breaking news
Swetcha Votarkar
-
నా భర్త నిర్దోషి.. పూర్ణ భార్య సంచలన వీడియో
-
పూర్ణ భార్య సంచలన వీడియో విడుదల
-
మరో మలుపు తిరిగిన యాంకర్ స్వేచ్ఛ కేసు
తెలుగు యాంకర్ స్వేచ్ఛ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. మృతురాలిపై సంచలన ఆరోపణలు చేసిన ఆమె.. ఇటు తన భర్త అమాయకుడంటూ చెబుతోంది. హైదరాబాద్, సాక్షి: న్యూస్ రీడర్ స్వేచ్ఛా వొటార్కర్(Swetcha Votarkar Case) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. స్వేచ్ఛపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఇటు తన భర్త ఎలాంటి తప్పు చేయలేదంటూ సాక్షికి తెలిపింది. పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ నాకు పరిచయమైంది. వారిద్దరి మధ్య సంబంధం మొదట్లో నాకు తెలియదు. అది తెలిశాకే పూర్ణను వదిలేశాను. స్వేచ్ఛ నన్ను మానసికంగా వేధించింది. నా పిల్లలను కూడా ‘అమ్మా’ అని పిలవాలని భయపెట్టింది. నా భర్త పూర్ణ నిర్దోషి, అమాయకుడు. .. పూర్ణచందర్‌పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యం. అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నాడు. పూర్ణనే స్వేచ్ఛ బ్లాక్మెయిల్ చేసింది అని స్వప్న మీడియాకు తెలిపింది. ఇదిలా ఉంటే.. పలు టీవీ ఛానెల్స్‌లో న్యూస్‌రీడర్, యాంకర్‌గా పని చేసిన స్వేచ్ఛ(40) శుక్రవారం రాత్రి తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఈ కేసులో అనుమానాలు ఉన్నాయని చెబుతూ.. స్వేచ్ఛ సహజీవనం చేసిన పూర్ణచందర్‌పై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పూర్ణచందర్.. చివరకు పోలీసులకు లొంగిపోయాడు. ఇదిలా ఉండగానే.. స్వేచ్ఛ కూతురు అరణ్య తనను పూర్ణ వేధించేవాడంటూ మీడియాకు చెప్పడం సంచలనంగా మారింది. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో.. ఇప్పుడు పూర్ణ భార్య మీడియా ముందుకు రావడం గమనార్హం.యాంకర్ స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మానసిక వేదన వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న ఆయన.. కేసు నుంచి రక్షించుకోవడానికే పూర్ణ చందర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పూర్ణ మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు.. పాప పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవం అని అన్నారాయన. లొంగిపోయే ముందు పూర్ణ చందర్ మీడియాకు విడుదల చేసిన ఐదు పేజీల లేఖలో ఏం ఉందంటే.. నాకు స్వేచ్ఛ 2009 నుంచే తెలుసు. ఆ సమయంలో ఇద్దరం కలిసి ఓ ఛానెల్లో పని చేశాం. అప్పట్లో స్వేచ్ఛ తన వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను నాతో పంచుకుంటూ ఉండేది. కానీ నిజమైన సాన్నిహిత్యం మాత్రం 2020 తర్వాత మొదలైంది. స్వేచ్ఛ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవ్వడానికి ప్రధాన కారణం ఆమె తల్లిదండ్రుల తీరే. చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఆమెను వదిలేసి ఉద్యమాల్లో భాగమయ్యారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కలిసేవారు. ఈ విషయాన్ని ఆమె ఎన్నోసార్లు నాతో పంచుకుంది. కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే ఆమెని మనోవేదనకు గురి చేశాయి. 2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి హైదరాబాద్‌లోని కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇక 2022లో తన కూతురు అరణ్యని కూడా నా వద్దకు తీసుకువచ్చింది. కుమార్తె భవిష్యత్తు పట్ల చాలా ఆందోళనగా ఉండేది. తన కూతురికి తనలాంటి జీవితాన్ని అందించకూడదని చెప్పేది. అందుకే ఆమె అన్ని బాధ్యతలు నాకు అప్పగించింది. తాను ఒక తండ్రి లా ఆ పిల్ల బాధ్యతలు చూసుకున్నాను. స్వేచ్ఛ జీవితంలో ఎప్పుడూ పూర్తిగా సంతోషంగా లేదు. తన బాధను మర్చిపోవడానికి కుమార్తెతో ఎక్కువ సమయం గడిపి ఓదార్పు పొందేది అని పూర్ణ చందర్ పేర్కొన్నాడు. -
swetcha votarkar: యాంకర్ స్వేచ్ఛ కుమార్తె సంచలన ఆరోపణలు
సాక్షి,హైదరాబాద్: తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar) ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వేచ్ఛ కుమార్తె పూర్ణచంద్ర నాయక్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తన తల్లి మరణానికి పూర్ణ చంద్రనాయక్ కారణమంటూ స్వేచ్ఛ కుమార్తె ఆరోపించింది. ‘పూర్ణచంద్ర నాయక్ ఎప్పుడూ నన్ను విసిగించేవాడు. అమ్మని, నన్ను ఎప్పుడూ కలవనిచ్చేవాడు కాదు. మా అమ్మ మరణానికి పూర్ణచంద్ర నాయక్ కారణం. ఆయన లేఖలో రాసినవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించింది. తన తల్లి మరణానికి పూర్ణచంద్ర నాయక్ కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వేచ్ఛ కూతురు ఫిర్యాదుతో అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో పూర్ణచంద్ర నాయక్‌ను చిక్కడ పల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు. మీడియాతో పూర్ణ చంద్ర నాయక్ అడ్వకేట్ శ్రవణ్మరోవైపు పూర్ణ చంద్ర నాయక్ అడ్వకేట్ శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. పూర్ణచంద్ర నాయక్‌ను కలిసేందుకు వచ్చాను. పోలీసులు అనుమతించలేదు. ఎఫ్ఐఆర్ కాపీ అందితే బెయిల్ పిటిషన్ వేస్తాం. మరికొద్ది సేపట్లో పూర్ణచంద్ర నాయక్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఫోక్సో కేసు నమోదు అయినట్లు నా దృష్టికి రాలేదు. స్వేచ్ఛ పేరెంట్స్ ఆరోపించిన దాని ప్రకారంగా ఈ కేసులో హత్య కోణం ఏం లేదు. పూర్ణ చంద్ర నాయక్ పై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో తెలియదు’అని వ్యాఖ్యానించారు. -
యాంకర్ స్వేచ్ఛ ఎలా చనిపోయింది.. వాచ్ మెన్ చెప్పిన సంచలన విషయాలు
-
యాంకర్ స్వేచ్ఛ కేసులో ట్విస్ట్
తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar) ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. సాక్షి, హైదరాబాద్: పలు టీవీ ఛానెల్స్‌లో పని చేసిన స్వేచ్ఛకు.. గతంలోనే వివాహమైంది. ఓ కూతురు కూడా ఉంది. మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయాక పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో ఆమె కలిసి ఉంటోంది. ఆమె ఫేస్బుక్ పేజీ పేరు సైతం స్వేచ్ఛా పూర్ణ చందర్‌గా మార్చుకుంది. అయితే కొన్నాళ్లుగా వీళ్ల మధ్యా విభేదాలు నడుస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివాహం చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయగా.. అందుకు పూర్ణ చంద్రరావు నిరాకరించాడు. దీంతో అతనితో ఇక కలిసి ఉండలేనంటూ ఆమె తల్లిదండ్రుల వద్ద వాపోయింది. ఈ విషయంలోనే ఆమె మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాతి నుంచి పూర్ణచంద్రరావు ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. అజ్ఞాతంలో ఉన్న అతని ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యాంకర్‌గా, న్యూస్ప్రజెంటర్గా పలు చానెల్స్‌లో పని చేసిన స్వేచ్ఛ.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గానూ గుర్తింపు దక్కించుకున్నారు. శుక్రవారం గాంధీనగర్ జవహర్ నగర్ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తొలుత పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహానికి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె నేత్రాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య
తెలుగు జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar)(40) శుక్రవారం బలవర్మణానికి పాల్పడ్డారు. చిక్కడపల్లి ఠాణా పరిధి జవహర్‌నగర్‌లోని ఆమె నివాసంలో రాత్రి 10.30 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ వివరాల ప్రకారం...ఫ్యానుకు చున్నీతో ఉరేసుకొని తనువు చాలించింది. ఐదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమె.. కూతురు, మరో స్నేహితుడితో కలిసి ఉంటున్నారని సమాచారం. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాంనగర్లో ఉంటున్నారు. తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయగా.. తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.న్యూస్ రీడర్, ప్రేసెంటెర్, యాంకర్ గా పలు న్యూస్ చానెల్స్ లో పని చేశారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గాను ఈమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్‌గా ఎన్నికయ్యారు కూడా.చిన్న వయసులో యాంకర్ స్వేచ్ఛ.. అదీ బలవన్మరణానని పాల్పడటం పట్ల పలువురు జర్నలిస్టులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.