న్యూస్ యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య | Telugu Journalists shocked with news Anchor Swetcha Votarkar Sudden Demise | Sakshi
Sakshi News home page

న్యూస్ యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య

Jun 28 2025 3:48 AM | Updated on Jun 28 2025 3:48 PM

Telugu Journalists shocked with news Anchor Swetcha Votarkar Sudden Demise

తెలుగు న్యూస్‌ ఛానల్‌ యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య

తెలుగు జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. న్యూస్ రీడర్,  యాంకర్‌ స్వేచ్ఛ వోటార్కర్‌(Swetcha Votarkar)(40) శుక్రవారం బలవర్మణానికి పాల్పడ్డారు. చిక్కడపల్లి ఠాణా పరిధి జవహర్‌నగర్‌లోని ఆమె నివాసంలో రాత్రి 10.30 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ రాజు నాయక్‌ వివరాల ప్రకారం...
ఫ్యానుకు చున్నీతో ఉరేసుకొని తనువు చాలించింది. ఐదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమె.. కూతురు, మరో స్నేహితుడితో కలిసి ఉంటున్నారని సమాచారం. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాంనగర్‌లో ఉంటున్నారు. తండ్రి శంకర్‌ ఉమ్మడి ఏపీలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయగా.. తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ రీడర్, ప్రేసెంటెర్, యాంకర్ గా  పలు న్యూస్ చానెల్స్ లో పని చేశారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గాను ఈమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్‌గా ఎన్నికయ్యారు కూడా.చిన్న వయసులో యాంకర్ స్వేచ్ఛ..  అదీ బలవన్మరణానని పాల్పడటం పట్ల పలువురు జర్నలిస్టులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement