పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు | Man gets 20 years in prison in POCSO case | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు

Jun 27 2025 5:15 AM | Updated on Jun 27 2025 5:15 AM

Man gets 20 years in prison in POCSO case

నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో శిక్ష ఖరారు   

కర్నూలు:  నంద్యాల జిల్లా బనగానపల్లెలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఇ.రాజేంద్రబాబు గురువారం తీర్పు చెప్పారు. 2020 అక్టోబర్‌ 22న బాధిత బాలిక (4) ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన గుడిసె రుద్రేశ్‌ (22) అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు బనగానపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

డీఎస్పీ నరసింహారెడ్డి కేసు విచారించి నిందితుడిపై కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధించారు. జరిమానా మొత్తాన్ని బాధిత బాలికకు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పులో ఆదేశించారు. 

Advertisement
 
Advertisement
Advertisement