలుదేరాడు. రాత్రి 11.15 గంటల సమయంలో సాయికుమార్ కాటేపల్లి శివారులో కారుతో వారి బైక్‌ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకుపోయాడు. ఘటనలో స్వామి అక్కడికక్కడే మృతిచెందగా వీరబాబుకు గాయాలయ్యాయి. అయితే కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకుపోయి ముందుకు కదలకుండా ఆగిపోయింది. స్వామి మృతి విషయం సాయికుమార్ ద్వారా తెలుసుకున్న మహేశ్ ద్విచక్ర వాహనం తీసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. సాయికుమార్, రామలింగస్వామిని బైక్‌పై ఎక్కించుకుని వచ్చి భువనగిరి రైల్వే స్టేషన్ వద్ద వదిలేశాడు. కారుతో.. కదిలిన డొంక రోడ్డు పక్కన ఆగిపోయిన కారును చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. కారు నంబర్ ఆధారంగా జరిపిన విచారణలో.. సాయికుమార్ సెల్ప్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నాడని తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని సెల్ఫోన్లో స్వాతి ఫోన్ నంబర్ కన్పించడంతో స్వాతిని విచారించగా మొత్తం విషయం వెలుగులోకి వచి్చంది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. మరో నిందితుడు చీమల రామలింగస్వామి పరారీలో ఉన్నాడు. వైద్యురాలిది ఆత్మహత్యే‘బుట్టబొమ్మ’ను వదల్లేనని భార్యతో చెప్పిన డాక్టర్ సృజన్క్షణికావేశానికిలోనై ఉరివేసుకున్న డాక్టర్ ప్రత్యూషసృజన్, బానోతు శ్రుతితో పాటు అత్తామామల అరెస్ట్ హసన్‌పర్తి: ‘ఇన్‌స్టా రీల్స్ అమ్మాయి బుట్టబొమ్మతో ప్రేమాయణం కొనసాగిస్తా ...ఏం చేసుకుంటావో చేసుకో’అన్న భర్త మాటలతో క్షణికావేశానికి లోనైన వైద్యురాలు ప్రత్యూష ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం డాక్టర్ ప్రత్యూష అనుమానాస్పదంగా మృతి చెందినట్లు నమోదైన కేసులో విచారించిన పోలీసులు మంగళవారం ఆమె భర్త డాక్టర్ అల్లాడి సృజన్, అత్తమామలు పుణ్యవతి–మధుసూదన్‌తోపాటు ఇన్‌స్టా రీల్స్గర్ల్ బానోతు శ్రుతిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి ఆవివరాలు వెల్లడించారు. మట్టెవాడకు చెందిన తంజాపూరి పద్మావతి కూతురు డాక్టర్ ప్రత్యూషకు (35), ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన డాక్టర్ అల్లాడి సృజన్‌కు 2017లో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు హసన్çపర్తిలోని కాకతీయ వెంటెజ్లో ఓ విల్లా కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వీరితోపాటు సృజన్ తల్లిదండ్రులు పుణ్యవతి–మధుసూదన్‌లు కూడా ఇక్కడే ఉంటున్నారు. బానోతు శ్రుతితో కుటుంబంలో చిచ్చు.. ఏడాది క్రితం బుట్టబొమ్మ–17 ఇన్‌స్ర్ట్రాగాం ఐడీ పేరుతో రీల్స్ చేసే అమ్మాయి బానోతు శ్రుతితో డాక్టర్ సృజన్ దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తన భార్యకు విడాకులు ఇస్తానని బెదిరించాడు. మరో వైపు శ్రుతి కూడా ఫోన్ ద్వారా ప్రత్యూషను వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. ఆది వారం కూడా ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. శ్రుతిని వదిలేది లేదని సృజన్ చెప్పడంతో ప్రత్యూష పైఅంతస్తుకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. కాగా గొడవ విషయంలో సృజన్ తల్లిదండ్రులు కూడా కొడుకుకే మద్దతు పలికారని ఏసీపీ పేర్కొన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.తరగతి గదిలో ఉరేసుకుని విద్యార్థి ని ఆత్మహత్య!సూర్యాపేట జిల్లా నడిగూడెం కేజీబీవీలో ఘటన నడిగూడెం: పదోతరగతి చదువుతున్న విద్యార్థిని తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగింది. స్థానిక ఎస్ఐ గంధమళ్ల అజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ నిమ్మ వెంకటేశ్వర్లు, వసుంధర దంపతులకు కుమార్తె తనూషా మహాలక్ష్మి (14), ఇద్దరు కుమారులు సంతానం. తనూషా మహాలక్ష్మి నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి చదువుతోంది. ఈనెల 4వ తేదీన వ్యక్తిగత కారణాలతో బాలిక ఇంటికి వెళ్లింది. తిరిగి 6వ తేదీన పాఠశాలకు వచ్చింది. ఆదివారం తనూషాను చూసేందుకు ఆమె తల్లి పాఠశాల వద్దకు వచ్చి భోజనం పెట్టి వెళ్లింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తండ్రి వెంకటేశ్వర్లు కూడా కుమార్తెను చూసి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున తనూషా పాఠశాలలోని తన తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం ఐదు గంటల సమయంలో తనూషా స్నేహితురాలు తమ తరగతి గదిలోకి వెళ్లగా.. అప్పటికే తనూషా ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది. రాత్రి విధుల్లో ఉన్న హిందీ ఉపాధ్యాయురాలు సునీత పాఠశాల ప్రత్యేకాధికారి వెంకటరమణకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో విద్యాలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, పాఠశాలను సూర్యాపేట జిల్లా విద్యాధికారి అశోక్, తహసీల్దార్ వి.సరిత, జీసీడీఓ తీగల పూలాన్, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
బెంగళూరులో దారుణం.. విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారం
బెంగళరూరు: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన వెలుగుచూసింది. క్లాస్‌లో పాఠాలకు సంబంధించి ఓ విద్యార్థినికి టెక్ట్స్ మెసేజ్ చేసిన లెక్చరర్.. ఆపై సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఫ్రెండ్ రూమ్‌కు పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై మరొక లెక్చరర్, అతని ఫ్రెండ్ కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాజాగా వెలుగు చూడటంతో బెంగళూరులో తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటకలోని ఓ విద్యార్థినిని ఫిజిక్స్ బోధించే లెక్చరర్ నరేంద్ర పరిచయం చేసుకున్నాడు. చదువులో సాయంతో పరిచయాన్ని సాన్నిహిత్యంగా మార్చుకున్నాడు. ఇలా అనూప్ అనే స్నేహితుడి రూమ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ అనూప్ కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డ వీడియోను చూపించి మరొక లెక్చరర్ సందీప్ విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని ఆ విద్యార్థినిని నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వీరు కర్ణాటక మహిళా కమిషన్‌ను ఆశ్రయించడంతో విషయం బయటకొచ్చింది. దీంతో మారతహళ్లి పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇద్దరు లెక్చరర్లు సహా స్నేహితుడు అనూప్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఇదిలావుంచితే, ఒడిశాలో కూడా ఇదే తరహా దారుణం ఇటీవల చోటు చేసుకుంది. తనను లైంగికంగా వేధిస్తున్న లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని ఓ విద్యార్థిని కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసి ప్రాణాలు తీసుకుంది. ప్రిన్సిపాల్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాలాసోర్ బీఈడీ సెకండియర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. ఒంటికి నిప్పంటించుకుని 90 శాతం కాలిన గాయాల పాలైన ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయింది. ముందే చెబుతున్నా.. న్యాయం జరగకపోతే.. -
భార్యభర్తల మధ్య గొడవ.. పంచాయితీకి వచ్చిన ఇద్దరు దారుణ హత్య
సాక్షి,పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. భార్య భర్తల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చిన భార్య తరుపు కుటుంబ సభ్యులపై.. భర్త తరుపు కుటుంబ సభ్యులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. పోలీసుల వివరాల మేరకు.. సుగ్లాంపల్లి భార్యాభర్తల పెద్ద మనుషుల పంచాయితీలో కత్తిపోట్ల కలకలం సృష్టించాయి. భార్య,భర్తల మధ్య జరుగుతున్న గొడవలకు పులిస్టాప్ పెట్టి వారిద్దరిని కలిపేందుకు ఆ ఊరి గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. ఈ పంచాయతీ జరుగుతున్న సమయంలో భర్త తరుపు కుటుంబ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు. మారణాయుధాలతో భార్య తరుపు కుటుంబ సభ్యులపై మారణాయుధాలతో దాడి చేశారు.అప్రమత్తమైన భార్య కుటుంబీకులు సైతం కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌కు చెందిన గాండ్ల గణేష్,ఓదెలకు చెందిన మోటం మల్లేష్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్యాభర్తల మధ్య వివాదాలలో జోక్యం చేసుకోవడం అనేది ఒక సున్నితమైన సమస్య. సాధారణంగా, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు వారి మధ్య సామరస్యం కుదర్చడానికి ప్రయత్నించడం మంచిది. కానీ వ్యక్తిగత విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు మరింత జటిలం అయ్యే అవకాశం ఉంది. -
నవవధువు చికెన్ తినలేదనే మనస్తాపంతో..
తమిళనాడు: వెల్లకోవిల్ సమీపంలో భార్య చికెన్ తినడానికి నిరాకరించిందని నవవరుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాలు.. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలూకాలోని సక్కోట్టై ప్రాంతానికి చెందిన మణికంఠన్ (29 ). ఇతను ఫర్నిచర్ దుకాణంలో పనిచేసేటప్పుడు, అతనితో కలిసి పనిచేసే సుబలక్ష్మి (25)తో ప్రేమలో పడ్డాడు. నెల రోజుల క్రితం తల్లిదండ్రులను ధిక్కరించి, వారిద్దరూ చెన్నైలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలు ఈ వివాహాన్ని వ్యతిరేకించడంతో, వారు తిరుప్పూర్ జిల్లా వెల్ల కోవిల్ పుత్తూరులోని సుబలక్ష్మి సోదరి మేనక ఇంట్లో నివసించారు. ఈ స్థితిలో, మేనక, ఆమె భర్త ఆలయ ప్రత్యేక కార్యక్రమానికి తిరుచ్చికి వెళ్లారు. ఆదివారం ఇంట్లో ఉన్న మణికంఠన్ దుకాణం నుంచి చికెన్ కొని తన భార్యను తినమని అడిగాడు. తన సోదరి గుడికి వెళ్లినందున ఇంట్లో చికెన్ తినడానికి ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. దీనితో ఆగ్రహించిన మణికంఠన్ తన ఇంటి బయట ఉన్న ఇనుప కడ్డీకి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అతన్ని రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు మణికంఠన్ మృతి చెందినట్లు ప్రకటించాడు. -
గండికోటలో దారుణం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోటలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడి.. హత్య చేశాడు. బాలికను బైక్‌పై గండికోట తీసుకొచ్చిన ఎర్రగుంట్లకి చెందిన లోకేష్.. గండికోటలోని ధాన్యాగారం వద్ద దారుణానికి ఒడిగట్టాడు. బాలికను వివస్త్రగా విడిచిపెట్టి వెళ్లాడు.బాలిక ప్రొద్దుటూరులోని ఓ ఇంటర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ అశోక్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. -
భర్తను కడతేర్చి.. ఇంటి ఆవరణలో గొయ్యి తవ్వి..
గౌహతి: దేశంలో ఇటీవలి కాలంలో భర్తలను అంతమొందిస్తున్న భార్యలకు సంబంధించిన ఉదంతాలు విరివిగా వినిపిస్తున్నాయి. తాజాగా అసోంలోని గౌహతిలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. దంపతుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ చివరకు భర్త హత్యకు దారితీసింది.గౌహతి పోలీసులు భర్తను హత్యచేసిన భార్యను అదుపులోకి తీసుకున్న దరిమిలా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. నిందితురాలు రహిమా ఖాతున్(38), ఆమె భర్త సబియాల్ రెహమాన్ (40)తో తరచూ గొడవ పడేదని పోలీసులు తెలిపారు. సబియాల్ రెహమాన్ స్క్రాప్ డీలర్‌గా పనిచేస్తున్నాడు. జూన్ 26న అతను తన పని ముగించుకుని, పాండు ప్రాంతంలో ఉన్న తన ఇంటికి తిరిగి వచ్చాడు.పోలీసులు ప్రాథమిక దర్యాప్తులోని వివరాల ప్రకారం.. ఆ సమయంలో తన భర్త మద్యం మత్తులో ఉన్నాడని, ఆ సమయంలో తలెత్తిన ఇంటి గొడవ దాడులకు దిగేవరకూ కొనసాగిందని రహీమా చెప్పింది. ఈ నేపధ్యంలోనే భర్త హతమయ్యాడని పేర్కొంది. కాగా భర్త మృతదేహాన్ని ఆమె ఇంటి ఆవరణలో ఐదు అడుగుల లోతున గొయ్యి తవ్వి, దానిలో పూడ్చిపెట్టిందని సమాచారం. ఆ జంటకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా రెహమాన్ కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో పొరుగింటివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసుల విచారణలో నిందితురాలు తొలుత తన భర్త పని కోసం కేరళకు వెళ్లాడని తెలిపింది. తరువాత మాటమార్చి, అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడని తెలిపింది. రెహమాన్ సోదరుడు జూలై 12న జలుక్బరి పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. మర్నాడు పోలీసులు రహిమా ఖాతున్ను విచారించగా తమ దంపతుల గొడవల్లో భర్త మరణించాడని చెప్పింది. ఆ తర్వాత తాను భర్త మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పాతిపెట్టానని పోలీసులకు చెప్పింది.ఫోరెన్సిక్ నిపుణులు, మేజిస్ట్రేట్‌తో కూడిన పోలీసు బృందం వారి ఇంటి ఆవరణలోని గొయ్యిలో నుంచి కుళ్లిపోయిన మృతదేహ అవశేషాలను వెలికి తీసింది. రహీమా ఒక్కర్తే ఈ హత్య చేసి ఉండకపోవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఒక మహిళ స్వయంగా ఇంత పెద్ద గొయ్యిని తవ్వే అవకాశం లేదని, ఇతరుల ప్రమేయం ఉండవచ్చని, ఈ దిశగా దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు తెలిపారు. -
ముందే చెబుతున్నా, న్యాయం జరగకపోతే..!
హృదయవిదారకమైన ఒడిషా బాలాసోర్ బీఈడీ సెకండియర్ స్టూడెంట్ సూసైడ్ కేసులో షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. హెచ్‌వోడీ లైంగిక వేధింపుల పర్వాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదు చేసిన కాపీ.. అందులో పేర్కొన్న విషయాలు బయటకు వచ్చాయి. బాలాసోర్ బీఈడీ విద్యార్థిని బలవన్మరణం కేసులో విస్తుపోయే విషయం వెలుగు చూసింది. నిప్పంటించుకునే పది రోజుల ముందు.. 22 ఏళ్ల బాధిత విద్యార్థిని సీఐసీసీ(college's internal complaints committee)కి ఫిర్యాదు చేసింది. అందులో సీనియర్ ఫ్యాకల్టీ నుంచి తనకు ఎదురైన ఇబ్బందులను ప్రస్తావిస్తూనే.. చర్యలు తీసుకోకుంటే గనుక ప్రాణం తీసుకుంటానని హెచ్చరించింది కూడా. జులై 1వ తేదీన ఆమె రాసిన లేఖలో ఇలా.. గత కొన్ని నెలలగా బీఈడీ డిపార్ట్మెంట్ హెచవోడీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ సమీర్ కుమార్ సాహూ నన్ను వేధిస్తున్నారు. తక్కువ మార్కుల వేస్తానని, నన్ను ఫెయిల్ చేస్తానని.. నా గురించి నా కుటుంబంతో లేనిపోనివి చెబుతానని బెదిరిస్తూ వస్తున్నారు. అన్నింటికి మించి తన కోరికెలు తీర్చమంటూ వేధిస్తున్నారు. మనశ్శాంతి కరువై మానసికంగా ఇబ్బంది పడుతున్నా. నా ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే.. నేను బలవన్మరణానికి పాల్పడతాను. నా చావుకు హెచ్‌వోడీ, కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది అని లేఖ రాసిందామె. జూన్ 30వ తేదీన ఫకీర్ మోహన్ కాలేజీ ప్రిన్సిపల్ దీలీప్ ఘోష్ దృష్టికి ఆమె విషయాన్ని తీసుకెళ్లింది. ఆ మరుసటిరోజు ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదును సమర్పించింది. అంతటితో ఆగకుండా.. పది రోజులపాటు ఆ ఫిర్యాదు కాపీని సోషల్ మీడియాలో పోస్టు చేసి చర్యలు తీసుకోవాలంటూ సీఎం, విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యేను ట్యాగ్చేసి మరీ కోరింది. అయినా ఫలితం లేకపోయింది. జులై 12వ తేదీన.. ఆమె కాలేజీలోని ప్రిన్సిపల్ గది ఆవరణలో నిప్పటించుకుంది. 95 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో ఆమెను రక్షించడానికి వెళ్లిన మరో విద్యార్థిని కూడా 70 శాతం గాయాలపాలై చికిత్స పొందుతోంది. ప్రధాన బాధితురాలిని బాలాసోర్ జిల్లా ఆస్పత్రిలో.. ఆపై భువనేశ్వర్‌లో ఎయిమ్స్‌కు ఆమెను తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బాధితురాలు కన్నుమూసింది. ఈ కేసుకు సంబంధించిన బీఈడీ హెచ్‌వోడీ సమీర్ కుమార్ సాహూ, కాలేజీ ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్‌లను కాలేజీ యాజమానయం తొలగించగా.. ఆపై పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఉదయం బాలాసోర్‌లోని బాధితురాలి స్వగ్రామం పలాసియాకు మృతదేహాన్ని తరలించారు. ఊరు ఊరంతా ఆమె మృతదేహం చూసి కన్నీరు పెట్టుకుంది. ఆమె మృతదేహాంతో కాసేపు రోడ్డుపై ఆందోళనకు దిగింది.ఈ ఘటనపై సీఎం మోహన్ చరణ్ మజ్హీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారాయన. మరోవైపు.. స్వరాష్ట్రం ఒడిశా పర్యటనలో ఉన్నరాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సోమవారం సాయంత్రం AIIMSకి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఆపై కాసేపటికే ఆమె కన్నుమూయడం గమనార్హం.ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు వినవస్తున్నాయి. ఆమెది ఆత్మహత్య కాదు.. బీజేపీ వ్యవస్థ చేసిన హత్య అని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బాధితురాలిని రక్షించడంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్న రాహుల్.. బాధిత విద్యార్థిని ధైర్యంగా తన గొంతుక వినిపించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: నేనేం చావడానికి ఇక్కడికి రాలేదు! -
కాంగ్రెస్ నేత హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, మెదక్: కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కుమారుడికి, అనిల్‌కు మధ్య విబేధాలు ఉన్నాయి. ఓ భూమి విషయంలో గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే కుమారుడి వద్ద అనిల్ రూ.80 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో ఉన్న బెంజ్ కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే కుమారుడిదేనని పోలీసులు అంటున్నారు. గత ఐదు నెలలుగా బెంజ్ కారు అనిల్ వద్దనే ఉంటుందని చెబుతున్నారు.మెదక్ – జోగిపేట ప్రధాన రహదారిపై నిన్న(సోమవారం రాత్రి కాంగ్రెస్ నేత అనిల్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. మండలంలోని పైతర గ్రామానికి చెందిన మరెల్లి అనిల్(28)జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. మెదక్ నుంచి స్వగ్రామానికి కారులో ఆయన ప్రయాణమయ్యాడు.చిన్నఘనాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అనిల్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే, అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో నాలుగు బులెట్లు లభ్యమయ్యాయి. -
తేజేశ్వర్ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, జోగుళాంబ గద్వాల జిల్లా: ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో ప్రధాన నిందితులైన తిరుమలరావు ఏ–1, కుమ్మరి నాగేష్ ఏ–3, చాకలి పరశురాముడు ఏ–4, చాకలి రాజు ఏ–5లను ఈ నెల 10న విచారణాధికారి శ్రీను.. కోర్టు అనుమతితో 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని వివరాలు సేకరించారు.వాయిస్ మెసెంజర్‌తో గొంతు మార్చి మాట్లాడినట్లు ఇది వరకే బయటపడగా.. తాజాగా మరో ట్విస్ట్ బయటపడింది. తేజేశ్వర్-సహస్రల మధ్య ఎలాంటి కలయిక ఉండరాదనే ఉద్దేశంతో స్పై కెమెరాను కొనుగోలు చేసి తేజేశ్వర్ బెడ్రూంలో ఏర్పాటు చేశారు.తిరుమలరావు నిత్యం వారి కదలికలను కెమెరా ద్వారా గమనించాడు. కొత్త ట్విస్టు వెలుగులోకి రావడంతో.. సహస్రను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పీటీ వా రెంట్‌ను కోర్టుకు సమర్పించారు. ఏ–2 సహస్రను కస్టడీలోకి తీసుకుంటే పూర్తి వివరాలు తెలుస్తాయని గద్వాల సీఐ శ్రీను వెల్లడించారు. -
పదేళ్ల బాలికపై 80 ఏళ్ల వృద్ధుడి లైంగిక దాడి
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో పదేళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. చిన్నారికి మాయమాటలు చెబుతూ వారం రోజులుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. బాధిత బాలిక అనారోగ్యంగా ఉండటంతో తల్లి ఆరా తీయగా ఈ దారుణం బయటపడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు కొత్తపేట ప్రాంతానికి చెందిన తెర్రి సత్యనారాయణ (80) భార్య చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. సమీప ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలిక అమ్మమ్మ ఇల్లు వృద్ధుడి ఇంటికి సమీపంలోనే ఉంది. దీంతో బాలిక పాఠశాలకు వెళుతూ తన అమ్మమ్మ ఇంటికి వచ్చే క్రమంలో వృద్ధుడు ఆమెకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు వృద్ధుడికి దేహశుద్ధి చేశారు. ఏలూరు టూటౌన్ పోలీసులకు సమాచారం అందడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు సర్వజనాస్పత్రికి తరలించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ నిందితుడు సత్యనారాయణపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. -
42 ఏళ్ల లారీడ్రైవర్‌తో డిగ్రీ విద్యార్థిని వివాహేతర సంబంధం..!
వరంగల్: అతడికి పెళ్లయ్యింది.. ఇద్దరు పిల్లలు. యువతి డిగ్రీ చదువుతుంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం.. చివరికి వారి ప్రాణమే తీసింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా ఏనుమాముల ఇందిరా కాలనీ ఫేజ్–2కు చెందిన వేల్పుగొండ స్వామి(42).. ఎలిశాల గాయత్రి (22) పక్కపక్కనే ఉంటారు. కుమారస్వామికి భార్య, ఇద్దరు పిల్లలు. ఒకరు తొమ్మిది, మరొకరు ఏడో తరగతి చదువుతున్నారు. లారీడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి పక్కనే ఉంటున్న గాయత్రి నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. వీరిద్దరికి మూడేళ్లక్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. స్వామికి.. గాయత్రిని వదిలేసి భార్యా, పిల్లలతో ఉండాలనే ఆలోచన వచ్చింది. విషయం గాయత్రికి తెలపగా, అందుకు అంగీకరించలేదు. ‘నువ్వు నాతోనే ఉండాలి.. మనమిద్దరం వివాహం చేసుకుందాం’ అని తెలిపింది. ఈ విషయంలో స్వామి తన భార్యను ఒప్పించాలని ప్రయత్నించినప్పటికీ ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించింది. దీంతో స్వామి ఏంచేయలేక భార్యను చికిత్స కోసం ఈనెల 2న ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడే వదిలేసి మళ్లీ వస్తానని వెళ్లాడు. రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో 4న మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో స్వామిపై మిస్సింగ్ కేసు నమోదైంది. గాయత్రి ఈనెల 2నుంచి కనిపించడం లేదని ఆమె తండ్రి కుమారస్వామి 3న ఏనుమాముల పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. వీరిద్దరు 2న ఇంట్లో నుంచి పారిపోయారు. తిరిగి ఇంటికెళ్తే ఇబ్బందవుతుందని, కలిసి చని పోదామని నిర్ణయించుకుని ఆదివారం ఉద యం పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామానికి చేరుకుని గడ్డిమందు తాగారు. గమనించిన స్థానికుడు పవన్‌కళ్యాణ్ ఫోన్ ద్వారా వారి బంధువులకు సమాచారం అందించి ఇద్దరిని 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందారు. మృతుడి అన్న యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పర్వతగిరి ఎస్సై ప్రవీణ్ తెలిపారు. -
హైదరాబాద్: పార్క్‌లో కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో కాల్పుల కలకలం రేగింది. మార్నింగ్ వాకర్స్‌పై దుండగులు కాల్పులు జరిపారు. శాలివాహన నగర్ పార్క్‌లో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వాకింగ్ చేస్తున్న సమయంలో చందు నాయక్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరపగా.. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.చందు నాయక్ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వాసిగా పోలీసులు గుర్తించారు. కాల్పులకు భూ వివాదమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో నలుగురు వ్యక్తులు.. చందు నాయక్‌పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. మృతుడిపై కారం చల్లి.. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇసుక రేణువుల్లో ఉన్న బుల్లెట్స్ కోసం పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. మృతుడు చందును చంపుతున్న క్రమంలో అడ్డొచ్చిన వారిని దుండగులు గన్‌తో బెదిరించారు. చుట్టుపక్కల సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. గన్స్‌లో ఉన్న బుల్లెట్స్‌ను పరిశీలించిన క్లూస్ టీమ్.. నమూనాలను ల్యాబ్‌కి పంపించారు. నిందితుల కార్ నెంబర్ ఆధారంగా పోలీసులు ట్రాక్ చేస్తున్నారు.సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యకుమార్ కాల్పుల ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘‘ఉదయం 7:30 గంటలకు ఓ వ్యక్తిపై కాల్పులు జరిగాయని సమాచారం వచ్చింది. చందు నాయక్ అనే వ్యక్తి వాకింగ్ చేస్తుండగా నలుగురు దుండగులు వచ్చి కాల్పులు జరిపారు. షిఫ్ట్ కార్ లో వచ్చి నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపారని స్థానికులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.నిందితుల కోసం 10 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నాం. స్పాట్లో 7 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించాం. స్పాట్లో దొరికిన బుల్లెట్లను చూస్తే ఒకే వెపన్తో ఫైరింగ్ చేసినట్టు ఉన్నాయి. 2022లో జరిగిన హత్య కేసులో చందు నాయక్ నిందితుడిగా ఉన్నాడు. కాగా, ఈ కాల్పుల ఘటనలో ఎస్వోటీ పోలీసుల ఎదుట నలుగురు లొంగిపోయారు. ఐదుగురి మధ్య ఆర్థిక లావాదేవీలే చందునాయక్ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతుడు చందునాయక్‌తో పాటు ఈ నలుగురు ఓ హత్య కేసులో నిందితులు. -
వైద్యుల కాపురంలో ‘బుట్టబొమ్మ’ చిచ్చు
పచ్చని కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పర స్త్రీ, పురుష వ్యామోహంలో పడిన ఆలుమగలు పెళ్లి అనే పవిత్ర బంధానికి విలువ లేకుండా చేస్తున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన దంపతులు అర్ధంతరంగా విడిపోతున్నారు. మరికొందరు నిండు జీవితాన్ని ఫణంగా పెట్టి లోకం విడిచివెళ్తున్నారు.వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సోమవారం జరిగిన రెండు ఘటనలు పెళ్లి అనే బంధానికి విలువ లేకుండా చేశాయి. ఓ డాక్టర్.. రీల్స్ చేసే యువతితో ప్రేమాయణం సాగించగా, తట్టుకోలేక వైద్యురాలైన భార్య తనువు చాలించింది. వరంగల్: ఓ డాక్టర్ కుటుంబంలో రీల్స్ గర్ల్ పెట్టిన చిచ్చు ఒకరి ప్రాణం తీసింది. ‘బుట్టబొమ్మ’ ఐడీతో ఇన్‌స్టా, ఫేస్బుక్ వేదికగా రీల్స్ చేసే ఆ యువతి పట్ల డాక్టర్ ఆకర్షితుడయ్యాడు. చివరికి ఇరువురు పెళ్లి చేసుకునేదాకా వెళ్లారు. దీంతో ఆ డాక్టర్ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. చివరికి డాక్టర్ భార్య, డెంటల్ వైద్యురాలు అనుమానాస్పద మృతి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త తరఫున వారు చెబుతుండగా, తన కూతురుని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి పద్మావతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన వరంగల్ నగరంలోని వైద్యవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.అత్తామామలకు చెప్పినప్పటికీ..డాక్టర్ సృజన్, రీల్స్ గర్ల్ మధ్య సంబంధంపై ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో డాక్టర్ సృజన్ తన భార్య ప్రత్యూషను శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ప్రత్యూష తన అత్తామామలు పుణ్యవతి–మధుసూదన్‌కు చెప్పింది. అయినప్పటికీ వారినుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరికి వారి బంధం పెళ్లిదాకా వచ్చింది. ఇంట్లో గొడవలు సాగుతూనే వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రత్యూష నగరంలోని ఎన్ఎస్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తల్లి పద్మావతికి సృజన్ ఫోన్ చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. వెంటనే పద్మావతి ఆస్పత్రికి వచ్చి చూడగా.. విగత జీవిగా కనిపించింది. కాగా, డాక్టర్ సృజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. నిందితుడిని కఠినంగా శిక్షించాలి : ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ఎంజీఎం : డాక్టర్ ప్రత్యూష మృతదేహానికి సోమవారం ఎంజీఎం మార్చరీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈసందర్భంగా బంధువులతోపాటు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు పెద్దఎత్తున మార్చురీకి తరలివచ్చారు. ప్రత్యూష కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీఎన్జీఓస్ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఓ యూట్యూబర్, రీల్స్ చేసే యువతి మాయలో పడి యువ వైద్యురాలు ప్రత్యూష మృతికి కారణమైన డాక్టర్ సృజన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, మార్చురీ వద్ద పోలీసులు మృతురాలి తల్లి పద్మావతితో మాట్లాడి వివరాలు సేకరించారు.రీల్స్ గర్ల్ ఎంట్రీ ఇలా..డాక్టర్ సృజన్ నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో కార్డియాలజీ వైద్యుడు. ఆస్పత్రి ప్రారంభ సమయంలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఓ యువతి ప్రమోషన్ వర్క్ కోసం అక్కడికి వచ్చింది. అక్కడున్న వైద్యులతో ముఖాముఖి నిర్వహించింది. ఆ సమయంలో ఆ యువతి పట్ల డాక్టర్ సృజన్ ఆకర్షితుడయ్యాడు. ఈసందర్భంగా ఇరువురు పరిచయం పెంచుకున్నారు. ఆమె వివిధ భంగిమల్లో చేసే రీల్స్ చూసి మరింత దగ్గరయ్యాడు. ఆ యువతి తన రీల్స్‌లో తాను గుండె ఆపరేషన్‌ను లైవ్‌గా చూసినట్లు పోస్టులు కూడా పెట్టింది. అంటే సృజన్ ఆమెను ఆపరేషన్ థియేటర్లోకి కూడా తీసుకెళ్లినట్లు స్పష్టమవుతోంది. సృజన్ కారును కూడా పూర్తిగా ఆమె వాడేదని సమాచారం. ఇటీవల ప్రత్యూష రెండో కాన్పు సమయంలో తల్లిగారింటికి వెళ్లినప్పుడు ఆ యువతి విల్లాకు వచ్చిందని, అంతగా వారి ప్రేమబంధం బలపడిందని స్థానికులు చెబుతున్నారు. -
Odisha: ప్రాణాలొదిలిన వేధింపుల బాధితురాలు.. స్పందించిన సీఎం
భువనేశ్వర్: లైంగిక వేధింపుల ఉదంతానికి మరో విద్యార్థిని అశువులుబాసింది. ఒడిశాలోని ఒక కళాశాలలో లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్‌పై ఫిర్యాదు చేసినప్పటికీ, చర్యలు తీసుకోకపోవడంతో కలత చెందిన ఒక విద్యార్థిని ఒంటికి నిప్పటించుకుంది. మూడు రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ సోమవారం రాత్రి మృతిచెందింది.ఐసీయూలోని బర్న్స్ వార్డులో చికిత్సనందిస్తూ, మూత్రపిండ మార్పిడి చికిత్సతో సహా అన్ని సాధ్యమైన వైద్య సహాయం అందించినప్పటికీ, బాధితురాలిని బతికించలేకపోయామని, ఆమె సోమవారం రాత్రి 11:46 గంటలకు మరణించిందని ఎయిమ్స్ భువనేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపింది. బాధితురాలు జూలై 1న కళాశాల ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆమె కళాశాల అధికారులకు రాసిన లేఖలో ఆ ప్రొఫెసర్ నెలల తరబడి తనపై సాగించిన వేధింపులు, బెదిరింపులను వివరించింది. అయినా ప్రొఫెసర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. ఈ నేపధ్యంలో తీవ్ర నిరాశలో ఉన్న బాధితురాలు జూలై 12న బాలసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల ప్రాంగణంలో నిప్పంటించుకుంది. 90 శాతం మేరకు కాలిపోయిన బాధితురాలిని వెంటనే ఎయిమ్స్ భువనేశ్వర్‌కు తరలించారు. సోమవారం రాత్రి ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. ଫକୀର ମୋହନ ସ୍ୱୟଂଶାସିତ ମହାବିଦ୍ୟାଳୟର ପୀଡ଼ିତା ଛାତ୍ରୀଙ୍କ ଦେହାନ୍ତ ଖବର ଶୁଣି ମୁଁ ଅତ୍ୟନ୍ତ ମର୍ମାହତ। ସରକାରଙ୍କ ସମସ୍ତ ଦାୟିତ୍ୱ ନିର୍ବାହ ତଥା ବିଶେଷଜ୍ଞ ଡାକ୍ତରୀ ଦଳଙ୍କ ଅକ୍ଲାନ୍ତ ପରିଶ୍ରମ ସତ୍ତ୍ୱେ ପୀଡ଼ିତାଙ୍କ ଜୀବନ ରକ୍ଷା ହୋଇପାରିଲା ନାହିଁ । ତାଙ୍କର ଅମର ଆତ୍ମାର ସଦଗତି କାମନା କରିବା ସହ ପରିବାରବର୍ଗଙ୍କୁ ଏହି ଅପୂରଣୀୟ…— Mohan Charan Majhi (@MohanMOdisha) July 14, 2025ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి విద్యార్థిని మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ, దోషులకు కఠినమైన శిక్ష పడుతుందని ఆమె కుటుంబానికి హామీ ఇచ్చారు.‘ఎఫ్ఎం అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థిని మృతి వార్త విని చాలా బాధపడ్డాను. నిపుణులైన వైద్య బృందం అవిశ్రాంత ప్రయత్నాలు చేసినప్పటికీ, బాధితురాలి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ జగన్నాథుడిని వేడుకుంటున్నాను. ఈ కేసులో దోషులందరూ చట్ట ప్రకారం కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని బాధిత విద్యార్థిని కుటుంబానికి హామీ ఇస్తున్నాను. ఇందుకోసం వ్యక్తిగతంగా అధికారులకు తగిన సూచనలు జారీ చేశాను’ అని ఆయన తన ఆన్లైన్ పోస్ట్‌లో తెలిపారు. -
కాపురంలో చిచ్చుపెట్టిన రీల్స్ చిన్నది!
సాక్షి, వరంగల్: రీల్స్ కలిపిన ప్రేమ.. పండంటి కాపురంలో చిచ్చు రాజేసింది. తన భర్త పరాయి యువతితో ప్రేమాయణం సాగించడం భరించలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. వరంగల్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కేసు వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ ప్రత్యూష.. హసన్‌పర్తిలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భర్త సృజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న ఓ యువతితో సృజన్ ప్రేమ వ్యవహారమే ప్రత్యూష మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సృజన్ కార్డియాలజీ డాక్టర్‌గా పని చేస్తున్నారు. మరో ఆస్పత్రిలో ప్రత్యూష డెంటిస్ట్‌గా పని చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఓ అమ్మాయి.. డాక్టర్ సృజన్‌ను ఆ మధ్య ఇంటర్వ్యూ చేసింది. వాటిని రీల్స్‌గా చేసి ప్రమోట్ చేసింది. ఈ క్రమంలో సృజన్, ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఈ వ్యవహారం తెలిసి ప్రత్యూష భర్తను నిలదీసింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో.. పెద్దలు సర్దిచెబుతూ వచ్చారు. అయినా సృజన్‌లో మార్పు రాకపోవడంతో ప్రత్యూష ఇలా ఘాతుకానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ బిడ్డ మరణానికి కారణమైన సృజన్‌ను, ఆ యువతిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. -
అన్నమయ్య జిల్లా: లారీ బోల్తా.. తొమ్మిది మంది దుర్మరణం
ఓబులవారిపల్లె/పుల్లంపేట: అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువుకట్టపై లారీ బోల్తాపడి 9 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉండగా.. నలుగురు పురుషులు. ఈ దుర్ఘటనలో మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన 22 మంది కూలీలు ఐషర్ వాహనంపై రాజంపేట ఇసుకపల్లి గ్రామానికి మామిడి కాయల్ని కోసి, లారీలో లోడ్ చేసేందుకు వెళ్లారు. మామిడి కాయల్ని లోడ్ చేసిన అనంతరం అదే లారీపై రైల్వేకోడూరు మామిడి మార్కెట్ యార్డుకు బయలుదేరారు. లారీ రెడ్డిపల్లి చెరువుకట్టపైకి రాగా మలుపు వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో గజ్జల దుర్గయ్య, గజ్జల వెంకటేశు, గజ్జల శ్రీను, గజ్జల రమణ, సుబ్బరత్నమ్మ, చిట్టెమ్మ, గజ్జల లక్ష్మీదేవి, రాధా, వెంకట సుబ్బమ్మ మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ 13 మంది కూలీలను 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులంతా రెక్కాడితే గానీ డొక్కాడని రోజు వారీ కూలీలే. ఘటనా స్థలాన్ని ఎస్పీ రామ్‌నాథ్ కార్గే పరిశీలించారు. లారీ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలిసాక్షి, అమరావతి: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై ఆదివారం రాత్రి మామిడి కాయల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన తొమ్మిది మంది చనిపోవడం, 13 మంది తీవ్రంగా గాయ పడటం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరంతా నిరుపేదలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు వారిని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
డ్రైవర్ దారుణ హత్యపై కూటమి గప్‌చుప్!
సాక్షి టాస్క్‌ఫోర్స్ : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య ఎంతో కలకలం సృష్టించినా అటు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు గానీ, ఇటు కూటమి ప్రభుత్వానికి గానీ ఈ ఘటన ఏమాత్రం పట్టడంలేదు. అతిసామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాసులును కోట వినుత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతికిరాతకంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ముఖ్యనేతలెవరూ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమిళ మీడియాలో కూడా ఈ ఉదంతంపై వరుస కథనాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగానీ, జనసేన అధినేతగానీ ఇప్పటివరకు నోరువిప్పలేదు. అయితే, మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం పవన్ రావాలి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. ఆదివారం మృతుడి సోదరి కీర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకున్న ఒకే ఒక్క సోదరుడు శ్రీనివాసులు అని.. అతన్ని పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరవుతోంది. దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని.. తమకు న్యాయం జరగాల్సిందేనని ఆమె పట్టుబడుతోంది. అంతేకాక.. ‘నా అన్నను నాకు లేకుండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. పవన్ రావాలి.. మాకు న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే’.. అని చెప్పింది. -
సీఐ వార్నింగ్.. వ్యక్తి ఆత్మహత్య
చొప్పదండి/కరీంనగర్ క్రైం: గృహహింస, వరకట్న వేధింపుల కేసులో తనను అత్తింటివారితోపాటు మధ్యవర్తులు, కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ వేధిస్తున్నారని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 7వ తేదీన సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగిన కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన కడారి శ్రవణ్‌కుమార్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. ఈ వ్యవహారంలో చొప్పదండి పోలీసులు కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీలత, మృతుడి భార్య, అత్త, మధ్యవర్తులపై కేసు నమోదు చేశారు.కరీంనగర్ రూరల్ రెవెన్యూ కార్యాలయంలో శ్రవణ్ కుమార్ రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కరీంనగర్ బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి నీలిమతో 2021 జూన్‌లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. రెండేళ్ల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి నీలిమ తల్లిగారింట్లో ఉంటోంది. గత నెలలో కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో నీలిమ వరకట్నం వేధింపుల కేసు పెట్టడంతో శ్రవణ్‌తోపాటు, అతని తండ్రి నర్సింగం, తల్లి విజయ, అక్క కడారి వనజ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ సీఐ శ్రీలత ‘నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి. నేను చెప్పినట్లు వింటే మంచిది. కంప్రమైజ్ చేసుకో. లేకుంటే ఇబ్బంది పడతావు’అని బెదిరిస్తూ అతడిపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో సీఐ శ్రీలత, తన భార్య, అత్త, మధ్యవర్తుల వేధింపులు భరించలేకపోతు న్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని శ్రవణ్ సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. శ్రవణ్ తండ్రి నర్సింగం ఫిర్యాదుతో సీఐ శ్రీలత, నీలిమ, ప్రవీణ్‌కుమార్, నవీన్‌కు మార్, ఎడ్ల ప్రసన్న, బత్తుల వినోద, బత్తుల మధుకుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌రెడ్డి తెలిపారు. శ్రవణ్ మృతితో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అతడి బంధు వులు ఆందోళన నిర్వహించారు. శ్రవణ్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రాధిక చేసిన మిస్టేక్ అదే.. హిమాన్షిక సంచలన వ్యాఖ్యలు
గురుగ్రామ్: టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కూతుర్ని ఆంక్షల నడుమ బంధించడానికి యత్నించే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాధిక ప్రాణ స్నేహితురాలు స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తల్లిదండ్రులు.. రాధికను నియంత్రించారని పేర్కొంది. రాధికను తనకు నచ్చిన విధంగా జీవించనివ్వలేదని తెలిపారు.రాధిక ప్రాణ స్నేహితురాలు హిమాన్షిక సింగ్ తాజాగా మాట్లాడుతూ.. రాధిక నాకు 2012 నుంచి తెలుసు. రాధిక ఎంతో సున్నితమైన మనసు కలిగి ఉంది. రాధిక కుటుంబ సభ్యులు.. ఆమెను నియంత్రించే వారు. ఆమె నాతో వీడియో కాల్లో ఉన్నప్పుడు, ఆమె ఎవరితో మాట్లాడుతుందో తల్లిదండ్రులకు చూపించాల్సి వచ్చింది. టెన్నిస్ అకాడమీ తన ఇంటి నుంచి కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్నప్పటికీ, ఆమె ఎప్పుడు తిరిగి రావాలన్న దానిపై డెడ్‌లైన్ ఉండేది. రాధికది సంప్రదాయ కుటుంబమని, దాదాపు ప్రతి దానితోనూ సమస్యలు ఉండేవని తెలిపింది. ప్రతి విషయంలోనూ నియంత్రణ విధిస్తూ రాధిక జీవితాన్ని ఆమె తండ్రి దుర్భరం చేశాడు.బయటకు వెళ్లాక పలానా సమయంలో తిరిగి ఇంటికి రావాలని ఆంక్షలు విధించేవారు. రాధిక కదలికలను ఇంట్లోవారు నియంత్రించారు. అతను తన నియంత్రణ, ప్రవర్తన, నిరంతర విమర్శలతో కుమార్తె జీవితాన్ని సంవత్సరాలుగా దుర్భరంగా మార్చాడు. షార్ట్స్ ధరించినందుకు, అబ్బాయిలతో మాట్లాడినందుకు, తన సొంత నిబంధనల ప్రకారం జీవించినందుకు వారు ఆమెను అవమానించారు. క్రమంగా వీడియోలు చిత్రీకరించడం వంటి ఆమె అభిరుచులన్నీ కనుమరుగయ్యాయి. ఆమె ఇంట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. కుటుంబంపై సామాజిక ఒత్తిడి ఉంది. ప్రజలు ఏమనుకుంటారో అని తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఆందోళన చెందేవారు. ఇంట్లోని ఆంక్షలతో ఆమె ఊపిరాడనట్టు ఉండేది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ రాధిక హత్యకు కారణమని తెలిపారు. రాధిక.. తన పేరెంట్స్‌కు నచ్చని కొని పనుల కారణంగానే హత్యకు గురైందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. రాధికా యాదవ్ టెన్నిస్ కోచ్‌లలో ఒకరైన అజయ్ యాదవ్ కూడా ఆమె హత్యపై స్పందించారు. ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడుతూ..‘ఇంట్లోని కొన్ని పరిమితులు, ఆంక్షలతో రాధిక సతమతమైనట్లు వెల్లడించారు. తనకు వాట్సాప్ చాట్ టెక్ట్స్ మెసేజ్‌లు, వాయిస్ చాట్లలో ఆమె చెప్పిన కొన్ని విషయాలను జాతీయ మీడియాకు చూపించారు. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. -
బీమా చేయించి.. ఆపై చంపించి..
సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను హత్య చేయించి..దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఓ అల్లుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా పెద్దమాసాన్‌పల్లి శివారులో చోటుచేసుకుంది. శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ డాక్టర్ బి.అనురాధ ఆ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన తొగుట పీఎస్ పరిధిలో దివ్యాంగురాలైన తాటికొండ రామవ్వ(60)ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని.. ఆమె అల్లుడు తాళ్ల వెంకటేశ్ డయల్ 100కు కాల్ చేశాడు. దీంతో గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందినట్టు తొగుట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైట్ కారు ఢీ కొట్టి..ఇప్పుడే వెళ్లిందని ఫిర్యాదులో భాగంగా వెంకటేశ్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు వైట్ కారు డ్రైవర్‌ను విచారించగా, తన కంటే ముందు బ్లాక్ కలర్ తార్జీపు వెళ్లిందని చెప్పాడు. సీసీ ఫుటేజీని పరిశీలించగా ఈ తార్ జీపు తుక్కాపూర్ వరకు నంబర్ ప్లేట్ ఉన్నట్టు, తర్వాత దానిని తొలగించి టీఆర్ స్టిక్కర్ వేసినట్టు గుర్తించారు. ఎందుకు నంబర్ ప్లేట్ తొలగించారని ఆరా తీశారు. ఆ తార్ జీపు నంబరు ఆధారంగా వాహన యజమాని దగ్గరకు వెళ్లి పోలీసులు విచారించారు. పెద్దమాసాన్‌పల్లికి చెందిన కరుణాకర్ సెల్ఫ్ డ్రైవింగ్ నిమిత్తం సిద్దిపేటలో రూ 2,500 చెల్లించి ఆధార్ కార్డు, వివరాలు ఇచ్చి అద్దెకు తీసుకున్నాడు. దీంతో పోలీసులు కరుణాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. కరుణాకర్ చెప్పిన వివరాల ఆధారంగా మృతురాలి అల్లుడైన వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. తానే ఈ దారుణానికి ఒడికట్టానని పోలీసులకు చెప్పాడు. ముందస్తు ప్లాన్ ప్రకారమే...సిద్దిపేట కేసీఆర్‌నగర్‌కు చెందిన తాటికొండ రామవ్వ–రంగయ్య దంపతుల కుమార్తెను తొగుట మండలం పెద్దమాసాన్‌పల్లికి చెందిన తాళ్ల వెంకటేశ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే వెంకటేశ్ తన అత్తను హత్య చేసి దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి... ఆమె పేరుపై ఇన్సూరెన్స్ చేయించి డబ్బు కాజేయాలనుకున్నాడు. అందులో భాగంగానే ఈ ఏడాది మార్చిలో తాటికొండ రామవ్వ పేరుపై పోస్టాఫీసులో ఏడాదికి రూ.755 చెల్లించి రూ.15 లక్షల ఇన్సూరెన్స్, ఎస్బీఐలో రూ.2 వేలు చెల్లించి రూ 40 లక్షల ఇన్సూరెన్స్ చేయించాడు. రైతుబీమా డబ్బు లు వస్తాయని రంగయ్య (మృతురాలి భర్త) పేరు పైన ఉన్న 28 గుంటల వ్యవసాయ భూమిని రామవ్వ పేరు మీద పట్టా మారి్పడి చేయించాడు. ఆపై తన ప్లాన్‌కు వరుసకు తమ్ముడయ్యే తాళ్ల కరుణాకర్‌కు చెప్పాడు. వెంకటేశ్ గతంలోనే తాళ్ల కరుణాకర్‌కు రూ.1.30 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అయితే కరుణాకర్ పౌల్ట్రీఫామ్ పెట్టి రూ.22 లక్షల వరకు నష్టపోయాడు. తన అత్త హత్యకు సహకరిస్తే అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదని, వచ్చే ఇన్సూరెన్స్‌లో ఇద్దరం చెరి సగం పంచుకుందామని వెంకటేశ్ కరుణాకర్‌ను ఒప్పించాడు. ప్లాన్‌లో భాగంగానే ఈ నెల 7న కారు తీసుకొని రావాలంటూ వెంకటేశ్ కరుణాకర్‌కు ఫోన్ చేశా డు. ఇదే సమయంలో విద్యుత్ అధికారులు వస్తున్నారని నీ సంతకం కావాలని చెప్పి వెంకటేశ్ తన అత్త రామవ్వను ఎక్స్ఎల్ వాహనంపై పెద్దమాసాన్‌పల్లి శివారులోని వ్యవసాయ భూమి వద్దకు తీసుకొచ్చాడు. కరుణాకర్ సిద్దిపేటలోని కార్లు సెల్ఫ్ డ్రైవింగ్ ఇచ్చే వారి వద్దకు వెళ్లి ఓ తార్ జీపు (టీఎస్ 18జీ 2277)ను అద్దెకు తీసుకున్నాడు. నంబర్ ప్లేట్ కనిపించకుండా టీఆర్ పేపర్ అతికించి పెద్దమాసాన్‌పల్లి శివారుకు వచ్చాడు. రోడ్డుపైన రామవ్వను ఉంచి వెంకటేశ్ పొలంలోకి వెళ్లాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం...రామవ్వను జీపుతో కరుణాకర్ ఢీకొట్టాడు. ఆపై కొద్ది దూరం వెళ్లాక వెంకటేశ్‌కు వాట్సాప్ కాల్ చేసి మీ అత్తను చంపిన వెళ్లి చూసుకో అన్నాడు. అనంతరం జీపునకు టీఆర్ పేపర్ తీసేసి దానిని సిద్దిపేటలో ఇచ్చేశాడు. సాంకేతిక సాయంతో పోలీసులు వెంకటేశ్‌ను అదుపులోకి తీసు కొని విచారించగా ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే తన అత్త ను చంపించినట్టు ఒప్పుకున్నాడు. ఆధారాలు దొరక్కుండా చేసేందుకు వారు దృశ్యం సినిమా చూశారని పోలీసు లు తెలిపారు. నార్మల్ ఫోన్ కాల్ చేస్తే పోలీసులకు దొరికే ప్రమాదముందని నిందితులిద్దరూ వాట్సాప్ కాల్స్ మా ట్లాడుకున్నట్టు విచారణలో తేలింది. వెంకటేశ్, కరుణాకర్లను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన తార్ జీప్ ఎక్స్ఎల్ వాహనాన్ని స్వా«దీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. గజ్వేల్ ఏసీపీ నరసింహులు ఆధ్వర్యంలో కేసును ఛేదించిన తొగుట సీఐ లతీఫ్, ఎస్ఐ రవికాంతరావు, సిబ్బందిని సీపీ అభినందించి రివార్డు అందజేశారు. -
పోలీసులు చంపేసి.. చెరువులో వేశారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి పోలీసుల రెడ్‌బుక్ రాజ్యాంగంలో మాతంగి భరత్ అనే యువకుడి ప్రాణం పోయింది. కోర్టు వాయిదాకు హాజరు కాకపోవడంతో ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు పేరుతో అతడిని పొట్టన పెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చెరువుగట్టు వద్ద నివాసం ఉంటున్న భరత్ ఇంటికి బుధవారం రాత్రి త్రీ టౌన్ ఐడీ పార్టీ కానిస్టేబుల్ మురళీ, మఫ్టీలో ఉన్న పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో భరత్, అతడి తమ్ముడు నవీన్, మరో ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఆటోలోంచి దిగిన ముగ్గురు పోలీసులు.. భరత్ అనుకుని మరొకరిని గట్టిగా పట్టుకున్నారు. దీంతో భరత్ పరిగెత్తుకుంటూ వెళ్లి చెరువులో దూకాడు. పోలీసులు కూడా చెరువులోకి దిగి వెంబడించారు. భరత్ ఈదుకుంటూ మరోవైపు వెళ్లగా అక్కడ మాటువేసిన మరికొందరు పోలీసులు పట్టుకుని బైక్ మీద తీసుకువెళ్లారని స్థానికులు చెబుతున్నారు.ప్యాంట్ లేకుండా.. తీవ్ర గాయాలతో విగతజీవిగా రెండు రోజుల తర్వాత శుక్రవారం ఉదయం భరత్ అదే చెరువులో విగతజీవిగా కనిపించాడు. అయితే, అతడు చెరువులో దూకే సమయంలో నల్ల ప్యాంట్, టి షర్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహంపైన మాత్రం ప్యాంట్ లేదు. కట్ డ్రాయర్, టి షర్ట్ మాత్రమే ఉన్నాయి. భరత్ తొడలు వాచిపోయాయి. తల, ముఖంపై తీవ్రంగా, శరీరంపై గాయాలున్నాయి. దీంతో పోలీసులే కొట్టి చంపి, చెరువులో పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తీవ్రస్థాయిలో బెదిరింపుల మధ్య అంత్యక్రియలు భరత్ మృతి తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు అనుమానాలను మరింత బలపరుస్తోంది. పోస్టుమార్టం నుంచి అంత్యక్రియల వరకు 5 పోలీస్ జీప్‌లు, ఒక స్పెషల్ పార్టీ బస్సు అనుసరించాయి. గతంలో తెనాలిలో పనిచేసి, ప్రస్తుతం జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులు వచ్చి.. భరత్ కుటుంబ సభ్యులతో రాజీ ప్రయత్నాలు చేయడం గమనార్హం. పోలీసుల తప్పు లేకపోతే ఎందుకు ఈ తతంగం నడుపుతున్నారన్న ప్రశ్నలు స్థానికుల నుంచి వచ్చాయి. అంతేకాదు.. ‘‘ఎలాంటి హడావుడి చేయకుండా అంత్యక్రియలు జరిపించండి. తేడా వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని కుటుంబసభ్యులను బెదిరించినట్లు తెలిసింది. భరత్ శరీరంపై లాఠీదెబ్బలుంటే విచారించి న్యాయం చేస్తామని ఎలాంటి ఆందోళనలు చేయొద్దని కూడా కోరినట్లు సమాచారం. » భరత్‌పై గత నవంబరులో త్రీ టౌన్ స్టేషనులో పోక్సో కేసు నమోదైంది. కోర్టులో విచారణకు గైర్హాజరయ్యాడు. ఈ నెల 14న వాయిదా కోసం తెనాలిలోని పోక్సో కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో 9వ తేదీ రాత్రి పొద్దుపోయాక పోలీసులు భరత్ ఇంటికి వెళ్లారు. కాగా, భరత్ తో పాటు ఇద్దరు పోలీసులు చెరువులో దూకినా కొంతసేపటి తర్వాత అతడు దొరకలేదంటూ తిరిగివెళ్లారని చెబుతున్నారు. అయితే, భరత్ విగతజీవిగా తేలేవరకు పోలీసులు చెరువు వైపు చూడకపోవడం అనుమానాలను మరింత తీవ్రం చేస్తోంది. భరత్ వారి వద్ద ఉన్నందునే పోలీసులు చెరువు వద్దకు మళ్లీ రాలేదని అంటున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సీరియస్ అయ్యారు. శనివారం సెట్ కాన్ఫరెన్స్‌లో తెనాలి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తెనాలిలో వరుస ఘటనలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారని డీఎస్పీపైనా నిప్పులు చెరిగినట్లు సమాచారం.పోలీసులు చిత్రహింసలు పెట్టి నా బిడ్డను చంపేశారు మావాడు ఎంతసేపైనా ఈదగలడు. అలాంటివాడు చెరువులో మునిగి ఎలా చనిపోతాడు? పోలీసులే పట్టుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపి చెరువులో వేసి తొక్కేశారు. పోలీసులను ఏమార్చి పారిపోయి ఉంటాడని అనుకున్నాం. శవమై తేలతాడని ఊహించలేదు. భరత్‌పై పోక్సో కేసు కూడా బూటకమే. పోలీసులకు ఎప్పుడేది అనిపిస్తే ఆ కేసు పెట్టడం, లోపల వేయడం అలవాటైంది. అబ్బాయిని తీసుకుని స్టేషన్‌కు రమ్మంటే తీసుకెళ్లేదాన్ని. చంపేయడం ఎందుకు? –భరత్ తల్లి సుశీల బీర్జాల మీద కొట్టారు.. ఒంటిపైన లాఠీదెబ్బలు ఉన్నాయి మా అన్నను ఐడీ పార్టీ కానిస్టేబుల్ మురళీ మరో పదిమంది కానిస్టేబుళ్లు కలిసి పట్టుకుని తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి చంపేశారు. అతడి ఒంటిపై లాఠీ దెబ్బలు ఉన్నాయి. బీర్జాల మీద కొట్టడంతోనే మరణించాడు. తర్వాత తెచ్చి చెరువులో వేసి తొక్కేశారు. పోలీసులు వెళ్లాక రాత్రంతా చెరువు చుట్టూ వెదికాం. కానీ, విగతజీవిగా కనిపించాడు. ఇది పోలీసులు చేసిన హత్యే. ఫిర్యాదు చేసినా కేసు పెట్టలేదు. తెనాలిలో పనిచేసిన నరసింహారావు అనే పోలీసు వచ్చి రాజీ ప్రయత్నాలు చేశారు. –భరత్ తమ్ముడు నవీన్ పోలీసులు చేసిన హత్యగా కనిపిస్తోంది భరత్ మృతి పోలీసులు చేసిన హత్య అని స్పష్టంగా కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల ఆరోపణలు బలమైనవే. అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును హత్య కేసుగా మార్చాలి. పోలీసుల ప్రమేయం ఉన్నందున, స్థానిక అధికారులు విచారిస్తే న్యాయం జరగదు. బయటి పోలీసులు లేదా సీఐడీతో విచారణ చేయించాలి. –జి.శాంతకుమార్, అధ్యక్షుడు, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ -
కోల్‌కతా ‘అత్యాచారం’ కేసులో ట్విస్ట్
కోల్‌కతా: వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో ఐఐఎంలో అత్యాచారం కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం అయిన వేళ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందని లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే ఆమె తండ్రి అత్యాచారం జరగలేదంటూ ట్విస్ట్ ఇచ్చారు. తన కూతురిపై అసలు అత్యాచారం జరగలేదని, ఆటోలోంచి పడిపోతే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. అది కేవలం యాక్సిడెంట్ మాత్రమేనని అత్యాచారం వార్తలను కొట్టిపారేశారు. దీనిపై శుక్రవారం రాత్రి తనపై అత్యాచారం జరిగిందనే బాధితురాలు ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తండ్రి ఈరోజు(శనివారం. జూలై 12) తన కూతురిపై అత్యాచారం జరగలేదంటూ వెల్లడించారు. ‘ ‘నిన్న రాత్రి మాకు ఫోన్ వచ్చింది. ఆటో రిక్షా నుంచి పడిపోయిందని ఆమె ఫోన్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్‌ను ట్రేస్ అవుట్ చేసి లొకేషన్ గుర్తించాం. పోలీసులే ఆమెను ఎస్ఎస్కేమ్ న్యూరాలజీ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. నా కూతురు తనపై అత్యచారం జరగలేదని నాకు చెప్పింది. పోలీసులు మాత్రం దీనిపై కేసు నమోదు చేసి ఇప్పటికే ఒకర్ని అరెస్ట్ చేశామని చెప్పారు. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తికి ఈ ఘటనతో ఏం సంబంధం లేదు’ అని తెలిపారు.ఈ కేసుకు సంబంధించి ఐఐఎమ్ క్యాంపస్ బాయ్స్ హాస్టల్లో అత్యాచారం జరిగినట్లు తొలుత వార్తలు వచ్చాయి. బాధితురాలి తండ్రి తాజాగా ముందుకు అది అత్యాచారం కాదని, కేవలం యాక్సిడెంట్ మాత్రమేనని చెప్పడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. -
అందుకే అలా చేశా.. నన్ను ఉరి తీయండి: రాధికా తండ్రి
టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన కుమార్తెను హత్య చేసినందుకు ఆమె తండ్రి దీపక్ యాదవ్ కుమిలిపోతున్నాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తనను ఉరి తీయాలంటూ.. రాధికా యాదవ్ తండ్రి పశ్చాత్తాపం పడినట్లు దీపక్ యాదవ్ సోదరుడు చెప్పుకొచ్చారు. ఆవేశంలో హత్య చేశానని.. తనను ఉరి తీయాలని పోలీసులను కోరినట్లు ఆయన తెలిపారు.ఈ కేసులో తండ్రి దీపక్ యాదవ్‌కు గురుగ్రామ్ కోర్టు 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆయన్ను కోర్టు నుంచి జైలుకు తరలించారు. రాధికా యాదవ్‌ను ఆమె తండ్రే హత్య చేశాడు. కిచెన్‌లో వంట పని చేస్తున్న రాధికా యాదవ్‌ను వెనుక నుంచి వెళ్లి తన లైసెన్స్డ్ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. నాలుగు రౌండ్ల బుల్లెట్లు ఒంట్లోంచి దూసుకెళ్లడంతో రాధిక అక్కడికక్కడే మృతి చెందింది.రాధికా యాదవ్ సొంతంగా టెన్నిస్ అకాడమీ నడుపుతుండటంతో ఇరుగుపొరుగు తనను కుమార్తె సంపాదనతో బతుకుతున్నావని హేళన చేస్తున్నారని, దాంతో అకాడమీని మూసివేయమని ఎంత చెప్పినా తన కుమార్తె వినిపించుకోలేదని.. అందుకే ఆమెను హత్య చేశానంటూ పోలీసుల విచారణలో దీపక్ యాదవ్ చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు, రాధిక ఇన్‌స్టాలో పెట్టిన ఓ రీల్ కూడా హత్యకు కారణమంటూ పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.కాగా, రాధికా యాదవ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూతుర్ని ఆంక్షల నడుమ బంధించడానికి యత్నించే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. రాధికా యాదవ్ టెన్నిస్ కోచ్‌లలో ఒకరైన అజయ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లోని కొన్ని పరిమితులు, ఆంక్షలతో రాధికా యాదవ్ సతమతమైనట్లు వెల్లడించారు. తనకు వాట్సాప్ చాట్ టెక్ట్స్ మెసేజ్‌లు, వాయిస్ చాట్లలో ఆమె చెప్పిన కొన్ని విషయాలను అజయ్ యాదవ్ జాతీయ మీడియాకు తెలిపారు.ఇదీ చదవండి: రాధిక వాట్సాప్ చాట్‌లో సంచలన విషయాలు..! -
రాధిక వాట్సాప్ చాట్‌లో సంచలన విషయాలు..!
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో కన్న తండ్రి దీపక్ యాదవ్ చేతిలో దారుణ హత్యకు గురైన టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూతుర్ని ఆంక్షల నడుమ బంధించడానికి యత్నించే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. రాధికా యాదవ్ టెన్నిస్ కోచ్‌లలో ఒకరైన అజయ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లోని కొన్ని పరిమితులు, ఆంక్షలతో రాధికా యాదవ్ సతమతమైనట్లు వెల్లడించారు. తనకు వాట్సాప్ చాట్ టెక్ట్స్ మెసేజ్‌లు, వాయిస్ చాట్లలో ఆమె చెప్పిన కొన్ని విషయాలను అజయ్ యాదవ్ ఎన్డీటీవీకి స్పష్టం చేశారు. ఆంక్షలు భరించలేకపోతున్నా.. !తాను ఇంట్లో ఆంక్షలను భరించలేకపోతున్నానని, ప్రతీ దానికి వివరణ ఇచ్చు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాధికా తనతో వాట్పాప్ చాట్‌లో తెలిపిందన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది అక్డోబర్, నవంబర్, డిసెంబర్లలో ఇంటికి దూరంగా వెళ్లిపోవాలనుకుందని, అందుకోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుందన్నారు. తాను తొలుత చైనా వెళ్లాలని అనుకున్నప్పటికీ, అక్కడ ఫుడ్ తనకు సరిపడదనే విషయంతో ఆగిపోయిందన్నారు. దుబాయ్, ఆస్ట్రేలియాకు వెళ్లి ఒక నాలుగు నెలల పాటు ఒంటిరిగా ఉండాలని, లైఫ్‌ను ఎంజాయన్ చేయాలని ఆమె పేర్కొన్నట్లు అజయ్ స్పష్టం చేశారు. తనకు ఏవో కొన్ని లక్ష్యాలున్నాయని, దాని కోసం తండ్రి దీపక్ యాదవ్‌కు చెబితే కనీసం వినడం కూడా చేయడం లేదని ఆమె మెసేజ్‌లో వాపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు..!మరో కోచ్ అంకిత్ పటేల్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. అసలు అండ్రీ-కూతుళ్ల మధ్య ఇంతటి వివాదం దాగి ఉందనే విషయం ఎప్పుడూ తమకు తెలియదన్నారు. ‘ నాకు రాధికా యాదవ్ 11-12 ఏళ్ల నుంచే తెలుసు. అలాగే ఆమె తండ్రి కూడా బాగా తెలుసు. ఆమె టెన్నిస్ ప్రాక్టీస్‌కు సంబంధించి తండ్రీ-కూతుళ్ల మధ్య ఎటువంటి విభేదాలు లేవు. తండ్రి ఎప్పుడూ ఆమె సపోర్ట్‌గా నిలిచేవారు. ఆమె ఎక్కడ టెన్నిస్ మ్యాచ్ ఆడటానికి వెళ్లినా వెంటే ఉండి అన్నీ చూసుకునే వారు. రాదికా ఎప్పుడూ ఒంటిరగా ఉండటాన్ని కానీ వేరే వాళ్లతో ఉండటం కానీ నేను చూడలేదు. టెన్నిస్ ఆటకు సంబంధించి వీరి మధ్య గొడవలున్నాయనేది వాస్తవం కాదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరి తెలుసు’ అని సదరు కోచ్ అంకిత్ పటేల్ తెలిపారు.ఇదీ చదవండి:ఎంత గొప్ప జీవితం.. క్షణంలో తలకిందులు..! -
సిద్ధిపేటలో దారుణం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను చంపి..
సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ అల్లుడు.. తన అత్తనే చంపించేశాడు.. ఈ నెల జులై 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అల్లుడు వెంకటేష్.. రూ. లక్షా 50 వేలు సుపారీ ఇచ్చి.. కారుతో ఢీకొట్టించి అత్తను హత్య చేయించాడు. తోగుట మండలం తుక్కాపూర్ దర్గా వద్ద ఈ ఘటన జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారం అత్తను హత్య చేయించిన అల్లుడు గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయిందంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు.సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయగా అల్లుడి బాగోతం బయటపడింది. వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. హత్య చేసినట్టు అల్లుడు వెంకటేష్ తన నేరాన్ని అంగీకరించాడు. అత్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన అల్లుడు వెంకటేష్.. ముందుగానే పోస్టాఫీసు ఇన్సూరెన్స్, ఎస్బీఐ ఇన్సూరెన్స్, రైతు బీమా చేయించినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.పౌల్ట్రీ ఫామ్ పెట్టి రూ.22 లక్షల వరకు నష్టపోయిన వెంకటేష్.. నష్టాల నుంచి బయటపడేందుకు అత్త హత్యకు ప్లాన్ చేశాడు. అత్త పేరుపై రూ.60 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేసిన అల్లుడు.. పొలం పని ఉందని చెప్పి..అత్తను తీసుకెళ్లాడు. దృశ్యం-2 సినిమా చూసి అత్తను హత్య చేయించాడు. కారుతో ఢీకొట్టి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. -
సెల్పీ దిగుదాం రా బావా..!
భార్యభర్తల బంధాలకు ఈ మధ్యకాలంలో అనూహ్య ముగింపు లభిస్తోంది. వివాహేతర సంబంధాలతోనో, పాత పరిచయాల కోసమే ఒకరినొకరు కడతేర్చుతున్న ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.సెల్ఫీ కోసం ఓ బ్రిడ్జి మీద ఆగిన కొత్తజంట.. వీడియోతో నెట్టింట రచ్చ చేస్తోంది. తన బావ(భర్త) ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయాడని ఆ నవవధువు, లేదు తన భార్యే తనను తోసేసి చంపాలని చూసిందని ఆ భర్త హల్ చల్ చేశారు. కర్ణాటక రాయ్‌చూర్‌లో తాజాగా జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..కాడ్లూరు సమీపంలో కృష్ణా నది వంతెన మీదుగా బైక్ మీద వెళ్తున్న ఓ జంట ఆగింది. కాసేపటికే ఆ వ్యక్తి చేతులు ఊపుతూ సాయం కోసం అరవసాగాడు. ఈలోపు వంతెన మీద ఉన్న అతని భార్య దారినపోయే వాళ్లను రక్షించమని సాయం కోరుతూ కనిపించింది. ఇది గమనించిన మత్స్యకారులు కొందరు తాడు సాయంతో ఆ వ్యక్తిని వంతెన పైకి తీసుకొచ్చారు. తమకు ఈ మధ్యే వివాహం అయ్యిందని, సెల్ఫీ దిగుదామని తన భార్య కోరిందని.. ఆ సమయంలో ఆమె తనను నీళ్లలోకి తోసేసిందని, ఎలాగోలా వచ్చిన కాస్త ఈతతో ఈదుకుంటూ బండరాళ్ల మీదకు చేరానని, తనను చంపేందుకు కుట్ర పన్నిందని సదరు వ్యక్తి వాపోయాడు. అయితే కాలు జారి తన భర్త నదిలో పడిపోయాడని, తనకు ఎలాంటి పాపం తెలియదని ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. దీంతో అక్కడ ఉన్నవాళ్లు ఆ జంటను స్థానికంగా ఉన్న పీఎస్‌కు తీసుకెళ్లగా.. వాళ్లు పెద్దల సమక్షంలో ఆ జంటకు కౌన్సెలింగ్ ఇప్పించి పంపించినట్లు తెలుస్తోంది.A newlywed man in #Raichur was allegedly pushed into the River by his wife during a photoshoot near Gurjapur Bridge.He clung to rocks & was rescued by fishermen.The wife claimed it was accidental but husband accused her of a deliberate act.Police are investigating the viral video pic.twitter.com/4Da9x8ShXx— Yasir Mushtaq (@path2shah) July 12, 2025 -
Kolkata: బాలుర హాస్టల్లో విద్యార్థినిపై అకృత్యం.. ఒకరి అరెస్ట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్కతాలోగల ఒక న్యాయ కళాశాలలో యువతిపై జరిగిన అత్యాచారాన్ని మరచిపోకముందే, ఇక్కడి ఐఐఎం కళాశాలలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్-కలకత్తాలో చదువుకుంటున్న ఒక విద్యార్ధినిపై బిజినెస్ స్కూల్ హాస్టల్లో ఒక విద్యార్థి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసిందని వారు పేర్కొన్నారు. బాధితురాలు పోలీసులకు అందించిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. ఆమెను కౌన్సెలింగ్ కోసం బాలుర హాస్టల్‌కు పిలిచారు. ఆ తర్వాత ఆమెచేత ఏదో పానీయం తాగించాక, ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగిందని ఆ యువతి గ్రహించిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు తనను బెదిరించాడని కూడా ఆమె ఆరోపించిందని పోలీసులు చెప్పారు. కేసు నమోదుచేసిన కొద్ది గంటలకే నిందితుడిని అరెస్ట్ చేశామని, కేసు దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు పేర్కొన్నారు. -
అన్నను అతికిరాతకంగా చంపిన తమ్ముడు
మెదక్: సొంత అన్ననే తమ్ము డు కిరాతకంగా హతమార్చిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... వసురాంతండాకు చెందిన రామావత్ మంత్యా (48)కు తండా పక్కనే పొలం ఉంది. ఇతని సొంత తమ్ముడు మోహన్ కూడా ఇదే తండాలో నివాసం ఉంటున్నాడు. గత యాసంగి సీజన్లో మోహన్ ట్రాక్టర్‌తో మంత్యా తన పొలాన్ని దున్నించాడు. కిరాయి డబ్బు చెల్లించలేదు. ఈ విషయమై అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మోహన్ ఇంట్లో తరచూ కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతుండటం, నెల క్రితం అతడి మనవరాలు అనారోగ్యంతో చనిపోయింది. అన్న మంత్యా మంత్రాలు చేయడం కారణంగానే ఇలా జరిగిందని భావించాడు. రెండు రోజుల క్రితం పొలం దున్నడానికి అదే తండాకు చెందిన భిక్షపతి ట్రాక్టర్‌ను మంత్యా మాట్లాడాడు. విషయం తెలుసుకున్న మోహన్ తన డబ్బులు ఇవ్వకుండా ఎవరూ పొలం దున్నేది లేదంటూ గొడవపడ్డాడు. ఉద యం కల్లు దుకాణంలో మోహన్, భిక్షపతి కల్లు తాగారు. దున్నకం విషయమై మాట్లాడాలంటూ భిక్షపతి మంత్యాకు ఫోన్ చేయగా అక్కడకు వచ్చాడు. డబ్బుల విషయమై అన్నదమ్ముల మధ్య మాటామాట పెరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మోహన్ పక్కనే ఉన్న కల్లు సీసాను పగలగొట్టి మంత్యా గొంతులో ఇతర శరీర భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు. ఆపై బండరాయితో తలపై, మర్మాంగాలపై మోదాడు. చేతి రుమాలుతో మెడకు బిగించి నేలపై తలను కొట్టి, కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. విషయం తెలుసుకున్న మంత్యా భార్య లక్ష్మి , కుమారుడు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న మంత్యాను కొల్చారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు తెలిపారు. మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి సంఘటన స్థలానికి వచ్చారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటన మొత్తాన్ని కల్లు దుకాణంలో ఉన్న కొందరు ఫోన్లో చిత్రీకరిస్తూ నిలుచున్నారే తప్ప ఘోరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
న్యూడ్‌కాల్స్ స్క్రీన్ షాట్లు పంపి..
హైదరాబాద్: న్యూడ్ కాల్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను చూపి మాజీ భార్యను వేధిస్తున్న వ్యక్తితో పాటు మరో మహిళపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బేగంపేట రసూల్‌పురాకు చెందిన మహిళ (39)కు సయ్యద్ జావేద్ (44)తో 2005లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. జావేద్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో బాధితురాలు అతనితో విడాకులు తీసుకుని వేరుగా నివాసం ఉంటుంది. అతడిపై ఆమె పెట్టిన కేసు విచారణలో ఉంది. ఇదిలా ఉండగా గత నెల 26న సయ్యద్ జావేద్ బాధితురాలికి ఫోన్ చేసి ఆమెతో కలిసి ఉంటానని చెప్పాడు. తరచూ ఆమెతో మాట్లాడేవాడు. బాధితురాలు కూడా జావేద్‌ను నమ్మి అతనితో మాట్లాడుతుండేది. ఈ క్రమంలో ఆమెతో బలవంతంగా న్యూడ్‌కాల్స్ మాట్లాడించిన అతను కాల్స్‌కు సంబంధించి స్క్రీన్షాట్లను సేవ్ చేసి బాధితురాలి ఇంటి సమీపంలో ఉంటున్న ఓ యువకుడికి పంపాడు. అతను ఈ విషయం బాధితురాలి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె భర్త ఉంటున్న ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న షాబానా అనే మహిళను నిలదీసింది. దీంతో జావేద్‌పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో స్క్రీన్షాట్లను అందరికీ పంపతామని బెదిరించారు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సయ్యద్ జావేద్‌తో పాటు షబానాపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భర్త వేధింపులు తాళలేక..
హైదరాబాద్: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్లాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సామల వెంకటరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్లాపూర్‌లో నివాసం ఉంటున్న సాదిక్ ఆలి, సమీనా బేగం దంపతులకు ముగ్గురు సంతానం. గత కొన్నేళ్లుగా సాదిక్ ఆలి భార్య సమీనాను వేధిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను ప్రతి రోజూ తాగి వచ్చి భార్యను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. గురువారం రాత్రి కూడా అతను భార్యతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపానికి లోనైన సమీనా బేగం శుక్రవారం ఉదయం సీలింగ్ రాడ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అల్లాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
శ్రీకాకుళం క్రైమ్, ఎచ్చెర్ల: రోడ్డు పనులు పరిశీలించి వస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. మూకుమ్మడిగా దాడిచేసిన అధికార టీడీపీ కార్యకర్తలు.. ఆయనను అంతమొందించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు.. ఫరీదుపేటకు చెందిన సత్తారు గోపి వైఎస్సార్సీపీ కార్యకర్త. ఊరి కూడలి ఎన్‌హెచ్–16 సమీపంలోని కొయిరాలమెట్ట వద్ద అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో ఉంది. శుక్రవారం మధ్యాహ్నం చిన్నాన్న సత్తారు కోటేశ్వరరావుతో కలిసి గోపి ఆ రహదారి పనులను పరిశీలించి ఇంటికి భోజనానికి బైక్ (ఏపీ30పి6845)పై బయల్దేరారు. ఇంతలో కొయిరాలమెట్ట వద్ద దారికాచిన ఎనిమిది మంది కర్రలతో దాడికి దిగారు. గోపి వారికి చిక్కగా... బైక్‌పై వెనుక కూర్చున్న కోటేశ్వరరావు పరిస్థితి గ్రహించి పారిపోయాడు. అప్పటికే కర్రలతో గోపి తలపై బాదిన దుండగులు ఆయనను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశారు. ఈ దాడిలో మారణాయుధాలు కూడా వాడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోపి ఎంపీపీ మొదలవలస చిరంజీవికి ప్రధాన అనుచరుడు. భర్త హత్య విషయం తెలిసి గోపి భార్య పుణ్యవతి కుప్పకూలారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. గోపికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. టీడీపీ వారే చంపారు...ఫరీదుపేట గ్రామ టీడీపీ నాయకులే గోపి హత్యకు ఒడిగట్టారని ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులకు సైతం ఇదే విషయం తెలిపారు. రాజకీయంగా కక్ష కట్టిన టీడీపీ నేతలు... కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామంలో రెండో హత్యకు పాల్పడ్డారు. ఏడాది కిందట వైఎస్సార్సీపీ కార్యకర్త కూన ప్రసాద్‌ను టీడీపీ మద్దతుదారులు హత్య చేశారు.హత్యను తప్పుదారి పట్టించే కుట్ర..హత్య విషయం తెలిసి పోలీసులు, గోపి కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్రోచ్ రోడ్డు వద్ద ఒక కర్ర, వెనుక నిర్మానుష్య ప్రదేశంలో రక్తపు మడుగులో గోపి మృతదేహం పక్కన లావుపాటి కర్ర ఉండటం గమనార్హం. నిరుడు కూన ప్రసాద్‌నూ ఇదే తరహాలో టీడీపీ వర్గీయులు హతమార్చారు. ఆ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయకుండా వదిలేశారని.. వారివల్లే గోపి హత్య జరిగిందని వైఎస్సార్సీపీ మద్దతుదారులు, కుటుంబసభ్యులు పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. దాదాపు అరగంట పాటు హైవేను దిగ్బంధించారు. పూర్తిగా రాజకీయ కారణాలు ఉండగా.. భార్యాభర్తల తగాదా కేసులో భాగంగా అంటూ కేసు తీవ్రత తగ్గిస్తూ, టీడీపీవారిని తప్పించేలా పోలీసులు వ్యవహరించారని గోపి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. డీఎస్పీ వివేకానంద సైతం ఇలానే మాట్లాడుతున్నారని తెలిపారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఎచ్చెర్ల ఎస్ఐ వి.సందీప్ ఘటనా స్థలి నుంచి వెళ్లిపోయారు. డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ అవతారం, సబ్ డివిజన్ పోలీసులంతా వచ్చినా ఆందోళనకారుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయారు. దీంతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి రావాల్సి వచ్చింది. గోపి హత్య నిందితులైన టీడీపీ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. కిందకు లాగేసి.. దుర్భాషలాడుతూ..తొమ్మిదిమంది టీడీపీ వాళ్లు వచ్చి బైక్‌పై వెళ్తున్న గోపిని, నన్ను లాగేశారు. తీవ్రంగా తిడుతూ నా ఫోన్‌ను తీసేసుకున్నారు. చంపేస్తారనే భయంతో పారిపోయా. గ్రామస్థులకు సమాచారం ఇవ్వడానికి వెళ్లా. మారణాయుధాలతో గోపిని చంపేశారు. – గోపి చిన్నాన్న కోటేశ్వరరావు -
లవర్‌తో దిగిన ఫోటోలు భర్త ఫోన్లో ఉండిపోవడంతో.. భార్య ఏం చేసిందంటే..!
న్యూఢిల్లీ: రోజుకు ఎన్నో చిత్ర విచిత్రాలను చూస్తున్నాం. తాజా ఘటన కూడా చాలా చిత్రమైందే. ఓ భార్య తన లవర్‌తో దిగిన ఫోటోలు, వీడియోలు భర్త ఫోన్లో ఉన్నాయనే కారణంతో వాటి కోసం ఇద్దరు మనుషల్ని పురమాయించింది. భర్తన పట్టుకునైనా ఆ ఫోన్ తీసుకుని లవర్‌తో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేయాలనే ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే తనకు తెలిసిన ఇద్దర్ని మాట్లాడుకుంది. భర్త రూట్ మ్యాప్ అంతా ఇచ్చింది. భర్త ఆఫీస్‌కు ఏ రూట్లో వెళతాడు.. ఎన్ని గంటలకు ఎక్కడకు చేరుకుంటాడు అనే వివరాల ఇచ్చింది. ఇందులో భర్త వర్క్ టైమింగ్స్ అన్ని షేర్ చేసింది. భర్త ఫోన్లో లవర్‌తో దిగిన ఫోటోలు కొంపముంచుతాయేమోనని భయపడి ఈ కుట్రకు తెరలేపింది భార్య. లవర్‌తో ఉన్నప్పుడు భర్త వాడే ప్రత్యామ్నాయ ఫోన్‌తో ఫోటోల దిగింది కానీ, ఆ ఫోన్ తిరిగి భర్త తీసుకోవడంతో భార్యకు కంగారు పట్టకుంది. ఎలాగైనా ఆ ఫోటోలు భర్త కంటపడకుండా చేయాలని భావించింది. ఇందుకు గాను ఇద్దరు వ్యక్తులను పురమాయించగా, ఒకరు పోలీసులకు దొరికిపోయాడు. అంకిత్ గోహ్లత్ అనే 27 ఏళ్ల వ్యక్తి,, అద్దెకు ఒక స్కూటర్ తీసుకుని ప్రణాళిక అమలు చేశాడు.. ఫోన్ అయితే దొంగిలించారు కానీ, ఆ ఫోన్ దొంగిలించబడిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిలో భాగంగా నిఘా ఉంచారు పోలీసులు. లవర్‌తో దిగిన ఫోటోలను డిలీట్ చేశారు కానీ విషయమైతే పోలీసులకు వెల్లడించాడు పట్టుబడిన వ్యక్తి.దాంతో అతన్ని ట్రేస్ అవుట్ చేసి పోలీసులు పట్టుకోగా అసలు విసయం బయటపడింది. ఆతని భార్యే ఫోన్ దొంగిలించాడానికి తనను పురామాయించిందని అసలు విషయం చెప్పేశాడు సదరు ‘దొంగ’. ఈ విషయం తమ దర్యాప్తులో తేలినట్లు ఢిల్లీ(సౌత్) డీసీపీ అంకిత్ చౌహాన్ వెల్లడించారు. సినిమా తలపించే ట్విస్టులున్న ఈ ఘటన జూన్ 19వ తేదీన జరగ్గా, చివరకు ఆ ఫోన్ ఎక్కడుందో పోలీసులకు తమ ఛేదనలో దొరకడంతో భార్య బండారం బయటపడింది. -
ఎంత గొప్ప జీవితం.. క్షణంలో తలకిందులు!
నెలకు రెంట్ల రూపంలో రూ. 15 నుంచి 17 లక్షల వరకూ ఆదాయం. ఒక లగ్జరీ ఫామ్ హౌస్. ఇంకా పలు రకాలైన ఆస్తులు. విలాసవంతమైన జీవితం. ఆ ఊరిలో శ్రీమంతుడు అనే హోదా. పెద్ద మనిషి అని ఊరి వాళ్లు తగిలించిన బిరుదు. చేతికి ఒక లైసెన్స్డ్ రివాల్వర్. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మనిషి అంటే కాసింతైనా ఇలా బ్రతకాలనిపిస్తుంది కదూ. ఇక్కడ ఆ వ్యక్తికి అన్నీ ఉన్నాయి.. సిరి సంపదలతో విలాసవంతమైన జీవితాన్ని కూడా బాగానే ఎంజాయ్ చేశాడు. దాంతో పాటు కాస్త అహంకారం, మూర్ఖత్వం కూడా ఉన్నట్లు ఉంది. అదే ఇప్పుడు అతని జీవితాన్ని తలకిందులు చేసింది. అహంకారానికి పోయి కూతురి ప్రాణాల్ని తీసి జైలు పాలయ్యాడు. కారణాలు ఏమైనా మూర్ఖత్వానికి పోయి ఎంతో గారాబంగా చూసుకున్న కూతుర్ని చంపడం ఒకటైతే, ప్యాలెస్ లాంటి భవనంలో బ్రతికిన ఆ వ్యక్తి ఇప్పుడు కఠిన శిక్షకు సిద్ధంగా ఉన్నాడు. 49 ఏళ్ల దీపక్ యాదవ్ అనే వ్యక్తి ఇప్పుడు కన్న కూతురి హత్య కేసులో ఒక్కసారిగా ‘విలన్’ అయిపోయాడు. ఇన్ స్టా రీల్స్ చేసిందని కూతుర్ని చంపేశాడు..!హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ సుశాంక్లో ఫేజ్-2లో నివాసముంటున్న దీపక్ యాదవ్.. టెన్నిస్ ప్లేయర్ అయిన కూతురు రాధికా యాదవ్‌ను హత్య చేశాడు. తన లైసెన్స్డ్ రివాల్సర్తో ఐదు రౌండ్ల కాల్పులు జరిపి కూతురి ప్రాణాలు తీశాడు. కూతురు భవిష్యత్ మరింత ఎదుగుతున్న తరుణంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. కూతురు తనకు నచ్చని సోషల్ మీడియా వీడియో ఒకటి చేసిందని, అందుకే చంపేశానని దీపక్ యాదవ్ అంటున్నాడు. తనకు వద్దని చెప్పినా వినలేదని, ఈ క్రమంలోనే తమ మధ్య గొడవ జరిగి హత్య చేసే వరకూ వెళ్లిందని దీపక్ పోలీసులకు చెప్పుకొచ్చాడు. దీనిపై ప్రస్తుతం పోలీస్ దర్యాప్తు జరుగుతుండగా, అసలు ఏం జరిగిందనే దానిపై మీడియా ఆరా తీసింది. ఈ క్రమంలోనే జాతీయ మీడియా చానెల్ ఎన్డీటీవీ రిపోర్ట్ ఆధారంగా అసలు హత్యకు ఈ కారణాలు కాకపోవచ్చనేది ఆ కుటుంబంతో పరిచయమున్న వ్యక్తి ఒకరు వెల్లడించారు.కూతురంటే అత్యంత గారం..ఈ ఘటనపై దీపక్ సొంత గ్రామం వాజిరాబాద్లో అతనితో పరిచయమున్న ఓ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం.. అసలు కూతుర్ని చంపాల్సిన అవసరం దీపక్ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అతనికి ఆస్తు-పాస్తులు అన్నీ ఉన్నాయి. విలాసవంతమైన జీవితం అతనిది. కూతురంటే అత్యంత గారం. కూతురు టెన్నిస్ ప్లేయర్ అవ్వడం కోసం రూ. 2 లక్షల పెట్టి రాకెట్ తీసుకొచ్చాడు. కూతురు ఈ హోదాకు రావడానికి దీపకే కారణం. కూతురు రాధికా యాదవ్ టెన్నిస్ అకాడమీ పెట్టినందుకో, ఇన్ స్టా రీల్స్ చేసినందుకో ఆమెను దీపక్ హత్య చేశాడనేది నమ్మశక్యంగా లేదు. ఇంకేదో కారణం ఉండి ఉండొచ్చు’ అని సదురు గ్రామస్తుడు తెలిపాడు.25 ఏళ్లకే టెన్నిస్ అకాడమీ..టెన్నిస్‌లో అంచెలంచెలుగా ఎదిగిన రాధికా యాదవ్.. ప్రస్తుతం అంతర్జాతీయ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 113వ స్థానంలో ఉంది. ఎన్నో పోటీలు ట్రోఫీలు గెలిచి తనకంటూ ఏర్పరుచుకున్న రాధిక.. 25 ఏళ్ల వయసులోనే టెన్నిస్ అకాడమీ కూడా ప్రారంభించింది. ఇందులో ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తుంది రాధికా. గురుగ్రామ్ సెక్టార్ 57లో ఒక టెన్నిస్ ఇన్స్టిట్యూట్ను రాధికా యాదవ్ రన్ చేస్తూ ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. టెన్నిస్ ప్లేయర్‌ను.. హత్య చేసిన తండ్రి! -
ఎన్టీఆర్ జిల్లా: పోస్టాఫీసులో రూ.50 లక్షల గోల్మాల్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కంచే చేను మేసిందన్న చందంగా తయారైంది. జి.కొండూరు మండల పరిధి సున్నంపాడు పోస్టాఫీసు పరిస్థితి. గ్రామానికి చెందిన పలువురు ఖాతాదారులు పొదుపు చేసుకున్న సొమ్ము, డిపాజిట్లను పోస్టుమాస్టరే కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మహిళ పోస్టల్ శాఖలో పని చేస్తున్న క్రమంలో తన అకౌంట్ స్టేటస్‌ని చెక్ చేసుకోగా ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్ము లేకపోవడంతో అనుమానం వచ్చి పోస్టల్‌శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.ఉన్నతాధికారులు గురువారం సున్నంపాడు వచ్చి విచారణ చేపట్టగా.. ఇప్పటి వరకు రూ.22లక్షల వరకు ఖాతాదారుల అకౌంట్ల నుంచి మాయమైనట్లు తేలినట్లు తెలిసింది. మొత్తం రూ.50 లక్షలకు పైగానే సొమ్మును పోస్టుమాస్టర్ విత్‌డ్రా చేసినట్లు తెలుస్తోంది. పోస్టాఫీసులో ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. విచారణ కొనసాగుతుండడంతో ఇవాళ లేదా రేపు (శుక్ర,శని) అధికారులు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. నగదు గోల్‌మాల్‌పై డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. -
Ongole: పాపం పసివాడు
చిన్నారి లక్షిత్ మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అడవిలో తప్పిపోయి రెండు రోజులపాటు తిండి, నీళ్లు లేక చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే తమ బిడ్డది సహజ మరణం కాదని.. ఎవరో ఉద్దేశపూర్వకంగానే చంపారంటూ కంభం పోలీస్ స్టేషన్ వద్ద లక్షిత్ కుటుంబ సభ్యులు శుక్రవారం ధర్నాకు దిగారు. బాధిత కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారం.. సాక్షి, ప్రకాశం జిల్లా: కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో పొదిలి లక్షిత్ అనే మూడున్నరేళ్ల వయసున్న బాలుడు మంగళవారం ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. లక్షిత్‌ను తాను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. చెయ్యి కొరికి పరిగెత్తాడని ఓ పిల్లాడు చెప్పాడు. అయితే చుట్టుపక్కల ఎంత వెతికినా చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చేపట్టారు. ఓ జాగిలానికి బాలుడి చెప్పు లభించడంతో డ్రోన్ల సాయంతో ఊరంతా గాలించారు. వంద మందికి పైగా గ్రామస్తులు గుంపులుగా విడిపోయి గాలించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో.. గురువారం ఉదయం సూరేపల్లి వెనుక ఉన్న ఓ పొలంలో కంది కొయ్యలు ఏరేందుకు వెళ్లిన మహిళలకు ఓ చిన్నారి శవం కనిపించింది. గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించగా.. అది లక్షిత్దేనని నిర్ధారణ అయ్యింది. దీంతో మిస్సింగ్ కేసును కాస్త.. అనుమానాస్పద మృతిగా మార్చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే..కేసు గ్రావిటీ తగ్గించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని, దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అడవిలో తప్పిపోయి.. తిండి, నీరు లేక మరణించారంటూ పోలీసులు చెబుతున్న స్టేట్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. లక్షిత్ సహజ మరణం చెందాడంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన రాతలు కేసును పక్కదారి పట్టించేలా ఉన్నాయంటూ పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం ఆరా తీశారు.అయ్యో లక్షిత్లక్షిత్ కోసం ఓవైపు పోలీసులు, మరోవైపు వందల మంది గ్రామస్తులు లింగోజిపల్లి, సూరేపల్లి గ్రామాల చుట్టూ వెతికారు. అయితే.. బాలుడి మృతదేహం దొరికిన పంటపొలం, ఆ చుట్టుపక్కల కూడా గాలించారు. అదే చోట.. గురువారం ఉదయం బాలుడు విగతజీవిగా బోర్లాపడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని తిప్పి చూడగా మర్మాంగాల వద్ద కొద్దిగా రక్తం కనిపించినట్లు తెలిసింది. మృతదేహాన్ని బట్టి గురువారం తెల్లవారుజామున బాలుడు చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంగోలు నుంచి వచ్చిన వైద్య బృందం సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం కుటుంబ సభ్యులకు బాలుడి మృతదేహాన్ని పోలీసులు అప్పగించగా, స్వగ్రామమైన గొట్లగట్టు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. అయితే.. ఎవరి పని?బాలుడు అదృశ్యమైన నేపథ్యంలో చిత్తుకాగితాలు ఏరుకునే వారు ఎత్తుకెళ్లి ఉంటారని తొలుత పోలీసులు, గ్రామస్తులు భావించారు. ఆ కోణంలోనే ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. తీరా.. బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెంది పడి ఉండటంతో కొత్తకొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. లక్షిత్‌ను ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకోసం ఎత్తుకెళ్లారు?.. ఎత్తుకెళ్లిన వారు రెండు రోజులు ఎందుకు దాచిపెట్టారో అర్థం కావడం లేదు. ఇది బంధువుల పనా.. లేకుంటే బయటివారి పనా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్ చేసి.. దొరికిపోతామనే భయంతో చంపేసి పారిపోయారా..? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రకటనలనూ కుటుంబ సభ్యులు తోసిపుచ్చుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంగన్వాడీ టీచర్లపైనే లక్షిత్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.విషాదంలో రెండు ఊర్లుకంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవులుకు ఇద్దరు కుమార్తెలు కాగా, మృతిచెందిన బాలుడి తల్లి చిన్న కుమార్తె సురేఖ. చెన్నకేశవులు పెద్ద కుమార్తెను 7 సంవత్సరాల క్రితం కొనకొనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన పొదిలి రంజిత్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. రెండో కూతురు సురేఖ (మృతిచెందిన బాలుడి తల్లి)ను పెద్ద అల్లుడు బంధువు (వరుసకు సోదరుడు) అయిన పొదిలి శ్రీనుకు ఇచ్చి 5 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. లక్షిత్ శ్రీను-సురేఖల పెద్ద కొడుకు. సురేఖ 45 రోజుల క్రితం రెండో కాన్పునకు పుట్టినిల్లు లింగోజిపల్లి గ్రామానికి వచ్చింది. నెల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఈ నేపథ్యంలో లక్షిత్ చనిపోవడంతో ఆ తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. లక్షిత్ స్వగ్రామమైన కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మొన్నటి వరకు గ్రామంలో అల్లారుముద్దుగా తిరుగతూ కనిపించిన లక్షిత్‌ను విగతజీవిగా చూడలేక స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇటు లింగోజిపల్లి నుంచి అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
విజయవాడలో దారుణం.. ఇంటి ఓనర్‌ను పని మనిషే..
