రియాక్టర్‌ మొదట బ్లాస్ట్‌ కాలేదు.. ఫ్యాక్టరీ ప్రమాదంపై మంత్రి వివేక్‌ | Massive Accident In Patancheruvu Chemical Factory Incident Latest News, 25 Workers Seriously Injured | Sakshi
Sakshi News home page

రియాక్టర్‌ మొదట బ్లాస్ట్‌ కాలేదు.. ఫ్యాక్టరీ ప్రమాదంపై మంత్రి వివేక్‌

Jun 30 2025 10:14 AM | Updated on Jun 30 2025 7:45 PM

Patancheruvu Chemical Factory June 30t Incident Latest News

పటాన్‌చెరు పారిశ్రామికవాడ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. షిఫ్ట్‌లో 150 మంది కార్మికులు ఉండగా.. ప్రమాదం జరిగిన బ్లాక్‌లోనే 90 మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. మృతుల సంఖ్య 15కి చేరింది. కంపెనీ మేనేజర్‌ ఒకరు సైతం మృతి చెందినట్లు సమాచారం. 26 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అందులో పలువురిపరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

సంగారెడ్డి, సాక్షి:  పటాన్‌చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. సిగాచి కెమికల్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలింది. పేలుడు ధాటికి కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌, మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ సహా చాలా భాగం దెబ్బతింది. ఆ సమయంలో అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌ పరిసరాల్లోనే భారీ సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు సమాచారం. 

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం 9గం. సమయంలో భారీ శబ్దంతో రియాక్టర్‌ పేలి మంటలు వ్యాపించాయి. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు. కంపెనీలో ఎక్కడ పడితే అక్కడ క్షతగాత్రులు పడిపోయారు. ప్రమాద సమయంలో లోపల కార్మికులు చాలామందే ఉన్నారు. మంటల్లో.. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకునిపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలిపారు. అలాగే అధికారులు సకాలంలో స్పందించి చుట్టపక్కల ప్రజలను ఖాళీ చేయించడంతో మరింత ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో.. సహాయక చర్యలపై మంత్రులు కీలక ప్రకటనలు  చేస్తున్నారు.

భవన శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కార్మికులు

  • శిథిలాలను తొగించిన కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు
  • గుర్తు పట్టరాని స్థితిలో మృతదేహాలు
  • పాశమైలారంలోని ప్రమాద స్థలం నుంచి మరో రెండు మృత దేహాలు వెలికితీత
  • 15కి చేరిన మృతుల సంఖ్య
  • మరణాలు, క్షతగాత్రుల సంఖ్యపై వెలువడని అధికారిక ప్రకటన
  • పరిశ్రమ వద్ద, ఆస్పత్రుల వద్ద కార్మికుల కుటుంబాల నిరీక్షణ.. రోదనలు
  • ఆచూకీ లభించక శోకసంద్రంలో కుటుంబాలు
  • భారీ వర్షంలోనూ కొనసాగుతున్న సహాయక చర్యలు

రేపు సంగారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి

  • రేపు ఉదయం పాశమైలారం ప్రమాద ఘటన స్థలానికి వెళ్లనున్న రేవంత్‌
  • పాశమైలారం ఘటనపై సీఎం విచారం
  • క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలపై సీఎం ఆరా
  • ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశం
  • గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన సీఎం

బాధాకరం: ప్రధాని మోదీ 

  • సంగారెడ్డి ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
  • చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం
  • తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను
  • క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
  • మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాం

సీఎం రేవంత్‌ విచారం
పాశమైలారం ఫ్యాక్టరీ  పేలుడు ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో పలువురు మరణించడం బాధాకరమన్న ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ఆదేశాలిచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.  

కేటీఆర్‌ దిగ్భ్రాంతి

  • పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన రియాక్టర్ పేలుడుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ దిగ్భ్రాంతి
  • కార్మికులు చనిపోవడం అత్యంత విషాదకరం
  • గాయపడిన వారిని రక్షించి అత్యుత్తమ వైద్య సహాయం అందించాలి
  • మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
  • ప్రమాదానికి కారణాలు తెలుసుకుని బాధ్యులను శిక్షించాలి
     

15 నిమిషాల్లో స్పందించాం: మంత్రి వివేక్‌

ఘటన జరిగిన 15నిమిషాల్లో స్పందించాం. కలెక్టర్, జిల్లా యంత్రాగ సమన్వయంతో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. వెంటనే 34మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం.. 12మంది ఐసీయూలో ఉన్నారు. వెంటిలేటర్ పై చికిత్స అందుతోంది. మొత్తం ఘటనలో12మంది చనిపోయారు. ప్రమాదంలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చర్మం, శరీరం తీవ్రంగా కాలిపోయాయి. హైడ్రా కూడా చేరుకుంది.. షాకిలాలను తీసివేస్తున్నారు. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది.. 

