breaking news
thukkapur
-
సిద్ధిపేటలో దారుణం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను చంపి..
సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ అల్లుడు.. తన అత్తనే చంపించేశాడు.. ఈ నెల జులై 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అల్లుడు వెంకటేష్.. రూ. లక్షా 50 వేలు సుపారీ ఇచ్చి.. కారుతో ఢీకొట్టించి అత్తను హత్య చేయించాడు. తోగుట మండలం తుక్కాపూర్ దర్గా వద్ద ఈ ఘటన జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారం అత్తను హత్య చేయించిన అల్లుడు గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయిందంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు.సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయగా అల్లుడి బాగోతం బయటపడింది. వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. హత్య చేసినట్టు అల్లుడు వెంకటేష్ తన నేరాన్ని అంగీకరించాడు. అత్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన అల్లుడు వెంకటేష్.. ముందుగానే పోస్టాఫీసు ఇన్సూరెన్స్, ఎస్బీఐ ఇన్సూరెన్స్, రైతు బీమా చేయించినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.పౌల్ట్రీ ఫామ్ పెట్టి రూ.22 లక్షల వరకు నష్టపోయిన వెంకటేష్.. నష్టాల నుంచి బయటపడేందుకు అత్త హత్యకు ప్లాన్ చేశాడు. అత్త పేరుపై రూ.60 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేసిన అల్లుడు.. పొలం పని ఉందని చెప్పి..అత్తను తీసుకెళ్లాడు. దృశ్యం-2 సినిమా చూసి అత్తను హత్య చేయించాడు. కారుతో ఢీకొట్టి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. -
మంచంపట్టిన తుక్కాపూర్
పలువురికి విషజ్వరాలు పారిశుద్ధ్య లోపమే కారణమంటున్న వైద్యులు కొల్చారం: కొల్చారం మండలం తుక్కాపూర్‌లో వారం రోజులుగా గ్రామస్తులు విషజ్వరాలతో బాధపడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్ గ్రామస్తులను పట్టిపీడిస్తున్నాయి. తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిపోవడంతో జ్వరాలు వ్యాపిస్తున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వైద్య సేవల కోసం మెదక్, జోగిపేట, తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారు. ఇప్పటి వరకు 25మంది విషజ్వరాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. అసలే కష్టాల్లో ఉన్న తమకు మాయరోగాలు ప్రాణాలమీదికి తెస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రంగంపేట వైద్యాధికారి మురళీధర్ మాట్లాడుతూ గ్రామంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన వైద్యసేవలందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుద్ధ్యలోపంవల్లే గ్రామంలో రోగాలు వస్తున్నాయని, కాచివడపోసిన నీటిని మాత్రమే తాగాలని ఆయన సూచించారు.