
అతడికి వివాహమైంది. ఆమె విద్యార్థిని
కలిసుండలేమని ఇరువురు ఆత్మహత్య
వరంగల్: అతడికి పెళ్లయ్యింది.. ఇద్దరు పిల్లలు. యువతి డిగ్రీ చదువుతుంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం.. చివరికి వారి ప్రాణమే తీసింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా ఏనుమాముల ఇందిరా కాలనీ ఫేజ్–2కు చెందిన వేల్పుగొండ స్వామి(42).. ఎలిశాల గాయత్రి (22) పక్కపక్కనే ఉంటారు. కుమారస్వామికి భార్య, ఇద్దరు పిల్లలు. ఒకరు తొమ్మిది, మరొకరు ఏడో తరగతి చదువుతున్నారు. లారీడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి పక్కనే ఉంటున్న గాయత్రి నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. వీరిద్దరికి మూడేళ్లక్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
స్వామికి.. గాయత్రిని వదిలేసి భార్యా, పిల్లలతో ఉండాలనే ఆలోచన వచ్చింది. విషయం గాయత్రికి తెలపగా, అందుకు అంగీకరించలేదు. ‘నువ్వు నాతోనే ఉండాలి.. మనమిద్దరం వివాహం చేసుకుందాం’ అని తెలిపింది. ఈ విషయంలో స్వామి తన భార్యను ఒప్పించాలని ప్రయత్నించినప్పటికీ ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించింది. దీంతో స్వామి ఏంచేయలేక భార్యను చికిత్స కోసం ఈనెల 2న ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడే వదిలేసి మళ్లీ వస్తానని వెళ్లాడు. రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో 4న మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో స్వామిపై మిస్సింగ్ కేసు నమోదైంది.
గాయత్రి ఈనెల 2నుంచి కనిపించడం లేదని ఆమె తండ్రి కుమారస్వామి 3న ఏనుమాముల పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. వీరిద్దరు 2న ఇంట్లో నుంచి పారిపోయారు. తిరిగి ఇంటికెళ్తే ఇబ్బందవుతుందని, కలిసి చని పోదామని నిర్ణయించుకుని ఆదివారం ఉద యం పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామానికి చేరుకుని గడ్డిమందు తాగారు. గమనించిన స్థానికుడు పవన్‌కళ్యాణ్ ఫోన్ ద్వారా వారి బంధువులకు సమాచారం అందించి ఇద్దరిని 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందారు. మృతుడి అన్న యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పర్వతగిరి ఎస్సై ప్రవీణ్ తెలిపారు.