
కరీంనగర్: బతకడం కన్నా... చావడమే చాలా తక్కువ బాధ.. అంటూ వేములవాడకు చెందిన రోహిత్(24) రాసిన సూసైడ్‌నోట్ కంటతడి పెట్టిస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డకు చెందిన దీటి వేణుగోపాల్–రాణి దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు రోహిత్ శనివారం అర్ధరాత్రి దాటాక ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు చూడడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఇటీవల రోహిత్ బీటెక్ పూర్తి చేసి, ఇంటి వద్ద ఉంటున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రోహిత్ మరణం ఆ కుటుంబంలో విషాదం నింపింది. తండ్రి గోపాల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
సూసైడ్‌నోట్‌లో ఇలా..
నా జీవితంలో గొప్ప సూసైడ్ లేఖ రాయాలన్న కోరిక నెరవేరింది. బతకడం కన్నా చావడం తక్కువ బాధగా అనిపిస్తోంది. చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ఇది నా విధి కావచ్చు. ఇక జన్మలు వద్దు. నా శరీరాన్ని కాశీ ఘాటులో దహనం చేయండి. నా కోరికలు నెరవేరినవే.. కానీ కలలు కాదు. నా జీవితం తట్టుకోలేనిది అయిపోయింది. మానవ సంబంధాలు కొన్ని పవిత్రం, మరికొన్ని బాధతో నిండినవే. నేను ఇక జన్మించనక్కర్లేదు. అంటూ ఆ యువకుడు డాక్టర్ డి.ఆర్. అని తన సూసైడ్‌నోట్‌లో రాశాడు.