Hyderabad
-
‘బడేభాయ్ చెప్పినట్టు రేవంత్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది’
సాక్షి,సిద్ధిపేట: ఉచిత విద్యుత్ కరెంట్ విషయంలో బడేభాయ్ చెప్పినట్టు సీఎం రేవంత్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. డిస్కంల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నది వేరు.. వాస్తవం వేరని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం (మే29) సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. 24గంటల విద్యుత్ ఇవ్వడం కోసమే రైతు డిస్కం ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే? రైతు డిస్కంతో 24 గంటల ఉచిత విద్యుత్ రానే రాదు. రైతు డిస్కం రైతులకు ఉరి తాడుగా మారబోతుంది.లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల పాలిట రైతు డిస్కం శాపంగా మారుతుంది. మేం పద్దతిగా ఆధారాలతో మాట్లాడుతాం. రేవంత్ రెడ్డిలా బట్ట కాల్చి మీద వేయం.ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో కనీసం ఏడు గంటల కరెంట్ కూడా రాదు. 13గంటలకు మించి రైతులకు కరెంట్ రావడం లేదు. రైతులకు మూడు గంటలు కరెంట్ చాలు అని కోదండరెడ్డి మాట్లాడుతున్నారు.గుజరాత్లో రైతులకు ఏడుగంటలే కరెంట్ ఇస్తున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే ఓట్లు అడుగుతానని రేవంత్ చెప్పాలి. రేవంత్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్‌కు మంగళం పాడింది. టీజీఆర్పీడీసీఎల్ థర్మల్ పవర్ ఇవ్వరట.. సోలార్ పవర్ మాత్రమే ఇస్తారట. బడేభాయ్ చెప్పినట్టు రేవంత్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వరద వచ్చినప్పుడే ప్రాజెక్టులు నింపుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. -
‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. క్లాసిక్ గార్డెన్లో బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 25 నుండి సర్ ప్రారంభమవుతుందని.. సర్’పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.‘‘కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలకు వారానికి మూడు రోజులు పవర్ హాలిడే ఉండేది. 65 సంవత్సరాలలో కాంగ్రెస్ చేయని పని ఆరు నెలల్లో కేసీఆర్ చేసి చూపించారు. 24 గంటల పాటు రైతులకు, పరిశ్రమలకు కేసీఆర్ నాణ్యమైన కరెంటు ఇచ్చారు’’ అని కేటీఆర్ గుర్తు చేశారు.‘‘వ్యవసాయానికి రోజుకు మూడు గంటల కరెంటు ఇస్తే చాలు అన్నా రేవంత్ రెడ్డి.. ఇప్పుడేమో రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. 35 వేల ఓటర్లు డిఫెన్స్ ల్యాండ్‌లో ఇల్లు కట్టుకున్నారు. వారి ఓటు హక్కు ఉండాలంటే సర్‌లో నమోదు చేసుకోవాలి. హైదరాబాద్‌లో మొత్తం బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించారు. గ్రామాల్లో రేవంత్ 420 మోసపూరిత హామీలను నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు. దేశం మొత్తం కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటే మనం నెత్తి మీద పెట్టుకున్నాం...సుమారు 2 లక్షల పట్టాలు కేసీఆర్ ఇచ్చారు.. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇండ్ల పట్టాలు అయినా రేవంత్ ఇచ్చారా?. స్కూటీ లేదు లూటీ మాత్రం నడుస్తుంది. రైతుబంధు లేదు రాహుల్ బంధు నడుస్తుంది. రైతులకు యూరియా ఇచ్చే దిక్కు లేదు. ధాన్యం కొనే దిక్కు లేదు కానీ.. రైతులకు రైతు డిస్కం తెస్తారంటా?. రైతులకు ఊరి వేయడానికే రైతు డిస్కం తెస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో 95 లక్షల ఓట్లు సర్ పేరుతో తీసేశారు.. కోర్టుకు వెళ్లారు.. కోర్టులో ఉండగానే ఎన్నికలు జరిగాయి బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించారు. అందరూ సర్‌లో పాల్గొని.. మన ఓట్లు తొలగించకుండా మనం అప్రమత్తంగా ఉండాలి’’ అని కేటీఆర్ సూచించారు -
బొల్లారంలో దారుణం.. బైక్‌పై వెళ్తున్న దంపతులపై దాడి
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలో దారుణం జరిగింది. బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో దుండగులను భర్త అడ్డుకున్నారు. దీంతో ఆయన భార్య మీనాను దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేయగా.. భర్త అనిల్ కుమార్‌పై కత్తులతో దాడి చేశారు.తీవ్రంగా గాయపడిన అనిల్ కుమార్ పరిస్థితి విషమం ఉంది. ఆసుపత్రికి తరలించారు. పరారైన నిందితులు కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. బిహార్‌కు చెందిన దంపతులు బొల్లారంలో నివాసం ఉంటున్నారు. షాపింగ్‌కు వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది. -
టికెట్ ధరలపై డిస్కౌంట్ కట్
సాక్షి, హైదరాబాద్: వరుసగా పెరుగుతూ వచ్చిన చమురు ధరలు ఆర్టీసీపై పెద్ద ప్రభావమే చూపుతున్నాయి. నగరంలో కొన్ని కేటగిరీ బస్సుల్లో తక్కువగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకునేందుకు గతంలో ప్రకటించిన టికెట్ ధరలపై డిస్కౌంట్‌ను ఆర్టీసీ ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. నగరంలో తిరుగుతున్న మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ సర్వీసుల్లో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీలతోనే ప్రయాణించేలా ఈ డిస్కౌంట్‌ను ఆర్టీసీ ప్రకటించింది. మే నెలతో దాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఫలితంగా జూన్ ఒకటి నుంచి పాత చార్జీలను వసూలు చేయనున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఆర్డినరీ (పల్లె వెలుగు కూడా), మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే వీలుంది. ఈ వెసులుబాటు మొదలైనప్పటి నుంచి ఆ రెండు కేటగిరీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ముందు వైపు ఉండే మహిళల సీట్లు నిండిపోయి, వెనకవైపు సీట్లలో కూడా ఎక్కువగా వారే కూర్చుంటున్నారు. దీంతో పురుషులకు సీట్లు పరిమితంగానే ఉంటున్నాయి. దీనిపై వారి నుంచి వరుసగా ఫిర్యాదులొస్తున్నాయి. దీంతో గతేడాది మెట్రో డీలక్స్ పేరుతో కొత్త కేటగిరీ సర్వీసును ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది . ఈ సర్వీసులో మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం లేకపోవటంతో, పురుషులకు సీట్లు లభిస్తున్నాయి. కానీ, ఇందులో మెట్రో ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే రూ.5 వరకు చార్జీ ఎక్కువ. దీనివల్ల ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ రేషియో నమోదుకాలేదు. దీన్ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల అభిప్రాయాలు సేకరించారు. ప్రభుత్వ పథకం వల్ల ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సీట్లు లభించటం లేదని, ఇప్పుడు సీట్లు కావాలంటే ఎక్కువ చార్జీ చెల్లించి డీలక్స్ బస్సులో వెళ్లమనడం ఎలా న్యాయమని చాలామంది పేర్కొన్నారు. దీంతో ఈ డీలక్స్ బస్సులతోపాటు, ఏసీ కేటగిరీ అయిన మెట్రో లగ్జరీ బస్సుల్లో గత మార్చిలో స్పెషల్ డిస్కౌంట్‌ను ఆర్టీసీ ప్రకటించింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు టికెట్ చార్జీనే చెల్లించి వీటిల్లో ప్రయాణించే వీలు కల్పించింది. మే నెల వరకు పరిశీలించి ఆక్యుపెన్సీ రేషియో పెరిగితే, ఈ ఆఫర్‌ను కొనసాగించాలని అప్పట్లో నిర్ణయించారు.కానీ ఇప్పుడు వరసగా పలుమార్లు డీజిల్ ధరలను పెంచటంతో ఆర్టీసీపై పెద్ద భారం నమోదైంది.నెలవారీ దాదాపు రూ.14 కోట్ల వరకు అదనపు భారం నమోదు కావటంతో ఈ డిస్కౌంట్ విషయంలో ఆర్టీసీ పునరాలోచన కొచ్చింది. నష్టాలను భరిస్తూ ఆఫర్‌ను కొనసాగించటం సరికాదని నిర్ణయించి, మే నెలతోనే దానికి మంగళం పాడి జూన్ నుంచి మళ్లీ పాత ధరలను ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్ ఒకటి నుంచి, మెట్రో డీలక్స్ బస్సుల్లో రెండో స్టేజీ నుంచి ఎక్స్‌ప్రెస్ కేటగిరీతో పోలిస్తే రూ.5 వరకు, లగ్జరీ బస్సుల్లో అది రూ.10 వరకు ఎక్కువగా ఉండనుంది. అంటే, గత ఫిబ్రవరి వరకు కొనసాగిన చార్జీలు జూన్ ఒకటి నుంచి మళ్లీ అమలవుతాయి. -
రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం..
కవాడిగూడ/ముషీరాబాద్: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందపెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి పేమెంట్ కోటాలో సీఎం గద్దెనెక్కారని, ఆయన రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలు 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జీవో 17ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చిన నిధుల టెండర్లపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 72 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మబలికి జీవో 17తో చిన్న చిన్న కాంట్రాక్టర్లను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జీవో 17ను రద్దు చేసేంతవరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టులు సీఎం రేవంత్‌రెడ్డి బామ్మర్ది, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు, బీజేపీ నేతలకు దక్కుతున్నాయని ఆరోపించారు. 2028లో బీఆర్ఎస్ వస్తుందని, 50 వేల మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ చైర్మన్ మందా శ్యామ్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఒక్క ఇళ్లయినా కట్టావా? జీహెచ్ఎంసీలో ఒక్క ఇళ్లయినా కట్టావా అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. కానీ ఎంత మంది ఇళ్లు కూల్చి వారి ఉసురుపోసుకున్నారో తెలుసా అంటూ ఘాటుగా మండిపడ్డారు. శనివారం మధ్యాహ్నం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధ్యక్షతన జరిగిన బూత్ లెవల్ ఏజెంట్స్ (బీఎల్ఏ) సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నిస్తే కండలు తిరిగిన పహిల్వాన్ అయినా మూడు నెలల్లోనే పిల్లలను పుట్టిస్తారా... అన్న సీఎం రేవంత్‌రెడ్డి 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే నిన్ను ఏమనాలి?’అని సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ నగర కేంద్ర గ్రంథాలయానికి వచ్చి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టండి.. మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అదే నిరుద్యోగులు సెక్యూరిటీ లేకుండా రాహుల్, రేవంత్ ఎక్కడ దొరుకుతారా అని ఎదురుచూస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌కుమార్, దేశపతి శ్రీనివాస్, సురభివాణిదేవి, దామోదర్ పాల్గొన్నారు. -
ఉచిత విద్యుత్ ఎత్తేయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని, ఆ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎత్తేసేది లేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన తమకు లేదని తేల్చిచెప్పారు. అసలు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్న నిబంధన కేంద్రం ఎప్పుడూ పెట్టలేదని చెప్పిన రేవంత్.. ఉచిత విద్యుత్, స్మార్ట్ మీటర్ల విషయంలో బీఆర్ఎస్కు సవాల్ చేశారు. ఉచిత విద్యుత్ ఎత్తేసినా, వ్యవసాయానికి మీటర్లు పెట్టినా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, తాము అలా చేయకపోతే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా అని వ్యాఖ్యానించారు. శనివారం రేవంత్‌రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘మేం అధికారంలోకి వచ్చేసరికి తెలంగాణలోని డిస్కంలు కుప్పకూలే పరిస్థితిలో ఉన్నాయి. డిస్కంలకు ఇప్పుడు రూ.69,745 కోట్ల అప్పులున్నాయి. అవి బాగుచేయలేనంతగా నిర్వీర్యమయ్యాయి. ఉచిత విద్యుత్ కింద రైతులకిచ్చే కరెంటుకు ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లించలేదు. దీంతో డిస్కంలు అప్పులు చేసి బొగ్గు, విద్యుత్ కొనుగోలు చేసుకోవాల్సి వచ్చేది. ఉద్యోగుల నిర్లక్ష్యం, నిర్వహణా లోపాల కారణంగా ఇతర అవసరాలకు వినియోగించిన విద్యుత్‌ను కూడా ఉచిత విద్యుత్ లెక్కలో రాసేవాళ్లు. వాళ్లు కనీసం ఎప్పుడు ఎంత కరెంటు తీసుకోవాలనే అంచనాలు కూడా వేయలేదు. మేం అధికారంలోకి వచ్చాక డిస్కంలను దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే రైతులతో పాటు ప్రభుత్వం గంపగుత్తగా కరెంటును వినియోగించుకునే కేటగిరీని కలిపి ప్రత్యేకంగా రైతు డిస్కం ఏర్పాటు చేశాం. దీనిద్వారా ఎంత విద్యుత్ తీసుకున్నామో, ఎంత సరఫరా చేశామో, నిర్వహణ నష్టాలు ఎంతో, బిల్లులు ఎంత వస్తున్నాయో కచ్చితంగా లెక్క తేలుతుంది. తెలంగాణ రైతాంగం రాత్రిపూట పెద్దగా వ్యవసాయానికి విద్యుత్ వాడదు కాబట్టి ధర తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు చేసి ఆ డిస్కం ద్వారా రైతులకు విద్యుత్ ఇస్తాం. అసలు మాకు ఉచిత విద్యుత్ ఎత్తేయాలనే ఆలోచనే లేదు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు కూడా పెట్టబోం. అలా పెట్టేది ఉంటే వచ్చే ఎన్నికల్లో మేం పోటీ చేయబోం. ఒకవేళ మేం పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ ఎత్తేయకపోయినా బీఆర్ఎస్ పోటీ చేయకుండా ఉంటుందా? బీఆర్ఎస్ నా సవాల్‌ను స్వీకరించాలి. అప్పుడే స్మార్ట్ మీటర్లు పెట్టారు అసలు స్మార్ట్ మీటర్ల విషయంలో కేంద్రంతో ఒప్పందం చేసుకుంది బీఆర్ఎస్సే. 2017, జూన్ 30న అజయ్‌మిశ్రా, రఘుమారెడ్డి, గోపాలరావు అనే అధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు పెట్టారు. 2017–18లో 29,632 స్మార్ట్ మీటర్లు కూడా పెట్టారు. కేంద్రం ఏ రోజూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని అడగలేదు. అసలు అలాంటి నిబంధనే లేదు. నోరు తెరిస్తే కేసీఆర్ చెప్పేది అబద్ధాలే. రైతుల కోసం తామేదో యుద్ధం చేసినట్టు అప్పట్లో చెప్పుకుని రైతుల దగ్గర మార్కులు కొట్టేయాలని అలాంటి మాటలు చెప్పారు. రైతులు ఆయన కంటే తెలివైన వారు కాబట్టి కర్రు కాల్చి వాత పెట్టారు. మోదీ నా చుట్టమేమీ కాదు. ఆ పథకంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు చేరాయి. ఏపీ కూడా చేరింది. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రాష్ట్రమంతటా స్మార్ట్ మీటర్లు పెట్టినా వ్యవసాయానికి మాత్రం పెట్టలేదు. తీగల మీద బట్టలు ఆరేయాలని కేసీఆర్ అన్నప్పుడే 1999 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసింది. కాంగ్రెస్సే. నాణ్యమైన విద్యుత్ ఇచ్చి రైతుల ఆత్మగౌరవం పెంచడానికి తెచ్చిన పారదర్శక విధానమే రైతు డిస్కం. సీఆర్పీసీ, ఐపీసీల్లో శిక్షలు వేసేందుకు నిబంధనలు లేవా? మరి ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, హెచ్ఆర్సీ, మైనార్టీ కమిషన్లు ఎందుకు ఏర్పాటు చేశారు. బీసీ కమిషన్‌ను ఎందుకు అడుగుతున్నారు. తమ వర్గాలకు కమిషన్ ఉంటే న్యాయం జరుగుతుందనే కదా. ఆ తరహాలోనిదే రైతు డిస్కం కూడా. మోదీకి కిషన్‌రెడ్డి చెప్పాలి కదా? బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి కేసుల్లో సీబీఐ విచారణను రాష్ట్ర ప్రభుత్వం కోరిన తర్వాత కూడా కేంద్రం ఎందుకు స్పందించడం లేదు. కనీసం సీబీఐ వాళ్లు ఆపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. తుమ్మిడిహెట్టిపై చర్చిద్దామంటే మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఈ విషయాలను మోదీ దగ్గర కిషన్‌రెడ్డి చెప్పాలి కదా? అంతర్రాష్ట్ర జలవివాదాలు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని మోదీ చెబుతున్నారు కదా? వచ్చే నెల1న ఆదిలాబాద్‌కు వెళ్తున్నా. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా దారిలోకి రాడో చూస్తా. పోలవరం ముంపు కింద ఏడు మండలాలు ఏపీకి ఇచ్చిన మోదీ తెలంగాణ కోసం వెయ్యి ఎకరాల భూమి ఇవ్వలేడా? సోయి తప్పిన మాటలు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ సోయి తప్పిన మాటలు మాట్లాడుతోంది. పువ్వాడ అజయ్ ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు కేసీఆర్ ఏం చేశాడు? కమ్మ సంఘానికి భూమి ఇవ్వలేదా? భీమవరంలో కేటీఆర్ పోటీ చేస్తానని చెప్పి బీఆర్ఎస్ ఏపీకి తోట చంద్రశేఖర్‌ను అధ్యక్షుడిని చేయలేదా? ఆయనకు కూకట్‌పల్లిలో 30 ఎకరాల భూమి ఇవ్వలేదా? హక్కుల కోసం పోరాటం ఎలా చేయాలో, చరిత్రలో కొందరిని ఎలా గౌరవించాలో నాకు తెలుసు. అసలు తారక రామారావు అనే పేరు మార్చుకోవాలి కదా? ఆ పేరుతో ఎంతకాలం బతుకుతారు? ప్రధానికి కనపడడం లేదా? గ్లోబరీనా అనే సంస్థ కేటీఆర్ బినామీ. ఆ సంస్థ వల్లనే తెలంగాణలో పరీక్ష పేపర్లు లీకయ్యాయి. విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సీబీఎస్ఈ వ్యవస్థను కూడా గ్లోబరీనా కుప్పకూల్చింది. హరీశ్, కేటీఆర్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడరు. ప్రధాని మోదీకి ఎందుకు కనపడడం లేదు? బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే కదా? రెండు పెద్ద కేసుల్లో ఆధారాలతో కేంద్రానికి ఇచ్చాం. ఆ కుటుంబాన్ని అరెస్టు చేస్తారో లేదో మోదీ, కిషన్‌రెడ్డిలే చెప్పాలి. జుట్టు వారి చేతిలో పెట్టాం. రాష్ట్రంలో జనగణన, ఎస్ఐఆర్లు నడుస్తున్నాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొందరేముంది? ఆర్థిక వెసులుబాటును బట్టి రైతు భరోసా చెల్లిస్తాం. మహిళా సమాఖ్యలతో గోదాములు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు, దళారులతో పనిలేకుండా ఓ ప్రణాళిక రూపొందిస్తున్నాం. గోదాములు, రైస్‌మిల్లులను మహిళా సమాఖ్యలతో ఏర్పాటు చేయిస్తాం. బ్యాంకు లింకేజీతో రుణాలు ఇప్పిస్తాం. వారినే యజమానులను చేస్తాం. దీనికి గొప్ప ప్రణాళిక మా దగ్గర ఉంది. ఇప్పటికే పెట్రోల్ బంకులిచ్చాం. సోలార్‌పవర్ ప్లాంట్లు ఇచ్చాం. ఆదానీ, అంబానీలకు మా ఆడబిడ్డలే పోటీ అనే రీతిలో వారి సాధికారతకు కట్టుబడి ఉన్నాం. అసెంబ్లీలో చెప్పాం.. మళ్లీ చెబుదాం రాష్ట్రం అప్పుల పాలవుతుందనే వాదనలో వాస్తవం లేదు. మేం యేటా రూ.70–75వేల కోట్లు అప్పులు తెస్తే రూ.90వేల కోట్ల వరకు పాత అప్పులు కడుతున్నాం. అన్ని లెక్కలు అసెంబ్లీలో చెప్పాం. మళ్లీ అసెంబ్లీలో అన్ని విషయాలు చెప్తాం. మేం తెచ్చిన అప్పులే కాదు కట్టిన అప్పులు కూడా చూడాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎంత మోసం చేసినా భరించాం. ఇప్పుడు అంతా తెలంగాణ వాళ్లమే కదా? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఆ కుటుంబం డీఎన్ఏనే అబద్ధాల డీఎన్ఏ. వాళ్ల మూలుగతో సహా మారిస్తేనే వారి వైఖరి మారుతుంది. అలా చేస్తే వాళ్లు ఉండరు. ఫ్యామిలీ మొత్తం అబద్ధాలమీదనే బతుకుతుంది. బ్లాక్ మెయిల్ చేసి బతుకుతుంది. చివరకు క్రషర్ల వాళ్లని కూడా పొడుగాయన బెదిరించాడు. నెలకు రూ.50 లక్షలు ఇస్తే క్రషర్ల గురించి మాట్లాడబోనని ఓ ఎమ్మెల్సీ ద్వారా బ్లాక్మెయిల్ చేశాడు. మూడడుగుల ఆయన, ఆరడుగులాయన చెత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు. హరీశ్.. ఓ బబుల్ షూటర్ అసలు ఆరడుగులాయన ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదు. ఆయన ఎందులో ఉంటాడో కూడా తెలియదు. గుండెల మీద చేయి వేసి కేసీఆర్ మీద ఒట్టేసి హరీశ్‌రావు బీఆర్ఎస్లోనే ఉంటాడేమో చెప్పమనండి. 2008లో వైఎస్సార్ దగ్గరకు పోలేదా? హరీశ్‌రావు మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు. ఆయన ట్రబుల్షూటర్ కాదు.. బబుల్ షూటర్. వచ్చే ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తాడన్న నమ్మకం నాకు లేదు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడనే సమాచారం నాకుంది. కానీ నేను చెప్పదల్చుకోలేదు. ఓవైపు పార్టీ సమావేశం జరుగుతుంటే ఢిల్లీ వెళ్లాడు. మీడియా పట్టుకుంటే అడ్వొకేట్‌ను కలిసేందుకు వెళ్లానని ఫొటోలు పెట్టాడు. తీర్పు రిజర్వ్ అయిన కేసులో అడ్వొకేట్ దగ్గరకెళ్లి ఆయన మాట్లాడేదేముంటుంది? కేంద్రంలో పెద్ద మంత్రి అవుతాడేమో నాది, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. నేను పీసీసీ అధ్యక్షుడిగా, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం. ఆయన పీసీసీ ప్రెసిడెంట్‌గా, నేను ముఖ్యమంత్రిగా ప్రతి ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నాం. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, ఉప ఎన్నికలు గెలిచాం. 2029లో కూడా మా కాంబినేషన్లోనే ఎన్నికల్లో గెలుస్తాం. మహేశ్‌గౌడ్ నాకు మంచి మిత్రుడు కూడా. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆయన పెద్ద కేంద్రమంత్రి కూడా అయ్యే అవకాశముంది. మాది సక్సెస్ఫుల్ కాంబినేషన్. మా పనితీరును ఫలితాలే చెబుతున్నాయి. నేను 2034 వరకు ఇక్కడే ఉంటా. రాష్ట్ర ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతిననీయను. అన్నింటినీ కొలిక్కి తెస్తా. రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ ఎకానమీగా రూపుదిద్దేందుకు అన్ని వ్యవస్థలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తా’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. వడ్లు కొనంది ఎవరు?అసలు ధాన్యం కొనుగోలు చేయంది ఎవరు? కేంద్రం కాదా? వరి వేస్తే ఉరి అన్నది బీఆర్ఎస్ కాదా? మేము వడ్లే కాదు మక్కలు కూడా కొంటున్నాం. మక్కలకు మద్దతు ధర ప్రకటించిన వారు ఒక్క గింజయినా కొన్నారా? మేం పండిన ప్రతి ధాన్యం గింజ కొంటున్నాం. పండిన పంటలో పంజాబ్ (86%), ఛత్తీస్‌గఢ్ (67%), హరియాణా (65%), ఒడిశా (52%) తరహాలో తెలంగాణ పంటఎందుకు కొనరు? తెలంగాణలో పండిన దాంట్లో 38 శాతమే కొంటారా? మేం వచ్చే నెల 15 లోపు ధాన్యమంతా కొంటాం. ఆ తర్వాత కిషన్‌రెడ్డి, మోదీ సంగతి చెబుతాం. వడ్లు కొనకపోతే బీజేపీ వాళ్ల ఇళ్ల ముందు తీసుకెళ్లి పోస్తాం. బస్సులో వెళ్లి రైతు యాత్ర చేస్తున్న వారి ఇళ్ల వద్దకు ట్రాక్టర్లు తీసుకెళతాం. ఇప్పటికే 60లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. 20 లక్షల టన్నుల మక్కలు కొంటాం. ఈ స్థాయిలో ఏ రోజైనా, ఏ ప్రభుత్వమైనా కొనుగోలు చేసిందా? అకాల వర్షం వల్ల రైతులకు కొంత నష్టం కలిగింది. రైతు దుఃఖంలో ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్లి సెల్ఫీ లు దిగి సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్నారు. అది కూడా ఒక బతుకేనా?. -
అలాగైతే మేం ఎన్నికల్లో పోటీ చేయం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మోటర్లకు మీటర్లు పెట్టినా.. రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా మేం ఎన్నికల్లో పోటీ చేయం.. ఒక వేళ మోటర్లకు మీటర్లు పెట్టకపోయినా.. ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా? అంటూ ఆ పార్టీకి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిచేందుకే రైతు డిస్కం. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్ వినియోగాన్ని రైతు డిస్కమ్‌కు కనెక్ట్ చేస్తున్నాం. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఎక్కడాలేని విధంగా రైతు డిస్కంను ఏర్పాటు చేశాం. రైతు డిస్కం ఏర్పాటుతో జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రభుత్వానికి అవసరాన్నిబట్టి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ అబద్ధాల పునాదులపై పార్టీలను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి’’ అంటూ రేవంత్ దుయ్యబట్టారు.‘‘కిషన్‌రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. వడ్లు కొనంది మీరు.. రైతు పండించిన ప్రతీ గింజను మా ప్రభుత్వం కొంటుంది. మేం కొంటున్నది ఎంత.. కేంద్రం కొనేది ఎంత?. కేంద్రం ఎంఎస్పీ నిర్ణయించింది కానీ ఒక్క గింజనైనా కొంటున్నారా?. వరి, జొన్న, మొక్కజొన్నలు మొత్తం మా ప్రభుత్వం కొంటుంది. మేం కొన్న మొత్తం పంట కేంద్రం కొనాలి. కేంద్రం కొనకపోవడం వల్లే రాష్ట్రంలో రైతు గోస పడుతున్నాడు. కేంద్రం కొనకపోతే బస్సులు వేసుకుని వెళ్లిన వాళ్ల దగ్గరికే ట్రాక్టర్లు వేసుకుని వెళతాం. జల వివాదాలను రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని మోదీ చెప్పారు. కానీ తుమ్మిడిహట్టి కోసం కలిసి మాట్లాడటానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరినా స్పందించడంలేదు’’ అంటూ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
ఖాకీ యూనిఫాంలో గాన గంధర్వుడు సురేష్ కుమార్
హైదరాబాద్: పోలీసులంటేనే నిత్యం ఏదో ఒక ఒత్తిడి, బందోబస్తు, కేసులు, గొడవలు, కొట్లాటలు ఒక్కోసారి వ్యక్తిగత జీవితానికి కూడా సరిగ్గా సమయం ఇవ్వలేని విధులు..కానీ తనకున్న కళతో ఓ అధికారి ఒక వైపు విధులను సక్రమంగా నిర్వహిస్తూనే మరో వైపు సమాజంలో యువతను, పౌరుల్లో స్ఫూర్తి నింపుతూ ముందుకుసాగుతున్నాడు. రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న బోడసింగి సురేష్ కుమార్ దేశ భక్తిగీతాలు ఆలపించడంతో పాటు సమాజంలో జరుగుతున్న పలు నిజ జీవిత ఘటనలపై పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. 2007 బ్యాచ్‌కు చెందిన సురేష్ గతంలో పని చేసిన జిల్లాలో సైతం ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏదో ఒక ప్రాంతంలో యువతను, స్థానికంగా ఉండే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పాటే ఆయుధంగా.. మంచిని పెంచడానికి, పది మందిలో స్ఫూర్తిని నింపి మంచి మార్గంలో నడిపించేందుకు పాట ఒక ఆయుధంగా పని చేస్తుందనే విషయాన్ని తాను నమ్ముతానని సురేష్‌కుమార్ చెబుతున్నారు. ఇప్పటి వరకు సురేష్‌కుమార్ సమాజాన్ని మేల్కొల్పేందుకు రచించిన జై భారత్ జెండా, షీ టీమ్స్ వల్ల అమ్మాయిలకు ఎటువంటి రక్షణ లభిస్తుందో తెలియజేసే పాట, పల్లెను వదిలి పటానికి రాలేని ఓ పల్లెటూరి వ్యక్తి బాధ, అడవుల వల్ల కలిగే ప్రయోజనాలు, అడవుల పరిరక్షణకు ఓ పాట, తండ్రి ప్రాముఖ్యం, పిల్లల కోసం తండ్రి చేసే త్యాగాలు, తండ్రి కష్టాన్ని తెలియజేసేలా రచించిన పాట ఇలా ఎన్నో రకాల పాటలను పాడి ఆకట్టుకున్నారు. ఏదైనా విషయాన్ని పాట రూపంలో చెప్తే అందరూ అటెన్షన్లోకి వస్తారని అందులోనూ ఖాకీ యూనిఫాం ధరించి తాను పాట పాడుతుంటూ అంతా ఆసక్తిగా చూడడంతో పాటు పాట భావాన్ని అర్థం చేసుకొని మంచి మాటలు వినేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. కరోనా సమయంలో కూడా భయపడొద్దని, ఎలా ఉండాలో చెప్పేందుకు ప్రత్యేకంగా ఓ సాంగ్‌ను తయారు చేయించి మరీ పాడారు. పాట రూపంలో చెప్తే అందరూ వింటారు చదువుకునే రోజుల నుంచే నాకు పాటలంటే ఇష్టం. పోలీస్ ఉద్యోగం వచ్చినా పాడే అలవాటును మాత్రం వదులుకోలేదు. శాంతి భద్రతల పరిరక్షణతో ఓ వైపు కృషి చేస్తూనే మరో వైపు సమాజంలో మంచిని పెంచేందుకు పాటల రూపంలో కృషి చేస్తూనే ఉన్నా. అక్షర జ్ఞానం లేని వారినే కాదు బాగా చదువుకున్న వాళ్లను కూడా సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని తీసుకొని సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలంటూ ఓ పాటను తయారు చేయించి పాడబోతున్నా. మా ఉన్నతాధికారులు కూడా నా ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. – బోడసింగి సురేష్ కుమార్, ఇన్స్పెక్టర్ రాంగోపాల్‌పేట -
ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు డిలీట్ చేశారు?
సాక్షి, హైదరాబాద్: పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి సాయి భగీరథ్ మూడు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. చివరి రోజైన శుక్రవారం పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్‌ను లోతుగా విచారించారు. గత డిసెంబర్ 31న ఓ మైనర్ బాలికకు బలవంతంగా మద్యం తాగించి, ఆమె అపస్మారక స్థితిలో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో భగీరథ్‌పై ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. కేసు నమోదైన రోజునే భగీరథ్ తన సెల్‌ఫోన్‌ను ఫార్మాట్ చేయడంతో పాటు ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్‌ను డిలీట్ చేశాడని సాంకేతిక విచారణలో పోలీసులు గుర్తించారు. ఈ సాంకేతిక ఆధారాలను నిందితుడి ముందుంచిన పోలీసులు.. డేటా డిలీట్ చేయడంలో అతనికి సహకరించిన వారు ఎవరు? అనే కోణంలో ఆరా తీశారు. బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించిన సమయంలో భగీరథ్ ఎక్కడున్నాడనే అంశంపై పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ ఠాణాలో కేసు నమోదైన రోజునే, కరీంనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నేరుగా ఫిర్యాదు చేశాడా? లేక పోలీసులు వచ్చి ఫిర్యాదు తీసుకున్నారా? అనే కోణంలో ప్రశ్నలు అడిగారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ నిందితుడు సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు తెలిసింది. కస్టడీ అనంతరం భగీరథ్‌ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. -
తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. బాల్క సుమన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బాల్క సుమన్‌పై పలు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణభవన్‌లో ఉన్న బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. ఈ సందర్భంగా తెలంగాణభవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం, బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గత మూడు రోజులుగా తెలంగాణ భవన్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణభవన్ వద్దనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత మూడు రోజులుగా మోహరించారు. బాల్క సుమన్ భవన్ నుండి బయటికి వస్తే అరెస్టు చేయాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలో కాసేపటి క్రితమే సుమన్ తరపు లాయర్ అక్కడికి చేరుకున్నారు. అలాగే, నాంపల్లి, టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. సుమన్‌కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.మరోవైపు.. బాల్క సుమన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 326, 351, 352, 353, 355, 361-BNS మరియు PDPP చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లను కేసులో చేర్చిన పోలీసులు. దీంతో, పోలీసులతో బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. సుమన్‌పై అక్రమ కేసులు పెట్టారంటూ లాయర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి కోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటామంటున్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామని న్యాయవాదుల హెచ్చరించారు. ఈ క్రమంలో భవన్ వద్ద పోలీసులకు, లాయర్లకు మధ్య చర్చలు, వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
మైనింగ్ స్కాం కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మైనింగ్ కుంభకోణాల కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది.గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ లీజులు, అనుమతులు, తవ్వకాల ప్రక్రియల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వెయిరీకి ఆదేశించింది. ఈ క్రమంలో విజిలెన్స్ సంస్థ సమగ్ర పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దీంతో ఇకపై సీఐడీ ఈ ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరపనుంది. సంబంధిత అధికారులు, అప్పటి నిర్ణయాధికారులు, లీజుదారుల పాత్రపై విచారణ కొనసాగనుంది. అవసరమైతే కీలక పత్రాలు, ఫైళ్లు, అనుమతి రికార్డులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని సమాచారం.ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై వరుసగా దర్యాప్తు ఆదేశాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇది మరింత రాజకీయ ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఆర్టీసీ సంచలన నిర్ణయం.. ఇక ఆధార్ పనిచేయదు..!
కామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు త్వరలో మహిళలకందరికీ మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల పంపిణీకి ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లాంఛనంగా స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ప్రస్తుతం ఆర్టీసీ ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులకు ఇస్తున్న సీజన్ పాస్‌ల మాదిరిగా మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు ఇవ్వనుంది. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు.. కామారెడ్డి జిల్లాలో సగటున రోజుకు 40 వేల మంది నెలకు 12 లక్షల మంది మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు ఇప్పటి వరకు తమ ఆధార్ కార్డులను చూపిస్తున్నారు. ఈ విధానం వల్ల పథకం కొన్ని ప్రాంతాల్లో దుర్వినియోగం అవుతున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల వారు నకిలీ ఆధార్ కార్డులతో ఈ పథకాన్ని వాడుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. బతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వేలాది మహిళా కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా నకలీ ఆధార్ కార్డులు సృష్టించి వాటి సాయంతో బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. దీన్ని అరికట్టేందుకు ఆర్టీసీ మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల జారీకి పూనుకుంది. డిజిటల్ విధానంతో మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను పూర్తి డిజిటల్ టెక్నాలజీతో తయారు చేయనున్నారు. ఏటీఎం కార్డుల మాదిరిగా చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డును తయారు చేస్తున్నారు. మహిళల ఆధార్ కార్డు, ఫోటో లాంటి ప్రాథమిక సమాచారం అందిస్తే ఆ సమాచారాన్ని కార్డులోని చిప్‌కు అనుసంధానిస్తారు. స్మార్ట్ కార్డులో మహిళల పూర్తి వివరాలు, ఫొటో, క్యూ ఆర్ కోడ్ ఉంటాయి. ఈ సమాచారాన్ని చిప్‌లో పొందుపర్చాక వారి పేర్లతో కార్డు జారీ చేస్తారు. స్మార్ట్ కార్డు పంపిణీ చేశాక అది ఉంటేనే ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తారు. నకలీ ఆధార్ కార్డులతో ప్రయాణం చేస్తున్న వారికి స్మార్ట్ కార్డు పొందే అవకాశం ఉండదు. ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశం..మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల పంపిణీని జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లాంఛనంగా ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ప్రతీ జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి కార్డుల పంపిణీ ప్రయోగాత్మకంగా ప్రారంభించి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ కార్డులను పంపిణీ చేయనున్నారని వారు తెలిపారు. మహాలక్ష్మి కార్డులు అందే వరకు మహిళలు పాత విధానంలోనే ఆధార్ కార్డు చూపించి ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చని వారు తెలిపారు. స్మార్ట్ కార్డుల ద్వారా టికెట్ జారీ చేయడానికి బస్సులోని కండక్టర్లకు ప్రత్యేక స్మార్ట్ కార్డు రీడర్లను అందజేయనున్నామని వారు వివరించారు. ఆధార్ చూపిస్తే చాలు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఆర్టీసీ త్వరలో మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనుంది. కానీ ఇందుకు సంబంధించిన విధివిధానాలేవీ మాకు ఇంత వరకు రాలేదు. కొత్త స్మార్ట్ కార్డులు వచ్చే వరకు మహిళలు పాత విధానం మాదిరిగానే తమ ఆధార్ కార్డులను చూపించి ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు. – దినేష్ కుమార్, డిపో మేనేజర్, కామారెడ్డి -
Hyderabad: ఈసారి ఎకరం రూ.250 కోట్లు?
సాక్షి, హైదరాబాద్: ఎకరం రూ.237 కోట్లు పలికి భారత్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసిన హైదరాబాద్‌లోని రాయదుర్గం భూములు మరో సంచలనానికి వేదిక కానున్నాయి. రియల్టీ రంగ సంస్థల అధిపతుల సమాచారం ప్రకారం జూన్ 1న జరిగే ఈ–వేలం చరిత్ర తిరగరాయనున్నట్టు తెలుస్తోంది. ఐటీసీ కోహినూర్‌కు సమీపంలో 5.09 ఎకరాల ప్లాట్‌ను తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) వేలం వేస్తోంది. బెంగళూరుకు చెందిన ఓ రియల్టీ దిగ్గజం ఐటీ కారిడార్‌లో ఉన్న రాయదుర్గం భూములపై అమితాసక్తిగా ఉంది. మే 28న జరిగిన ఈ–వేలంలో 6.29 ఎకరాల ప్లాట్‌ను తృటిలో చేజార్చుకున్న ఈ కంపెనీ.. ఈసారి ఎలాగైనా ఈ ప్రైమ్ ప్రాపర్టీని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. రిజర్వ్ ప్రైస్ ఎకరా రూ.139 కోట్లు కాగా.. తీవ్ర పోటీ నేపథ్యంలో ఎకరా విక్రయ ధర రూ.250 కోట్లు దాటే అవకాశముంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూములను చేజిక్కించుకోవడం కోసం ప్రముఖ రియల్టీ సంస్థలు నువ్వా నేనా అన్నట్టు రంగంలోకి దిగాయి. శుక్రవారం జరిగిన ఈ–వేలంలో రిజర్వ్ ప్రైస్ ఎకరా రూ.139 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. వేలంలో 70.5 శాతం అధిక ధరకు బిడ్ చేసి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్టీ సంస్థ గౌర వెంచర్స్ ఎకరం రూ.237 కోట్ల చొప్పున మొత్తం 6.29 ఎకరాల భూమిని రూ.1,490.73 కోట్లకు దక్కించుకుంది. కాగా ఇదే ప్రాంతంలో 2025 అక్టోబర్‌లో జరిగిన భూముల వేలంలో ఎకరం రూ.177 కోట్లకు ఎంఎస్ఎన్ రియల్టీ కొనుగోలు చేసింది. -
నాకూ మినహాయింపొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘పార్టీ కోసం అందరూ పనిచేయాల్సిందే. కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులతో సహా. నాకు కూడా మినహాయింపు ఇవ్వొద్దు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)పై అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నియమించిన ఇన్‌చార్జీలతో సమన్వయంతో పనిచేయాలి. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో మమేకం కావాలి. నా అసెంబ్లీ నియోజకవర్గాన్ని వేరే వారికి అప్పగించండి. నాకు ఏదైనా ఇతర అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వండి. నేనే వెళ్తా. ఆ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతా. వారితో కలిసి ఎస్ఐఆర్ విషయంలో పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు 45 లక్షల పార్టీ సభ్యత్వం చేర్పించామని, పార్టీ సభ్యులు ఒక్కొక్కరు ఇంకో ఓటు వేయించడంతో పార్టీ అధికారంలోకి వచి్చందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలవాలని, ఇందుకోసం కనీసం కోటి ఓట్లు రావాల్సి ఉంటుందని అన్నారు. అలా రావాలంటే పార్టీకి సంబంధించిన ఒక్క ఓటు కూడా ఎస్ఐఆర్ ద్వారా పోకుండా ఉండాలని, ఇందుకు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా ఉన్న నేతలు, మంత్రులతో సహా అందరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం ఇందిరాభవన్‌లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని తేలిగ్గా తీసుకోవద్దు ‘ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఈ కార్యక్రమంపై పార్టీ పక్షాన అవగాహన పెంచుకోవాలి. ఎస్ఐఆర్ కారణంగా వలసదారుల ఓట్లకు ఇబ్బంది రావచ్చు. వారి ఓట్లు పోకుండా చూడాలి. లంబాడీ, ఆదివాసీ, మైనార్టీ, దళిత, మహిళా ఓట్ల విషయంలో సమస్యలు రావచ్చు. ఈ సమస్యల పరిష్కారమెలా అన్న దానిపై బూత్‌స్థాయి కార్యకర్తలకు అవగాహన కల్పించాలి. గతంలో పార్టీ డిజిటల్ సభ్యత్వం చేర్పించిన వారికి ఈ విషయంలో కీలక బాధ్యతలు అప్పగించాలి.ఎస్ఐఆర్ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్చార్జులను నియమించాలి. అసెంబ్లీ ఇన్చార్జులు తప్పనిసరిగా నియోజకవర్గాల్లో ఉండాల్సిందే. వారు సరిగా పనిచేస్తేనే ఓట్లు పోకుండా ఉంటాయి. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్‌లోని నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలి. హైదరాబాద్ నగర పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలి. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్లస్టర్ వారీ సమావేశాలు నిర్వహించాలి..’ అని సీఎం సూచించారు. కొందరు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో శిక్షణ ఇవ్వాలి ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేడర్ పూర్తిగా సోషల్ మీడియా వారియర్లుగా మారిపోయి పనిచేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సోషల్ మీడియాలో వీక్ అయ్యాం. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందార్లు అయ్యారు. సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత ప్రచారం తప్ప పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయనివ్వడం లేదు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు రీచ్ కావడం లేదు. ఎమ్మెల్యేలు పాల్గొన్న కార్యక్రమాలు, ఎంపీలు కొబ్బరికాయలు కొట్టిన కార్యక్రమాలే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. పార్టీ కోసం ఎలాంటి ప్రచారం జరగడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సోషల్ మీడియాలో శిక్షణ ఇవ్వాలి. నేతలు ఈ తీరును సరిచేసుకోవాలి. నెలలో మూడు రోజులు పార్టీకి.. నేతలు కార్యకర్తల వద్దకు వెళితేనే, కార్యకర్తలు బూత్‌స్థాయిలో ఓటరు వద్దకు వెళ్తారన్న విషయాన్ని గమనించాలి. జిల్లాల ఇన్చార్జి మంత్రులు కూడా కార్యకర్తల వద్దకు వెళ్లి కలవాలి. నేను కూడా 10 రోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్లి పార్టీ కార్యకర్తలను కలుస్తా. నెలలో మూడు రోజులు పార్టీకి కేటాయిస్తా. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లందరూ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి..’ అని సీఎం చెప్పారు. కార్యకర్తల్లో నిరుత్సాహం పలువురు మంత్రులు, పార్టీ నేతలు మాట్లాడుతూ ఎస్ఐఆర్తో పాటు పార్టీ నిర్మాణంపై పలు సూచనలు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి మాట్లాడుతూ నామినేటెడ్ పోస్టుల నియామకంలో ఆచితూచి వ్యవహరించాలని, పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించాలని, సీనియార్టీని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని చెప్పారు. దీంతో సీఎం జోక్యం చేసుకుని ఉన్న పదవులను వీలున్నంత పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మంత్రుల తీరుతో నష్టం: మాజీ ఎంపీ వీహెచ్ మాజీ ఎంపీ, బీసీ సంక్షేమ సలహాదారు వి.హన్మంతరావు మాట్లాడుతూ..కొందరు మంత్రుల వ్యవహారశైలితో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. ‘పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వారున్నారు. కోట్లు ఖర్చుపెట్టుకుని ఆస్తులు అమ్ముకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన వారిని పట్టించుకోరా? మీరు నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు కనీసం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఇన్చార్జులకు సమాచారం కూడా ఇవ్వరా?..’ అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఎంఐఎం నేతలతో ఎక్కువగా అంటకాగవద్దని, అలా చేస్తే హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఎలా బలోపేతమవుతుందని ప్రశ్నించినట్టు సమాచారం.రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ర్గౌడ్లు పలు సూచనలు చేశారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజహరుద్దీన్, వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీతో పాటు జెట్టి కుసుమకుమార్, జి.చిన్నారెడ్డి, రాములు నాయక్, టి. రామ్మోహన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, జె.గీతారెడ్డి, ఎస్.సంపత్‌కుమార్, ఈరవత్రి అనిల్, ఎర్రబెల్లి స్వర్ణ, మిద్దెల జితేందర్, జక్కిడి శివచరణ్‌రెడ్డి, యడవెల్లి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. మంత్రులు వారంలో ఒకరోజు పార్టీకి కేటాయించాలి ప్రతి వారంలో ఒక రోజు మంత్రులు ప్రభుత్వ పనులకు సెలవు పెట్టి పార్టీ పనులపై దృష్టి పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులకు నియోజకవర్గాల బాధ్యతలు కేటాయించనున్నారు. సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ప్రభుత్వ సలహాదారులు వీహెచ్, షబ్బీర్ అలీ, పార్టీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్‌రావులు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. -
అక్కడ తిప్పలు ఇక్కడ అప్పులు!
డబ్బులన్నీ ఫీజులకే.. రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి సుమిత్ వేల్పుల ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎంఎస్ కోసం అమెరికా వచ్చిన తనకు రూపాయి పతనంతో ఏటా రూ.5 లక్షల అదనపు భారం పడుతోందని చెప్పాడు. డబ్బులన్నీ ట్యూషన్ ఫీజుకే పోతున్నాయని తెలిపాడు. అమ్మ గొలుసు అమ్మి యూఎస్ వచ్చానని, కూలీ పనికి వెళ్లే అమ్మ, చిరుద్యోగి నాన్నను డబ్బులు అడగలేక కొన్నిసార్లు పస్తులు ఉంటున్నట్టు చెప్పాడు. పార్ట్‌టైమ్ ఉద్యోగం దొంగచాటుగా చేస్తూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నానని కన్నీరు మున్నీరయ్యాడు. .ఒక్క పూటే తింటూ.. ఖమ్మంకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నవనీత్ వర్మ తన కొడుకును అమెరికా పంపారు. ఇందుకోసం రూ.35 లక్షల అప్పు చేశారు. జీతంలో 80% ఈ అప్పు కింద వడ్డీకే కడుతున్నారు. ఈ క్రమంలో భార్యకు గుండెపోటు వస్తే ఇల్లు తాకట్టు పెట్టి మళ్లీ అప్పు చేశారు. అమెరికాలో చదువుతున్న కొడుకు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఒక్క పూటే తింటున్నాడని తెలిసి నవనీత్ తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. కొడుకు డబ్బులు పంపమని అడగలేక అడిగిన తీరు గుర్తు చేసుకుంటూ బావురుమన్నారు.సాక్షి, హైదరాబాద్: అమెరికా విద్య విద్యార్థులను హడలెత్తిస్తోంది. భవిష్యత్తుపై ఎన్నో కలలతో ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లాలనుకునే వారిని, ఇప్పటికే అక్కడ ఉండి చదువును కొనసాగిస్తున్న వారిని ప్రస్తుత పరిస్థితులు బెంబేలెత్తిస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు..డాలర్ దూకుడు.. రూపాయి పతనం.. తల్లిదండ్రులు, విద్యార్థులకు శాపంగా మారాయి. పెరిగిన ఖర్చులు గుండె దడ పుట్టిస్తున్నాయి. అమెరికా వెళ్లాలంటే వీసా నిబంధనలు చుక్కలు చూపిస్తున్నాయి. స్లాట్ దొరకడమే కష్టంగా ఉంటే, వీసా రావడం దైవాధీనంగా మారింది.మరోవైపు యూఎస్‌లో విద్యార్థులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ట్రంప్ ప్రభుత్వ నిబంధనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు పరిస్థితి ఎలా మారుతుందోననే ఆందోళన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసే అవకాశం లేక, యూఎస్ విద్య కోసం చేసిన అప్పులు గుదిబండగా మారడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల తిప్పలు వర్ణనాతీతం. పిల్లలు తినీ తినకా..ఫీజులు, ఇతర ఖర్చుల కోసం డబ్బులు కావాలని అడుగుతుంటే వారి గుండె తరుక్కుపోతోంది. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కొందరితో ‘సాక్షి’ మాట్లాడింది. ఎవర్ని కదిలించినా.. కన్నీటి కథలు.. గుండెల్ని పిండే వ్యథలే.. డాలర్ కరాళ నృత్యం అమెరికా చదువు కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు చేసిన విద్యార్థుల ఆర్థిక ప్రణాళిక పూర్తిగా మారిపోయింది. ఏడాది క్రితం వరకూ రూపాయి తో పోలిస్తే డాలర్ విలువ రూ.83. ప్రస్తుతం ఇది రూ. 96కు చేరింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు దీనికి కారణం కాగా.. ఇది విద్యార్థులపై భారాన్ని పెంచింది. యూనివర్సిటీని బట్టి ఫీజులుంటాయి. వర్సిటీల ట్యూషన్ ఫీజు 30 వేల నుంచి 32 వేల డాలర్ల వరకూ ఉంటుంది. ఒక్కో విద్యార్థికి రూ.35 లక్షల నుంచి 50 లక్షల వరకూ ఖర్చవుతుంది.రూపాయి పతనంతో ఫీజు 35 వేల నుంచి 40 వేల డాలర్లకు చేరింది. హాస్టల్, ఇన్సూరెన్స్, ప్రయాణ ఖర్చులు అదనం. ఫీజుతో పాటు ఇప్పుడీ ఖర్చులన్నీ పెరిగాయి. భారతీయ విద్యార్థులపై ఈ ఏడాది రూ.5 లక్షల నుంచి 8 లక్షల అదనపు భారం పడిందని, బ్యాంకు రుణం కాకుండా మరో రూ.20 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందని ఇటీవల యూఎస్ వెళ్ళిన ఖమ్మం విద్యార్థిని మాధవి తండ్రి ప్రణబ్ తెలిపారు. ప్రతి నెలా అప్పుపై వడ్డీకే రూ.30 వేలు కడుతున్నట్టు వాపోయారు. టెన్షన్ పుట్టిస్తున్న వీసాలు వీసా ఫీజు గతంలో 160 డాలర్లు ఉండేది. ఇప్పుడది 180 డాలర్లు అయ్యింది. బయోమెట్రిక్, డాక్యుమెంటేషన్ ధ్రువీకరణ.. ఇలా వీసా ఖర్చు అమాంతం పెరిగింది. మన దేశం నుంచి ఏటా సగటున 7 లక్షల మంది విదేశీ విద్య కోసం వెళ్తారు. ఇందులో 3 లక్షల మంది అమెరికాకే వెళ్తున్నారు. అమెరికా వర్సిటీల్లో రెండు దశల్లో ప్రవేశాలు చేపడతారు. ఫాల్ సెమిస్టర్గా భావించే మే, జూన్ నెలలు కీలకం. ఆరు నెలల ముందు నుంచే విద్యార్థులు దీనికోసం ప్రణాళిక రూపొందించుకుంటారు. ప్రవేశాలను ఖరారు చేసుకుని వీసాలకు దరఖాస్తు చేసుకుంటారు. అయితే యూఎస్ ఈ ఏడాది 38 శాతం వీసాలకు కోత పెట్టింది. కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.విద్యార్థి ఆర్థిక పరమైన లావాదేవీలను నిశితంగా పరిశీలించాలని యూఎస్ కాన్సులేట్‌ను ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో విద్యార్థి చేసిన పోస్టులనూ వెతకాలని, ఎవరెవరితో లింక్‌లున్నాయి? యూఎస్‌లో ఉండే వారితో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నాడు? ఇలాంటివన్నీ శోధించాలని పేర్కొంది. దీంతో వీసాలకు అలస్యమవుతోంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై ఎక్కడ స్టాట్ వస్తుందో తెలియని పరిస్థితి. స్లాట్ వచ్చినా వీసా గ్యారంటీ ఉండటం లేదు. గడచిన 3 నెలలుగా 120 మంది తెలుగు విద్యార్థుల వీసాలను చిన్న కారణాలతో నిలిపివేశారు.‘యూఎస్‌లో ఓ స్నేహితుడితో చాట్ చేశాను. అతని బ్యాక్ గ్రౌండ్ సరిగా లేదని వీసా ఆపేశారు..’ అని నెల్లూరుకు చెందిన ప్రభాకర్ మిన్నకంటి వాపోయాడు. బ్యాంకు స్టేట్మెంట్లో లావాదేవీలపై బ్యాంకు నుంచి వివరణ రాలేదని వీసా ఇవ్వలేదని వరంగల్‌కు చెందిన శ్రీకాంత్ మండేపూడి చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇతర దేశాల్లో ఎంఎస్ చేయడంపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కెనడా, ఆ్రస్టేలియా, జర్మనీ, ఐర్లాండ్ వంటి దేశాలపై దృష్టి పెడుతున్నారు. -
ఎన్ఎమ్ఈవో-ఓపీ అమలులో తెలంగాణ టాప్
-హైదరాబాద్,: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO-OP) కార్యక్రమం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు–2026లో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి రాష్ట్రాల వారీగా ఆయిల్ పామ్ సాగు పురోగతిని వెల్లడించగా, తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు స్పష్టమైందన్నారు.NMEO-OP మిషన్ కింద 2021 నుండి 2026 వరకు దేశవ్యాప్తంగా 2,73,084 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేపట్టగా, అందులో 98,112 హెక్టార్లతో తెలంగాణ ఒక్కటే 36 శాతం వాటాను కలిగి ఉండటం రాష్ట్ర వ్యవసాయ రంగానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 1.16 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగవుతుండగా, 79,448 మంది రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు.మంంత్రి మాట్లాడుతూ... ఈ విజయం కేవలం గణాంకాలకు మాత్రమే పరిమితం కాదన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను స్వీకరిస్తూ ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులు వేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. దేశంలో వంటనూనెల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు తెలంగాణ రైతులు విశేషంగా తోడ్పడుతున్నారని చెప్పారు.దేశంలో ఎడిబుల్ ఆయిల్స్ అవసరం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుందని మంత్రి తెలిపారు. ఇతర నూనెగింజల పంటలతో పోలిస్తే అధిక దిగుబడి ఇచ్చే ఈ పంట రైతులకు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారిందన్నారు. ఒకసారి తోటను ఏర్పాటు చేస్తే సుమారు 30 సంవత్సరాలపాటు దిగుబడి అందే ఈ పంట ద్వారా రైతులు ఎకరాకు సంవత్సరానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు.ఆయిల్ పామ్ రైతులకు మార్కెటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. రైతులు పండించిన ఫ్రెష్ ఫ్రూట్ బంచ్లు (FFBs) ఆయిల్ పామ్ కంపెనీల ద్వారా నేరుగా కొనుగోలు చేయబడుతున్నాయని, దీంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందన్నారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ గెలల ధర మెట్రిక్ టన్నుకు రూ.23,501గా ఉండటం రైతులకు మరింత ప్రయోజనకరంగా మారిందన్నారు.అయితే, గతంలో అమలులో ఉన్న విధంగా కేంద్ర ప్రభుత్వం పామాయిల్‌పై 44 శాతం దిగుమతి సుంకాన్ని పునరుద్ధరిస్తే, దేశీయ ఆయిల్ పామ్ రైతులకు మరింత మేలు జరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. దిగుమతి సుంకం పెరగడం వల్ల దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, ఆయిల్ పామ్ గెలల ధర మెట్రిక్ టన్నుకు రూ.25,000 వరకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో రైతులకు మరింత అధిక ఆదాయం లభించడంతో పాటు, కొత్తగా ఎక్కువ మంది రైతులు కూడా ఆయిల్ పామ్ సాగు వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందన్నారు. దేశీయ వంటనూనెల ఉత్పత్తి పెరగడం, రైతుల ఆదాయం మెరుగుపడడం, దిగుమతులపై ఆధారపడటం తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయని మంత్రి వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వివరించారు. రైతులకు నాణ్యమైన మొక్కల సరఫరా, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థల ఏర్పాటుకు సబ్సిడీ, మొదటి నాలుగు సంవత్సరాలపాటు తోటల నిర్వహణకు ఆర్థిక సహాయం, అంతర పంటల సాగుకు ప్రోత్సాహకాలు, కోత పరికరాల కొనుగోలుకు ఎకరానికి రూ.51 వేల వరకు రాయితీ అందిస్తున్నామని తెలిపారు. అదనంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా పలు వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందిస్తున్నామని చెప్పారు. ఈ చర్యలన్నీ రైతుల పెట్టుబడి భారం తగ్గించి, ఆయిల్ పామ్ సాగుపై విశ్వాసాన్ని పెంచాయని పేర్కొన్నారు.ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన ప్రాసెసింగ్ మౌలిక వసతుల అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు, సిద్ధిపేట జిల్లాలో ఒకటి కలిపి మొత్తం మూడు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లులు పనిచేస్తున్నాయని చెప్పారు. వీటి గంటకు ప్రాసెసింగ్ సామర్థ్యం 150 మెట్రిక్ టన్నుల వరకు ఉందన్నారు. అదనంగా మరో ఏడు ప్రాసెసింగ్ మిల్లులు నిర్మాణ దశలో ఉన్నాయని, అవి పూర్తయిన తర్వాత రైతులకు మరింత సమీపంలోనే ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.ఆయిల్ పామ్ రంగం కేవలం రైతుల ఆదాయాన్నే పెంచడం కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. ప్రాసెసింగ్ మిల్లులు, రవాణా, కోత, నిల్వ, అనుబంధ కార్యకలాపాల ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు పరిశ్రమల అభివృద్ధికి కూడా ఈ రంగం దోహదపడుతోందన్నారు.పంటల వైవిధ్యీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును మరింత విస్తరించాలని నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరో 85 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, దేశంలో వంటనూనెల స్వయం సమృద్ధి సాధించడం, గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు."తెలంగాణ రైతన్న కృషి, పట్టుదల, ప్రభుత్వ ప్రోత్సాహం కలిసి వచ్చిన ఫలితమే ఈ అగ్రస్థానం. దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ నంబర్-1గా నిలవడం ప్రతి రైతుకు గర్వకారణం. రైతుల సంక్షేమం, ఆదాయ వృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అవసరమైన ప్రతి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది" అని స్పష్టం చేశారు. -
మొయిజుద్దీన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్: లాయర్ మొయిజుద్దీన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు హత్య కేసుకు సంబంధించి ఏడుగుర్ని అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. వక్ఫ్ భూముల వివాదాలే లాయర్ హత్యకు కారణమన్నారు. లం ఖాన్ కుటుంబానికి మొయిజుద్దిన్ పలు విషయాలలో అడ్డు వస్తున్నాడానే కారణంతో హత్య చేయించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.‘మొయిజుద్దీన్ స్విమ్మింగ్‌కు వెళ్తుండగా హత్య చేశారు. మొయిజుద్దీన్‌ను హతమార్చాలని ఆలంఖాన్ నిర్ణయించుకున్నాడు. మే 23 న శాంతి నగర్ లో అడ్వకేట్ ఖాజా మొయిజుద్దిన్‌ను ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీ కోట్టారు. వక్ఫ్ భూముల వివాదాలే లాయర్ హత్యకు కారణం. జనవరి నుంచి లాయర్ హత్యకు రెక్కీ నిర్వహించారు. 23వ తేదీన మొయిజుద్దీన్ స్విమ్మింగ్ వెళ్తుండగా హత్య చేశారు. లాయర్‌ను చంపేందుకు రూ. 15 లక్షలు సుపారీ ఇచ్చారు. నిందితుల నుంచి రూ. 10. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. ఆలం ఖాన్ కుటుంబానికి మొయిజుద్దిన్ పలు విషయాలలో అడ్డు వస్తున్నాడానే కారణంతో హత్య చేయించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. లక్డి కాపుల్, మలక్ పేట్ ప్రాంతాలకు చెందిన వక్ఫ్ బోర్డు ప్రాపర్టీకి సంబంధించి కేసులలో ఖాజా మొయిజుద్దిన్, ఆలం ఖాన్ కుటుంబానికి వివాదాలు ఉన్నాయి. హత్య చేసేందుకు గత ఆరు నెలల నుండి పలు మార్లు ప్రయత్నం చేసి చివరకు మొయిజుద్దిన్ ను హత్య చేశారు’ అని తెలిపారు. -
తెలంగాణ కేబినెట్లో భారీ మార్పులు.. ముహూర్తం ఫిక్స్!
ఢిల్లీ: త్వరలో తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. జూన్ చివరి వారంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ రాహుల్ గాంధీని కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్.. తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని కోరారు. మంత్రివర్గంలో చోటు కోసం అధిష్టానం చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి కేబినెట్లో చోటు కోసం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఆది శ్రీనివాస్‌కు కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు, పీసీపీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పని తీరు సరిగా లేని పలువురి మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని.. హై కమాండ్ అంతర్గతంగా నివేదికలు తెప్పించుకుంటుందని టాక్. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల పూర్తి కావడంతో కేబినెట్లో కొత్త వారికి అవకాశం కల్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘బీజేపీ యాత్రతోనే మంత్రులు కల్లాల బాట పట్టారు’
హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రైతు గోసం-బీజేపీ భరోసా పేరుతో రైతాంగం పడుతున్న బాధలను తెలుసుకునేందుకు యాత్ర చేపట్టామని, నాలుగురోజుల పాటు అనేక జిల్లాల్లో పర్యటించి.. రైతాంగం ఆర్తనాదాలు విన్నామన్నారు. బీజేపీ పోరాటం చేయగానే.. ప్రభుత్వం సమీక్షలు, జిల్లాల్లో కల్లాల బాట పడుతుందని ఎద్దేవా చేశారు.‘ధాన్యం కొనుగోళ్లు 80 శాతం పూర్తి అయ్యాయని ముఖ్యమంత్రి చెప్పారు. మా పర్యటనలో 80 శాతం ధాన్యం కుప్పలు పేరుకుపోయి కనిపించాయి. మంత్రులు ఇవే సమీక్షలు, పర్యటనలు ముందే చేస్తే బాగుండేది కదా?, ఇసుక, సిమెంట్ లారీలను ముందే ఆపి ధాన్యం సేకరణ ఎందుకు చేయలేదు. రైతులే గన్నీ బ్యాగులు కొనే పరిస్థితి. లారీ, హామాలీల ఖర్చు రైతే ఇస్తున్నాడు.. రైతాంగం శ్రమను ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు. చివరి గింజ వరకు కొనే బాధ్యత నాది అని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు చేతకాకపోతే దిగిపోమ్మని గత సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయడం లేదు. గద్దెనెక్కగానే రేవంత్ రెడ్డి గద్దలెక్క మారిపోయారు. ఓటు బ్యాంకు కోసమే రైతులను వాడుకుంటున్నారు. కేంద్రం ఇచ్చిన యూరియాను కూడా సక్రమంగా ఇవ్వకుండా.. యాప్ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు వయసు మీరీ, బుద్ధి మందగించింది కాబట్టే బీజేపీని విమర్శిస్తున్నారు. మంత్రి పదవుల కోసం, సూట్ కేసులు మోయడానికి కాంగ్రెస్ నేతలు డిల్లీ యాత్రలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై బహిరంగ చర్చకు సిద్ధం.. మంత్రులు ఉత్తమ్, తుమ్మల చర్చకు వస్తారా?, బీజేపీ యాత్ర చేస్తే కాంగ్రెస్ ఎందుకు భయపడుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కు పెట్రోల్ డీజల్ పై అవగాహన లేదు. పెట్రోల్ డీజల్ పై 30 శాతం వ్యాట్ ను ఎందుకు ముఖ్యమంత్రి తగ్గించడం లేదు. రైతు వడదెబ్బతో చనిపోతే మంత్రులు వెళ్లి పరామర్శించారా?.. ఎక్స్ గ్రేషియా ప్రకటించారా?, సన్ ప్లవర్, శెనిగలు కొంటున్నామని తుమ్మల చెబుతున్నారు.. మీ కౌంటర్ ఎక్కడ పెట్టారో చూపించాలి. రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ లేదు. రాష్ట్రంలో దోపిడి రాజ్యం నడుస్తోంది. కేంద్రం కొనుగోళ్లు చేయలేకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు చేయలేదా?’ అని ప్రశ్నించారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో తొలి విడత రూ. 2,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన రూ.4000 కోట్లు కూడా త్వరలోనే జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ (GPF) బకాయిలు 100 శాతం ప్రభుత్వం క్లియర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. -
నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఎల్‌నివో ప్రభావంతో ఐఎండీ అంచనాలు తలకిందులయ్యాయి. నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యమవుతోంది. నెమ్మదిగా కదులుతున్న నైరుతి రుతు పవనాలు... జూన్ 4,5 తేదీల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళను తాకిన మూడు రోజుల తర్వాత తెలంగాణలో రుతు పవనాలు ప్రవేశించనున్నాయి.మే చివరి వారంలో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ భావించింది. అయితే, ఈ ఏడాది ఇంకా అక్కడ విస్తరించలేదు. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ సీజన్లో వర్షపాతం తక్కువగా ఉండవచ్చని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రుతు పవనాల రాక ఆలస్యం కావడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. రుతుపవన గాలులు అరేబియా సముద్రంలోని చాలా భాగాలు, లక్షద్వీప్ ప్రాంతం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోకి మరింత ముందుకు సాగాయి. రుతుపవనాల గమనం ప్రస్తుతం నెమ్మదిగా ఉన్నప్పటికీ.. అవి సహజంగానే మళ్లీ పుంజుకుంటాయని ఐఎండీ పేర్కొంది.రుతుపవనాల విస్తరణకు ఆటంకం కలిగించిన సముద్ర, వాతావరణ పరిస్థితులు ఇప్పుడు క్రమంగా తొలగిపోతున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడానికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం.. రుతుపవనాల వ్యవస్థ నైరుతి అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం మీదుగా మయన్మార్ వరకు విస్తరించి ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో బలపడుతోందని ఐఎండీ వెల్లడించింది.సాధారణంగా జూన్ 1న ప్రవేశించే రుతుపవనాలు.. ఈసారి దాదాపు ఐదు రోజులు ముందుగానే.. మే 26 నాటికే కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ గతంలో అంచనా వేసింది. అయితే.. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా రుతుపవన గాలులు తాత్కాలికంగా బలహీనపడ్డాయి. కాగా, ప్రస్తుత మందగమనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. రుతుపవనాలు ఇప్పటికే దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాల్లో విస్తరించాయి. ఇప్పుడు వాయవ్య దిశగా వేగంగా కదులుతున్నాయి. ప్రారంభ అంచనాతో పోలిస్తే స్వల్పంగా ఆలస్యమైనప్పటికీ.. రుతు పవనాల ప్రస్తుత కదలిక సాధారణంగానే ఉన్నాయి.సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 27 నాటికి రాజధాని ఢిల్లీకి చేరుకుంటాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా.. జూన్ 25 నుండి 30 మధ్య రుతుపవనాలు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుత మందగమనం జూన్ మొదటి వారం వరకు కొనసాగకపోతే.. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రుతుపవనాల గమనం చాలా వరకు సాధారణంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
‘టిమ్స్’ కూడా సాధారణ ప్రభుత్వ ఆస్పత్రేనా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రులకు మానవ వనరుల కల్పనే ప్రధాన సమస్యగా తయారైంది. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా, విదేశీ రోగులను ఆకర్షించేలా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో అందించాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న ‘టిమ్స్’లో ఆ స్థాయి వైద్య సేవలు అందించే స్పెషలిస్టు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకం ఇప్పటి వరకు జరగలేదు.నిమ్స్, ఎయిమ్స్ తరహాలో ప్రత్యేక డైరెక్టరేట్, స్వయం ప్రతిపత్తి వ్యవస్థ, స్వతంత్ర నియామకాలతో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహణ ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చెప్పినా, ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. సనత్‌నగర్, ఎల్బీనగర్, ఆల్వాల్ ప్రాంతాల్లో 1,000 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న మూడు టిమ్స్ ఆస్పత్రుల్లో కార్డియాక్ స్పెషాలిటీగా సనత్‌నగర్ టిమ్స్‌ను తొలి దశలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలుమార్లు ఆస్పత్రి ప్రారంభోత్సవ తేదీలు మారగా, తాజాగా జూన్ 2న ప్రారంభించాలనే ప్రతిపాదన కూడా వాయిదా పడింది. సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ తీసుకొని జూన్ రెండోవారంలో ప్రారంభించాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు. అటకపైకెక్కిన ప్రత్యేక నియామకాలు టిమ్స్ ఆస్పత్రులను (Telangana Institute of Medical Sciences) సాధారణ ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి భిన్నంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా డైరెక్టరేట్ స్థాయి వ్యవస్థ ఏర్పాటు చేసి, నేరుగా ఈ ఆస్పత్రుల కోసమే వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాలని వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. ఒక్కో టిమ్స్ ఆస్పత్రికి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో కలిపి సుమారు 4 వేల మందిని నియమించాలని ప్రతిపాదించారు.అయితే వైద్య, నర్సింగ్, టెక్నికల్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు రాలేదని తెలిసింది. దీంతో ప్రత్యేక నియామకాల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యేక డైరెక్టరేట్ కింద టిమ్స్ నిర్వహించాలని భావించిన వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి ఆస్పత్రిలో ట్రయల్ రన్ కోసం గాంధీ, ఉస్మానియాతోపాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఆస్పత్రుల నుంచి కొందరు వైద్యులు, ఇతర సిబ్బందిని తాత్కాలికంగా సనత్‌నగర్ టిమ్స్‌కు తరలించి ‘ట్రయల్‌రన్’నిర్వహిస్తున్నారు.కనీసం 4 వేల మంది వైద్య సిబ్బంది అవసరం...1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహణకు కనీసంగా 200 మంది స్పెషలిస్టు వైద్యులు, 500 మంది రెసిడెంట్ డాక్టర్లు, మూడు షిప్ట్‌ల్లో పనిచేసేందుకు 1,500 వరకు స్టాఫ్ నర్సులు, 1500–2000 మంది పారా మెడికల్ సిబ్బంది అవసరం ఉంటుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి కార్డియాక్ కేర్, ఐసీయూలు, ట్రామా కేర్, క్యాథ్‌ల్యాబ్‌లు, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్, ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి అత్యాధునిక విభాగాలు పూర్తిస్థాయిలో పనిచేయాలంటే అనుభవజ్ఞులైన సిబ్బంది తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. కనీసం 4 వేల మంది వరకు నేరుగా నియమిస్తే తప్ప, ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను సమర్థంగా నిర్వహించడం సాధ్యం కాదని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చదవండి: వడివడిగా ఫ్యూచర్ సిటీవైపు అడుగులు -
గుండు శ్రీనివాసుడికి ‘జుట్టు’తోనే మోక్షం!
మహబూబాబాదు జిల్లా: సాఫ్ట్‌వేర్‌కు కళ్లుంటాయి కానీ బుర్ర ఉండదని తేలిపోయింది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ శ్రీనివాస్, కొండగట్టు అంజన్నకు తలనీలాలు ఇస్తే.. అటెండెన్స్ యాప్ మాత్రం అతని కూలీకి ఎసరు పెట్టింది. సిస్టమ్‌లో పాత జుట్టు ఫొటో ఉండటంతో, గుండుతో వచ్చిన శ్రీనివాస్‌ను చూసి ‘నువ్వు డూప్లికేట్’అంటూ యాప్ మొండికేసింది. కంగుతిన్న కూలీలు సాఫ్ట్వేర్ తెలివిని సాగనంపడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. పక్కనే ఉన్న మహిళా కూలీ తన జుట్టును శ్రీనివాస్ గుండుపై ‘విగ్గు’లా పరిచింది. అంతే, ఆ జుట్టు ముసుగును చూడగానే యాప్ సలాం కొడుతూ అటెండెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు మనోళ్లు ‘కృత్రిమ జుట్టు’తో చెక్ పెట్టిన ఈ సంఘటన నవ్వులు పూయించింది. ఉపాధి హామీ సాఫ్ట్‌వేర్‌లో బయటపడ్డ లోపాలుగుండుతో ఉన్న కార్మికుడిని గుర్తించని యాప్గుండుపై మహిళ జుట్టు కప్పి అటెండెన్స్ వేసుకున్న కార్మికుడుమహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో ఇటీవల కొండగట్టు అంజన్నకు తలనీలాలు సమర్పించిన శ్రీనివాస్ అనే ఉపాధి హామీ కార్మికుడు… pic.twitter.com/PUKifkdN4R— Telugu Scribe (@TeluguScribe) May 29, 2026 -
రాజీవ్ స్వగృహ టౌన్ షిప్లో దారుణం
నాగోలు: పెంచిన మెయింటెనెన్స్ కాకుండా పాత పద్ధతిలో మెయింటెనెన్స్ కట్టారని వారం రోజులుగా ఓ ప్లాట్‌కు రాజీవ్ స్వగృహ టౌన్ షిప్ కమిటీ సభ్యులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వారం రోజులుగా బాధిత కుటుంబం చిన్న పిల్లలతో సహా చీకట్లో ఉంటున్నారు. ఈ సంఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన మేరకు.. నాగోలు బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ సీ–బ్లాక్ లో బీజే చక్రపాణి గతంలో ప్లాట్ కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నాడు. బైలాస్కు వ్యతిరేకంగా పెంచిన నిర్వహణ ఖర్చుల గురించి అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులను చక్రపాణి ప్రశ్నించాడు. దీంతో అసోసియేషన్ సభ్యులు అతని కుటుంబాన్ని వేధించడం మొదలుపెట్టారు. 4 నెలల నుంచీ ఫ్లాట్‌కు తరుచూ విద్యుత్ నిలిపివేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే వారం రోజులుగా విద్యుత్‌ను పూర్తిగా నిలిపివేశారు. అసలే వేసవి.. చిన్న పిల్లలతో ఉక్కపోతకు తీవ్ర ఇబ్బంది పడుతున్నా కనికరించకుండా కమిటీ సభ్యులు దౌర్జన్యం చేస్తున్నారని నాగోలు పీఎస్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నాగోలు పోలీసులు అసోసియేషన్ సభ్యులతో మాట్లాడి గురువారం సాయంత్రం విద్యుత్‌ను పునరుద్ధరించి వెళ్లారు. అయితే ఆ తరువాత ఎప్పటి లాగానే ఫ్లాట్‌కు విద్యుత్‌ను నిలిపివేశారు. దీంతో తనకు జరుగుతున్న అన్యాయంపై బాధితుడు రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. -
నేపాలీ ఇదేం పని.. వీధిలో చేయిపట్టుకొని అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి
హైదరాబాద్: రాత్రివేళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించిన నేపాలీ యువకులను గురువారం అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. బుధవారం రాత్రి బషీర్‌బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదురుగా ఓ యువతి ఒంటరిగా వెళుతోంది. దీంతో నేపాల్ యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. యువతి గట్టిగా అరవడంతో స్థానికులు బంధించి బంధించి దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని అబిడ్స్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. స్థానికంగా ఓ ఫాస్ట్‌ఫుడ్ కేంద్రంలో పనిచేస్తున్న సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్ నేవులుగా గుర్తించారు. -
Gandhi Hospital: ఐవీఎఫ్‌తో జన్మించిన బాలభీముడు
గాందీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సంతాన సాఫల్య కేంద్రం మరో విజయం సాధించింది. దంపతుల పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐవీఎఫ్ ద్వారా బాల భీముడు జన్మించాడు. ప్రభుత్వ సెక్టార్‌లోని గాంధీ ఐవీఎఫ్ సెంటర్లో గత మూడునెలల్లో మూడు జంటలకు సంతాన సాఫల్యం కలగడం గమనార్హం. గాంధీ సూపరింటెండెంట్ ప్రొ.వాణి, ఐవీఎఫ్ సెంటర్ వైద్యులు ప్రొ. శోభ, ఫాతిమా తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి– భువనగిరి జిల్లా బీబీనగర్ గూడూరుకు చెందిన గౌలికర్ సౌమ్య, రవిలకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతాన భాగ్యం కలగకపోవడంతో పలు ప్రైవేటు, కార్పొరేట్ ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయించారు. అక్కడ లక్షలాది రూపాయలు వెచ్చించి సుమారు 12 సార్లు ఓవలేషన్ ఇండెక్షన్ (ఓఐ) ఇంట్రా యుటేరియన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) చేయించుకున్నా ఫలితం లేకపోయింది. ఏడాది క్రితం గాంధీ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు. పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, నాలుగుమార్లు ఓవలేషన ఇండెక్షన్ చేసిన తర్వాత గర్భం దాల్చేందుకు అవసరమైన ట్రీట్మెంట్ను 2025 సెప్టెంబర్ 24న ప్రారంభించి ఐవీఎఫ్ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఈ నెల 27న సౌమ్య పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. శిశువు సుమారు నాలుగు కిలోల బరువు ఉన్నాడు. ఈ తరహా వైద్యచికిత్సకు ప్రైవేటు సెక్టార్లో రూ.12 లక్షలు వ్యయం అయ్యేదని, నయా పైసా ఖర్చు లేకుండా యాంటినెటల్ చెకప్స్, మందులు, వైద్య చికిత్సలు, సేవలు ఉచితంగా అందించామని సూపరింటెండెంట్ ప్రొ.వాణి స్పష్టం చేశారు. తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. మరో పదిమందికి ఐవీఎఫ్ చికిత్సలు అందిస్తున్నారు. గాంధీ వైద్యులకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందనలు తెలిపారు. -
లాయర్ హత్య కేసు.. ఆలంఖాన్ సహా ఐదుగురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రాజకీయ నేత ఆలంఖాన్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన తండ్రీ కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మొహిజుద్దీన్ చంపేందుకు ఆలంఖాన్ రూ.25లక్షల సుపారీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. తన భూములకు అడ్డం పడుతున్నాడని కారణంగానే మొహిజుద్దీన్‌ను వారు హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.ఇక, ఈ కేసులో ఆలంఖాన్ కుమారుడు ముజాహిద్ ఆలంఖాన్ సహా గ్యాంగ్ నలుగురు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. మొహిజుద్దీన్ హత్య కోసం ఆలంఖాన్ ఇప్పటికే 10 సార్లు ప్లాన్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగానే ప్లాన్ ప్రకారం.. మొహిజుద్దీన్‌ను సుపారీ గ్యాంగ్ కారుతో ఢీకొట్టి చంపినట్టు పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా.. మొహిజుద్దీన్ కొన్నేళ్లుగా వక్ఫ్ భూముల పరిరక్షణకు పోరాడుతున్నారు. ఓ భూమికి సంబంధించి బర్కత్‌పురకు చెందిన ఆలంఖాన్‌తో విభేదాలు వచ్చాయి. తమ ఆధీనంలో ఉన్న ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ పలుమార్లు ఒత్తిడి తీసుకువచ్చారు. తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగడంతోపాటు ఆ భూ వివాదం కేసు నుంచి వైదొలిగితే రూ.2 కోట్లు ఇస్తామంటూ మొహిజుద్దీన్‌కు ఆఫర్ చేశారు. అయితే రాజీ పడబోనని చెప్పడంతో మొయిజుద్దీన్‌ను హత్యను చేయాలని భావించారు. ఆ పనిని సుపారీ గ్యాంగ్‌తో పనిపూర్తి చేయించాలని నగరానికి చెందిన కిషన్ సింగ్ అలియాస్ పప్పును వీరు కలిసి విషయం చెప్పారు. సుపారీ కింద రూ.15 లక్షలు చెల్లించారు. హత్య బాధ్యతను కవాడిగూడకు చెందిన సింగూరి అభిజీత్ అలియాస్ నాని, వినయ్, మణిదీప్‌లకు అప్పగించి రూ.10 లక్షలు చెల్లించాడు. ఈ ముగ్గురూ పప్పుతో కలిసి పథకం వేసి, కారు కొని, రెక్కీ చేసి, శనివారం మొయిజుద్దీన్‌ను రెడ్‌హిల్స్ శాంతినగర్‌లో హత్య చేశారు.అభిజిత్ గుర్తింపు... స్టంట్స్ చేయడంలో అనుభవం ఉన్న అభిజితే ఆ రోజు కారు నడిపాడు. మణిదీప్, వినయ్ అందులో కూర్చున్నారు. డ్రైవింగ్ నైపుణ్యం కారణంగానే ఇతడు నడిపిన, మొయిజుద్దీన్ ఎక్కబోయిన కార్లలో ఏదీ దెబ్బతినలేదు. ఈ హత్య చేసే సమయంలో కారుకు నెంబర్ ప్లేట్ లేకపోయినా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అధ్యయనం చేశారు. వీటి ఆధారంగా అభిజిత్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. -
హైదరాబాద్‌లో యాపిల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్.. హైదరాబాద్‌లో దసరా నాటికి ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. రాయదుర్గంలోని టీ–హబ్ సమీపంలో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది కొలువుదీరనుంది. ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌తోపాటు సర్వీస్, కాల్ సెంటర్ సైతం ఏర్పాటు చేయనుంది. బ్యాకెండ్ సపోర్ట్ టీమ్ కూడా ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించనుంది. వాటన్నింటి కోసం కంపెనీ మొత్తంగా సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేంద్రాన్ని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌గా (జీసీసీ) యాపిల్ తీర్చిదిద్దనుందని సమాచారం. దాదాపు 1,400 మంది సిబ్బంది వరకు ఇక్కడ కూర్చునే వీలుంది. డేటా ప్రొటెక్షన్, మెడికల్, కమ్యూనికేషన్, ఏఐ, నేవిగేషన్ సిస్టమ్, ట్రాఫిక్ సర్వేలెన్స్, వాయిస్ రికగ్నిషన్ తదితర విభాగాలకు చెందిన సాంకేతిక నిపుణులు విధులు నిర్వర్తిస్తారు. డిజిటల్ ఆపరేషన్స్ కూడా ఇక్కడి నుంచే జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే గచ్చిబౌలిలోని వేవ్‌రాక్‌లో యాపిల్‌కు జీసీసీ ఉంది. హైదరాబాద్‌లోని రెండు జీసీసీల కోసం కొత్తగా 3,500 మందిని యాపిల్ నియమించుకుందని తెలుస్తోంది. ఇవీ ప్రత్యేకతలు.. – యాపిల్‌కు ముంబైలో రెండు, పుణే, ఢిల్లీ, బెంగళూరు, నోయిడాలలో ఒక్కో అధికారిక స్టోర్ (ఎక్స్పీరియన్స్ సెంటర్) ఉన్నాయి. – సాధారణ మొబైల్ షాపుల కంటే భిన్నంగా వినియోగదారులకు సరికొత్త గ్లోబల్ షాపింగ్ అనుభవాన్ని ఇవి అందిస్తాయి. ప్రతి స్టోర్ డిజైన్ అక్కడి నగర ప్రత్యేకతను ప్రతిబింబిస్తుంది. – ఐఫోన్స్, ఐప్యాడ్స్, మ్యాక్‌బుక్స్, యాపిల్ వాచెస్, ఎయిర్‌పాడ్స్ వంటి అన్ని లేటెస్ట్ యాపిల్ ఉత్పత్తుల పనితీరును కస్టమర్లు స్వయంగా తెలుసుకోవచ్చు. – యాపిల్ స్టోర్లలో సంప్రదాయ బిల్లింగ్ కౌంటర్లు, క్యూలు ఉండవు. సిబ్బంది దగ్గరే హ్యాండ్‌హెల్డ్ డివైస్‌లు ఉంటాయి. కస్టమర్ వద్దకే వచ్చి వారు అక్కడికక్కడే బిల్లింగ్ పూర్తి చేస్తారు. – కస్టమర్ల కోసం ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, మ్యూజిక్ క్రియేషన్, కోడింగ్, ఆర్ట్ వంటి అంశాలపై యాపిల్ నిపుణులు ఉచితంగా శిక్షణ ఇస్తారు. – యాపిల్ పరికరాల్లో సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సమస్యలు వస్తే పరిష్కరించడానికి జీనియస్ బార్ టెక్నికల్ సపోర్ట్ డెస్క్ ఉంటుంది. డివైస్ సెటప్, యాపిల్ ఐడీ రికవరీ, బ్యాకప్ వంటి సహాయాన్ని నిపుణులు అందిస్తారు. – స్టోర్లలోని ఉద్యోగులు వివిధ రాష్ట్రాలకు చెందినవారై ఉంటారు. వారు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సహా 15కుపైగా భాషల్లో కస్టమర్లతో మాట్లాడి సహాయం అందిస్తారు. – వినియోగదారులు తమకు నచ్చిన ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో ఆన్లైన్లో డివైస్‌లు ఆర్డర్ చేసి ఎక్స్పీరియన్స్ సెంటర్ నుంచి వాటిని కలెక్ట్ చేసుకోవచ్చు. – పాత ఐఫోన్, ఇతర బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను ఎక్ఛ్సేజ్ చేసుకొని కొత్త యాపిల్ ఉత్పత్తులను డిస్కౌంట్‌పై పొందొచ్చు. -
సంక్షేమ చిట్టా.. ఒకేచోట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పౌరులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండే విధంగా ‘సమగ్ర సంక్షేమ కార్డు’(యూనిఫైడ్ కార్డ్)ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎవరికి, ఏయే ప్రభుత్వ శాఖల ద్వారా ఏయే సంక్షేమ పథకాల కింద ఎంత మేర లబ్ధి చేకూరుతోందో స్పష్టంగా తెలిసేలా ఈ కార్డు ఉండాలని సూచించారు. తక్షణమే ఇందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని, అన్ని ప్రభుత్వ శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి గురువారం ఆయ న సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తదితరులతో సమీక్ష నిర్వహించారు. అర్హులకు పథకాలు..అనర్హుల గుర్తింపు సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. అసలైన అర్హులకు పథకాలు మరింత కచ్చితంగా చేరతాయని అన్నారు. అదే సమయంలో అనర్హులను గుర్తించడం కూడా సులభమవుతుందన్నారు. ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే బదులు, ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒకే సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని సీఎం సూచించారు. సాంకేతికతపై పట్టున్న, చురుగ్గా పనిచేసే యువ ప్రభుత్వ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని ఆదేశించారు. కార్డుకు ఆధార్ తరహా ప్రత్యేక నంబర్ ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రీయింబర్స్మెంట్, కార్మిక శాఖ, విద్యా శాఖ, ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం తీసుకువస్తున్న బీమా తదితర పథకాల వివరాలు ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్డుకు అవసరమైతే ఆధార్ నంబర్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఇచ్చే అంశంపైనా ఆలోచన చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను ఈ కార్డుకు అనుసంధానించాలని సూచించారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా లింక్ చేయాలన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా కార్డు ఉండాలని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు సేకరించండి వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను సీఎం ఆదేశించారు. ఇందులో ప్రధానంగా ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలన్నారు. ఎక్కడైనా మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయితే, అక్కడి నుంచి ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్కు చేరాలని, దాని ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోగలగాలని చెప్పారు. కేరళ గల్ఫ్ విధానాలపై అధ్యయనం కేరళ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు, పాస్‌పోర్ట్‌లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే, అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని చెప్పారు. -
‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి’
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంతో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి జరుగుతుందని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈశాన్య రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాల కు కనెక్టివిటీ నీ కేంద్ర ప్రభుత్వం పెంచిందని తద్వారా ఈశాన్య రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలకు మరింతగా సాంస్కృతికంగా చేరువయ్యాయని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్-యువ సంగమ్ ఫేజ్-6’ కార్యక్రమంలో భాగంగా మేఘాలయ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) షిల్లాంగ్‌కు చెందిన 50 మంది విద్యార్థులు గురువారం లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. దేశంలోని విభిన్న రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానాల పరస్పర అవగాహన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.యువత దేశ సమైక్యత, జాతీయ సమగ్రత బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అభివృద్ధి విశేషాలను విద్యార్థులకు అధికారులు వివరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్, ఎన్ఐటీ వరంగల్‌కు చెందిన ప్రొఫెసర్ కిరణ్ కుమార్, సునీల్ కుమార్, ప్రొఫెసర్ పెరుగు శ్యామ్ (కో-నోడల్ ఆఫీసర్), ప్రొఫెసర్ హరిప్రసాద్ రెడ్డి (నోడల్ ఆఫీసర్) పాల్గొన్నారు.గవర్నర్‌ను కలిసిన ఎన్ఎస్జీ గ్రూప్ కమాండర్నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), ముంబై 28 స్పెషల్ కాంపోజిట్ గ్రూప్ (ఎస్సీజీ) గ్రూప్ కమాండర్ కల్నల్ అభిషేక్ సింగ్ గురువారం లోక్ భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. -
ప్రపంచానికే తలమానికంగా ‘ఫ్యూచర్ సిటీ’
హైదరాబాద్ : ప్రపంచానికే తలమానికంగా ఉండేలా “ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, డి .శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం నాడు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రతిష్టాత్మక “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ… గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టును ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా వేగంగా ముందుకు సాగుతోందన్నారు.ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ ప్రారంభోత్సవాన్నికి సంబంధించిన తేదీల పై గౌరవ ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.ఫ్యూచర్ సిటీలో తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం వేస్తున్న పునాదులు రాబోయే తరాలకు ఆధునిక తెలంగాణ నిర్మాణానికి నాంది పలుకుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, గ్లోబల్ ప్రెజెన్స్ కలిగిన అనేక ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ” ఏర్పాటు చేసినట్లు తెలిపారు.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎదురైన అనేక సవాళ్లను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణకే కాకుండా దేశానికే తలమానికంగా నిలిచే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటోందని, ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ప్రపంచంలోని అనేక దేశాలు, రాష్ట్రాలు సైతం ఆలోచించని విధంగా తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్‌లో కొనసాగుతున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పనుల పురోగతిని సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుని నిర్మాణాన్ని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.అనంతరం మంత్రులు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కె. శశాంక, ఐఏఎస్, మహేశ్వరం డీసీపీకె. నారాయణ రెడ్డి, ఐపీఎస్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
Hyd: టీజీఐఐసీ భూముల వేలానికి రికార్డు ధర
హైదరాబాద్: టీజీఐఐసీ(Telangana Industrial Infrastructure Corporation) తాజాగా నిర్వహించిన భూముల వేలంలో రికార్డు ధర పలికింది. రంగారెడ్డి శేరిలింగపల్లి మండలంలోని రాయదుర్గంలో టీజీఐఐసీ భూముల వేలం నిర్వహించగా, వాటికి రికార్డు ధర పలికింది. సర్వే నంబర్ 83/1 లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి ఈ-వేల నిర్వహించింది టీజీఐఐసీ. ఈ-వేలంలో ఎకరం భూమి ధర రూ. 237 కోట్లు పలికింది. గతేడాది ఇక్కడ ఎకరం భూమి ధర రూ.177 కోట్లు పలకగా, ఈ ఏడాది మరింత పెరిగి ఎకరం రూ. 237 కోట్లు పలకడం విశేషం. మొత్తం 6 ఎకరాల 9 గుంటలు రూ. 1490.73 కోట్లు పలికింది. దీన్ని గౌర వెంచర్స్ దక్కించుకుంది.గతేడాది ఎకరం రూ. 177 కోట్లకు ఎంఎస్ఎన్ రియాల్టీ దక్కించుకోగా, ఈసారి గౌర వెంచర్స్ ఎకరం భూమిని రూ. 237 కోట్లకు దక్కించుకుంది. జూన్ 1వ తేదీన మరో 5.09 ఎకరాలకు టీజీఐఐసీ వేలం వేయనుంది. -
తీవ్ర వడగాల్పులు.. తెలంగాణ ప్రజలకు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తూర్పు, ఉత్తర తెలంగాణకు వడగాల్పుల హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. వచ్చే రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వడదెబ్బతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 19 మంది మృతిచెందారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలకు తాజా వాతావరణం ఊరటనిచ్చింది. చాలాచోట్ల సాధారణంకంటే 2 నుంచి 6 డిగ్రీల మేర తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. గురువారం ఉత్తర, తూర్పు జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బుధవారం తూర్పు జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిశాయి. గురు, శుక్రవారాల్లో కూడా తూర్పు, ఉత్తర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర బిహార్ పరిసర ప్రాంతాల నుంచి జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా దక్షిణ తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 21.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కాగా, ఏపీలో రాగల మూడు గంటల్లో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గంటకు 40 నుండి 50 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు . ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విజ్ఞప్తి చేశారు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ నగదు పట్టివేత
సికింద్రాబాద్: ముంబై నుండి సికింద్రాబాద్‌కు హవాలా సొమ్ము తరలిస్తున్న ఒక వ్యక్తిని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.1.22 కోట్ల డబ్బును స్వా«దీనం చేసుకున్నారు. రైలు ప్రయాణంలో పట్టుబడిన హవాలా డబ్బు వివరాలను బుధవారం జీఆర్పీ డీఎస్పీ ఎస్ఎన్ జావెద్ వెల్లడించారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయీశ్వర్‌గౌడ్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు నరసింహారావు, సంజీవరావుల నేతృత్వంలో బొల్లారం–మల్కాజిగిరి స్టేషన్ల మధ్య తనిఖీలు నిర్వహిస్తుండగా దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలులో అనుమానాస్పదంగా లగేజ్ బ్యాగ్‌తో ఉన్న వ్యక్తి పట్టుబడ్డాడు. మహారాష్ట్ర అమరావతి జిల్లాకు చెందిన విజయ్ అంబదాస్ గుప్తా (40) గా గుర్తించిన అతని నుంచి పెద్దమొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని కాంతా జ్యువెలరీ యజమాని సంతోష్ సేథ్ నుంచి రూ.1.22 కోట్ల డబ్బు తీసుకొని సికింద్రాబాద్‌కు వస్తున్నట్టు అంబదాస్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. మోండా మార్కెట్లోని బంటీ అనే వ్యాపారికి ఈ డబ్బు బ్యాగును అప్పగించేందుకు వస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇందుకు ప్రతిఫలంగా తనకు రూ. 5,000 కమీషన్ ఇచ్చినట్టు చెప్పాడు. పట్టుబడిన డబ్బు హవాలాకు చెందినదిగా గుర్తించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఇన్‌కంటాక్స్ అధికారులకు బదిలీ చేశారు. -
బక్రీద్ సందడి.. పొట్టేళ్లతో యువతుల సెల్ఫీ
బక్రీద్ నేపథ్యంలో పాతబస్తీలో బుధవారం పొట్టేళ్లకు మేత తినిపిస్తూ యువతుల సెల్ఫీ.. -
125 కిలోల పొట్టేలు
హైదరాబాద్: బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని వారాసిగూడకి చెందిన లడ్డూ భాయ్ జమ్ము కశ్మీర్ నుంచి రెండున్నర సంవత్సరాల వయసున్న 125 కిలోల పొట్టేలును ప్రత్యేకంగా నగరానికి తెప్పించారు. నాలుగు అడుగుల ఎత్తు పైనే ఉన్న ఈ పొట్టేలు అందరినీ ఆకర్షిస్తోంది. -
మంచుకొండల మధ్యే మహాప్రస్థానం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని జయించిన ఆనందం.. చివరకు అదే మంచు పర్వతాల్లో శాశ్వత నిద్రగా మారింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ(53) మృతదేహాన్ని ఎవరెస్ట్‌పైనే వదిలేయాలని ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. “ఆయన ఇప్పుడు సాక్షాత్తూ పరమశివుడి చెంతనే ఉన్నారు” అంటూ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురవుతున్నారు.గత వారం ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన అరుణ్ కుమార్.. తిరుగు ప్రయాణంలో ‘హిల్లరీ స్టెప్’ సమీపంలో తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. ఆ సమయంలో ఆయనతో పాటు నలుగురు షెర్పాలు ఉన్నట్లు నేపాల్‌కు చెందిన యాత్ర నిర్వాహక సంస్థ ‘పయనీర్ అడ్వెంచర్స్’ తెలిపింది. అయితే 8 వేల మీటర్ల ఎత్తుకు పైబడిన ‘డెత్ జోన్’లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో మృతదేహాన్ని కిందకు తీసుకురావడం దాదాపు అసాధ్యమని నిపుణులు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే అరుణ్ కుటుంబ సభ్యులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. “ఎవరెస్ట్ అంటే పరమశివుడి నివాసమైన కైలాసమే. ఆయన అక్కడే శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాలని భావించాం. అంత ఎత్తు నుంచి మృతదేహాన్ని తీసుకురావడం కూడా చాలా ప్రమాదకరం. తీసుకొచ్చేసరికి దేహం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది” అని అరుణ్ బావ సుధీర్ ఉపాధ్యాయ మీడియాకు తెలిపారు.అరుణ్ కుమార్ తివారీ కేవలం ఐటీ ప్రొఫెషనల్ మాత్రమే కాదు.. అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడు కూడా. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో సీనియర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన.. ఇప్పటికే మౌంట్ ఎల్బ్రస్, డెనాలి, అకోన్కాగ్వా వంటి పర్వతాలను అధిరోహించారు. 2025లో ఒకసారి ఎవరెస్ట్ యాత్రకు వెళ్లినప్పటికీ ఆరోగ్య సమస్యల కారణంగా 7,200 మీటర్ల వద్ద నుంచి వెనుదిరిగారు. అయితే ఈసారి తన కలను నెరవేర్చుకుని శిఖరాన్ని జయించారు. కానీ తిరుగు ప్రయాణమే ఆయనకు చివరి మజిలీగా మారింది.అరుణ్ కుటుంబంలో భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆవేదనలో మునిగిపోయినా.. ఆయనకు ఇష్టమైన హిమాలయాల్లోనే శాశ్వత విశ్రాంతి కలగాలని నిర్ణయించడం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.ఇదే ఎవరెస్ట్ యాత్రలో మరో తెలుగు వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురానికి చెందిన, అమెరికాలో స్థిరపడిన ఐటీ ప్రొఫెషనల్ సందీప్ అరే(46) మే 20న ఎవరెస్ట్ అధిరోహించి, మరుసటి రోజే తీవ్ర అలసట, స్నో బ్లైండ్‌నెస్‌తో మరణించారు. ఆయన మృతదేహాన్ని షెర్పాలు కిందకు తీసుకురాగా.. బెంగళూరులో అంత్యక్రియలు నిర్వహించారు.👉ఎవరెస్ట్‌లోని ‘డెత్ జోన్’లో మృతదేహాలను తరలించడం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్లలో ఒకటిగా భావిస్తారు. ఆక్సిజన్ కొరత, గడ్డకట్టే చలి, మంచు తుఫానులు, హిమపాతాల ముప్పు మధ్య రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఒక్క మృతదేహాన్ని కిందకు తీసుకురావాలంటే ఎనిమిది నుంచి పన్నెండు మంది అనుభవజ్ఞులైన షెర్పాలు, ప్రత్యేక పరికరాలు, అదనపు ఆక్సిజన్ సిలిండర్లు అవసరం అవుతాయి. ఈ ప్రక్రియకు రోజుల సమయం పట్టడంతో పాటు కోట్ల రూపాయల వ్యయం కూడా అవుతుంది.అందుకే చాలా కుటుంబాలు.. మరిన్ని ప్రాణాలకు ప్రమాదం కలిగించకుండా తమవారిని ఎవరెస్ట్‌పైనే వదిలేయాలని నిర్ణయిస్తుంటాయి. ఇప్పుడు అరుణ్ కుమార్ తివారీ కుటుంబం కూడా అదే మార్గాన్ని ఎంచుకుంది. అలా మంచు పర్వతాల్లో మొదలైన ఆయన సాహస యాత్ర.. చివరకు శివయ్య చెంతనే శాశ్వత విశ్రాంతిగా ముగిసింది. -
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఝలక్!
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీలో కార్మిక సంఘాలు, గుర్తింపు సంఘం ఎన్నికలు, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం.. ఈ రెండు అంశాలపై ప్రణాళికాబద్ధంగా కార్మిక సంఘాలే చర్చించుకుని నిర్ణయం వెల్లడించాలి’.. మేడే రోజున ఆర్టీసీ కార్మిక సంఘాలతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి వారికి సూచించిన మాట ఇది.‘మాకు యూనియన్ ఎన్నికలు అవసరం లేదు, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనమే ముఖ్యం, ఆ మేరకే ఆమోద లేఖ సమర్పించాలి’ అని కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్ చేయటంతో కార్మిక సంఘాల నేతలు ముందు విలీన ప్రక్రియే జరపాలని, జూన్ రెండు రాష్ట్రావతరణ దినోత్సవం రోజున అపాయింటెండ్ డేట్‌ను ప్రకటించాలని పేర్కొంటూ యూనియన్ల వారీగా ప్రభుత్వానికి లేఖలు సమర్పించారు. దీంతో జూన్ రెండున అపాయింటెడ్ డేట్‌పై ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని వెయ్యి కళ్లతో కార్మికులు ఎదురు చూస్తున్నారు.అయితే, బుధవారం కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, త్వరలో ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆ తర్వాతనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఉంటుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి చేసిన సూచనల ప్రకారం తాము వెల్లడించిన అభిప్రాయానికి ఇది విరుద్ధంగా ఉండటంతో కార్మికులు కంగు తినాల్సి వచ్చింది. మొదట గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించి, ఎన్నికైన సంఘం ప్రతినిధులను.. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ విధివిధానాలు రూపొందించేందుకు సిఫారసు చేసే అధ్యయన కమిటీలో అధికారులతోపాటు నియమించనున్నట్టు మంత్రి వెల్లడించారు. నేతల ఒత్తిడితోనే? ముఖ్యమంత్రి సూచించటంతో, కార్మికుల ఆకాంక్షల మేరకు కార్మిక సంఘాల నేతలు విలీనమే కావాలంటూ ప్రభుత్వానికి లేఖలు సమర్పించారు. కానీ, లోపాయికారిగా మాత్రం యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని పలువురు నేతలు గట్టిగా ప్రయత్నించారు. యూనియన్లు లేకుంటే ప్రభుత్వం కార్మికులను పట్టించుకోదని, యూనియన్లు ఉండాల్సిందేనని కొందరు నేతలు మాట్లాడిన ఆడియో రికార్డులు ఆ సమయంలో వైరల్ అయ్యాయి. దీంతో యూనియన్లు కాదు, విలీనం కోసమే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కార్మికులు సంఘాలకతీతంగా నేతలను డిమాండ్ చేశారు. కానీ, చివరకు కొందరు నేతల ఒత్తిడే ఫలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటనను యూనియన్ల నేతలు ఖండించారు. -
తండ్రి మరణాన్ని తట్టుకోలేక..
రంగారెడ్డి జిల్లా: బంధాలు, అనుబంధాలే కరువైపోతున్న ఈ రోజుల్లో తండ్రి మీద ఆ కుమా రు డు పెంచుకున్న మమకారం ఏకంగా ప్రాణాలనే తీసుకునేలా చేసింది. కుమారుడిని అలా చూసిన తల్లి కూడా తనువు చాలించింది. ఈ విషాద ఘట న రంగారెడ్డి జిల్లా లష్కర్‌గూడ పంచాయతీ కనకదుర్గానగర్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన పసుల కళాధర్, కళావతి దంపతులు తమ కుమారుడు శివకుమార్‌తో కలిసి మేడ్చల్‌లో ఉండేవారు. భార్యాభర్తలిద్దరూ టైలరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తు న్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన కళాధర్ ఆరు నెలల క్రితం మృతిచెందారు. దీంతో శివకుమార్‌ను తీసుకుని కళావతి లష్కర్‌గూడలో ఉంటున్న తన సోదరుడి వద్దకు వచ్చారు. ఇక్కడే ఓ అద్దె ఇంట్లో ఉంటూ కాలం గడుపుతున్నారు. అ యితే, తండ్రి మరణం శివకుమార్(20)కు మాన సికంగా కుంగదీసింది.తండ్రితో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నిత్యం తల్లడిల్లేవాడు. ఈ క్ర మంలో తీవ్ర మనోవేదనతో బుధవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. కొద్దిసేపటి తర్వాత తల్లి కళావతి(45) కొడుకు చనిపోయి ఉండటాన్ని గమనించారు. ఆరునెలల క్రితం భర్త చనిపోవడం, ఇప్పుడు కొడుకు ఆత్మహ త్య చేసుకోవడం చూసి తట్టుకోలేకపోయారు. వా రిద్దరూ లేని జీవితం ఎందుకు అనుకున్నారేమో.. ఆమె కూడా చీరతో ఉరి వేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. -
అప్పులుంటే.. చంపేస్తావా!
తెలిసీ తెలియని వయస్సులో ఈ చేతులే కదా మాకు గోరు ముద్దలు తినిపించాయి.. ఈ చేతులే కదా మమ్మల్ని ఆడించాయి.. ఈ చేతులే కదా మాకు నడక నేర్పించాయి.. అలాంటి ఈ చేతులతోనే మమ్మల్ని కాటికి సాగనంపుతున్నావా నాన్న అంటూ ఆ చిన్నారుల మూగరోదన ఆ తండ్రికి వినిపించలేదు.. అల్లారు ముద్దుగా పెంచి.. అడిగినవన్నీ అరచేతిలో పెట్టి.. మమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన నువ్వే.. ఏమాత్రం కనికరం లేకుండా.. కాళ్లు, చేతులు కట్టేసి.. కాటికి సాగే నంపే తరుణంలో నీ గుండె ఎంత బండలా మారింది నాన్నా.. అన్న ఆ పసిహృదయాల మౌనవేదన ఆ తండ్రికి కనిపించలేదు. ..కేవలం తాను చేసిన అప్పులకు తన భార్యాపిల్లలు ఎక్కడ బలవుతారో అన్న చిన్న కారణంతో.. ఎన్నో విజయాలు అందుకొని.. నిండు నూరేళ్లు జీవించాల్సిన మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు ఓ తండ్రి. ఇంటి నిర్మాణం, వ్యవసాయంలో నష్టాలు.. వెరసీ అప్పులపాలైన ఓ కౌలు రైతు.. తన కుటుంబాన్ని తానే చిదిమేసుకు న్న విషాదకర సంఘటన తీవ్రంగా కలచివేసింది. వనపర్తి: జీవనోపాధి కోసం మామిడితోటలు లీజుకు తీసుకుని మామిడి పండ్లు విక్రయిస్తూ.. మిగతా సమయంలో తోటల సంరక్షణ చేసుకుంటూ జీవించే ఓ కుటుంబం సరైన లాభాలు లేక.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ కుటుంబ పెద్ద తన భార్య, ఇద్దరు పిల్లలను నీటిలో సంపులో పడేసి ప్రాణాలు తీసి.. తానూ ఉరేసుకున్న ఉదంతం ఉమ్మడి పాలమూరు జిలాల్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరు గ్రామానికి చెందిన నర్సింహులు(40) నాలుగేళ్ల క్రితం ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం శివారులో సుమారు 50 ఎకరాల మామిడి తోటను లీజు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో తోటల లీజు, ఇతర అవసరాల కోసం గద్వాలలో కొందరితో అప్పు చేశాడు. డోకూరులోని తన సొంత ఇంటిపై ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ.లక్షల్లో అప్పు చేశాడు. ఇటీవల ఈఎంఐలు సక్రమంగా చెల్లించడం లేదని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు ఇంటి గోడలపై ఈ ఇంటిని అప్పుకింద జప్తు చేయనున్నట్లు రాయడంతో గ్రామంలో తోటివారు, బంధువులు, సన్నిహితుల ఎదుట అవమానంగా భావించాడు. ఐపీ పెట్టే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న వాహనాలు, వస్తువులను అమ్మేసి అప్పులు తీర్చే ప్రయత్నం చేశాడు. అయినా.. వడ్డీలు వసూలు చేసేవారు, ఈఎంఐలు చెల్లించాల్సిన ఫైనాన్స్ కంపెనీల నుంచి ఒత్తిడి తగ్గలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే భార్య ఎల్లమ్మ(36), కుమారుడు నిహాల్(15), కూతురు సాహితీశ్రీ(13)ల కాళ్లు, చేతులు కట్టేసి తోటలోని సంపులోకి తోసి తాను నివాసం ఉండే కంటైనర్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరిశీలించిన డీఎస్పీ గిరిబాబు విషయం తెలుసుకున్న వనపర్తి డీఎస్పీ గిరిబాబు ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం గ్రామ శివారులోని మామిడి తోటకు వెళ్లి ఘటనా స్థలా న్ని పరిశీలించారు. మృతదేహాలను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.గొల్లుమన్న కుటుంబం.. తల్లిదండ్రుల చాటున నిండునూరేళ్లు జీవించాల్సిన చిన్నారులు.. ఊహించని విధంగా కన్న తండ్రే.. కాలయముడై కాళ్లు చేతులు కట్టేసి నీటి సంపులోకి తోసి ప్రాణాలు తీయడం కలకలం రేపింది. తోటలో ఆడుతూ... పాడుతూ.. సరదాగా తిరిగే చిన్నారులు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి మామిడి తోట చుట్టుపక్కల రైతులు, కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం నర్సింహులు స్వగ్రామం డోకూరుకు తీసుకెళ్లారు. -
మళ్లీ మాకే.. ఎవరిని తప్పించాలి?
సాక్షి, హైదరాబాద్: కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి తీవ్రమవుతోంది. వచ్చే జూలై 7వ తేదీతో రెండేళ్ల పదవీ కాలం ముగియనున్న 37 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు మళ్లీ తమకే కావాలంటూ ప్రస్తుత చైర్మన్లు భారీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో సహా వీలైన అన్ని మార్గాల్లో.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ ఇన్చార్జి మీనాక్షిలపై ఒత్తిడి చేయిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొందరు ఓ అడుగు ముందుకు వేసి ఢిల్లీ నుంచి కూడా సీఎం, పీసీసీ చీఫ్‌లకు చెప్పిస్తున్నారని సమాచారం. దీంతో ఈసారి కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక అంత ఈజీ కాదనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఎవరిని కొనసాగించాలి.. ఎవరిని తప్పించాలి? అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు ఎన్నికల కంటే ముందు మొత్తం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. వీరంతా గత రెండేళ్లుగా ఈ పదవుల్లో కొనసాగుతున్నారు. ఈ ఏడాది జూలై 7వ తేదీతో వీరి పదవీకాలం ముగియనుంది. దీంతో మిగిలిన కార్పొరేషన్లు కూడా కలిపి మొత్తం 50 మంది వరకు చైర్మన్లను నియమించాలనే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఇటీవల కుల కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లతో పాటు మహిళా కమిషన్ నియామకం సందర్భంగా సీఎం, పీసీసీ చీఫ్, రాష్ట్ర ఇన్చార్జీల మధ్య ఈ నియామకాలకు సంబంధించిన చర్చ కూడా జరిగింది.కీలక కార్పొరేషన్లకు కొత్తగా ఎమ్మెల్యేలను చైర్మన్లుగా నియమించే అంశం ఇప్పటికే హైకమాండ్ పరిధిలో ఉన్న నేపథ్యంలో మిగిలిన కార్పొరేషన్లకు నూతన సారథులను నియమించడంతో పాటు ప్రస్తుతమున్న వారిని కొనసాగించాలా వద్దా అన్న దానిపై ఈ చర్చ జరిగినట్టు సమాచారం. కొత్త చైర్మన్ పదవుల విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోయినా, పాత వారిని కొనసాగించే విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని, ఎవరిని కొనసాగించాలి, ఎవరిని తప్పించాలనే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని ముగ్గురు నేతలు అభిప్రాయపడినట్టు గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. రెన్యువల్ వద్దనుకున్నా.. వాస్తవానికి మొదటి దఫాలో నియమితులైన వారిలో ఎవరినీ మళ్లీ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించవద్దని సీఎం రేవంత్ గతంలోనే నిర్ణయించారు. ఒకరిని కొనసాగించి మరొకరిని తప్పిస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయని, కొత్తగా ఎక్కువమందికి అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ కోసం కష్టపడిన వారందరికీ న్యాయం చేసినట్టవుతుందనే ఆలోచనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. అయితే పదవుల రెన్యువల్ విషయంలో ఒత్తిడి తీవ్రం కావడంతో కనీసం ఐదారుగురిని అయినా కొనసాగించాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. ఎవరిని కొనసాగించాలనే విషయంలో కూడా తనకు స్పష్టత ఉందని ఆయన తన సన్నిహితుల వద్ద చెపుతున్నట్టు సమాచారం. తమ పదవులు రెన్యువల్ చేయాలని చైర్మన్లు అడిగిన సందర్భంలో ఎవరెలా పనిచేశారో తన వద్ద నివేదికలున్నాయని ఆయన చెబుతుండటం గమనార్హం.10 మంది లోపే ఫస్ట్ క్లాస్! మొత్తం 37 మందిని నియమిస్తే వారి పనితీరును బట్టి 10 మంది లోపే ఫస్ట్ క్లాస్ (60 శాతం) మార్కులు తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాత వారిలో ఎంత మందిని కొనసాగించాలి, కొత్తగా ఎవరిని నియమించాలన్న దానిపై జూన్ రెండో వారంలో మరోమారు భేటీ జరుగుతుందని, ఎమ్మెల్యేలకు ఇచ్చే పదవుల విషయంలో హైకమాండ్ నుంచి గ్రీన్‌సిగ్నల్ తీసుకున్న తర్వాత జూన్ 25 తర్వాత కొత్త నియామక ఉత్తర్వులు ఇచ్చే అవకాశముందని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. -
కమలంలో కాంగ్రెస్ కోవర్టులు?
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ కోవర్టులున్నారనే ఆరోపణలు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డితో బీజేపీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు అంతర్గతంగా అంటకాగుతున్నారని, సన్నిహితంగా మెలుగుతున్నారనే చర్చ కమల దళంలో కాక పుట్టిస్తోంది. కొందరు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలు, నియోజకవర్గ స్థాయిల్లో ఎక్కడికక్కడ సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతున్నట్టుగా పార్టీ నాయకత్వానికి సమాచారం అందినట్టు తెలుస్తోంది. మరోవైపు మరికొందరు పార్టీ నేతలు, వివిధ స్థాయిల నాయకులు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో సర్దుబాటు చేసుకున్నారనే ఆరోపణలూ గట్టిగానే వినిపిస్తుండటంతో బీజేపీ అధినాయకత్వం కూడా అప్రమత్తమైందని, పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగినట్టు సమాచారం. క్లాస్ పీకిన పాటిల్ ఇటీవల రాష్ట్ర బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం సందర్భంగా...తెలంగాణ ఇన్చార్జి అభయ్ పాటిల్ కొందరు నేతలను ముఖాముఖి ప్రశ్నించి పద్థతి మార్చుకోవాలని హెచ్చరికలు జారీచేయడం చర్చనీయాంశమయ్యింది. కొందరు ప్రజాప్రతినిధులు అవసరం ఉన్నా, లేకపోయినా సీఎంను కలుసుకోవడం ఆయనతో వేదికలు పంచుకోవడం, తమ నియోజకవర్గానికి చెందిన కార్యక్రమం కాకపోయినా పాల్గొని సీఎంకు స్వాగతాలు పలకడంపై వంటి వాటిపై అంతర్గతంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తమ నియోజకవర్గంలోని సమస్యలు, ఇతర అంశాలపై సీఎంను కలుసుకోవడంలో తప్పేమీ లేదని, అయితే సీఎం మీటింగ్‌లకు వెళుతూ, సంబంధం లేని చోట వేదికలు పంచుకుంటే కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయంటూ గట్టిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతల వ్యవహారశైలిని పాటిల్ నిలదీసినట్టు పార్టీ వర్గాల సమాచారం. కాగా కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కు, మిలాఖత్లపై తమ వద్ద ఆధారాలున్నాయనే విధంగా పాటిల్ ద్వారా అగ్రనేతలు సంకేతాలిచ్చారని అంటున్నారు. మున్సిపోల్స్‌లో పెద్దెత్తున మిలాఖత్.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అనేక జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు అధికచోట్ల, బీఆర్ఎస్ విజయానికి కొన్నిచోట్ల బీజేపీ నాయకులు పూర్తిస్థాయిలో సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆర్థికపరమైన లావాదేవీలు కూడా జరిగాయని, ఇటు ఎన్నికల కోసం ఇచ్చిన పార్టీ ఫండ్‌ను ఎదుటిపార్టీ ఇచ్చిన డబ్బును కొన్ని జిల్లాల్లో కొందరు పార్టీ నేతలు జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలు కూడా పెద్దెత్తున వచ్చాయి. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు ఎక్కువగా లేని మెదక్, మంచిర్యాల, వరంగల్, రామగుండం, వికారాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, జనగామ తదితర జిల్లాల్లో బహిరంగంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బీజేపీ నాయకులు సహకరించినట్టు అప్పట్లో విమర్శలు వినిపించాయి. కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థులకు కొన్నిచోట్ల అతి తక్కువ ఓట్లు (కొన్నిచోట్ల సున్న) రావడానికి నాయకుల తీరు, రాజకీయ ప్రత్యర్థులతో కుమ్మక్కు కావడమే కారణమని కూడా పార్టీ నిర్థారించింది. ఈ వ్యవహారంపై ఆయా జిల్లాల్లోని పార్టీ నాయకులు జాతీయ, రాష్ట్ర నాయకత్వాలకు లిఖితపూర్వక ఫిర్యాదులు కూడా చేసినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌కు లోపాయికారీగా సహకరించిన తీరుపై రాష్ట్ర నాయకత్వాన్ని జాతీయ నాయకత్వం నిలదీసి పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మళ్లీ ఆ ముద్ర పడకుండా .. బీఆర్ఎస్–బీజేపీ కుమ్మక్కు అయ్యాయని కాంగ్రెస్..కాంగ్రెస్–బీజేపీల మధ్య అవగాహన ఉందని బీఅర్ఎస్.. తరచుగా ఆరోపణా్రస్తాలు సంధించుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి ఆరోపణల వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి రాజకీయంగా తీరని నష్టం జరిగిందని భావిస్తున్న జాతీయ నాయకత్వం..ఈసారి అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ముందు నుంచే జాగ్రత్త పడాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. మరో రెండున్నరేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో పార్టీపై అలాంటి ముద్ర ఏదీ లేకుండా క్లీన్‌గా వెళ్లేందుకు అవసరమైన కార్యాచరణను ఇప్పటినుంచే సిద్ధం చేసే దిశలో చర్యలు చేపడుతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ పూర్తి బలం పుంజుకుని, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందనే వాతావరణం నెలకొనగానే..పార్టీపై ఆరోపణలు, ఇతర రూపాల్లో ఎప్పటికప్పుడు ఏదో ఒకపెద్ద అవాంతరం ఎదురై చతికిలపడాల్సి వస్తోందని అధినాయకత్వం భావిస్తోందని సమాచారం. ప్రస్తుతం పార్టీ నేతలు కొందరు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటున్నారా? కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారా? అనే అనుమానాల నేపథ్యంలో.. మరోసారి గతంలో మాదిరి పరిస్థితి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా ‘కోవర్ట్’ల అంశంపైనా నాయకత్వం గట్టిగా దృష్టి కేంద్రీకరించిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. -
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వద్దు
పంజగుట్ట (హైదరాబాద్): ఏపీలో ప్రొ.నాగేశ్వర్‌పై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని వక్తలు డిమాండ్ చేశారు. లేకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వద్దని చెప్పారు. తెలంగాణ క్రాంతిదళ్ ఆధ్వర్యంలో క్రాంతిదళ్ వ్యవస్థాపకుడు డాక్టర్ పృథ్విరాజ్ యాదవ్ అధ్యక్షతన ‘తెలంగాణ గొంతులపై ఆంధ్ర ఇనుప బూట్లు ఇంకెంతకాలం’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రొ.నాగేశ్వర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో తనపై పెట్టిన కేసులు చూస్తే నవ్వొస్తుందన్నారు. ‘నేను కుల చిచ్చుపెట్టానట.. ప్రాంతం గురించి మాట్లాడానట.. అల్లర్లు సృష్టించేందుకు పనిచేశానట.. ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేశానట.. ఆ కేసులు చూస్తుంటే నవ్వొస్తుంది’ అని అన్నారు. తెలంగాణ వారు ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడతారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం శోచనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు విశాఖపట్నం రైల్వేజోన్ ఇచ్చినట్లే ఇచ్చి ఆదాయం వచ్చే మరో లైన్‌ను ఒడిశాకు కలిపారని, మచిలీపట్నం ఆయిల్ గ్యాస్ నిక్షేపాలను దుర్మార్గమైన వేదాంత కంపెనీకి అప్పచెప్పారన్నారు. దీనిపై ప్రశ్నించాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందని, తాను ప్రశ్నించినందుకే కేసులు పెట్టారని చెప్పారు. మీ ఆస్తులు ఇక్కడే ఉన్నాయ్... ‘పవన్ కళ్యాణ్‌కు ప్రజాస్వామ్యం, తెలంగాణ కోసం మాట్లాడే హక్కే లేదు. అసలు ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టే హక్కు కూడా లేదు. పూటకో రంగుమార్చేవాడు, చేగువేరా బొమ్మ పెట్టుకుని గద్దర్‌ను మోసం చేసిన వాడు పవన్. ఎన్టీఆర్‌ను మానసికంగా వేధించి ఆయన చావుకు కారణమైన వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు. పవన్, బాబును తెలంగాణలో అడుగు పెట్టనివ్వరాదు’ అని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు. ‘చంద్రబాబు, పవన్ జాగ్రత్త. రజాకార్లనే ఉరికించిన నేల ఇది. మీ ఆస్తులు, ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయి. మీ ఆస్తులు తగలబెట్టడం కాదు, అస్తిత్వం లేకుండా చేస్తాం. చంద్రబాబు హెరిటేజ్‌ను నేటి నుంచి తెలంగాణలో బ్యాన్ చేద్దాం’ అని పృధ్వీరాజ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చంద్రబాబును విమర్శించామని, కానీ ప్రస్తుతం వారు చేస్తున్న బూతుపురాణాల్లా ఎప్పుడూ విమర్శించలేదని పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య అన్నారు. వెంటనే నాగేశ్వర్‌పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. -
క‘న్నీటి’పాలు
సాక్షి, హైదరాబాద్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే సమయానికి ప్రకృతి మరో సారి కన్నెర్రజేసింది. మంగళవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షం రైతుల కష్టాన్ని నీటిలో కలిపేసింది. పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలకు ఆశగా తీసుకొచ్చిన ధాన్యం, మొక్కజొన్న వర్షానికి తడిసిముద్దవగా.. కొన్నిచోట్ల నీటి ప్రవాహంలో ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి. తమ పంట కళ్లముందే తడిసిపోతుండటంతో రైతులు నిస్సహాయంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి, మెదక్, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అకాల వర్షం తీవ్ర ప్రభావం చూపింది. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిల్వ ఉంచిన ధాన్యం బస్తాల్లోకి నీరు చేరడంతో రైతులు మళ్లీ వాటిని ఎండబెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల రైతులు రాత్రివేళ కుటుంబ సభ్యులతో కలిసి ధాన్యం నిల్వలు తడవకుండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంట్రాక్ట్ లారీలు సమయానికి రాకపోవడంతో ధాన్యం బస్తాలు కేంద్రాల్లోనే పేరుకుపోయాయి. వర్షం మొదలవగానే రైతులు పరుగులు తీస్తూ బస్తాలపై ప్లాస్టిక్ కవర్లు కప్పినా ప్రయోజనం లేకపోయింది. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేక రైతులు రాత్రంతా వానలోనే ధాన్యానికి కాపలా కాశారు. మొక్కజొన్న రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. వారాల తరబడి మొక్కజొన్నను కొనుగోలు చేయకుండా మార్కెట్ యార్డులు, పీఏసీఎస్లలోనే నిల్వ ఉంచుతుండటంతో... తడిసిన మొక్కజొన్న మొలకెత్తే పరిస్థితి తలెత్తింది. కొనుగోళ్లలో జాప్యం, గన్నీ సంచుల కొరత, లారీల లేమి కారణంగానే ఈ నష్టం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా అకాల వర్షంతో పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. కొనుగోళ్లలో వేగం పెంచాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అకాల వర్షానికి తడిసిన వడ్లను పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. జిల్లాల వారీగా పరిస్థితి ఇదీ... ⇒ మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోయాయి. ‘వారం రోజులుగా లారీలు వస్తాయని చెబుతున్నారు.. ఇప్పటికీ రాలేదు. ఒక్క వానతో మా కష్టం అంతా పోయింది’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నశంకరంపేట మండలంలోని శాలిపేట, సూరారం కొనుగోలు కేంద్రాల్లో కూడా రోజుల తరబడి లారీలు రాకపోవడంతో ధాన్యం ఎండకు ఎండి, వానకు తడిసే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల తడిసిన మొక్కజొన్న మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది. మెదక్, హవేలీ ఘనాపూర్, పాపన్నపేట, కుల్చారం, కౌడిపల్లి, చిలిపిచేడ్, రామాయంపేట, చేగుంట మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. నిజాంపేట మండలంలో కల్లాలు లేక రైతులు రహదారులపైనే ధాన్యం ఆరబోసుకున్నారు. వర్షం రావడంతో రోడ్లపై ఉన్న వడ్ల కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. ⇒ కామారెడ్డి జిల్లా రాజంపేట ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. సదాశివనగర్ మండలం మల్లుపేట, ఎల్లారెడ్డి పరిసరాల్లో కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిచిపోయింది. ⇒ జగిత్యాల జిల్లా ధర్మపురి మార్కెట్ యార్డులో వర్షం కారణంగా ధాన్యం, మక్కలు తడిశాయి. ⇒ పెద్దపల్లి, మంథని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వడ్ల కుప్పలు, బస్తాలు పూర్తిగా తడిచిపోయాయి. బలమైన గాలులకు టార్పాలిన్లు ఎగిరిపోవడంతో వర్షపు నీరు ధాన్యంలోకి చేరింది. ⇒ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. రాత్రివేళ రైతులు ప్లాస్టిక్ షీట్లు కప్పి కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ⇒ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో పంటలను కాపాడేందుకు వెళ్లిన నలుగురు రైతులు గోడ కూలి మృతి చెందిన ఘటన అకాల వర్షాల తీవ్రతను ప్రతిబింబిస్తోంది. ⇒ రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు, హమాలీలు, లారీలు లేకపోవడం వల్లే ధాన్యం ఎక్కువ రోజులు కేంద్రాల్లోనే నిల్వ ఉండిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అచ్చంపేట మార్కెట్‌కు వడ్లు తీసుకొచ్చి చాలా రోజులైనా కాంటా వేయలేదు. కుప్పలుగా పోసిన ధాన్యం మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి తడిసింది. నిద్రిస్తున్న సమయంలో భారీ వర్షం రావడంతో ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. కనీసం తడిసిన వడ్లను వెంటనే కొనాలి. –రషీదా, మల్లెల తీర్థం, నాగర్ కర్నూల్ జిల్లా చివరి గింజ వరకూ కొంటాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితిపై ఉత్తమ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, కలెక్టర్లు, పోలీస్, రవాణా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఇప్పటికే తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించేందుకు ఇసుక రవాణా లారీలను కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. రైతులకు ఇప్పటికే రూ.10,097 కోట్ల చెల్లింపులు జరిగాయని, దీనివల్ల 8.15 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 44.67 లక్షల మెట్రిక్ టన్నులు సాధారణ రకాలు కాగా, 12.33 లక్షల మెట్రిక్ టన్నులు సన్న ధాన్యమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపడుతున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. -
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు రేవంత్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. బ్యారేజీ ఎత్తు, నిర్మాణంపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. సమావేశానికి అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని ఫడ్నవీస్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది.’’ అని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.‘‘మొదటి ప్రతిపాదనలో 152 మీటర్ల ఎత్తున తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం. 2016లో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 148 మీటర్ల ఎత్తు ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు సరిపోదని నిపుణులు తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల సాగు, తాగునీటి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. బ్యారేజీ ఎఫ్ఆర్ఎల్ (FRL) పెంచినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం చాలా తక్కువ. ఎత్తు పెంచితే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీటిని తెచ్చుకునే వీలుంది’’ అని లేఖలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. -
గాంధీ భవన్లో రగడ.. గల్లాలు పట్టుకుని కాంగ్రెస్ నేతలు ఫైటింగ్
హైదరాబాద్: గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కలకలం చెలరేగింది. నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌ను కార్వాన్ ఇన్చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీ ఉస్మాన్ తోసేశారు. ప్రొటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగడంతో ఈ గొడవ చెలరేగింది. ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్ గల్లాలు పట్టుకున్నారు.మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సమక్షంలోనే గొడవ జరిగింది. మంత్రి అజారుద్దీన్ పక్క కూర్చునే విషయంలో గొడవ మొదలైంది. గొడవ పడుతుంటే కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీహెచ్‌ను తోసేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గొడవ ఆపాలని పొన్నం ప్రభాకర్ చెప్పినా ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ వినలేదు. గొడవ పడుతున్న వారికి అక్కడి నేతలు అడ్డుకున్నారు. గొడవ మొదలుకావడంతో సమావేశం ముగిసినట్లు ప్రకటించారు. క్షమాపణలు చెప్పాను: ఉస్మాన్ గొడవపై కార్వాన్ ఇన్చార్జి ఉస్మాన్ స్పందిస్తూ... ‘‘ఫిరోజ్ ఖాన్‌కు క్షమాపణలు చెప్పాను. ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న గొడవ. మాది కాంగ్రెస్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో గొడవకు జరుగుతూ ఉంటాయి. నేను తోసేసింది చూశారు. అంతకు ముందు జరిగింది కూడా తెలుసుకోండి’’ అని అన్నారు.అందుకే గొడవ: ఫిరోజ్ ఖాన్ గొడవపై ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘కుర్చీలో కూర్చోవడం విషయంలో ఇబ్బంది జరిగింది. చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్ల గొడవ అయింది. మంత్రి పక్కన కూర్చోవాలని అందరూ అనుకున్నారు. ఉస్మాన్ నాకు పెద్దన్న లాంటి వాడు. ఉస్మాన్ నన్ను స్టేజీపైకి రమ్మంటే నేను వెళ్లలేదు. ఉస్మాన్ అన్న నాకు ముద్దు పెట్టాడు’’ అని చెప్పారు. -
చురుగ్గా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలు, విమానాశ్రయం తరహా సదుపాయాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముస్తాబవుతోంది. చారిత్రక సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పదో నంబర్ ప్లాట్‌ఫాం వైపు 80 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. ప్రయాణికులకు కేవలం రైల్వే సదుపాయాన్ని అందజేయడంతో పాటు విభిన్న సంస్కృతులను ప్రతిబింబించే రెస్టారెంట్లు, కాఫీషాపులు ఏర్పాటు కానున్నాయి.కేఎఫ్‌సీ, మెక్‌డోనాల్డ్స్, బర్గర్‌కింగ్ వంటి షాపులు అందుబాటులోకి రానున్నాయి. దక్షిణాది ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మద్రాస్ కాఫీ హౌస్‌ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి షాపింగ్‌మాల్స్ కొలువుదీరనున్నాయి. ప్రయాణికుల బస కోసం అన్ని సదుపాయాలతో కూడిన విశ్రాంతి గదులు అందుబాటులోకి రానున్నాయి. వందకు పైగా ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలకు అందజేస్తున్న ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రీడెవలప్‌మెంట్‌లో భాగంగా 100కుపైగా ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికులతో పాటు సాధారణ వాహనదారులు సైతం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. మరోవైపు సౌరవిద్యుత్ వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నారు. 500 కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. స్టేషన్ ఉత్తరం వైపు మల్టీలెవల్ పార్కింగ్, దక్షిణం వైపు టన్నెల్ పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఒకేసారి 600 నుంచి 1000 వాహనాలను పార్కింగ్ చేసే సదుపాయం ఉంటుంది.రూ.714 కోట్లతో పునరాభివృద్ధి.. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించేందుకు 2022 సెప్టెంబర్‌లో రూ.714.73 కోట్లతో పనులు ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు సగటున 180 రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 1.5 లక్షల మంది పయనిస్తున్నారు. స్టేషన్ రీడెవలప్మెంట్ పూర్తయితే రైళ్ల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంది.చదవండి: ఆటా మహాసభలకు సీఎం రేవంత్రెడ్డిజీ ప్లస్ 3 అంతస్తులతో స్టేషన్ రూపుదిద్దుకుంటోంది. మొత్తం 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, రెండు ట్రావెలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. సికింద్రాబాద్ ఈస్ట్, వెస్ట్ మెట్రోస్టేషన్లు, రెతిఫైల్ బస్‌స్టేషన్‌తో సికింద్రాబాద్‌స్టేషన్‌ను అనుసంధానం చేసేలా స్కైవాక్‌లు అందుబాటులోకి రానున్నాయి. 64 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే డిసెంబర్ నాటికి పూర్తిగా వినియోగంలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
తెలంగాణలో ఈడీ అధికారుల దాడులు.. ఏకకాలంలో 8 చోట్ల..
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్లో ఈడీ తనిఖీలు చేస్తోంది. ఇసుక, గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో ఎనిమిది చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. జీఎస్టీ ఎగ్గొట్టి రూ.కోట్లు దారిమళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీ, ఏజెన్సీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నకిలీ ఇన్ వాయిస్‌లతో గ్రానైట్ తరలించిన కేసులో తనఖీలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ గ్రానైట్ వ్యాపారిని జీఎస్టీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జీఎస్టీ ఎగ్గొట్టేందుకు నకిలీ బిల్లులతో వంద కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ తరలించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈడీ ఎంట్రీతో మరింత దుమారం రేగుతోంది. -
హైదరాబాద్: ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ మెరుపు దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ దాడులతో ఒక్కసారిగా కలకలం రేగింది. కొండాపూర్‌తో పాటు నాగోల్, ఉప్పల్, పలు ప్రాంతాల్లో ఏసీబీ ఏకధాటిగా సోదాలు చేపట్టింది. మేడ్చల్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. కొండాపూర్ ఆర్టీవో కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.హైదరాబాద్ సెంట్రల్ పరిధిలోని నాగోల్ జగ్జీవన్ రామ్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏజెంట్ల ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఇతర వాహన రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరుగుతున్నాయనే సమాచారంతో హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి.ఆర్టీఏ ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కార్యాలయంలోని ఎంవీఐలు, ఏఎంవీఐలను సైతం ఏసీబీ అధికారులు విచారిసుత్న్నారు. అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఏజెంట్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలిస్తున్నారు. లైసెన్స్‌ల జారీ, రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. -
విజేత దివ్యారెడ్డి
సీనియర్ అథ్లెట్ దివ్యారెడ్డి బొల్లారెడ్డి తన ఖాతాలో మరో విజయం నమోదు చేసుకున్నారు. నెక్లెస్ రోడ్లో నిర్వహించిన హైదారాబాద్ సిటీ స్లామ్ 10కె సమ్మర్ రన్-2026లో 40-49 మహిళల విభాగంలో దివ్యారెడ్డి విజేతగా నిలిచారు. ఇతర వయో విభాగాల్లో సునిమా, వెంకట్, విపిన్ గెలుపొందారు. పతకాల పంట పండిస్తున్న దివ్యారెడ్డిఇటీవల ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్-2025లో దివ్యారెడ్డి నాలుగు పతకాలు సాధించారు. నలభై ఐదేళ్లకు పైబడిన వయో విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం, 1500 మీటర్ల పరుగులో రజతం, 400 మీటర్ల రేసులో కాంస్యం గెలిచిన దివ్యారెడ్డి.. 4*400 రిలేలో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్నారు. -
లాయర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూత్రధారి కాంగ్రెస్ కీలక నేత
సాక్షి, సిటీబ్యూరో: వక్ఫ్ బోర్డు ప్యానల్ న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసు కొలిక్కి వచ్చింది. ఈ హత్యకు భూవివాదాలే కారణమని, బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత సూత్రధారి అని తేలింది. ఆయనతో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వీళ్లు కూడా చిక్కితే ఈ హత్యోదంతం ఆద్యంతాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. మొహిజుద్దీన్ కొన్నేళ్లుగా వక్ఫ్ భూముల పరిరక్షణకు పోరాడుతున్నారు. ఓ భూమికి సంబంధించి బర్కత్‌పురకు చెందిన కీలక కాంగ్రెస్ నేతతో విభేదాలు వచ్చాయి. తమ ఆధీనంలో ఉన్న ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ ఆ నేతతోపాటు ఆయన కుమారుడు సైతం మొహిజుద్దీన్, ఆయన కుమారుడు ఫర్హాన్పైనా పలుమార్లు ఒత్తిడి తీసుకువచ్చారు. బెదిరింపులు.. ఆఫర్.. తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగడంతోపాటు ఆ భూ వివాదం కేసు నుంచి వైదొలిగితే రూ.2 కోట్లు ఇస్తామంటూ మొహిజుద్దీన్‌కు ఆఫర్ చేశారు. అయితే రాజీ పడబోనని చెప్పడంతో మొయిజుద్దీన్‌ను హత్యను చేయాలని భావించి ఆ పనిని తావూస్, మునీర్‌లకు అప్పగించారు. కాగా, సుపారీ గ్యాంగ్‌తో పనిపూర్తి చేయించాలని నగరానికి చెందిన కిషన్ సింగ్ అలియాస్ పప్పును వీరు కలిసి విషయం చెప్పారు. సుపారీ కింద రూ.15 లక్షలు చెల్లించారు. హత్య బాధ్యతను కవాడిగూడకు చెందిన సింగూరి అభిజీత్ అలియాస్ నాని, వినయ్, మణిదీప్‌లకు అప్పగించి రూ.10 లక్షలు చెల్లించాడు. ఈ ముగ్గురూ పప్పుతో కలిసి పథకం వేసి, కారు కొని, రెక్కీ చేసి, శనివారం మొయిజుద్దీన్‌ను రెడ్‌హిల్స్ శాంతినగర్‌లో హత్య చేశారు.అభిజిత్ గుర్తింపు... స్టంట్స్ చేయడంలో అనుభవం ఉన్న అభిజితే ఆ రోజు కారు నడిపాడు. మణిదీప్, వినయ్ అందులో కూర్చున్నారు. డ్రైవింగ్ నైపుణ్యం కారణంగానే ఇతడు నడిపిన, మొయిజుద్దీన్ ఎక్కబోయిన కార్లలో ఏదీ దెబ్బతినలేదు. ఈ హత్య చేసే సమయంలో కారుకు నెంబర్ ప్లేట్ లేకపోయినా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అధ్యయనం చేశారు. వీటి ఆధారంగా అభిజిత్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇతడిచ్చిన సమాచారంతో మణిదీప్, వినయ్‌లను పట్టుకున్నారు. పరారీలో ఉన్న తావూస్, మునీర్, కిషన్ సింగ్‌ల కోసం మూడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఈ హత్య కేసులో సదరు కాంగ్రెస్ నేత పాత్రపై ఆధారాలు దొరకడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని కార్యాలయానికి పిలిపించారు. మొయిజుద్దీన్‌తో ఉన్న విభేదాలు, హత్య తదితర అంశాలపై పలు ప్రశ్నలు వేశారు. తొలుత తనకు ఏం సంబంధమని, తాను ఎవరో తెలుసా? అంటూ చిందులు తొక్కారు. ఆ తర్వాత నేరం అంగీకరించడంతోపాటు తావూస్, మునీర్ పేర్లు బయటపెట్టారు. దీంతో ఈ నిందితుల కోసం గాలిస్తున్న టాస్క్‌ఫోర్స్ ఒకటిరెండు రోజుల్లో అరెస్టులను ప్రకటించనుంది. ఈ హత్య వెనుక కాంగ్రెస్ నేత కుమారుడి పాత్రపైనా ఆరోపణలు ఉండటంతో ఆ కోణంలోనూ విచారణ సాగుతోంది. -
కొత్త కోర్సులతో దోస్తీ కట్
సాక్షి, హైదరాబాద్: ఏడాది కాలంగా కసరత్తు చేసి, విద్యార్థులను ఊదరగొట్టిన పది కొత్త కోర్సులకు మంగళం పాడే పరిస్థితి ఏర్పడింది. డిగ్రీ ఆన్లైన్ సిస్టమ్ (దోస్త్) నుంచి వీటిని తొలగించారు. ఈ కోర్సుల కోసం ఉన్నత విద్యామండలి వెచ్చించిన లక్షలాది రూపాయలు బూడిదపాలవుతోంది. ఈ కోర్సుల్లో చేరేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్న విద్యార్థులు తీవ్ర నిరాశలోకి వెళ్లారు. కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తులు కూడా సమర్పించిన దాదాపు 260 కాలేజీల పరిస్థితి అయోమయంలో పడింది. కొత్త కోర్సుల కోసం ఈ కాలేజీలు ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా వదులుకున్నాయి. కొత్తవి రాక, ఉన్నవి రద్దవ్వడంతో కాలేజీ యాజమాన్యాలు ఆందోళనలో ఉన్నాయి. ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యా విభాగం మధ్య కోల్డ్ వార్ దీనికి కారణం. ఈ వ్యవహారాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు కొత్త కోర్సుల రద్దుపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. రాజీకి అధికారులు మాత్రం తగ్గేదేలేదంటూ భీషి్మంచుకున్నారు. పెద్ద ఎత్తున నిధులు కొన్నేళ్లుగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. 4.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నా చేరేవారి సంఖ్య 2.25 లక్షలు దాటడం లేదు. ఇంజనీరింగ్‌తో సమానంగా డిగ్రీ కోర్సులను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆదేశం మేరకు ఉన్నత విద్యామండలి ఏడాదిపాటు నిపుణులను నియమించుకుని, దాదాపు రూ.25 లక్షల వరకూ వెచ్చించి, డిగ్రీ కోర్సుల్లో సంస్కరణలను మండలి చేపట్టింది. విస్తృతంగా పరిశోధన జరిపేందుకూ పెద్దఎత్తున నిధులు వెచ్చించింది. ఈ క్రమంలో బీఏ, బీకాం, బీఎస్సీలో ఎమర్జింగ్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు అవసరమైన బోధన ప్రణాళికనూ సిద్ధం చేశారు. దీనికి అన్ని యూనివర్సిటీలూ ఆమోదం తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 260 కాలేజీలు కొత్త కోర్సులను తెచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటికే ఉన్న కొన్ని కోర్సులను రద్దు చేసుకుంటామని చెప్పాయి. యూనివర్సిటీలు అదే పనిగా ఈ కోర్సులపై ప్రచారం చేశాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరేందుకు సంసిద్ధమయ్యారు. వర్సిటీలు కూడా దోస్త్ పోర్టల్‌లో కోర్సులను అప్లోడ్ చేశాయి. వీటన్నింటినీ సాంకేతిక విద్య కమిషనరేట్ ఆపేసింది. దోస్త్ పోర్టల్‌లో ఆప్షన్లు పెట్టేందుకు వీల్లేకుండా బ్లాక్ చేయడంతో వేలాది మంది విద్యార్థులు అమోమయంలో పడ్డారు. వాస్తవానికి ఈ కోర్సులన్నీ ఈ నెలాఖరుతో ముగిసే రెండో దశ కౌన్సెలింగ్‌లోకి ఉంటాయని అధికారులు నెల రోజులుగా చెబుతున్నారు. రద్దయిన కోర్సులన్నీ కీలకమైనవే... బీఏ, బీఎస్సీ, బీకామ్ ద్వారా బహుళజాతి సంస్థల్లో గరిష్ట ఉపాధి అవకాశాలు లభించే కోర్సులను ప్రవేశ పెడుతున్నట్టు ఉన్నత విద్యామండలి ఏడాదిగా ప్రచారం చేసింది. బీఏలో సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, ల్యాండ్ అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ వంటివి ఉన్నాయి. ఈ కోర్సులను ఇంజనీరింగ్‌లో పూర్తి చేయాలంటే విద్యార్థి రూ. లక్షల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. డిగ్రీలో ఈ కోర్సులు చేయడానికి మూడేళ్ల కాలంలో రూ. 50 వేలకు మించి ఖర్చు కాదు. ఇంజనీరింగ్‌తో సమానంగా ఉపాధి లభించే వీలుంది. బీఎస్సీలోనూ డేటాసైన్స్, ఏఐఎంఎల్, డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ (ఆనర్స్) వంటివి ఉన్నాయి. వీటి బోధన ప్రణాళిక మొత్తం ఇంజనీరింగ్ విద్యతో సమానంగా రూపొందించారు. శరవేగంగా దూసుకొస్తున్న ఇ–కామర్స్ కోసం ఫైనాన్స్ టెక్నాలజీతో పాటు, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులను ప్రతిపాదించారు. వీటివల్ల బహుళజాతి సంస్థలో మంచి ఉపాధి వస్తుందని విద్యార్థులు భావించారు. వీటినీ ఇప్పుడు నిలిపివేస్తున్నారు. ఎవరి కోసం ఈ వివాదం? డిగ్రీ కోర్సుల ప్రక్షాళనకు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు వ్యతిరేకంగా ఉన్నాయి. సమాంతర కోర్సులు ప్రవేశపెడితే ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ సీట్లకు డిమాండ్ ఉండదనే వాదన తెచ్చాయి. ఈ దిశగా విద్యాశాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడంతోపాటు, బలమైన లాబీయింగ్ కూడా నడిచినట్టు విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే ప్రభుత్వంలోని కొంతమంది, ఉన్నతాధికారులు కీలకమైన కోర్సుల నిలిపివేతకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ కోర్సులపై ఏడాదిగా ఉన్నత విద్యామండలి నిపుణుల కమిటీలు ఏర్పాటు చేసి, సిలబస్ రూపకల్పన చేస్తున్నప్పుడు విద్యాశాఖ ఉన్నతాధికారులూ ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. దోస్త్‌లో కోర్సులు రాకుండా ఆఖరులో అడ్డుకోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. -
లొంగిపోండి.. అండగా ఉంటాం
సాక్షి, హైదరాబాద్: అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన మిగిలిన ముగ్గురు మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డీజీపీ సీవీ ఆనంద్ భరోసా ఇచ్చారు. కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, జోడె రత్నబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగ్తులు లొంగిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, బిహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శి పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ అలియాస్ సలైదా, ఆయన భార్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేదర దానమ్మ అలియాస్లత అలియాస్ పూనం మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్ సమక్షంలో జనజీవనస్రవంతిలో కలిశారు. ఇద్దరి పేరిట ఉన్న రివార్డు మొత్తానికి సంబంధించి మొత్తం రూ.45 లక్షలకు రెండు డీడీలను డీజీపీ వారికి అందించారు. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ పోలీసుల వద్దకు వచ్చినా నరహరి అనారోగ్య కారణాల రీత్యా మంగళవారం లొంగుబాటు చూపారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతిభద్రతల డీజీ మహేశ్ భగవత్, ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, ఎస్ఐబీ ఇంచార్జి కార్తీకేయలతో కలిసి డీజీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. గణపతి విదేశాల్లో ఉన్నారన్నది అవాస్తవం మావోయిస్టు అగ్రనేత గణపతి విదేశాల్లో ఉన్నట్టు వస్తున్న వార్తలు వాస్తవం కాదని, గణపతికి ఎక్కడ ఉన్నారన్న దానికి సంబంధించిన కచ్చితమైన సమాచారం తెలియనప్పటికీ దేశంలోనే ఏదో ఒక చోట గణపతి ఉండొచ్చని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామన్నారు. తిరిగి మావోయిస్టు భావజాలం వైపు మళ్లకుండా వారికి నచ్చిన పనిలో మెళకువలు నేర్పేలా ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నట్లుగా స్కిల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు అందుతున్న పునరావాస కార్యక్రమాల గురించి స్వయంగా తెలుసుకుంటానని, త్వరలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మావోయిస్టుల సమస్యపై గత అనుభవాల దృష్ట్యా ఎస్ఐబీ, గ్రేహౌండ్స్‌ను ఇంకా కొనసాగిస్తామని, అయితే సిబ్బంది కొంత తగ్గొచ్చని తెలిపారు. లొంగిపోయినవారి గురించి స్థానిక పోలీసుల నుంచి జిల్లాల ఎస్పీలు, సీపీల వరకు గమనిస్తూనే ఉంటారని, ప్రతి నెల, రెండు నెలలు, ఆరు నెలలకు ఒకసారి పునరావాసంపై రిపోర్టులు తీసుకుంటామని వెల్లడించారు. పరిస్థితులు అనుకూలంగా లేకనే లొంగుబాటు : నరహరి దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ నష్టాలను చవిచూసిందని, ఈ సమయంలో సాయుధ పోరాటమనే దారి ప్రస్తుతం కష్టాల మయంగా కనిపించడం..అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పునరావాస పథకంలోని అనుకూలత కారణంగా జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు పసునూరి నరహరి తెలిపారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నరహరి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ఆర్ఎస్యూలో చేరారు. 1982లో పీపుల్స్‌వార్‌లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. తుపాకులు, రాకెట్లు, రాకెట్ ప్రేరేపిత గ్రెనేడ్ల తయారీలో నరహరికి అపారమైన నైపుణ్యం ఉంది. నరహరి భార్య మేదరి దానమ్మది ఏపీలోని గుంటూరు, ఆమె 1986 నుంచి ఉద్యమంలోకి వచ్చారు. -
రూ.వేయి కోట్ల భూ కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ భూములను అందినకాడికి కొల్లగొడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్లో సర్వే నంబరు 173 నుంచి 183 వరకు ఉన్న సర్వే నంబర్లలోని 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరిగిందన్నారు. సుమారు రూ.వేయి కోట్లు విలువ చేసే ఈ కుంభకోణంపై సిట్ లేదా సీఐడీ విచారణ జరిపి ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంగళవారం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కాకుండా నిషేధిత జాబితా 22ఏలో పెట్టాలని తహసీల్దార్‌కు ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని 2026 జనవరిలో హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లోనూ పొందుపరచడంతో పాటు దీనిని ప్రభుత్వ భూమిగా ఫిబ్రవరి 24న తహశీల్దార్ తేల్చారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఫిబ్రవరి 28న ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందినదిగా తహశీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల్లో ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా పేర్కొంటూ భూ భారతిలోనూ అప్లోడ్ చేశారు. కలెక్టర్ ఆమోదం లేకుండా ఇది ఎలా సాధ్యమవుతుంది? రూ.వేయి కోట్ల విలువైన భూములపై జరిగిన కుంభకోణంపై చర్యలు తీసుకోవాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బదిలీతో సరిపెడుతారా? ‘భూ కుంభకోణంపై మీడియా కథనాల నేపథ్యంలో కేవలం తహశీల్దార్ బదిలీతో సరిపెట్టారు. దాడుల కోసం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఏసీబీ అధికారులు ఎవరి ఒత్తిళ్ల వల్ల తిరిగి వచ్చారో చెప్పాలి. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఈ కుంభకోణంలో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. భూ భారతిలో 170ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా నమోదైంది. తహశీల్దార్ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు సదరు అధికారిని సర్వీసు నుంచి తొలగించాలి. భూ కుంభకోణంపై సిట్ లేదా సీఐడీ విచారణ జరపడంతో పాటు ఇందులో భాగస్వాములైన అధికారులు, ప్రభుత్వ పెద్దలపై విచారణ జరపాలి’ అని హరీశ్‌రావు డిమాండు చేశారు. జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్‌ను సస్పెండ్ చేయడాన్ని హరీశ్ ఖండించారు. ధాన్యం కొనుగోలుపై ప్రశ్నించిన డ్రైవర్‌పై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌కు బీఆర్ఎస్ అండగా నిలవడంతో పాటు న్యాయపోరాటం చేస్తామని హరీశ్‌రావు ప్రకటించారు. -
జీపీల సొంత ఆదాయం బ్యాంక్ ఖాతాలో వేయండి
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని (వోన్ సోర్స్ రెవెన్యూ) ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా సవరించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతీ నెలా మొదటి తారీఖునే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఐఏఎస్ అధికారులకు నెల నెలా సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా అలాగే జీతాలు అందాలన్నారు. సిబ్బంది జీతాలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా రూ.50 కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకునేది లేదని వారిని హెచ్చరించారు. మంగళవారం డా.ఎంసీఆర్హెచ్ఆర్డీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో పంచాయతీ, ఆర్థికశాఖల అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి పెన్షన్ల పంపిణీ విధానంపై కీలక ఆదేశాలిచ్చారు. ప్రస్తుత పెన్షన్ విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని సూచించారు. అర్హులకే చేయూత పించన్లు అందేలా చూడాలని స్పష్టంచేశారు. ఓటర్ ఐడీ, ఆధార్, కులగణన (సీప్‌సీ డేటా) ఆధారంగా పెన్షన్లను స్ట్రీమ్ లైన్ చేయాలని ఆదేశించారు. కొత్తగా అందించే పెన్షన్లలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. కాగా సొంత ఆదాయంపై గ్రామపంచాయతీల స్వతంత్రతకు భంగం కలిగించేలా గత ప్రభుత్వం నిబంధనను తొలగించిందని, ఇప్పుడు దానిని పునరుద్ధరించేందుకు సీఎం అంగీకారం తెలిపారు. దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి గవర్నర్‌కు పంపిస్తే ఆయన ఆమోదం తర్వాత ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఈ మేరకు ఆర్డినెన్స్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత శాసనసభ సమావేశాల సమయంలో దీనిపై చట్ట సవరణ బిల్లు పెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం ఆదేశాలతో జీపీల సొంత ఆదాయాన్ని (వోన్ సోర్స్ రెవెన్యూ)బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా పీఆర్ఆర్డీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో పీఆర్ ఆర్డీమంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ దానకిషోర్, కమిషనర్ దివ్యాదేవరాజన్, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. -
ఫ్యూచర్ సిటీ 11 జోన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీని విద్య, వైద్యం, వినోదం, నివాస, వాణిజ్య, పారిశ్రామిక, తయారీ.. ఇలా ప్రత్యేక జోన్లుగా విభజిస్తూ బృహత్ ప్రణాళిక సిద్ధమైంది. పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యంఇస్తూ నెట్ జీరో సిటీగా రూపుదిద్దుకోనున్న ఈ ఫ్యూచర్ సిటీలో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 11 జోన్లుగా అభివృద్ధి చేయనున్న ఈ ఫోర్త్ సిటీలో 13,610 ఎకరాల్లో అన్ని రంగాలకు భూ కేటాయింపులు చేశారు. అత్యధికంగా 4 వేల ఎకరాలు లైఫ్ సైన్స్ హబ్‌కు కేటాయించగా.. నివాస సముదాయాలకు 2,477 ఎకరాలను కేటాయించారు. 762 చ.కి.మీ... హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో గ్రేటర్లో నాల్గో నగరం ఆవశ్యకత ఏర్పడిందని, దీన్ని పట్టణ, పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి భారత్ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమన్‌గల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం ఏడు మండలాల్లోని 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ను ఏర్పాటు చేశారు. 762 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న ఈ ఎఫ్‌సీడీఏలో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఉంటుంది. ఇందులో 15 వేల ఎకరాలు అభయారణ్యం ఉండగా.. మిగిలిన 15 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. జూన్ 2న కార్యాలయం ప్రారంభం రాష్ట్రావతరణ దినోత్సవం జూన్ 2న ఎఫ్‌సీడీఏ కార్యాలయం ప్రారం¿ోత్సవానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మీర్ఖాన్పేటలో ఎఫ్‌సీడీఏ కార్యాలయం కోసం ప్రభుత్వం 7.29 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. జీ+1 అంతస్తుల్లో, 16,393 చదరపు అడుగుల విస్తీర్ణంలో హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. ఇందులో కాన్ఫరె¯న్స్ హాల్, ఎక్స్పీరియన్స్ సెంటర్ వంటి ప్రత్యేక గదులుంటాయి. -
బలైపోతున్న భర్తలు.. కలవరపెడుతున్న ఘటనలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత మూడు రోజుల్లో వరుసగా భర్తల హత్యలు చోటుచేసుకోవడం కలవరపెడుతోంది. ఈ హత్యలకు ప్రాంతం, కులం, మతం అనే తేడా లేదు. ఇలా వివాహేతర సంబంధాల కారణంగా భార్యల చేతిలో భర్తలు బలైపోతున్న ఘటనలు వరుస వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో మనూర్ మండలానికి చెందిన ఓ మహిళ తన ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీనికి అడ్డుగా ఉన్న భర్త ముత్యంరెడ్డిని ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం తన భర్తను జేసీబీతో గొయ్యి తవ్వించి మరీ పాతిపెట్టారు. అలానే మంచిర్యాల జిల్లాలో హాజీపూర్ మండలం ముల్కల గ్రామానికి చెందిన కుమార్‌ను అతని భార్య భారతి, తన ప్రియుడు సురేందర్‌తో కలిసి హతమార్చింది. ఈ స్కెచ్‌కు సురేందర్ స్నేహితుడు మల్లేశ్ కూడా తోడయ్యాడు. అయితే చేసే హత్యలో కూడా లాభం ఉండాలనుకుంది భారతి. దానికోసం హత్యకు ముందే భర్త పేరుతో రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ కట్టించింది. ఆ తర్వాత హత్య జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటిదే మరో ఘటన ఈమధ్య విశాఖ జిల్లా భీమిలిలో జరిగింది. ఓ మహిళ తన భర్తను గొడవల మధ్య చున్నీతో గొంతు బిగించి హతమార్చింది. ఇలా ఈ మూడు ఘటనలు కేవలం మూడు రోజుల్లోనే చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలోనూ హనీమూన్ మర్డర్ వంటి అనేక కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వీటిలో చాలా సందర్భాల్లో భర్త తన తప్పు లేకపోయినా బలైపోతున్నాడు. ఈ సంఘటనలు కుటుంబ బంధాలు, భార్య-భర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండాల్సిన నమ్మకం, వారి దాంపత్యంలోని విలువలు ఎంతగా దెబ్బతింటున్నాయో చూపిస్తున్నాయి. వివాహం అనేది జీవిత భాగస్వామ్యానికి ప్రతీక. కానీ కొంతమంది మహిళలు దాన్ని నేరానికి వేదికగా మార్చడం ఆందోళనకరంగా మారింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇటు సమాజంతో పాటు చట్టవ్యవస్థ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అవసరమైతే పోరాటానికి కూడా సిద్ధమవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో సరైన వసతులు లేవని, మెస్ చార్జీలు పెంచినా, విద్యార్థుల భోజనంలో నాణ్యత లేదన్నారు. విద్య కోసం అవసరమైతే పోరాటానికి సిద్ధమవుతానని, వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మిస్తే అవి కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయన్నారు. అవే డబ్బులు విద్యకు ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సరైన ప్రొటీన్ ఫుడ్ అందడం లేదన్నారు రాజగోపాల్‌రెడ్డి. -
బండి భగీరథ్ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి
హైదరాబాద్: పొక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ పోలీస్ కస్టడీకి మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పోలీసులు అతడిని మూడు రోజులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మరిన్ని నిజాలు రాబట్టే అవకాశం ఉంది. కాగా, ఈనెల 16న బండి భగీరథ్‌ను అరెస్టు చేసి, పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. అతడిని కేసు పర్యవేక్షణాధికారిణి రితిరాజ్ విచారించారు.మరోవైపు, భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఇటీవలే హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. తనపై పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని భగీరథ్ కోరారు. ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్‌పై రిలీజ్ చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకునేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఎంఆర్వో సుచరిత
సాక్షి,హైదరాబాద్: ఏసీబీ అధికారులకు శామీర్ పేట్ ఎమ్మెఆర్వో సుచరిత రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. భూమి నాలా కన్వెర్షన్‌కి సుచరిత ఎకరాకు లక్షరేట్ కార్డ్ ఫిక్స్ చేశారు. 30ఎకరాల భూమి కన్వెర్షన్‌కి 30లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా అడ్వాన్స్‌గా సుచరిత కారు డ్రైవర్ రూ.2లక్షలు తీసుకున్నారు. ఆ డబ్బును సుచరితకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. డబ్బు గురించి ప్రశ్నింగా సుచరిత, ఆమె డ్రైవర్ నీళ్లు నమిలారు.ఎమ్మార్వో సుచరిత శామీర్‌పేట్ ఆఫీస్‌నే అవినీతికి అడ్డాగా మార్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. అనంతరం మీడియాతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. శామీర్‌పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించి రైతు కన్సల్టెంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.ఎకరానికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామని, ఎమ్మార్వో సుచరితతో పాటు ఆర్డీఓ కీసర రాజేష్ పలువురు సిబ్బందిని విచారిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.2024లో శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ఎమ్మార్వో సత్యనారాయణ రూ.2 లక్షల లంచం కేసులో డ్రైవర్‌తో కలిసి ఏసీబీకి చిక్కిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి అదే కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
లొంగిపోయిన మావోయిస్టు నేత నరహరికి రూ.25 లక్షలు అందజేత
హైదరాబాద్: మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి, అతని భార్య ధనమ్మ మే 12న పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. వారిని ఇవాళ (మంగళవారం) మీడియా ముందు ప్రవేశపెట్టారు. నరహరికి రూ.25 లక్షలు, ధనమ్మకు రూ.20 లక్షల చెక్ అందజేశారు డీజీపీ సీవీ ఆనంద్. ఇక సెంట్రల్ కమిటీలో మిగిలింది ఇద్దరేనని సీవీ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 45 మంది మావోయిస్టులు మాత్రమే అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్న వారు కూడా లొంగిపోవాలని నరహరి పిలుపునిచ్చారు. దాదాపు 45 ఏళ్లుగా ఆయన అజ్ఞాతంలో ఉంటూ కీలక పాత్ర పోషించారు.మావోయిస్టు సెంట్రల్ కమిటీ మొత్తంగా తుడిచిపెట్టుకుపోయినట్లే. ఇప్పటికే పలువురు నేతలు ఎన్కౌంటర్లో మృత్యువాత పడగా మెజారిటీ నాయకులు లొంగిపోయారు. నరహరి లొంగుబాటుతో ఇక యాక్టివ్‌గా ఉన్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ నేత వార్త శేఖర్‌ను మాత్రమే కీలకంగా భావించవచ్చు. -
ఆటా మహాసభలకు సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధుల బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. 2026 జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీల్యాండ్ బాల్టిమోర్‌లో నిర్వహించనున్న 19వ ఆటా తెలుగు మహాసభలకు హాజరుకావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా బృందం మహాసభ కార్యక్రమ వివరాలను సీఎంకు వివరించారు. ఎన్నారైలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దత్తత అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు. సీఎంను కలిసిన వారిలో ఆటా నేషనల్ కో–ఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కో–ఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా, ప్రవీణ్ పాల్ రెడ్డితోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటా మహాసభలకు హాజరవుతానని ఆటా ప్రతినిధులకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. చదవండి: ఇకపై ప్రభుత్వ ఆస్తిగా హైదరాబాద్ మెట్రోముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (#ATA) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అటా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారిని కలిసి జూలై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు మేరీలాండ్ బాల్టిమోర్ లో నిర్వహించనున్న… pic.twitter.com/g7WTYtpWl1— Telangana CMO (@TelanganaCMO) May 25, 2026 -
బైక్‌పై స్టంట్లు.. లైక్‌ల కోసం స్టేటస్..
హైదరాబాద్: బైక్‌పై స్టంట్లు చేయడమే కాక లైక్‌ల కోసం స్టేటస్ పెట్టిన బంజారాహిల్స్ రోడ్ నంబర్–5 దేవరకొండ బస్తీ యువకుడు షాదాబ్ (19)ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. జెప్టో డెలివరీ బాయ్‌గా పనిచేసే ఇతడు ఇటీవల శామీర్‌పేట రోడ్లోకి వెళ్లి బైక్‌ను గాల్లోకి లేపి ఫోన్ మాట్లాడుతూ విన్యాసాలు చేశాడు. దానిని వాట్సప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. షాబాద్‌ను అదుపులోకి తీసుకుని బైక్‌ను సీజ్ చేశారు. స్నేహితుల్లో తాను ప్రత్యేకత చాటుకోవాలని, తన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలనే స్టంట్లు చేసినట్లుగా నిందితుడు వెల్లడించాడు. షాదాబ్‌పై చోరీ కేసు నమోదై ఉందని దర్యాప్తులో తేలింది. బైక్‌పై ప్రమాదకర స్టంట్లు చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులులైక్ల కోసం బైక్ పై స్టంట్లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బంజారాహిల్స్ రోడ్ నంబర్-5 దేవరకొండ బస్తీ యువకుడు షాదాబ్ (19)గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు https://t.co/gipROq3UKL pic.twitter.com/wdx1J8kxMN— Telugu Scribe (@TeluguScribe) May 26, 2026 -
నెక్స్ట్ ఫ్లైట్ 6 గంటల తర్వాతా?.. అప్పటివరకు తింటా!
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ రెస్టారెంట్ టేబుల్ పైకి ఎక్కి అక్కడ మిగిలి ఉన్న ఆహారాన్ని వీధి కుక్క తింటుండడం కలకలం రేపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాల్సిన చోట పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయంటూ దీనిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జీఎంఆర్ సంస్థ స్పదించింది. వీధి కుక్కల నియంత్రణకు తాము జీహెచ్ఎంసీతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించింది. జనవరి నుంచి 21 వీధి శునకాలను సంబంధిత అధికారులు పట్టున్నట్లు తెలిపారు. హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థల ముందు ఘన, ద్రవ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు వాటి నిర్వహణపై నిరంతరం శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. -
యూపీ సీఎం పీఏ నెంబర్ కావాలి
సాక్షి,హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ తెహరీక్–ఇ–హిందుస్థాన్ (టీటీహెచ్) చీఫ్ షెహజాద్ బట్టీ అనుచరులతో సంప్రదింపులు జరుపుతూ, మేడ్చల్ పోలీసులకు చిక్కిన జాయిద్ ఖాన్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతడి నుంచి షెహజాద్ అనుచరులు అబిద్, రానాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) నెంబర్ తీసుకోవాలని భావించారు. మరికొన్ని ఆపరేషన్లకు ప్లాన్ చేసినట్లు వెలుగులోకి వచి్చంది. తదుపరి విచారణ కోసం జాయిద్‌ను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ కేసులో షెహజాద్‌తో పాటు అబిద్, రానాలను వాంటెడ్‌గా చేర్చారు. పోలీసుల దర్యాప్తు, నిందితుడి విచారణలో అనేక కీలకాంశాలు వెలుగులోకి వచ్చిన అంశాలివి... ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన జాయిద్ అలియాస్ ఆదిల్ ఖాన్ (22) నాలుగో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. ఇతడి బంధువైన ఫైజాన్ మేడ్చల్‌లోని ముబారక్ రెస్టారెంట్లో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. అతడి ద్వారానే జాయిద్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మేడ్చల్ వచ్చి అదే హోటల్లో సర్వర్‌గా చేరి అదే రెస్టారెంట్లో నివసిస్తున్నాడు. 2021 నుంచి జాయిద్‌కు రెండు ఇన్‌స్ట్రాగామ్, ఓ ఫేస్బుక్, మరో వాట్సాప్ ఖాతాలు ఉన్నాయి. 2023లో ఓ బొమ్మ పిస్టల్ ఖరీదు చేసిన జాయిద్ దాంతో వీడియోలు తీసి అప్లోడ్ చేయడం మొదలెట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిజమైన తుపాకీ ఖరీదు చేయాలని భావించిన జాయిద్ దానికోసం గూగుల్‌తో పాటు ఇన్‌స్ట్రాగామ్‌లో సెర్చ్ చేశాడు. వాటి ద్వారా మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్కు చెందిన వ్యక్తి విదేశీ పిస్టల్స్ విక్రయిస్తాడని తెలిసింది. అతడి ఫోన్ నెంబర్ సంగ్రహించిన జాయిద్ సంప్రదించాడు. ఫిబ్రవరి 27న అతడు కొన్ని తుపాకుల ఫొటోలను షేర్ చేశాడు. ఇలా ఇన్‌స్ట్రాగామ్‌లో అబిద్ జట్, రానా హుస్సేన్‌లను ఫాలో అవడం ప్రారంభించాడు. వీళ్లు ఆయుధాలతో అనేక ఫొటోలు, వీడియోలను తమ పేజ్‌ల్లో పోస్టు చేశారు. ఈ ద్వయం దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న తెహరీక్–ఇ–హిందుస్థాన్ (టీటీహెచ్) ఉగ్రవాద సంస్థను నిర్వహిస్తున్న షెహజాద్ బట్టీ అనుచులుగా ఉన్నారు. అక్రమ ఆయుధాల వ్యాపారం, టార్గెట్ కిల్లింగ్ చేసే బట్టీ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఐఎస్ఐ కోసం దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాలు తెలిసీ జాయిద్ వారితో సంబంధాలు కొనసాగించాడు. అబిద్ జట్ కోరడంతో జాయిద్ ఈ ఏడాది ఏప్రిల్ 2న ప్రయాగ్‌రాజ్‌కు చెందిన చోటా యోగి అనే వ్యక్తి వివరాలను ఇన్‌స్ట్రాగామ్ ద్వారా షేర్ చేశాడు. అప్పటి నుంచి అబిద్, రానాలు తమ ఫోన్ నెంబర్లు పంపి, వాట్సాప్ సంప్రదిపులు ప్రారంభించారు. ఈ నెల 10న అబిద్ జట్ తన పోస్టర్‌ను జాయిద్‌కు షేర్ చేశాడు. ‘పాకిస్థానీ డాన్ అబిద్ జట్’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ పోస్టర్స్‌ను వెయ్యి ప్రింట్ తీసి, ఘజియాబాద్ ప్రాంతంలో అంటించాలని, ఆ వీడియోలను తనకు పోస్టు చేయాలని, అలా చేస్తే ఓ అసలైన పిస్టల్ పంపిస్తానని అబిద్ చెప్పాడు. దీనికి జాయిద్ అంగీకరించాడు. ఈ నెల 20న జాయిద్‌ను సంప్రదించిన రానా తనకు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ పీఏ ఫోన్ నెంబర్ కావాలని కోరాడు. దీనికోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన జాయిద్ యూపీ క్యాబినెట్ మంత్రులు, ప్రజా ప్రతినిధులకు చెందిన వారి వివరాలను దొరకడంతో అవన్నీ షేర్ చేశాడు. ఘజియాబాద్ వెళ్లినప్పుడు అబిద్ జట్ పోస్టర్లు అంటించి, అసలు పిస్టల్ పొందాలని జాయిద్ ఎదురు చూస్తున్నాడు. -
కుమార్ నెలవారీ బండి ఖర్చు పెరిగింది
సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్ నుంచి రోజూ బంజారాహిల్స్‌లోని ఆఫీసుకు బైకుపై వచ్చేందుకు కుమార్ అనే ఉద్యోగికి నెలకు పెట్రోలు ఖర్చు రూ.1500 అయ్యేది. కొద్దిరోజులుగా పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల అతని నెలవారి బండి ఖర్చు రూ.1800కు చేరుతోంది. ఇలా నగరంలో మధ్యతరగతి అల్పాదాయ వర్గాలపై చమురు ధరల పెంపు ప్రభావం గణనీయంగా ఉంటోంది. సోమవారం లీటర్‌పై ఏకంగా రూ. 2.84 పైసలు పెరిగింది. గడిచిన పది రోజుల్లోనే మొత్తం రూ.8.23 పైసలు అదనపు భారం పడటంతో సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతోంది. నగరంలో సుమారు 66 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు తిరుగుతున్నాయన్నది అంచనా. మెట్రో, సిటీ బస్సుల్లో రద్దీని తట్టుకోలేక, ఆటోలు, క్యాబ్‌ల చార్జీలు భరించ సొంత బండిని ఆశ్రయించిన వారికి పెట్రోల్ ధరలు షాక్ ఇస్తున్నాయి. ఒక సగటు ఉద్యోగి, వ్యాపారి తన విధులు, పనులకు వెళ్లి రావడానికి మొత్తం నెలవారీ పెట్రోల్ బిల్లును లెక్కగడితే భారం అధికంగానే ఉంది. -
కర్ణాటక సరిహద్దులో.. 2 బ్రిడ్జి కమ్ బరాజ్‌లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో రెండు బ్రిడ్జి కమ్ బరాజ్‌లను సంయుక్తంగా నిర్మించాలనే ప్రతిపాదనలపై ఉభయ రాష్ట్రాల మధ్య సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. కొల్పూర్, కొర్తుకుండ వద్ద కృష్ణా నదిపై 1.08 టీఎంసీల సామర్థ్యంతో ఒక బ్రిడ్జి కమ్ బరాజ్.. తంగడగి గ్రామం వద్ద భీమా నదిపై 1 టీఎంసీ సామర్థ్యంతో మరో బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మించాలనే ప్రతిపాదనలపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో రెండు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కర్ణాటక చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. జూరాల ప్రాజెక్టుకు సుమారు 30 కి.మీ.ల ఎగువన కొల్పూర్, కొర్తుకుండ వద్ద ఒక బరాజ్, కృష్ణా ప్రధాన పాయలో భీమా నది కలిసే ప్రాంతానికి ఎగువన తంగడగి వద్ద మరో బరాజ్ నిర్మించాలనే ప్రతిపాదనలపై కర్ణాటక అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ బరాజ్‌ల నిర్మాణంతో రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని కర్ణాటక మంత్రి చెప్పారు. బరాజ్‌ల కుడి వైపు నుంచి కర్ణాటక, ఎడమ వైపు నుంచి తెలంగాణ.. నీళ్లను మళ్లించుకోవచ్చని, వేసవిలో తాగునీటి అవసరాల కోసం పంపింగ్ చేసుకోవచ్చని సూచించారు. అయితే ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రజా ప్రతినిధుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సమగ్ర అధ్యయనం కోసం నీటిపారుదల శాఖ కార్యదర్శి, ఈఎన్సీ (జనరల్), ఇతర నిపుణులతో ఒక కమిటీ వేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకుంటామని, ఈ మేరకు ఒప్పందం చేసుకుంటామని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రతిపాదనలను కర్ణాటక మంత్రికి వివరించామని ఉత్తమ్ మీడియాకు తెలిపారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే ప్రతిపాదనలను ఆ రాష్ట్రం ముందు ఉంచినట్టు వెల్లడించారు. ఈ చర్చల్లో సాధించిన పురోగతిని సీఎం రేవంత్‌రెడ్డికి వివరించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రుల మధ్య భిన్నాభిప్రాయం కృష్ణా, భీమా నదులపై బరాజ్‌లు నిర్మిస్తే దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు వరదలు లేనప్పుడు వచ్చే రీజనరేటెడ్ నీళ్ల ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రధానంగా బీమా నదిపై ఇప్పటికే కర్ణాటక ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు నిర్మించడంతో జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గిపోయిందని ఆయన అన్నారు. కృష్ణా, భీమా నదులపై ఎగువన కర్ణాటకలో ఇప్పటికే కట్టిన ప్రాజెక్టులతో వర్షాభావ సంవత్సరాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కరువు పీడిత మక్తల్ నియోజకవర్గానికి తాగు, సాగునీటి సరఫరా కోసం ఈ రెండు బరాజ్‌లను నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. కర్ణాటకలోని ఆల్మట్టి బరాజ్ ఎత్తు పెంచడానికి ఆ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలతో తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు పలువురు కర్ణాటక మంత్రిని నిలదీసినట్టు తెలిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగానికి కీలకమైన ఆర్డీఎస్ ఆధునికీకరణ ప్రాజెక్టుకు కర్ణాటక సహకరించడం లేదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయగా, ఈ విషయంలో ఏపీ సహకరించడం లేదని కర్ణాటక మంత్రి బదులిచ్చారు. ప్రాజెక్టు పనులకు అవసరమైన నిధులు విడుదల చేస్తే సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో రాయచూర్ ఎంపీ జి.కుమార్‌నాయక్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, రాయచూర్ రూరల్ ఎమ్మెల్యే బసన్నగౌడ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మేఘారెడ్డి, శివకుమార్‌రెడ్డి, వంశీకృష్ణ, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కౌన్సిల్ x కమిషనరేట్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యామండలి, కాలేజీ విద్య కమిషనరేట్ మధ్య వివాదం రోడ్డుకెక్కింది. డిగ్రీ కోర్సులపై ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. కాలేజీ విద్య కమిషనర్ దేవసేన, మండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి మధ్య పరోక్ష మాటల యుద్ధం కొనసాగుతోంది. విధానపరమైన నిర్ణయాలపై ఒకరితో ఒకరు ఏకీభవించడం లేదు. ఇద్దరి మధ్య వివాదం డిగ్రీ ప్రవేశాల (దోస్త్)పై పడింది. దోస్త్ వెబ్‌సైట్‌ను హైజాక్ చేయడం, కోర్సులకు అనుమతి లేదంటూ రెండు ప్రభుత్వ సంస్థలు విమర్శలు ఆరోపించుకోవడం లక్షలాది మంది విద్యార్థులను గందరగోళంలోకి నెట్టింది.కొంతకాలంగా జరుగుతున్న ఈ కోల్డ్‌వార్‌ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. దేవసేన వ్యవహారంపై బాలకిష్టారెడ్డి ఏకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుతో ఆయన సోమవారం భేటీ అయ్యారు. తన హక్కులను దేవసేన కాలరాస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పినట్టు సమాచారం. అసలేం జరిగింది? కౌన్సిల్, కాలేజీ కమిషనరేట్ మధ్య కొన్ని నెలలుగా కోల్డ్‌వార్ జరుగుతోంది. మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రతీ ప్రతిపాదనను దేవసేనతోపాటు విద్యాశాఖ ముఖ్య అధికారి అడ్డుకుంటూ వస్తున్నారు. ఏడాది నుంచి బాలకిష్టారెడ్డి డిగ్రీ కోర్సుల స్వరూప స్వభావం మార్చేందుకు కొత్త కోర్సులపై కసరత్తు చేశారు. ఈ ఏడాది నుంచి వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.బీఏలో సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ గవర్నెన్స్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, ల్యాండ్–అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్, బీబీఏలో ఎయిర్‌పోర్టు, ఎయిర్‌లైన్స్, ఏరోస్పేస్, హాస్పిటల్ అడ్మిని్రస్టేషన్, బీకాంలో ఈ–కామర్స్, డిజిటల్ మార్కెటింగ్, ఫైనాన్స్ టెక్నాలజీ కోర్సులను ప్రతిపాదించారు. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని ఈ కోర్సులను దోస్త్ వెబ్సైట్లోకి రెండో కౌన్సెలింగ్ నాటికి అప్లోడ్ చేయించారు.ఇదే క్రమంలో కాలేజీ కమిషనరేట్ 11 కొత్త అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఏఈడీపీ) కోర్సులను ప్రతిపాదించడమే కాకుండా దోస్త్ వెబ్సైట్లోకి అప్లోడ్ చేసింది. బీఎస్సీలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఈ మొబిలిటీ అండ్ బ్యాటరీ, హారి్టకల్చర్, ఫిషరీస్ ఫుడ్ ప్రాసెసింగ్, బీకాంలో బిజినెస్ ఎనలటిక్స్, బీఏలో యానిమేషన్, ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్ వంటివి ఉన్నాయి. కమిషనరేట్ ప్రవేశపెట్టిన కోర్సులపై దోస్త్ కనీ్వనర్‌గా ఉన్న బాలకిష్టారెడ్డి అనుమతి తీసుకోకపోవడం వివాదానికి దారి తీసింది. పోర్టల్‌లో కోర్సులు బ్లాక్ఉన్నత విద్యామండలి ప్రతిపాదించిన కోర్సులన్నీ అన్ని యూనివర్సిటీలు దోస్త్ రెండో దశ కౌన్సెలింగ్‌లో అప్లోడ్ చేశాయి. కానీ విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చేప్పుడు మాత్రం ఆ కోర్సులు చూపించడం లేదు. దోస్త్ పోర్టల్ పాస్వర్డ్ వర్సిటీ ఉన్నతాధికారులు, గుడ్‌గవర్నెన్స్ (సీజీజీ) అధికారుల వద్ద మాత్రమే ఉంటుంది. సీజీజీ ఉన్నతాధికారిపై కమిషరేట్ నుంచి ఒత్తిడి రావడంతో కౌన్సిల్ ప్రవేశపెట్టిన కోర్సులను బ్లాక్ చేశారు. దోస్త్ కనీ్వనర్ అనుమతివ్వని కమిషరేట్ ఎంబెడెడ్ కోర్సులను మాత్రం అప్లోడ్ చేశారు. దీనిపై దేవసేన వివరణ ఇచ్చారు.ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టిన కోర్సులను ప్రైవేటు కాలేజీలకు గుర్తింపు ఇచ్చే వర్సిటీలు అనుమతించలేదని తెలిపారు. అసలు కొత్త కోర్సులపై వర్సిటీ అధికారులు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వలేదన్నారు. అందుకే ఆ కోర్సులను అందుబాటులోకి తేవడం కుదరదని చెప్పారు. ఇదంతా అబద్ధమని, వర్సిటీల భేటీలో అనుమతి ఇచి్చనట్టు తమ వద్ద ఆధారాలున్నాయని బాలకిష్టారెడ్డి తెలిపారు.‘ఏడాదిగా కోర్సులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. డిగ్రీలో నాణ్యత పెంచే కోర్సులను తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. వీటి వల్ల వందశాతం ఉపాధి లభిస్తుంది. కోర్సులు ఆపేస్తే నష్టపోయేది విద్యార్థులే’అని బాలకిష్టారెడ్డి మీడియాతో అన్నారు. వివాదం వల్ల విద్యార్థులు నష్టపోకుండా చూడాలని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
రైతు గోస పట్టదా?
