breaking news
Medak - Akkannapet
-
Anil Incident: హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు !
-
అన్నను అతికిరాతకంగా చంపిన తమ్ముడు
మెదక్: సొంత అన్ననే తమ్ము డు కిరాతకంగా హతమార్చిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... వసురాంతండాకు చెందిన రామావత్ మంత్యా (48)కు తండా పక్కనే పొలం ఉంది. ఇతని సొంత తమ్ముడు మోహన్ కూడా ఇదే తండాలో నివాసం ఉంటున్నాడు. గత యాసంగి సీజన్లో మోహన్ ట్రాక్టర్‌తో మంత్యా తన పొలాన్ని దున్నించాడు. కిరాయి డబ్బు చెల్లించలేదు. ఈ విషయమై అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మోహన్ ఇంట్లో తరచూ కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతుండటం, నెల క్రితం అతడి మనవరాలు అనారోగ్యంతో చనిపోయింది. అన్న మంత్యా మంత్రాలు చేయడం కారణంగానే ఇలా జరిగిందని భావించాడు. రెండు రోజుల క్రితం పొలం దున్నడానికి అదే తండాకు చెందిన భిక్షపతి ట్రాక్టర్‌ను మంత్యా మాట్లాడాడు. విషయం తెలుసుకున్న మోహన్ తన డబ్బులు ఇవ్వకుండా ఎవరూ పొలం దున్నేది లేదంటూ గొడవపడ్డాడు. ఉద యం కల్లు దుకాణంలో మోహన్, భిక్షపతి కల్లు తాగారు. దున్నకం విషయమై మాట్లాడాలంటూ భిక్షపతి మంత్యాకు ఫోన్ చేయగా అక్కడకు వచ్చాడు. డబ్బుల విషయమై అన్నదమ్ముల మధ్య మాటామాట పెరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మోహన్ పక్కనే ఉన్న కల్లు సీసాను పగలగొట్టి మంత్యా గొంతులో ఇతర శరీర భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు. ఆపై బండరాయితో తలపై, మర్మాంగాలపై మోదాడు. చేతి రుమాలుతో మెడకు బిగించి నేలపై తలను కొట్టి, కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. విషయం తెలుసుకున్న మంత్యా భార్య లక్ష్మి , కుమారుడు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న మంత్యాను కొల్చారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు తెలిపారు. మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి సంఘటన స్థలానికి వచ్చారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటన మొత్తాన్ని కల్లు దుకాణంలో ఉన్న కొందరు ఫోన్లో చిత్రీకరిస్తూ నిలుచున్నారే తప్ప ఘోరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ఏడుపాయల ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి
-
లైన్...క్లియర్
మెదక్, న్యూస్‌లైన్: మూడు దశాబ్దాల స్వప్నం సాకారం కాబోతోంది. మెతుకు సీమ ప్రజల పట్టువీడని పోరాటాలు.. ఆకలెరుగని దీక్షలు.. అలుపెరుగని ఆందోళనలు.. ప్రజా ప్రతినిధుల ప్రయత్నాలు..వెరసి మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనుంది. దీంతో గురువారం రైల్వేశాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సధర్మ దేవరాయ్, ఈఈ రవీంద్రనాథ్, జేఈ వరుణ్‌కుమార్, డిప్యూటీ చీ్‌ఫ్ కమిషనర్ సుధాకర్, మెదక్ ఆర్డీఓ వనజాదేవి, మెదక్ డీఎస్పీ గోద్రూ, సీఐ విజయ్‌కుమార్‌లు మెదక్ పట్టణంలో కేంద్రమంత్రి శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. మూడు దశాబ్దాల ఉద్యమం మెదక్ -అక్కన్నపేటకు రైల్వేలైన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ 1980లోనే ఊపిరి పోసుకుంది. ఈ ప్రయత్నంలో భాగంగా స్థానిక న్యాయవాది సుభాష్‌చంద్రగౌడ్ అధ్వర్యంలో రైల్వేసాధన సమితి ఏర్పడింది. మెదక్ ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డిలకు తోడు స్థానిక ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున రైల్వేలైన్ కోసం ఉద్యమాన్ని చేపట్టారు. అక్కన్నపేట నుండి మెదక్ పట్టణానికి సుమారు 17.20 కిలో మీటర్ల దూరం పుష్, పుల్(వచ్చి వెనక్కి వెళ్లేది)రైలు వేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కాస్ట్ ఆఫ్ షేరింగ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి 50 శాతం నిధులివ్వడానికి అంగీకారం తెలిపారు. అనంతరం ఎంపీ విజయశాంతి కృషి మేరకు రైల్వేలైన్ సర్వేకు ఆమోదం లభించింది. ఈ మేరకు ఎంపీ కోటా నుండి రూ.కోటి విడుదల కాగా, రాష్ట్ర ప్రభుత్వం నుండి మరో రూ. కోటి నిధులు విడుదలయ్యాయి. మొత్తంగా ఈ ప్రాజెక్టు వ్యయం రూ.129.32 కోట్లుగా నిర్ణయించిన అధికారులు 2012లో పింక్‌బుక్‌లో నమోదు చేశారు. మెదక్ -అక్కన్నపేట రైల్వే లైన్‌కు 80 గ్రామాల పరిధిలోని 131.14 హెక్టార్ల భూమితోపాటు అటవీశాఖకు చెందిన 66 హెక్టార్ల భూమి అవసరమవుతుందని గతంలోనే అధికారులు తేల్చారు. అక్కన్నపేట నుంచి వచ్చేదారిలో లకా్ష్మపూర్, శమ్నాపూర్లతోపాటు మెదక్ పట్టణంలో రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మెదక్ పట్టణ శివారులోని సబ్‌స్టేషన్ వెనకాల గల డంప్‌యార్డ్ దగ్గర మెదక్ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. నా శ్రమ ఫలించింది మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ కోసం తీవ్రంగా శ్రమించాను. కేంద్రమంత్రి మల్లికార్జున్‌ఖర్గే, రైల్వే ఇంజనీరింగ్ బోర్డు చైర్మన్ ఎస్.కె.జైన్, సీఎం, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటీవ్లతో నిరంతరం మాట్లాడుతూ లైన్ మంజూరు కృషి చేశాను. ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయించాను. రైల్వేలైన్ త్వరితగతిన పూర్తయితే ఈ ప్రాంత వాసుల రవాణా కష్టాలు తీరుతాయి. -విజయశాంతి, ఎంపీ, మెదక్