
పెను విషాదాన్ని మిగిల్చిన సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరణించిన వారి సంఖ్యను 45గా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ అడ్మిన్ భవన శిథిలాల ప్రక్రియ కొనసాగుతోంది. తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత రానుంది.
Updates: 42కు చేరిన మృతులు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- మృతుల్లో ఎక్కువ మంది తమిళనాడు, బిహార్, జార్ఖండ్ వాసులు
- మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు
- ఆసుపత్రుల్లో 35 మంది బాధితులకు చికిత్స
- 12 మంది పరిస్థితి విషమం, ఐసీయూలో చికిత్స
- పేలుడు ఘటనలో 27 మంది కార్మికులు గల్లంతు
- శిథిలాల కింద మృతదేహాల కోసం గాలిస్తున్న డీఆర్‌ఎఫ్ టీమ్
- సహాయక చర్యల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, రెవెన్యూ, హైడ్రా సిబ్బంది
- తమవాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాల ఆందోళన
బాధితులకు సీఎం పరామర్శ
సిగాచి ఫ్యాక్టరీ బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ
ధృవ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం
ఆరోగ్య స్థితిపై ఆరా
కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ
మార్చురీ వద్ద రోదనలతో పడిగాపులు
- పటాన్ చెరులో డిఎన్ఏ శాంపుల్స్ సేకరణ కోసం ప్రత్యేక చర్యలు
- గుర్తుపట్టేందుకు వీలులేని మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్ లు
- తమ వారిని గుర్తించలేని కుటుంబ సభ్యుల నుండి డీఎన్‌ఏ సేకరణ
- ఇప్పటివరకు 18 మంది డిఎన్ఏ శాంపుల్ సేకరణ మృతదేహాల
- డీఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తరువాతే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్న అధికారులు
- ఇవాళ 11 మంది డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్న అధికారులు
- తమవాళ్ల మృతదేహాల కోసం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోదనలతో కుటుంబ సభ్యుల పడిగాపులు
ఘటనపై NHRC కేసు నమోదు
పాశమైలారం ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల సంఘం కేసు నమోదు
ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది రామారావు
కేసు నమోదు చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం యాజమాన్యం నుంచి ఇప్పించాలని పిటిషన్
తాజా ప్రమాదం నేపథ్యంలో.. తెలంగాణలోని పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలని కోరిన పిటిషనర్
త్వరలో ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశాలు?
యాజమాన్యం ఎక్కడ?
24 గంటలు దాటినా యాజమాన్యం రాకపోవడం బాధాకరమన్న మంత్రి శ్రీధర్‌బాబు
ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్న శ్రీధర్‌బాబు
ప్రమాద ఘటనను కార్మిక, వైద్యశాఖ మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు: మంత్రి శ్రీధర్‌బాబు
- అంతకుముందు.. యాజమాన్యం ఎక్కడ? అని అధికారులను ఆరా తీసిన సీఎం రేవంత్
- బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి చెప్పారా? అని ప్రశ్న
- యాజమాన్యం రాకపోవడంపై సీఎం ఆగ్రహం
సిగాచి ఘటనపై సీఎం కీలక ఆదేశాలు
- సిగాచి పరిశ్రమను పరిశీలించిన సీఎం, మంత్రులు
- అనంతరం ప్రమాద స్థలిలోనే అధికారులతో సీఎం సమీక్ష
- ఫ్యాక్టరీ ప్రమాదంపై అధికారులను ఆరా తీసిన సీఎం రేవంత్
- సిగాచి పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులను ప్రశ్నించిన సీఎం రేవంత్
- పరిశ్రమను తనిఖీ చేశారా?.. తనిఖీల్లో ఏమైనా లోపాలను గుర్తించారా?
- పరిశ్రమ బోర్డు సభ్యులు ఎవరు? అంటూ ఫ్యాక్టరీస్ డైరెక్టర్‌ను అడిగిన సీఎం
- ఘటనపై కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్
- గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా?.. కారణాలు తెలుసుకోండి
- ఇప్పటికే తనిఖీలు చేసినవాళ్లతో కాకుండా.. కొత్త వాళ్లతో విచారణ జరిపించండి
- ఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపించి నివేదిక ఇవ్వండి
- ఇలాంటి ప్రమాదాలపై అధికారులు అలర్ట్‌గా ఉండాలి
- తక్షణ సాయం కింద.. మృతుల కుటుంబాలకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించాలని సీఎం ఆదేశం
పాశమైలారం ఘటనా స్థలిలో సీఎం రేవంత్
పాశమైలారం సిగచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
వెంట మంత్రులు పొంగులేటి, వివేక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి..
ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి
ప్రమాదం జరిగిన తీరును.. సహాయక చర్యలపై అధికారులను ఆరా తీస్తున్న సీఎం రేవంత్
పటాన్‌చెరు మార్చురీలో 37 మృతదేహాలు
11 మృతదేహాల గుర్తింపు పూర్తి
పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు
- డీఎన్‌ఏ టెస్ట్‌కు ఒకరోజు నుంచి రోజున్నర టైం పడుతుందంటున్న అధికారులు
సిగచి ప్రమాద స్థలికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సంగారెడ్డి పటాన్ చెరువు సిగచి కంపెనీ ప్రమాద స్థలానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మధ్యాహ్నం ప్రమాద స్థలిని పరిశీలించి.. బాధితులను పరామర్శించనున్న కిషన్‌రెడ్డి
కిషన్‌రెడ్డి వెంట బీజేపీ నూతన అధ్యక్షుడు రాంచందర్‌రావు కూడా
కొనసాగుతున్న మృతదేహాల గుర్తింపు
పాశమైలారం ఘటనలో కొనసాగుతున్న మృతదేహాల గుర్తింపు
డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపునకు ఏర్పాట్లు
ఘటనాస్థలానికి వచ్చిన డీఎన్‌ఏ పరీక్షలు చేసే బృందాలు
ఇప్పటిదాకా కేవలం 6 మృతదేహాలకు మాత్రమే గుర్తింపు
పటాన్‌చెరు బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి
కాసేపట్లో పటాన్‌చెరు పాశమైలారం పారిశ్రామికవాడకు సీఎం రేవంత్ రెడ్డి
ఫ్యాక్టరీ ప్రమాద బాధితులకు ఆస్పత్రిలో పరామర్శ
పాశమైలారం ప్రమాద స్థలిని పరిశీలించనున్న సీఎం
సీఎం వెంట మంత్రులు కూడా
సిగచి ఆవరణలో పోలీసు ఆంక్షలు
- సిగచి ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి
- అంతకంటే ముందు.. ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శ
- సీఎం రాక నేపథ్యంలో సిగచి కంపెనీ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు
- సిగచి కంపనీ వైపు ఎవరిని అనుమతించని పోలీసులు
- నిన్న ప్రమాదం తర్వాత బాధిత కుటుంబాలతో పోలీసులకు వాగ్వాదం
- తమ వారి గురించి సరైన సమాచారం లేదని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
- తోసేసిన పోలీసులు.. ఫ్యాక్టరీ వద్ద కాసేపు ఉద్రిక్తత
42కు చేరుకున్న మృతుల సంఖ్య
- శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగింపు..
- మరో రెండు గంటల పాటు శిధిలాల తొలగించే ప్రక్రియ కొనసాగే అవకాశం..
- కుప్పకూలిన సిగచి ప్రొడక్షన్ బిల్డింగ్
- చనిపోయిన వారిలో ఎక్కువ మంది తమిళనాడు బీహార్ జార్ఖండ్ కు చెందిన వారే..
- వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 34 మంది క్షతగాత్రులు
- మూడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
శిథిలాల కింద మరో 20 మంది
42కి చేరిన మృతుల సంఖ్య
శిథిలాల కిందే మరో 20 మంది?
మృతుల సంఖ్య 55కి చేరే అవకాశం
కొనసాగుతున్న శిథిలాల తొలగింపు
ధ్వంసమైన ప్లాంట్‌ను పక్కకు తొలగించిన సహాయక బృందాలు
గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు
మృతుల్లో తమిళనాడు, యూపీ వాసులేక్కువ
డీఎన్‌ఏ పరీక్షల అనంతరమే కుటుంబ సభ్యులకు అప్పగించే ఛాన్స్
ఇప్పటివరకు గుర్తు పట్టినవి ఆరు మృతదేహాలు మాత్రమే
అంతకు ముందు.. ఈ ఉదయం ప్రమాదంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారిక ప్రకటన చేశారు. ఘటన వివరాలతో పాటు సహాయక చర్యలు ఇతరత్రా వివరాలను వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం..

ప్రమాదంలో 47 మంది గల్లంతు అయ్యారు
ఇప్పటివరకు 26 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. అందులో నాలుగు మృతదేహాలను మాత్రమే గుర్తించాం.
ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరికొందరు మృతి
గుర్తుపట్టలేని స్థితిలో 20 మృతదేహాలు ఉన్నాయి
మరో 27 మంది జాడ తెలియాల్సి ఉంది
ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో 35 మందికి చికిత్స అందుతోంది.. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది
57 మంది సరక్షితంగా ఇంటికి వెళ్లారు
ప్రమాద సమయంలో మూడు అంతస్తుల భవనం కూలిపోయింది
శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉన్నారు.. వారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి
సహాయక చర్యల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, రెవెన్యూ, హైడ్రా సిబ్బంది పాల్గొంటున్నారు
ఇదీ చదవండి: పరిశ్రమల్లో ప్రాణాలు.. గాలిలో దీపాలు
సంగారెడ్డి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం
సిగాచీ పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం
తక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు 08455–276155 నంబర్‌ను సంప్రదించవచ్చన్న కలెక్టర్ ప్రావీణ్య
బ్లోయర్ పేలి.. రియాక్టర్‌కు అంటుకుని..
- మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్ మైక్రోస్టెల్లయిన్ సెల్యులర్ పౌడర్ ఉత్పత్తి
- ప్రాథమికం సమాచారం ప్రకారం.. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు.
- అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్ బ్లోయర్ పేలింది.
- ఎగసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్‌కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది.
- భూమి కంపించినట్టు అయ్యిందన్న ప్రత్యక్ష సాక్షులు
- పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్న కొందరు కార్మికులు
- అయితే ఎయిర్ ఫైర్ సిస్టమ్‌లో ప్రెషర్ వల్లే సిగాచీ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు.
- ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారని తెలిపారు.
మృతుల్లో యాజమాన్య ప్రతినిధి?
- మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బిహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
- మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి.
- ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి.
అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్
- సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
- హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
- భారీ కట్టర్లు, క్రేన్‌లు, హిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు.
- సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరా యం కలిగించింది.
- అయితే రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది.
- మంగళవారం కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగనున్నాయి.
మిన్నంటిన రోదనలు.. ఆందోళన
- కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు.
- విధులకు హాజరై ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
- తమ వారి ఆచూకీ అధికారులను ఆరా తీశారు.
- సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు.
- పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.
ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడు
- సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ కంపెనీలో రియాక్టర్ పేలడంతో ప్రమాదం
- చెల్లాచెదురుగా ఎగిరిపడిన కార్మికులు, ఛిద్రమైన శరీరాలు
- అగ్నికీలల్లో పలువురి సజీవదహనం..
- కార్మికులు, ఉద్యోగులు దుర్మరణం!
- సమీప ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు
- మృతుల్లో ఎక్కువమంది ఒడిశా, బిహార్, యూపీ వారే..
- ప్రధాని మోదీ, సీఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపం
- 36 మందికి కాలిన గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
- కుప్పకూలిన భవనాలు.. శిథిలాల కింద మరికొందరు..
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్... ఘటనా స్థలాన్ని,ఆస్పత్రులను సందర్శించిన మంత్రులు..
- నేడు ఘటనా స్థలానికి సీఎం రేవంత్
- ఆస్పత్రిలో బాధితులకు సీఎం పరామర్శ