Kolkata: బాధితురాలిని బలవంతంగా.. సీసీటీవీలో షాకింగ్‌ దృశ్యాలు | Shocking CCTV Footage Revealed, Kolkata Survivor Was Dragged Inside College, More Details Inside | Sakshi
Sakshi News home page

Kolkata: బాధితురాలిని బలవంతంగా.. సీసీటీవీలో షాకింగ్‌ దృశ్యాలు

Jun 30 2025 9:27 AM | Updated on Jun 30 2025 11:04 AM

On CCTV Kolkata Survivor was Dragged Inside College

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో విద్యార్థినిపై జరిగిన అకృత్యం దేశవ్యాప​ంగా సంచలనం సృష్టించింది. కేసు దర్యాప్తులో పలు విస్తుపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. బాధితురాలిని ఇద్దరు నిందితులు కళాశాల లోపలికి బలవంతంగా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కనిపించాయి. ఈ  కేసులో ప్రధాన నిందితుని నుంచి వచ్చిన వివాహ ప్రతిపాదనను బాధితురాలు తిరస్కరించిన నేపధ్యంలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

అత్యాచార బాధితురాలిని కళాశాల గేటు నుండి కళాశాల ప్రాంగణంలోకి ఇద్దరు నిందితులు బలవంతంగా లాక్కెళుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో బయటపడ్డాయని కోల్‌కతా పోలీసు వర్గాలు  మీడియాకు తెలిపాయి. ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా మరో  ఇద్దరు నిందితులతో తనను బలవంతంగా గార్డు గదిలోనికి తీసుకువెళ్లాలని ఆదేశించాడని బాధితురాలు చెప్పడాన్ని ఈ వీడియో క్లిప్‌ ధృవీకరిస్తోంది. ప్రస్తుతం తాము ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఈ కేసులో నిందితులు మనోజిత్ మిశ్రా, ప్రోమిత్ ముఖర్జీ, జైద్ అహ్మద్, కాలేజీ సెక్యూరిటీ గార్డులను ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేశారు. మనోజిత్ బాధితురాలిపై అత్యాచారం చేశాడని, మిగిలిన ఇద్దరు ఆమెను బ్లాక్ మెయిల్ చేసేందుకు వీడియో చిత్రీకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనోజిత్ మిశ్రా తృణమూల్ యువజన విభాగంలో సభ్యునిగా ఉన్నారు. దీంతో పార్టీపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి: Maharashtra:‘హిందీ’పై గరంగరం.. త్రిభాషా విధానం రద్దు

Advertisement
 
Advertisement
Advertisement