రియాక్టర్ మొదట బ్లాస్ట్ కాలేదు. నిర్లక్ష్యం ఏంటి అనేది ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది. నిజంగా విచారణ జరిపి బాద్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం అని మంత్రి వివేక్‌ మీడియాకు తెలిపారు.

ఎక్కడా నిర్లక్ష్యం లేదు: మంత్రి రాజనర్సింహ

సిగాచి కంపెనీ ప్రమాదంపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందని.. సకాలంలో స్పందించి ఉంటే ప్రాణాలు పోయేవి కావని మాజీ మంత్రి హరీష్‌ రావు చేసిన విమర్శలను మంత్రి దామోదర రాజనర్సింహ ఖండించారు. సిగచి కంపెనీ ప్రమాదం బాధాకరం. ఉదయం 9గం.ప్రాంతంలో ప్రమాదం జరిగింది.  మూడు గంటల నుంచి ప్రమాద స్థలంలోనే ఉన్నాం. 

సంఘటన జరిగినా వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. ఎమర్జెన్సీ సిస్టం ద్వారా త్వరితగతిన క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాం. ఫ్యాక్టరీలో మైక్రో క్రిస్టల్ పౌడర్ ని తయారు చేస్తుంటారు. మార్నింగ్ 60మంది వర్కర్స్ పనిలో ఉన్నారు. జనరల్ వాళ్ళు 20మంది ఉన్నారు. ఆస్పత్రిలో 34మందికి చికిత్స అందుతోంది. 12 మృతదేహాలను ఇప్పటిదాకా వెలికి తీశాం. ప్రతి కార్మికుడికి ప్రభుత్వం వైద్యం అందిస్తుంది.. ఎక్కడ నిర్లక్ష్యం లేదు.  మృతుల కుటుంబాలను పరామర్శిస్తాం. ప్రభుత్వం తరపున బాధితులకు అండగా ఉంటాం. ప్రతి కార్మిక కుటుంబాన్ని అదుకుంటాం. ఈ ప్రమాదాన్ని రాజకీయం చేయడం సరికాదు అని మంత్రి రాజనర్సింహ అన్నారు. 

ఇదీ చదవండి: ఫ్యాక్టరీ ప్రమాదం.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే!

👉ఐజీ సత్యనారాయణ ప్రమాదంపై మీడియాతో మాట్లాడారు. రియాక్టర్ పేలడంతో ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన టైంలో.. షిఫ్ట్‌లో 150 మంది ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటిదాకా 8 మంది మరణించారు. మూడు ఆస్పత్రుల్లో 26 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకొక బ్లాక్ ఓపెన్ చేయాల్సి ఉంది.. అందులో కార్మికులు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది అని తెలిపారు. 

👉ప్రమాదం తర్వాత.. ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ప్రమాదం గురించి తెలియగానే కలెక్టర్‌, ఐజీ, సంగారెడ్డి ఎస్పీ, అడిషనల్‌ కలెక్టర్‌.. అధికార యంత్రాంగమంతా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాద వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

👉ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగ, ఘాటైన వాసనలు వెలువడుతుండడంతో అక్కడున్నవాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో అటువైపుగా ఎవరూ రావొద‍్దని స్థానికులను పోలీసులు కోరుతున్నారు. మొత్తం  8 ఫైర్‌ ఇంజిన్లు అక్కిడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయి. ప్రమాద స్థలానికి భారీగా ఆంబులెన్స్‌లు చేరుకుని క్షతగాత్రుల్ని తరలిస్తున్నాయి.  భారీ క్రేన్లు, కట్టర్ల సాయంతో ఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా బృందం.. అడ్మిన్‌స్ట్రేషన్‌ బిల్డింగ్‌ శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement