
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని లజ్‌పత్ నగర్-Iలో ఘోరం చోటుచేసుకుంది. ఎంతో నమ్మకంతో ఇంటి పనిలో పెట్టుకున్న సహాయకుడే యజమానురాలితో పాటు, ఆమె కుమారుని గొంతు కోశాడు. యజమానురాలు తిట్టిందని, ఆగ్రహంచిన ఆ సహాయకుడు ఇంతటి దారుణానికి తెగించాడు.
లజ్‌పత్ నగర్‌లో బుధవారం రాత్రి ఒక మహిళ, ఆమె కుమారుడు వారి ఇంటి లోపల హత్యకు గురయ్యారనే వివరాలు తెలియగానే, రంగంలోకి దిగిన పోలీసులు వారి ఇంటి నుంచి పరారైన సహాయకుడు ముఖేష్(24)ను అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా, నేరాన్ని అంగీకరించడంతోపాటు ఘటనాక్రమాన్ని పోలీసులకు వివరించాడు. తన యజమాని రుచికా సేవ, ఆమె కుమారుడు క్రిష్‌ల గొంతులను కోసినట్లు నిందితుడు ముఖేష్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
#WATCH | Delhi's Double murder case | The bodies of a woman, Ruchika (42) and her son, Krish (14) were found at their residence in the Lajpat Nagar-1 area. The suspect house help has been apprehended. Further investigation underway: Delhi Police
(Visuals from the spot) pic.twitter.com/bI338FWx1N— ANI (@ANI) July 3, 2025
రుచిక భర్త కుల్దీప్ రాత్రి 9:30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. ఆయనకు మెట్లపై రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్న తలుపును బలవంతంగా తెరిచారు. అక్కడ వారు రుచిక మృతదేహాన్ని బెడ్‌రూమ్‌లో, క్రిష్ మృతదేహాన్ని బాత్రూంలో గుర్తించారు. ఇద్దరికీ మెడపై కత్తితో చేసిన గాయాలన్నాయి. ఈ ఘటనకు వారింటిలో పనిచేసే ముఖేష్ కారణమని భావించిన పోలీసులు అతనిని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో ముఖేష్ తనను యజమానురాలు రుచిక తిట్టిందునే ఈ దారుణానికి పాల్పడ్డానని తెలిపాడు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా?