సిద్ధిపేటలో దారుణం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను చంపి.. | Siddipet Thukkapur Alludu Venkatesh Case Details | Sakshi
Sakshi News home page

సిద్ధిపేటలో దారుణం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను చంపి..

Jul 12 2025 2:57 PM | Updated on Jul 12 2025 3:49 PM

Siddipet Thukkapur Alludu Venkatesh Case Details

సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం ఓ అల్లుడు.. తన అత్తనే చంపించేశాడు.. ఈ నెల జులై 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం అల్లుడు వెంకటేష్.. రూ. లక్షా 50 వేలు సుపారీ ఇచ్చి.. కారుతో ఢీకొట్టించి అత్తను హత్య చేయించాడు. తోగుట మండలం తుక్కాపూర్‌ దర్గా వద్ద ఈ ఘటన జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారం అత్తను హత్య  చేయించిన అల్లుడు గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయిందంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు.

సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయగా అల్లుడి బాగోతం బయటపడింది. వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. హత్య చేసినట్టు అల్లుడు వెంకటేష్ తన నేరాన్ని అంగీకరించాడు. అత్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన అల్లుడు వెంకటేష్‌.. ముందుగానే పోస్టాఫీసు ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ ఇన్సూరెన్స్‌, రైతు బీమా చేయించినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.

పౌల్ట్రీ ఫామ్‌ పెట్టి రూ.22 లక్షల వరకు నష్టపోయిన వెంకటేష్‌.. నష్టాల నుంచి బయటపడేందుకు అత్త హత్యకు ప్లాన్‌ చేశాడు. అత్త పేరుపై రూ.60 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ చేసిన అల్లుడు.. పొలం పని ఉందని చెప్పి..అత్తను తీసుకెళ్లాడు. దృశ్యం-2 సినిమా చూసి అత్తను హత్య చేయించాడు. కారుతో ఢీకొట్టి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement