
హైదరాబాద్: కూకట్‌పల్లి పరిధిలో కలకలం రేపిన కల్తీ కల్లు మహమ్మారి ఊహించని విషాదంగా మారింది. కల్తీ కల్లుతాగి అస్వస్థతకు గురైన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకి పెరిగింది.
కల్లు కాంపౌండ్‌లో కల్తీ కల్లు తాగి మొత్తంగా 31మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వీరిలో పలువురు నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తొలుత దీని ప్రభావం సాధారణంగానే భావించినా అనూహ్యంగా మృతులు, బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.