సాక్షి, విజయవాడ: నగరంలో దారుణం జరిగింది. ఆర్అండ్బి రిటైర్డ్ ఇంజనీర్ రామారావు అనుమానాస్పదంగా మృతి చెందారు. రామారావు ఇంట్లో కేర్ టేకర్‌గా పని చేస్తున్న మహిళే ఆయనను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. కేర్ టేకర్ అనూషాతో పాటు మరో యువకుడు కలిసి ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ల్లో అనుషతో పాటు మరో యువకుడు కదలికలను పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత అనూష నులకపేటలోని నివాసానికి వెళ్లినట్లు గుర్తించారు. అనూషతో పాటు మరో యువకుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.నగరంలోని మాచవరం పీఎస్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి వెంకట రామారావు(70) తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నారు. రామారావు.. వృద్ధురాలైన తన తల్లిని చూసుకునేందుకు మూడు రోజుల క్రితం అనూష అనే యువతిని కేర్ టేకర్‌గా పెట్టుకున్నారు. ఆమె వారితో పాటే.. అదే ఇంట్లో నివాసం ఉంటోంది.శుక్రవారం అర్ధరాత్రి సమయంలో రామారావు గదిలో లైట్లు వెలగడంతో తల్లి సరస్వతి.. వెంటనే వచ్చి చూడగా మంచంపై కుమారుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆయన పడి ఉన్న మంచంపై కారం కూడా చల్లి ఉంది. కళ్లల్లో కారం కొట్టిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వైపు, బీరువా కూడా పగులగొట్టి ఉంది. ఇంటి పని మనిషి కూడా కనిపించకపోవడంతో అనుమానించిన తల్లి.. పక్క ఫ్లాట్ వాళ్లను పిలిచింది.వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రామారావు నిద్రలో ఉండగా దిండుతో ఊపిరాడకుండా చేసి, కారం చల్లినట్లు పోలీసులు గుర్తించారు. మొదట ఆహారంలో మత్తు మందు కలిపి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కేర్ టేకర్ అనూష హత్య చేసినట్లు నిర్థారించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
భార్య దారుణ హత్య
కై కలూరు: ఆస్తిని పెద్ద కొడుక్కి రాసివ్వమని అడిగిన భార్యను అంతమొందించాడో భర్త. ఈ ఘటన ఏలూరు జిల్లా కలిదిండి మండలం ఎస్ఆర్పీ అగ్రహారంలో చోటుచేసుకుంది. వివరాలివి.. గ్రామానికి చెందిన కట్టా పెద్దిరాజు (50), జయలక్ష్మి (47) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు మగ సంతానం. పెద్ద కుమారుడికి ఇటీవల పెళ్లయింది. ఇద్దరు కుమారులు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పెద్దిరాజుకు గ్రామంలో 40 సెంట్ల భూమి ఉంది. దీనిని అమ్మకానికి సిద్ధం చేస్తున్నాడు. పెద్ద కుమారుడికి వివాహం జరగడంతో దంపతులు ఇల్లు కట్టుకుంటారని, స్థలం అతడికి రాయాలని జయలక్ష్మి భర్తను కోరింది. ఈ విషయంలో తరచూ భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. తన కంటే బిడ్డలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని పెద్దిరాజు భార్యపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నిద్రపోతున్న జయలక్ష్మిపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు. దీంతో ఆమె ఘటనాస్థలిలోనే ప్రాణం విడిచింది. అనంతరం పెద్దిరాజు భయపడి పురుగు మందు తాగి, చాకుతో పీక కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. ప్రాణాలతో ఉన్న పెద్దిరాజును ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘కూతురు సంపాదన మీద బతుకుతున్నావా?ఎందుకా బతుకు?’
ఢిల్లీ: కూతురు సంపాదన మీద బతుకుతున్నావా? ఏందుకా? బతుకు? అనే ఇతరుల సూటిపోటి మాటలు తండ్రిలోని రాక్షసత్వాన్ని నిద్ర లేపాయి. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న కూతురు ప్రాణాలు తీసేలా చేశాయి. గురుగ్రామ్‌లో తండ్రి చేతిలో దారుణ హత్యకు గురైన రాష్ట్ర స్థాయి టెన్నీస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్యకేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.గురువారం రాత్రి గురుగ్రామ్‌లో నివాసం ఉంటున్న టెన్నిస్ క్రీడాకారిణిని రాధికా యాదవ్ (25)ను ఆమె త్రండి దీపక్ యాదవ్ (49) తుపాకీతో కాల్చి చంపాడు. అయితే, ఈ దారుణం జరగడానికి కారణం రాధికా యాదవ్ ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చేస్తుంటుంది. ఇదే విషయంలో దీపక్ యాదవ్.. రాధికాను మందలించారు. పట్టించుకోకుండా ఇన్ స్టా రీల్స్ చేస్తూ కూతురు తన పరువు తీస్తోందని భావించే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని తేలింది. ఈ హత్యోదంతంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో రాధికా యాదవ్ మరణానికి అసలు కారణంగా ఆమె ఇన్ స్టా రీల్స్ చేయడం కాదని నిర్ధారించారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తేలింది. రాధికా యాదవ్‌కు టెన్నిస్ అంటే ప్రాణం. ఓ సానియా మిర్జా, సెరెనా విలియమ్స్‌లా రాణించాలని అనుకుంది. అందుకు తగ్గట్లుగానే చిన్ననాటి నుంచి టెన్నీస్‌లో తర్ఫీదు పొందింది. రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు టెన్నీస్ మ్యాచ్‌లలో అసాధారణమైన ఆటతీరుతో తనకూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉందని నిరూపించింది. కానీ, అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎందుకవుతుంది?.కొద్ది కాలం క్రితం జరిగిన రాష్ట్రస్థాయి టెన్నీస్ పోటీల్లో పాల్గొన్న రాధికా యాదవ్‌కు తీవ్ర గాయమైంది. దీంతో ఆటకు దూరం కావాల్సి వచ్చింది. కొంతకాలం టెన్నీస్‌కు దూరం కావడంతో మానసికంగా కృంగి పోయింది. అప్పుడే నేను ఆటకు దూరమైతేనేం. నాలాగా టెన్నీస్‌లో రాణించాలనుకునే వారిని ప్రోత్సహిస్తే సరిపోతుంది కదా అని అనుకుంది. అనుకున్నదే తడవుగా కుటుంబసభ్యులు,గురువుల సహకారంతో టెన్నీస్ అకాడమనీ ప్రారంభించింది. అనతికాలంలో తన కోచింగ్‌తో రాధికా యాదవ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. తండ్రి దీపక్ యాదవ్ కూడా తనకు చేదోడు వాదోడుగా నిలిచారు. అదిగో అప్పుడే.. మనం కష్టాల్లో ఉంటే సంతోష పడేవాళ్లు.. సంతోషంగా ఉంటే ఈర్ష, అసూయతో కుళ్లుకునే వాళ్లు ఉంటారనే నానుడిని నిజం చేశారు దీపక్ యాదవ్ ఇరుగు పొరుగు వారు.దీపక్ యాదవ్ కుటుంబానికి పేరు, ప్రతిష్టలు రావడం ఇష్టం లేని ఇతరులు సూటిపోటి మాటలు అనడం ప్రారంభించారు. ఆ మాటలు తట్టుకోలేక కూతురి ప్రాణం తీసినట్లు తండ్రి దీపక్ పోలీసుల విచారణలో నేరం అంగీకరించారు. ‘నేను ఇంట్లో నిత్యవసర వస్తువుల కోసం, లేదంటే ఇతర పనుల నిమిత్తం బయటకు వెళుతుంటాను. అలా నేను బయటకు వెళ్లిన ప్రతీసారి ఇతరులు నన్ను సూటిపోటి మాటలతో హింసించేవారు. కూతురు సంపాదన మీద బ్రతుకుతున్నావా?. ఎందుకా బతుకు? అనే మాటలు నన్ను ఎంతగానో బాధించేవి. వాటిని నేను పట్టించుకునే వాడిని కాదు. కొందరు నా కూతురి వ్యక్తిత్వంపై అనుచితంగా మాట్లాడారు. ఈ వరుస సంఘటనలు నన్ను మానసికంగా కుంగదీసాయి. నా కూతుర్ని టెన్నిస్ అకాడమీని మూసేయమని చెప్పాను. కానీ ఆమె తిరస్కరించింది. నాలో సహనం నశించింది. ఆమె వంటచేస్తున్నపుడు వెనుక నుండి నా లైసెన్స్డ్ రివాల్వర్‌తో మూడు రౌండు కాల్పులు జరిపాను. నా కూతురిని నేనే హత్య చేశాను’ అని దీపక్ యాదవ్ పోలీసుల ఎదుట కన్నీరుమున్నీగా విలపించారు. పోలీసుల ప్రకారం.. మృతురాలు రాధికా యాదవ్ మామ కుల్దీప్ యాదవ్ దారుణం ఎలా జరిగిందో పోలీసులకు కళ్లకు కట్టిన వివరించారు. గురువారం ఉదయం 10:30కు గట్టి శబ్దం వినిపించడంతో, ఆయన దీపక్ నివసించే మొదటి అంతస్థుకు పరుగెత్తారు. నాకు గన్ను పేలిన శబ్ధం వినిపించింది. మొదటి ఫ్లోర్‌కి వెళ్లగా నా మేనకోడలు రాధికా వంటగదిలో రక్తపు మడుగులో పడి ఉంది. డ్రాయింగ్ రూమ్‌లో రివాల్వర్ కనిపించింది. ఆ తర్వాత నా కుమారుడు పీయూష్ యాదవ్‌తో కలిసి మేము ఆమెను కారులో తీసుకుని ఆస్పత్రికి తరలించాం. వైద్యుడు ఆమెను పరీక్షించిన తర్వాత ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఆమె గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి… చాలా ట్రోఫీలు గెలుచుకుంది. ఆమె హత్యకు కారణం నాకు అర్థం కావడం లేదు.ఆమె మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఎందుకు హత్య జరిగింది అనే విషయం నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను మొదటి అంతస్థు (ఫ్లోర్)కి వెళ్లినప్పుడు దీపక్, మంజు యాదవ్, రాధికా మాత్రమే అక్కడ ఉన్నారు ’అని కుల్దీప్ యాదవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
కాకినాడ జీజీహెచ్‌లో కీచకులు
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో కీచకఘట్టం వెలుగుచూసింది. చదువు కోసం వచ్చిన పారా మెడికల్ విద్యార్థినులు పలువురిపై అదే విభాగంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి మరో ముగ్గురు సిబ్బంది సహకరించారు. నెల రోజులుగా సుమారు 50 మంది విద్యార్థినులపై ఈ దాష్టీకానికి పాల్పడ్డారు. బయటపెడితే చంపేస్తామని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించడంతో తమపై జరుగుతున్న అకృత్యాన్ని భరిస్తూ వచ్చిన విద్యార్థినులు బుధవారం రంగరాయ కళాశాల యాజమాన్యానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. విషయం రాష్ట్ర డీఎంఈకి చేరింది. వివరాల్లోకి వెళితే, కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్‌స్సీ–ఎంఎల్టీ విద్యనభ్యసిస్తున్న వారితో పాటు వివిధ ఒకేషనల్ కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థినులు కాకినాడ జీజీహెచ్‌లోని ల్యాబ్‌లలో శిక్షణకు వస్తారు. నెల రోజులుగా వీరు ఆసుపత్రిలో ఏడవ నంబర్, అంబానీ ల్యాబ్‌లలో శిక్షణ పొందుతున్నారు. నెల రోజులుగా 70 మంది విద్యార్థినులు ఈ శిక్షణలకు హాజరు కాగా, అదే ల్యాబ్‌లో బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్‌గా పని చేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఆర్ఎంసీ రెగ్యులర్ ఉద్యోగి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు సహకరించారు. ఈ విషయాన్ని విద్యార్థినులు ఆర్ఎంసీ ప్రిన్సిపాల్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఫిర్యాదు పంపారు. ఒక హెచ్‌వోడీ, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లతో కూడిన కమిటీ ఈ నెల 9, 10వ తేదీలలో 48 మంది విద్యార్థులను విచారించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ చక్రవర్తితో పాటు అతడికి సహకరించిన మైక్రోబయాలజీ ల్యాబ్ టెక్నీషియన్ జిమ్మీ రాజు, బయోకెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ గోపాలకృష్ణ, పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ ప్రసాద్‌లను విచారించింది. విద్యార్థినులు ఆరోగ్య పరీక్షల్లో నిమగ్నమై ఉండగా వారికి తెలియకుండా వారి శరీర భాగాలు ఫొటోలు తీసి వారికే వాట్సాప్ చేసే వాడనీ, వాటిని మరెవరికీ షేర్ చేసి తమ బాధ బయటికి చెప్పుకునే అవకాశం లేకుండా వన్ టైం వ్యూ ద్వారా పంపేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను చెప్పినట్లు వినకపోతే, పరీక్షల్లో ఫెయిల్ చేయిస్తానని బెదిరించాడని కళ్యాణ్ చక్రవర్తిపై విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ తంతు అంతటికీ జిమ్మీ రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యుల్ని తక్షణమే సస్పెండ్ చేయాలని డీఎంఈ ఆదేశించినట్లు తెలిసింది. -
అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి
భీమడోలు: ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి అంబేడ్కర్ గురుకుల కళాశాలలో గురువారం సాయంత్రం ఇంటర్ విద్యార్థిని లేళ్ల మానస (16) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భీమడోలు పంచాయతీ శివారు అర్జావారిగూడేనికి చెందిన ఈ బాలిక కళాశాల బాత్రూమ్లో చున్నీతో ఉరి వేసుకున్న స్థితిలో ఉండగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ‘మా కుమార్తె మానస కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతోంది. పొలసానిపల్లి గురుకుల కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశానికి ఆహ్వానం వస్తే వచ్చాం. మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాతోనే ఉంది. బాగా మాట్లాడింది. కళాశాలకు వచ్చి వారం రోజులే అయ్యింది.. ఊరికి రమ్మంటే దసరా సెలవులకు వస్తానని చెప్పింది. ఇంతలోనే మరణ వార్తను వినాల్సి వచ్చింది. మా కుమార్తె ఉరి వేసుకునేంత పిరికిది కాదు’ అని తల్లిదండ్రులు లేళ్ల మరియమ్మ, రాజు తెలిపారు. తహసీల్దార్ బి.రమాదేవి, సీఐ యుజే విల్సన్, ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరీష్, డీఎస్పీ శ్రావణ్‌కుమార్ అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడుతున్నారు. బాలిక మృతికి కారణమైన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, న్యాయ విచారణ చేపట్టాలని, కుటుంబానికి నష్టపరిహారం అందించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. -
ఇన్ స్టాల్ రీల్స్ చేసిన టెన్నిస్ ప్లేయర్.. హత్య చేసిన తండ్రి!
గురుగ్రామ్: హర్యానా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఇన్ స్టా రీల్స్ చేసిందని కన్న కూతురి జీవితాన్ని చిదిమేశాడు తండ్రి. టెన్నిస్‌లో ఎంతో భవిష్యత్ ఉన్న 25 ఏళ్ల రాధికా యాదవ్‌ను తండ్రి హత్య చేశాడు. గురుగ్రామ్ సుశాంక్ లోక్ ఫేజ్-2లో నివాసముంటున్న రాధికా యాదవ్‌ను.. తండ్రి గన్‌తో కాల్చి చంపాడు. ఇన్ స్టా రీల్‌కు సంబంధించి తండ్రీ కూతుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇన్ స్టా రీల్ ఎందుకు చేశావని ఆగ్రహించిన తండ్రి.. కూతుర్ని నిలదీశాడు. ఈ విషయంపై కూతురు ఎదురు తిరిగింది. దాంతో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని తండ్రి తన వద్ద ఉన్న గన్‌తో కాల్చి హత్య చేశాడు.తన లైసెన్స్డ్ రివాల్వర్‌తో కూతుర్ని తన ఇంటి వద్దే కాల్చి చంపాడు. కూతుర్ని చంపడమే లక్ష్యంగా మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దాంతో తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కూతుర్ని హత్య చేసిన విషయాన్ని తండ్రి అంగీకరించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్డ్ రివాల్వర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. టెన్నిస్ ఖేలో డాట్ కామ్ ప్రకారం అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఆమె 113వ స్థానంలో ఉంది. 2020, మార్చి 23వ తేదీన జన్మించిన రాధికా యాదవ్.. టెన్నిస్‌లో తన ఢవిష్యత్‌ను ఎతుక్కుంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో పోటీల్లో విజేతగా నిలిచింది. తన భవిష్యత్‌ను మరింత మెరుగులు దిద్దుకునే క్రమంలో తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోవడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. -
ప్రియురాలిని రూమ్‌లో లాక్ చేసి.. ఆపై ప్రియుడు..
ఏ బంధమైనా నమ్మకం మీదే నడుస్తుంది. అది వైవాహిక బంధమైనా, లివింగ్ రిలేషన్ షిప్ బంధమైనా ఉండాల్సింది నమ్మకం. అటువంటి నమ్మకం చెల్లా చెదురై పోతే జీవితాల్లో అలజడి తప్పదు. ఓ జంట విషయంలో అదే జరిగింది. కలిసి జీవించాలనుకున్నారు. కానీ వారి బంధాన్ని ఏడాదికే ముగించేశారు. ఈ జంటలో ఒకరు మృత్యుఒడికి చేరితే, మరొకరు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. అస్సాంలోని గువాహటిలో జరిగిన ఈ ఘటన లివింగ్ రిలేషన్ అనేది ఫ్రెండ్ షిప్ చేసినంత ఈజీ కాదనే విషయాన్ని తేటతెల్లం చేసింది. అసలు విషయంలోకి వెళితే.. గువాహటిలోని కహిలిపారాలోని కళ్యాణి నగర్లో ఓ లివింగ్ రిలేషస్ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఇందులో ప్రియుడు చనిపోతే, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. నవ్‌జ్యోతి తలుక్దార్- సుస్మితలు ఏడాది కాలంగా లివ్-ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నారు. దీనిలో భాగంగా ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఏమైంది ఏమో కానీ ఇందులో తలుక్దార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే క్రమంలో సుస్మితను వేరే రూమ్‌లో బంధించి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే తన బాయ్ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకుంటున్నాడనే సమాచారాని పోలీసులకు చేరవేసింది సుస్మిత. పోలీసులు వచ్చే సరికి తలుక్దార్ విగతజీవిలా కనిపించగా, మరో రూమ్‌లో ఉన్న సుస్మిత.. చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో ఆమెను హుటాహుటీనా స్థానిక హయత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీరి మధ్య తరుచు జరుగుతున్న ఘర్షణలే దీనికి కారణమని గువాహటికి చెందిన సీనియర్ పోలీస్ అధికారి తెలిపారువీరిద్దరూ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న కొత్తలో బాగానే ఉన్నారని, ఆపై కొంతకాలానికి వీరి మధ్య ఎప్పుడూఆపార్థాలు చోటు చేసుకుని గొడవలు జరిగేవని స్థానికులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. -
‘మల్నాడు’ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు
హైదరాబాద్: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. 9 పబ్‌లపై కేసులు నమోదు చేసింది ఈగల్ టీమ్.. పబ్ యాజమానులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వచ్చేవారం తమ ఎదుట హాజరుకావాలని పబ్ యాజమానులకు స్పష్టం చేసింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమానులకు సంబంధాలను గుర్తించింది. మూడు పబ్ యజమానులు కలిసి డ్రగ్ పార్టీ నిర్వహించినట్లు ఈగల్ టీం గుర్తించింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాయి యాజమాన్యాలు. ఈ కేసులో కూడా ఫ్రిజం పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్ పార్టీలు నిర్వహించాయి, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానుల పైన కేసు నమోదు చేశారు. పోలీసులు. క్వాక్ పబ్ ఓనర్ రాజా శేఖర, కోరా పబ్ ఓనర్ పృద్వి వీరమాచినేని, బ్రాడ్ వే పబ్ ఓనర్ రోహిత్ మాదిశెట్టిలపై కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురు పబ్బు యజమానులతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు మల్నాడు రెస్టారెంట్ సూర్య విచారణలో పేర్కొన్నారు.కాగా, తెలంగాణ నార్కోటిక్ డ్రగ్స్ టీంకు కొత్త పేరు పెట్టిన తర్వాత అతిపెద్ద డ్రగ్ రాకెట్‌ను గుట్టు రట్టు చేసింది ఈగల్ టీం. అతిపెద్ద నెట్వర్క్ ను బట్టబయలు చేశారు.. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య ఈ డ్రగ్ రాకెట్ ని నడుపుతున్నట్లు తేలింది. డ్రగ్స్ రహిత తెలంగాణనే లక్ష్యంగా పని చేస్తున్నామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్, గంజాయి జోలికి వెళ్లొద్దని..డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దామన్నారు. దీనిలో ‘ఈగల్’ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ‘యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (ఏఎన్‌బీ)ను ‘ఈగల్’ గా మార్చారు. ఈగల్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్. తెలంగాణలోని కోటి 50 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో ఎక్కడ గంజాయి పండించినా..ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సప్లయ్ చేసినా దాన్ని ఛేదించే పనిని ఈగల్‌కు అప్పగించారు. -
అమ్మాయిల ఫొటోలు, వీడియోలతో పోకిరి హల్చల్.. తర్వాత ఏమైందంటే?
బెంగళూరు: అమ్మాయిలను సీక్రెట్‌గా ఫొటోలు, వీడియోలు తీస్తూ వేధింపులకు గురి చేస్తున్న ఓ పోకిరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి.. రోడ్డుపై వెళ్తున్న అమ్మాయిలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో వీడియోలను అప్లోడ్ చేస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.వివరాల ప్రకారం.. గురుదీప్ సింగ్ (26) అనే వ్యక్తి బెంగళూరులోని చర్చి స్ట్రీట్, కోరమంగళ సహా పలు ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. ఈ సమయంలో రోడ్లపై వెళ్తున్న అమ్మాయిలను వారికి తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. అనంతరం, వాటిని ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్నాడు. అయితే, ఓ యువతికి చెందిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా షాకైంది. ఈ వీడియోలకు అసభ్యకరంగా కామెంట్స్ రావడంతో ఆవేదన చెందింది. అనంతరం, తన వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని సదరు యువతి.. గురుదీప్ సింగ్‌కు మెసేజ్ పెట్టింది. ఈ క్రమంలో నిందితుడు.. దురుసుగా ప్రవర్తించాడు. ఆమె ఫొటోలు, వీడియోలు తొలగించకపోగా.. అసభ్య పదజాలంతో ఆమెను దూషించాడు.దీంతో, గురుప్రీత్ సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సహాయం కోసం @blrcitypolice, @cybercrimecid పోలీసులకు ఈ పోస్టులను ట్యాగ్ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. గురుప్రీత్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితురాలు స్పందిస్తూ.. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి వ్యక్తులు ఇంకా బెంగళూరులో తిరుగుతున్నారన చెప్పుకొచ్చింది. వారిపై కూడా చర్చలు తీసుకోవాలని పోలీసులను కోరింది. -
850 కిలోల గంజాయి స్వాధీనం
అనకాపల్లి/సూళ్లూరుపేట: రాష్ట్రంలోని రెండు వేర్వేరు జిల్లాల్లో 850 కిలోల గంజాయిను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. పదిమందిని అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిపోలీస్ స్టేషన్ పరిధి వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిశా నుంచి కర్ణాటకకు బొలేరో వాహనంలో తరలిస్తున్న 840 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నక్కపల్లి పోలీస్‌స్టేషన్ సీఐ కె.కుమారస్వామి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీచేస్తుండగా, ఒక బొలెరో వాహనంలో 20 బ్యాగుల్లో 840 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దాని విలువ రూ.42 లక్షలు ఉంటుందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం మామిడిపాలేనికి చెందిన సుక్రీ అర్జున్, డేగలపాలేనికి చెందిన వంతల సురేశ్, పెద్దపేటకు చెందిన కొదమ నాగరాజు, పాంగి అర్జునరావు కలిసి ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా అటవీప్రాంతాల్లో గంజాయి కొనుగోలుచేసి «డౌనూరు చెక్ పోస్ట్ వద్ద పోలీసులను తప్పించుకుని నర్సీపట్నం తీసుకొచ్చారని తెలిపారు. అక్కడ నుంచి కర్ణాటకకు తరలించేందుకు పెద్దపేటకు చెందిన పాంగి అర్జునరావు, చింతపల్లికి చెందిన వంతల సురేశ్, రోలుగుంటకు చెందిన కైసర్ల దివాకర్, నక్కపల్లికి చెందిన యలమంచిలి రమణ సిద్ధమవుతుండగా పట్టుకున్నట్టు తెలిపారు. సుక్రీ అర్జున, కొదమ నాగరాజులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. సూళ్లూరుపేటలో ఆరుగురు అరెస్ట్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తున్న ఆరుగురిని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 10 కిలోల గంజాయి, నాలుగు సెల్ఫోన్లు, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ షార్కు వెళ్లే మార్గంలోని చెంగాళమ్మ లేఅవుట్‌కు చెందిన కంపా చంద్రకాంత్ (28), విజయవాడ ఆర్ఆర్ పేటకు చెందిన అంకాల భరత్ కౌశల్ అలియాస్ కౌశిక్ (28), తడమండలం వెండ్లూరుపాడుకు చెందిన బూరగ తేజ (23), సూళ్లూరుకు చెందిన మొండెం శైలేష్ (21), తడమండలం అనపగుంటకు చెందిన పరింగి నరేంద్ర (30), సూళ్లూరు నాగరాజపురానికి చెందిన వేనాటి శ్రీ (20)ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. గంజాయి విలువ రూ.2 లక్షలు ఉంటుందన్నారు. -
KPHB: కల్తీ కల్లు ఘటనలో ఐదుకి చేరిన మృతులు
హైదరాబాద్: కూకట్పల్లి పరిధిలో కలకలం రేపిన కల్తీ కల్లు మహమ్మారి ఊహించని విషాదంగా మారింది. కల్తీ కల్లుతాగి అస్వస్థతకు గురైన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకి పెరిగింది. కల్లు కాంపౌండ్‌లో కల్తీ కల్లు తాగి మొత్తంగా 31మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వీరిలో పలువురు నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తొలుత దీని ప్రభావం సాధారణంగానే భావించినా అనూహ్యంగా మృతులు, బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంచైజీ, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(HCA) వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావును తెలంగాణ సీఐడీ బుధవారం అరెస్ట్ చేసింది. జగన్‌తోపాటు హెచ్‌సీఏ ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ సిఫార్సు మేరకు సీఐడీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.గత ఐపీఎల్ సీజన్లో హెచ్‌సీఏ-ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల వివాదం జరిగిన సంగతి తెలిసిందే. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ హోదాలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని జగన్మోహన్రావు బెదిరించారన్నది ప్రధాన అభియోగం. అయితే ఆ అభియోగాలన్నీ వాస్తవమేనని విజిలెన్స్ నిర్ధారించడంతో సీఐడీ ఇప్పుడు అరెస్టులు చేసింది. హెచ్‌సీఏకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తోంది. అయితే మరో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగబోనివ్వమని ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. అయితే హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆలోచన చేస్తామని ఆ సమయంలో హెచ్ఆర్ఎస్ ఆయనకు స్పష్టం చేసింది. అయితే.. తనకు వ్యక్తిగతంగా 10 శాతం వీఐపీ టికెట్లు కచ్చితంగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగనివ్వబోమని ఆయన బెదిరింపులకు దిగారు. అందుకు ఎస్ఆర్హెచ్ అంగీకరించలేదు. దీంతో లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ కార్పొరేట్ బాక్స్‌కు ఆయన తాళాలు కూడా వేయించారు. ఈ పరిణామంతో షాక్ తిన్న ఎస్ఆర్హెచ్ యాజమాన్యం.. హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామంటూ ప్రకటించడం సంచలన చర్చకు దారి తీసింది. ఐపీఎల్ టికెట్ల వివాదం నేపథ్యంతో ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ వ్యవహారంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్‌సీఏ అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన సీఐడీ.. ఇప్పుడు ఆ అక్రమాలు వాస్తవమేనని తేలడంతో ఏకంగా అరెస్టులు చేసింది. -
అత్త పాపిట తిలకం దిద్ది.. !
పాత పరిచయాలు.. వివాహేతర సంబంధాలతో భార్యలను భర్తలు, భర్తలను భార్యలు కడతేర్చడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ తరహా నేరాలపై జనాల్లోనూ ఆసక్తి పెరిగిపోతోంది. తాజాగా.. తన బార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ యువకుడిని చితకబాది వివాహం జరిపించిన ఘటన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ రాక్షస వివాహం జరిపించింది అతని మామే కావడం మరో విశేషం.బీహార్ సుపౌల్ జిల్లాలో దారుణం జరిగింది. తన అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ యువకుడ్ని చితకబాది.. అతనితో ఆమెకు బలవంతంగా వివాహం జరిపించారు. పైగా ఆ వివాహం జరిపించింది అతని మామనే కావడం గమనార్హం. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన యువకుడు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు.. భీంపూర్ పీఎస్ పరిధిలో జీవ్‌ఛాపూర్ వార్డు నంబర్ 8కి చెందిన 24 ఏళ్ల మిథిలేష్ కుమార్‌ను జులై 2వ తేదీన కొందరు వ్యక్తులు బలవంతంగా ఇంట్లో నుంచి లాక్కెళ్లారు. మిథిలేష్‌ను తన ఇంటికి తీసుకెళ్లిన మామ శివ్‌చంద్ర తన ఇంట్లో పంచాయితీ పెట్టాడు. శివచంద్రకు భార్య రీటా దేవి, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. అయితే రీటాదేవితో వివాహేతర సంబంధం ఉందని చెబుతూ మిథిలేష్‌ను చితకబాదాడు. అదే సమయంలో ..అక్కడికొచ్చిన జనాలు రాడ్లు, కర్రలతో మిథిలేష్‌ను కొట్టారు. మరికొందరు గ్రామస్తులు ఇటు రీటాను చితకబాదారు. ఆపై బలవంతంగా మిథిలేష్‌తో రీటా నుదుట సిందూరం దిద్దించి.. వివాహం జరిగినట్లు శివ్‌చంద్ర ప్రకటించాడు. అడ్డొచ్చిన బాధితుడి తండ్రి రామచంద్రను, తల్లిని సైతం ఆ జనాలు కొట్టారు. ఈలోపు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి రాగా.. శివ్‌చంద్ర అండ్ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయింది. తీవ్ర గాయాలతో మిథిలేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.बिहार के सुपौल जिले में रिश्तों को तार-तार करने वाली घटना सामने आई है. जिले के भीमपुर थाना क्षेत्र में एक भतीजे से जबरदस्ती उसकी चाची की मांग भरवाई गई और शादी कराई गई. दरअसल, परिजनों और ग्रामीणों का आरोप है कि दोनों के बीच अवैध संबंध थे, जिसके चलते गांव वालों ने पहले उनके साथ… pic.twitter.com/p5Md89BvkE— ABP News (@ABPNews) July 8, 2025 -
జీవితంపై విరక్తితో నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు..!
హైదరాబాద్: జీవితంపై విరక్తి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడిగినేని చైతన్య (35) సాఫ్ట్వేర్ ఉద్యోగి. గత ఏప్రిల్ 23న నాగ మౌనికతో వివాహమైంది. ఈ దంపతులు కేపీహెచ్‌బీ, 7వ ఫేజ్‌లోని ఎల్ఐజీ–43లో నివాసం ఉంటున్నారు. ఆషాఢ మాసం నేపథ్యంలో జూన్ 21న నాగ మౌనిక పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలోని తల్లిగారింటికి వెళ్లింది. ప్రతిరోజూ ఆమె ఫోన్లో భర్తతో మాట్లాడుతూ ఉండేది. సోమవారం రాత్రి 10 గంటలకు ఫోన్లో అతనితో మాట్లాడింది. అప్పటికే తన భర్త దిగులుగా మాట్లాడటంతో కొద్ది సేపటి తర్వాత ఫోన్ కట్ అయింది. అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో చైతన్యకు ఫోన్ చేయగా ఎత్తలేదు. పలుమార్లు ప్రయత్నించినా స్పందన లేకపోవంతో వెంటనే తన మామకి సమాచారం అందించింది. వెంటనే కింది అంతస్తులోకి వెళ్లి చైతన్యను పిలవగా ఎంతకీ స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. చైతన్య సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. వెంటనే విషయాన్ని మౌనికకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు మౌనిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. తన భర్త జీవితం పట్ల విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కేపీహెచ్‌బీ పోలీసులు చెప్పారు. -
స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు
కడలూర్: పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తున్న స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. మరో విద్యార్థి, వ్యాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని కడలూరు–అలప్పక్కం రైలు మార్గంలో 170వ నంబర్ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద మంగళవారం ఉదయం 7.45 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొనడంతో నలుగురు విద్యార్థులున్న ఆ వ్యాను పల్టీలు కొట్టింది. అనంతరం విల్లుపురం–మైలాదుతురై ప్యాసింజర్ రైలును డ్రైవర్ నిలిపివేశారు. నుజ్జునుజ్జయిన వ్యానులోంచి స్థానికులు విద్యార్థులను బయటకు తీశారు.ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ఆస్పత్రిలో కన్నుమూశారు. వ్యాను డ్రైవర్, 12వ తరగతి విద్యార్థి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్కూలుకు ఆలస్యమవుతుందని, గేట్ తెరిచే ఉంచాలని వ్యాన్ డ్రైవర్ ఒత్తిడి చేయడం వల్లే గేటును తెరిచి ఉంచానని గేట్ కీపర్ అంటుండగా, తాము వచ్చేసరికే గేటు ఓపెన్ చేసి ఉందని వ్యాన్ డ్రైవర్, క్షతగాత్రుడైన విద్యార్థి చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ గేట్ కీపర్‌పై కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేశారు. కాగా, స్కూలు విద్యార్థులను బయటకు తీసేందుకు వచ్చిన ఓ వ్యక్తి తెగిన విద్యుత్ తీగను తాకి షాక్‌కు గురయ్యారు.అతడు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంపై రైల్వే శాఖ ప్రజలను క్షమాపణ కోరింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. -
మాజీ మంత్రి ప్రసన్నకుమార్ హత్యకు పక్కా స్కెచ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక ప్రకారమే టీడీపీ మూకలు బరి తెగించాయి. దాడి దృశ్యాలు, వ్యూహాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. నెల్లూరు నగరం నడిబొడ్డున గల నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి సోమవారం రాత్రి మారణాయుధాలతో టీడీపీ మూకలు, రౌడీలు, పాత నేరస్తులు అక్రమంగా ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. తొలుత సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ప్రసన్నకుమార్‌రెడ్డిని చంపేస్తామని కేకలు వేస్తూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలు దాడి ఎంత భయంకరంగా జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాలతో ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లిన టీడీపీ మూకలు, రౌడీలు ఆయన ఇంట్లో లేకపోవడంతో ధ్వంసరచనకు పాల్పడ్డారు. అంతా కుట్ర ప్రకారమే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి సమీపంలోపి బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ జరుగుతోంది. జనసందోహం భారీగా ఉండటంతో ఆ సమయంలో తాము ఏం చేసినా ఎవరూ గుర్తు పట్టే అవకాశం ఉండదని భావించిన టీడీపీ గూండాలు వాహనాల్లో పెద్దఎత్తున సుజాతమ్మ కాలనీకి చేరుకున్నారు. వాహనాలను దూరంగా పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వచ్చారు. ఆయన ఇంట్లో లేరనే విషయం తెలిసి బీభత్సం సృష్టించారు. తొలుత దుండగులు ఇంటి ప్రధాన ద్వారంతోపాటు వెనుక వైపు ద్వారాల నుంచి లోపలికి ప్రవేశించారు. కొందరు ఇంట్లోకి ప్రవేశించగా.. మిగిలిన వారు ఇంట్లోని వారిని బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.దీనిని బట్టి చూస్తే ప్రసన్నకుమార్‌రెడ్డిని హతమార్చేందుకు పక్కా స్కెచ్ వేసినట్టు స్పష్టమవుతోంది. దాడి ఘటనపై ప్రసన్నకుమార్‌రెడ్డి సోమవారం అర్ధరాత్రి అనుమానితుల పేర్లు ఉటంకిస్తూ.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి తనను హత్య చేయించేందుకు పథకం పన్నారని ఫిర్యాదు చేశారు. అనుమానితుల పేర్లు కూడా పోలీసులకు ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని.. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. పోలీసులొచ్చినా బెదరని మూకలు ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న దర్గామిట్ట పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు పదుల సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిబయట ఉన్న దుండగులు పరుగులు తీయగా.. ఇంట్లో విధ్వంసం చేస్తున్న రౌడీమూకలు ఏ మాత్రం బెదరలేదు. దాడి పూర్తయ్యాక తాపీగా నడుచుకుంటూ బయటకు వెళ్లారు. పోలీసులు వారిని పట్టుకునే అవకాశం ఉన్నా.. ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. దాడిని ఆపేందుకు అవకాశం ఉన్నా ఆ పని కూడా చేయలేదు. పోలీసులు అక్కడే ఉన్నా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాల మేరకే దాడి పూర్తయ్యే వరకూ కిమ్మనకుండా ఉండిపోయారు. ఘటనను తప్పుదోవ పట్టించేందుకు మరో కుట్ర దాడి ఘటనను టీడీపీ నేతలు తప్పుదోవ పట్టించే కుట్రకు తెరలేపారు. ఆయన ఇంటిపై మహిళలు దాడి చేశారని, అభిమానులు దాడులు చేశారని, వారే దాడి చేసుకుని ఉండొచ్చనే ప్రచారానికి టీడీపీ నేతలు తెరతీశారు. తద్వారా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి.. అసలు వాస్తవాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికులు కొందరు దాడి దృశ్యాలను వీడియోలు తీసి.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ పోలీసులు మాత్రం తమకేమీ తెలియదన్నట్టు, ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై అసలు దాడే జరగలేదు అన్నట్టు ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. ప్రసన్నకుమార్ హత్యకు టీడీపీ భారీ కుట్రటీడీపీ రౌడీమూకలు మారణాయుధాలతో బీభత్సం సృష్టించారు మాజీ మంత్రి అనిల్కుమార్సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని హత్య చేసేందుకు టీడీపీ రౌడీమూకలు భారీ కుట్ర పన్ని మారణాయుధాలతో ఆయన ఇంట్లోకి రాత్రివేళ చొరబడ్డారని మాజీ మంత్రి కె.అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఆ సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో లేకపోవడంతో రెచ్చిపోయిన టీడీపీ మూకలు జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా బీభత్సం సృష్టించారన్నారు. సోమవారం రాత్రి ప్రసన్నకుమార్ ఇంటిపై జరిగిన దాడిపై ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన మాజీమంత్రులు అనిల్, ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేత వీరి చలపతిరావు ఏఎస్పీ సౌజన్యకు ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో పచ్చమూకలు దారుణ ఘటనకు శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన నల్లపరెడ్డి కుటుంబంపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. టీడీపీ మూకలు వెళ్లిన సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి షాక్‌కు గురయ్యారని.. ఆమెకు జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని నిలదీశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, దాడికి పాల్పడిన వారి అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎవరి ప్రోద్బలం ఉందో, ఎవరు పంపించారో అందరికీ తెలుసన్నారు. ప్రనన్నకుమార్ ద్వారా ఇంకేమి నిజాలు బయటకు వస్తాయోనని భయపడి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. డబ్బుందన్న మదంతో డాన్లు కావాలని ఇలాంటి ఆగడాలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసుల తీరుకు అద్దం పడుతోందని దుయ్యబట్టారు. ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు పక్కనే ఉన్నా ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.నిజమే చెప్పాను.. వెనక్కి తగ్గను: ప్రసన్నకుమార్‌రెడ్డి మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురించి అంతా నిజమే చెప్పానని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఏడాది కాలంలో ఇప్పటివరకు ఆమె చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఆమె తనపై వ్యక్తిగత విమర్శ చేయడంతోనే నిజాన్ని ప్రజల ముందుంచానని చెప్పారు. మహిళలంటే తమకెంతో గౌరవం ఉందని, ఆమె తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే తాను ఆమె గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పానన్నారు. గంజాయి మత్తులో దాడి చేసిన వారిని, ఈ దాడులకు పురిగొల్పిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేశారు. -
'కాల్'కేయులు!
సాక్షి, హైదరాబాద్: ‘నాన్నా పులి..’సామెతను గుర్తుచేస్తున్నాయి కొందరి చేష్టలు. బాంబులు పెట్టారంటూ బెదిరింపు ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్‌తో బెదరగొట్టడం.. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఆఘమేఘాల మీద ఉరుకులు, పరుగులు పెట్టడం ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది. వీటిల్లో చాలావరకు ఆకతాయితనంతోనో, శాడిజంతోనో చేసే కాల్స్ అయినా సరే..ప్రజా భద్రత దృష్ట్యా ఈ తరహా ఏ ఒక్క ఫోన్‌కాల్‌ను కానీ, ఈ–మెయిల్‌ను కానీ పట్టించుకోకుండా వదిలేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ నిజంగానే బాంబు పేలుడు లాంటివి సంభవిస్తే ప్రాణ నష్టం భారీగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా విమానాశ్రయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈ తరహా నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్, పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టుల్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ–మెయిల్ రావడంతో కాసేపు గందరగోళం నెలకొంది. నిందితులు తాము చిక్కకుండా సాంకేతికతను ఉపయోగించి ఈ తరహా ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్ చేస్తున్నట్టు పోలీసులు దర్యాప్తులో తేలుతోంది. ఐదేళ్లలో పెరిగిన కాల్స్, ఈ–మెయిల్స్ గత ఐదేళ్లలో (2020–2025) దేశంలో బాంబు బెదిరింపు కాల్స్ సంఖ్య గణనీయంగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ తరహా ఘటనల్లో ఎక్కువగా వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) ఉపయోగించి విదేశాల నుంచి ఈ–మెయిల్స్ పంపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇలాంటి వారు ఫోన్‌కాల్స్ చేసేవారు, కానీ ఇటీవల ఈ–మెయిల్లు సోషల్ మీడియాకు మారడం, వీపీఎన్ వాడకంతో నేరస్థులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. 2024లో దేశవ్యాప్తంగా ఇలాంటి బెదిరింపు కాల్స్ చేసిన వారిలో 13 మందిని అరెస్టు చేయగా.. అందులో తెలంగాణలో ఒకరిని అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు కాల్స్ ఇలా.. » 2020–2021లో కోవిడ్ మహమ్మారి, లాక్డౌన్ కారణంగా ఇలాంటి కాల్స్ సంఖ్య తక్కువగా ఉంది. » 2022లో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలకు సుమారు 100కు పైగా బాంబు బెదిరింపు కాల్స్ వచి్చనట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిలో చాలావరకు నకిలీవిగా గుర్తించారు. హైదరాబాద్ సహా పలు నగరాల్లోని సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలకు ఈ తరహా బెదిరింపు కాల్స్ వచ్చాయి. » 2023లో బాంబు బెదిరింపుల సంఖ్య మరింత పెరిగింది. ఢిల్లీలోని స్కూళ్లు, ఆసుపత్రులు, మెట్రో స్టేషన్లకు బెదిరింపు కాల్స్, ఈ–మెయిల్స్ వచ్చాయి. ఈ ఏడాదిలో 500కు పైగా బెదిరింపు కాల్స్, ఈ–మెయిల్స్ నమోదయ్యాయి. వీటిల్లోనూ చాలావరకు ఉత్తుత్తివిగా తేలాయి. » 2024లో 997 బాంబు బెదిరింపు కాల్స్ నమోదయ్యాయి. 2024 జూన్‌లో ఒక్క రోజులోనే ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో కలిపి 50కి పైగా విమానాశ్రయాలు, 40కి పైగా ఆసుపత్రులకు బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. అక్టోబర్‌లో రెండు వారాల్లోనే 500 విమానాలకు ఈ తరహా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. » 2025 మొదటి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా వందలాది బెదిరింపు కాల్స్, ఈ–ఇమెయిల్స్ నమోదయ్యాయి. జనవరిలో ఢిల్లీలోని 15కి పైగా ఆసుపత్రులు, పలు విమానాశ్రయాలకు బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. తెలంగాణలో ఇలా.. » 2022లో హైదరాబాద్‌లోని కొన్ని షాపింగ్ మాల్స్, స్కూళ్లకు బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. దర్యాప్తు తర్వాత ఇవి నకిలీవిగా తేలాయి.» 2023లో హైదరాబాద్‌లోని పలు స్కూళ్లు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. వీటిల్లో ఎక్కువగా విదేశీ సర్వర్ల నుంచి వచ్చిన ఈ–మెయిల్స్ ఉన్నాయి. » 2024లో హైదరాబాద్‌లోని స్కూళ్లు, కాలేజీలు, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు ఈ–మెయిల్స్ వచ్చాయి. అక్టోబర్ 22న హైదరాబాద్‌లోని ఒక సీఆర్పీఎఫ్ స్కూల్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అదేవిధంగా మేలో ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో బాంబు పెట్టినట్టు నకిలీ బెదిరింపు కాల్ చేసిన ఒక వ్యక్తిని హైదరాబాద్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు. »2025లో మంగళవారం సిటీ సివిల్ కోర్టు సహా పలు చోట్ల బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. -
ఆ కామాంధుడు.. కన్నతండ్రే!
చాప్రా: బీహార్‌లో వావివరుసలు మరచి ప్రవర్తించిన ఒక తండ్రి ఉదంతం కలకలం రేపుతోంది. రైలు టాయిలెట్‌లోని ఒక బ్యాగులో నవజాత శిశువు లభ్యమైన దరిమిలా పోలీసుల విచారణలో పలు విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. రైలులోని టాయిలెట్లో శిశువు ఏడుపు విన్న ప్రయాణికులు, వెంటనే ఆ శిశువును బయటకు తీసి, మొరాదాబాద్‌లోని రైల్వే పోలీసులకు అప్పగించారు.పోలీసుల విచారణలో బీహార్‌కు చెందిన ఒక బాలిక తన తండ్రి చేతిలో అత్యాచారానికి గురైందని, అయితే వారి కుటుంబ సభ్యులు దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని తేలింది. బాధితురాలు పోలీసులకు తెలిపిన సమాచారంలో.. తన తండ్రి మద్యం సేవించేవాడని, ఏడాదిగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. గర్భవతి అయిన బాలికను కుటుంబ సభ్యులు చికిత్స కోసం రైలులో ఢిల్లీకి తీసుకెళ్తున్నప్పుడు శిశువుకు జన్మనిచ్చిందని వెల్లడయ్యింది.వారు ప్రయాణిస్తున్న రైలు వారణాసి సమీపంలో ఉండగా, ఆమె టాయిలెట్లో మగబిడ్డను ప్రసవించింది. అయితే కుటుంబ సభ్యులు ఆ శిశువును ఒక బ్యాగులో ఉంచి, దానిని అక్కడే ఉన్న మరొక రైలు టాయిలెట్లో పడవేసి, రైలు నుంచి దిగిపోయారని పోలీసుల దర్యాప్తులో తేలింది. బరేలీ సమీపానికి రైలు చేరుకున్నంతలో ప్రయాణికులు ఆ శిశువును గుర్తించారు. వెంటనేవారు ఆ శిశువును టికెట్ తనిఖీ సిబ్బందికి అప్పగించారు. వారు ఆ శిశువును ఎయిర్ కండిషన్డ్ కోచ్‌కు తరలించారు. తరువాత ఆ శిశువుకు మొరాదాబాద్‌లో వైద్య సహాయం అందించినట్లు పోలీసులు తెలిపారు.బాధిత బాలిక కుటుంబ సభ్యులు వదిలివెళ్లిన బ్యాగులో లభ్యమైన సిమ్ కార్డ్ ఆధారంగా పోలీసులు బాధితురాలి ఆచూకీ తెలుసుకున్నారు. తరువాత ఆమెను మొరాదాబాద్‌కు తీసుకువచ్చారు. అయితే బాధితురాలు అక్కడి అధికారులతో ఆ శిశువును తాను పోషించలేనని లిఖిత పూర్వకంగా తెలిపింది. బాధితురాలితో పాటు వచ్చిన బంధువులు కూడా ఇదే విషయాన్ని పోలీసుల ముందు స్పష్టం చేశారని సమాచారం. దీంతో ఆ శిశువును మొరాదాబాద్‌లోని చైల్డ్ వెల్ఫేర్ సొసైటీలో ఉంచారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
జైలు నుంచే స్కెచ్ గీసి.. గోపాల్ ఖేమ్కా కేసులో షాకింగ్ విషయాలు
ఎన్నికల వేళ.. బీహార్‌లో రాజకీయంగానూ కలకలం రేపిన గోపాల్ ఖేమ్కా హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు వికాస్ అలియాస్ రాజా పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మరోవైపు.. గోపాల్ హత్యకు జైలు నుంచే కుట్ర జరిగిందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందక్కడ. గోపాల్ ఖేమ్కా హత్య (Businessman Murder in Bihar) కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం.. కీలక నిందితుడైన వికాస్ (ఆయుధం సరఫరా చేసింది ఇతనే) కోసం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలోనే పాట్నాలోని ఓ ప్రాంతంలో సోదాలు జరుపుతుండగా.. పోలీసులను చూసి కాల్పులు జరిపాడతను. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ ఆయుధాల తయారీ, విక్రయాలతో నిందితుడికి సంబంధాలున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గోపాల్ ఖేమ్కా హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.గోపాల్ ఖేమ్కా.. బీహార్లోనే అతి పురాతన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటైన మగధ హాస్పిటల్ యజమాని. పాట్నా గాంధీ మైదాన్ పీఎస్ పరిధిలోని రాంగులాం చౌక్ పనాష్ హోటల్ సమీపంలో శుక్రవారం రాత్రి ఆయన దారుణ హత్యకు గురయ్యారు. హోటల్ నుంచి బయటకు వస్తుండగా నిందితులు బైక్ మీద వచ్చి అతి సమీపం నుంచి గోపాల్‌పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారాయన. 2018లో ఆయన తనయుడు గుంజన్ ఖేమ్కా కూడా ఇదే తరహాలో బైకర్ల కాల్పులలో మరణించడం గమనార్హం. అయితే ఆ కేసులో నిందితులను ఇప్పటిదాకా పోలీసులు పట్టుకోలేకపోయారు.గోపాల్ ఖేమ్కా కేసులో.. అశోక్ కుమార్ సాఫ్ అనే వ్యాపారవేత్త ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్య కోసం సుపారీ గ్యాంగ్‌కు 3.5 లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఉమేష్‌యాదవ్ అనే షూటర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. గోపాల్ అంత్యక్రియలకు హాజరైన రోషన్ కుమార్ అనే మరో నిందితుడు పట్టుబడ్డాడు. ఇక వికాస్ ఎన్కౌంటర్లో మరణించాడు. పాట్నాలోని బీర్ సెంట్రల్ జైలు నుంచే గోపాల్ ఖేమ్కా హత్యకు కుట్ర జరిగినట్లు భావిస్తున్నామని బీహార్ డీజీపీ వినయ్ కుమార్ తెలియజేశారు. ఇప్పటికే జైలు నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారాయన. జైల్లోని నిందితులు.. బయట ఉన్నవాళ్ల సాయంతో ప్లాన్ అమలు చేశారని అన్నారాయన. ఈ సంచలన కేసుకు సంబంధించిన మిగతా వివరాలను మీడియా సమక్షంలో వెల్లడిస్తామని స్థానికంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు.గోపాల్ ఖేమ్కాకు బీజేపీతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరికొన్ని నెలల్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ హత్య రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. నీతీశ్‌కుమార్ పాలనలో బిహార్ నేర రాజధానిగా మారిందని లోక్‌సభలో విపక్ష నేత, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వ్యాపారవేత్తలకు, ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని.. హత్యలు, దోపిడీలు సర్వసాధారణంగా మారాయని ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ దుయ్యబట్టారు. -
యూపీలో దారుణం.. అనురాధతో తాంత్రికుడి పైశాచిక ఆనందం!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. తనకు పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళ.. స్థానికంగా ఉన్న తాంత్రికుడిని ఆశ్రయించింది. అదే అదునుగా సదరు తాంత్రికుడు.. ఆమెతో అనుచితంగా ప్రవర్తించడం, మంత్రాల నెపంతో దాడి చేయడం, టాయిలెట్ నీళ్లు తాగించడం వంటివి చేశాడు. దీంతో, ఆమె ఆరోగ్యం క్షీణించి బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలోని కంధారపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహల్వాన్పూర్ గ్రామానికి చెందిన అనురాధ(35)కు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది. పదేళ్లు అయిన పిల్లలు పుట్టకపోవడంతో బాధితురాలు వైద్యులను ఆశ్రయించింది. అయినప్పటికీ పిల్లలు పుట్టలేదు. ఈ నేపథ్యంలో ఇరుపొరుగు వారు ఆమెకు ఓ సలహా ఇచ్చారు. స్థానికంగా ఉన్న తాంత్రికుడి చందు వద్దకు వెళ్లాలని సూచించారు. వారి మాటలు నమ్మిన అనురాధ.. అతడి వద్దకు వెళ్లింది.ఈ క్రమంలో రెచ్చిపోయిన తాంత్రికుడు చందు.. అనురాధతో అనుచితంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకుతూ ఇబ్బందులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా.. అనురాధకు దుష్టాత్మ పట్టిందని నమ్మించాడు. కొన్ని పూజలు చేయాలని చెప్పి.. అతని సహాయకులు ఆమె జుట్టును లాగి, ఆమె మెడ, నోటిని బలవంతంగా నొక్కారు. మురుగు కాలువ, టాయిలెట్ నుండి మురికి నీటిని కూడా తాగించారు. అనంతరం, అనురాధ ఆరోగ్యం క్షీణించింది. దీంతో, సదరు తాంత్రికుడు, బాధితురాలు తల్లి కలిసి అనురాధను ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న కాసేపటికే అనురాధ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని అక్కడే వదిలేసి తాంత్రికుడి బృందం ఆసుపత్రి నుండి పారిపోయింది. అనురాధ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.ఈ సందర్బంగా బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఏదో పూజల పేరుతో అనురాధను చందు చిత్రహింసలకు గురి చేశారు. మురుగు నీటిని తాగించ వద్దని మేము వారించినప్పటికీ మా మాట వినలేదు. మా బిడ్డను అన్యాయం చంపేశారు. పూజలు చేయాలని అతడు మా వద్ద నుంచి 22వేలు తీసుకున్నాడు. ఇంకా డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తాంత్రికుడు చందు పోలీస్ స్టేషన్లో లొంగిపోగా.. అతడి సహచరులు పరారీలో ఉన్నారు. -
తప్పెవరిది?.. తమిళనాడు ఘోర ప్రమాదంపై చర్చ
తమిళనాడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఓ స్కూల్ వ్యాన్ పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.సాక్షి, చెన్నై: తమిళనాడు కడలూరులో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం చెమ్మంగుప్పం వద్ద ఓ స్కూల్ వ్యాన్ రైలు పట్టాలను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది విధ్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే.. గేట్‌మేన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందన్న విమర్శలు వినిపిస్తుండగా.. మరోవైపు డ్రైవర్ కోరితేనే తాను గేటు తెరిచానని గేట్‌మేన్ చెబుతున్నాడు. ఈ క్రమంలో తప్పెవరిదనే చర్చ నడుస్తోంది. ఈలోపు గేట్‌మేన్ పంకజ్‌శర్మను రైల్వే అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రమాదం ధాటికి వ్యాన్ చిన్నారుల మృతదేహాలు ముక్కలై పడ్డాయి. రైలు ఢీ కొట్టిన వేగానికి 50 మీటర్ల దూరం ఎగిరిపడి తుక్కు అయిన వ్యాన్ దృశ్యాలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి.கேட் கீப்பரின் அலட்சியத்தால் பள்ளி வேன் மீது ரயில் மோதி 2 மாணவர்கள் ப**யான கோர விபத்து... தண்டவாளத்தில் சிதறிக்கிடந்த புத்தகப்பை... மனதை நொறுக்கிய காட்சிகள்....!#Cuddalore | #SchoolVan | #RailwayTrack | #GateKeeper | #CuddaloreAccidentUpdate | #TrainAccident | #PolimerNews pic.twitter.com/yv79s6oamO— Polimer News (@polimernews) July 8, 2025 -
తెలివి ఉండే నా తలరాత ఇలా రాశావా తల్లీ!
కరీంనగర్: బతకడం కన్నా... చావడమే చాలా తక్కువ బాధ.. అంటూ వేములవాడకు చెందిన రోహిత్(24) రాసిన సూసైడ్‌నోట్ కంటతడి పెట్టిస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డకు చెందిన దీటి వేణుగోపాల్–రాణి దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు రోహిత్ శనివారం అర్ధరాత్రి దాటాక ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు చూడడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఇటీవల రోహిత్ బీటెక్ పూర్తి చేసి, ఇంటి వద్ద ఉంటున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రోహిత్ మరణం ఆ కుటుంబంలో విషాదం నింపింది. తండ్రి గోపాల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.సూసైడ్‌నోట్‌లో ఇలా..నా జీవితంలో గొప్ప సూసైడ్ లేఖ రాయాలన్న కోరిక నెరవేరింది. బతకడం కన్నా చావడం తక్కువ బాధగా అనిపిస్తోంది. చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ఇది నా విధి కావచ్చు. ఇక జన్మలు వద్దు. నా శరీరాన్ని కాశీ ఘాటులో దహనం చేయండి. నా కోరికలు నెరవేరినవే.. కానీ కలలు కాదు. నా జీవితం తట్టుకోలేనిది అయిపోయింది. మానవ సంబంధాలు కొన్ని పవిత్రం, మరికొన్ని బాధతో నిండినవే. నేను ఇక జన్మించనక్కర్లేదు. అంటూ ఆ యువకుడు డాక్టర్ డి.ఆర్. అని తన సూసైడ్‌నోట్‌లో రాశాడు. -
‘డ్రగ్’ల్బాజీ సూత్రధారుల సంగతేంటి!
సాక్షి, విశాఖపట్నం: కూటమి నేతల అండదండలతో డ్రగ్స్ కల్చర్ విశాఖ మహా నగరంలోకి ప్రవేశించేసింది. ఎన్నికల ముందు కంటైనర్‌లో రూ.వేల కోట్ల డ్రగ్స్ విశాఖకు వచ్చాయంటూ లేనిపోని ఆరోపణలు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు ఏకంగా విశాఖ నగరాన్నే డ్రగ్స్‌కి అడ్డాగా మార్చేశారు. ఎలాగోలా వలపన్ని పట్టుకున్న పోలీసులు డ్రగ్ రాకెట్‌ను ఛేదించేందుకు ప్రయత్నిస్తుంటే.. నేరుగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలోనే తిష్టవేసి కేసు ముందుకెళ్లకుండా టీడీపీ పెద్దలు నిలువరిస్తున్నారు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకురావడం వెనుక ఉన్న అసలైన సూత్రధారుల్ని వదిలేసి.. పాత్రధారులతోనే కేసు దర్యాప్తును ముగించేస్తున్నారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టే ఓ బడా నేత కుమారుడు ఇందులో ఉండటంతో టీడీపీకి చెందిన ఓ ఎంపీ, ఎమ్మె ల్యే దగ్గరుండి కేసు వ్యవహారాల్ని నడిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే..? ఢిల్లీ నుంచి విమానంలో దక్షిణాఫ్రికాకు చెందిన థామస్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకొస్తున్నారంటూ నగర పోలీసులకు సెంట్రల్ ఏజెన్సీల నుంచి సమాచారం వచ్చింది. ఆ వ్యక్తి కస్టమ్స్‌కి చిక్కకుండా 25 గ్రాముల కొకైన్‌ని పుస్తకాల మధ్యలో పెట్టి తీసుకొచ్చేశాడు. ఎయిర్‌పోర్టులో పట్టుకుంటే డ్రగ్స్ ఎవరి కోసం తీసుకొచ్చారన్నది తెలియదన్న ఉద్దేశంతో ఈగల్ బృందం సదరు విదేశీయుడిని ఫాలో అవుతూ వచ్చింది. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో అతడు అక్షయ్‌కుమార్ అలియాస్ మున్నాను కలిసి డ్రగ్స్ ఇస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి ఫోన్‌తో పాటు మున్నా ఫోన్‌ని స్వాదీనం చేసుకున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. మున్నాను విచారించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరు వైద్యుడు కాగా, మరొకరు కూటమి నాయకుడి కుమారుడు, ఇంకొకరు ఉత్తరాంధ్ర కూటమి నేతల ఆరి్థక లావాదేవీలు చూసే బడా నేత కుమారుడు. ఈ ముగ్గుర్నీ పట్టుకోగానే.. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ నేరుగా పోలీసులకు ఫోన్‌చేసి వెంటనే వారిని విడిచి పెట్టాలని.. వారిపై ఎలాంటి కేసులు ఉండకూడదనీ.. తమకు కావల్సిన వ్యక్తులంటూ హుకుం జారీ చేశారు. పోలీసులపై తీవ్ర ఒత్తిడి రావడంతో కేవలం ఇద్దర్ని మాత్రమే అరెస్ట్ చేశామంటూ తొలిరోజు ప్రెస్మీట్లో సీపీ వెల్లడించారు. మొత్తం ఐదుగుర్ని అదుపులోకి తీసుకొని ఇద్దర్ని మాత్రమే అరెస్ట్ ఎందుకు చూపిస్తున్నారని మీడియా ప్రశ్నించగా.. మిగిలిన ముగ్గురు అనుమానితులు మాత్రమేననీ, నిందితులు కాదని సమాధానమిచ్చి తప్పించుకోవాలని చూశారు. కూటమి నేతల హస్తం ఉన్నట్టు అన్ని ఆధారాలున్నా.. టీడీపీ నేతలు పోలీసుల చేతులు కట్టేసి దర్యాప్తును తుంగలో తొక్కేస్తున్నారు. సూత్రధారుల్ని విడిచిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. లోతుగా దర్యాప్తు చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలొస్తున్నాయి. హోంమంత్రి స్పందించరేం? ప్రతి విషయంలో హడావుడి చేసే హోంమంత్రి అనిత సోమవారం సాయంత్రం నగరంలో పోలీసుల కార్యక్రమానికి హాజరైనా డ్రగ్స్ కేసుపై పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. దీంతో కూటమి నేతల హస్తం ఉందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. సీపీ కార్యాలయంలోనే ఓ ఎమ్మెల్యే తిష్ట! ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా.. టీడీపీ ఎమ్మెల్యే ఒకరు సీపీ కార్యాలయానికి నేరుగా వచ్చేసినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురూ తమకు బాగా కావాల్సినవారని, ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు నమోదు చెయ్యొద్దంటూ అక్కడే ఉండి వ్యవహారం నడిపించారు. అప్పటికే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్టు మీడియాలో వార్తలు రావడంతో ఏం చేయాలో పాలుపోక కూటమి పార్టీలకు సంబంధం లేని.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వైద్యుడిని అరెస్ట్ చేసినట్టు చూపించారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు కూటమి పార్టీ నేత, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సీఈవో.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మున్నాతో అతడికి సత్సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో అతడి పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మూడు ముళ్లు వేసి.. రూ.28 కోట్లు కాజేసి!
చిత్తూరు అర్బన్: ఒంటరిగా ఉన్న ఓ మహిళను నమ్మకంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు లాటరీ పేరుతో ఆమెకు టోకరా వేశాడు. రూ.15 కోట్లు పన్నులు చెల్లిస్తే రూ.1,700 కోట్లు వస్తాయని ఆశలు కల్పించాడు. చివరికి ఆమె ఆస్తులు అమ్మించి రూ.28 కోట్లు తీసుకుని అడ్రస్ లేకుండాపోయాడు. దీంతో బాధితురాలు సోమవారం చిత్తూరులో ఎస్పీ మణికంఠను కలిసి ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం మేరకు... చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని రాజుపేటకి చెందిన నాగమణికి 1992లో ఒక వ్యక్తితో వివాహమైంది. ఒక కొడుకు కూడా పుట్టాడు. కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కుమారుడు చనిపోగా, ఆ దిగులుతో భర్త కూడా మరణించాడు. కొడుకు బీమా డబ్బులు, భర్త ఆస్తులన్నీ నాగమణికి వారసత్వంగా వచ్చాయి. ఒంటరిగా ఉన్న ఆమె మరో పెళ్లి చేసుకోవాలని చిత్తూరులోని ఓ పెళ్లిళ్ల మధ్యవర్తిని సంప్రదించింది. ఈ క్రమంలో బంగారుపాళ్యం మండలం శేషాపురం గ్రామానికి చెందిన శివప్రసాద్ నాయుడు అనే వ్యక్తి నాగమణిని కలిసి తన భార్య చనిపోయిందని, పిల్లలు కూడా లేరని చెప్పాడు. అతని భార్య ఉన్నప్పటికీ, చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్‌ను చూపించాడు. దీంతో అతని మాటలు నమ్మిన నాగమణి పెళ్లికి అంగీకరించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో శివప్రసాద్ నాయుడిని 2022 అక్టోబర్‌లో కర్ణాటకలోని బంగారు తిరుపతి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఇద్దరు కాపురం పెట్టారు. ఆర్బీఐ నుంచి లాటరీ పేరుతో మోసం కొన్నాళ్ల తర్వాత తనకు ఆర్బీఐ నుంచి రూ.1,700 కోట్ల లాటరీ తగిలిందని శివప్రసాద్ నాయుడు ఓ పత్రాన్ని చూపించాడు. ఈ మొత్తం రావాలంటే పన్నుల రూపంలో రూ.15 కోట్లు చెల్లించాలని నాగమణిని నమ్మించాడు. దీంతో ఆమె తన బ్యాంకు ఖాతాలో ఉన్న దాదాపు రూ.3 కోట్ల నగదును శివప్రసాద్, అతని అన్న చక్రవర్తి, వదిన హేమలత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. రూ.15 కోట్ల విలువ చేసే భూములు, రూ.10 కోట్ల విలువ చేసే భవనాన్ని విక్రయించి మొత్తం రూ.28 కోట్లను శివప్రసాద్ తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా ఆర్బీఐ నుంచి రూ.1,700 కోట్లు ఇంకా రాలేదని నాగమణి ప్రశ్నించినప్పుడల్లా మాయమాటలు చెప్పి తప్పించుకునేవాడు. ఓ సారి గట్టిగా నిలదీయడంతో చంపేస్తానని నాగమణిని బెదిరించాడు. గతేడాది డిసెంబరులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడ్ని వెతుక్కుంటూ బంగారుపాళ్యానికి వెళ్లిన నాగమణికి ఊహించని షాక్ తగిలింది. శివప్రసాద్ నాయుడికి భార్యతోపాటు ఎనిమిదేళ్ల కూతురు ఉన్నారని తెలిసి విస్తుపోయింది. దీనిపై గట్టిగా నిలదీయడంతో అందరూ కలిసి ఆమెపై దాడిచేసి, చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. -
అడవిలోకి తీసుకెళ్లి.. ఆలిని హతమార్చాడు
ఆదిలాబాద్ టౌన్: అనుమానం పెనుభూతమై ఓ భర్త కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.ఆదిలాబాద్ పట్టణం సుందరయ్యనగర్‌కు చెందిన హింగోలి శంకర్‌కు ఇంద్రవెల్లిలోని నర్సాపూర్‌కు చెందిన వందన (45)తో 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 20 ఏళ్లు పైబడిన ఇద్దరు కుమారులు, 17 ఏళ్ల కుమార్తె ఉన్నారు. శంకర్ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుండగా, ఆయన భార్య గృహిణి. సాఫీగా సాగిన వీరి సంసార జీవితంలో భార్యపై అనుమానం శంకర్‌లో అశాంతి రేపింది.టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యకు ఆరోగ్యం బాగాలేదని, క్షుద్రపూజలు చేయిస్తానని, ఆయుర్వేద మందు తాగిస్తానని చెప్పి ఈనెల 2న శంకర్ ఆదిలాబాద్ నుంచి వందనను బస్సులో తీసుకెళ్లాడు. తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ అటవీ ప్రాంతం (మహారాష్ట్ర సరిహద్దు)లోకి తీసుకెళ్లి చెట్లకు పసుపు కుంకుమతో పూజలు చేస్తున్నట్లు నటించాడు. వెంట తెచ్చుకున్న కారంపొడిని వందన కళ్లలో చల్లాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయగా బండరాయితో తలపై బాదాడు. దీంతో రక్తపు మడుగులో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఇంటి నుంచి వెళ్లిన అమ్మ నాన్న తిరిగి రాకపోవడంతో పిల్లలు ఆందోళనకు గురయ్యారు.శనివారం రాత్రి కూతురు ప్రియాంక టూటౌన్లో ఫిర్యాదు చేయగా, అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సంఘటన స్థలానికి ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డితో పాటు పోలీసులు వెళ్లి చూడగా ఆమె మృతదేహం కుళ్లిపోయి ఉంది. కాగా నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. -
యువతి అనుమానాస్పద మృతి.. యువకుడి పరిస్థితి విషమం!
బండ్లగూడ: సంగారెడ్డి జిల్లాలో ఓ యువతి-యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రామచంద్రాపురం పీఎస్ పరిధిలోని బండ్లడూడ బాలాజీ నగర్లో చోటు చేసుకున్న ఈ ఘటనలో యువతి మృతిచెందగా, యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరూ ప్రేమించుకుని ఆత్మహత్యాయత్నం చేశారా? అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనలో రమ్య అనే యువతి మృతిచెందగా, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీణ్ అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. డిగ్రీ చదువుతున్న రమ్య అనే యువతితో ప్రవీణ్ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు. ఈ కారణంగానే ఇరువురు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం .అయితే యువతి గొంతుపై కత్తి గాట్లతో రక్తపు మడుగులో పడి ఉంది. ఇక ఆమె పక్కనే పడి ఉన్న ప్రవీణ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడ యువతి మెడపై కత్తి నాట్లు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఇద్దరు కలిసి ఆత్మహత్యాయత్నం చేశారా? లేక యువతిపై ప్రవీణ్ దాడి చేసి ఆపై ఆత్మహత్యకు యత్నించాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన రీల్స్ సరదా.. టవల్ బిగుసుకుని చిన్నారి మృతి
సాక్షి,హైదరాబాద్: ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ సోషల్ మీడియా యుగంలో చాలా మంది వివిధ రకాల వీడియోలు, యూట్యూబ్ షార్ట్ వీడియోలు, రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. కానీ అదే రీల్స్ పిచ్చి.. యువతకు మాత్రమే కాదు.. పిల్లల ప్రాణాలకు సంకటంగా మారుతోంది. లైకుల కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తూ.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా, సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రీల్స్ చేస్తుండగా చిన్నారి మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కులులో చోటు చేసుకుంది. చిట్కులుకు చెందిన సహస్ర నాలుగువ తరగతి చదువుతోంది.ఈ క్రమంలో కరెంట్ లేని సమయంలో ఫ్యానుకు టవల్ వేలాడదీసి రీల్స్ చేసే ప్రయత్నం చేసింది. సరిగ్గా అదే సమయంలో కరెంట్ రావడంతో సహస్ర మెడకు టవల్ బిగుసుకుని అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతిపై కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బంగారు భవిష్యత్తున్న సహస్ర అర్ధాంతరంగా తనువు చాలించడంపై చూపురులను కంటతడి పెట్టిస్తోంది. -
దర్శన్ కేసు స్ఫూర్తితో..! కర్ణాటకలో మరో దారుణం
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తన గర్ల్‌ఫ్రెండ్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టాడని ఓ యువకుడు.. మరో యువకుడిపై తన స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెలమంగళ తాలుకా సోలదేవనహళ్లిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. కుశాల్ అనే కుర్రాడు గతంలో ఓ యువతిని ప్రేమించాడు. అయితే తర్వాత ఇద్దరికీ బ్రేకప్ కాగా, ఆ యువతి మరో యువకుడితో రిలేషన్ మొదలుపెట్టింది. ఇది భరించలేని కుశాల్.. సదరు యువతికి అసభ్య సందేశాలు పంపాడు. ఈ విషయాన్ని సదరు యువతి తన తాజా ప్రియుడికి చెప్పింది. దీంతో రగలిపోయిన సదరు యువకుడు తన స్నేహితులతో కలిసి కుశాల్‌పై దాడికి పాల్పడ్డాడు. అయితే.. కుశాల్‌ను కిడ్నాప్ చేసి.. ఓ బహిరంగ ప్రదేశంలోకి ఈడ్చుకెళ్లి పడేశారు. పది మంది అతన్ని చుట్టుముట్టి కాళ్లతో, కర్రలతో తన్నారు. బట్టలు విప్పించి.. ప్రైవేట్ బాగాలపై దాడి చేస్తూ హింసించారు. దాడి సమయంలో ఆ యువతి కూడా అక్కడే ఉంది. దాడికి పాల్పడిన టైంలో ఆ గ్యాంగ్ మొత్తం కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి కేసు ప్రస్తావన తెచ్చి మరీ కుశాల్‌పై దాడికి పాల్పడింది. వీడు మరో రేణుకాస్వామి రా అంటూ ఒక్కొక్కరుగా కుశాల్‌ను చితకబాదారు. ఇది కూడా ఆ కేసులాగే ముగుస్తుందంటూ హెచ్చరించారు కూడా. జూన్ 30వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 10 మందిపై సోలదేవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటిదాకా 8 మందిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, బెదిరింపు, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టింగ్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.కన్నడనాట చాలెంజింగ్ స్టార్‌గా పేరున్న దర్శన్ నటి పవిత్రగౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కోపంతో తన అభిమాని అయిన రేణుకా స్వామి అనే వ్యక్తిని సుపారీ గ్యాంగ్‌తో కిడ్నాప్ చేయించి.. అత్యంత దారుణంగా హింసించి చంపాడని తెలిసిందే. ఈ ఉదంతం కర్ణాటకను మాత్రమే కాదు.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ప్రస్తుతం ఈ కేసులో దర్శన్ బెయిల్ మీద బయట ఉన్నాడు. -
విశాఖ: సంచలన కేసు.. కూటమి నేతలకు లింకులు?
సాక్షి, విశాఖపట్నం: నగరంలో తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసు పూటకో మలుపు తిరుగుతోంది. అరెస్టుల సంఖ్య పెరగడంతో పాటు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. ఈ కేసులో కూటమి నేతల కుమారులు ఉన్నట్లు, వాళ్లను తప్పించే ప్రయత్నాలు జరిగిపోయాయని సమాచారం.ప్రశాంత నగరంగా పేరున్న విశాఖ.. ఏడాది కాలంగా నేరాలకు అడ్డాగా మారిపోయింది. ఎన్నడూ లేనివిధంగా తాజాగా డ్రగ్స్ కేసు బయటపడింది. అయితే ఈ విచారణలో తీగ లాగితే లింకులు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తొలుత త్రీటౌన్ పోలీసులు ప్రకటించారు. అయితే శనివారం నాటికి అందులో ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేసినట్లు చూపించారు. అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా, సౌతాఫ్రికాకు చెందిన థామస్‌ను అరెస్టు చేసినట్టు తెలిపారు. మిగిలిన ముగ్గురిని అనుమానితులుగా పేర్కొన్న పోలీసులు.. ఆదివారం మరొకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నగరానికి చెందిన డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య వర్మ రూ. 65 వేల రూపాయలు తో డ్రగ్స్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని, ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు. అయితే.. ఈ కేసులో కూటమి నేతలకు లింకులు ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్స్‌కేసులో కూటమి నేతల కుమారులు ఉన్నారని సమాచారం. దీంతో కూటమి ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ స్వయంగా రంగంలోకి దిగారు. ఓ ఎమ్మెల్యే ఫోన్ కాల్‌తో ముగ్గురిని ఈపాటికే బయటకు పంపించేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామంపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి. -
కోరుట్ల: చిన్నమ్మా.. ఎంత పని చేశావమ్మా!
కోరుట్ల: పట్ణణంలో శనివారం రాత్రి హత్యకు గురైన ఆరేళ్ల బాలిక హితాక్షి కేసు కొత్త మలుపు తిరిగింది. చిన్నారిని ఆమె చిన్నమ్మే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ప్రస్తుతం కథలాపూర్ పోలీస్ స్టేషన్లో నిందితురాలు మమతను విచారిస్తున్న పోలీసులు, ఇవాళ.. లేదంటే రేపు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. కోరుట్ల ఆదర్శనగర్ పాప హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. శనివారం సాయంత్రం హితిక్ష అనే ఐదేళ్ల పాప అదృశ్యం కాగా, ఆమె తండ్రి ఫిర్యాదుతో ఈ ఘోర హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఇంటిపక్కనే బాత్రూమ్లో విగతజీవిగా పాప మృతదేహాం లభించగా.. గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. పలు కోణాల్లో బృందాలుగా పోలీసుల విచారణ చేపట్టి అనుమానంతో పలువురిని ప్రశ్నించారు. ముందుగా మృతదేహం దొరికిన ఇంటి యజమానిని అనుమానించినా.. అతడికి ఈ హత్యతో సంబంధం లేదని నిర్ధారించుకున్నారు. అయితే తోటికోడలు పెత్తనం సహించలేకే మమత ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. హత్యలో ఒక్కరే ఉన్నారా..? మరెవరైనా పాలుపంచుకున్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆదర్శనగర్‌కు చెందిన సోదరులు ఆకుల రాము, లక్ష్మణ్‌లకు నవీన, మమతతో వివాహమైంది. నవీన, మమత అక్కాచెల్లెళ్ల కూతుళ్లు. రాము, నవీన దంపతులకు కుమారుడు వేదాంశ్, కూతురు హితాక్షి (6) ఉన్నారు. రాములు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లాడు. లక్ష్మణ్, మమత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. నాలుగు నెలల క్రితం మమత ఆన్లైన్లో బెట్టింగ్‌కు పాల్పడి రూ.18 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. దీనిపై కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌క్రైం కేసు నమోదైంది. వారి కుటుంబంలో కొద్దికాలంగా గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇంట్లో నవీనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమెపై మమత ద్వేషం పెంచుకున్నట్లు తెలిసింది. శనివారం ఉదయం వేదాంశ్, హితాక్షిని స్కూల్‌కు పంపిన నవీన.. ఆడపడుచుతో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. ఇంట్లో అత్తతోపాటు మమత మాత్రమే ఉంది. సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు రాగానే మమత వారితో కలిసి పెద్దపులుల వేషధారణలు చూసేందుకు వెళ్లింది. అదే సమయంలో తన వెంట కూరగాయలు కోసే కత్తి, మొక్కలు కత్తిరించే కట్టర్‌ను తీసుకెళ్లినట్లు సమాచారం. సమీపంలోని ఇంటికి గేటు, బాత్రూంకు తలుపు లేకపోవడం.. సదరు ఇంటి యజమానికి ఆ ఏరియాలో కొంత వివాదాస్పదుడిగా పేరు ఉండటంతో ఆ ఇంటిని హత్య కోసం ఎంచుకున్నట్లు సమాచారం. రాత్రి 7.30 గంటల సమయంలో ముగ్గురు పిల్లలను ఇంటికి పంపిన మమత.. హితాక్షిని సదరు ఇంట్లోకి తీసుకెళ్లి గొంతుపై కత్తితో కోసి, కట్టర్‌తో మెడ, గొంతు చుట్టు కత్తిరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హితాక్షి చనిపోగానే హడావుడిగా ఇంటికి తిరిగి వెళ్లిన మమత.. రక్తం మరకలు ఉన్న దుస్తులు మార్చుకొని వాటిని వాషింగ్ మెషీన్లో వేసి, అందరితోపాటు హితాక్షి కోసం వెతికినట్లు తెలిసింది. హితాక్షి మృతదేహం దొరకగానే నవీనతో కలిసి ఆస్పత్రికి వచ్చిన మమత అక్కడ బోరున విలపించడం గమనార్హం. -
పండుగపూట పూరీ గొంతులో ఇరుక్కుని..
రాజాపూర్: పండుగపూట మహబూబ్ నగర్ జిల్లాలో ఓ విషాదం చోటు చేసుకుంది. పూరీ తింటుండగా గొంతులో ఇరుక్కుని ఒక యువకుడు మృతి చెందాడు. రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో జరిగిందీ ఘటన. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన రైతు రాంరెడ్డి దగ్గర ఖానాపూర్ గ్రామానికి చెందిన బ్యాగరి కుమార్ (25), బాండ్ర గిరయ్య పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తొలిఏకాదశి పండుగ కావడంతో ఆదివారం ఉదయం పొలం పనులు చేస్తున్న కుమార్, గిరయ్య తినడానికి.. రైతు రాంరెడ్డి పూరీలు తీసుకువచ్చాడు. ఇద్దరూ పూరీలు తింటుండగా.. కుమార్ గొంతులో ఇరుక్కుపోయింది. పక్కనే ఉన్న గిరయ్య నీళ్లు తెచ్చి తాగించేందుకు ప్రయత్నిస్తుండగానే.. కుమార్ కింద పడిపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు మృతి చెందడంతో.. తల్లి రాజమణి, చెల్లెలు తమకు దిక్కెవరంటూ బోరున విలపించారు. కుమార్ మృతితో ఖానాపూర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. -
గుండెపోటుతో చిన్నారి మృతి
స్టేషన్‌ఘన్‌పూర్: ముక్కుపచ్చలారని చిన్నారి గుండె ఆగి చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన గోవింద్ అశోక్, అనూష దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, ఉపాధి కోసం వీరు హైదరాబాద్‌కు వచ్చారు. అశోక్ నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. రెండో కుమార్తె మిధున (6) శనివారం రాత్రి ఛాతీలో నొప్పి వస్తుందని అంటూ.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే పాప మృతిచెందింది. కాగా, గుండె పోటుతో తమ కుమార్తె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు. -
యువకుడు దారుణ హత్య
కొత్తూరు: బాకీ విషయమై తలెత్తిన వివాదం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ఈ విషాద ఘటన కొత్తూరు మండలం వసప గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసప గ్రామంలో మలగాన శంకర్ అనే వ్యక్తి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. ఇతనికి అదే గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు(19) అనే యువకుడు బాకీ ఉన్నాడు. ఎప్పుడు వీరిద్దరూ కలిసిన బాకీ విషయమై గొడవ జరిగేది. తన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని శంకర్ తరచూ బెదిరించేవాడు. ఈ క్రమంలో మిన్నారావు శనివారం రాత్రి పకోడీ కొనేందుకు శంకర్ షాపు వద్దకు వెళ్లాడు. ఇంతవరకు ఉన్న బాకీ తీర్చాలని శంకర్ అడగడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో కొట్లాటకు దారితీసింది. ఈ క్రమంలో శంకర్ షాపులో ఉన్న సుత్తితో మిన్నారావు తలపై బలంగా కొట్టాడు. దీంతో మిన్నారావు కిందపడిపోయాడు. కొనఊపిరితో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా చాకుతో గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని షాపు ఎదురుగా ఉన్న పీహెచ్ రోడ్డు పక్కన పడేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఆదివారం వేకువజామున రోడ్డు పక్కన మిన్నారావు మృతదేహం కనిపించడంతో అటువైపు వైపు వెళ్లిన స్థానికులు గుర్తించి మృతుడి లుకలాపు బుడ్డు, లక్ష్మిలకు తెలియజేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఒక్కగానొక్క కుమారుడు విగతజీవిగా కనిపించడంతో విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న సీఐ చింతాడ ప్రసాదరావు, ఎస్ఐ ఎండీ ఆమీర్ ఆలీ సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి బుడ్డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆమీర్ ఆలీ తెలిపారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఈ హత్య జరిగి ఉండవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా, మిన్నారావు రోజువారీ కూలీ పనులు చేస్తుండేవాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అందివచ్చిన కొడుకు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. జంట ఆత్మహత్య
కొమరోలు/ప్యాపిలి: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె గ్రామ సమీప రేగలగడ్డ చెరువు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన కట్టెల భారతికి(20)మూడేళ్ల క్రితం అలేబాదు గ్రామానికి చెందిన శివప్రసాద్‌తో వివాహం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి ఏడాదిగా భారతి స్వగ్రామంలో ఉంటోంది.ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కంబగిరి రాముడు(26)తో భారతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం పెద్దలకు తెలియడంతో వారు హెచ్చరించారు. దీంతో ఇరువురూ ఈ నెల 4న ఇంటి నుంచి పారిపోయారు. ఇరువురి కుటుంబ సభ్యులు గ్రామ చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో శనివారం సాయంత్రం రాముడు తన తండ్రి పాపయ్యకు వాట్సాప్ ద్వారా లొకేషన్ పంపించి ఫోన్ స్విచాఫ్ చేశాడు. స్థానిక ఎస్సై నాగరాజు ఆదివారం తెల్లవారుజామున సిబ్బందితో కలిసి లొకేషన్ ఆధారంగా అక్కపల్లె గ్రామానికి చేరుకున్నారు. చుట్టుపక్కల గాలించగా భారతి, రాముడు చెట్టుకు ఉరి వేసుకుని విగత జీవులుగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
రూ.16 లక్షలు కొట్టేసిన టీడీపీ నేత
పెదకూరపాడు: ఎన్ఆర్ఐ మహిళను మోసం చేసి ఓ టీడీపీ నేత రూ.16 లక్షలు కొట్టేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూరప్‌లో ఉండే షేక్ హసీనా అమరావతిలో భూమి కొనుగోలు చేయాలని మధ్యవర్తి గోపిని సంప్రదించింది. దీంతో హసీనా సోదరి జాన్‌బీకి అమరావతి మండలం నెమలికల్లులోని కుప్పా మల్లేశ్వరయ్యకి చెందిన భూమిని గోపి చూపెట్టాడు. ఆ భూమి వివరాలను ఆమె హసీనాకు వాట్సప్‌లో షేర్ చేసింది. భూమి నచ్చడంతో గోపికి రూ.లక్ష బయానా చెల్లించి భూమికి సంబంధించిన డాక్యుమెంట్ జిరాక్స్‌లను తీసుకుంది. భూమి రికార్డులన్నీ బాగానే ఉండటంతో 95 సెంట్ల పొలాన్ని రూ.75.52 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.హసీనా..తన సోదరి జాన్‌బీని పంపి రూ.16 లక్షలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో అగ్రిమెంట్ చేసుకోవడానికి వచ్చిన జాన్‌బీకి అమరావతికి చెందిన టీడీపీ నేత జానీసైదా తాను మల్లేశ్వరయ్య నుంచి భూమి కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్నానని నకిలీ పత్రాలు చూపించి నమ్మించాడు. అదే రూ.75.52 లక్షలకే తాను ఆ భూమిని అమ్ముతానని చెప్పాడు. దీంతో మే 15న రూ.16 లక్షలు జానీ సైదాకు చెల్లించి నెలరోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా జాన్‌బీ పేరు మీద అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలో జూన్ 20న భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి యూరప్ నుంచి గుంటూరుకు షేక్ హసీనా వచ్చింది. భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటానని జానీసైదాను కోరినా అతడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు.దీంతో హసీనాకు అనుమానం వచ్చి భూ యజయాని మల్లేశ్వరయ్యను సంప్రదించింది. అతడు జానీసైదా ఎవరో తనకు తెలియదని, తాను అగ్రిమెంట్ చేయలేదని చెప్పడంతో హసీనా తాను మోసపోయానని గ్రహించి గుంటూరు పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. హసీనా మాట్లాడుతూ తాను కూడా టీడీపీ తరఫున 3 సార్లు పోలింగ్ ఏజెంట్‌గా పనిచేశానని, తనకు జరిగిన మోసాన్ని మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళతానని తెలిపింది. కాగా, ఇసుక ఆక్రమాలకు సంబంధించి జానీ సైదాపై పలు ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో టీడీపీలో ముఖ్యనేత కావడంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. -
ప్రాణం తీసుకున్న బీటెక్ విద్యార్థిని.. కారణం ఆమె స్నేహితులే!
సాక్షి,హైదరాబాద్: చదువు విజ్ఞానాన్ని ఇస్తుంది. చదువు ఎలా బతకాలో నేర్పిస్తుంది. చక్కటి చదువు మంచి నడవడికను నేర్పిస్తుంది. కానీ ఆ యువతి విషయంలో చదివే మరణ శాసనం రాసింది. అవును స్నేహితుల వేధింపులే ఆమెకు శాపంగా మారాయి. బాగా చదవడం లేదంటూ చేసిన ఏగతాళి మాటలు ఆమెను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. తోటి స్నేహితురాలని చూడకుండా మాటలతో వేధించారు. ప్రాణం తీశారు.పైన ఫొటోలో కనిపిస్తున్న ఆ యువతి పేరు నిత్య. ఉండేది జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్‌లో. తన తోటి స్నేహితులు తనని ఎగతాళి చేశారని ఆత్మహత్య చేసుకుంది.. నిత్య హైదరాబాద్‌లోని ఓ ఉమెన్స్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్న నిత్యాను తోటి స్నేహితురాళ్లే సూటిపోటి మాటలతో వేధించారు. స్నేహితుల ఎగతాళితో మనస్థాపం చెందిన నిత్య హైదరాబాద్ నుంచి తన స్వగ్రామమైన జాబితాపూర్‌కు వచ్చింది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్రమత్తమైన స్థానికులు జగిత్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తరలించారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. చదువుల కోసం హైదరాబాద్‌కు పంపిస్తే స్నేహితులే వేధించి చంపేశారంటూ నిత్య కుటుంబసభ్యులు కన్నీరు మన్నీరవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవరో ఏదో అన్నారని క్షణికావేశంలో పెద్ద నిర్ణయం తీసుకున్న నిత్య తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిచ్చింది. -
హెచ్చుమీరిన అసాంఘిక కార్యకలాపాలు.. విచ్చలవిడిగా వ్యభిచారం!
అనంతపురం: నగరంలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరాయి. పేద కుటుంబాల యువతులకు డబ్బు ఆశ చూపి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. నిర్వాహకుల మాటలు నమ్మి వచ్చిన వారిని నరకకూపంలోకి నెడుతున్నారు. ఇందులోకి దిగాక.. తిరిగి వెనక్కి వెళ్లలేక.. కుటుంబ కషాలే గుర్తుకు తెచ్చుకుని, ఇష్టం లేకున్నా మనసు చంపుకుని నిర్వాహకులు ఎలా చెబితే అలా నడచు కోవాల్సి వస్తోంది. చదువు రాకపోవడం, ఎవ రితోనూ బాధలు చెప్పుకోలేని నిస్సహాయ స్థితి, నెలన్నర వ్యవధిలోనే అనేక కేసులు..గతనెల 30న అనంతపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉప్పర లలిత అనే మహిళ నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఓ బాధితురాలిని కాపాడారు. నిర్వాహకురాలిపై కేసు నమోదు చేశారు. ఇదే కాలనీలో జూన్ 19నసాయంత్రం 7:30 గంటల సమయంలో వ్యభి చారం గృహంపై పోలీసులు రైడ్ చేసి నిర్వాహకు రాలు కె. లక్ష్మిని అరెస్ట్ చేసి, ఓ బాధితురాలిని కాపాడారు. అంతకు ముందు కొన్ని రోజులు అంటే జూన్ 12న హౌసింగ్ బోర్డులోనే ఓ వ్యభిచార గృహంపై దాడులు చేశారు.నిర్వాహకులు కుమ్మర లక్ష్మి, బోయ వనితను అరెస్టు చేసి ఇద్దరు బాధితు లను కాపాడారు. అదే రోజు హౌసింగ్ బోర్డులోనే వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న రామాజీ, మేరీ సుజాత, సరస్వతి అలియాస్ సాలమ్మ, విటులు జి. బాబావలి, గార్లదిన్నె లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు. ఓ బాధితురాలిని కాపాడారు. మే 11న హౌసింగ్‌బోర్డు ఎల్బాజీ బస్టాండు సమీపంలో ఒక ఇంట్లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఆకుల నారాయణమ్మ, విటుడు అజయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఇద్దరు బాధితులను రక్షించారు. అనతికా లంలోనే ఇన్ని కేసులు నమోదయ్యాయంటే నగరం లో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.19-25 ఏళ్లలోపు వారే టార్గెట్.. ఒక వైపు పోలీసులు వ్యభిచార స్థావరాలపై దాడులు చేసి విటులు, నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నా ఆక్రమ కార్యకలాపాలు ఎప్పటిలాగానే నడుస్తున్నాయి. హైటెక్ హంగులతో యథేచ్ఛగా వ్యభిచారం. నిర్వహిస్తూ నిర్వాహకులు పోలీసులకు అనుమానం రాకుండా జగ్రత్తపడుతున్నారు. 19-25 ఏళ్ల లోపు ఉన్న యువతులనే ఈ ఊబిలోకి దింపుతున్నారు.నిర్వాహకులు తమ పర్మినెంట్ కస్టమర్లతో ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి అందులోనే యువతుల ఫొటోలు పోస్ట్ చేసి విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తు న్నట్లు తెలిసింది. ఎవరికీ అనుమానం రాకుండా కొందరు భార్యాభర్తలు కలిసి యువతులతో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. కొందరు ప్రముఖుల వద్దకే యువతులను పంపిస్తున్నారు. నగరంలో కొన్ని లాడ్జీలు కేవలం వ్యభిచార కార్యకలాపాల కోసమే నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని నగరవాసులు కోరుతున్నారు. రాత్రి వేళ గస్తీని తీవ్రతరం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ముఠా నేత భార్యతో సభ్యుడు.. వెంటాడిన 40 మంది గ్యాంగ్స్టర్లు..
నాగపూర్: గ్యాంగ్స్టర్లు ప్రధాన పాత్రల్లో కనిపించే సినిమాను తలపించే ఉదంతం మహారాష్ట్రలోని నాగపూర్‌లో చోటుచేసుకుంది... గ్యాంగ్ నాయకుని భార్యతో అదే గ్యాంగ్‌లోని సభ్యుడు అఫైర్ నడిపితే.. ఆ విషయం గ్యాంగ్‌లోని అందరికీ తెలిస్తే.. ఇంతలో ఆ గ్యాంగ్ నాయకుని భార్య అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే... ఈ సీన్లన్నీ నిజంగా జరిగినవే.. మరి పర్యవసానం ఏమయ్యిందనే విషయానికొస్తే..మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇప్పా గ్యాంగ్‌లోని 40 మంది సభ్యులు నగరంతో పాటు, కాంప్టీ శివారు ప్రాంతాల్లో తిరుగుతూ, తమ గ్యాంగులోని సభ్యుడైన అర్షద్ టోపీని అంతమెందించాలని నిర్ణయించుకున్నారు. తమ గ్యాంగ్ లీడర్ భార్య మరణించాక.. వారంతా అర్షద్ టోపీని వెదుకుతున్నారు. అర్షద్ టోపీ ఆ పేరుమోసిన ముఠా నాయకుని భార్యతో సంబంధం పెట్టుకున్నాడు. వారిద్దరూ ఒక బైక్ వెళుతుండగా, ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ విషయం ముఠాలోని సభ్యులందరికీ తెలిసింది. గురువారం అర్షద్ టోపీ ఆ మహిళతో బయటకు వెళ్లినప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.నాగ్‌పూర్ సీనియర్ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అర్షద్ టోపీతో పాటు ఆ మహిళ బైక్‌పై ప్రయాణిస్తుండగా, వారి వాహనం జేసీబీని ఢీకొంది. అర్షద్ టోపీ స్వల్ప గాయాలతో బయటపడగా, ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. కోరాడి థర్మల్ ప్లాంట్‌కు చెందిన పెట్రోలింగ్ వాహనం సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితురాలిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. ఆ ఆసుపత్రి సిబ్బంది ఆమెకు చికిత్స చేసేందుకు నిరాకరించడంతో, ఆమెను కాంప్టీలోని మరొక ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆమెకు చికిత్స అందించేందుకు నిరాకరించారు.ఎట్టకేలకు ఆమెను అర్షద్ టోపీ నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ వార్త తెలియగానే ఇప్పా గ్యాంగ్ సభ్యులు అర్షద్ టోపీని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. తమ ముఠా నాయకుని భార్యను అర్షద్ టోపీని హత్య చేసివుండవచ్చని ఇప్పా గ్యాంగ్ సభ్యులు భావిస్తున్నారని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. కాగా తన ప్రాణానికి ప్రమాదం ఉందని గ్రహించిన అర్షద్ టోపీ పార్డిలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కార్యాలయానికి రక్షణ కోరుతూ వెళ్లాడు. పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న డీఎస్పీ అతనిని కొరాడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ఒక అధికారి తెలిపారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో ఆ మహిళ ప్రమాదంలో మరణించిందా? లేక హత్యకు గురైందా అనేదానిపై ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.ఇది కూడా చదవండి: ‘దళితులంటే అంత చులకనా? ‘జగద్గురువు’పై శశి థరూర్ విశ్లేషణ -
మద్యం మత్తులో భార్యను చంపిన భర్త
రహమత్‌నగర్(హైదరాబాద్): మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే దారుణంగా హింసించి కడతేర్చాడో కిరాతకుడు. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలాజీనగర్‌కు చెందిన నర్సింహ కూలి పనిచేస్తుంటాడు. మొదటి భార్య వదిలి వేయడంతో ఫతేనగర్‌కు చెందిన సోని(26)ని ఏడేళ్లక్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరు రెండు నెలల క్రితం బోరబండ డివిజన్ సాయాబాబానగర్కు వచ్చి అద్దెకు ఉంటున్నారు. సోని హౌస్ కీపింగ్ పని చేస్తుండగా..కుమారుడిని గురుకుల పాఠశాలలో చేరి్పంచారు. మద్యానికి బానిసైన నర్సింహ దొంగతనాలు చేశాడు. ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లలో 16 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో సోనీ ఇటీవల నర్సింహకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లి వచ్చింది. దీంతో కోపం పెంచుకున్న నర్సింహ శుక్రవారం రాత్రి మద్యం తాగి వచ్చి సోనిని తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరింది. అరుపులు, కేకలు విన్న పొరుగింటి వారు 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వగా..బోరబండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకని సోనిని పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. నర్సింహను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. -
కోరుట్ల చిన్నారి కేసులో బిగ్ ట్విస్ట్... సొంత పిన్నే..!
సాక్షి, జగిత్యాల జిల్లా: కోరుట్ల పట్టణం ఆదర్శనగర్ చిన్నారి హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. పాప సొంత పిన్నే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న(శనివారం) సాయంత్రం సమయంలో హితీక్ష అనే ఐదేళ్ల పాప అదృశ్యమవగా.. పాప తల్లీ నవీన పోలీస్ ష్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటిపక్కనే బాత్రూమ్లో విగతజీవిగా పాప మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు.పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు.. పలువురిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లిన పాప తండ్రి రాములు.. హుటాహుటీన అక్కడా నుంచి బయలుదేరారు. పాప సొంత పిన్ని మమతనే హత్య చేసినట్టు ప్రాథమిక సమాచారం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. హితీక్ష కుటుంబసభ్యుల్లో కొందరిని ప్రశ్నించిన పోలీసులు.. కుటుంబ కలహాలే హత్యకు దారితీసినట్లుగా అనుమానిస్తున్నారు. సిసీ టీవీ, సెల్‌ఫోన్ లోకేషన్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 40 మందిని పోలీసులు విచారించారు.శనివారం సాయంత్రం 5 గంటలకు హర్షిత స్కూల్ నుంచి ఇంటికి వచ్చి సమీపంలో పెద్దపులుల ఆటలు సాగుతుండటంతో వాటిని చూసేందుకు చుట్టుపక్కల పిల్లలతో కలిసి వెళ్లింది. కొంత సేపటి తరువాత ఇంటికి వచ్చి నానమ్మతో కాలం గడిపినట్లు సమాచారం. ఆ తరువాత సాయంత్రం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తరువాత కనిపించకుండా పోయింది.సుమారు గంటన్నర పాటు వెతికిన తల్లిదండ్రులు రాము–నవీనలు తమ కూతురు కనిపించడం లేదని 8.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు చుట్టుపక్కల ఇండ్లలో బాలిక కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లోని బాత్రూంలో బాలిక మెడకోసి చంపినట్లుగా గుర్తించారు. బాత్రూం మొత్తం బాలిక రక్తంతో నిండిఉండగా మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.బాలిక మృతదేహం దొరికిన ఇంటికి చెందిన వ్యక్తిని కొడిపెల్లి విజయ్‌గా పోలీసులు గుర్తించారు. విజయ్ భార్య దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. ఆ ఇంట్లో విజయ్‌తో పాటు అతని అన్నదమ్ముల కుమారులు ఉన్నట్లుగా సమాచారం. అయితే విజయ్ ఎక్కడున్నాడని ఆరా తీసిన పోలీసులు సెల్‌ఫోన్ ద్వారా అతనితో మాట్లాడితే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లుగా చెపుతున్నట్లుగా సమాచారం.విజయ్ నర్సంపేటలో ఉంటే బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్రూంలోకి ఎలా వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా బాలిక పెద్దపులులకు భయపడి సమీపంలోని ఇంట్లోని బాత్రూంలోకి వెళ్లగా అక్కడ కాలు జారి నల్లాపై పడితే మెడకు గుచ్చి వదిలించుకునే ప్రయత్నంలో బాలిక మెడ కోసినట్లుగా మారిందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
పురివిప్పిన పాత కక్షలు.. వ్యక్తి దారుణ హత్య
ప్రకాశం: ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం నల్లగుంట్లలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డీఎస్పీ నాగరాజు కథనం మేరకు.. 2022 ఫిబ్రవరి 9వ తేదీన కొర్రప్రోలు సమీపంలో జరిగిన మొద్దు వెంకటేశ్వర్లు హత్య కేసులో గ్రామానికి చెందిన బైరబోయిన వెంకటేశ్వర్లు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తులు కక్షతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గ్రామంలో మొహర్రం వేడుకల సందర్భంగా బాదుల్లా షరగత్ను నిర్వహించారు. ఇదే అదునుగా భావించిన ప్రత్యర్థి వర్గీయులు అర్ధరాత్రి సమయంలో కాపు కాసి వెంకటేశ్వర్లుపై కత్తులతో చేసిన దాడి కిరాతకంగా నరికి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. హతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.గ్రామంలో పోలీస్ పికెట్వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురవడంతో ఆయన కుటుంబం శోక సముద్రంలో మునిగింది. భార్య విజయలక్ష్మి భర్త మృతదేహంపై పడి బోరున విలపించటం అందరినీ కలిచి వేసింది. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో స్పెషల్ పార్టీ పోలీసులతో పికెట్ ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. -
సైకిల్ కొన్న ఆనందం తీరకముందే.. అక్కాతమ్ముడి మృతి
ఆదిలాబాద్ రూరల్: ‘తాతా.. రైతుభరోసా డబ్బులు పడ్డా యా.. మాకు సైకిళ్లు కొనివ్వవా’.. అని ఆ చిన్నారులు అడగ్గానే తాత కాదనలేకపోయాడు. వారి కోరిక మేరకు శుక్ర వారం ఇద్దరికీ చెరో సైకిల్ కొనిచ్చాడు. అయితే మరుసటిరోజే అక్కాతమ్ముడు మృతి చెందిన ఘటన అందరినీ కలిచివేసింది. మావల ఎస్సై ముజాహిద్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన లంక స్వామి–గీత దంపతుల కు కుమారుడు విదాత్ (10), కుమార్తె వినూత్న (11) ఉన్నారు. వీరు ఓ ప్రైవేట్ పాఠశాలలో 5వ, 6వ తరగతి చదువుతున్నారు. రైతు భరోసా డబ్బులు రావడంతో స్వా మి తండ్రి రాజేశ్వర్ శుక్రవారం మనుమడు, మను మరాలి కి కొత్త సైకిళ్లను కొనిచ్చాడు. ఆ ఆనందంలో చిన్నారులిద్దరూ శనివారం పాఠశాలకు వెళ్లలేదు. కుటుంబ సభ్యులంతా ఉదయం 10 గంటల ప్రాంతంలో పొలం పనులకు వెళ్లారు. అరగంట తర్వాత ఇద్దరు చిన్నారులు కూడా చెరో సైకిల్‌పై పొలానికి బయలుదేరారు. మార్గమధ్యలో బంజారాహిల్స్ ప్రాంతంలో రోడ్డుకు ఆనుకుని ఉ న్న నీటి కుంటలో ప్రమాదవశాత్తు వినూత్న సైకిల్‌తో సహా పడింది. ఆమెను రక్షించే క్రమంలో తమ్ముడు విదాత్ కూడా అందులో పడి ఊపిరాడక మృతి చెందారు. మధ్యా హ్నం అయినా పిల్లలు రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా, నీటికుంట సమీపంలో సైకిల్ కనిపించింది. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. -
రెండేళ్లు ఎస్సైగా ట్రైనింగ్.. కట్ చేస్తే కటకటాల్లోకి!
రెండేళ్లు పోలీస్ అకాడమీలో ఎస్సైగా శిక్షణ తీసుకుంది. అకాడమీకి వచ్చే ఉన్నతాధికారులతో సరదాగా మాటలు కలిపింది. డైనమిక్ యంగ్ ఆఫీసర్ అంటూ వాళ్లు కూడా ఆమెను అభినందించేవాళ్లు. అంతేకాదు.. యూనిఫారమ్‌లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసుకుని సంబురపడిపోయేది. కట్ చేస్తే.. ఇప్పుడు కటకటాల్లో ఊచలు లెక్కపెడుతోంది. జైపూర్‌లోని రాజస్థాన్ పోలీస్ అకాడమీ(RPA)లో ఎస్ఐగా రెండేళ్లు శిక్షణ పొందిన మోనా అలియాస్ మూలీ దేవి(Mooli Devi) ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మోనా బుగాలియా 2021లో ఎస్సై ఎగ్జామ్స్ రాసింది. క్వాలిఫై కాలేకపోయింది. దీంతో దొడ్డిదోవ ఎంచుకుంది. మూలీ దేవి అనే పేరుతో ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు సృష్టించి అకాడమీలో ప్రవేశించింది. స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్‌గా తనను తాను అందరికి పరిచయం చేసుకుంది. అలా అకాడమీ పెద్దలనే బోల్తా కొట్టించి.. రెండేళ్లపాటు అధికారికంగా శిక్షణ పొందింది. ఈ రెండేళ్లలో.. అక్కడికి వచ్చే ఉన్నతాధికారులతో టెన్నిస్ ఆడుతూ ఫొటోలు దిగడమే కాకుండా.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రైనింగ్ గ్రూప్‌లలో యాక్టివ్ మెంబర్‌గా ఉంటూ వచ్చింది. యూనిఫామ్‌లో రీల్స్ చేయడమే కాకుండా.. మోటివేషనల్ స్పీచ్‌లు ఇచ్చేది. అయితే.. ఆమె ఎప్పుడూ ప్రధాన గేట్ ద్వారా కాకుండా.. అధికారుల కుటుంబాలకు ప్రత్యేకంగా ఉన్న గేట్ ద్వారా అకాడమీకి ప్రవేశించేది. ఈ వీఐపీ వేషాలపై 2023లో కొంతమంది ట్రైనీలకు అనుమానం వచ్చింది. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లగా.. విచారణలో అసలు విషయం బయటపడింది. రెండేళ్లపాటు పరారీలో ఉన్న ఆమెను.. ఇవాళ(జూలై 5న) సికర్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఆమె నుంచి మూడు యూనిఫామ్లతో పాటు నకిలీ గుర్తింపు పత్రాలు, పోలీస్ అకాడమీకి సంబంధించిన పరీక్షా పత్రాలు స్వాధీనపర్చుకున్నారు. మోనా బుగాలియా స్వస్థలం నాగౌర్ జిల్లా అని, ఆమె తండ్రి లారీ డ్రైవర్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుగా తన గౌరవాన్ని పెంచుకునేందుకు, తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకునేందుకే తాను ఇలా నాటకం ఆడాల్సి వచ్చిందని ఆమె అంటోంది. మరోవైపు ఈ ఘటనతో పోలీస్ అకాడమీ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా ఎలా శిక్షణకు అనుమతించారని మండిపడుతున్నారు పలువురు. అయితే అత్యంత భద్రత కలిగిన అకాడమీలో ఇలా నకిలీ పత్రాలతో ప్రవేశించడం అంత సులువైన పని కాదని.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని అధికారులు అంటున్నారు. -
మరో ఘోరం.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను..!
పాత పరిచయాలు, వివాహేతర సంబంధాలతో భర్తలను కడతేరుస్తున్న భార్యల ఉదంతాలు సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతుండడం చూస్తున్నదే. పెళ్లై నెల తిరగకుండానే నవవధువులు సైతం ఈ జాబితాలో చేరిపోతున్నారు. తాజాగా తెలంగాణలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. క్రైమ్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను హత్య చేసింది ఓ భార్య. ఆపై అత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది దొరికిపోయింది. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలకు ప్రయత్నించగా.. బంధువుల జోక్యంతో ఈ వ్యవహారం బయటపడింది. బాచుపల్లిలో నివాసం ఉంటున్న అంజిలప్ప ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని భార్య రాధ కన్నీరు మున్నీరు అయ్యింది. ఆపై స్వగ్రామం నారాయణపేటకు మృతదేహాన్ని తీసుకెళ్లింది. అయితే గొంతుపై ఉన్న మరకలను చూసి బంధువులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఆమెను గట్టిగా విచారించగా.. ఆమె అసలు విషయం చెప్పింది. గత కొంతకాలంగా రాధ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోంది. అయితే అలాంటివి వద్దని, అతనితో ఫోన్ మాట్లాడొద్దని భర్త ఆమెను మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న రాధ.. మద్యం మత్తులో ఉన్న భర్త గొంతును నులిమి హత్య చేసింది. పోలీసుల విచారణలో అంజిలప్పను తానే హత్య చేసినట్లు రాధ అంగీకరించింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
చెల్లెలితో మాట్లాడుతున్నాడని హత్య
కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి.వేమవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అనుమానంతో అదే గ్రామానికి చెందిన మరో యువకుడిని హత్య చేసి జగనన్న లే అవుట్లో కప్పి పెట్టేశారు. సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను సీఐ ఎ.కృష్ణభగవాన్ వివరించారు. పి.వేమవరానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన నొక్కు కిరణ్కార్తిక్ (19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆ యువతి అన్నయ్య నూతలకట్టు కృష్ణ ప్రసాద్ అడపాదడపా గ్రామానికి వచ్చినపుడు తన చెల్లి ఎవరితోనో మాట్లాడుతున్న విషయం తెలుసుకుని కార్తిక్‌ను మందలించాడు. తన చెల్లెలని బాగా చదివించాలనుకుంటున్నానని ఈ వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించాడు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో గత నెల 24వ తేదీ రాత్రి కృష్ణ ప్రసాద్ తన స్నేహితుడు దూలపల్లి వినోద్ సాయంతో కార్తిక్‌ను పిలిచి పని ఉంది మాట్లాడదాం రమ్మని తీసుకువెళ్లారు. అతడిని అచ్చంపేట శివారు బ్రహ్మానందపురంలోని జగనన్న లేఅవుట్‌కు తీసుకువెళ్లి అతడితో ఘర్షణపడి కొట్టి హత్య చేసి గోతిలో కప్పిపెట్టేశారు. అనంతరం కృష్ణప్రసాద్ హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా గతనెల 24వ తేదీనే ఉప్పాడలోని వెల్డింగ్ దుకాణంలో పనిచేస్తున్న కార్తిక్, అతని తండ్రి వెంకటరమణల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. కూలీలకు సొమ్ములిచ్చే విషయంలో తేడా రావడంతో కార్తిక్‌ను అతని తండ్రి మందలించాడు. దీంతో కార్తిక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ ఆ రోజు రాత్రి అతడు ఇంటికి రాకపోవడం, రాత్రి పది గంటల తరువాత ఫోన్ పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి ఇళ్లలో గాలించారు. ఏ ప్రయత్నమూ ఫలించకపోవడంతో 27వ తేదీన తండ్రి వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు విషయంలో తేడా రావడంతో మందలించడంతో తమ కుమారుడు అలిగి వెళ్లి ఉంటాడని తాము భావించామని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీఐ ఎ కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కృష్ణప్రసాద్ తన స్నేహితుడు వినోద్‌కు తరుచూ పోన్ చేసి ఇక్కడి పరిస్థితిని తెలుసుకునేవాడు. పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని తెలిసి, వారు తమను గుర్తిస్తే కేసు తీవ్రంగా ఉంటుందని భావించి గురువారం రాత్రి కృష్ణప్రసాద్, వినోద్ పోలీసులకు లొంగిపోయినట్లు సీఐ వివరించారు. ముద్దుగా చదివించుకుంటున్న తన చెల్లిని మోసం చేస్తాడనే అనుమానంతో హత్య చేసినట్లు కృష్ణప్రసాద్ చెప్పాడని సీఐ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిందితులను ఘటనా ప్రదేశానికి తీసుకువెళ్లి మండల మెజిస్ట్రేట్, తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు జి.నాగేశ్వరరావు, వై.ముసలయ్య, ఎం.పృథ్వి, సీహెచ్ ప్రసాద్, బాబీ, రాజేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అదృశ్యం కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రౌడీషిటర్‌తో కౌన్సిలర్ వివాహేతర సంబంధం
తమిళనాడు: వీసీకే మహిళా కౌన్సిలర్ దారుణ హత్యకు గురైంది. రౌడీషిటర్‌తో ఇన్‌స్ట్రాగామ్‌లో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడంతో భర్త, పిల్లలను వదిలి రౌడీషిటర్‌తో సహజీవనం కొనసాగించడానికి సిద్ధమైన మహిళా కౌన్సిలర్‌ను భర్త దారుణంగా హతమా ర్చాడు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్ పెద్దకాలనీకి చెందిన కోమది(28) తిరునిండ్రవూర్ 26వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్‌గా పని చేస్తున్నారు. ఈమె భర్త స్టీఫెన్‌రాజ్(38) తిరునిండ్రవూర్ పట్టణ వీసీకే కార్యదర్శిగా కొనసాగు తున్నారు. వీరిద్దరు 2015లో ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు. కాగా స్టీఫెన్‌రాజ్, భార్య కోమది, అతని సోదరుడు అజిత్, తల్లిదండ్రులు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కోమదికి తిరునిండ్రవూర్ రామదాస్పురం ప్రాంతానికి చెందిన రౌడీషిటర్ మోసస్దేవతో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే రెండు నెలల క్రితం మోసస్‌దేవాతో కోమది సన్నిహితంగా ఉన్న ఫొటోలను అజిత్ సెల్‌ఫోన్‌కు పంపినట్టు తెలిసింది. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు మొదలయ్యా యి. ఈ విషయమై కోమదిని భర్త స్టీఫెన్‌రాజ్ ప లుమార్లు మందలించినా మరింత సన్నిహితంగా ఉండడం ప్రారంభించింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి ఆటోలో కోమ ది బయలుదేరింది. అజిత్, స్టీఫెన్‌రాజ్ ఆమెను వెంబడించారు. కోమది ఆవడి సమీపంలోని నడుకుత్తగై ప్రాంతంలో మోసస్‌దేవాతో సన్నిహితంగా ఉన్నట్టు స్టీఫెన్‌రాజ్ గుర్తించి ఆగ్రహించి కత్తితో కోమదిని దారుణంగా నరికి పరారయ్యారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసి రౌడీ షీటర్ పరారయ్యాడు. విషయం తెలిసి అసిస్టెంట్ కమిషనర్ గిరి, పోలీసులు మృతదేహాన్ని ప్రభు త్వాస్పత్రికి తరలించారు. స్టీఫెన్‌రాజ్, అజిత్, తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఇంటికి వెళితే.. పరువు పోతుంది..!
నారాయణపేట రూరల్: ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు.. కట్టుకున్న భర్త గొంతునులిమి భార్య హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట మండలం కోటకొండకు చెందిన కంపిలి అంజిలప్ప (32)కు పదేళ్ల క్రితం ధన్వాడ మండలం రామకిష్టయ్యపల్లికి చెందిన రాధతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు కోసం రెండు నెలల క్రితం ముంబైకి వలస వెళ్లి కూలి పనులు చేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న ధన్వాడ మండలానికి చెందిన ఓ యువకుడితో రాధకు పరిచయం ఉండేది. తనకంటే చిన్నవాడైనా అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త.. భార్యను మందలించాడు. ఆపై స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో తాండూరుకు చేరుకున్నాక ఇంటికి వెళితే.. పరువు పోతుందని, వేరేచోట పని చూసుకుందామని రాధ పట్టుబట్టడంతో హైదరాబాద్ వెళ్లారు. బాచుపల్లిలోని ఓ అపార్ట్మెంట్ వద్ద పనిచేస్తూ గుడిసెలో ఉంటున్నారు. అయితే రాధ తిరిగి ఆ యువకుడితో మాట్లాడటం అంజిలప్ప గమనించాడు. దీంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. హత్యచేసి.. పక్కింట్లో నిద్రించి ఈ క్రమంలోనే గత నెల 23న రాత్రి అంజిలప్ప మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తా గిన మైకంలో భర్త పడుకొని ఉండగా.. భార్య గొంతు నులిమి హత్య చేసింది. ఏమీ తెలియ నట్టు పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్లి భర్త తనను ఇబ్బంది పెడు తున్నాడని చెప్పి అక్కడే పడుకుంది. తెల్లవారుజామున లేచి గుడిసెలోకి వెళ్లి భర్త చనిపోయాడని రోదిస్తూ మృతదేహాన్ని అంబులెన్స్‌లో కోటకొండకు తీసుకొచ్చింది. కుటుంబ సభ్యుల అనుమానంతో.. మృతుడి సోదరుడు, ఇతర కుటుంబసభ్యులు అంజిలప్ప మృతిపై అనుమానాలు ఉన్నాయని అదేరోజు నారాయణపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దీంతో వారు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో రాజకీయ ఒత్తిడులు ఎక్కువ కావడంతో స్థానిక పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాచుపల్లి పీఎస్‌కు కేసును బదిలీ చేశా రు. సైబరాబాద్ కమిషనర్, డీసీపీ ఆదేశాలతో బాచుపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. గతనెల 26న కుటుంబసభ్యులను విచారించారు. రాధను అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించడంతో కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలు పాలు కావడంతో ఇద్దరు పిల్లలు అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఘటనపై బాచుపల్లి సీఐ ఉపేందర్ మాట్లాడుతూ.. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే హత్యకు సంబంధించిన విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. సీసీ కెమెరాలు పరిశీలిచంగా, హత్య ఘటనలో ఒక్కరే ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని సీఐ చెప్పారు. -
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ విద్యార్థిని..
శాయంపేట/మద్దూరు: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ విద్యార్థిని.. గురుకుల పాఠశాలలో సీటు రాలే దని మరో విద్యార్థిని వేర్వేరుచోట్ల ఆత్మహత్య చేసుకున్నారు. హనుమకొండ, నారాయణపేట జిల్లా ల్లో చోటుచేసుకున్న ఘటనల వివ రాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రావుల ప్రత్యూష (24) బీటెక్ పూర్తిచేసి రెండేళ్లుగా ఉద్యోగవేటలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల ఎంట్రన్స్‌లు రాయగా, కొన్ని మార్కుల తేడాతో ఫలితం రాలేదు. దీంతో ప్రత్యూష మనస్తాపానికి గురై శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో దూలానికి ఉరివేసుకుంది. కొద్దిసేపటికి అమ్మమ్మ లక్ష్మి ఇంట్లోకి వచ్చి చూసి.. భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే ప్రత్యూష మృతి చెందింది. తల్లిదండ్రులు కూలీలు. ప్రత్యూష తండ్రి రావుల రమేశ్ ఫిర్యా దుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జక్కుల పరమేశ్ తెలిపారు. గురుకులంలో సీటు రాలేదని నారాయణపేట జిల్లా దమ్‌గాన్‌పూర్‌కు చెందిన నర్సప్ప, లక్ష్మి దంపతులకు కుమార్తె, కుమారు డు ఉన్నారు. నర్సప్ప బతుకుదెరువుకు హైదరాబాద్ వెళ్లి కూలీ పనిచేస్తుండగా, లక్ష్మి ఊళ్లో వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంది. కుమార్తె మనీషా (14) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగ తి పూర్తి చేసుకొని మద్దూరు బాలికల పాఠశాలలో 9వ తరగతి అడ్మిషన్ పొందింది. గురుకుల పాఠశాల లో సీటు కోసం ఎంట్రన్స్ రాసింది. పరిగి గురుకుల పాఠశాలలో సీటు వచ్చిందని టీసీ తీసుకొని వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక అక్కడ సీటు రాలేదని తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన మనీషా 2వ తేదీ రాత్రి పురుగుమందు తాగింది. తల్లి గమనించి మ హబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించింది. అక్కడే చికిత్సపొందు తూ మనీషా గురువారం అర్ధరాత్రి మృతి చెందింది. -
పాఠశాలకు వెళ్లిన తొలిరోజే.. చిన్నారి ప్రాణం తీసిన స్కూల్ బస్సు
సాక్షి,నంద్యాల జిల్లా: తల్లిదండ్రులారా.. తస్మాత్ జాగ్రత్త! మీ పిల్లల భద్రత మీ చేతుల్లోనే ఉంది. బస్సులో స్కూల్‌కు వెళ్లే సమయంలో, వచ్చే సమయంలో ప్రతి క్షణం అప్రమత్తత అవసరం. ఏ మాత్రం ఏమరు పాటుగా ఉన్న నిండు ప్రాణాల్ని కోల్పోవాల్సి వస్తుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన తొలిరోజే చిన్నారిని స్కూల్ బస్సు ప్రాణం తీసింది. పోలీసుల వివరాల మేరకు.. ఆళ్లగడ్డలో ఎంవీ నగర్‌కు చెందిన శ్రీధర్, వనజ దంపతుల కుమార్తె హరిప్రియ(5). ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. ఈక్రమంలో ఇవాళే తొలి రోజు స్కూల్‌కు వెళ్లింది. అనంతరం స్కూల్ బస్సులో ఇంటికి వచ్చింది.అయితే చిన్నారి బస్సు దిగి ముందు నుంచి ఇంటి వైపుకు వెళ్లే ప్రయత్నం చేసింది. అప్పుడే ఘోరం జరిగింది. బస్సు ముందు నుంచి హరిప్రియ ఇంటికి వెళుతున్న విషయాన్ని పట్టించుకోలేదు. ముందుకు పోనిచ్చాడు. దీంతో బాలిక బస్సు చకక్రాల కిందపడి ప్రాణాలు కోల్పోయింది. బాలిక ప్రాణాలు కోల్పోవడంతో ఎంవీ నగర్లో విషాదం నెలకొంది. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కొత్త మలుపు తిరిగిన అత్యాచారం కేసు
పూణేలో ఇటీవల జరిగిన ‘అత్యాచార ఘటన’ కొత్త మలుపు తిరిగింది. ఓ డెలివరీ బాయ్ తనపై పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారానికి ఒడిగట్టాడని, మళ్లీ వస్తా అని మెసేజ్ కూడా ఫోన్లో టైప్ చేశాడని అని యువతి చెప్పిందంతా అంతా తూచ్ అని పోలీసులు తేల్చేశారు. ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి డెలివరీ బాయ్ వచ్చి అత్యాచారానికి పాల్పడలేదని, ఇది తన ఫ్రెండ్‌తో కలిసి ఆ 22 ఏళ్ల యువతి ఆడిన కట్టుకథ అని పోలీసులు స్పష్టం చేశారు. పూణేలో 22 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ పై జరిగిన అత్యాచారం కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడి వ్యక్తి అపరిచితుడు కాదని, ఆ మహిళకు తెలిసిన వ్యక్తే అని పోలీసులు వెల్లడించారు. అత్యాచారం అనంతరం నిందితుడు తన ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడని యువతి పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే. దాన్ని సాక్ష్యంగా చూపించేందుకు ఆమె సెల్ఫీ స్వయంగా తీసుకుందని తేలింది. నిందితుడు తన ఫోన్లో మళ్లీ వస్తా అని మెసేజ్ టైప్ చేసి ఉంచడం కూడా కల్పితమని పోలీసులు బట్టబయలు చేశారు.పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ శుక్రవారం( జూలై 4వ తేదీ) మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఆ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి ఆమెకు రెండేళ్లుగా పరిచయం ఉంది. ఆమెకు అతను కొత్త వ్యక్తి కాదు. ఆ సెల్ఫీని సైతం ఆమె స్వయంగా తీసుకుంది. ఐ విల్ బీ బ్యాక్( నేను మళ్లీ వస్తా) అనే మెసేజ్‌ను కూడా ఆమె టైప్ చేసింది’ అని చెప్పారు.మరి ఆరోపణలు ఎందుకు చేసింది..? డెలివరీ బాయ్ పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని ఆమెకు ఎందుకు చెప్పిందనే దానిపైనే ఇప్పుడు పూర్తి దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇంకా విచారణ దశలోనే ఉందని, అయితే యువతి మానసిక స్థితి సరిగా లేనట్లు ఉందన్నారు. ఇంకా దర్యాప్తు జరుగుతుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ఇంతకీ యువతి ఫిర్యాదు ఏమిటంటే..!పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి సదరు యువతి నివాసం ఉంటోంది. ఆమెకు వచ్చిన పార్సిల్‌ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడని. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడని పేర్కొంది. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లినట్లు, ఆ తర్వాత డెలివరీ బాయ్ తనపై పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని తెలిపింది. ఇదే విషయాన్ని పోలీసులకు, కుటుంబ సభ్యులకు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. -
కాకినాడ జిల్లాలో దారుణం.. ప్రేమించాడని చంపేసి పూడ్చిపెట్టారు!
కాకినాడ: జిల్లాలో దారుణం వెలుగుచూసింది. సామర్లకోట మండలం పి. వేమవరంలో ఓ యువకుడ్ని దారుణంగా హత్య చేసి పూడ్చి పెట్టారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో నిందితులు పోలీసులకు లొంగిపోయారు. విషయంలోకి వెళ్తే.. కిరణ్ కార్తీక్ అనే యువకుడు.. ఓ యువతిని ప్రేమించాడు. ఇది తెలుసుకున్న యువతి సోదరుడు మరో స్నేహితుడితో కలిసి కిరణ్ కార్తీక్‌ను హత్య చేయడానికి ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే 10 రోజుల కిందటే కిరణ్ కార్తీక్ హత్య చేపి శవాన్ని పాతిపెట్టాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి నిందితులు కృష్ణప్రసాద్, వినోద్‌లు పోలీసులకు లొంగిపోయారు. -
20 మంది గాళ్‌ఫ్రెండ్స్, ఇద్దరు భార్యలు..
ఇలా ఎలారా.. అని అవాక్కయ్యారా? ఒక్కరితోనే వేగలేక చస్తున్నాం, ఇంత మందిని ఎలా మేనేజ్ చేశావ్ బ్రో అంటూ బుర్ర బద్దలు కొట్టుకోకండి. పాపం ఎప్పటికైనా పండుతుంది. తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. నౌషాద్ త్యాగి విషయంలోనూ అదే జరిగింది. మహిళల జీవితాలతో చెలగాటమాడిన ఈ కేటుగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.ఎవరీ నౌషద్?ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని చార్తవాల్ ప్రాంతంలో జూలై 1న నౌషాద్ త్యాగిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు ఉద్యోగం చేస్తున్నట్టు నమ్మించి పలువురు మహిళలను మోసం చేయడంతో పోలీసులు అతడికి బేడీలు వేశారు. యూపీ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG)లో కానిస్టేబుల్‌గా నటిస్తూ, మారు పేర్లతో కొన్నేళ్లుగా వంచనకు పాల్పడినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. త్యాగికి ఇద్దరు భార్యలు, 20 మంది స్నేహితురాళ్లు ఉన్నారని.. వీరిలో 10 మందితో శారీరక సంబంధాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.వారే త్యాగి టార్గెట్..వితంతువులు, భర్తల నుంచి విడిపోయిన మహిళలను లక్ష్యంగా చేసుకుని త్యాగి మోసాలకు పాల్పడ్డాడు. తాను లక్ష్యంగా చేసుకున్న మహిళ మతం ఆధారంగా తన వేషం మారుస్తాడు. హిందూ మహిళలకు రాహుల్ లేదా రికీగా, ముస్లిం మహిళలకు నౌషాద్‌గా పరిచయం చేసుకుని దగ్గరవుతాడు. తర్వాత వారి నుంచి డబ్బు, బంగారం, ఖరీదైన వస్తువులు దోచుకుని ఉడాయిస్తాడు. ముజఫర్‌నగర్‌లో మొదటి భార్య, ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో అతడి రెండవ భార్య ఉంటారు. వీరిద్దరికీ తెలియకుండా త్యాగి వంచన పర్వం కొనసాగించాడు. మొదటి భార్య అతడి కంటే 23 సంవత్సరాలు పెద్ద.నాలుగు రాష్ట్రాల్లో మోసాలుయూపీతో పాటు ఢిల్లీ, మేఘాలయ, అసోం రాష్ట్రాల్లో ఆరేళ్లుగా నౌషాద్ త్యాగి మోసాలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఘజియాబాద్, బులంద్‌షహర్, మధుర, సంభాల్, ముజఫర్‌నగర్ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో అతడు వంచన పర్వం సాగించినట్టు తెలిపారు. అంతేకాదు పోలీసు యూనిఫాం ధరించి జనాన్ని బెదిరించి డబ్బులు గుంజేవాడని చెప్పారు. సంబంధిత సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. తన మోసపూరిత చర్యలకు ఉపయోగించిన యూనిఫామ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దొరికాడిలా..ముజఫర్ నగర్లో దుకాణం నడుపుతున్న ఒక వితంతువును త్యాగి వలలో వేసుకోవడంతో ఈ దురాగతం బయటపడింది. తనను రాహుల్ త్యాగిగా పరిచయం చేసుకుని, ఆమె దుకాణానికి తరచుగా వెళ్లేవాడు. ఆమెపై ప్రేమ నటించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2 లక్షల 75 వేల రూపాయలు గుంజాడు. తాకట్టులో ఉన్న 3 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను విడిపించేందుకు ఆమెను ఒప్పించాడు. అయితే పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అతడు తప్పించుకోవడానికి చూసేవాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బండారం బయట పడింది. అప్పటికే విషయం అర్థమై కొత్త 'తోడు' కోసం వెతుక్కునే ప్రయత్నంలో ఉండగా పోలీసులు త్యాగి ఆట కట్టించారు. అతడి మొబైల్ ఫోన్లో అనేక మంది మహిళల అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. మారు పేర్లతో అతడు తయారు చేయించిన నేమ్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు.చదవండి: ఎంత నరకం అనుభవించాడో..ఫ్రెండ్ యూనిఫాంతో మోసాలు..పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న స్నేహితుడితో ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ప్రాంతంలో నౌషద్ త్యాగి నివసించేవాడు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో అతడి ఫ్రెండ్ మధ్యప్రదేశ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అతడు అనుకోకుండా యూనిఫాం, ఇతర వస్తువులను త్యాగి వద్ద వదిలి వెళ్లాడు. వీటితో నౌషద్ మోసాలకు తెర తీశాడు. ముజఫర్‌నగర్‌కు మకాం మార్చి.. తనకు తాను పోలీసు కానిస్టేబుల్‌గా చెప్పుకుంటూ చెలరేగిపోయాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. -
ఉదయం పెళ్లి.. సాయంత్రం ప్రియుడితో నవ వధువు జంప్
అన్నానగర్: పెళ్లి రోజున బ్యూటీ సెలూన్‌కు వెళుతున్నట్లు చెప్పి ప్రియుడితో నవ వధువు పరారైంది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పెళ్లింట ఇలా వధువు వెళ్లిపోయిందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం..పెరంబూర్‌లోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన అర్చనకు మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయకుమార్‌తో వివాహం నిశ్చయం అయ్యింది. ఈ మేరకు బుధవారం ఉదయం బెసెంట్నగర్ ఆలయంలో వారి వివాహ వేడుక జరిగింది. తర్వాత వధూవరులు ఇంటికి వెళ్లారు. సాయంత్రం వివాహ విందుకు ఏర్పాట్లలో రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. అర్చన తన తల్లిదండ్రులకు రిసెప్షన్ కోసం బ్యూటీ సెలూన్‌కు వెళుతున్నానని చెప్పి, తన కొంతమంది స్నేహితులతో వెళ్లింది.అనంతరం, అర్చన ఇంటికి తిరిగి రాలేదు. రిసెప్షన్ సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు అర్చన సెల్‌ఫోన్‌కు ఫోన్ చేశారు. కానీ అది స్విచ్ ఆఫ్‌లో ఉంది. ఆమెతోపాటు వచ్చిన ఆమె స్నేహితులు కూడా అదృశ్యమయ్యారు. ఆమె తల్లిదండ్రులు విచారించగా, అర్చన ఇప్పటికే ఎరుకంజేరికి చెందిన ఒక యువకుడిని ప్రేమించిందని, పెళ్లి తర్వాత అతనిని వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసిందని వారికి తెలిసింది.ఈ క్రమంలో బ్యూటీ సెలూన్‌కు వెళ్లే నెపంతో ఆమె తన ప్రియుడితో పారిపోయిందని కూడా తేలింది. వధువు అదృశ్యం కావడంతో వరుడు, అతని బంధువులు ఒక్కసారిగా షాకై దిగ్భ్రాంతి చెందారు. దీంతో వివాహ రిసెప్షన్ రద్దు చేసుకున్నారు. ఈ విషయమై అర్చన తల్లి తిరు.వి.కె.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన నవ వధువు, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. -
యువతిపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడికి యత్నం
నాయుడుపేట టౌన్: తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని అగ్రహరపేట అరుంధతీయ కాలనీకి చెందిన ఓ యువతిపై అదే ప్రాంతానికి చెందిన మొండెం ఉదయ్ అనే టీడీపీ కార్యకర్త లైంగిక దాడికి యత్నించాడు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అగ్రహరపేటకు చెందిన యువతి బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఉదయ్ ఇంట్లోకి ప్రవేశించి లైంగికదాడికి యత్నించాడు. ప్రతిఘటించిన యువతి గట్టిగా కేకలు వేసింది. స్థానికులు చేరుకునేసరికి ఉదయ్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత యువతి తండ్రి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మన్నవ సర్పంచ్‌పై హత్యాయత్నం
సాక్షి టాస్క్‌ఫోర్స్/సాక్షి, అమరావతి: మంత్రి లోకేశ్ మాట్లాడితే రెడ్ బుక్ అంటారు. అంటే ఎర్ర పుస్తకం. అందుకు తగ్గట్టే వారి అనుచరులు ప్రత్యర్థుల రక్తం కళ్ల చూస్తున్నారు. ఎదురు నిలిచిన వారిపై దాడులు చేస్తూ గ్రామాలను ఎరుపు ఎక్కిస్తున్నారు. ఇందుకు ప్రబల తార్కాణం పొన్నూరు మండలం మన్నవలో జరిగిన సంఘటనే. గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశ్నించే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇందుకు మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పాశవిక దాడే నిదర్శనం. వివరాలివీ.. మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో తన ట్రాక్టర్‌కు మరమ్మతులు చేయించే క్రమంలో కట్టెంపూడి గ్రామ సమీపంలోని ఓ టీస్టాల్కు వెళ్లి టీ తాగేందుకు కూర్చున్నారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. తీవ్రగాయాలతో సర్పంచ్ కిందపడిపోయినప్పటికీ ఆయన్ను చంపడమే లక్ష్యంగా ఎల్లోగ్యాంగ్ మరింత గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఘటన జరిగిన కొద్దిసేపటికి స్టాల్‌లోని సీసీ ఫుటేజీ బయటకు వచ్చింది. ఈ దాడికి మధ్యాహ్నం నుంచి రెక్కీ నిర్వహించినట్లు దానిద్వారా తెలుస్తోంది. ఇక ముగ్గురు వ్యక్తులు ఇనుపరాడ్లతో ఒకేసారి దాడిచేస్తున్న దృశ్యాలతో ఆ ప్రదేశం రణభూమిని తలపించింది. స్థానికులు 108 సహాయంతో పొన్నూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి బాధితుడిని తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు పంపారు. టీడీపీ అక్రమాలను అడ్డుకుంటున్నందుకే.. మన్నవ గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశి్నంచే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి గ్రామ టీడీపీ నాయకులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. దీంతో గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు టీడీపీ నేతల అక్రమాలను అడ్డుకుంటున్నారు. జిల్లా అధికారులకు ఆయన ఫిర్యాదు చేయడంతోపాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాలను ప్రశ్నిస్తున్నారు. దీంతో వారు కక్షగట్టి దాడికి తెగబడినట్లు తెలిసింది. శాంతిభద్రతలు క్షీణించాయి: అంబటి ఈ ఘటనపై మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని ఆరోపించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం.. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో సీఎం చంద్రబాబు చేస్తున్న రాక్షస పాలనలో ప్రజాప్రతినిధులకు, సామాన్యులకూ, ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలు, నాయకులకు రక్షణలేకుండా పోయిందని ఒక ప్రకటనలో తెలిపారు. నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పార్టీ తోడుగా నిలుస్తుందన్నారు. సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి చేస్తున్న టీడీపీ మూకలు(ఇన్సెట్) నాగమల్లేశ్వరరావు(ఫైల్) -
ఆ ఇద్దరూ కరుడుగట్టిన ఉగ్రవాదులు
సాక్షి, రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని కొత్తపల్లెలో పోలీసులు అరెస్టు చేసిన అబూబకర్ సిద్దిఖ్ అలియాస్ అమానుల్లా, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్‌లు కరుడుగట్టిన ఉగ్రవాదులని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. తమిళనాడుకు చెందిన వీరు టెక్నికల్‌గా నిపుణులని, పక్కాగా పథకం వేసి బాంబు పేలుళ్లకు పాల్పడడంలో సిద్ధహస్తులని పేర్కొన్నారు. పలు కేసుల్లో నిందితులైన వీరిని జూన్ 30న తమిళనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.రాయచోటి పోలీసు పరేడ్ మైదానం వద్ద గురువారం జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుతో కలిసి మీడియా సమావేశంలో డీఐజీ కోయ ప్రవీణ్ వివరాలు వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే...‘‘అబూ బకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీ 1999 నుంచి పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. సుమారు 20 ఏళ్లుగా రాయచోటిలో ఉంటున్నారు. తప్పుడు పేర్లతో గుర్తింపు కార్డులు పొందారు. అబూ బకర్ సిద్దిఖ్ తమిళనాడు నాగూరు, మైలాడ్, చెన్నైలోని చింతాద్రిపేట, మధురై తిరుమంగళం, వేలూరులో జరిగిన పలు ఘటనల్లో నిందితుడు. సామూహిక దాడులు, పేలుళ్లు, ఉగ్రవాదాన్ని వ్యాపింపజేయడంపై అతడి మీద కేసులు నమోదయ్యాయి.⇒ మహమ్మద్ అలీపై చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లో, పోలీసు కార్యాలయం వద్ద బాంబు పెట్టడంపై కేసులు నమోదయ్యాయి. ఈ చర్యకు పాల్పడిన రోజే.. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చిలో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. 1999లో కొచ్చి–కుర్లా ఎక్స్‌ప్రెస్‌లో పేలుడు పదార్థాలను తరలిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది.⇒ 2013లో కర్ణాటకలోని మల్లేశ్వరంలో జరిగిన బాంబు పేలుళ్లలో అబూ బకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీ ప్రమేయం ఉంది. అప్పుడు రాయచోటి నుంచే కార్యకలాపాలు సాగించారు. స్థానికంగా పేద కుటుంబాల మహిళలను వివాహమాడి చిరు వ్యాపారాలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పోలీసులు తమిళనాడు పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టి.. భారీ కుట్రను భగ్నం చేశాయి.అల్ ఉమ్మా సంస్థతో అనుబంధంఉగ్ర సంస్థ అల్ ఉమ్మాతో అబూబకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీకి అనుబంధం ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన ఉగ్ర సంస్థ. ఐసిస్ తరహా భావజాలం కలిగినది. నిందితులు గతంలో విదేశాలకు వెళ్లి వచ్చారు. వీరి వద్ద దేశంలోని మూడు ప్రధాన నగరాలు, రైల్వే నెట్‌వర్క్‌ల మ్యాప్‌లు దొరికాయి.రాయచోటి నుంచే పలు చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారు? ఎవరెవరితో ఆర్థిక లావాదేవీలు జరిపారు? సహాయ సహకారాలు అందించినవారెవరు? ప్రతి విషయం క్షుణ్ణంగా విచారిస్తున్నాం. పేలుడు సామగ్రి ఎలా వచ్చింది? బంధువులు, స్నేహితులు, ఇతర సంబంధాలు అన్ని అంశాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం. స్థానికంగా శిక్షణ ఇచ్చినట్లు నిర్ధారణ కాలేదు. అబూబకర్, మహమ్మద్ అలీలను తమిళనాడు పోలీసులు తీసుకెళ్లారు. ఈ కేసుపై నిఘా సంస్థలు పనిచేస్తున్నాయి.సూట్ కేసు బాంబులు, బకెట్ బాంబులు..ఉగ్రవాదులు ఉంటున్న ఇళ్లను తనిఖీ చేయగా సూట్ కేసు బాంబులు, బకెట్ బాంబులు, భారీఎత్తున పేలుడు పదార్థాలు ఇతర వస్తువులు లభించాయి. వీటితో కర్ణాటకలోని మల్లేశ్వరం లాంటి 30 బాంబు పేలుళ్లకు పాల్పడవచ్చు. దాదాపు 50 ఐఈడీలు తయారు చేయగల సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం.పోలీసులను అడ్డుకున్న నిందితుల భార్యలు సోదాలకు వెళ్లినప్పుడు అబూబకర్ భార్య సైరాబాను, మహమ్మద్ అలీ భార్య షేక్ షమీమ్‌లు మహిళా పోలీసులపై దాడికి యత్నించారు. పేలుడు పదార్థాల గురించి వీరికి తెలుసా? లేదా? అనేది విచారణలో తేలుతుంది. మహిళలు ఇద్దరిపై కేసులు నమోదు చేశాం. కోర్టు రిమాండ్ విధించడంతో కడప కేంద్ర కారాగారానికి తరలించాం.⇒ ఉగ్రవాదుల నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలతో పాటు నాలుగు సూట్‌కేస్ బాంబులను రాయచోటి డీఎస్పీ కార్యాలయం పక్కన ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేశారు. భయం.. భయం..రాయచోటిలో ఉగ్రజాడ తెలిసినప్పటి నుంచి అందరిలో భయం నెలకొంది. ఉగ్రవాదులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నా చిన్న సమాచారం కూడా వెలుగులోకి రాకపోవడాన్ని పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా వర్గాలు, తమిళనాడు పోలీసుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తోంది. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పోలీసులను టీమ్‌లుగా విభజించారు. ఉగ్రవాదుల ఇంటి చుట్టుపక్కల వారిని ఇప్పటికే విచారించిన పోలీసులు.. బంధువులు, స్నేహితులపై దృష్టిసారించారు. రోజూ డీఎస్పీ కార్యాలయానికి పలువురిని తీసుకొచ్చి ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలు, సెల్ఫోన్ల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. -
57వ అంతస్తు నుంచి దూకి ప్రముఖ నటి కుమారుడు ఆత్మహత్య
ముంబై: చదువు ప్రముఖ నటి కుమారుడి ప్రాణం తీసినట్లు తెలుస్తోంది. ట్యూషన్‌కు వెళ్లే విషయంలో తల్లితో వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమె కుమారుడు 57వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల సమాచారం మేరకు .. ముంబైలో జరిగిన ఈ విషాదకర ఘటన బుధవారం ముంబైలోని కాందివలి వెస్ట్ ప్రాంతంలోని సీ బ్రూక్ అనే హైరైజ్ అపార్ట్మెంట్లో జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో నటి కుమారుడు 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ట్యూషన్‌కు వెళ్లే విషయంలో నటితో ఆమె కుమారుడు గొడవ పడ్డాడు. వాగ్వాదం జరిగిన తర్వాత బాలుడు 57వ అంతస్తు నుంచి దూకినట్టు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనను పోలీసులు ప్రాథమికంగా బాలుడిది ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఎటువంటి అనుమానాస్పద అంశాలు లేవని తెలిపారు. ప్రముఖ నటి ఎవరు అనేది పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే, ఆ నటి భర్తతో విడాకులు తీసుకుందని, కుమారుడితో కలిసి అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మానసిక స్థితి, పాఠశాల వాతావరణం, కుటుంబ పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ట్యూషన్ క్లాస్‌పై ఒత్తిడి కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా,సదరు నటి పలు హిందీ, గుజరాతీ సీరియళ్లలో నటించిన ఆమె పాపులర్ అయ్యారు. -
రాయచోటిలో ఉగ్రమూలాల కలకలం.. ఇళ్లలో దొరికిన బాంబుల నిర్వీర్యం
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో ఉగ్ర మూలాలు బయటపడ్డాయి. ఉగ్ర వాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సమక్షంలో సూట్‌కేసు బాంబులను ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదుల అరెస్టుతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో అలజడి నెలకొంది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు రాయచోటి పట్టణం షెల్టర్ జోన్‌గా ఉండటంపై ఇటు పోలీసులు, అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది.చైన్నె, కర్ణాటక, కేరళ, హైదరాబాద్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో చేపట్టిన బాంబు బ్లాస్టింగ్ సంఘటనలలో రాయచోటిలో పట్టుబడిన ఇరువురి పాత్ర ఉందన్న సమాచారంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని నెలలుగా రాయచోటిలోనే మకాం వేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు ఉగ్రవాదుల జాడ కనిపెట్టడంలో సఫలీకృతులయ్యారు. కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదులు జరిపిన ఘోర దుర్ఘటన సమయంలో వీరిద్దరి కదలికలు అధికం కావడంపై ఐబీ అధికారులు అలర్ట్ అయినట్లు సమాచారం.ఐబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ప్రత్యేక సిబ్బంది ద్వారా వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. కేరళ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ రాయచోటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి ఇతర ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రానివ్వకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో జీవనం సాగించడంపై పట్టణంలో మరి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అన్న భయం పట్టణవాసుల్లో నెలకొంది.పట్టుబడిన ఇద్దరినీ ఐబీ అధికారులు చైన్నెకి తరలించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలతో రెవెన్యూ అధికారులను కలుపుకొని ఉగ్రవాదుల గృహాలలో సోదాలు చేశారు. విస్తుపోయే ఆధారాలు లభించినట్లు తెలిసింది. పట్టణ పరిధిలోని కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉన్న షేక్ అమానుల్లా(55) అలియాస్ అబూబకర్ సిద్దిక్, మహబూబ్‌బాషావీధిలో నివాసం ఉన్న షేక్ మన్సూర్ (47) అలియాస్ మహమ్మద్‌అలీలు సొంతంగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు.వీరి గృహాలలో బ్లాస్టింగ్ పరికరాలు, కేబుల్స్, నెట్వర్క్ సమాచారం చేరవేసే యంత్రాలు, మ్యాపులు, భూముల కొనుగోలుకు సంబంధించిన రికార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1995లో కోయంబత్తూర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే బీజేపీ దివంగత అగ్రనేత ఎల్‌కె అద్వానీ రథయాత్ర సందర్భంగా విధ్వంస చర్యలకు కుట్రలు చేసినట్లు వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. -
విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో కదిలిన డొంక
సాక్షి, విశాఖపట్నం: మరో బెట్టింగ్ యాప్ ముఠాను విశాఖ పోలీసులు గుట్టురట్టు చేశారు. విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో డొంక కదిలింది. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 13 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను విశాఖ పోలీసులు.. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు.. బెంగళూరులో బెట్టింగ్ డెన్ ఏర్పాటు చేసి బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. విశాఖకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.బెట్టింగ్ ముఠాలో అనకాపల్లి జిల్లా కసింకోటకు చెందిన నిందితుడు కీలక పాత్ర వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ ముఠా సభ్యులు వద్ద నుంచి 57 మొబైల్ ఫోన్లు,137 బ్యాంకు పాస్ పుస్తకాలు, 11 ల్యాప్ టాప్‌లు, 132 ఏటిఎం కార్డులు, 4 సీసీ కెమెరాలు, ఒక కౌంటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. -
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం.. లేకపోతే చంపేస్తా!
అనంతపురం: పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా అంటూ ఓ యువతిపై యువకుడు దాడి చేసిన ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పుట్లూరు మండలం శనగల గూడూరుకు చెందిన యువతి సాయినగర్ ఏడో క్రాస్‌లోని లేడీస్ హాస్టల్లో ఉంటోంది.రెండు సంవ త్సరాల క్రితం అనంతపురం నగరంలోని బస్టాండు వద్ద ఉన్న ప్రియదర్శిని హోటల్లో పార్టం ఉద్యోగం చేస్తున్న ఈమెకు.. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం అగ్రహారంకు చెందిన ప్రవీణ్ కుమార్ పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం అని చెప్పగా యువతి నిరాకరించింది. ఈ క్రమంలోనే ఇటీవల విద్యుత్ నగర్లో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు హోంలోన్ విభాగంలో సేల్స్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరింది.విషయం తెలుసుకున్న ప్రవీణ్ కుమార్ మళ్లీ ఆమె వెంటపడుతూ పెళ్లి చేసుకోవాలని వేధించడం ప్రారంభించాడు. మంగళవారం హాస్టల్ వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. బైకులో బలవంతంగా ప్రసన్నాయ పల్లి రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి దాడి చేశాడు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపుతా అని బెదిరించాడు. తిరిగి బైక్‌పై హాస్టల్ వద్ద వదిలి వెళ్లిపోయాడు. దీనిపై తన సోదరితో కలిసి యువతి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
మళ్లీ వస్తా.. యువతిపై డెలివరీ బాయ్ ఘాతుకం.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ దిగి..
పూణే: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి పార్సిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు నిందితుడు అంతటితో ఆగకుండా ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టేసి వెళ్లిపోయాడు. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.వివరాల ప్రకారం.. పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి బాధితురాలు(22) నివాసం ఉంటోంది. అయితే, ఆమెకు వచ్చిన పార్సిల్‌ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడు. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడు. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి.. ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ ఓ పేపర్‌పై రాసిపెట్టే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని హెచ్చరించి పరారయ్యాడు. ఓ గంట తర్వాత బాధితురాలు స్పృహలోకి కన్నీరు పెట్టుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు.. ఆమె ఇంటికి చేరుకుని వివరాలను సేకరించారు. బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజ్ కుమార్ షిండే మాట్లాడుతూ.. ఇంట్లో బాధితురాలి సోదరుడు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి కోసం గాలిస్తున్నాం. సీసీ కెమెరాల ఆధారం అతడి గురంచి అన్వేషిస్తున్నాం. లైంగిక దాడి, మహిళపై దాడి, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. బాధితురాలి మొబైల్ సెల్ఫీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. నిందితుడు ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి ఏదో పదార్థాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఏదైనా స్ప్రే ఉపయోగించారా? అని వివరాలు సేకరిస్తున్నాం అని తెలిపారు. VIDEO | Here's what Pune Deputy Commissioner of Police (Zone 5) Rajkumar Shinde said on the alleged rape of a 22-year-old woman in her apartment by a courier delivery executive:"A case has been registered under Bharatiya Nyaya Sanhita sections 64 (punishment for rape), 77… pic.twitter.com/rbxvN86an9— Press Trust of India (@PTI_News) July 3, 2025 -
యజమానురాలు తిట్టిందని.. తల్లీ కుమారులపై సహాయకుని ఘాతుకం
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని లజ్‌పత్ నగర్-Iలో ఘోరం చోటుచేసుకుంది. ఎంతో నమ్మకంతో ఇంటి పనిలో పెట్టుకున్న సహాయకుడే యజమానురాలితో పాటు, ఆమె కుమారుని గొంతు కోశాడు. యజమానురాలు తిట్టిందని, ఆగ్రహంచిన ఆ సహాయకుడు ఇంతటి దారుణానికి తెగించాడు.లజ్‌పత్ నగర్లో బుధవారం రాత్రి ఒక మహిళ, ఆమె కుమారుడు వారి ఇంటి లోపల హత్యకు గురయ్యారనే వివరాలు తెలియగానే, రంగంలోకి దిగిన పోలీసులు వారి ఇంటి నుంచి పరారైన సహాయకుడు ముఖేష్(24)ను అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా, నేరాన్ని అంగీకరించడంతోపాటు ఘటనాక్రమాన్ని పోలీసులకు వివరించాడు. తన యజమాని రుచికా సేవ, ఆమె కుమారుడు క్రిష్‌ల గొంతులను కోసినట్లు నిందితుడు ముఖేష్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. #WATCH | Delhi's Double murder case | The bodies of a woman, Ruchika (42) and her son, Krish (14) were found at their residence in the Lajpat Nagar-1 area. The suspect house help has been apprehended. Further investigation underway: Delhi Police(Visuals from the spot) pic.twitter.com/bI338FWx1N— ANI (@ANI) July 3, 2025రుచిక భర్త కుల్దీప్ రాత్రి 9:30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. ఆయనకు మెట్లపై రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్న తలుపును బలవంతంగా తెరిచారు. అక్కడ వారు రుచిక మృతదేహాన్ని బెడ్రూమ్లో, క్రిష్ మృతదేహాన్ని బాత్రూంలో గుర్తించారు. ఇద్దరికీ మెడపై కత్తితో చేసిన గాయాలన్నాయి. ఈ ఘటనకు వారింటిలో పనిచేసే ముఖేష్ కారణమని భావించిన పోలీసులు అతనిని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో ముఖేష్ తనను యజమానురాలు రుచిక తిట్టిందునే ఈ దారుణానికి పాల్పడ్డానని తెలిపాడు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా? -
భర్త వద్దు.. మామే కావాలి.. పెళ్లైన 45 రోజులకే..
పాట్నా: దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో భర్తలను అత్యంత దారుణంగా చంపేస్తున్న ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మరో భర్త.. పెళ్లి అయిన 45 రోజులకు హత్యకు గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే, తన మామతో జీవించేందుకే.. అడ్డుగా ఉన్న భర్తను భార్యే హత్య చేయించింది. ఈ విషాదకర ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. దీంతో, పెళ్లి అంటేనే పురుషులు వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ప్రియాంశు (25), గుంజాదేవి (20)లకు రెండు కుటుంబాల పెద్దలు వివాహం జరిపించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య 45 రోజుల క్రితమే వీరిద్దరికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే, గుంజాదేవికి తన మామ అంటే(భర్త తండ్రి కాదు) ఎంతో ఇష్టం. పెళ్లికి ముందు నుంచే గుంజాదేవీ, ఆమె మామ జీవన్‌సింగ్ (55)లు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. శారీరకంగా కూడా కలిసినట్టు తెలిసింది. ఈ క్రమంలో తన మామనే పెళ్లిచేసుకుంటానని.. గుంజాదేవీ తన పేరెంట్స్‌కు చెప్పింది. ఇందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు.అనంతరం, ప్రియాంశుతో దేవీకి బలవంతంగా వివాహం చేశారు. తర్వాత.. తన మామను మరిచిపోలేక గుంజాదేవీ.. భర్తను దూరం పెడుతూ వస్తోంది. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకుని తన మామను పెళ్లి చేసుకోవాలని ఆమె భావించింది. దీంతో, తన భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇందుకు సుపారీ గ్యాంగ్‌తో డీల్ కుదుర్చుకుంది. గత నెల 25న ప్రియాంశు తన సోదరిని కలిసేందుకు వెళ్లి రైలులో తిరిగి పయనమయ్యాడు. ఈ క్రమంలో నవీనగర్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో గుంజాదేవీ గ్రామం నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది.ఇది గమనించిన ప్రియాంశు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె కాల్ రికార్డులను పరిశీలించగా.. జీవన్‌సింగ్‌తో తరచూ టచ్‌లో ఉన్నట్లు వెల్లడైంది. అతడి కాల్ డేటా కూడా పరిశీలిస్తే సుపారీ గ్యాంగ్‌తో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఇక, ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు సుపారీ గ్యాంగ్ సభ్యులతో పాటు నిందితురాలిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీవన్‌సింగ్ పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లి అయిన నెలన్నరకే తమ కొడుకు ఇలా చనిపోయవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
మాదాపూర్‌లో దారుణం.. బెట్టింగ్ ఆడ్డొదన్న తండ్రిని చంపేశాడు
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో దారుణం జరిగింది. బెట్టింగ్ ఆడొద్దని మందలించిన తండ్రిని కుమారుడు చంపేశాడు. కొడుకు చదువు కోసం ఆరు లక్షలు ఇవ్వగా.. కొడుకు బెట్టింగ్ యాప్స్‌లో పెట్టి పోగొట్టాడు. దీంతో మందలించిన తండ్రి హనుమంత్‌ని హత్య చేసిన కుమారుడు రవీందర్.. ఆత్మహత్యగా క్రియేట్ చేశాడు. వనపర్తికి తీసుకెళ్లి తండ్రి మృతదేహానికి కర్మకాండ చేసే ప్రయత్నం చేశాడు.బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. రవీందర్‌ని అదుపులోకి తీసుకున్న విచారించారు. తండ్రిని తానే చంపానని రవీందర్ ఒప్పుకున్నాడు. రవీందర్‌ను రిమాండ్‌కు తరలించారు. -
బాలునిపై ఏడాదిగా మహిళా టీచర్ దారుణం
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఒళ్లు గగుర్పొడిచే ఉదంతం చోటుచేసుకుంది. మహిళలపై తరచూ దారుణాలు చోటుచేసుకుంటున్నాయనే వార్తలు వినిపిస్తున్న ప్రస్తుత సమయంలో, తాజాగా దీనికి భిన్నంగా జరిగిన ఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ముంబైకి చెందిన 40 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలు తన దగ్గర చదువుకునే 16 ఏళ్ల విద్యార్ధికి ఆందోళన నిరోధక మందులు(యాంటీ యాంగ్జైటీ మందులు) ఇచ్చి, ఏడాది కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తోంది. ఈ విషయం బయటపడిన దరిమిలా పోలీసులు ఆ మహిళా ఉపాధ్యాయురాలిని అరెస్ట్ చేశారు. ఆమెపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పాక్సో)చట్టం, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) చట్టం, భారత శిక్షాస్మృతిలోని నిబంధనల కింద నేరాలను మోపారు.పోలీసులు తెలిపిన ప్రకారం నిందితురాలు ఆంగ్ల ఉపాధ్యాయురాలు. బాధిత విద్యార్థి 11వ తరగతిలో ఉన్నప్పుడు అతనికి పాఠ్యాంశాలను బోధించారు. 2023 డిసెంబర్లో జరిగిన పాఠశాల వార్షికోత్సవం సమయంలో ఆ విద్యార్థికి ఆకర్షితురాలినైనట్లు ఆమె పోలీసులకు తెలిపింది. 2024 జనవరి నుంచి ఆ విద్యార్థితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. తొలుత ఆమె ఆ బాలుడిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, లైంగికంగా వేధించేదని, తరువాత అతనికియాంటీ-యాంగ్జైటీ ముందులు ఇచ్చి లోబరుచుకునేదని పోలీసులు తెలిపారు.అయితే ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు అతని ప్రవర్తనలో మార్పును గమనించి, ప్రశ్నించగా, అసలు విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ విద్యార్థి త్వరలోనే పాఠశాల విద్య పూర్తి చేస్తాడన్న భావనతో అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని విస్మరించారు. ఈ ఏడాది ఆ విద్యార్థి 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే ఆ ఉపాధ్యాయురాలు తిరిగి అతనిపై వేధింపులు ప్రారంభించింది. దీంతో ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు ఆ ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇది కూడా చదవండి: ఖరీదైన ఐదు టీవీలు, 14 ఏసీలు.. ఢిల్లీ సీఎం ఇంటి రెనోవేషన్ ఖర్చెంతంటే.. -
ఆటోలో ప్రేమజంట ఆత్మహత్య!
సాక్షి,బళ్లారి(కర్ణాటక): వారిద్దరూ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక్కటవుదామని ఆశపడ్డారు. కానీ ఆటో రిక్షాలో శవాలై తేలారు. ఇది ఆత్మహత్య, హత్య అనే అనుమానాలు వ్యాపించాయి. వివరాలు.. బెళగావి జిల్లాలో గోకాక్ వద్ద సవదత్తి తాలూకా మనవళ్లికి చెందిన రాఘవేంద్ర జాదవ్ (28), రంజిత (26) అనే ఇద్దరు ఊరి బయట ఆటోలో విగతజీవులై కనిపించారు. కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని, అయితే వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని తెలిసింది. ఇటీవల ఆమెకు మరొకరితో నిశ్చితార్థం చేశారు. దీంతో ఆవేదనకు గురైన ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు చిక్కనంది సమీపంలో ఆటోలో పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. సమగ్ర విచారణ జరిపించాలని జాదవ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గోకాక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.లవ్ బ్రేకప్.. ప్రియుడు ఆత్మహత్య మైసూరు: ప్రేమించిన యువతి ముఖం చాటేయడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకా బన్నితాళపుర గ్రామంలో జరిగింది. సాగడె గ్రామానికి చెందిన సంతు అదే ఊరికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అయితే తాను మరో యువకున్ని ప్రేమిస్తున్నట్లు సంతు వాట్సాప్‌కు మెసేజ్ పంపింది. దీంతో విరక్తి చెందిన సంతునా మరణానికి ప్రియురాలే కారణం, ఆమె వదిలేయడంతో ప్రాణాలు తీసుకుంటున్నట్లు పలువురికి మెసేజ్‌లు పంపాడు. తమ ఇద్దరి ఫోటోని స్టేటస్‌లో పెట్టి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్లుపేటె పోలీసులు కేసు నమోదు చేశారు. -
పాక్ నటిగా పరిచయమై టోకరా
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సుదీర్ఘకాలం తర్వాత మాట్రిమోనియల్ ఫ్రాడ్ చోటు చేసుకుంది. సోషల్‌మీడియాలోని మాట్రిమోనియల్ గ్రూప్ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన నటి ఫాతిమా ఎఫెండీగా పరిచయమైన సైబర్ నేరగాళ్లు పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఆపై తల్లికి అనారోగ్యం, వైద్య ఖర్చుల పేరు చెప్పి రూ.21.73 లక్షలు కాజేశారు. దీనిపై మంగళవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన యువకుడు (29) ఓ సోషల్‌మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న మాట్రిమోనియల్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నాడు. అతడికి 2023 మార్చిలో ఆ గ్రూపు ద్వారానే పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి ఫాతిమా ఎఫెండీ పేరుతో సైబర్ నేరగాడు పరిచయం అయ్యాడు. తన ఖాతాలకు డీపీగా సదరు నటి ఫొటోను పెట్టుకోవడంతో అతను పూర్తిగా నమ్మేశాడు. కొన్నాళ్లు చాటింగ్ చేసిన తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ అసలు కథ మొదలుపెట్టాడు. ఓ దశలో నగర యువకుడిని పూర్తిగా నమ్మించడానికి ఫాతిమా సోదరి అనీసా ఎం.హుండేకర్ పేరుతోనూ చాటింగ్ చేశాడు. ఈ సందర్భలోనూ తన సోదరిని మీకు ఇచ్చి వివాహం చేయడానికి అభ్యంతరం లేదంటూ పదేపదే ప్రస్తావించి పూర్తిగా ఉచ్చులోకి దింపారు. ఇలా కొంతకాలం చాటింగ్స్ చేసిన తర్వాత ఫాతిమాగా చెప్పుకున్న సైబర్ నేరగాడు తన తల్లి ఆరోగ్యం దెబ్బతిందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పాడు. దానికి ఆధారంగా అంటూ కొన్ని నకిలీ పత్రాలనూ వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. వైద్యం కోసం భారీగా ఖర్చు అవుతోందని నమ్మబలికాడు. పాకిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం తన వద్ద నగదు అందుబాటులో లేదని సందేశం ఇచ్చాడు. వైద్య ఖర్చుల కోసం సాయం చేస్తే... కొంత తక్షణం, మరికొంత కొన్నాళ్లకు స్థిరాస్తులు విక్రయించి తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అవసరమైతే వడ్డీతో సహా చెల్లిస్తానని నమ్మబలికాడు. అతడిని పూర్తిగా నమ్మించడం కోసం తొలుత చిన్న మొత్తాలు బదిలీ చేయించుకుని, వాటిని కొన్ని రోజులకు తిరిగి చెల్లించేశాడు. తాను సంప్రదింపులు జరుపుతోంది, లావాదేవీలు చేస్తోంది పాకిస్థాన్‌కు చెందిన నటి ఫాతిమా ఎఫెండీతోనే అని నగర యువకుడు పూర్తిగా నమ్మేశాడు. దీంతో సైబర్ నేరగాళ్లు కోరినప్పుడల్లా నగదు బదిలీ చేస్తూ వెళ్లాడు. ఇలా దఫదఫాలుగా రూ.21,73,912 చెల్లించాడు. ఆ తర్వాత ఫాతిమాగా చెప్పుకున్న సైబర్ నేరగాడు యువకుడికి సంబంధించిన అన్ని సోషల్‌మీడియా హ్యాండిల్స్, ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేసేశాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుల ఫోన్ నెంబర్లు, సోషల్‌మీడియా ఖాతాలతో పాటు డబ్బు బదిలీ చేసిన బ్యాంకు అకౌంట్ల ఆ«ధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రోదనలు.. ఆక్రందనలు
జిన్నారం (పటాన్చెరు)/పటాన్చెరు టౌన్: పదుల సంఖ్యలో కార్మికులు పొట్ట చేతబట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. ఉపాధి కోసం సిగాచి పరిశ్రమలో చేరారు. వీరిలో కొందరు కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. వీరిలో అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు, నవ దంపతులు సైతం ఉన్నారు. సోమవారం ఊహించని విధంగా జరిగిన దుర్ఘటనలో వీరిలో అనేకమంది మృత్యువాత పడ్డారు. కారి్మకులు, కిందిస్థాయి సిబ్బంది మొదలు అధికారులు, ఉన్నతాధికారుల ప్రాణాలు కూడా క్షణాల్లోనే గాల్లో కలిసిపోయాయి. కొంతమంది ఆచూకీ తెలియకుండా పోయింది. కొందరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. దీంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.మృతుల్లో ఏపీకి చెందిన అధికారి ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన మర్రపు ప్రవీణ్‌కుమార్(46) సిగాచి పరిశ్రమలో డీజీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. పేలుడు తర్వాత ఆయన ఆచూకీ తెలియలేదు. అయితే 36 మృతదేహాలను అధికారులు పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రవీణ్‌కుమార్ మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు బోరున విలపించారు. మంచిర్యాలకు చెందిన క్యూసీ మేనేజర్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన వజ్జకేవుల నాగేశ్వరరావు క్వాలిటీ కంట్రోల్ విభాగంలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మరణించారు. మృతదేహాన్ని స్వా«దీనం చేసుకునేందుకు వచి్చన తమ్ముడు రవి విలపిస్తూ.. ఇందుకు సహకరించిన పోలీసులకు రెండు చేతులెత్తి దండం పెట్టాడు. నాన్నా.. నువ్వు లేకుండా ఎలా బతకాలి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ గ్రామానికి చెందిన జగదీశ్ (53) 35 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం భార్య కమలాదేవితో కలిసి ఇస్నాపూర్‌కు వచ్చాడు. సిగాచి పరిశ్రమ ఏర్పాటయ్యాక అందులో చేరాడు. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. సోమవారం జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. నాన్నా.. నువ్వు లేకుండా మేమంతా ఎలా బతకాలంటూ పిల్లలు రోదిస్తున్నారు. తండ్రి మృతితో రోడ్డున పడిన కుటుంబం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలియా జిల్లా రత్ననగర్కు చెందిన రామ్‌సింగ్ (50) ఈ దుర్ఘటనలో మృతి చెందాడు. ఇస్నాపూర్‌లో ఉంటున్న ఇతనికి భార్య, పెళ్లీడుకు వచి్చన ఇద్దరు సహా ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రామ్‌సింగ్ మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. నా ఇద్దరు చిన్నాన్నలు చనిపోయారు.. తన ఇద్దరు బాబాయిలతో కలిసి బతుకుదెరువు కోసం వచ్చిన పవన్ నిసార్ ప్రస్తుతం ఒంటరిగా మిగిలాడు. ప్రమాదంలో తన చిన్నాన్నలు అఖిలేశ్ కుమార్ (35), విజయ్‌కుమార్ (30) మృతి చెందారంటూ పవన్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. రెండురోజుల క్రితమే ఉద్యోగంలో చేరాడుమహారాష్ట్రకు చెందిన సోని భర్త భీమ్రావు భార్యతో కలిసి బండ్లగూడలో ఉంటూ రెండురోజుల క్రితమే కంపెనీలో చేరాడు. సోమవారం ఉదయం 8 గంటలకు పనికి వెళ్లగా ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. దీంతో సోని కుటుంబసభ్యులతో కలిసి పరిశ్రమ వద్దకు వెళ్లింది. భర్త ఆచూకీ కోసం ప్రయతి్నస్తుంటే పటాన్‌చెరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు అక్కడివారు చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా భీమ్రావు తీవ్రంగా కాలిన గాయాలతో కని్పంచడంతో సోని బోరున విలపించింది. తన భర్తకు మంచి వైద్యం అందించాలని, ఆర్థికంగా ఆదుకోవాలని అధికారులను కోరుతోంది. మా అల్లుడి జాడ ఎవరూ చెప్పడం లేదు ‘ప్రమాదంలో మా అల్లుడు ప్రశాంత్ మహాపాత్రో గల్లంతయ్యాడు. మూడేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాడు. తొలుత కాంట్రాక్ట్ లేబర్‌గా, ఇప్పుడు క్యాజువల్ కారి్మకుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం విధుల్లోనే ఉన్నాడని భావిస్తున్నాం. మరణించాడా? బతికున్నాడా? అనేది ఎవరూ చెప్పడం లేదు. అధికారుల వద్ద ఉన్న జాబితాలో మా అల్లుడి పేరు కనిపించడం లేదు..’అని ఒడిశాకు చెందిన కోక సాహు వాపోయాడు. నా కొడుకు కోసం వెతుకుతున్నా.. ‘నా కొడుకు పేరు వెంకటేశ్. ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. మూడేళ్లుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఆదివారం నా కొడుకుతో ఫోన్లో మాట్లాడాను. సోమవారం పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు ఆయన ఫోన్ పనిచేయడం లేదు, ఆచూకీ లభించడం లేదు. అధికారుల వద్ద ఉన్న ఏ జాబితాలోనూ నా కుమారుడి పేరు లేదు. నా కొడుకు సజీవంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా..’అని ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నారావు అన్నాడు. అన్న ఆచూకీ కోసం తమ్ముడి ఆరా ‘మా అన్న దాసరి సునీల్‌కుమార్ కనిపించడం లేదు. ఏడాదిన్నరగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. క్వాలిటీ చెక్ విభాగంలో పనిచేస్తుండేవాడు. ఇప్పటివరకు ఆయన ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం ఫోన్ రింగ్ అయింది. ఆ తర్వాత స్విచ్ఛాఫ్ అయింది. మా సోదరుడు ఆచూకీ చెప్పాలి..’అని ఏపీలోని ప్రకాశం జిల్లా వాసి దాసరి సంపత్ కోరారు.నవ దంపతుల మృత్యువాత ప్రేమ వివాహం చేసుకున్న రెండు నెలలకే.. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిగాచి పరిశ్రమలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. జీవితం గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ ఇంతలోనే విధి వంచితులుగా మారారు. సోమవారం జరిగిన ప్రమాదం తర్వాత నవ దంపతుల ఆచూకీ తెలియకుండా పోయింది. ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగు పెనికలపాడుకు చెందిన నిఖిల్‌రెడ్డి ఎమ్మెస్సీ చదివాడు. ఏపీలోని ఎనీ్టఆర్ జిల్లా మాలపల్లికి చెందిన రామాల శ్రీరమ్య కూడా ఎమ్మెస్సీ చదివింది. తొలుత నిఖిల్‌రెడ్డి సిగాచిలో చేరగా, అక్కడే శ్రీరమ్య కూడా ఉద్యోగం సంపాదించుకుంది.మంచి స్నేహితులుగా మారిన వాళ్లు పరస్పరం ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారని పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు తెలిపారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న వీరిద్దరూ కన్పించక పోవడంతో మరణించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. విషయం తెలిసి పరిశ్రమ వద్దకు వచి్చన వారి కుటుంబీకులు.. ఆచూకీ లభించని వారి జాబితాలో వీరి పేర్లు చూసి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అనంతరం ఆస్పత్రి మార్చురీలో ఇద్దరి మృతదేహాలను చూసి బోరున విలపించారు. నా భర్త ఏమయ్యాడో చెప్పండి ఏడు నెలల గర్భవతి ఆక్రందన ఒకే కుటుంబంలో ముగ్గురి ఆచూకీ గల్లంతు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆచూకీ గల్లంతైంది. ఘటన జరిగి 24 గంటలు దాటిపోయినా తమ వారి ఆచూకీ తెలియకపోవడంతో ఆ కుటుంబానికి చెందిన పూజ కన్నీరు మున్నీరవుతున్నారు. ఆమె ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. బిహార్‌కు చెందిన పూజ భర్త నాగ పాశ్వాన్ (25), ఇతర కుటుంబసభ్యులు దీపక్ (19), దిలీప్ (45) ఆచూకీ ఇంతవరకు లభించలేదు. వీరు ఐదునెలల క్రితమే పటాన్‌చెరుకు ఉపాధి నిమిత్తం వచ్చారు. ఈ పరిశ్రమలో పనికి కుదిరారు.వీరు శిథిలాల్లో నలిగి కాలిపోయి ఉంటారేమోనని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంధువుల సాయంతో పరిశ్రమ వద్దకు వచి్చన పూజ తన భర్త, ఇతర కుటుంబసభ్యుల ఆచూకీ చెప్పాలంటూ విలపించడం స్థానికులను సైతం కన్నీరు పెట్టించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశ్రమను సందర్శించిన సందర్భంగా పూజ గురించి ప్రస్తావించారు. కాగా తన భర్త ఏమయ్యాడో అధికారులు చెప్పడం లేదని పూజ రోదించింది. -
‘భాగస్వామి’పై దారుణం.. మృతదేహంతో రెండు రోజులు సావాసం
భోపాల్: దేశంలో ఇటీవలి కాలంలో ‘రిలేషన్షిప్’ ఉంటున్న కొందరు క్షణికావేశంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇటువంటి దారుణ ఉదంతం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెలుగు చూసింది. స్థానిక గాయత్రి నగర్లో రితికా సేన్(29) తన లివ్ ఇన్ పార్ట్నర్ సచిన్ రాజ్‌పుత్(32) చేతిలో దారుణ హత్యకు గురయ్యింది.రితికా సేన్‌ను గొంతుకోసి, హత్యచేసిన తరువాత సచిన్ ఆమె మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, రెండు రోజుల పాటు ఆ మృతదేహం పక్కనే పడుకున్నాడు. జూన్ 27 రాత్రి వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, అది రితకా హత్యకు దారితీసింది. ఉద్యోగం లేకుండా అల్లరిచిల్లరిగా తిరుగుతున్న రాజ్‌పుత్ తన భాగస్వామి రితికా సేన్‌పై ఎప్పుడూ అసూయ పడేవాడు. ఆమె పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీ యజమానితో ఆమెకు సంబంధం ఉందని అనుమానించేవాడు. ఈ నేపధ్యంలోనే ఆమెను హత్య చేశాడు.తరువాత ఆమె మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి, మంచం మీద పెట్టి, రెండు రోజుల పాటు అదే గదిలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మద్యం మత్తులో సచిన్ రాజ్‌పుత్ తన స్నేహితుడు అనుజ్‌తో తాను రితికా సేన్‌ను హత్య చేసినట్లు తెలిపాడు. దీంతో అనుజ్ పోలీసులకు ఫోన్ చేసి, విషయమంతా చెప్పాడు. వెంటనే బజారియా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రితికా సేన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టంనకు తరలించారు.పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ శిల్పా కౌరవ్ మీడియాతో మాట్లాడుతూ మృతురాలు రితికా సేన్ తన ప్రియుడు సచిన్ రాజ్‌పుత్‌తో పాటు రెండున్నరేళ్లుగా సహజీవనం చేస్తున్నదన్నారు. సచిన్‌కు అప్పటికే వివాహం అయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. జూన్ 27న రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగి, అది రితికా హత్యకు దారితీసిందన్నారు. సింజోర్కు చెందిన సచిన్.. రితికతో పాటు తొమ్మిది నెలల క్రితం గాయత్రి నగర్‌కు వచ్చి ఉంటున్నాడు. రితిక ఉద్యోగం చేస్తుండగా, సచిన్ ఆమె జీతంపై ఆధారపడేవాడు. నిందితుడు సచిన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: దూరం పెట్టిందని.. నర్సింగ్ విద్యార్థినిపై ఘాతుకం -
భర్త దారుణ హత్య.. ఇంటికి తాళం వేసి భార్య పరార్..!
నాగోలు(హైదరాబాద్): ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసి నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతంలో పడవేసిన సంఘటన నాగోలు పోలీసుల స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమాముల శివారులో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు నాగోలు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహం వద్ద లభించిన వివరాల ఆధారంగా మృతుడు కాచిగూడకు చెందిన అశోక్ యాదవ్ గా గుర్తించారు. కాచిగూడలో జ్యూస్ షాప్ నిర్వహిస్తున్న అశోక్ యాదవ్‌కు భార్య క్రాంతి దేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్, ఏసీపీ కృష్ణయ్య, నాగోలు ఇన్స్పెక్టర్ సూర్యనాయక్ సంఘటన స్ధలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. అశోక్ యాదవ్ మృతదేమం లభించిన ఫోన్ ఆధారంగా అతని భార్యకు ఫోన్ చేసిన పోలీసులు సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఇంటి వస్తున్నట్లు సమాచారం అందుకున్న అతడి భార్య ఇంటికి తాళం, జ్యూస్ సెంటర్ మూసి వేసి సెల్‌ఫోన్ ఆఫ్ చేసి పరారైనట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. -
తమిళనాడులో భారీ పేలుడు.. 8 మంది మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పటాకుల తయారీ ప్రముఖ కేంద్రం శివకాశిలోని ఓ గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. పేలుడు ధాటికి సత్తూరులోని బాణసంచా యూనిట్‌పై దట్టమైన పొగ అములుకుంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని బాణాసంచా గోడౌన్ నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. తరచూ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.#JUSTIN சிவகாசி அருகே சின்ன காமன்பட்டி கோகுலேஸ் பட்டாசு ஆலையில் பயங்கர வெடி விபத்து #Sivakasi #FireAccident #News18Tamilnadu | https://t.co/3v5L32pLWJ pic.twitter.com/5g7GYG6V6d— News18 Tamil Nadu (@News18TamilNadu) July 1, 2025VIDEO Credits: News18 Tamil Nadu -
‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’
నేరేడుచర్ల(నల్గొండ): ప్రియుడికి వీడియో కాల్ చేస్తే స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్న వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఆమె మృతికి ప్రియుడే కారణమని మృతదేహాన్ని అతడి ఇంటి ముందు ఉంచి మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం బోడలదిన్నె గ్రామానికి చెందిన మల్గిరెడ్డి అశ్విని(35) తన భర్తతో కలిసి గత మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో నివాసముంటోంది. వీరికి ఒక కుమార్తె సంతానం. బోడలదిన్నె గ్రామానికే చెందిన కందుకూరి సురేష్‌రెడ్డి కూడా ఎల్బీనగర్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో అశ్విని, సురేష్‌రెడ్డి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల అశ్విని, సురేష్‌రెడ్డి మధ్య దూరం పెరగడంతో.. నాలుగు రోజుల క్రితం అశ్విని సురేష్‌రెడ్డికి వీడియో కాల్ చేసి ‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అని చెప్పింది. దీనికి తాను రానని సురేష్‌రెడ్డి సమాధానం చెప్పడంతో మనస్తాపానికి గురైన అశ్విని తాను ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత అనుమానం వచ్చి సురేష్‌రెడ్డి అశ్విని ఇంటికి వెళ్లగా ఆమె ఆపస్మారక స్థితిలో ఉండటం చూసి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతదేహంతో ఆందోళన..అశ్విని మృతికి సురేష్రెడ్డే కారణమంటూ మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి బోడలదిన్నె గ్రామంలోని సురేష్‌రెడ్డి ఇంట్లో మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ తన సిబ్బందితో బోడలదిన్నె గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు కుటుంబాలతో గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిపి సోమవారం అశ్విని మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. అశ్విని మృతికి సురేష్‌రెడ్డి కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
దూరం పెట్టిందని.. నర్సింగ్ విద్యార్థినిపై ఘాతుకం
ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఏం జరిగిందో తెలియదు. ఆమె అతన్ని దూరం పెట్టింది. అది భరించలేకపోయాడా యువకుడు. ఆమెపై కక్ష కట్టి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో పట్టపగలే అంతా చూస్తుండగా ఆమె పీక కోసి అతికిరాతకంగా చంపాడు.మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. జిల్లా ఆసుపత్రిలోని ట్రామా సెంటర్లో 19 ఏళ్ల సంధ్య చౌద్రీ అనే యువతి దారుణ హత్యకు గురైంది. నిందితుడు అభిషేక్ కోష్టి.. ఆసుపత్రి సిబ్బంది, రోగుల సమక్షంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. తరువాత తన గొంతు కోసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది.నర్సింగ్ శిక్షణ పొందుతున్న సంధ్యను వెంబడించిన అభిషేక్ కోష్టి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. తరువాత ఆమెను పట్టుకుని, కిందకు నెట్టివేసి, కత్తితో ఆమె గొంతు కోశాడు. తరువాత తన గొంతుకోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించాడు. ఈలోపు జనం గుమిగూడడంతో.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనను చూసిన ఆస్పత్రి అధికారి నళిన్ మాట్లాడుతూ.. నల్ల చొక్కా ధరించిన ఒక యువకుడు సంధ్యపై దాడి చేశాడని, తాను జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించడగా, తనను అడ్డుకున్నాడని, చంపేస్తానని కూడా బెదించాడని తెలిపారు.పోలీసులు నిందితుడు అభిషేక్‌ను అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. విచారణలో అతను.. రెండున్నరేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా తాము కలుసుకున్నామని పోలీసులకు తెలిపాడు. తాము ప్రేమించుకుంటున్నామని, అయితే ఇటీవలి కాలంలో సంధ్య తనను పట్టించుకోవడం మానేసిందని, తన నంబర్‌ను బ్లాక్ చేసిందని చెప్పాడు. ఆమె వేరొకరిని ప్రేమిస్తున్నదని భావించి, ఆమెకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుని, ఆమె హత్యకు ప్లాన్ చేసినట్లు అభిషేక్ పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నాడు. కాగా సంధ్యకు అభిషేక్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.సంధ్య హత్య అనంతరం ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రధాన రహదారిని దిగ్బంధించారు. అయితే నిందితునిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సంధ్య హత్య జరిగిన రోజు ఆస్పత్రి ట్రామా సెంటర్లో 11 మంది రోగులు చేరారు. అయితే భయంతో ఎనిమిది మంది అదే రోజు డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారు మరుసటి రోజు వెళ్లిపోయారు. ఆసుపత్రి సివిల్ సర్జన్ గురుచరణ్ చౌరాసియా మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో భద్రతా వైఫల్యంపై ఉన్నతాధికారులకు లేఖ రాస్తామన్నారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఆస్పత్రికి చేరుకున్నాయి. సంధ్యను హత్య చేసి, తనను తాను గాయపరచుకున్న నిందితుడు అభిషేక్ ప్రస్తుతం అదుపులో ఉన్నాడు. ఎస్పీ మృగాఖి డేకా సారధ్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: ‘హార్వర్డ్’కు ట్రంప్ మరో షాక్.. యూదు హక్కులపై వేటు -
పాశమైలారం ఘటన.. సిగాచి బాధితులకు సీఎం పరామర్శ
పెను విషాదాన్ని మిగిల్చిన సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరణించిన వారి సంఖ్యను 45గా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ అడ్మిన్ భవన శిథిలాల ప్రక్రియ కొనసాగుతోంది. తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత రానుంది. Updates: 42కు చేరిన మృతులుమృతుల సంఖ్య పెరిగే అవకాశంమృతుల్లో ఎక్కువ మంది తమిళనాడు, బిహార్, జార్ఖండ్ వాసులుమృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలుఆసుపత్రుల్లో 35 మంది బాధితులకు చికిత్స12 మంది పరిస్థితి విషమం, ఐసీయూలో చికిత్సపేలుడు ఘటనలో 27 మంది కార్మికులు గల్లంతుశిథిలాల కింద మృతదేహాల కోసం గాలిస్తున్న డీఆర్ఎఫ్ టీమ్సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా సిబ్బందితమవాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాల ఆందోళన బాధితులకు సీఎం పరామర్శసిగాచి ఫ్యాక్టరీ బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి పరామర్శధృవ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎంఆరోగ్య స్థితిపై ఆరాకార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీమార్చురీ వద్ద రోదనలతో పడిగాపులుపటాన్ చెరులో డిఎన్ఏ శాంపుల్స్ సేకరణ కోసం ప్రత్యేక చర్యలుగుర్తుపట్టేందుకు వీలులేని మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్ లుతమ వారిని గుర్తించలేని కుటుంబ సభ్యుల నుండి డీఎన్ఏ సేకరణఇప్పటివరకు 18 మంది డిఎన్ఏ శాంపుల్ సేకరణ మృతదేహాలడీఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తరువాతే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్న అధికారులుఇవాళ 11 మంది డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్న అధికారులుతమవాళ్ల మృతదేహాల కోసం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోదనలతో కుటుంబ సభ్యుల పడిగాపులుఘటనపై NHRC కేసు నమోదుపాశమైలారం ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల సంఘం కేసు నమోదుఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది రామారావుకేసు నమోదు చేసిన ఎన్హెచ్ఆర్సీమృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం యాజమాన్యం నుంచి ఇప్పించాలని పిటిషన్తాజా ప్రమాదం నేపథ్యంలో.. తెలంగాణలోని పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలని కోరిన పిటిషనర్త్వరలో ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు? యాజమాన్యం ఎక్కడ? 24 గంటలు దాటినా యాజమాన్యం రాకపోవడం బాధాకరమన్న మంత్రి శ్రీధర్బాబుఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్న శ్రీధర్బాబుప్రమాద ఘటనను కార్మిక, వైద్యశాఖ మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు: మంత్రి శ్రీధర్బాబుఅంతకుముందు.. యాజమాన్యం ఎక్కడ? అని అధికారులను ఆరా తీసిన సీఎం రేవంత్ బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి చెప్పారా? అని ప్రశ్న యాజమాన్యం రాకపోవడంపై సీఎం ఆగ్రహం సిగాచి ఘటనపై సీఎం కీలక ఆదేశాలుసిగాచి పరిశ్రమను పరిశీలించిన సీఎం, మంత్రులుఅనంతరం ప్రమాద స్థలిలోనే అధికారులతో సీఎం సమీక్షఫ్యాక్టరీ ప్రమాదంపై అధికారులను ఆరా తీసిన సీఎం రేవంత్సిగాచి పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులను ప్రశ్నించిన సీఎం రేవంత్పరిశ్రమను తనిఖీ చేశారా?.. తనిఖీల్లో ఏమైనా లోపాలను గుర్తించారా?పరిశ్రమ బోర్డు సభ్యులు ఎవరు? అంటూ ఫ్యాక్టరీస్ డైరెక్టర్‌ను అడిగిన సీఎంఘటనపై కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా?.. కారణాలు తెలుసుకోండిఇప్పటికే తనిఖీలు చేసినవాళ్లతో కాకుండా.. కొత్త వాళ్లతో విచారణ జరిపించండిఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపించి నివేదిక ఇవ్వండిఇలాంటి ప్రమాదాలపై అధికారులు అలర్ట్‌గా ఉండాలితక్షణ సాయం కింద.. మృతుల కుటుంబాలకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించాలని సీఎం ఆదేశంపాశమైలారం ఘటనా స్థలిలో సీఎం రేవంత్పాశమైలారం సిగచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డివెంట మంత్రులు పొంగులేటి, వివేక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి..ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రిప్రమాదం జరిగిన తీరును.. సహాయక చర్యలపై అధికారులను ఆరా తీస్తున్న సీఎం రేవంత్పటాన్చెరు మార్చురీలో 37 మృతదేహాలు11 మృతదేహాల గుర్తింపు పూర్తి పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలుడీఎన్ఏ టెస్ట్‌కు ఒకరోజు నుంచి రోజున్నర టైం పడుతుందంటున్న అధికారులు సిగచి ప్రమాద స్థలికి కేంద్రమంత్రి కిషన్రెడ్డిసంగారెడ్డి పటాన్ చెరువు సిగచి కంపెనీ ప్రమాద స్థలానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డిమధ్యాహ్నం ప్రమాద స్థలిని పరిశీలించి.. బాధితులను పరామర్శించనున్న కిషన్రెడ్డికిషన్రెడ్డి వెంట బీజేపీ నూతన అధ్యక్షుడు రాంచందర్‌రావు కూడాకొనసాగుతున్న మృతదేహాల గుర్తింపుపాశమైలారం ఘటనలో కొనసాగుతున్న మృతదేహాల గుర్తింపుడీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపునకు ఏర్పాట్లుఘటనాస్థలానికి వచ్చిన డీఎన్ఏ పరీక్షలు చేసే బృందాలుఇప్పటిదాకా కేవలం 6 మృతదేహాలకు మాత్రమే గుర్తింపుపటాన్చెరు బయల్దేరిన సీఎం రేవంత్రెడ్డికాసేపట్లో పటాన్చెరు పాశమైలారం పారిశ్రామికవాడకు సీఎం రేవంత్ రెడ్డిఫ్యాక్టరీ ప్రమాద బాధితులకు ఆస్పత్రిలో పరామర్శపాశమైలారం ప్రమాద స్థలిని పరిశీలించనున్న సీఎంసీఎం వెంట మంత్రులు కూడాసిగచి ఆవరణలో పోలీసు ఆంక్షలుసిగచి ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ రెడ్డిఅంతకంటే ముందు.. ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శసీఎం రాక నేపథ్యంలో సిగచి కంపెనీ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలుసిగచి కంపనీ వైపు ఎవరిని అనుమతించని పోలీసులునిన్న ప్రమాదం తర్వాత బాధిత కుటుంబాలతో పోలీసులకు వాగ్వాదంతమ వారి గురించి సరైన సమాచారం లేదని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులుతోసేసిన పోలీసులు.. ఫ్యాక్టరీ వద్ద కాసేపు ఉద్రిక్తత42కు చేరుకున్న మృతుల సంఖ్యశిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగింపు..మరో రెండు గంటల పాటు శిధిలాల తొలగించే ప్రక్రియ కొనసాగే అవకాశం..కుప్పకూలిన సిగచి ప్రొడక్షన్ బిల్డింగ్చనిపోయిన వారిలో ఎక్కువ మంది తమిళనాడు బీహార్ జార్ఖండ్ కు చెందిన వారే..వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 34 మంది క్షతగాత్రులుమూడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులుశిథిలాల కింద మరో 20 మంది42కి చేరిన మృతుల సంఖ్యశిథిలాల కిందే మరో 20 మంది?మృతుల సంఖ్య 55కి చేరే అవకాశంకొనసాగుతున్న శిథిలాల తొలగింపుధ్వంసమైన ప్లాంట్‌ను పక్కకు తొలగించిన సహాయక బృందాలుగుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలుమృతుల్లో తమిళనాడు, యూపీ వాసులేక్కువడీఎన్ఏ పరీక్షల అనంతరమే కుటుంబ సభ్యులకు అప్పగించే ఛాన్స్ఇప్పటివరకు గుర్తు పట్టినవి ఆరు మృతదేహాలు మాత్రమేఅంతకు ముందు.. ఈ ఉదయం ప్రమాదంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారిక ప్రకటన చేశారు. ఘటన వివరాలతో పాటు సహాయక చర్యలు ఇతరత్రా వివరాలను వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో 47 మంది గల్లంతు అయ్యారుఇప్పటివరకు 26 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. అందులో నాలుగు మృతదేహాలను మాత్రమే గుర్తించాం.ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరికొందరు మృతిగుర్తుపట్టలేని స్థితిలో 20 మృతదేహాలు ఉన్నాయి మరో 27 మంది జాడ తెలియాల్సి ఉందిఆస్పత్రిలో తీవ్ర గాయాలతో 35 మందికి చికిత్స అందుతోంది.. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది57 మంది సరక్షితంగా ఇంటికి వెళ్లారుప్రమాద సమయంలో మూడు అంతస్తుల భవనం కూలిపోయిందిశిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉన్నారు.. వారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయిసహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా సిబ్బంది పాల్గొంటున్నారు ఇదీ చదవండి: పరిశ్రమల్లో ప్రాణాలు.. గాలిలో దీపాలు సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూం సిగాచీ పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూంతక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు 08455–276155 నంబర్‌ను సంప్రదించవచ్చన్న కలెక్టర్ ప్రావీణ్యబ్లోయర్ పేలి.. రియాక్టర్‌కు అంటుకుని.. మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్ మైక్రోస్టెల్లయిన్ సెల్యులర్ పౌడర్ ఉత్పత్తి ప్రాథమికం సమాచారం ప్రకారం.. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్ బ్లోయర్ పేలింది. ఎగసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్‌కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భూమి కంపించినట్టు అయ్యిందన్న ప్రత్యక్ష సాక్షులు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్న కొందరు కార్మికులు అయితే ఎయిర్ ఫైర్ సిస్టమ్‌లో ప్రెషర్ వల్లే సిగాచీ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారని తెలిపారు. మృతుల్లో యాజమాన్య ప్రతినిధి?మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బిహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారీ కట్టర్లు, క్రేన్లు, హిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు. సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరా యం కలిగించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగనున్నాయి. మిన్నంటిన రోదనలు.. ఆందోళన కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. విధులకు హాజరై ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి ఆచూకీ అధికారులను ఆరా తీశారు. సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడుసంగారెడ్డి జిల్లాలోని సిగాచీ కంపెనీలో రియాక్టర్ పేలడంతో ప్రమాదం చెల్లాచెదురుగా ఎగిరిపడిన కార్మికులు, ఛిద్రమైన శరీరాలు అగ్నికీలల్లో పలువురి సజీవదహనం.. కార్మికులు, ఉద్యోగులు దుర్మరణం! సమీప ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు మృతుల్లో ఎక్కువమంది ఒడిశా, బిహార్, యూపీ వారే.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపం 36 మందికి కాలిన గాయాలు.. పలువురి పరిస్థితి విషమం కుప్పకూలిన భవనాలు.. శిథిలాల కింద మరికొందరు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్... ఘటనా స్థలాన్ని,ఆస్పత్రులను సందర్శించిన మంత్రులు.. నేడు ఘటనా స్థలానికి సీఎం రేవంత్ ఆస్పత్రిలో బాధితులకు సీఎం పరామర్శ -
నా వల్ల కావడం లేదు తల్లీ..
