
శాయంపేట/మద్దూరు: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ విద్యార్థిని.. గురుకుల పాఠశాలలో సీటు రాలే దని మరో విద్యార్థిని వేర్వేరుచోట్ల ఆత్మహత్య చేసుకున్నారు. హనుమకొండ, నారాయణపేట జిల్లా ల్లో చోటుచేసుకున్న ఘటనల వివ రాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రావుల ప్రత్యూష (24) బీటెక్ పూర్తిచేసి రెండేళ్లుగా ఉద్యోగవేటలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల ఎంట్రన్స్‌లు రాయగా, కొన్ని మార్కుల తేడాతో ఫలితం రాలేదు.
దీంతో ప్రత్యూష మనస్తాపానికి గురై శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో దూలానికి ఉరివేసుకుంది. కొద్దిసేపటికి అమ్మమ్మ లక్ష్మి ఇంట్లోకి వచ్చి చూసి.. భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే ప్రత్యూష మృతి చెందింది. తల్లిదండ్రులు కూలీలు. ప్రత్యూష తండ్రి రావుల రమేశ్ ఫిర్యా దుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జక్కుల పరమేశ్ తెలిపారు.
గురుకులంలో సీటు రాలేదని
నారాయణపేట జిల్లా దమ్‌గాన్‌పూర్‌కు చెందిన నర్సప్ప, లక్ష్మి దంపతులకు కుమార్తె, కుమారు డు ఉన్నారు. నర్సప్ప బతుకుదెరువుకు హైదరాబాద్ వెళ్లి కూలీ పనిచేస్తుండగా, లక్ష్మి ఊళ్లో వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంది. కుమార్తె మనీషా (14) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగ తి పూర్తి చేసుకొని మద్దూరు బాలికల పాఠశాలలో 9వ తరగతి అడ్మిషన్ పొందింది. గురుకుల పాఠశాల లో సీటు కోసం ఎంట్రన్స్ రాసింది.
పరిగి గురుకుల పాఠశాలలో సీటు వచ్చిందని టీసీ తీసుకొని వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక అక్కడ సీటు రాలేదని తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన మనీషా 2వ తేదీ రాత్రి పురుగుమందు తాగింది. తల్లి గమనించి మ హబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించింది. అక్కడే చికిత్సపొందు తూ మనీషా గురువారం అర్ధరాత్రి మృతి చెందింది.