
ఓఆర్‌ఆర్ ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీ కొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. నలుగురు ప్రమాద స్థలంలోనే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
పెద్దఅంబర్‌పేట నుంచి బొంగ్లూరు వెళ్తుండగా ఆదిభట్ల ఓఆర్‌ఆర్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతోనే ఘోరం చోటు చేసుకుంది. ఘటన తర్వాత సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. కారు నుంచి మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే మృతుల వివరాలు, ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
