
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పటాకుల తయారీ ప్రముఖ కేంద్రం శివకాశిలోని ఓ గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.
పేలుడు ధాటికి సత్తూరులోని బాణసంచా యూనిట్‌పై దట్టమైన పొగ అములుకుంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని బాణాసంచా గోడౌన్ నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. తరచూ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.
#JUSTIN சிவகாசி அருகே சின்ன காமன்பட்டி கோகுலேஸ் பட்டாசு ஆலையில் பயங்கர வெடி விபத்து #Sivakasi #FireAccident #News18Tamilnadu | https://t.co/3v5L32pLWJ pic.twitter.com/5g7GYG6V6d
— News18 Tamil Nadu (@News18TamilNadu) July 1, 2025
VIDEO Credits: News18 Tamil Nadu