స్కాలర్‌షిప్‌ రాలేదా? కోరిన సమాచారం అందకపోతే అప్పీల్‌కు వెళ్లవచ్చు! | Do know about exemptions ofsection 8and 9 The Right to Information (RTI) Act | Sakshi
Sakshi News home page

స్కాలర్‌షిప్‌ రాలేదా? కోరిన సమాచారం అందకపోతే అప్పీల్‌కు వెళ్లవచ్చు!

Jul 16 2025 3:23 PM | Updated on Jul 16 2025 3:59 PM

Do know about exemptions ofsection 8and 9 The Right to Information (RTI) Act

మా అమ్మాయికి రావలసిన స్కాలర్షిప్ రాకపోవటంతో నేను సదరు అధికారులకు గతంలో సమాచార హక్కు చట్టం కింద 'స్కాలర్‌షిప్ ఎందుకు రాలేదు, కారణాలు తెలపండి' అని అడిగాను. మొదట ఈ విషయం మా పరిధిలోకి రాదు అని ఒక శాఖ వారు సమాధానం ఇస్తూ సరైన శాఖకి నా దరఖాస్తును బదిలీ చేశారు. వారేమో "మీరు కోరిన సమాచారం సెక్షన్ 8 ప్రకారం అందించటం వీలు కాదు" అని తిరస్కరించారు. నాకు సమాచారం ఎలా వస్తుందో చెప్పగలరు. -జాగృతి, ఆదిలాబాద్ 

సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం ప్రభుత్వ/ప్రభుత్వ అనుబంధ శాఖలు/ప్రభుత్వం ద్వారా నిధులు పొందుతున్న సంస్థలు, మొదలైన వారినుంచి ఎవరైనా సమాచారం పొందవచ్చు. అయితే అసలు "సమాచారం" అంటే ఏమిటి అని మనం తెలుసు కోవాల్సిన అవసరం ఉంది. మీరు కోరుతున్న సమాచారం ఏదో ఒక రూపం కలిగి ఉండడం చాలా ముఖ్యం. అంటే సదరు సమాచారం పత్రాలు, మెమోలు, సలహాలు, ప్రకటనలు, నివేదికలు, అంకెల పట్టికలు, ఎలక్ట్రానిక్ సమాచారం వంటివి ఏదో ఒక రూపంలో నిక్షి ప్తమై భౌతికంగా ఉండాలి. అలా లేని పక్షంలో మీ దరఖాస్తును తిర స్కరించే ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు: నాకు స్కాలర్షిప్ ఎందుకు మంజూరు అవలేదు అంటే మీరు కారణం అడుగుతు న్నట్లు - ఆది సమాచారం అయుండకపోవచ్చు లేదా అందుకు దగ్గర కారణం రికార్డులో ఉండి ఉండకపోవచ్చు. అదే సమాచారాన్ని మీరు "నా స్కాలర్షిప్ ప్రతిపాదనకు మంజూరుకు సంబంధించి ఫైలు ఏ స్థాయిలో ఉన్నది - తగిన పత్రాలు అందించగలరు." అని కోరినట్లయితే మీకు ఖచ్చితంగా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. 

సెక్షన్ 8, 9 లోని మినహాయింపులు పరిశీలిస్తే,
ముఖ్యంగా దేశభద్రతకు, అంతర్జాతీయ సంబంధాలకు, దేశ ఆర్ధికవ్యవస్థకు భంగం కలిగించే సమాచారాలు, గోప్యం వహించ వలసిన సమాచారాలు, ఏదైనా చట్టం ద్వారా గాని కోర్టుల ద్వారా గాని నిషే ధించబడిన సమాచారం, ఏదైనా వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత మైన సమాచారం, వ్యక్తిగత స్వేచ్ఛకు అలాగే భద్రతకు భంగం కలిగి స్తుంది. అనిపించే సమాచారం వంటివి ఇవ్వవలసిన ఆవసరం లేదు. కొన్ని సందర్భాలలో ప్రజాప్రయోజనం ఉంటుంది అని సదరు అధి కారులు తలిస్తే మీకు సమాచారాన్ని ఇచ్చే అవకాశం/ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ప్రశ్నలు అడిగేటప్పుడు "ఎందుకు చేశారు. ఆ పని చేయడానికి కారణం ఏమిటి" వంటి ప్రశ్నలు అడగకుండా ఆ అంశానికి సంబంధించిన పత్రాలను మాత్రమే అడిగినట్లయితే మీరు కోరిన సమాచారాన్ని తిరస్కరించే ఆస్కారం తగ్గిపో తుంది. మీరు కోరిన సమాచారం చాలా ఎక్కువ పేజీలలో ఉండి ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ పనికి భంగం కలిగిస్తుంది అని వారు భావిస్తే మిమ్మల్ని ఒకరోజు ఆఫీసుకు వచ్చి డాక్యుమెంట్లు పరిశీలించుకోవలసినదిగా సమాధానం ఇవ్వవచ్చు. అప్లికేషన్కు పదిరూపాయలు (తెల్ల రేషన్ కార్డు ఉంటే ఉచితంగా), సమాచారం పొందడానికి అధికారి నిర్దేశించిన రుసుము చెల్లించి మీరు సమాచారం పొంద వచ్చు. 

మీ మొదటి దరఖాస్తుకు సమాచారం దక్కకపోతే మీరు అప్పీలకు వెళ్ళవచ్చు, అప్పీల్లో కూడా మీకు సమాచారం దక్కక పోతే మీరు రాష్ట్ర సమాచార కమిషన్లో దరఖాస్తు చేయవచ్చు. మీరు కోరుతున్న సమాచారం ఎవరిని అడగాలో మీకు తెలియన ప్పుడు, సదరు అంశానికి సంబంధించిన మంత్రివర్యులకు కూడా మీరు నేరుగా దరఖాస్తు చేయవచ్చు. వారు తగిన రీతిలో మీకు సమాచారాన్ని అందిస్తారు. చాలా సందర్భాలలో సమాచారం రాక పోవడానికి కారణం సరైన రీతిలో అదగకపోవడం అనేది కూడా గమనించాలి.

- శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది 

మీకున్న న్యాయపరమైన సమస్యలు.సందేహాల కోసం sakkhilamjy3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement