
నాయుడుపేట టౌన్: తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని అగ్రహరపేట అరుంధతీయ కాలనీకి చెందిన ఓ యువతిపై అదే ప్రాంతానికి చెందిన మొండెం ఉదయ్ అనే టీడీపీ కార్యకర్త లైంగిక దాడికి యత్నించాడు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అగ్రహరపేటకు చెందిన యువతి బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఉదయ్ ఇంట్లోకి ప్రవేశించి లైంగికదాడికి యత్నించాడు. ప్రతిఘటించిన యువతి గట్టిగా కేకలు వేసింది. స్థానికులు చేరుకునేసరికి ఉదయ్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత యువతి తండ్రి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.