
బండ్లగూడ: సంగారెడ్డి జిల్లాలో ఓ యువతి-యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రామచంద్రాపురం పీఎస్ పరిధిలోని బండ్లడూడ బాలాజీ నగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో యువతి మృతిచెందగా, యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరూ ప్రేమించుకుని ఆత్మహత్యాయత్నం చేశారా? అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనలో రమ్య అనే యువతి మృతిచెందగా, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీణ్ అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం.
డిగ్రీ చదువుతున్న రమ్య అనే యువతితో ప్రవీణ్ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు. ఈ కారణంగానే ఇరువురు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం .అయితే యువతి గొంతుపై కత్తి గాట్లతో రక్తపు మడుగులో పడి ఉంది. ఇక ఆమె పక్కనే పడి ఉన్న ప్రవీణ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడ యువతి మెడపై కత్తి నాట్లు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఇద్దరు కలిసి ఆత్మహత్యాయత్నం చేశారా? లేక యువతిపై ప్రవీణ్ దాడి చేసి ఆపై ఆత్మహత్యకు యత్నించాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
