
రహమత్‌నగర్(హైదరాబాద్): మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే దారుణంగా హింసించి కడతేర్చాడో కిరాతకుడు. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలాజీనగర్‌కు చెందిన నర్సింహ కూలి పనిచేస్తుంటాడు. మొదటి భార్య వదిలి వేయడంతో ఫతేనగర్‌కు చెందిన సోని(26)ని ఏడేళ్లక్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరు రెండు నెలల క్రితం బోరబండ డివిజన్ సాయాబాబానగర్‌కు వచ్చి అద్దెకు ఉంటున్నారు.
సోని హౌస్ కీపింగ్ పని చేస్తుండగా..కుమారుడిని గురుకుల పాఠశాలలో చేరి్పంచారు. మద్యానికి బానిసైన నర్సింహ దొంగతనాలు చేశాడు. ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లలో 16 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో సోనీ ఇటీవల నర్సింహకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లి వచ్చింది.
దీంతో కోపం పెంచుకున్న నర్సింహ శుక్రవారం రాత్రి మద్యం తాగి వచ్చి సోనిని తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరింది. అరుపులు, కేకలు విన్న పొరుగింటి వారు 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వగా..బోరబండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకని సోనిని పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. నర్సింహను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.