
- అనంతపురం నగరంలోని కొన్ని లాడ్జీల్లోనూ కార్యకలాపాలు
- పేదరికాన్ని ఆసరాగా తీసుకుని మహిళలను ఊబిలోకి దింపుతున్న నిర్వాహకులు
- చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు
అనంతపురం: నగరంలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరాయి. పేద కుటుంబాల యువతులకు డబ్బు ఆశ చూపి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. నిర్వాహకుల మాటలు నమ్మి వచ్చిన వారిని నరకకూపంలోకి నెడుతున్నారు. ఇందులోకి దిగాక.. తిరిగి వెనక్కి వెళ్లలేక.. కుటుంబ కషాలే గుర్తుకు తెచ్చుకుని, ఇష్టం లేకున్నా మనసు చంపుకుని నిర్వాహకులు ఎలా చెబితే అలా నడచు కోవాల్సి వస్తోంది. చదువు రాకపోవడం, ఎవ రితోనూ బాధలు చెప్పుకోలేని నిస్సహాయ స్థితి, నెలన్నర వ్యవధిలోనే అనేక కేసులు..
గతనెల 30న అనంతపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉప్పర లలిత అనే మహిళ నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఓ బాధితురాలిని కాపాడారు. నిర్వాహకురాలిపై కేసు నమోదు చేశారు. ఇదే కాలనీలో జూన్ 19నసాయంత్రం 7:30 గంటల సమయంలో వ్యభి చారం గృహంపై పోలీసులు రైడ్ చేసి నిర్వాహకు రాలు కె. లక్ష్మిని అరెస్ట్ చేసి, ఓ బాధితురాలిని కాపాడారు. అంతకు ముందు కొన్ని రోజులు అంటే జూన్ 12న హౌసింగ్ బోర్డులోనే ఓ వ్యభిచార గృహంపై దాడులు చేశారు.
నిర్వాహకులు కుమ్మర లక్ష్మి, బోయ వనితను అరెస్టు చేసి ఇద్దరు బాధితు లను కాపాడారు. అదే రోజు హౌసింగ్ బోర్డులోనే వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న రామాజీ, మేరీ సుజాత, సరస్వతి అలియాస్ సాలమ్మ, విటులు జి. బాబావలి, గార్లదిన్నె లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు. ఓ బాధితురాలిని కాపాడారు. మే 11న హౌసింగ్బోర్డు ఎల్బాజీ బస్టాండు సమీపంలో ఒక ఇంట్లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఆకుల నారాయణమ్మ, విటుడు అజయ్ కుమార్ను అరెస్ట్ చేశారు. ఇద్దరు బాధితులను రక్షించారు. అనతికా లంలోనే ఇన్ని కేసులు నమోదయ్యాయంటే నగరం లో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
19-25 ఏళ్లలోపు వారే టార్గెట్.. ఒక వైపు పోలీసులు వ్యభిచార స్థావరాలపై దాడులు చేసి విటులు, నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నా ఆక్రమ కార్యకలాపాలు ఎప్పటిలాగానే నడుస్తున్నాయి. హైటెక్ హంగులతో యథేచ్ఛగా వ్యభిచారం. నిర్వహిస్తూ నిర్వాహకులు పోలీసులకు అనుమానం రాకుండా జగ్రత్తపడుతున్నారు. 19-25 ఏళ్ల లోపు ఉన్న యువతులనే ఈ ఊబిలోకి దింపుతున్నారు.
నిర్వాహకులు తమ పర్మినెంట్ కస్టమర్లతో ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి అందులోనే యువతుల ఫొటోలు పోస్ట్ చేసి విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తు న్నట్లు తెలిసింది.
ఎవరికీ అనుమానం రాకుండా కొందరు భార్యాభర్తలు కలిసి యువతులతో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. కొందరు ప్రముఖుల వద్దకే యువతులను పంపిస్తున్నారు. నగరంలో కొన్ని లాడ్జీలు కేవలం వ్యభిచార కార్యకలాపాల కోసమే నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని నగరవాసులు కోరుతున్నారు. రాత్రి వేళ గస్తీని తీవ్రతరం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.