కొరుక్కుపేట: లయన్స్ క్లబ్ ఆఫ్ చైన్నె సన్ రైజర్స్ ఆధ్వర్యంలో చైన్నెలోని ఐసీడబ్ల్యూఓకి కిరాణా సామగ్రిని వితరణగా అందజేసింది. అధ్యక్షుడు లయన్ దామోదరన్, కార్యదర్శి లయన్ రాజేష్, కోశాధికారి లయన్ రామమూర్తి, మాజీ అధ్యక్షుడు జయచంద్రన్ నేతత్వంలో జరిగిన కార్యక్రమంలో కిరాణా సామగ్రిని ఐసి డబ్ల్యూ ఓ కార్యదర్శి ఏ జె హరిహరన్‌కు అందజేశారు. ఈక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చైన్నె సన్‌రైజర్స్ ఐసీడబ్ల్యూ ఓ నిర్వహణలో ఉన్న చైన్నె వేపేరి పెరియమెట్లో ఉన్న వృద్ధ మహిళల ఆశ్రమానికి కిరాణా సామాగ్రి, మ్యాట్స్ టాయిలెట్రీలను వితరణగా అందజేశామని తెలిపారు.


