
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో కన్న తండ్రి దీపక్ యాదవ్ చేతిలో దారుణ హత్యకు గురైన టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూతుర్ని ఆంక్షల నడుమ బంధించడానికి యత్నించే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
రాధికా యాదవ్ టెన్నిస్ కోచ్‌లలో ఒకరైన అజయ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లోని కొన్ని పరిమితులు, ఆంక్షలతో రాధికా యాదవ్ సతమతమైనట్లు వెల్లడించారు. తనకు వాట్సాప్ చాట్ టెక్ట్స్ మెసేజ్‌లు, వాయిస్ చాట్‌లలో ఆమె చెప్పిన కొన్ని విషయాలను అజయ్ యాదవ్ ఎన్డీటీవీకి స్పష్టం చేశారు.
ఆంక్షలు భరించలేకపోతున్నా.. !
తాను ఇంట్లో ఆంక్షలను భరించలేకపోతున్నానని, ప్రతీ దానికి వివరణ ఇచ్చు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాధికా తనతో వాట్పాప్ చాట్‌లో తెలిపిందన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది అక్డోబర్, నవంబర్, డిసెంబర్‌లలో ఇంటికి దూరంగా వెళ్లిపోవాలనుకుందని, అందుకోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుందన్నారు.
తాను తొలుత చైనా వెళ్లాలని అనుకున్నప్పటికీ, అక్కడ ఫుడ్ తనకు సరిపడదనే విషయంతో ఆగిపోయిందన్నారు. దుబాయ్, ఆస్ట్రేలియాకు వెళ్లి ఒక నాలుగు నెలల పాటు ఒంటిరిగా ఉండాలని, లైఫ్‌ను ఎంజాయన్ చేయాలని ఆమె పేర్కొన్నట్లు అజయ్ స్పష్టం చేశారు. తనకు ఏవో కొన్ని లక్ష్యాలున్నాయని, దాని కోసం తండ్రి దీపక్ యాదవ్‌కు చెబితే కనీసం వినడం కూడా చేయడం లేదని ఆమె మెసేజ్‌లో వాపోయింది.
ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు..!
మరో కోచ్ అంకిత్ పటేల్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. అసలు అండ్రీ-కూతుళ్ల మధ్య ఇంతటి వివాదం దాగి ఉందనే విషయం ఎప్పుడూ తమకు తెలియదన్నారు. ‘ నాకు రాధికా యాదవ్ 11-12 ఏళ్ల నుంచే తెలుసు. అలాగే ఆమె తండ్రి కూడా బాగా తెలుసు. ఆమె టెన్నిస్ ప్రాక్టీస్‌కు సంబంధించి తండ్రీ-కూతుళ్ల మధ్య ఎటువంటి విభేదాలు లేవు. తండ్రి ఎప్పుడూ ఆమె సపోర్ట్‌గా నిలిచేవారు.
ఆమె ఎక్కడ టెన్నిస్ మ్యాచ్ ఆడటానికి వెళ్లినా వెంటే ఉండి అన్నీ చూసుకునే వారు. రాదికా ఎప్పుడూ ఒంటిరగా ఉండటాన్ని కానీ వేరే వాళ్లతో ఉండటం కానీ నేను చూడలేదు. టెన్నిస్ ఆటకు సంబంధించి వీరి మధ్య గొడవలున్నాయనేది వాస్తవం కాదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరి తెలుసు’ అని సదరు కోచ్ అంకిత్ పటేల్ తెలిపారు.
ఇదీ చదవండి: