క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Mar 10 2026 7:35 AM | Updated on Mar 10 2026 7:35 AM

గుడిసె దగ్ధం: బాలుడి మృతి

తిరువళ్లూరు: మీంజూరు సమీపంలో షార్ట్‌ సర్యూట్‌తో గుడిసె దగ్ధమైంది. పదవ తరగతి విద్యార్థి మృతిచెందిన సంఘటన విషాధాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా మీంజూరు సమీపంలోని కారణంబేడు గ్రామానికి చెందిన మునస్వామి. ఇతను స్థానికంగా గుడిసెలో నివాసం వుంటున్నాడు. ఇతనికి భార్యతో పాటు శ్రీనివాసన్‌(15) అనే కుమారుడు వున్నాడు. ఇతను తిరువాయల్‌ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. ఈక్రమంలో ఆదివారం రాత్రి మునస్వామి తన బందువుల ఇంటికి వెళ్లాడు. శ్రీనివాసన్‌ అమ్మమ్మ శకుంతలతో కలసి ఇంట్లో వున్నాడు. శకుంతల ఉదయం వంట పాత్రలను కడగడానికి బయటకు వచ్చింది. అదే సమయంలో హఠాత్తుగా గుడిసె నుంచి మంటలు చెలరేగి క్షణాల్లో వ్యాపించింది. మంటలు ఎగిసి పడడంతో ప్రమాదంలో గుడిసెలో చిక్కుకుని శ్రీనివాసన్‌ మృతిచెందాడు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయినా అప్పటికే గుడిసె పూర్తిగా దగ్ధమైంది. పోలీసుల విచారణలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు.

ఆటోడ్రైవర్‌ దారుణ హత్య

–ఇద్దరి అరెస్ట్‌

అన్నానగర్‌: ఆటోడ్రైవర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. శివగంగై జిల్లా మనమదురై సమీపంలోని ఇడక్కత్తూర్‌ ప్రాంతానికి చెందిన వేలుసామి కుమారుడు మునీశ్వరన్‌ (36) ఆటోడ్రైవర్‌. ఇతని స్నేహితులు సతీష్‌కుమార్‌ (38), కార్తికేయన్‌ (35). ఆదివారం రాత్రి ఈ ముగ్గురూ సతీష్‌కుమార్‌ ఇంటి మిద్దైపె మద్యం తాగుతున్నారు. అప్పుడు సతీష్‌కుమార్‌ భార్య గురించి మునీశ్వరన్‌ చెడుగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహించిన సతీష్‌కుమార్‌, కార్తికేయన్‌ మద్యం బాటిళ్లను పగులగొట్టి మునీశ్వరన్‌ గొంతు కోశారు. ఈఘటనలో మునీశ్వరన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మనమదురై పోలీసులు కార్తికేయన్‌, సతీష్‌కుమార్‌లను అరెస్టు చేశారు.

భర్త హత్య

–భార్యపై లైంగికదాడికి యత్నం

తిరువొత్తియూరు: ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని యువకుడు భర్తను హత్య చేసి, అతని భార్యపై లైంగికదాడికి ప్రయత్నించిన సంఘటన సంచలనం కలిగించింది. కృష్ణగిరి జిల్లా ఊతంగరై సమీపంలోని ఓబక వలస గ్రామానికి చెందిన కన్నప్పన్‌ (70). ఈయన భార్యతో కలసి వ్యవ సాయ తోటలో వున్న ఇంట్లో ఉంటున్నారు. ఆది వారం రాత్రి ఎప్పటిలాగే కన్నప్పన్‌ ఇంటి బయట నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన 25 ఏళ్ల యువకుడు బయట నిద్రిస్తున్న కన్నప్పన్‌ను కరత్రో తలపై బలంగా కొట్టాడు. కన్నప్పన్‌ కేకలు విని భార్య బయటకు వచ్చింది. బయటకు వచ్చిన ఆమెను ఇంట్లోకి లాక్కెళ్లి లైంగికదాడికి యత్నించినట్లు తెలిసింది. కన్నప్పన్‌, అతని భార్య కేకలు విని చుట్టుపక్కల వారు రావడం గమనించి ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన కన్నప్పన్‌న్‌ను ఊతంగరై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నదిలో యువకుడు గల్లంతు

తిరువొత్తియూరు: చైన్నె, అడయార్‌ తిరువిక ఫ్లైఓవర్‌ పైనుంచి ఆదివారం ఓ యువకుడు నదిలోకి దూకి గల్లంతయ్యాడు. అటుగా వెళ్తున్న వారు ఇది చూసి వెంటనే పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. అడయార్‌ పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వారు అక్కడికి వెళ్లి ఫైబర్‌ బోటు సాయంతో నదిలో యువకుడి కోసం గాలిస్తున్నారు. యువకుడి వివరాలు తెలియరాలేదు.

బాలికపై దాడి

–ఇన్‌స్టాగ్రామ్‌ సెలబ్రిటీ అరెస్ట్‌

అన్నానగర్‌: బాలికపై దాడికి పాల్పడిన ఇన్‌స్టాగ్రామ్‌ సెలబ్రిటీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. చైన్నెలోని కాసిమేడు సింగరవేలన్‌నగర్‌కు చెందిన కవిన్‌ (25). కాసిమేడు మీనవన్‌ అనే తన వీడియోతో ఇన్‌స్టాగ్రామ్‌లో అతను సెలబ్రిటీ అయ్యాడు. ఇతను ఆదివారం రాత్రి బైక్‌లో ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో రోడ్డుపై నిలబడి ఉన్న 15 ఏళ్ల బాలికను అతని బైక్‌ ఢీకొంది. ఆగ్రహించిన బాలిక అతనితో వాగ్వాదానికి దిగింది. ఆగ్రహించిన బాలిక కడుపులో తన్నాడు. అడ్డుకున్న బాలిక తండ్రిపై దాడి చేశాడు. దీంతో బాలిక కుటుంసభ్యులు, బంధువులు, కవిన్‌పై దాడి చేశారు. సమాచారం అందుకున్న కాసిమేడు పోలీసులు కవిన్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. కవిన్‌పై దాడి చేసినందుకు అమ్మాయి తండ్రిపై కేసు నమోదు చేశారు.

వైభవంగా స్తంభ ప్రతిష్ఠ

కొరుక్కుపేట: చైన్నెలోని శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాల సందర్బంగా ఆలయం వద్ద స్తంభ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకుల బృందం స్తంబ ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త కొల్లా వేంకట చంద్రశేఖర్‌, పాలకమండలి సభ్యులు దేసు లక్ష్మీనారాయణ, ఎస్‌ఎల్‌ సుదర్శనం, సీఆర్‌ కిషోర్‌బాబు, సెక్రటరీ కిషోర్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement