
సాక్షి,పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. భార్య భర్తల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చిన భార్య తరుపు కుటుంబ సభ్యులపై.. భర్త తరుపు కుటుంబ సభ్యులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.
పోలీసుల వివరాల మేరకు.. సుగ్లాంపల్లి భార్యాభర్తల పెద్ద మనుషుల పంచాయితీలో కత్తిపోట్ల కలకలం సృష్టించాయి. భార్య,భర్తల మధ్య జరుగుతున్న గొడవలకు పులిస్టాప్ పెట్టి వారిద్దరిని కలిపేందుకు ఆ ఊరి గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. ఈ పంచాయతీ జరుగుతున్న సమయంలో భర్త తరుపు కుటుంబ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు. మారణాయుధాలతో భార్య తరుపు కుటుంబ సభ్యులపై మారణాయుధాలతో దాడి చేశారు.
అప్రమత్తమైన భార్య కుటుంబీకులు సైతం కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌కు చెందిన గాండ్ల గణేష్,ఓదెలకు చెందిన మోటం మల్లేష్‌లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భార్యాభర్తల మధ్య వివాదాలలో జోక్యం చేసుకోవడం అనేది ఒక సున్నితమైన సమస్య. సాధారణంగా, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు వారి మధ్య సామరస్యం కుదర్చడానికి ప్రయత్నించడం మంచిది. కానీ వ్యక్తిగత విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు మరింత జటిలం అయ్యే అవకాశం ఉంది.