
పీరియడ్‌లో ఉన్న మహిళలు దశాబ్దాల కాలంగా కుర్మాఘర్‌లో ఉంటున్న సంప్రదాయం
రుతుస్రావం (menstrual) జరుగుతున్న మహిళలను అపవిత్రమైనవారిగా.. అంటరానివారిగా పరిగణించే గ్రామాలు ఇప్పటికీ మన దేశంలో ఇంకా ఉన్నాయి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని మాడియాతెగ మహిళలు శతాబ్దాలుగా 'ఆ ఐదు రోజులు' ఊరికి దూరంగా రుతు గుడిసె (menstrual huts or kurma ghars) లలో ఒంటరిగా ఉంటున్నారు. ఇప్పుడా ఆచారానికి అక్కడి మహిళలంతా కలిసి స్వస్తి పలికారు.
ఆ గ్రామంలోని అన్ని వయసుల మహిళలకు సమష్టిగా 'మావా ఆస్కాన్లోన్' (మహిళలుగా ఇది మా నిజమైన ఇల్లు) ను ఏర్పాటు చేశారు. దశాబ్దాలుగా ఈ ఆచారాన్ని నిర్మూలించడానికి కృషి చేసి, విజయం సాధించారు. ఈ నిర్మాణం మహిళలకు ఒక ఆశ్రయం మాత్రమే కాదు సమావేశాలు జరుపు కోవడానికి, ఒకరికొకరు మద్దతుగా నిలబడటానికి మహిళల కమ్యూనిటీ కేంద్రంగా కూడా పనిచే స్తుంది. సమీప గ్రామాల మహిళలు కూడా ఈ ఇంటికి వస్తున్నారు. మహిళలే మహిళల కోసం ఐక్య తగా సదస్సులు ఏర్పాటు చేసి, అవగాహన కల్పిస్తున్నారు.
దశాబ్దాల కాలంగా కుర్మాఘర్ (రుతు గుడిసె) ఆచారాన్ని నిర్మూలించడానికి గడ్చిరోలికి చెందిన స్వర్మ్ అనే ఎన్జీవో అక్కడి మహిళలకు మద్దతుగా నిలిచింది. ఇది సహజమైన జీవప్రక్రియ. ఈ సమ యంలో మహిళలకు అవసరమైన భావోద్వేగ, శారీ లేక మద్దతు కుటుంబం నుండి మాత్రమే లభి స్తుంది, ఒంటరితనంతో కాదు" అని పదే పదే చెబుతూ గ్రామంలోని పురుష సభ్యులను, సంప్ర దాయ విశ్వాస నాయకులలో మార్పునకు కృషి చేసింది. 'మొదట్లో అసాధ్యం అనిపించింది. కానీ,చేశారు. శ్రమించారు. కానీ, నిజాయితీగా కృషి చేయడంతో మనస్తత్వాలు రడం ప్రారంభించాయి. ఇక నుంచి రుతు గుడిలో ఏ ఒక్క మహిళ కూడా ఉండకూడదు అని స్థంగా చెబుతున్నారు' అంటారు ఎన్టీవో డైరెక్టర్ దిలీప్ బర్సగా..
ఒంటరి వేదన నుంచి విముక్తి
మహిళల కోసం ఆశ్రమం నిర్మించాలనుకున్న డు కుర్మ ఘరాగా ఉండకూడదనే షరతుతో గీకరించారు. అంటే, వారు ఆ రుతు గుడిసెతో తటి మానసిక, శారీరక క్షోభను అనుభవించారో చేసుకోవచ్చు. మహిళలు ఒంటరిగా ఉండే. పది ఐదు రోజుల నుండి మూడు రోజులకు, వాత రెండు రోజులకు తగ్గింది. అయినప్పటికీ డా ఇళ్ల వాళ్లు రుతుస్రావం ఉన్న మహిళలను శ్లోకి అనుమతించడాన్ని నేటికీ వ్యతిరేకిస్తున్నాయి. రుతుస్రావం ఉన్న, లేని మహిళలు అందరూ ఒకే పైకప్పు కింద కలిసి ఉండటం వల్ల ఈ నిషేధం తొలగిపో యేంతవరకు అవిశ్రాంతంగా కృషిచేశారు శ్రమించారు. ఫలితంగా నేడు అందరూ కలిసి ఉంటున్నారు. కొందరు రుతుక్రమంలో ఉన్న మహిళలు ఇప్పటికీ కేంద్రంలో పగటిపూట గడు పుతారు. కానీ, రాత్రికి ఇంటికి తిరిగి వెళతారు. ఈ ఇల్లు ఇప్పుడు అన్నిరకాల సమావేశాలకు ఉపయోగపడుతుంది. మహిళల విజయానికి చిహ్నంగా మారింది.
ఆంక్షల నుంచి అవగాహనవైపుగా
నెల్గుండ గ్రామానికి చెందిన మాడియా తెగ సభ్యురాలు బేబీ మర్కుమే మాట్లాడుతూ 'ఊరికి దూరంగా 15 గుడిసెల వరకు ఉన్నాయి. అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు. తుఫానుల వల్ల చాలా వరకు పైకప్పులు ఎగిరిపోయాయి. రుతు క్రమం సమయంలో నది నీటిని తాకడానికి కూడా వీల్లేని ఆంక్షలు, మూడవ రోజు, మళ్లీ ఐదవ రోజున స్నానం చేసి, ఊరి లోపలికి వెళ్లాలి. దీనివల్ల రకర కాల జబ్బులు వచ్చేవి. కానీ, ఊరి పెద్దవాళ్లు మొండిగా ఉంటారు' అని చెబుతుంది ఆమె. 201 1లో స్వర్క్ 223 రుతు గుడిసెలలో ఒక సర్వే నిర్వ హించింది. అందులో.. పాముకాటు, అడవి జంతు వుల దాడులు, ఒంటరితనం, అధిక రక్తస్రావం, వైద్య అత్యవసర పరిస్థితుల వల్ల 28 మంది అమ్మా యిలు మరణించారని గుర్తించింది. బాధితుల్లో దాదాపు 70 శాతం మంది 11 నుంచి 37 సంవత్స రాల మధ్య వయసు గలవారే అని చెబుతారు. ఇక్కడి మహిళలు, గిరిజన పరిశోధన శిక్షణ సంస్థ గడ్చిరోలిలోని 50 గ్రామాలకు తన బృందాన్ని పంపింది. ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సాయంతో విద్య, వైద్యం వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది..