
కేసు వెనక్కి తీసుకోవాలంటూ మాజీ భార్యకు బెదిరింపులు
బాధితురాలి ఫిర్యాదు, మాజీ భర్తపై కేసు నమోదు
హైదరాబాద్: న్యూడ్ కాల్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను చూపి మాజీ భార్యను వేధిస్తున్న వ్యక్తితో పాటు మరో మహిళపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బేగంపేట రసూల్‌పురాకు చెందిన మహిళ (39)కు సయ్యద్ జావేద్ (44)తో 2005లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. జావేద్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో బాధితురాలు అతనితో విడాకులు తీసుకుని వేరుగా నివాసం ఉంటుంది.
అతడిపై ఆమె పెట్టిన కేసు విచారణలో ఉంది. ఇదిలా ఉండగా గత నెల 26న సయ్యద్ జావేద్ బాధితురాలికి ఫోన్ చేసి ఆమెతో కలిసి ఉంటానని చెప్పాడు. తరచూ ఆమెతో మాట్లాడేవాడు. బాధితురాలు కూడా జావేద్‌ను నమ్మి అతనితో మాట్లాడుతుండేది. ఈ క్రమంలో ఆమెతో బలవంతంగా న్యూడ్‌కాల్స్ మాట్లాడించిన అతను కాల్స్‌కు సంబంధించి స్క్రీన్‌షాట్లను సేవ్ చేసి బాధితురాలి ఇంటి సమీపంలో ఉంటున్న ఓ యువకుడికి పంపాడు.
అతను ఈ విషయం బాధితురాలి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె భర్త ఉంటున్న ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న షాబానా అనే మహిళను నిలదీసింది. దీంతో జావేద్‌పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో స్క్రీన్‌షాట్లను అందరికీ పంపతామని బెదిరించారు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సయ్యద్ జావేద్‌తో పాటు షబానాపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.