కూసుమంచి: రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మరణించగా, అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుమార్తె ప్రాణం ఉన్నా మంచంలోనే అచేతన స్థితిలో మిగిలింది. దీంతో కూతురిని దక్కించుకోవాలని ఆ తండ్రి శక్తికి మించి రూ.లక్షల్లో అప్పులు చేసినా ఫలితం లేక బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఇది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మాతండాకు చెందిన జర్పుల పరశురాం (46)– లలితకు సందీప్, సింధు సంతానం. పరశురాం భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం సింధు ఖమ్మంలో ఎంసెట్ పరీక్ష రాసింది.పరీక్ష ముగిశాక ఆమెను సోదరుడు సందీప్ బైక్‌పై తీసుకొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో సింధు తలకు తీవ్రగాయాలు కావడంతో మాటలేక అచేతన స్థితిలో ఉండిపోయింది. వీరి కుటుంబ దీనస్థితిని గమనించి దాతలు రూ.25 లక్షల మేర సాయం చేశారు. సింధుకు చికిత్స చేయించినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఆపై పరశురాం పలువురి వద్ద రూ.15 లక్షల వరకు అప్పు తీసుకుని చికిత్స కొనసాగించినా ఫలితం లేకపోయింది. తమకున్న పది గుంటల భూమిని అమ్ముకుందామంటే పట్టాదారు పాసుపుస్తకం లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైంది. మంచంలో బిడ్డను చూడలేకపోతున్నా.. దాతల చేయూతకు తోడు అప్పులు చేసినా బిడ్డకు నయం కాకపోవడం, భూమి అమ్మలేని పరిస్థితి ఎదురుకావడంతో పరశురాం కుమిలిపోయాడు. దీంతో ఆదివారం రాత్రి తాను కౌలుకు తీసుకున్న చేను వద్దకు వెళ్లి అక్కడి నుంచి భార్య లలితకు ఫోన్ చేశాడు. కుమార్తెకు చికిత్స చేయించేందుకు తన శక్తి సరిపోవడం లేదని, బిడ్డను ఆ స్థితిలో చూడలేకపోతున్నానని ఆమెకు చెబుతూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. దీంతో లలిత స్థానికులతో కలిసి చేను వద్దకు వెళ్లి వ్యవసాయ బావిలో పరిశీలించగా పరశురాం మృతదేహం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది
సాక్షి, హైదరాబాద్: ‘పెద్ద శబ్దం..ఒక్కసారిగా మంట లు వచ్చాయి. మొత్తం పొగ..దుమ్ము.. ఏం జరుగు తోందో తెలియలేదు. ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది. మా కళ్ల ముందే పేలుడు జరిగింది..మా ముందే చాలామంది చనిపోయారు. కొందరు మహిళ లు మంటలు అంటుకుని కాపాడాలంటూ వేడుకుంటు న్న అరుపులే ఇంకా గుర్తొస్తున్నాయి. మా చిన్నాన్నలు, అన్నలు, స్నేహితులు కనిపించకుండా పోయారు.వాళ్లు బతికి ఉన్నారో..? లేదో..? తెలియడం లేదు.. పొద్దుటి నుంచి వాళ్ల జాడ కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్నాం..ఎప్పు డు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది..’అని పాశమైలారం సిగాచి ఫ్యా క్టరీలో ప్రమాద ఘటన ప్రత్యక్ష సాక్షులు ‘సాక్షి’వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. ‘మా వాళ్ల జాడ చెప్పండి సారూ’అంటూ బాధితుల బంధువులు అక్కడికి వచి్చ న అధికారులను బతిమాలుకుంటున్న తీరు కంట తడిపెట్టించింది. తమ వాళ్ల గురించి ఎందుకు చెప్ప డం లేదంటూ కొందరు మహిళలు ఏకంగా రాళ్ల ను తీసుకుని అధికారులపై దాడి చేసినంత పని చేశా రు. వారి కుటుంబీకుల కోసం వారు చేస్తున్న ఆర్తనాదాలు..ఆగ్రహావేశాలు సైతం అందరినీ కలిచి వేశాయి. వాష్‌రూంలో ఉండగా పెద్ద శబ్దం నేను ఉదయం షిప్ట్‌లో ఉన్నా. పేలుడు జరగడానికి ఐదు నిమిషాల ముందు వరకు కూడా డ్రయింగ్ యూనిట్ దగ్గరే పనిచేస్తున్నా. మూత్ర విసర్జన కోసం బయటికి వెళ్లి పక్కన వాష్‌రూంలో ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచి్చంది. బయటికి వచ్చి చూసే సరికి పెద్దగా మంటలు..పొగ..దుమ్ము ఏమీ కనపడ లేదు. వాష్‌రూంకు వెళ్లకపోతే చనిపోయేవాడిని. – చందన్ గౌర్, కార్మికుడు, ఉత్తరప్రదేశ్ నేను రియాక్టర్ దగ్గరే పని చేస్తున్నా నేను రెండేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా. ఉదయం పేలుడు జరిగినప్పుడు రియాక్టర్ దగ్గర పనిచేస్తున్న. మొదట ఎయిర్ బ్లోయర్ పేలింది. దానివల్ల నేను పనిచేస్తున్న రియాక్టర్ కూడా పెద్ద శబ్దంతో పేలింది. అయితే పక్కనే గది నుంచి మెట్లు ఉన్న విషయం నాకు ముందు నుంచి తెలుసుకాబట్టి ఆ దారి వెతుక్కుంటూ బిల్డింగ్ పైకి వెళ్లిన. అక్కడ కూడా ఏమీ అర్థం కాలేదు. వెంటనే కూలిన ఒక గోడ పట్టుకుని పాకుతూ మొదటి అంతస్తులోకి కిందికి వచి్చన. అక్కడ కిటికిలోంచి కిందికి దూకిన. నా పక్కనే రెండు శవాలు పడి ఉన్నాయి. వెంటనే అక్కడ నుంచి బయటికి వచ్చేశా. పేలుడు జరిగినప్పుడు కనీసం 30 నుంచి 45 మంది అక్కడ ఉన్నారు. వాళ్లంతా చనిపోయే ఉంటారు. – పవన్ ఇసాద్, కార్మికుడు, ఉత్తరప్రదేశ్ మా ఇద్దరు చిన్నాన్నలు చిక్కుకున్నారు ఏడేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నా. ఇప్పటివరకు ఏ చిన్న ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగినప్పుడు నేను రియాక్టర్ రూం దగ్గరే పనిచేస్తున్న. ఒక్కసారిగా పెద్ద శబ్దం.. వెంటనే మంటలు అంటుకున్నాయి. దీంతో కిందికి పారిపోయిన. కానీ మా చిన్నాన్నలు శశికుమార్, లఖ్నజీత్ ఇద్దరు లోపలే చిక్కుకున్నారు. ఒకరి శవం దొరికింది. ఇంకొకరు ఏమయ్యారోఏమో.. – విజయ్, బక్సర్ జిల్లా బిహార్ ముగ్గురిని కాపాడినం.. నేను ప్రమాదం జరిగినప్పుడు పక్కన బిల్డింగ్‌లో టిఫిన్ చేస్తున్న. బయటికి వచ్చేసరికి మొత్తం పొగ ఉంది. ఏం కనిపించలేదు. కాసేపటికి అంతా అటు ఇటు ఉరుకుతున్నరు. పక్కన అడ్మిని్రస్టేషన్ బిల్డింగ్ దగ్గర కొంతమంది కాపాడాలని అరుస్తున్నారు. నేను, ఇంకో ఇద్దరం కలిసి వాళ్ల దగ్గరికి వెళ్లినం. పైన ఫ్లోర్ నుంచి మెల్లగా కిందికి దింపి ముగ్గురిని కాపాడినం. – శివ, కార్మికుడు, ఒడిశా డ్యూటీలోనే దూరంగా ఉన్నా.. నేను ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న. పేలుడు జరిగినప్పుడు డ్యూటీలోనే ఉన్న. కానీ స్పాట్‌కు దూరంగా ఉన్న. పె ద్ద శబ్దం వచి్చంది. ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే అటువైపు పరుగెత్తుకుంటూ వెళ్లిన. ఎవరెరు చనిపోయారో అర్థం కాలేదు. అనేకమంది గాయపడ్డారు. – సంతోష్ కుమార్, ఉద్యోగి, ఏపీ ఆచూకీ లేనివారు ఎంతమంది?సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన తర్వాత ఆచూకీ లేకుండా పోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సోమవారం పరిశ్రమలో విధులకు వెళ్లినవారు ఇంటికి తిరిగి రాక.. ఆసుపత్రుల్లోనూ కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో అసలెంత మంది ఉన్నారు.. ప్రమాదం నుంచి బయటపడిన వారు ఎంతమంది.. అనేదానిపై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత లేకుండా పోయింది.ఒకవైపు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా, శిథిలాల కింద ఎంతమంది ఉండి ఉంటారనే దానిపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించినట్లు తెలిసింది. రెండు మృతదేహాలు శిథిలాల కింద లభ్యమైనట్లు చెబుతున్నారు. మృతదేహాలను పోలీసులు ఆసుపత్రులకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. డీఎన్ఏ పరీక్షలు చేపడుతున్నట్లు తెలిసింది. కుటుంబసభ్యుల డీఎన్ఏలతో పోల్చాకే మృతదేహాలను అప్పగించనున్నట్లు సమాచారం. సోమవారం రాత్రి వరకు ముగ్గురిని గుర్తించినట్లు తెలుస్తుండగా.. దీన్ని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. కాగా ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల తరలింపునకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా 10 అంబులెన్సులను ఏర్పాటు చేశారు. కంపెనీ డ్రైవర్ సమయస్ఫూర్తి8 మంది క్షతగాత్రులను బస్సులో ఆస్పత్రికి తరలింపుసాక్షి, హైదరాబాద్: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగిన వెంటనే అక్కడ భయానక వాతావరణం నెలకొంది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అయితే జరిగిన ఘటన నుంచి క్షణాల్లో తేరుకున్న కంపెనీ బస్సు డ్రైవర్ లాల్‌రెడ్డి సమయస్ఫూర్తితో వ్యవహరించారు. పేలుడు కారణంగా బస్సు ధ్వంసమైనా వెనుకడుగు వేయకుండా బాధితులను ముత్తంగిలోని ఆసుపత్రికి తరలించారు.ఘటన జరిగిన తీరును ఆయన ‘సాక్షి’ కి వివరించారు. ‘నేను జనరల్ షిప్ట్ వాళ్లను కంపెనీకి తీసుకువచ్చి న తర్వాత బస్సును పార్క్ చేసి కూర్చుని ఉన్నా. కొద్ది నిమిషాల్లోనే పెద్ద శబ్దం విని్పంచింది. కాసేపటికి అంతా గాయాలతో బయటికి వస్తున్నారు. ఇంకా అంబులెన్స్‌లేవీ రాలేదు. నేను వెంటనే 8 మందిని బస్సులో ఎక్కించుకుని ముత్తంగి ఆసుపత్రికి తీసుకెళ్లిన. అక్కడి నుంచి మదీనగూడ ఆసుపత్రికి తీసుకొచి్చన. ఆషాక్ నుంచి బయటికి రాలేకపోతున్నా..’అని లాల్‌రెడ్డి వివరించారు. -
బతుకులు బుగ్గి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు టౌన్/పటాన్చెరు/రామచంద్రాపురం/జిన్నారం/చందానగర్: ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరున్న పాశమైలారంలోని సిగాచి అనే ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. కంపెనీలోని రియాక్టర్ పేలిపోగా దాని తీవ్రతకు మూడంతస్తుల భవనాలు రెండు కుప్పకూలిపోయాయి. పరిశ్రమ పైకప్పు, రేకులు, ఇతర యంత్ర భాగాలు ఎగిరి వంద మీటర్ల దూరంలో పడ్డాయి. యంత్రాల భాగాలు చెల్లాచెదురయ్యాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న 100 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయారు. శరీరాలు ఛిద్రమైపోయాయి. 10 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా ఇద్దరు ఆస్పత్రుల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. మొత్తం 16 మంది మరణించినట్లు అనధికారిక సమాచారంకాగా, మంత్రులు దామోదర, వివేక్ మాత్రం 12 మంది మరణించినట్లు ప్రకటించారు. మృతదేహాలను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. సుమారు 36 మంది గాయపడ్డారు. 20 మందికి పైగా కార్మికులకు 80 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలో ఉన్న పటాన్చెరు, చందానగర్, మదీనాగూడ, మియాపూర్‌లలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనాల శిథిలాల కింద మరింత మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పరిశ్రమ ఆవరణలో భీతావహ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు సందర్శించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఘోర దుర్ఘటనపై ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తదితర ప్రముఖులు ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. బ్లోయర్ పేలి.. రియాక్టర్‌కు అంటుకుని.. మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్ మైక్రోస్టెల్లయిన్ సెల్యులర్ పౌడర్‌ను ఉ త్పత్తి చేస్తారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్ బ్లోయర్ పేలింది. దీంతో ఎగసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్‌కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భూమి కంపించినట్టు అయ్యింది. కొందరు కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మృతుల్లో యాజమాన్య ప్రతినిధి? మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బిహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారీ కట్టర్లు, క్రేన్లు, హిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరా యం కలిగించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగనున్నాయి. మిన్నంటిన రోదనలు.. ఆందోళన కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. విధులకు హాజరై ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి ఆచూకీ అధికారులను ఆరా తీశారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి దామోదర రాజనర్సింహ నాలుగు గంటల పాటు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్‌కు పలు సూచనలిచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పరిశ్రమల శాఖ ఫైర్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఎయిర్ ఫైర్ సిస్టమ్‌లో ప్రెషర్ వల్లే సిగాచీ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వం తరఫున మెరుగైన ఎక్స్‌గ్రేషియా అందించేందుకు కృషి చేస్తామన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మంత్రులు దామోదర, వివేక్ రాజకీయం చేయొద్దు: మంత్రులు పేలుడు ఘటనలో గాయపడిన వారిలో హేమ సుందర్, ధర్మరాజ్ ప్రసాద్, రాజేష్ కుమార్ చౌదరి, కమలేష్ ముఖియా, చందన్‌కుమార్ నాయక్, నగ్నజిత్, అభిషేక్ కుమార్, అజిత్ తివారి, సంజయ్‌కుమార్, యశ్వంత్ కుమార్, ధన్వీర్ కుమార్, సంజయ్ ముఖియా, రాజశేఖర్‌రెడ్డి, దేవనంద్, గణేష్ కుమార్, సంజయ్‌కుమార్ యాదవ్, నీలాంబర్ బట్రా, సమీర్, అమర్జిత్, అర్జున్‌కుమార్, అజిమ్ అన్సారీలను మియాపూర్ మదీనాగూడలోని ప్రణామ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ అభిషేక్ కుమార్, అజిత్ తివారి మృతి చెందారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో ఉన్నవారిని మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దీనిపై ఎవరూ ఎలాంటి రాజకీయం చేయవద్దని కోరారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఇందుకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూం.. సిగాచీ పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. తక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు 08455–276155 నంబర్‌ను సంప్రదించవచ్చని కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. నేడు సీఎం సందర్శన సిగాచి పరిశ్రమను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఉదయం 10 గంటలకు సందర్శించనున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నారు. అక్కడి కార్మికులతో మాట్లాడనున్నారు. సహాయక చర్యలను కూడా పరిశీలిస్తారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: కేసీఆర్ సిగాచి పరిశ్రమ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని, చనిపోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఇలావుండగా పాశమైలారం పరిశ్రమలో రియాక్టర్ పేలుడు అత్యంత విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పలువురు కార్మికులు చనిపోయారన్న వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధానిసాక్షి, న్యూఢిల్లీ: సంగారెడ్డి జిల్లాలో సంభవించిన పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రధాని తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ‘ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా..’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఈ ఘోర ప్రమాదం గురించి విని చాలా బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తక్షణ సహాయ, రక్షణ చర్యలు చేపడుతున్నారు..’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘ఈ ఘోర ప్రమాదంలో అమూల్యమైన ప్రాణాలు పోవడం ఎంతో దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం..’ అని ఖర్గే అన్నారు.సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. ప్రమాదంపై ఆరా సాక్షి, హైదరాబాద్: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదంఫై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌ను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ జితేందర్, సీఎస్ రామకృష్ణారావుతో సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున సీఎస్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. డిజాస్టర్‌మేనేజ్‌మెంట్‌స్పెషల్ సీఎస్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఫైర్‌సరీ్వసెస్‌అడిషనల్‌డీజీని సభ్యులుగా నియమించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతను కమిటీకి అప్పగించారు. -
భర్త వివాహేతర సంబంధం.. భార్య అనుమానాస్పద మృతి
పీలేరు(అన్నమయ్య): అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని కాకులారంపల్లె పంచాయతీ బందారువాండ్లపల్లెలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం వెంగంపల్లెకు చెందిన లోకనాథరెడ్డి, జీవనజ్యోతి కుమార్తె ఇందుజా (30)కు ఐదేళ్ల క్రితం బందారువాండ్లపల్లెకు చెందిన వరంపాటి శంకర్‌రెడ్డి కుమారుడు విజయశేఖర్‌రెడ్డితో వివాహం జరిగింది. కొంతకాలంపాటు వారి సంసారం సజావుగా సాగింది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. విజయశేఖర్‌రెడ్డి వేరే మహిళతో వివాహేతర సంబంధం కలిగి వుండడంతో తరచూ భార్య భర్తలు గొడవ పడేవారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఇందుజా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు పీలేరుకు చేరుకుని తమ కుమార్తెను అత్తింటివారే కడతేర్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్‌రెడ్డి స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి, బంధువుల ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
చెత్త బండీలో మహిళ మృతదేహం.. దారుణానికి పాల్పడ్డ లివ్ ఇన్ పార్ట్నర్
బెంగళూరు: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పసివయసు వారి నించి వృద్ధ మహిళల వరకూ ఎక్కడో ఒకచోట ప్రతీరోజూ అకృత్యాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఇటువంటి దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. మహిళను నమ్మించి, ఆమెతో సహజీవనం సాగించి, ఆనక ఆమెను కడతేర్చిన ప్రబుద్ధుని ఉదంతం కలకలం రేపుతోంది.బెంగళూరులో ఒక మహిళ మృతదేహాన్ని ఒక చెత్త ట్రక్కులో పోలీసులు కనుగొన్నారు. ఆ మృతదేహాన్ని ఒక సంచిలో ఉంచి, దానిని చెత్త ట్రక్కులో పడవేసినట్లు గుర్తించారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మహిళను ఆమె లివ్ ఇన్ పార్ట్నర్ హత్య చేశాడని కనుగొన్నారు. మృతురాలిని ఆశ(40)గా పోలీసులు గుర్తించారు. ఆమెకు మహ్మద్ షంషుద్దీన్(33) అనే వ్యక్తితో సంబంధం ఉందని, అతనే ఆమెను హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.బెంగళూరు పౌర సంస్థ బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) సిబ్బంది ఒక చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం కలిగిన గోనె సంచిని చూసింది. ఆ మహిళ చేతులను కట్టివేసి, గొనె సంచిలో కుక్కివేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంనకు పంపి, కేసు దర్యాప్తు ప్రారంభించారు.మృతురాలికి సంబంధించిన ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుడిని అస్సాంకు చెందిన మహ్మద్ షంషుద్దీన్‌గా గుర్తించారు. నిందితుడు ఆశతో ఏడాదిన్నరగా లివ్ ఇన్‌లో ఉన్నాడు. వారిద్దరూ దక్షిణ బెంగళూరులోని హులిమావులో ఒక అద్దె ఇంట్లో కలిసి ఉన్నారు. నిందితుడు, బాధితురాలికి గతంలోనే వేర్వేరుగా వివాహాలు కాగా, వారికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆశ,మహ్మద్ షంషుద్దీన్‌లు తాము భార్యాభర్తలమని చుట్టుపక్కల వారికి చెప్పేవారు.ఆశా అర్బన్ కంపెనీలో పనిచేస్తూ, గృహనిర్వాహక సేవలను అందిస్తుంటుంది. మహమ్మద్ షంషుద్దీన్ భార్య, ఇద్దరు పిల్లలు అస్సాంలోనే ఉన్నారు. ఈ కేసు గురించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) లోకేష్ బి జగల్సర్ మాట్లాడుతూ ఆశ, షంషుద్దీన్ మధ్య గొడవ జరిగిందని, అది మరింత తీవ్రం కావడంతో షంషుద్దీన్.. ఆశను గొంతు కోసి చంపాడని తెలిపారు. తరువాత అతను ఆశ మృతదేహాన్ని గొనె సంచిలో కుక్కివేసి, దానిని బైక్‌పై తీసుకువెళ్లి చెత్త ట్రక్కులో పడవేసి అక్కడి నుండి పారిపోయాన్నారు. అయితే ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో నిందితుడు పట్టుబడ్డాడని జగల్సర్ తెలిపారు. -
ఎస్ఐ రాణాప్రతాప్ సతీమణి ఆత్మహత్య.. ఏం జరిగింది?
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఎస్ఐ భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలానికి చెందిన ఖమ్మం జీఆర్పీ ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం జూలురుపాడులో పురుగుల మందు తాగిన రాజేశ్వరి ఆత్మహత్యాయత్నం చేశారు. అది గమనించి కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రాజేశ్వరి సోమవారం మృతి చెందారు. అనంతరం, మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయితే, వేధింపుల కారణంగానే రాజేశ్వరి మృతి చెందినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.ఇక, ఎస్ఐ రాణా ప్రతాప్, రాజేశ్వరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, మొదటి నుంచి రాణా ప్రతాప్ దురుసు ప్రవర్తన కలిగిన వ్యక్తి అని.. వివాదాల్లో ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. ఖమ్మంలో ట్రైనీ ఎస్ఐగా ఉన్న సమయంలో సర్వీస్ రివాల్వర్ చూపెట్టి బెదిరించి దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. సస్పెండ్ అయినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు.. రాణా ప్రతాప్ సోదరుడు మహేష్ కూడా ఎస్ఐగానే విధులు నిర్వహిస్తునన్నారు. -
ఆర్ఎంపీ వివాహేతర సంబంధం.. జ్యోతిని కారులో తీసుకెళ్లి..
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను పక్కాగా ప్లాన్ ప్రకారం ఓ ఆర్ఎంపీ హత్య చేశాడు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే పూడ్చిపెట్టేందుకు యత్నం చేశాడు. కానీ, పోలీసులు రంగం ప్రవేశం చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని గుర్రంపోడ్ మండలంలో మహేష్ అనే వ్యక్తి ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక జునూతలలో జ్యోతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా.. వివాహేతర సంబంధానికి దారి తీసినట్టు తెలిసింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో, ఒత్తిడికి గురైన మహేష్.. జ్యోతిని అడ్డుతొలంగిచుకోవాలని చూశాడు. తాజాగా ఆమెతో మాట్లాడిన మహేష్.. బయటకు తీసుకెళ్లే నెపంతో దేవరకొండ నుంచి బాధితురాలిని తీసుకుని కారులో బయలుదేరాడు.అనంతరం, మార్గ మధ్యంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, ఆగ్రహానికి లోనైన మహేష్.. అప్పటికే తన వెంట తెచ్చుకున్న గడ్డి మందును బలవంతంగా ఆమెతో తాగించాడు. జ్యోతిని హత్య చేసేందుకు పక్కాగా ప్లాన్.. ఆమెకు విషపు ఇంజక్షన్ కూడా ఇచ్చాడు. జ్యోతి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే.. ఆమెను మట్టిలో పూడ్చిపెట్టాలని అనుకున్నాడు. అయితే, మహేష్ వెళ్తున్న కారుపై అనుమానం వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు.. అతడిని వెంబడించారు. కారును ఆపి పరిశీలించగా.. కొన ఊపిరితో ఉన్న జ్యోతిని చూసి వెంటనే.. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలోనే జ్యోతి మృతి చెందింది. అనంతరం, నిందితుడు మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. -
రియాక్టర్ మొదట బ్లాస్ట్ కాలేదు.. ఫ్యాక్టరీ ప్రమాదంపై మంత్రి వివేక్
పటాన్చెరు పారిశ్రామికవాడ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. షిఫ్ట్‌లో 150 మంది కార్మికులు ఉండగా.. ప్రమాదం జరిగిన బ్లాక్‌లోనే 90 మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. మృతుల సంఖ్య 15కి చేరింది. కంపెనీ మేనేజర్ ఒకరు సైతం మృతి చెందినట్లు సమాచారం. 26 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అందులో పలువురిపరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంగారెడ్డి, సాక్షి: పటాన్చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్ సహా చాలా భాగం దెబ్బతింది. ఆ సమయంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పరిసరాల్లోనే భారీ సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం 9గం. సమయంలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలి మంటలు వ్యాపించాయి. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు. కంపెనీలో ఎక్కడ పడితే అక్కడ క్షతగాత్రులు పడిపోయారు. ప్రమాద సమయంలో లోపల కార్మికులు చాలామందే ఉన్నారు. మంటల్లో.. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకునిపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలిపారు. అలాగే అధికారులు సకాలంలో స్పందించి చుట్టపక్కల ప్రజలను ఖాళీ చేయించడంతో మరింత ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో.. సహాయక చర్యలపై మంత్రులు కీలక ప్రకటనలు చేస్తున్నారు.భవన శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కార్మికులుశిథిలాలను తొగించిన కొద్దీ బయటపడుతున్న మృతదేహాలుగుర్తు పట్టరాని స్థితిలో మృతదేహాలుపాశమైలారంలోని ప్రమాద స్థలం నుంచి మరో రెండు మృత దేహాలు వెలికితీత15కి చేరిన మృతుల సంఖ్యమరణాలు, క్షతగాత్రుల సంఖ్యపై వెలువడని అధికారిక ప్రకటనపరిశ్రమ వద్ద, ఆస్పత్రుల వద్ద కార్మికుల కుటుంబాల నిరీక్షణ.. రోదనలుఆచూకీ లభించక శోకసంద్రంలో కుటుంబాలుభారీ వర్షంలోనూ కొనసాగుతున్న సహాయక చర్యలురేపు సంగారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్రెడ్డిరేపు ఉదయం పాశమైలారం ప్రమాద ఘటన స్థలానికి వెళ్లనున్న రేవంత్పాశమైలారం ఘటనపై సీఎం విచారంక్షేత్ర స్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలపై సీఎం ఆరాప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశంగాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన సీఎంబాధాకరం: ప్రధాని మోదీ సంగారెడ్డి ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతిచాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరంతమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానుక్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాంసీఎం రేవంత్ విచారంపాశమైలారం ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో పలువురు మరణించడం బాధాకరమన్న ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ఆదేశాలిచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కేటీఆర్ దిగ్భ్రాంతిపటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన రియాక్టర్ పేలుడుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతికార్మికులు చనిపోవడం అత్యంత విషాదకరంగాయపడిన వారిని రక్షించి అత్యుత్తమ వైద్య సహాయం అందించాలిమృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలిప్రమాదానికి కారణాలు తెలుసుకుని బాధ్యులను శిక్షించాలి 15 నిమిషాల్లో స్పందించాం: మంత్రి వివేక్ఘటన జరిగిన 15నిమిషాల్లో స్పందించాం. కలెక్టర్, జిల్లా యంత్రాగ సమన్వయంతో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. వెంటనే 34మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం.. 12మంది ఐసీయూలో ఉన్నారు. వెంటిలేటర్ పై చికిత్స అందుతోంది. మొత్తం ఘటనలో12మంది చనిపోయారు. ప్రమాదంలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చర్మం, శరీరం తీవ్రంగా కాలిపోయాయి. హైడ్రా కూడా చేరుకుంది.. షాకిలాలను తీసివేస్తున్నారు. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది.. రియాక్టర్ మొదట బ్లాస్ట్ కాలేదు. నిర్లక్ష్యం ఏంటి అనేది ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది. నిజంగా విచారణ జరిపి బాద్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం అని మంత్రి వివేక్ మీడియాకు తెలిపారు.ఎక్కడా నిర్లక్ష్యం లేదు: మంత్రి రాజనర్సింహసిగాచి కంపెనీ ప్రమాదంపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందని.. సకాలంలో స్పందించి ఉంటే ప్రాణాలు పోయేవి కావని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలను మంత్రి దామోదర రాజనర్సింహ ఖండించారు. సిగచి కంపెనీ ప్రమాదం బాధాకరం. ఉదయం 9గం.ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మూడు గంటల నుంచి ప్రమాద స్థలంలోనే ఉన్నాం. సంఘటన జరిగినా వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. ఎమర్జెన్సీ సిస్టం ద్వారా త్వరితగతిన క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాం. ఫ్యాక్టరీలో మైక్రో క్రిస్టల్ పౌడర్ ని తయారు చేస్తుంటారు. మార్నింగ్ 60మంది వర్కర్స్ పనిలో ఉన్నారు. జనరల్ వాళ్ళు 20మంది ఉన్నారు. ఆస్పత్రిలో 34మందికి చికిత్స అందుతోంది. 12 మృతదేహాలను ఇప్పటిదాకా వెలికి తీశాం. ప్రతి కార్మికుడికి ప్రభుత్వం వైద్యం అందిస్తుంది.. ఎక్కడ నిర్లక్ష్యం లేదు. మృతుల కుటుంబాలను పరామర్శిస్తాం. ప్రభుత్వం తరపున బాధితులకు అండగా ఉంటాం. ప్రతి కార్మిక కుటుంబాన్ని అదుకుంటాం. ఈ ప్రమాదాన్ని రాజకీయం చేయడం సరికాదు అని మంత్రి రాజనర్సింహ అన్నారు. ఇదీ చదవండి: ఫ్యాక్టరీ ప్రమాదం.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే!👉ఐజీ సత్యనారాయణ ప్రమాదంపై మీడియాతో మాట్లాడారు. రియాక్టర్ పేలడంతో ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన టైంలో.. షిఫ్ట్‌లో 150 మంది ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటిదాకా 8 మంది మరణించారు. మూడు ఆస్పత్రుల్లో 26 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకొక బ్లాక్ ఓపెన్ చేయాల్సి ఉంది.. అందులో కార్మికులు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది అని తెలిపారు. 👉ప్రమాదం తర్వాత.. ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ప్రమాదం గురించి తెలియగానే కలెక్టర్, ఐజీ, సంగారెడ్డి ఎస్పీ, అడిషనల్ కలెక్టర్.. అధికార యంత్రాంగమంతా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాద వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 👉ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగ, ఘాటైన వాసనలు వెలువడుతుండడంతో అక్కడున్నవాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో అటువైపుగా ఎవరూ రావొద్దని స్థానికులను పోలీసులు కోరుతున్నారు. మొత్తం 8 ఫైర్ ఇంజిన్లు అక్కిడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయి. ప్రమాద స్థలానికి భారీగా ఆంబులెన్స్‌లు చేరుకుని క్షతగాత్రుల్ని తరలిస్తున్నాయి. భారీ క్రేన్లు, కట్టర్ల సాయంతో ఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా బృందం.. అడ్మిన్‌స్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. -
సీసీటీవీ సాక్షిగా భార్యాభర్తల గొడవ, ఆ మర్నాడే..
జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక దంపతుల జంట వారి ఇంట్లో అచేతనంగా కనిపించింది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ జంట ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. అలాగే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు.జైపూర్‌లోని ఒక బ్యాంకులో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్ర సమయం గడుస్తున్నా బ్యాంకుకు రాకపోవడంతో, సిబ్బంది అతనికి కాల్ చేశారు. దానికి కూడా సమాధానం రాకపోవడంతో ధర్మేంద్ర స్నేహితుడు అతని ఇంటికి వెళ్లాడు. అతను ఇంటి తలుపు తెరవగానే ధర్మేంద్రతో పాటు అతని భార్య విగతజీవులుగా కనిపించారు.కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వారి ఫ్లాట్ పార్కింగ్ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా, దానిలో ధర్మేంద్ర, సుమన్‌లు ఏదో విషయమై తీవ్ర స్థాయిలో అరుచుకుంటూ, వాదించుకోవడం కనిపించింది. ఈ ఫుటేజ్ దంపతులు మృతిచెందడానికి ముందురోజుదిగా పోలీసులు గుర్తించారు. అలాగే ఆ వీడియోలో సుమన్ తన భర్త కారు తీయడాన్ని అడ్డుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆ తరువాత వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వారు తమ ఇంటిలోనికి వెళ్లిపోయారు.అదే రోజు సాయంత్రం నాటి మరో వీడియోలో వారు అపార్ట్మెంట్లోకి ప్రవేశించడం కనిపించింది. ఆ సమయంలో సుమన్ ఒక బ్యాగ్ తీసుకెళుతున్నది. ఇద్దరూ సజీవంగా కనిపించిన చివరి ఫుటేజ్ ఇదే. కాగా ఈ జంట ఇటీవలే ఫ్లాట్‌ను కొనుగోలు చేశారని, వారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని స్థానికులు తెలిపారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ప్రస్తుతం భరత్‌పూర్‌లోని తాత ఇంటిలో ఉన్నారు. కాగా సుమన్ తండ్రి అజయ్ సింగ్ పోలీసులతో మాట్లాడుతూ తన కుమార్తె శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని, ఇది హత్యనని ఆరోపించారు.ఇది కూడా చదవండి: Kolkata: బాధితురాలిని బలవంతంగా.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు -
మరో మలుపు తిరిగిన యాంకర్ స్వేచ్ఛ కేసు
తెలుగు యాంకర్ స్వేచ్ఛ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. మృతురాలిపై సంచలన ఆరోపణలు చేసిన ఆమె.. ఇటు తన భర్త అమాయకుడంటూ చెబుతోంది. హైదరాబాద్, సాక్షి: న్యూస్ రీడర్ స్వేచ్ఛా వొటార్కర్(Swetcha Votarkar Case) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. స్వేచ్ఛపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఇటు తన భర్త ఎలాంటి తప్పు చేయలేదంటూ సాక్షికి తెలిపింది. పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ నాకు పరిచయమైంది. వారిద్దరి మధ్య సంబంధం మొదట్లో నాకు తెలియదు. అది తెలిశాకే పూర్ణను వదిలేశాను. స్వేచ్ఛ నన్ను మానసికంగా వేధించింది. నా పిల్లలను కూడా ‘అమ్మా’ అని పిలవాలని భయపెట్టింది. నా భర్త పూర్ణ నిర్దోషి, అమాయకుడు. .. పూర్ణచందర్‌పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యం. అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నాడు. పూర్ణనే స్వేచ్ఛ బ్లాక్మెయిల్ చేసింది అని స్వప్న మీడియాకు తెలిపింది. ఇదిలా ఉంటే.. పలు టీవీ ఛానెల్స్‌లో న్యూస్‌రీడర్, యాంకర్‌గా పని చేసిన స్వేచ్ఛ(40) శుక్రవారం రాత్రి తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఈ కేసులో అనుమానాలు ఉన్నాయని చెబుతూ.. స్వేచ్ఛ సహజీవనం చేసిన పూర్ణచందర్‌పై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పూర్ణచందర్.. చివరకు పోలీసులకు లొంగిపోయాడు. ఇదిలా ఉండగానే.. స్వేచ్ఛ కూతురు అరణ్య తనను పూర్ణ వేధించేవాడంటూ మీడియాకు చెప్పడం సంచలనంగా మారింది. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో.. ఇప్పుడు పూర్ణ భార్య మీడియా ముందుకు రావడం గమనార్హం.యాంకర్ స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మానసిక వేదన వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న ఆయన.. కేసు నుంచి రక్షించుకోవడానికే పూర్ణ చందర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పూర్ణ మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు.. పాప పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవం అని అన్నారాయన. లొంగిపోయే ముందు పూర్ణ చందర్ మీడియాకు విడుదల చేసిన ఐదు పేజీల లేఖలో ఏం ఉందంటే.. నాకు స్వేచ్ఛ 2009 నుంచే తెలుసు. ఆ సమయంలో ఇద్దరం కలిసి ఓ ఛానెల్లో పని చేశాం. అప్పట్లో స్వేచ్ఛ తన వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను నాతో పంచుకుంటూ ఉండేది. కానీ నిజమైన సాన్నిహిత్యం మాత్రం 2020 తర్వాత మొదలైంది. స్వేచ్ఛ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవ్వడానికి ప్రధాన కారణం ఆమె తల్లిదండ్రుల తీరే. చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఆమెను వదిలేసి ఉద్యమాల్లో భాగమయ్యారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కలిసేవారు. ఈ విషయాన్ని ఆమె ఎన్నోసార్లు నాతో పంచుకుంది. కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే ఆమెని మనోవేదనకు గురి చేశాయి. 2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి హైదరాబాద్‌లోని కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇక 2022లో తన కూతురు అరణ్యని కూడా నా వద్దకు తీసుకువచ్చింది. కుమార్తె భవిష్యత్తు పట్ల చాలా ఆందోళనగా ఉండేది. తన కూతురికి తనలాంటి జీవితాన్ని అందించకూడదని చెప్పేది. అందుకే ఆమె అన్ని బాధ్యతలు నాకు అప్పగించింది. తాను ఒక తండ్రి లా ఆ పిల్ల బాధ్యతలు చూసుకున్నాను. స్వేచ్ఛ జీవితంలో ఎప్పుడూ పూర్తిగా సంతోషంగా లేదు. తన బాధను మర్చిపోవడానికి కుమార్తెతో ఎక్కువ సమయం గడిపి ఓదార్పు పొందేది అని పూర్ణ చందర్ పేర్కొన్నాడు. -
నాన్నా.. ఈ మెంటల్ టార్ఛర్ భరించలేకున్నా!
అన్నానగర్: తిరుప్పూర్ జిల్లా అవినాశిలోని కైకాట్టిపుదూర్ ప్రాంతానికి చెందిన అన్నాదురై బనియన్ కంపెనీ నడుపుతున్నాడు. ఇతని కూతురు రిదన్య ( 27). ఈమెకి కైకట్టిపుదూర్ లోని జయం గార్డె¯న్కు చెందిన కవింకుమార్కు మూడు నెలల క్రితం వివాహమైంది. శనివారం ఇంటి నుంచి కారు తీసుకెళ్లిన రిదన్య ఆ తర్వాత తిరిగి రాలేదు. ఇంతలో, మొండిపాళయం సమీపంలోని చెట్టిపుత్తూరులో కొబ్బరి చెట్లకు ఉపయోగించే పురుగుమందుల మాత్రలు మింగి రిదన్య తన కారులో మృతి చెంది కనిపించింది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న సేవూర్ పోలీసులు రిదన్య మతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం అవినాశి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. కుటుంబ వివాదం కారణంగా రిదన్య విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ముందు రిదన్య తన తండ్రికి వాట్సాప్ ద్వారా కొన్ని ఆడియోలను పంపింది. పోలీసులు వాటిని స్వా«దీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అందులో భర్త కవిన్‌కుమార్, మామగారు ఈశ్వరమూర్తి, అత్తగారు చిత్రాదేవి, ఆమెను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని పేర్కొంది. ఇకపై ఈ జీవితాన్ని గడపలేనని వెల్లడించింది. రిదన్యకు పెళ్లయి 3 నెలలే కావడంతో, ఆర్టీఓ దర్యాప్తు కూడా జరుగుతోంది. -
Kolkata: బాధితురాలిని బలవంతంగా.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో విద్యార్థినిపై జరిగిన అకృత్యం దేశవ్యాపంగా సంచలనం సృష్టించింది. కేసు దర్యాప్తులో పలు విస్తుపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. బాధితురాలిని ఇద్దరు నిందితులు కళాశాల లోపలికి బలవంతంగా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కనిపించాయి. ఈ కేసులో ప్రధాన నిందితుని నుంచి వచ్చిన వివాహ ప్రతిపాదనను బాధితురాలు తిరస్కరించిన నేపధ్యంలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.అత్యాచార బాధితురాలిని కళాశాల గేటు నుండి కళాశాల ప్రాంగణంలోకి ఇద్దరు నిందితులు బలవంతంగా లాక్కెళుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో బయటపడ్డాయని కోల్‌కతా పోలీసు వర్గాలు మీడియాకు తెలిపాయి. ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా మరో ఇద్దరు నిందితులతో తనను బలవంతంగా గార్డు గదిలోనికి తీసుకువెళ్లాలని ఆదేశించాడని బాధితురాలు చెప్పడాన్ని ఈ వీడియో క్లిప్ ధృవీకరిస్తోంది. ప్రస్తుతం తాము ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఈ కేసులో నిందితులు మనోజిత్ మిశ్రా, ప్రోమిత్ ముఖర్జీ, జైద్ అహ్మద్, కాలేజీ సెక్యూరిటీ గార్డులను ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేశారు. మనోజిత్ బాధితురాలిపై అత్యాచారం చేశాడని, మిగిలిన ఇద్దరు ఆమెను బ్లాక్ మెయిల్ చేసేందుకు వీడియో చిత్రీకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనోజిత్ మిశ్రా తృణమూల్ యువజన విభాగంలో సభ్యునిగా ఉన్నారు. దీంతో పార్టీపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తోంది.ఇది కూడా చదవండి: Maharashtra:‘హిందీ’పై గరంగరం.. త్రిభాషా విధానం రద్దు -
మేం ఉండలేం.. బావమరదలు ఒకేసారి...
సాక్షి, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఓ రిసార్టులో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, ఇద్దరూ వేర్వేరుగా వివాహం చేసుకున్నారు. కాగా, ఇద్దరు సన్నిహితంగా ఉండటంతో వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుందని ఇరు కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వీడియో, లేఖలో పేర్కొన్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీబీనగర్ ఎస్ఐ రమేశ్ మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లాకు చెందిన బంధబాల సుధాకర్ (39), రామంతాపూర్‌లోని గాంధీ నగర్‌కు చెందిన పాసాల సుష్మిత (35) సమీప బంధువులు. ఇద్దరూ వేర్వేరుగా వివాహం చేసుకున్నారు. వీరి స్వగ్రామం నల్గొండ జిల్లా కేతేపల్లి.. ఇద్దరు వరుసకు బావామరదలు అవుతారు. ఇరు కుటుంబాలు ప్రస్తుతం రామంతపూర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, వీరిద్దరూ సన్నిహితంగా ఉండటంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుందని ఇరు కుటుంబాల్లో తగాదాలు జరుగుతున్నాయి.ఇదే కారణంగా నల్గొండ జిల్లాలోని కేతేపల్లి పోలీస్ స్టేషన్లో సుష్మితపై ఆమె భర్త కేసు పెట్టారు. దీంతో మనస్తాపానికి గురై రెండు రోజుల కిందట బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని రిసార్ట్‌లో సుష్మిత, సుధాకర్ రూమ్ తీసుకొని ఇక్కడే ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకుంటున్నట్లు సుధాకర్ తన బావ రంజిత్‌కి వీడియో కాల్ చేసి చెప్పాడు. కానీ ఎక్కడ నుంచి ఫోన్ చేసినట్లు చెప్పలేదు. ఉప్పల్ పోలీసుల సాయంతో బీబీనగర్ పోలీస్ స్టేషన్‌కు రంజిత్ సమాచారం ఇచ్చాడు. ఆదివారం సాయంత్రం మొబైల్ నెట్వర్క్ ఆధారంగా కొండమడుగు శివారులోని రిసార్ట్స్‌కు చేరుకొన్నారు. వారు ఉంటున్న రూమ్ తలుపులు పగులకొట్టి చూసేసరికి ఇద్దరు మృతి చెంది ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఇదిలాఉండగా.. చనిపోయే ముందు సుష్మిత, బాల సుధాకర్ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియోలో బాల సుధాకర్ మాట్లాడుతూ.. ఆయన భార్య తనను వేధిస్తోందన్నారు. ప్రతీ విషయంలో తనను అనుమానిస్తున్నట్టు తెలిపారు. అలాగే, సుష్మిత మాట్లాడుతూ.. తన భర్త వేధింపులు భరించలేకపోతున్నాను. బాల సుధాకర్‌తో మాట్లాడినందుకే నాతో అక్రమ సంబంధం అంటగట్టాడు. అందరిలో నన్ను తల దించుకునేలా చేశాడు అని తెలిపారు. అంతకుముందు వీరిద్దరూ కలిసి ఓ లేఖ కూడా రాసిపెట్టి పలు విషయాలను అందులో వెల్లడించారు. -
రథయాత్రలో తొక్కిసలాట
పూరీ: ఒడిశాలో విఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో గుండిచా ఆలయం ఎదుట తొక్కిసలాట జరగడంతో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 50 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించామని, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు.మూడు రథాల్లో కొలువుదీరిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రను దగ్గరి నుంచి తిలకించడానికి గుండిచా ఆలయం వద్ద భక్తులు ఇసకేస్తే రాలనంతగా గుమిగూడారు. అంతలో యాత్రా సామగ్రితో రెండు ట్రక్కులు జనం మధ్యలోకి దూసుకొచ్చాయి. దాంతో భయాందోళనకు గురై వారంతా ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. ఒకరిపై ఒకరు పడిపోయారు. తొక్కిసలాటలో బోలాగఢ్కు చెందిన బసంతి సాహూ (36), బాలిపాట్నాకు చెందిన ప్రేమకాంత్ మొహంతీ (80), ప్రవతి దాస్ (42) మరణించారు. అధికారులపై వేటు తొక్కిసలాటపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. తొక్కిసలాటకు బాధ్యులుగా జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వయిన్, ఎస్పీ వినీత్ అగర్వాల్‌పై బదిలీ వేటు వేశారు. డీసీపీ బిష్ణు పాటీ, కమాండెంట్ అజయ్ పాధీని సస్పెండ్ చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. జగన్నాథుడి భక్తులు క్షమించాలంటూ ‘ఎక్స్’లో సీఎం పోస్టు చేశారు. రథయాత్రలో తొక్కిసలాటకు భద్రతా లోపాలే కారణమని దర్యాప్తులో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. రథయాత్ర ఇన్చార్జిగా సీనియర్ అధికారి అరవింద్ అగర్వాల్‌ను నియమించింది.పరిస్థితి అదుపులోకి వచి్చందని న్యాయ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ వెల్లడించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం మనసును కలచివేసిందని పూరీ రాజు, శ్రీజగన్నాథాలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ గజపతి మహారాజా దివ్యసింగ్ దేవ్ చెప్పారు. ఇవి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాందీ, ఒడిశా మాజీ సీఎం నవీన్ పటా్నయక్ తదితరులు సంతాపం ప్రకటించారు.ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఘోరం జరిగిందని విమర్శించారు. పూరీలో రథయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. సంప్రదాయం ప్రకారం మూడు రథాలు ప్రధానాలయం నుంచి 2.6 కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి శనివారం చేరుకున్నాయి. గుండిచా మాతను జగన్నాథ, బలభద్ర, సుభద్రల తల్లిగా భావిస్తారు. రథాలు జూలై 5 దాకా అక్కడే ఉంటాయి. అనంతరం బహుదా యాత్ర ద్వారా ఆలయంలోకి తిరుగు ప్రయాణం అవుతాయి. -
అన్యోన్య దాంపత్యం.. అర్ధాంతరంగా ముగిసిపోయింది..!
వారిది కచ్చితంగా అన్యోన్య దాంపత్యమనే చెప్పొచ్చు. కానీ వారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇక్కడ అన్యోన్య దాంపత్యం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. అది సీసీ టీవీ ఫుటేజ్ చెబుతున్న మాట. మనిషి మాట నమ్మని ఈ రోజుల్లో.. సీసీ టీవీ ఫుటేజ్ ‘మాట’ కచ్చితంగా నమ్ముతాం. వీరు శవాలుగా మారకముందు గత రెండు రోజుల సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి చూస్తే వారు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. మరి ఈ జంట ఎలా చనిపోయిందనేది ప్రశ్న. ఏమైనా చిన్నపాటి మనస్పర్థలు తలెత్తి అది ఆత్మహత్య వరకూ వెళ్లిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనేది పోలీసులు దర్యాప్తులో తేలనుంది. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగానే ఈ కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు.రాజస్థాన్ రాష్ట్రంలోనే జైపూర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ దంపతుల్లో భర్త పేరు ధర్మేంద్ర కాగా, భార్య పేరు సుమన్. వీరికి 11, 8 ఏళ్లు కల్గిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి ఇద్దరు భరత్పూర్ గ్రామంలో తమ నానమ్మ, తాతయ్యలు దగ్గర ఉంటున్నారు. సమ్మర్ హాలీ డేస్‌కు తాతయ్య ఇంటికి వెళ్లిన ఆ పిల్లలు ఇంకా రాలేదు.ధర్మేంద్ర- సుమన్ జంట ఈ శుక్రవారం(జూన్ 27వ తేదీ) తమ ఫ్లాట్‌లో విగతజీవులుగా కనిపించారు. అంతకుముందూ వరకూ ఎంతో ఆనందంగా ఉన్న ఈ జంట.. ఎందుకు ఇలా చేశారు అనేది చర్చగా మారింది. ధర్మేంద్ర బ్యాంక్ సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం ధర్మేంద్ర బ్యాంక్‌కు వెళ్లకపోవడంతో తోటి ఉద్యోగులు ఫోన్ చేస్తే స్పందన రాలేదు. దీంతో ఈ విషయాన్ని సదర ఉద్యోగి.. ధర్మేంద్ర బంధువులకు తెలియజేశాడు. దీంతో వారు వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా ఆ జంట విగతజీవులుగా కనిపించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం వీరికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని బంధువులు చెబుతున్నారు. ఇటీవలే రీసెంట్గా ఫ్లాట్ కొనుగోలు చేసిన వీరి ఆర్థికపరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వారు అంటున్నారు. మూడు సీసీ ఫుటేజ్‌లో ఇలా..ఒక సీసీ ఫుటేజ్‌లో వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించారు. వారు ఫ్లాట్‌లో కారు పార్కు చేసే క్రమంలో భార్య సుమన్.. భర్త ధర్మేంద్ర భుజంపై తలపెట్టుకుని అతని చేతుల్ని పట్టుకుని ఉంది. ఆపై కారు దిగి వెళ్లిపోతున్న వీడియోలో ఆమె భుజంపై భర్త ధర్మేంద్ర చేయి వేసి నడుచుకుంటూ వెళ్లినట్లు ఉంది. అయితే వారు చనిపోవడానికి ముంద రోజు గురువారం మాత్రం ఇద్దరికీ చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు కనిపించింది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం భార్య సుమన్.. ఒక క్యారీ బ్యాగ్ తీసుకుని వెళుతున్నట్లు కనిపించింది. అదే వారు చివరిసారి సజీవంగా కనిపించడం. ఆ తర్వాత రోజే ఈ దారుణం చోటు చేసుకుంది. సుమన్ ఒంటిపై గాయాలుఅయితే భార్య సుమన్ ఒంటిపై గాయాలు కనిపించడంతో హత్యా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి కుటుంబంలో ఎటువంటి వైవాహిక విభేదాలు ఉన్నట్లు తమకు కనిపించలేదని పోలీస్ అధికారి అజయ్ సింగ్ తెలిపారు. అయితే ఇద్దరూ సూసైడ్ చేసుకుని ఉండటంతో అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఏమైనా క్లూ దొరుకుతుందనే కోణంలో వారి మొబైల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు పోలీసులు. -
పెళ్లి కోసం ‘రీల్స్’లో ఆస్తి చూపించాడు.. వివాహమైన రెండు గంటలకే..
జబల్పూర్: దేశంలో ఇటీవలి కాలంలో భర్తలపై హత్యలకు తెగబడుతున్న మహిళల ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. ఇటువంటి ఘటనలను విన్నవారు విస్తుపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. జబల్పూర్కు చెందిన ఇంద్ర కుమార్ తివారీ(45)ని పెళ్లి పేరుతో వంచించి, అతనిని అంతమొందించిన సాహిబా బానో అనే మహిళను ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారు.జూన్ 6న ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌లోని హటా ప్రాంతంలోని ఒక కాలువలో ఒక పురుషుని మృతదేహం బయటపడిన దరిమిలా ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశారు. తొలుత ఈ మృతదేహం ఎవరిదైనదీ తెలియలేదు. దర్యాప్తులో కొన్ని వారాల తర్వాత జబల్పూర్లో అదృశ్య వ్యక్తితో ఈ మృతదేహాన్ని పోల్చి చూడగా, అది ఇంద్ర కుమార్ తివారీ మృతదేహమని తేలింది.ఈ హత్య వెనుక సూత్రధారి సాహిబా బానో అని, ఆమె ఖుషీ తివారీగా పేరు మార్చుకుని ఇంద్రకుమార్‌ను ఆకట్టుకున్నదని పోలీసులు తెలిపారు. పెళ్లికాని ఇంద్రకుమార్ ఇటీవల తనకు గల భూమి వివరాలను చెబుతూ ఒక రీల్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిని చూసిన సాహిబా బానో ఆ భూమిని దక్కించుకోవాలనే ఆశతో, అతనిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది.సోషల్ మీడియాలో అతనిని సంప్రదించి, తన పేరు ఖుషీ తివారీ అని పరిచయం చేసుకుని, గోరఖ్‌పూర్‌కు రావాలని ఆహ్వానించింది. తర్వాత తన ఇద్దరు సహచరుల సహాయంతో ఇంద్రకుమార్‌ను వివాహం చేసుకుంది. కొన్ని గంటల తర్వాత తివారీని హత్య చేసి, అతని మృతదేహాన్ని తన సహచారుల సాయంతో కాలువలో పడేసింది. ఈ కేసులో పోలీసులు సాహిబాతో ఆమెకు సహకరించిన ఇద్దరినీ అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కోల్‌కతా కేసు: మెడ, ఇతర భాగాలపై కమిలిన గాయాలు.. మెడికల్ రిపోర్టులో వెల్లడి
కోల్‌కతా: కోల్‌కతాలోని లా కాలేజీలో జూన్ 25న అత్యాచారానికి గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లా విద్యార్థిని(24)కి నిర్వహించిన వైద్య పరీక్షలో ఆమెపై శారీరక దాడి జరిగినట్లు స్పష్టమయ్యింది. బాధితురాలి మెడ, ఛాతీపై కమిలిపోయిన గుర్తులను మెడికల్ రిపోర్టు వెల్లడించింది. బాహ్య జననేంద్రియం లేదా నోటిపై ఎటువంటి గాయాలు కనిపించనప్పటికీ, ఫోరెన్సిక్ నిర్ధారణ మేరకు లైంగిక దాడిని వైద్యులు తోసిపుచ్చలేదు.26న రాత్రి 10 గంటలకు కోల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో బాధితురాలికి వైద్యపరీక్ష నిర్వహించారు. ఈ ప్రక్రియలో మూడు స్వాబ్‌లను సేకరించి, ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. దీనిలో మూత్ర గర్భ పరీక్ష ప్రతికూలంగా వచ్చింది. అసిస్టెంట్ కమిషనర్ ర్యాంక్ అధికారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లా విద్యార్థిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును దర్యాప్తు చేస్తున్నదని ఒక అధికారి తెలిపారు.ఈ కేసులో కోల్‌కతా పోలీసులు తాజాగా నాల్గవ వ్యక్తి, సౌత్ కలకత్తా లా కాలేజీ సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విచారణ సమయంలో గార్డు సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ అరెస్టుతో ఈ కేసులో అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య నాలుగుకు చేరింది. గార్డు గదిలో ఈ లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంలో తృణమూల్ ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) సమావేశం తర్వాత తనపై లైంగిక దాడి జరిగిందని తెలిపింది. ఈ సమయంలో తన తలపై హాకీ స్టిక్‌తో కొట్టారని, రాత్రి 10:50 గంటల ప్రాంతంలో నిందితులు తనను విడిచిపెట్టారని తెలిపింది. ఇది కూడా చదవండి: 20 ఏళ్ల తర్వాత థాక్రే బద్రర్స్ రీయూనియన్.. దేనికి సంకేతం? -
కోర్టు భవనంపై నుంచి దూకిన కుటుంబం
మెదక్‌జోన్/మెదక్ కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ: అత్త, భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఓ వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి శనివారం మెదక్ జిల్లా కోర్టుకు వచ్చాడు. కేసుకు హాజరైన అనంతరం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి కోర్టు భవనం మూడో అంతస్తు నుంచి దూకాడు. ఘటనలో భార్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఇద్దరు పిల్లలు, అతడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన డాకొల్ల నవీన్ ఐదేళ్ల క్రితం మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రమ్య (24)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్లలోపు ఆడపిల్లలు రుచిక, యశ్విక ఉన్నారు. గతేడాది నవీన్ తన అత్తగారిల్లు లక్ష్మాపూర్‌కు వచ్చి గొడవపడ్డాడు. ఈ క్రమంలో అత్త రాజమణి, భార్య రమ్యను చంపే ప్రయత్నం చేశాడు. ఈ కేసులో రామాయంపేటలో నవీన్‌పై హత్యాయత్నం కేసు నమోదుకాగా, జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో రమ్య సైతం నవీన్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇటీవలే లోక్‌అదాలత్‌లో ఈ కేసుపై వారిద్దరూ రాజీపడినట్లు పోలీసులు తెలిపారు. కాగా, అత్త, భార్యపై హత్యాయత్నం కేసు విషయమై శనివారం కోర్టుకు హాజరైన నవీన్.. భార్య పిల్లలతో కలిసి కోర్టు భవనంపైనుంచి దూకాడు. భార్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా నవీన్, పిల్లలు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన మెదక్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. అదనపు ఎస్పీ మహేందర్ ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, నవీనే భార్యాపిల్లలను చంపే కుట్రలో భాగంగా భవనంపైనుంచి తోసిఉంటాడని రమ్య కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. తల్లడిల్లుతున్న చిన్నారులు.. కాగా, బాలిక రుచికకు ఎడమ చేయి మూడు చోట్ల విరిగింది. ఛాతీలోనూ తీవ్ర గాయమైంది. ఏడాది న్నర వయసున్న యశ్విక నోట్లోని పళ్లన్నీ రాలిపో యాయి. తీవ్రగాయాలతో ఉన్న ఆ చిన్నారులను చూసిన వారంతా చలించిపోతున్నారు. -
డబ్బుల కోసం తల్లికి నిప్పంటించి..
సంగెం: కన్న కొడుకే తల్లిపాలిట కాలయముడయ్యాడు. డబ్బులకోసం తల్లిని చంపేందుకు సిద్ధమయ్యాడు. ‘వద్దు కొడుకా’.. అంటూ తల్లి బతిమాలినా వినకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుంటపల్లికి చెందిన ముత్తినేని వినోద (60), సాంబయ్య దంపతులకు ఒక కూతురు, లింగమూర్తి, సతీశ్ అనే కుమారులు ఉన్నారు. వీరిలో కొంతకాలం కిందట లింగమూర్తి అనారోగ్యంతో మరణించాడు. సాంబయ్యకు ఉన్న భూమిలో 4 ఎకరాలను ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకోసం తీసుకుంది. మరో ఎకరం భూమి ఇంకా సాంబయ్య పేర ఉంది. ప్రభుత్వం పరిహారంగా రూ.40 లక్షలు ఇచ్చింది. వీటిలో రూ.30 లక్షలను చిన్న కుమారుడు సతీశ్‌కు ఇచ్చారు. ఈ డబ్బులతో సతీశ్ వేరే చోట రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. సాంబయ్య పేర రూ.3 లక్షలు, తల్లి వినోద పేర రూ.3.50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. మిగిలిన డబ్బులో నుంచి కూడా కొంత సతీశ్‌కు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రూ.2 వేలు, డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీతో కాలం వెళ్లదీస్తున్నారు. కాగా, తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బులను కూతురుకు ఇస్తున్నారని సతీశ్ తరచూ గొడవ పడుతుండేవాడు. మిగిలిన డబ్బులను కూడా తనకు ఇచ్చేయాలని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుండా తల్లి అడ్డుపడుతోందని గతంలో తల్లి కాలు, చేయి విరగ్గొట్టాడు. దీంతో అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తల్లిపై కక్ష పెంచుకున్న సతీశ్ శుక్రవారం రాత్రి ఇంటి ముందు తల్లిదండ్రులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో వచ్చి తల్లి వినోదపై దాడి చేశాడు. బాటిల్లో తెచ్చిన పెట్రోల్ ఆమెపై చల్లి నిప్పు అంటించి పారిపోయాడు. భార్య అరుపులు విని లేచిన సాంబయ్య చుట్టుపక్కల వారి సాయంతో మంటలు ఆర్పారు. అప్పటికే 80 శాతం గాయాలైన వినోదను 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. న్యాయమూర్తి సమక్షంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై నరేశ్‌లు వినోద వాంగ్మూలం రికార్డు చేశారు. భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ శనివారం తెలిపారు. -
Kolkata: లా విద్యార్థిని అత్యాచారం కేసులో నాలుగో నిందితుడు అరెస్ట్
కోల్‌కతా: సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ లా ఫస్ట్ ఇయర్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ దారుణంలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. విద్యార్థినిపై దారుణం జరిగిన తర్వాత కూడా ఆమెను వేధించిన కాలేజీ క్యాంపస్ సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలకంగా వ్యవహరించడంతో ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది. కోల్‌కతాలోని కస్బా ప్రాంత న్యాయ కళాశాలలో జూన్ 25న రాత్రి మొదటి సంవత్సరం లా చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్‌లోనే అత్యాచారం జరిగింది. జూలై 16న జరగనున్న సెమిస్టర్ పరీక్షల కోసం పరీక్షా ఫారాలను పూర్తి చేసేందుకు బుధవారం కాలేజీ క్యాంపస్‌కు వచ్చింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్‌కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు.మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు.నా బోయ్‌ఫ్రెండ్‌కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు. -
ఎర్రగడ్డ ఆస్పత్రికి సోనీ
హైదరాబాద్: రైలు పట్టాలపై కారు నడిపిన కేసులో నిందితురాలైన వోమికా సోనీని ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఆమె మానసిక స్థితి బాగోలేనందున తొలుత చికిత్స తీసుకోవాలని, అనంతరం తమ ఎదుట విచారణకు హాజరు పర్చాలని ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు సూచించారు. 2025 జూన్ 26న(గురువారం) శంకర్పల్లి (రంగారెడ్డి జిల్లా) నాగులపల్లి వద్ద ఓ మహిళ రైలు పట్టాలపై కారు నడిపి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల ప్రాంతంలో సుమారు 8 కిలోమీటర్లపాటు ఆమె అలా పట్టాలపై కారు పోనిచ్చింది. అది గమనించిన స్థానికులు, రైల్వే పోలీసులు ఆమెను అడ్డుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో రాడ్‌తో ఆమె అందరిపై దాడికి యత్నించింది. చివరకు ఓ చెట్టును ఢీ కొట్టి కారు ఆగిపోగా.. ఎలాగోలా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఫలితంగా 45 నిమిషాల పాటు రైలు సేవలు నిలిచిపోయాయి. బెంగళూరు-హైదరాబాద్ మధ్య నడిచే 15 రైలు దారి మళ్లించారు. ఘటనకుగానూ ఆమెపై పోలీసులు, రైల్వే పోలీసులు విడివిడిగా కేసు నమోదు చేశారు. తొలుత మద్యం మత్తులో ఆ మహిళ అలా చేసి ఉండొచ్చని పోలీసుల భావించారు. అయితే.. ఆమె పేరు వోమికా సోని(34) అని, లక్నో(యూపీ)కి చెందిన మహిళ అని తర్వాత నిర్ధారించుకున్నారు. ఐటీ జాబ్ పొగొట్టుకున్న ఆమె డిప్రెషన్లోకి వెళ్లిందని.. ఆపై తన కియా కారుతో ఇలా పట్టాలపై బీభత్సం సృష్టించిందని పోలీసులు తేల్చారు. చివరకు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్నాక.. ఆమెపై చర్యల అంశాన్ని పోలీసులు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.Video: Woman Drives Car On Railway Track, Disrupts Train Services pic.twitter.com/5MSyXJXzbG— NDTV (@ndtv) June 26, 2025 -
వివాహేతర సంబంధం వద్దన్నా వినలేదు!
అన్నానగర్: వివాహేతర సంబంధం నడుపుతుందన్న కోపంతో భార్యను భర్త కొట్టి, గొంతునులిమి చంపేశాడు. చెన్నై సమీపంలోని పెరుంబాక్కంలో ఉన్న హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అపార్ట్మెంట్లో నివసిస్తున్న జాహీర్ హుస్సేన్ (39)కు సుప్రియ భేగం(26) భార్య ఉంది. వీరు ఉత్తర రాష్ట్రానికి చెందినవారు. వీరిద్దరూ వేర్వేరు ప్రైవేట్ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య తగాదా జరిగింది. దీంతో ఆగ్రహించిన జాహీర్ హుస్సేన్, సుప్రియా బేగంపై దాడి చేసి, గొంతు నులిమాడు. అప్పుడు ఆమె స్పృహ తప్పింది. దీంతో వెంటనే ఆమెను రాయపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు, సుప్రియభేగం అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ విషయమై ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరుంబాక్కం పోలీసులు జాహీర్ హూస్సెన్ను అరెస్టు చేసి, విచారించారు. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, మందలించిన వివాహేతర సంబంధాన్ని వదులకపోవడంతో ఆమెను కొట్టి, గొంతు నులిమి చంపినట్లు అంగీకరించాడు. -
ఫరీదాబాద్ కేసు: చేసిందంతా మామనే.. ఎంత దారుణం
ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో రెండు నెలలుగా కనిపించకుండా పోయిన మహిళ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఆ మహిళ మృతదేహాన్ని ఆమె అత్తమామలే స్వయంగా తమ ఇంటి ముందు పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో మామనే ఆమైపై అత్యాచారం చేసి, హత్య చేశారని వెల్లడయ్యింది. ఇందుకు మృతురాలి అత్త, భర్త కూడా సహకరించారని తెలుస్తోంది.మృతురాలు తన్ను ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలోని షికోహాబాద్‌కు చెందినది. ఆమెకు రెండేళ్ల క్రితం అరుణ్ సింగ్‌తో వివాహమయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మామ భూప్ సింగ్, అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. తన్ను భర్త అరుణ్ పరారీలో ఉన్నాడు. తమ కోడలు తన్ను అదృశ్యమయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఈ విషయం బయటకు పొక్కకుండా అత్తామామలు జాగ్రత్తపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 21న రాత్రి అరుణ్ తన భార్య తన్ను తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడు. అర్థరాత్రి తన్ను గదిలోకి ప్రవేశించిన మామ అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణం తర్వాత అతను తన కుమారుడు అరుణ్‌ను పిలిచాడు. వారిద్దరూ కలిసి తన్ను మృతదేహాన్ని.. అప్పటికే వీధిలో తవ్విన గొయ్యిలో పడవేసి, దానిపై ఇటుకలు, మట్టిని పోశారు. ఆ గొయ్యి మురుగునీటి కోసం తవ్వినదని భూప్ సింగ్ చుట్టుపక్కలవారికి తెలిపాడు. దీనిపై అనుమానించిన స్థానికులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ గొయ్యిని తవ్వించగా, తన్ను మృతదేహం బయటపడింది. ఈ ఘటనలో పోలీసులు మామ భూప్ సింగ్, అతని భార్య సోనియా, కుమారుడు అరుణ్ సింగ్ కుమార్తె కాజల్‌పై కేసు నమోదు చేశారు. కాగా తమకుమార్తె తన్నును కట్నం కోసం అత్తమామలు వేధిస్తున్నారని, వివాహం తర్వాత కూడా తమ కుమార్తె ఏడాదిపాటు తమ ఇంటిలోనే ఉన్నదని ఆమె తండ్రి రోదిస్తూ మీడియాకు తెలిపాడు.ఇది కూడా చదవండి:‘మధ్యవర్తిత్వం’ చట్టవిరుద్ధం.. పాక్‌కు భారత్ మరో షాక్ -
యాంకర్ స్వేచ్ఛ కేసులో ట్విస్ట్
తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar) ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. సాక్షి, హైదరాబాద్: పలు టీవీ ఛానెల్స్‌లో పని చేసిన స్వేచ్ఛకు.. గతంలోనే వివాహమైంది. ఓ కూతురు కూడా ఉంది. మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయాక పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో ఆమె కలిసి ఉంటోంది. ఆమె ఫేస్బుక్ పేజీ పేరు సైతం స్వేచ్ఛా పూర్ణ చందర్‌గా మార్చుకుంది. అయితే కొన్నాళ్లుగా వీళ్ల మధ్యా విభేదాలు నడుస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివాహం చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయగా.. అందుకు పూర్ణ చంద్రరావు నిరాకరించాడు. దీంతో అతనితో ఇక కలిసి ఉండలేనంటూ ఆమె తల్లిదండ్రుల వద్ద వాపోయింది. ఈ విషయంలోనే ఆమె మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాతి నుంచి పూర్ణచంద్రరావు ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. అజ్ఞాతంలో ఉన్న అతని ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యాంకర్‌గా, న్యూస్ప్రజెంటర్గా పలు చానెల్స్‌లో పని చేసిన స్వేచ్ఛ.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గానూ గుర్తింపు దక్కించుకున్నారు. శుక్రవారం గాంధీనగర్ జవహర్ నగర్ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తొలుత పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహానికి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె నేత్రాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి..
వరంగల్ క్రైం: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల కిందట జరిగిన ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తోందంటూ కొందరు వ్యక్తులు ఓ వివాహితను వివస్త్రను చేసి జననాంగంలో జీడిరసం పోసి విచక్షణారహితంగా దాడి చేశారు. ‘సాక్షి’కి విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వారికి ముగ్గురు పిల్లలు. అయితే సమీప బంధువైన ఓ వివాహితతో అతను వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. సుమారు పది రోజులు ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య స్వగ్రామమైన తాటికాయలకు వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు ఆ ఇద్దరినీ వెతికి పట్టుకొని ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకువచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికీ గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసి.. జననాంగంపై జీడి (పూర్వకాలంలో నొప్పి తగ్గించేందుకు వాడేవారు. అదేవిధంగా శరీరంలోని సున్నిత అవయవాలపై పోస్తే పుండ్లు అవుతాయి) పోశారు. ‘తప్పు చేశాను.. క్షమించండి’ అంటూ బాధిత మహిళ వేడుకున్నా వినకుండా దాడి చేశారు. జననాంగంలోనుంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదు. ఆ తరువాత ఆ ఇద్దరినీ ఏం చేశారో ఇప్పటివరకు ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం లేదని తెలిసింది. అసలు ఆ ఇద్దరూ ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది. -
కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు
కోల్‌కతా: దేశమంతటా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ కాలేజీ మెడికోపై హత్యాచార ఘటనను మరవకముందే కోల్‌కతాలో అలాంటిదే మరో దారుణం జరిగింది. సౌత్ కలకత్తా లా కాలేజీ విద్యార్థిపై కాలేజీలోనే అత్యాచారం జరిగింది. అదే కాలేజీకి చెందిన మాజీ విద్యార్థి ఇద్దరు ప్రస్తుత విద్యార్థులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షకు సంబంధించిన పత్రాలను నింపేందుకు బాధితురాలు (24) బుధవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్లింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు. సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్‌కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు. మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు. నా బోయ్‌ఫ్రెండ్‌కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు. గది బయట కాపలాగా ఉన్నారు’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముగ్గురు నిందితులకు కోర్టు ఐదు రోజుల రిమాండ్ విధించింది. ప్రధాన నిందితునికి సహకరించడం కూడా అత్యాచారానికి పాల్పడటంతో సమానమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ‘‘బాధితురాలు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలమిచ్చింది. ఘటన జరిగిన గార్డు గదితోపాటు పక్కనే ఉన్న విద్యార్థి సంఘం గదిని సీజ్ చేసి, ప్రత్యక్ష సాక్షులను విచారించాం’’ అని పోలీసులు తెలిపారు.అతనో క్రిమినల్ లాయర్ ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా అదే లా కాలేజీలో చదివాడు. 45 రోజుల కాంట్రాక్టుపై ప్రస్తుతం కాలేజీలో బోధనేతర విధుల్లో పనిచేస్తున్నాడని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నైనా చటర్జీ చెప్పారు. అంతేగాక అలీపోర్ పోలీస్ అండ్ సెషన్స్ కోర్టులో క్రిమినల్ లాయర్‌గా చేస్తున్నట్టు కాలేజీ వర్గాలు తెలిపాయి. టీఎంసీకి చెందిన పలువురు నేతలతో మోనోజిత్‌కు దగ్గర సంబంధాలున్నట్లు సమాచారం. ఘటనపై వామపక్ష విద్యార్థి విభాగం, కాంగ్రెస్ శ్రేణులు కస్బా పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగాయి.తృణమూల్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు అత్యాచారోదంతంపై తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘యువతులు తాము ఎలాంటి వారితో కలిసి తిరుగుతున్నామో చూసుకోవాలి. రాష్ట్రంలో ప్రతి చోటా మహిళలకు పోలీసులు రక్షణ కల్పించడం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ ఉదంతంపై నిరసనలు పెరిగి పెద్దవవుతుండటంతో తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ప్రధాన నిందితుడు మోనోజిత్‌తో పారీ్టకి సంబంధం లేదని ప్రకటించింది. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొంది. కానీ తృణమూల్ ప్రకటనను బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఖండించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు ప్రముఖ తృణమూల్ నేతలతో పాటు మోనోజిత్ ఎన్నోసార్లు వేదికలపై కని్పంచినట్టు చెప్పారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మమతకు సీఎంగా కొనసాగే అర్హత లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ సువేందు అధికారి మండిపడ్డారు. -
ముంచెత్తే మత్తు..బతుకే చిత్తు
కూటమి అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ దందా గుంటూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. యువత, కళాశాలల విద్యార్థులు, పాఠశాలల్లో చదువుకునే బాలలే లక్ష్యంగా మాదకద్రవ్యాల ముఠాలు చెలరేగిపోతున్నాయి. పాలకులకు రెడ్‌బుక్ పేరిట రాజకీయ కక్షలు సాధించడంతో సరిపోతోంది. దీంతో డ్రగ్స్ దెబ్బకు యవత బంగారు భవిష్యత్తు నాశనమవుతోంది.నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో గంజాయి, కొకైన్, మెత్, ఎండీఎం వంటి మాదకద్రవ్యాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విశాఖపట్నం, పాడేరు, అరకు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయి భారీగా సరఫరా అవుతోంది. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులు, యువతే లక్ష్యంగా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విద్యార్థులే లక్ష్యంగా... శివారు ప్రాంతాలలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి నుంచి నగరంలోకి సిగరెట్స్, చాకెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో తీసుకొస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. కేజీ గంజాయి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. అదే విధంగా గ్రాము చొప్పున క్రిస్టల్‌ను రూ.8 వేలు నుంచి రూ.10 వేలు, మెత్‌ను రూ.5 వేలు నుంచి రూ.6 వేలు, ఎండీఎంఏను రూ.3 వేలు నుంచి రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాకు మాదకద్రవ్యాలు చేరుతున్నాయి. రాజధాని ప్రాంతంలోనే ఎక్కువమంగళగిరి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్ర యాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఈ స్టేషన్ పరిధిలోనే గత సంవత్సరం ఆగస్టులో 231.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతోపాటు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 234.2 కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. 38 మందిని అరెస్ట్ చేశారు. దీంతోపాటు మెత్, ఎండీఎంఏ 23 గ్రాములు స్వా«దీనం చేసుకున్నారు. దీనిపై మూడు కేసులు నమోదు చేయడంతోపాటు 17 మందిని అరెస్ట్ చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సుమారు వంద కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 20 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో వైపు అధిక ధర పెట్టి మద్యం కొనుగోలు చేయలేక చాలా మంది పేదలు, రోజువారీ కూలీలు తక్కువ ధరకు లభించే శానిటైజర్‌ను మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి మత్తులో తేలుతున్నారు. ఆయా షాపుల్లో ఇలాంటివి విక్రయించడంపై నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. -
న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య
తెలుగు జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar)(40) శుక్రవారం బలవర్మణానికి పాల్పడ్డారు. చిక్కడపల్లి ఠాణా పరిధి జవహర్‌నగర్‌లోని ఆమె నివాసంలో రాత్రి 10.30 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ వివరాల ప్రకారం...ఫ్యానుకు చున్నీతో ఉరేసుకొని తనువు చాలించింది. ఐదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమె.. కూతురు, మరో స్నేహితుడితో కలిసి ఉంటున్నారని సమాచారం. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాంనగర్లో ఉంటున్నారు. తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయగా.. తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.న్యూస్ రీడర్, ప్రేసెంటెర్, యాంకర్ గా పలు న్యూస్ చానెల్స్ లో పని చేశారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గాను ఈమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్‌గా ఎన్నికయ్యారు కూడా.చిన్న వయసులో యాంకర్ స్వేచ్ఛ.. అదీ బలవన్మరణానని పాల్పడటం పట్ల పలువురు జర్నలిస్టులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
నాకు కష్టమొచ్చింది.. ఇక ఈ ట్రైన్ ఎందుకు?.. అందులో ఉన్న మీరెందుకు?
మనిషికొక్క తీరు.. మనకి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా అధిగమించాలనేది కొంతమంది ఆలోచిస్తే, ఆ సమస్యనే తన చుట్టంగా చేసుకుని బాధపడే వాళ్లు మరికొందరు. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలయ్యే వాళ్లు ఇంకొందరు. ఇది చాలా ప్రమాదం. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలవ్వాలని కోరుకుంటారు.కానీ ప్రపంచంలోని సమస్యతో మాత్రం వీరికి అవసరం ఉండదు. ఇలాంటి వాళ్లు చాలా సందర్భాల్లో ఏం చేస్తున్నామనే విచక్షణ మరిచిపోతారు. ఏదైనా చిన్నపాటి కష్టం వస్తే చాలు.. మన చుట్టూ ఉన్న వాళ్లు ఎంత సుఖంగా ఉన్నారో అనే భ్రాంతిలో ఉండి వారికి తీవ్ర నష్టం చేయడానికి యత్నించడంలో ముందుంటారు. ఈ తరహాలోనే తన భార్య తనకు విడాకులు ఇచ్చిందనే కారణంతో మొత్తం ట్రైన్నే తగలబెట్టాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. తన వెంట బ్యాగులో తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాను ఒక్కసారిగా ట్రైన్లో చల్లుకుంటా వచ్చి ఒక్కసారిగా నిప్పంటించాడు. అసలు ఏం జరుగుతుందనే ప్రయాణికులు తేరుకుని పరుగులు తీసే లోపే ఆ ట్రైన్ లోపల ఒక్కసారిగా భగ్గుమంది. భార్య విడాకులిచ్చిందనే ఫ్రస్టేషన్లో..ఈ ఘటన దక్షిణాకొరియా దేశంలో చోటు చేసుకంది. ఇటీవల సియోల్‌కు చెందిన వాన్ అనే వ్యక్తికి భార్యతో విడాకులయ్యాయి. దీన్ని భరించలేకపోయాడు. సుమారు 67 ఏళ్ల వయసులో తనకు విడాకులు మంజూరు కావడాన్ని వాన్ తట్టుకోలేకపోయాడు. ఇక తాను ఎందుకు అనుకున్నాడు. అలా అనుకుంటూనే ట్రైన్ ఎక్కాడు. అప్పటికే ఓ పెట్రోల్ డబ్బా బ్యాగ్‌తో పాటు వెంట తెచ్చుకున్నాడు. అయితే ఆ ట్రైన్ కోచ్‌లో జనం కాస్త సంతోషంగా కనిపించారు. తనకు కష్టం వచ్చింది.. వీరి ముఖాల్లో నవ్వులు పూస్తున్నాయి అనుకున్నాడో ఏమో కానీ.. ఒక్కసారిగా పెట్రోల్ డబ్బా బయటకు తీశాడు. పెట్రోల్ డబ్బా బయటకు తీసిన క్షణంలోనే అనుమానం వచ్చిన ఆ కోచ్‌లోని ప్రయాణికులు పరుగులు తీశారు. పెట్రోల్ మొత్తం కోచ్ అంతా చల్లడం.. ఆపై నిప్పంటించడం జరిగిపోయాయి. సముద్రగర్భంలోని టన్నెల్లో రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో 22 మంది ఆస్పత్రి పాలు కాగా, మరొక 129 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిందితుడు వాన్ కూడా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కారణంగా 240,000 యూఎస్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.వాన్‌పై హత్యాభియోగాలుఈ దారుణానికి పాల్పడ్డ వాన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కదులుతున్న ట్రైన్లో ఘటన జూన్ 9న జరగ్గా, ఇది ఆలస్యంగా వెలుగుచూసింది. వాన్‌పై హత్యాయత్నం అభియోగాలతో పాటు పలు సెక్షన్లు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న వాన్.. భార్యతో విడాకులు మంజూరు అయినందుకే ఇలా చేశానని స్పష్టం చేశాడు. ట్రైన్లో పెట్రోల్ పోసిన ఘటన వీడియో వైరల్‌గా మారింది.서울지하철 5호선 방화범 CCTV사망자 없는게 기적이네요 pic.twitter.com/IQMowGZkWH— 브이몬 (@XXV_mon) June 25, 2025 -
కాంట్రాక్టర్ హంతకులపై తూటా
దొడ్డబళ్లాపురం: హావేరి జిల్లా శిగ్గాంవి పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన కాంట్రాక్టర్ శివానంద కున్నూరు (40) హత్య కేసులో నిందితులపై పోలీసులు ఫైరింగ్ చేశారు. నిందితులు అష్రఫ్, నాగరాజు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, వారికి హావేరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హుబ్లి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మూడురోజుల కిందట పట్టపగలు నలుగురు దుండగులు శివానందను కత్తులతో నరికి చంపడం జిల్లాలో సంచలనం కలిగించింది. ఈ హత్య వీడియోలు వైరల్ అయ్యాయి.దాగి ఉండగా..పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి వారి కోసం శోధించారు. హానగల్ తాలూకా కొండోజి క్రాస్ వద్ద నిందితులు దాగి ఉన్నట్టు తెలిసి గురువారం తెల్లవారుజామున అరెస్టు చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. శిగ్గాంవి సీఐ సత్యప్ప, ఎస్సై సంపత్ నిందితుల కాళ్లకు షూట్ చేయడంతో గాయాలై దొరికిపోయారు. ఈ ఘటనలో సత్యప్ప, సంపత్, కానిస్టేబుల్ రవికి స్వల్ప గాయాలయ్యాయి. హత్యకు ఆర్థిక వ్యవహారాలు, లేదా అక్రమ సంబంధం కారణమని అనుమానాలున్నాయి. ఇప్పటికే సుదీప్, సురేష్ గౌళి, హనుమంత అనే ముగ్గురు అరెస్టయ్యారు. -
కాళ్లు, చేతులు కట్టేసి.. డ్రమ్ములో కుక్కేసి..
మరో ఘోర ఉదంతం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. బ్లూ కలర్ డ్రమ్ములో కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహాం బయటపడింది. దీంతో యూపీ మీరట్ ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు చాలామంది. మీరట్‌లో ఓ మహిళ గంజాయి మత్తులో తూలుతూ.. ప్రియుడి సాయంతో తన భర్తను చంపి మృతదేహాన్ని డ్రమ్ములో దాచిపెట్టిన సంగతి తెలిసిందే.ఛండీగఢ్: మీరట్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. పంజాబ్‌లోని లూధియానాలో ఓ డ్రమ్ములో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మెడ, కాళ్లను తాడుతో కట్టి.. డ్రమ్ములోకి కుక్కిన వైనం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జూన్ 25వ తేదీన.. ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి చెత్త ఏరుకుంటుండగా దుర్వాసన వస్తుండడం చుట్టుపక్కల వాళ్లకు సమాచారం అందించాడు. వాళ్ల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు డ్రమ్ము నుంచి మృతదేహాన్ని స్వాధీనపర్చుకున్నారు. డ్రమ్ములో ఓ బెడ్‌షీట్‌లో మృతదేహం చుట్టి ఉంది. చనిపోయిన వ్యక్తికి 40 ఏళ్ల వయసు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఒంటిపై గాయాలు లేవని.. పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సి ఉందని చెబుతున్నారు. లోతైన దర్యాప్తు.. డ్రమ్ము కొత్తగా ఉండడంతో.. లూథియానాలో 42 డ్రమ్ము తయారీ యూనిట్లకు, దుకాణాలకు వెళ్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హత్య కేసుగా నమోదు చేసుకుని.. ఈ మధ్యకాలంలో కనిపించకుండా పోయిన వ్యక్తల జాబితాతో మృతుడి వివరాలు సరిపోల్చుకుంటున్నారు. మీరట్ సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసు ఇలా.. ఫిబ్రవరి 24, 2025:మర్చంట్ నేవీ ఉద్యోగి సౌరభ్ రాజ్‌పుత్ లండన్ నుంచి తన కుమార్తె పుట్టినరోజు కోసం భారత్‌కు వచ్చారు. ఫిబ్రవరి 25, 2025:భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి హత్యకు ప్రయత్నించారు. కానీ ఆ రోజు ప్రయత్నం విఫలమైంది. మార్చి 3, 2025:సౌరభ్‌ను కత్తితో పొడిచి హత్య చేశారుశరీరాన్ని ముక్కలు చేసి, తల, చేతులను వేరు చేశారుశరీర భాగాలను మిక్సర్ గ్రైండర్లో వేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు మార్చి 4-5, 2025సిమెంట్, డ్రమ్ములు కొనుగోలు చేసి శరీర భాగాలను డ్రమ్ములో వేసి సిమెంట్ పోసారుడ్రమ్మును ఇంట్లో దాచారుమార్చి 10, 2025 (సుమారు):డ్రమ్ము నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ అనుమానం వ్యక్తం చేశాడుసౌరభ్ కూతురు ‘‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’’ అని చెప్పినా, మొదట ఎవ్వరూ పట్టించుకోలేదు మార్చి 20–25, 2025:పోలీసులు డ్రమ్మును స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారుఫోరెన్సిక్ బృందం బెడ్షీట్లు, బాత్రూమ్ టైల్స్‌పై రక్తపు మరకలు గుర్తించిందిసూట్కేస్లో కూడా రక్తపు ఆనవాళ్లు లభించాయి మార్చి 26–27, 2025:ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లా అరెస్టయ్యారుఇద్దరూ నేరాన్ని అంగీకరించారుముస్కాన్కు 2019 నుంచి సాహిల్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు వెల్లడించారు ప్రస్తుతం నిందితులిద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా జైలులో ఉన్నారు. ముస్కాన్ ఆరు నెలల గర్భవతి కావడంతో ఆమెను ప్రత్యేక బ్యారక్‌లో ఉంచారు. ఆమె జైలులో లా చదివే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
భవనం టెర్రస్ పైకి యువతి.. రీల్స్ పిచ్చే బలి తీసుకుందా?
బెంగళూరు: తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్లిన ఒక యువతి, నిర్మాణంలో ఉన్న భవనంలోని 13వ అంతస్తు నుంచి పడి మరణించింది. బుధవారం రాత్రి ఆ మహిళ తన స్నేహితుల బృందంతో కలిసి పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ భవనానికి వెళ్లిందని పోలీసులు వెల్లడించారు.పార్టీ మధ్యలో యువతి రీల్స్ కోసం టెర్రస్‌పైకి వెళ్లింది.. అక్కడ వీడియో తీసుకుంటూ కాలుజారి నుంచి కింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు బీహార్‌కు చెందిన యువతిగా గుర్తించారు. నగరంలోని ఓ షాపింగ్ మార్ట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటననుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అయితే, ఆమె రీల్ షూట్ కోసమే భవనం టెర్రస్‌పైకి వెళ్లినట్లు చెబుతున్నప్పటికి.. ఆమె ఫోన్ నుంచి అలాంటి రికార్డింగ్ ఏదీ లభించలేదని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. ఆ యువతి ప్రమాదవశాత్తు పడిపోయిందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు
కర్నూలు: నంద్యాల జిల్లా బనగానపల్లెలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఇ.రాజేంద్రబాబు గురువారం తీర్పు చెప్పారు. 2020 అక్టోబర్ 22న బాధిత బాలిక (4) ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన గుడిసె రుద్రేశ్ (22) అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు బనగానపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ నరసింహారెడ్డి కేసు విచారించి నిందితుడిపై కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధించారు. జరిమానా మొత్తాన్ని బాధిత బాలికకు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పులో ఆదేశించారు.