
ఏ బంధమైనా నమ్మకం మీదే నడుస్తుంది. అది వైవాహిక బంధమైనా, లివింగ్ రిలేషన్ షిప్ బంధమైనా ఉండాల్సింది నమ్మకం. అటువంటి నమ్మకం చెల్లా చెదురై పోతే జీవితాల్లో అలజడి తప్పదు. ఓ జంట విషయంలో అదే జరిగింది.
కలిసి జీవించాలనుకున్నారు. కానీ వారి బంధాన్ని ఏడాదికే ముగించేశారు. ఈ జంటలో ఒకరు మృత్యుఒడికి చేరితే, మరొకరు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. అస్సాంలోని గువాహటిలో జరిగిన ఈ ఘటన లివింగ్ రిలేషన్ అనేది ఫ్రెండ్ షిప్ చేసినంత ఈజీ కాదనే విషయాన్ని తేటతెల్లం చేసింది.
అసలు విషయంలోకి వెళితే.. గువాహటిలోని కహిలిపారాలోని కళ్యాణి నగర్‌లో ఓ లివింగ్ రిలేషస్ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఇందులో ప్రియుడు చనిపోతే, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. నవ్‌జ్యోతి తలుక్‌దార్- సుస్మితలు ఏడాది కాలంగా లివ్-ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారు. దీనిలో భాగంగా ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఏమైంది ఏమో కానీ ఇందులో తలుక్‌దార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్య చేసుకునే క్రమంలో సుస్మితను వేరే రూమ్‌లో బంధించి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే తన బాయ్ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకుంటున్నాడనే సమాచారాని పోలీసులకు చేరవేసింది సుస్మిత. పోలీసులు వచ్చే సరికి తలుక్‌దార్ విగతజీవిలా కనిపించగా, మరో రూమ్‌లో ఉన్న సుస్మిత.. చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో ఆమెను హుటాహుటీనా స్థానిక హయత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీరి మధ్య తరుచు జరుగుతున్న ఘర్షణలే దీనికి కారణమని గువాహటికి చెందిన సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు
వీరిద్దరూ లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న కొత్తలో బాగానే ఉన్నారని, ఆపై కొంతకాలానికి వీరి మధ్య ఎప్పుడూఆపార్థాలు చోటు చేసుకుని గొడవలు జరిగేవని స్థానికులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.