‘మల్నాడు’ డ్రగ్‌ పార్టీ కేసులో ఈగల్‌ టీం దూకుడు | EAGLE Team Leads Aggressive In Malnadu Drugs Case, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

‘మల్నాడు’ డ్రగ్‌ పార్టీ కేసులో ఈగల్‌ టీం దూకుడు

Jul 10 2025 3:45 PM | Updated on Jul 10 2025 5:35 PM

EAGLE Team Leads Aggressive In Malnadu Drugs Csae

హైదరాబాద్‌: మల్నాడు రెస్టారెంట్‌ డ్రగ్‌ పార్టీ కేసులో ఈగల్‌ టీం దూకుడు పెంచింది. 9 పబ్‌లపై కేసులు నమోదు చేసింది ఈగల్‌ టీమ్‌.. పబ్‌ యాజమానులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వచ్చేవారం తమ ఎదుట హాజరుకావాలని పబ్‌ యాజమానులకు స్పష్టం చేసింది. మల్నాడు రెస్టారెంట్‌ సూర్యతో ముగ్గురు పబ్‌ యజమానులకు సంబంధాలను గుర్తించింది. మూడు పబ్‌ యజమానులు కలిసి డ్రగ్‌ పార్టీ నిర్వహించినట్లు ఈగల్‌ టీం గుర్తించింది. 

పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాయి యాజమాన్యాలు. ఈ కేసులో కూడా ఫ్రిజం పబ్‌, ఫామ్‌ పబ్‌, బర్డ్‌ బాక్స్‌ పబ్‌, బ్లాక్‌ 22 పబ్‌, వాక్‌ కోరా పబ్‌, బ్రాడ్‌ వే పబ్‌ పార్టీలు నిర్వహించాయి, వాక్ కోరా పబ్,  బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానుల పైన కేసు నమోదు చేశారు. పోలీసులు. 

క్వాక్ పబ్ ఓనర్ రాజా శేఖర,  కోరా పబ్ ఓనర్ పృద్వి వీరమాచినేని,  బ్రాడ్ వే పబ్  ఓనర్ రోహిత్ మాదిశెట్టిలపై కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురు పబ్బు యజమానులతో కలిసి డ్రగ్  పార్టీలు నిర్వహించినట్లు మల్నాడు రెస్టారెంట్‌ సూర్య  విచారణలో పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ నార్కోటిక్ డ్రగ్స్ టీంకు కొత్త పేరు పెట్టిన తర్వాత అతిపెద్ద డ్రగ్ రాకెట్‌ను గుట్టు రట్టు చేసింది ఈగల్ టీం. అతిపెద్ద నెట్‌వర్క్‌ ను బట్టబయలు చేశారు.. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య ఈ డ్రగ్ రాకెట్ ని నడుపుతున్నట్లు తేలింది. 

డ్రగ్స్‌ రహిత తెలంగాణనే లక్ష్యంగా పని చేస్తున్నామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  డ్రగ్స్, గంజాయి జోలికి వెళ్లొద్దని..డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దామన్నారు. దీనిలో ‘ఈగల్‌’ టీమ్‌ను ఏర్పాటు చేశారు. 

‘యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (ఏఎన్‌బీ)ను  ‘ఈగల్‌’ గా మార్చారు. ఈగల్‌ అంటే ఎలైట్‌ యాక్షన్‌ గ్రూప్‌ ఫర్‌ డ్రగ్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌. తెలంగాణలోని కోటి 50 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో ఎక్కడ గంజాయి పండించినా..ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ సప్లయ్‌ చేసినా దాన్ని ఛేదించే పనిని ఈగల్‌కు అప్పగించారు.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement