
ఆపై బండరాయితో మోదీ అన్నను కిరాతకంగా చంపిన తమ్ముడు
హత్య దృశ్యాల వీడియో వైరల్
మెదక్ జిల్లాలో ఘటన
మెదక్: సొంత అన్ననే తమ్ము డు కిరాతకంగా హతమార్చిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహమ్మద్ గౌస్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... వసురాంతండాకు చెందిన రామావత్ మంత్యా (48)కు తండా పక్కనే పొలం ఉంది. ఇతని సొంత తమ్ముడు మోహన్ కూడా ఇదే తండాలో నివాసం ఉంటున్నాడు. గత యాసంగి సీజన్‌లో మోహన్ ట్రాక్టర్‌తో మంత్యా తన పొలాన్ని దున్నించాడు. కిరాయి డబ్బు చెల్లించలేదు. ఈ విషయమై అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మోహన్ ఇంట్లో తరచూ కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతుండటం, నెల క్రితం అతడి మనవరాలు అనారోగ్యంతో చనిపోయింది.
అన్న మంత్యా మంత్రాలు చేయడం కారణంగానే ఇలా జరిగిందని భావించాడు. రెండు రోజుల క్రితం పొలం దున్నడానికి అదే తండాకు చెందిన భిక్షపతి ట్రాక్టర్‌ను మంత్యా మాట్లాడాడు. విషయం తెలుసుకున్న మోహన్ తన డబ్బులు ఇవ్వకుండా ఎవరూ పొలం దున్నేది లేదంటూ గొడవపడ్డాడు. ఉద యం కల్లు దుకాణంలో మోహన్, భిక్షపతి కల్లు తాగారు. దున్నకం విషయమై మాట్లాడాలంటూ భిక్షపతి మంత్యాకు ఫోన్ చేయగా అక్కడకు వచ్చాడు. డబ్బుల విషయమై అన్నదమ్ముల మధ్య మాటామాట పెరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మోహన్ పక్కనే ఉన్న కల్లు సీసాను పగలగొట్టి మంత్యా గొంతులో ఇతర శరీర భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు.
ఆపై బండరాయితో తలపై, మర్మాంగాలపై మోదాడు. చేతి రుమాలుతో మెడకు బిగించి నేలపై తలను కొట్టి, కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. విషయం తెలుసుకున్న మంత్యా భార్య లక్ష్మి , కుమారుడు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న మంత్యాను కొల్చారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు తెలిపారు. మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి సంఘటన స్థలానికి వచ్చారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటన మొత్తాన్ని కల్లు దుకాణంలో ఉన్న కొందరు ఫోన్‌లో చిత్రీకరిస్తూ నిలుచున్నారే తప్ప ఘోరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.