సాక్షి, హైదరాబాద్/కుల్కచర్ల/గజ్వేల్: కాంగ్రెస్ పార్టీకి రైతుల గోస పట్టడం లేదని, పండించిన పంటను అమ్ముకోలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో సోమవారం ‘రైతుగోస– బీజేపీ భరోసా’కార్యక్రమాన్ని ప్రారంభించి, మార్కెట్ యార్డులోని రైతులతో మాట్లాడారు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డును కూడా సందర్శించి రైతులతో మాట్లాడారు. వరంగల్‌లో ఇచ్చిన డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ఏనాడో మర్చిపోయిందన్నారు. రియల్ఎస్టేట్ దందా తప్ప క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలా జరుగుతుందో సీఎంకు తెలియదన్నారు. ఇప్పటివరకు ఆయా జిల్లాల వారీగా ఎంతమేర ధాన్యం సేకరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 45 లక్షల టన్నులు సేకరించామని సీఎం పేర్కొంటున్నారని తెలిపారు. ఈ లెక్కన కూడా 30 శాతం మించలేదని మండిపడ్డారు.బీజేపీ శాసనసభాపక్షనేత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కాకుండానే, వారంలో కేంద్రాలను మూసేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని మండిపడ్డారు. అలా చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ బీజేపీ బస్సు యాత్ర వస్తుందని తెలిసి...కలెక్టర్ ఆదివారం గజ్వేల్ మార్కెట్ యార్డుకు ఆగమేఘాల మీద చేరుకొని లారీలు , గన్నీ బ్యాగులు తెప్పించే ప్రయత్నం చేశారని చెప్పారు. ఇదే ప్రయత్నం నిరంతరంగా ఎందుకు సాగటం లేదని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయం నుంచి ఐక్యత చాటుతూ... పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనకు ఐక్యతను చాటుతూ ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు బస్సులో బయలుదేరారు. ఈ బస్సు యాత్రలో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎం.రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, పైడి రాకేశ్‌రెడ్డి, ధన్పాల్ సూర్యానారాయణగుప్తా, డా.పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీలు ఏవీఎన్‌రెడ్డి, డా.సి.చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. మంగళ, బుధవారాల్లో ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల తీరును బీజేపీ ప్రతినిధి బృందం సమీక్షించనుంది. -
కీచక తండ్రికి ఇరవయ్యేళ్ల జైలు
షాబాద్: కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన రాజు (37) తన కన్న కూతురిపై అక్టోబర్ 12, 2024న లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదవగా, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.కేసు పూర్వాపరాలను పరి శీలించిన ఎల్బీనగర్ కోర్టులోని పోక్సో ప్రత్యేక సెషన్స్ న్యాయమూర్తి జి.శ్రీనివాస్ నిందితునికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం మంజూ రు చేశారు. దర్యాప్తు బృందంలోని ఏపీపీ భిక్షప తి గౌడ్, కోర్టు సిబ్బంది ఏండీ హనీఫ్, హెచ్‌జీవీ ప్రభాకర్, అలివేలును సీఐ అభినందించారు. -
మెట్రోకు రూ.13,600 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్ నగర రవాణా రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి విడతను తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో టేకోవర్ చేసుకుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు బలోపేతానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్ఎఫ్సీ) ద్వారా రూ. 13,600 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్‌ను ప్రభుత్వం పొందింది. సోమవారం ఢిల్లీలో ఐఆర్ఎఫ్సీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్, హెచ్ఎమ్ఆర్ఎల్ ప్రతినిధుల మధ్య ఈ మేరకు రుణ ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఐఆర్ఎఫ్సీ సీఎండీ, సీఈఓ మనోజ్ కుమార్ దూబే, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌లో సుస్థిరమైన, ప్రజానుకూల రవాణా వ్యవస్థను నిర్మించేందుకు ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎస్ రామకృష్ణారావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరోవైపు జూన్ ఒకటో తేదీ నుంచి మెట్రో రైల్ నిర్వహణ బాధ్యతల నుంచి ఎల్ అండ్ టీ వైదొలగనుంది. అధికారులు, సాంకేతిక నిపుణుల సహాయ సహకారాలు మాత్రం కొంతకాలంపాటు కొనసాగుతాయి. ప్రభుత్వమే వారికి జీతాలను చెల్లిస్తుంది. అలాగే ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లోగోను కూడా మార్చనున్నారు. రెండో దశ మెట్రో రైల్ నిర్మాణం కూడా చేపట్టనున్న దృష్ట్యా భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని మెట్రోరైల్ బ్రాండ్‌కు తగినవిధంగా పేరు, లోగో, తదితర అంశాల్లో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఇకపై ప్రభుత్వ ఆస్తిగా మెట్రో...: ఎల్ అండ్ టీ మెట్రో రైల్లోని 100 శాతం వాటాను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం స్వా«దీనం చేసుకున్న అనంతరం ఈ రీఫైనాన్సింగ్ ప్రక్రియ అమలులోకి వచ్చింది. దీంతో 69.2 కి.మీ. పొడవు, 57 స్టేషన్లతో రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న హైదరాబాద్ మెట్రో మొదటి దశ ఇకపై పూర్తిస్థాయిలో ప్రభుత్వ వ్యూహాత్మక ప్రజారవాణా ఆస్తిగా మారింది. ఒప్పందం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు – అధిక వడ్డీతో కూడిన పాత రుణాల స్థానంలో తక్కువ వ్యయంతో కూడిన దీర్ఘకాలిక రీఫైనాన్సింగ్ లభించడం వల్ల మెట్రో ప్రాజెక్టుకు భారీ ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. – తాజాగా సమకూరిన రూ. 13,600 కోట్ల నిధులను నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్‌కు వినియోగించి ప్రస్తుత రుణదాతలకు క్రమబద్ధమైన ఎగ్జిట్ కల్పిస్తారు. – ఈ రుణం 20 ఏళ్ల కాలపరిమితితో, త్రైమాసిక చెల్లింపుల సౌలభ్యంతో రూపొందడం వల్ల ప్రభుత్వంపై తక్షణ భారం పడదు. – ఈ లావాదేవీకి రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపు గ్యారంటీతోపాటు ఆర్బీఐ మద్దతు గల డైరెక్ట్ డెబిట్ మాండేట్ వంటి బలమైన రక్షణ వ్యవస్థలు మద్దతుగా నిలిచాయి. – ప్రస్తుత రుణ భారం తగ్గడంతో భవిష్యత్ మెట్రో విస్తరణ ప్రణాళికలు, కొత్త కారిడార్ల నిర్మాణం, చివరి మైలు అనుసంధాన పనులను వేగవంతం చేయడానికి మార్గం సుగమమైంది. -
రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటిస్తున్నప్పటికీ పంటలను మాత్రం పూర్తిస్థాయిలో కొనడం లేదని అన్నారు. సోమవారం సచివాలయంలో సీపీఎం రాష్ట్ర నాయకులు.. ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ నేతృత్వంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పండిన పంటలో 30 శాతం కూడా సేకరించడం లేదని విమర్శించారు. పంట కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించాలని వారికి సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తోందన్నారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని, మొక్కజొన్నను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కొనుగోళ్లపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు. బెంగాల్ ఎన్నికల కారణంగా హమాలీల కొరత ఏర్పడిందని, ఎండ తీవ్రత వల్ల మధ్యాహ్న సమయంలో పనులు మందగిస్తున్నాయని పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులకు అక్కడే ఇళ్లు..: కాగా, మూసీ నిర్వాసితులకు స్థానికంగానే ఇళ్లు మంజూరు చేస్తామని సీపీఎం నేతలకు సీఎం హామీ ఇచ్చారు. మూసీ అంశంపై బీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మూసీని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాజెక్ట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్, భోజనం అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఆరుట్ల స్కూల్‌ను ఒకసారి సందర్శించాలని సీపీఎం నాయకులను సీఎం ఆహ్వానించారు. ఈ భేటీలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనీస వేతనాల సవరణ చట్టాన్ని తీసుకువచ్చినందుకు సీపీఎం నాయకులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. -
ఒక్కటైనా కట్టారా?
కూకట్పల్లి (హైదరాబాద్): అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా..హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి అవగాహన ఉంది కాబట్టే నగర ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అనేక ఫ్లై ఓవర్లు మొదలుకుని టిమ్స్ ఆసుపత్రి దాకా ప్రతి ఒక్కటీ తామే నిర్మించామని, ప్రస్తుతం వాటికే సీఎం రేవంత్‌రెడ్డి రిబ్బన్ కట్ చేస్తూ తామే నిర్మించామని చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నగరానికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయలేని అసమర్థ ప్రభుత్వం అని మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించినట్టు నిరూపించినా రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. సోమవారం కూకట్‌పల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మోసం చేసింది.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెట్టాం. తెలంగాణకు 24 గంటల కరెంటు, తాగునీటిని అందించింది కేసీఆరే. కానీ అసెంబ్లీ ఎన్నిలప్పుడు అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రతి వర్గాన్ని మోసం చేసింది. ప్రభుత్వ విధానాలతో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతింది. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు, సెంట్రింగ్ కార్మికులకు ఉపాధి లభించకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ, సెంట్రింగ్ కార్మికుల కోసం బీమాతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. నగరంలో ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీటిని సరఫరా చేస్తాం. ఈ బాధ్యత నేనే తీసుకుంటా..’అని కేటీఆర్ స్పష్టం చేశారు. దొంగ ఓట్లపై జాగ్రత్తగా ఉండాలి ‘ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పారీ్టకి అండగా ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికీ తగిన అవకాశం, గౌరవం కల్పిస్తాం. ‘సర్’విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్కరు ఓటు కోల్పోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలో నమోదు చేసిన దొంగ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిజిటల్ విధానంలో నిర్వహిస్తాం. ఈ కార్యక్రమం దాదాపు 50 నుంచి 60 రోజుల పాటు కొనసాగుతుంది. సభ్యత్వ నమోదుకు సంబంధించి పార్టీ తరఫున కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం..’అని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ‘సర్’పై కార్యకర్తలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
రక్తమోడిన రహదారులు
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో రహదారులు రక్తమోడాయి. ఈ ఉమ్మడి జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇందులో ఉమ్మడి నల్లగొండ ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, ఉమ్మడి వరంగల్‌లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. నేపాల్‌కు చెందిన మీనాబుల్ (21), రవీబుల్ (28) యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఓ బేకరీలో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి వారిద్దరూ బైక్‌పై ఆలేరు నుంచి జనగామ వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.మరో ఘటనలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని తండ్రి, కుమార్తె మృతి చెందారు. వెంకట్రాంపురం గ్రామానికి చెందిన కీత రాజయ్య(65)కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సోమవారం రాజయ్య రెండో కుమార్తె సునీత (43)తో కలిసి మునగాలలోని బ్యాంక్‌కు వచ్చి స్వగ్రామానికి వెళ్తుండగా మొద్దుల చెరువు గ్రామ స్టేజీ వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సునీతను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.సూర్యాపేట జిల్లాలోనే మోతె మండలం రాఘవాపురం క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఖమ్మం పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన రామిశెట్టి వెంకటరమణమ్మ (63), రామిశెట్టి వెంకాయమ్మ (70) కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌లోని తమ బంధువుల వద్దకు వెళ్లారు. సోమవారం బంధువుల అబ్బాయితో కలిసి కారులో తిరిగి ఖమ్మంకు వెళ్తుండగా.. మార్గమధ్యలో రాఘవాపురం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే.. పక్కన ఆగి ఉన్న లారీ ఒక్కసారిగా రోడ్డు మీదకు రావడంతో వెనుక వస్తున్న కారు దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. వెంకాయమ్మను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నల్ల సిద్దినర్సమ్మ, మల్లయ్యల కుమారుడు వెంకటేశ్ (24) సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బైక్‌పై జనగామ నుంచి బసిరెడ్డిపల్లికి వస్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే చనిపోయాడు. మరో ప్రమాదంలో జయశంకర్ భూ పాలపల్లి జిల్లా కాటారం నుంచి ధర్మసాగర్ వైపు వెళ్తున్న కారు గుమ్మళ్లపల్లి శివారులోకి రాగానే అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి చెట్టును బలంగా ఢీకొట్టింది.కారులో ప్రయాణిస్తున్న శ్రావణ్(22) మృతిచెందగా శశివరణ్, రాజుకుమార్ల కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లెకి చెందిన బొక్కల ఐలయ్య (75) సోమవారం తెల్లవారు జామున జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాలకు చెందిన మచ్చిక సాయికుమార్ (25) ఆదివారం మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. మరో ఘటనలో వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో సోమవారం రాత్రి నడుచుకుంటూ వెళుతున్న మద్ది సాంబయ్య (36)ను ద్విచక్రవాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. కారు ఢీకొని హెడ్‌కానిస్టేబుల్ మృతి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్ జాడి బాపురావు (59) సోమవారం మధ్యాహ్నం డ్యూటీ ముగియడంతో ఇంటికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. కొద్ది దూరం వెళ్లగానే పులికుంట వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బాపురావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. -
వడదెబ్బతో 49 మంది మృతి
సాక్షి నెట్వర్క్: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బకు గురయ్యే వారి సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో 49 మంది చనిపోయారు. వరంగల్ జిల్లా బుధరావుపేటలో గుండ్రపల్లి సదయ్య (58), ధర్మారంలో అంకేశ్వరపు సమ్మక్క (70), దమ్మన్నపేటలో అనసూర్య (68), ఖిలా వరంగల్ పడమరకోటలో బొల్లం వీరమల్లు (68), మొండ్రాయిలో తండ చేరాలు (75), పుల్లయబోడులో భూక్య నరేశ్ (29), సర్వాపురానికి చెందిన మండల వీరయ్మ (74) వడదెబ్బతో మృతిచెందారు. ⇒ పరకాల డిపోనకు చెందిన కండక్టర్ బి.శంకర్ (48) విధుల్లో భాగంగా భద్రాచలం నుంచి పరకాల బయలుదేరి కొత్తగూడెం దాటిన తర్వాత అనిశెట్టిపల్లి వద్ద వేడిగాలితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆర్టీసీ డ్రైవర్, ప్రయాణికులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణం కోల్పోయాడు. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నగరంపల్లిలో గొర్రెలకాపరి కోడారి సాంబయ్య(52), అంకుషాపూర్‌లో వ్యవసాయ కూలీ మహమ్మద్ సైద్‌ఖాన్ (42), జనగామ జిల్లా రంగరాయగూడెంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అదే గ్రామానికి చెందిన రైతు నెలమంచ ఎలేందర్‌రెడ్డి (39) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై చనిపోయాడు. శివునిపల్లికి చెందిన పిట్టల శంకర్–రవళి దంపతుల కుమారుడు అక్షిత్ (4) ఎండ తీవ్రతతో మృతి చెందాడు. ఘన్‌పూర్‌లో తాటికొండ నర్సమ్మ(65), కామారపు విజయ్ (60), వరంగల్ జిల్లా ఇటుకాలపల్లిలో కూలీ నైనబోయిన రాజు(44) హనుమకొండ జిల్లా నీరుకుళ్లలో మేస్త్రీ వద్ద పనిచేసే కూలీ వడదెబ్బతో చనిపోయాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పెయింటర్ కొమిరె రమేశ్ (39), బైపాస్‌రోడ్డులో ఉండే యాచకుడు షేక్ లతీఫ్ (50), ములుగుకు చెందిన బీజేపీ నేత అన్నపురెడ్డి ప్రమోద్‌రెడ్డి (49), కమలాపురంలో అన్నపు రెడ్డి లక్ష్మీబాయి (80), తిరువాయిపేట వెంకటరమణ (48), తాడి సత్యవతి (80) వడదెబ్బతో చనిపోయారు. ⇒ నిజామాబాద్ జిల్లా అంజుమాన్ ఫారమ్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పడారి గంగన్న (40), బౌరంపేటలో రైతు రమేశ్ (42), ఉమ్మడి కరీంనగర్ జిల్లా..జగిత్యాలలో గొల్లపల్లి శివప్రసాద్‌గౌడ్ (50), రామడుగులో లక్ష్మీరాజం (48), గోపాల్రావుపేటలో షేర్ల నరేశ్ (30), ఘన్ముక్కులలో బొంగోని రాజవీరు (65), జమ్మికుంటలో దాసారపు కాంతమ్మ (59), సుల్తానాబాద్‌లో తోడేటి లక్ష్మి (44), వెన్నంపల్లిలో ఉపాధి కూలీ గోసు్కల గట్టయ్య (52), రామగుండంలో కుమార్ (40), యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులో సుంకరి భాగ్యమ్మ (79), పెద్దగూడెంలో కౌలు రైతు కాకారం ధర్మారెడ్డి (70), తోపుచర్లలో వేముల సైదమ్మ (42), మంచిర్యాల జిల్లా జన్నారంలో యాట ఇందయ్య (60), మైలారంలో బర్ల బుచ్చయ్య (71), చెన్నూర్‌లో తోగటి అశోక్ (46), సీసీసీ రిటైర్మెంట్ కాలనీలో ఆటో డ్రైవర్ రెడ్డిమల్ల లక్ష్మణ్ (49), నర్సింగపూర్‌లో సిడం వెంకటేశ్(33), ఆదిలాబాద్ జిల్లా గిమ్మలో బోనగిరి లస్మన్న(70), సిద్దిపేట జిల్లా తెల్లపలుగు తండాకు చెందిన బానోతు సంగ్లనాయక్ (65) వడదెబ్బతో చనిపోయారు. ⇒ భద్రాద్రి జిల్లాలోని చలమప్పగూడెంలో వ్యవసాయ పనులకు వెళ్లిన బండారు నాగమణి (40), అశ్వారావుపేటలో బోగి మంగ (62), జగన్నాథపురంలో ముత్తిని నర్సింహారావు (70), టేకులచెరువులో దాసరి దుర్గమ్మ (56), ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఉస్మాన్ (54), నారపునేనిపల్లిలో మంచికంటి విజయ(80), దారేడులో కూలీ షేక్ ఇమామ్ (45) వడదెబ్బతో మృతి చెందారు.మూడు రోజుల తర్వాత..భార్య కూతురి ఇంటికి వెళ్లడంతో తల్లాడలో మిర్చి కమీషన్ వ్యాపారి బండారు మోహన్‌రావు (65) ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం నిద్రించాడు. ఎండల తీవ్రతతో వడదెబ్బ బారిన పడగా తాగునీరు ఇచ్చేవారు కూడా లేక రెండు రోజుల క్రితమే మృతి చెందాడు. ఇరుగు పొరుగు వారికి వాసన వస్తుండటంతో తలుపులు పగులగొట్టే సరికి కుళ్లిన స్థితిలో మృతదేహం బయటపడింది. -
డిపాజిట్లు రూ.లక్ష కోట్లు అప్పులు రూ.లక్షన్నర కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా నగదు డిపాజిట్లు, అప్పులు పెరుగుతున్నాయి. 2026 మార్చి నాటికి గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని రకాల బ్యాంకుల్లో కలిపి రూ. 9.43 లక్షల కోట్లు ఉంటే, అన్ని రకాల బ్యాంకుల ద్వారా తీసుకున్న మొత్తం అప్పులు రూ.12.33 లక్షల కోట్లు ఉన్నాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) గణాంకాలు చెబుతున్నాయి. 2025–26 సంవత్సరంలో ఈ డిపాజిట్లు, అప్పులు కొత్త బెంచ్ మార్కులను అధిగమించాయి. ఒకే సంవత్సరంలో నగదు డిపాజిట్లు రూ.లక్ష కోట్లు పెరగ్గా, అప్పులు రూ.1.5 లక్షల కోట్లు పెరిగాయి. 2025 మార్చి నాటికి రూ.8.40 లక్షల కోట్లు ఉన్న డిపాజిట్లు ..రూ.9.43 లక్షల కోట్లు కాగా, రూ.10.81 లక్షల కోట్లున్న రుణాలు.. రూ.12.33 లక్షల కోట్లకు పెరిగాయని ఎస్ఎల్బీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఆరేళ్లలో 70 శాతం పెరుగుదల డిపాజిట్ల విషయానికి వస్తే 2021 మార్చి నాటికి రాష్ట్ర ప్రజలు రూ.5.71 లక్షల కోట్లు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారు. ఆరేళ్ల కాలంలో ఈ డిపాజిట్లు దాదాపు 70 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. డిపాజిట్ల విషయానికి వస్తే 2020–21లో రూ.87,649 కోట్లు, 2021–22లో రూ. 60, 616 కోట్లు, 2022–23లో రూ. 50,481 కోట్లు, 2023–24లో రూ. 96,947 కోట్లు, 2024–25లో రూ.60,477 కోట్లు, 2025–26లో రూ.1,02,995 కోట్లు పెరిగాయి. ⇒ అప్పుల విషయానికి వస్తే 2021 మార్చి నాటికి రూ.6.27 లక్షల కోట్లు ఉన్న అప్పులు దాదాపు రెట్టింపయ్యాయి. రాష్ట్రంలోని అన్ని రకాల బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తం అప్పు 2026 మార్చి నాటికి రూ.12,33,858 కోట్లకు చేరింది. ఇక, సంవత్సరాల వారీగా పరిశీలిస్తే 2020–21లో రూ.56,662 కోట్లు, 2021–22లో రూ.1,05,292 కోట్లు, 2022–23లో రూ.81,564 కోట్లు, 2023–24లో రూ.1,65,163 కోట్లు, 2024–25లో 1,02,302 కోట్లు, 2025–26లో రూ. 1,52,497 కోట్లు పెరిగాయని ఎస్ఎల్బీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ⇒ క్రెడిట్, డిపాజిట్ నిష్పత్తి (సీడీఆర్) ఆర్బీఐ లెక్కల ప్రకారం 60 శాతం ఉండాల్సి ఉండగా, ఈ రెండింటి నిష్పత్తి 2026 మార్చి నాటికి తెలంగాణలో 130.78 శాతానికి పెరగడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణ బ్యాంకు శాఖల సంఖ్య ఏటేటా గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతోంది. 2021 మార్చి నాటికి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,783 బ్యాంకు శాఖలుండగా, 2026 మార్చి నాటికి ఆ సంఖ్య 1,918కి చేరింది. సెమీ అర్బన్ ప్రాంతాల్లో 1,283 నుంచి 1,649కి పెరిగాయి. వీటితోపాటు అర్బన్, మెట్రో ప్రాంతాల్లో కలిపి 2021 మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా 5,762 బ్యాంకు శాఖలుండగా, 2026 మార్చి నాటికి 6,801కి పెరిగాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి లెక్కలు వెల్లడించాయి. -
అంతా మీ ఆశీర్వాదమే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తమ ప్రభుత్వం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మళ్లీ ఈ సర్కార్‌ను అధికారంలోకి తీసుకువచ్చే శక్తి మహిళలకు ఉందని అన్నారు. రాష్ట్ర మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని, మారుమూల గ్రామాల్లోని మహిళలు కూడా ఆర్థికంగా నిలబడాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని అన్నారు. ‘మహిళలు ఆర్థికంగా నిలబడితే కుటుంబం నిలబడుతుంది.. కుటుంబం నిలబడితే గ్రామం బలపడుతుంది, గ్రామం బలపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడు రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. ఈ దిశలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తోంది..’ అని అన్నారు. సోమవారం సచివాలయంలో..ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాల ప్రారంభం సందర్భంగా..8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి సీఎం స్విచ్ నొక్కి వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళల ఆర్థిక బలోపేతానికి కీలక నిర్ణయాలు ‘రాష్ట్ర వ్యాప్తంగా రూ.800 కోట్లతో 8 వేల మహిళా సంఘాల భవనాలకు ఒకేసారి శంకుస్థాపన చేశాం. ఈ మేరకు ప్రభుత్వం దేశంలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం. మహిళా సంఘాలకు మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీలు) మహిళలను పారిశ్రామిక రంగంలోకి తీసుకురావడంలో భాగంగా మహిళల ఆధ్వర్యంలో రైస్ మిల్లుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం అవసరమైన భూమి, బ్యాంకు రుణాలు, ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుంది. మహిళా సంఘాలు మండలాల్లో గోడౌన్లు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకోవాలి. వీటి కోసం వంద ఎకరాల వరకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైస్ మిల్లులు, గోడౌన్ల కోసం సున్నా వడ్డీతో బ్యాంక్ లింకేజీ ఏర్పాటు చేసి కావాల్సిన రుణాలను మంజూరు చేస్తాం. అలాగే మహిళా సంఘాలతో మహిళా శక్తి సూపర్ బజార్లు కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేస్తాం. ఈ బజార్లలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటాదారుగా ఉంటుంది. వీటిల్లో నాణ్యమైన వస్తువులు దొరికేలా చూడాలి. పట్టణ ప్రాంతాల్లో వీటి కోసం ప్రభుత్వ భూములను చాలా తక్కువ ధరకు లీజుకు ఇస్తాం. ఇవి దేశంలోనే బెస్ట్ సూపర్ బజార్లుగా తయారు కావాలి. డీమార్ట్, బిగ్ బజార్ల కంటే బెస్ట్‌గా మహిళా శక్తి సూపర్ బజార్లు ఉండాలి..’ అని సీఎం అన్నారు. 5వ తేదీన మహిళలకు మరో 553 బస్సులు ‘మహిళలను బస్సుల యజమానులను చేయాలని వెయ్యి బస్సులు కొనుగోలు చేసి ఆరీ్టసీకి అద్దెకు ఇచ్చాం. అదే విధంగా జూన్ 5న పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా సంఘాల ద్వారా నడిచే మరో 553 బస్సులను ప్రారంభిస్తున్నాం. మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వ చేయం భవిష్యత్తులో మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వలు పెట్టం. మహిళా ఎస్‌హెచ్‌జీలు వడ్లు కొనుగోలు చేసి బియ్యం ప్రభుత్వానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఆడబిడ్డలు ప్రతి గింజకు జవాబుదారిగా ఉంటారు. ఇకపై రూ.10 లక్షల వరకు బ్యాంక్ లింకేజీ రుణాలు సోలార్ ఎనర్జీ అనగానే అదానీ, అంబానీ గుర్తుకు వస్తారు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి మెగావాట్ల సోలార్ ఎనర్టీ ప్లాంట్లను మహిళా సంఘాలతో ఏర్పాటు చేయిస్తోంది. రిలయన్స్ వాళ్లు చేసే పెట్రోల్ బంక్ వ్యాపారాన్ని కూడా మహిళా స్వయం సహాయ సంఘాలతో చేయిస్తున్నాం. మహిళలకు సంబంధించి రూ. 5 లక్షల వరకున్న బ్యాంక్ లింకేజీ లోన్లను రూ.10 లక్షలకు పెంచుతున్నాం. మహిళలు తాము తీసుకున్న ప్రతి రూపాయిని నిక్చచ్చిగా చెల్లించి ముందుకు వెళ్తున్నారు. లోన్లు తీసుకున్న వ్యాపారులు మాత్రం ఎగ్గొట్టి పారిపోతున్నారు..’ అని ముఖ్యమంత్రి అన్నారు. చిలుక పచ్చ రంగులో ఇందిరమ్మ చీరలు ‘రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డకు సారెలా చీరలు అందజేసింది. గతంలో ఇచ్చిన చీరలు పంట పొలాల్లో పిట్టలను కొట్టడానికి ఉపయోగించారు. ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డలు పాలపిట్టల్లా కనిపిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ చీరలను పంపిణి చేస్తాం. చిలుక పచ్చ రంగులో కొత్త డిజైన్‌లో ఇందిరమ్మ చీరలు ఇవ్వబోతున్నాం. అన్నదమ్ములు కొందరు ఇంట్లో నుంచి చెల్లెళ్లను వెళ్లగొడుతున్నారు. ఈ మధ్య రాజకీయాల్లో కొందరు చెల్లెళ్లను బయటకు వెళ్లగొడితే బయటకు వెళ్లి ఎలా శాపనార్థాలు పెడుతున్నారో చూస్తున్నాం..’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు ఇచ్చే ఇందిరమ్మ చీరల డిజైన్లను ముఖ్యమంత్రి విడుదల చేశారు. మహిళా వారోత్సవాల పురస్కరించుకుని మంత్రి సీతక్కకు, ఎమ్మెల్యే మట్టా రాగమయికి సీఎం చీరలు బహూకరించారు. మహిళా సమాఖ్యలతో ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ద్వారా పలు జిల్లాల మహిళా సమాఖ్యలతో రేవంత్ ముఖాముఖిలో పాల్గొన్నారు. నారాయణపేట మహిళా సమాఖ్య సభ్యులు పెట్రోల్ బంక్ ద్వారా తాము ఇప్పటివరకు రూ.27 లక్షలు సంపాదించామంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా బ్యాంకులకు వందకు వంద శాతం రీపేమెంట్ చేసిన నిర్మల్ జిల్లా సమాఖ్య పరిధిలోని సంఘాలను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మెయిన్ రోడ్డులో వారికి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎం.దానకిశోర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఎండోమెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, మహిళా, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈఓ దివ్య, మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ శృతి ఓజా తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో పనులు షురూ మహిళా శక్తి భవనాల వర్చువల్ ప్రారంభం తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఆయా భవనాలకు భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. స్థానికులతో కలిసి అధికారులు పనులు మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ పనులు పూర్తయిన వందకు పైగా మహిళా భవనాలను ఎక్కడికక్కడ ప్రారంభించారు. -
తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబాద్‌తో సహా తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం పడింది. ఈరోజు(సోమవారం, మే 25వ తేదీ) మధ్యాహ్నం వరకూ ఎండతో అల్లాడిన ప్రజల్ని వర్షం పలకరించింది. హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, ఎల్బీనగర్, వనస్థలిపురం, చింతల్, బాలానగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెంట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని చోట్ల మాదిరిగా వర్షం పడగా, అక్కడక్కడా భారీగానే వర్షం పడింది. ప్రధానంగా కోఠిలో భారీ వర్షం పడింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఎల్లారెడ్డి మండలం అల్మాస్పూర్లో గాలివాన బీభత్సానికి వర్షపు నీరు కల్లాల్లోకి చేరింది. దాంతో ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి బీభత్సంతో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఓ చెట్టు కారుపై పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. గుంతపల్లి చెరువు తండాలో పిడుగుపడింది. మెదక్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షానికి మెదక్ మండలంలో ధాన్యం తడిసిపోయింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ గ్రామంలో ఈదురు గాలికి పశువుల పాక కూలింది. లక్ష్మయ్య అనే గొర్లె కాపరి మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వరి కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం తడిచిపోయింది. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆవేదన చెందుతున్నారు. -
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
హైదరాబాద్: నగర వాసులకు భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం కల్గింది. ఈరోజు(సోమవారం, మే 25వ తేదీ) హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, ఎల్బీనగర్, వనస్థలిపురం, చింతల్, బాలానగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెంట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని చోట్ల మాదిరిగా వర్షం పడగా, అక్కడక్కడా భారీగానే వర్షం పడింది. ప్రధానంగా కోఠిలో భారీ వర్షం పడింది. దీంతో హైదరాబాద్ వాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే రోహిణి కార్తె ప్రారంభం కూడా ఈరోజే కావడంతో రేపట్నుంచి ఎండలు ఎలా ఉంటాయో అనే ఆందోళన కూడా జనాల్లో ఉంది. రోహిణి కార్తె ప్రారంభంలో సాధారణంగా చినుకులు పడటం జరుగుతూ ఉంటుంది. ఆపై భానుడు మరింత సెగలు కక్కుతాడు. ఈ వర్షం అందుకే సంకేతమైతే నగరవాసులకు మరింత హీట్‌వేవ్‌ను చూడాల్సి ఉంటుంది. -
పోలీసులపైకే దూసుకొచ్చాడు..
హైదరాబాద్: వీకెండ్లో ఐటీ కారిడార్ కార్ రేస్, బైక్ స్టంట్లకు వేదికవుతోంది. రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో కారు రేస్ రేసింగ్ పాల్పడటం పరిపాటిగా మారింది. శనివారం రాత్రి కార్ రేసింగ్ చేస్తున్నారనే విషయం పోలీసులకు తెలిసింది. దీంతో వారు ఘటన స్థలానికి వెళ్లారు. తమపైకే కారు దూసుకురావడంతో వారు కంగుతిన్నారు. రేసింగ్‌కు పాల్పడిన డిగ్రీ విద్యార్థిని అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న చెప్పిన వివరాల ప్రకారం.. టీ హబ్, హై హోంభూజ, ఐకియా రోడ్లలో కారు రేసింగ్ చేస్తున్నారని సమాచారం అందడంతో శనివారం రాత్రి 12.30 గంటలకు బ్లూకోల్ట్ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఎం.రమేష్ హెడ్‌కానిస్టేబుల్ అక్కడికి వెళ్లారు. నాలెడ్జి సిటీలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి నిలోఫర్ కేఫ్ వైపు హోండా సిటీ కారు భారీ శబ్దాలు చేస్తూ రోడ్డుపై మితిమీరిన వేగంతో చక్కర్లు కొడుతోంది. బ్లూకోల్ట్ సిబ్బంది కారును ఆపేందుకు ప్రయత్నించగా అందులోని వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కారు సైడ్ మిర్రర్ తాకడంతో కానిస్టేబుల్ రమేష్ కుడిచేతికి గాయాలయ్యాయి. ఫిరోజ్గాం«దీనగర్‌కు చెందిన మహ్మద్ రెహా్మన్ (18) మెహిదీపట్నంలోని ఓ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి కారు రేసింగ్‌కు వచ్చాడు. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసిన రెహా్మన్ను పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. కారులోంచి పారిపోయిన ఒయాసిస్, అయాన్, వాసిమ్లపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కారు, బైక్ రేసింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. -
ORRపై 200 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన యువకుడు
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కారును నడిపి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతోపాటు టోల్ సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేసిన వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలకాపూర్ టౌన్‌షిప్‌కు చెందిన కొత్తపల్లి యశ్వంత్‌రెడ్డి గత ఏప్రిల్‌లో వోక్స్ వ్యాగన్ విర్టస్ కారును కొనుగోలు చేశాడు. దాని వేగాన్ని పరీక్షించేందుకు ఈ నెల 10న నార్సింగి టోల్గేట్ వద్ద ఔటర్‌రింగ్ రోడ్డు ఎక్కి కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపాడు. దాన్ని తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. దాన్ని గమనించిన పెట్రోలింగ్ అధికారి కె.సాయిరాం ఈ నెల 19న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసి ఆదివారం అతడితోపాటు కారును అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, ప్రమాదకర స్టంట్లు చేయటం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, ఇలాంటి చర్యలతో అమాయక ప్రయాణికులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందన్నారు. -
వివాహేతర సంబంధం.. ప్రియురాలి నాలుక కోసిన ప్రియుడు!
హైదరాబాద్: సహజీవనం చేస్తున్న మహిళ నాలుకను కోసేశాడు ఓ వ్యక్తి. కుషాయిగూడ ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడ, శుభోదయ కాలనీలో నివాసం ఉంటున్న సుజాత దినసరి కూలీ. ఆమె భర్త చనిపోవడంతో అదే కాలనీకి చెందిన నవీన్ అనే వ్యక్తితో కలిసి ఆరు నెలలుగా సహజీవనం చేస్తోంది. కూలీ పనిచేసే ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఈ నెల 22న మద్యం మత్తులో ఉన్న వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. మాటామాట పెరగడంతో ఆమె నాలుకను నవీన్ కోశాడు. ఇరుగుపొరుగు గమనించి అదే కాలనీలో ఉండే ఆమె కొడుకు డేవిడ్‌కు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న డేవిడ్ ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రజా పాలనలో ఇంతటి దుస్థితినా?: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: గర్భిణి రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే ప్రసవించాల్సిన పరిస్థితి… మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి… అంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదేనా ‘ప్రజా పాలన’నా అంటూ రేవంత్ సర్కార్‌ను నిలదీస్తూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారాయన. తాండూర్‌లో ఓ నిరుపేద గర్భిణికి 108 అంబులెన్స్ సేవలు సమయానికి అందలేదని, ఫలితంగా ఆమె రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే ప్రసవించాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. అదే సమయంలో భద్రాచలంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తరలించేందుకు హియర్స్ వాహనం అందుబాటులో లేక కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లిన ఘటన కూడా చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. ఘటనలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగులను పోస్ట్ చేశారు.Is this the “Praja Palana” people were promised?The condition of Telangana’s public healthcare system under the Congress government is becoming deeply disturbing and heartbreaking.In Tandur, a poor pregnant woman was forced to deliver her baby on a railway platform after 108… pic.twitter.com/1O4cQYr54Y— Harish Rao Thanneeru (@BRSHarish) May 25, 2026కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు, హియర్స్ వాహన సదుపాయాలు ఇప్పుడు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారాయన. అత్యవసర పరిస్థితుల్లో పేదలకు అండగా ఉండాల్సిన వ్యవస్థలు ఇలా కుప్పకూలడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రాణాలు కాపాడాల్సిన సేవలు పనిచేయకపోవడం, మరణానంతరం గౌరవం ఇవ్వాల్సిన వ్యవస్థలు కూడా విఫలమవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 108 సేవలను, హియర్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని, బాధ్యతను నిర్ణయించాలని రేవంత్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
టీజీకి హీట్‌వేవ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతోంది. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం నుంచే తీవ్రమైన ఎండ కారణంగా మిట్ట మధ్యాహ్నం అయితే వాతావరణం నిప్పుల కొలిమిలా మారుతోంది. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో వాతావరణ శాఖ ఈరోజు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది.తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి - కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ములుగు, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాలు, జగిత్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, భద్రాద్రిలో తీవ్రమైన వేడిగాలులు 44-47°C లతో మధ్యాహ్నం సమయంలో LOO గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.ఉరుములతో కూడిన వర్షసూచన.. మరోవైపు.. నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, తదితర ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, ఇతర జిల్లాల్లో, అక్కడక్కడా మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక, హైదరాబాద్ సిటీలో సాయంత్రం నుంచి రాత్రి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం/ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.Today's FORECAST - May 25, 2026HEATWAVE WARNING ⚠️🔥SERIOUS HEATWAVE conditions ahead in Khammam, Bhadradri - Kothagudem, Mahabubabad, Suryapet, Nalgonda, Mulugu, Warangal, Hanmakonda, Karimnagar, Peddapalli, Bhupalapally, Mancherial, Jagitial, Asifabad, Adilabad, Nirmal,…— Telangana Weatherman (@balaji25_t) May 25, 2026 -
జూబ్లీహిల్స్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దంపతులపై యువకుల దాడి
బంజారాహిల్స్: మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు అర్ధరాత్రి దారి కాసి అకారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దంపతులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... సనత్‌నగర్ జెక్ కాలనీలో నివసించే ముజఫర్ ఎండీ ఖాన్ యష్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. శనివారం అర్ధరాత్రి తన భార్యతో కలిసి కారులో అన్నపూర్ణ స్టూడియో రోడ్డులో వెళ్తున్నారు. ఓ కారులో వచ్చిన ముగ్గురు యువకులు తప్పతాగి అకస్మాత్తుగా రోడ్డును బ్లాక్ చేసి వీరిని అడ్డగించారు. ఇదేమిటని ప్రశి్నంచిన ముజఫర్‌పై దాడికి పాల్పడటంతో ముఖం, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకున్న ఆయన భార్యపై కూడా దాడి చేయడంతో ఆమెకు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
‘ఇదే నా చివరి రాత్రి.. నువ్వు సుఖంగా ఉండు’
హైదరాబాద్: జీవితం మీద విరక్తి చెంది ఓ యువకుడు ‘ఇదే నా చివరి రాత్రి’ అంటూ సెల్ ఫోన్లో తన స్నేహితులకు మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో దేవరకొండ బస్తీలో నివసించే సమీర్ (20) ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా సమీర్ మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం స్నేహితులకు ‘ఇదే నా చివరి రాత్రి. నువ్వు సుఖంగా ఉండు’ అంటూ చాటింగ్ చేసి ఆదివారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఎలాంటి కారణాలు కూడా లేవని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి మొబైల్ ఫోన్ చాటింగ్‌లను పోలీసులు పరిశీలించారు. -
హైదరాబాద్‌లో అత్యధిక డిమాండ్ ఈ మందులకే
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర పౌరులు మధుమేహం, రక్తపోటు, ఎసిడిటీ, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రోగాలతో నలిగిపోతున్నారు. నగరంలో అమ్ముడవుతున్న మందుల్లోనూ వీటిదే అగ్రస్థానం. గ్రేటర్ పరిధిలోని 35 శాతం మంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) వెల్లడించింది. ఐటీ కారిడార్‌లో రక్తపోటు, స్ట్రెస్ రిలీఫ్ మందుల అమ్మకాల్లో ఏటా 15 శాతం వృద్ధి నమోదవుతోందని ప్రి్రస్కిప్సన్స్ ట్రెండ్ స్పష్టం చేసింది. 60 ఏళ్లు పైబడినవారు రోజుకు మూడు పూటలా కలిపి 6 నుంచి 10 మాత్రలు మింగుతున్నారని నివేదికలో పేర్కొంది. 42 లక్షల మంది మందులతోనే.. గ్రేటర్ పరిధిలో సుమారు 1.35 కోట్లు. వీరిలో దాదాపు 42 లక్షల మంది బీసీ, షుగర్, థైరాయిడ్, అసిడిటీ, గుండె, ఊపిరితిత్తులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి జబ్బులున్న వారు రోజుకు కనీసం రెండు నుంచి నాలుగు మాత్రలు తీసుకుంటుండగా, వృద్ధుల్లో ఈ సంఖ్య 6 నుంచి 10 మాత్రలుగా ఉందని అంచనా. మధుమేహంలో మనమే.. దేశంలో అత్యధికంగా మధుమేహం బాధితులున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. మధుమేహం నియంత్రణకు వినియోగించే మందుల అమ్మకాలు అంతే పరిమాణంలో ఉంటున్నాయి. టైప్–1, టైప్–2 బాధితులు రోజుకు ఒక దఫా నుంచి మూడు దఫాలు ఇన్సులిన్ తీసుకుంటున్నారు. బాధితుల్లో సుమారు 10 నుంచి 15 శాతం మంది ఇన్సులిన్ ఇంజక్షన్లపైనే ఆధారపడుతున్నారు. ఐటీ కారిడార్‌లో టెకీలతో పాటు ఇతర రంగాల్లోని నిపుణుల్లోనూ మానసిక ఒత్తిడి పెరుగుతోంది. దీంతో స్ట్రస్ రిలీఫ్, బీపీ మందుల వినియోగం గణనీయంగా పెరిగింది. థైరాయిడ్‌లో మహిళలతో సమానంగా పురుషులు అధిక మసాలాలు ఉండే బిర్యానీ, ఇతర వంటకాలు, సమయానికి ఆహారం తినకపోవడంతో అసిడిటీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. థైరాయిడ్ మహిళలతో పాటు పురుషుల్లోనూ సమానంగా కనిపిస్తోంది. వివిధ రకాల యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి వంటి మాత్రలు అధికంగా వినియోగిస్తున్నారు. జర్నల్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నివేదిక ప్రకారం యాంటీబయాటిక్స్ వాడకంలో దేశంలోనే హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ప్రతి వెయ్యి మందిలో రోజు సగటున 15 మంది యాంటీబయాటిక్స్ వినియోగిస్తున్నారు. -
వడదెబ్బతో 61 మంది మృతి
సాక్షి, నెట్వర్క్ : అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం వడదెబ్బతో 61 మంది మృతి చెందారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 26 మంది ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా పాతపోచారంలో లింగాల రాజయ్య(75), బడితండాలో అజ్మీరా లచ్యా (80), నెల్లికుదురులో వీరగాని వీరమ్మ (84), కొత్త రామయ్య (86), తొర్రూరులో పైండ్ల నర్సయ్య(45), అమ్మాపురంలో అత్తిలి రాము(60), నాంచారిమడూరులో సోమ నారాయణ (65), గూడూరులో పాపని ఎల్లమ్మ (68) వడదెబ్బతో మృతి చెందారు. ములుగు జిల్లా రామన్నగూడెంలో దొడ్డ వెంకటయ్య(85), కన్నెపల్లిలో పాయం సుశీంద్ర (65), జనగామ నాగిరెడ్డిపల్లిలో తేలు మల్లమ్మ (70), జఫర్‌గఢ్‌లో తాటికాయల బాబు (49), రంగరాయగూడెంలో తల్లీకూతుళ్లు మంద చంద్రమ్మ(80), కవిత (35), జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుంటూరుపల్లిలో ఎర్రబోయిన జయలక్ష్మి (65), వరంగల్ కరీమాబాద్‌లో బేతి అశోక్ (55), కరీమాబాద్‌లో మైదం శ్రీను (55), వెంకటాపురంలో గోర్కటి లింగమ్మ (70), గొర్రెకుంటలో గడ్డం పద్మ (55), వర్ధన్నపేటలో చందు ఐలయ్య (88), ఇల్లందలో వనం వజ్రమ్మ (70), రొడ్డ సుశీల (65) వడదెబ్బతో మృతిచెందారు. హనుమకొండ జిల్లా గాంధీనగర్‌లో తూముల రాజయ్య (68), కొత్తూరు మార్కెట్ ప్రాంతంలో నివసించే ఎండీ.బియాబానీ (65), కొండపర్తిలో నీరటి అనసూర్య(58), వెల్లంపల్లిలో నూక సాంబయ్య (65) వడదెబ్బతో మృతి చెందారు. ⇒ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. పెద్దపల్లి జిల్లా నాగారానికి చెందిన మల్యాల సత్తమ్మ (78), రొంపికుంటకు చెందిన కొండి లక్ష్మి (75), చిప్ప శ్రీనివాస్ (35), ధూళికట్టకు చెందిన గండ్ర సత్తెమ్మ (65), కొత్తపల్లికి చెందిన పిన్‌రెడ్డి అశ్విని (33), రాయికల్‌కు చెందిన గద్దె భూమక్క (75), పోచమ్మవాడకు చెందిన ఎద్దండి రాజవ్వ (85), కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన కనుకయ్య(60), రామగుండం యైటింక్లయిన్‌కాలనీలో ఆటో డ్రైవర్ ముత్యం అశోక్ (39), గోదావరిఖనిలో కూరెళ్ల సంపత్(50), అశోక్‌నగర్‌లో బొజ్జ శంకరయ్య(70) వడదెబ్బతో చనిపోయారు. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో... ఇల్లూరులో కొరివి అచ్చయ్య (90), పైనంపల్లిలో బీమాల వెంకటేశ్వర్లు (43), ఖమ్మం పాత బస్టాండ్‌లో గురుజాల కొండలు (50), బూర్గంపాడులో నోముల వంశీకృష్ణ (33), సారపాక ప్రధానకూడలి సమీపాన గుర్తు తెలియని వ్యక్తి, పాల్వంచలో కాగితాలు ఏరుకొని జీవించే గుర్తు తెలియని వ్యక్తి (50), అశ్వారావుపేటలో ఎస్.కే.షాహిదా (65), మామిడిగుండాలలో ముక్తి పూర్ణ (35), రుద్రంపూర్‌లో ఎన్.రజినీకాంత్(36) వడదెబ్బతో కన్నుమూశారు. ⇒ సిద్దిపేట జిల్లా చౌటపల్లిలో చల్లగొండ లక్ష్మణ్‌రావు (59), హుస్నాబాద్‌లో పోశవేని సహదేవ్(64), – నిజామాబాద్ జిల్లా చౌడ్తండాలో ధరావత్ బుజ్జి (42), యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వెంకటేశ్ అలియాస్ చిన్న (47),వానరాశి రత్నమ్మ(52), ధర్మోజిగూడెంలో కృష్ణవేణి(60) , సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఏర్పుల శివ(40), ఇస్తాళపురంలో ఐలయ్య (66) వడదెబ్బతో మృతి చెందారు, ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. బాదంపల్లిలో దాది నరేశ్ (39), జెండావెంకటాపూర్‌లో లాటుకూరి కిరణ్(30), కుమురంభీం జిల్లా పారిగాంలో ఎల్కరి అశోక్, జక్కాపూర్‌లో పిప్రె సాయినాథ్(45), మంచిర్యాల జిల్లా ముత్యంపల్లిలో మందరాజు (49), నిర్మల్ జిల్లా కడెంలో గుర్తుతెలియని వ్యక్తి, జన్నారం మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. -
'ఏఐ'.. నా సీటెక్కడోయ్?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ట్రెండ్ మారుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు విద్యార్థుల ఆలోచన విధానం పరుగులు పెడుతోంది. ర్యాంకు తెలిసిన ప్రతీ విద్యార్థి సీటు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ఏఐ టూల్స్ ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. ఆప్షన్లపై మాక్ కౌన్సెలింగ్‌కు ఏఐ ఆధారిత నెట్ సైట్లకే లాగిన్ అవుతున్నారు. కన్సల్టెన్సీలు, ఏజెంట్లను ఆశ్రయించడం తగ్గిపోయింది. పైగా కన్సల్టెన్సీలు కూడా ఏఐ ఆధారిత ప్రిడిక్షన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఏఐ వాడకం పెరిగిన తర్వాత కన్సల్టెన్సీలకు వచ్చే విద్యార్థులు 40 శాతం తగ్గారని ప్రైవేటు కన్సల్టెంట్ సంజయ్ మిత్ర చెప్పారు. ర్యాంకును బట్టి ఏఐ ద్వారా సీటును అంచనా వేయడంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులూ ముందు వరుసలోనే ఉన్నారని తెలిపారు. తాము కూడా ఏఐ ఆధారిత అప్లికేషన్స్‌ను సమకూర్చుకోవాల్సి వచ్చిందని మరో కన్సల్టెంట్ శైలేష్ పల్లవ్ తెలిపారు. అంచనాల దూకుడులో ఏఐప్రతీ కాలేజీకి సంబంధించి గత కొన్నేళ్ల కటాఫ్ వివరాలు ఇప్పటికే క్లౌడ్ డేటాకు చేరాయి. ఏఐ ఆధారిత కసరత్తు రెండేళ్లుగా జరిగినట్టు ఎడ్యు డేటా సెంటర్‌కు చెందిన దిలీప్ మల్హోత్రా తెలిపారు. కౌన్సెలింగ్ ప్రిడిక్టర్స్, ర్యాంకు ఆధారిత కాలేజీ అవకాశాలు, బ్రాంచ్ వారీగా విశ్లేషణలు, ఏఐ ఆధారిత రికమండేషన్స్, కొన్నేళ్లుగా కటాఫ్ ఆధార అంచనాలతో కూడిన డేటా.. క్లౌడ్ సెంటర్ల నుంచి వేగంగా తెస్తున్నాయని, ఇందుకు సంబంధించి ఆధునిక అప్లికేషన్స్ నెట్లో హల్చల్ చేస్తున్నాయని హైదరాబాద్ క్లౌడ్ డేటా సెంటర్ ప్రాజెక్టు మేనేజర్ వినీత్ వస్లా తెలిపారు. ప్రారంభ, ముగింపు కటాఫ్ వివరాలను అన్ని కాలేజీల స్థాయిల్లో అందించేలా అప్లికేషన్స్ రూపొందించినట్టు చెప్పారు. దీనివల్ల విద్యార్థులకు ర్యాంకు అంచనా కోసం వెతికే సమయం తగ్గిపోయిందన్నారు. ఐదు నుంచి పదేళ్ల కటాఫ్ వివరాలను కొన్ని అప్లికేషన్లు గ్రాఫిక్స్ రూపంలో అందిస్తున్నాయి. కాలేజీల ప్లేస్మెంట్ ట్రెండ్, ఫీజులు తదితర సమాచారం డేటా కేంద్రాల్లో నిక్షిప్తం చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. కొన్నేళ్ల బ్రాంచీల వారీగా డిమాండ్ వివరాలనూ ఏఐ మాడ్యూల్స్ ద్వారా తెలుసుకునే అవకాశాలు పెరిగినట్టు కేరీర్ కన్సల్టెన్సీకి చెందిన విక్రమ్ పొలంపల్లి తెలిపారు.నెట్లో హల్చల్..కన్వెన్షనల్ ఏఐ కౌన్సెలర్లు ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇవి చాట్ జీపీటీ తరహాలో పనిచేస్తున్నాయి. ‘నా ర్యాంకు ఇంత... నాకు సీఎస్ఈ సీటు కావాలి.. హైదరాబాద్‌లో ఏ కాలేజీలో వస్తుంది’ అని ఫీడ్ చేస్తే క్షణాల్లో సమాధానం వస్తుంది. కాలేజీల జాబితా, గత కటాఫ్, ఫీజులు, ప్లేస్మెంట్, ప్రత్యామ్నాయ బ్రాంచీలను ఏఐ సూచిస్తోంది. ఈ తరహా ప్లాట్‌ఫామ్‌కు ఏఐ ట్యూటర్, కటాఫ్ ప్రిడిక్షన్, కెరీర్ గైడెన్స్ వంటి ఫీచర్లను కొత్తగా జోడించడం వల్ల ఫలితం వేగంగా వస్తోంది. అంతేకాదు... ఎంచుకునే కోర్సు డిమాండ్‌ను కూడా ఏఐ విశ్లేషిస్తోంది. కోర్... నాన్ కోర్... ఎమర్జింగ్ కోర్సుల్లో డిమాండ్... ఉద్యోగ అవకాశాలు.. ఐదేళ్లుగా బ్రాంచీకి ఉన్న డిమాండ్, ఉపాధి అవకాశాల వివరాలు అందుతున్నాయి. పర్సనలైజ్డ్ కౌన్సెలింగ్ డ్యాష్ బోర్డులూ చురుకుగా పనిచేస్తున్నాయి. విద్యార్థి ప్రొఫైల్, మాక్‌టెస్ట్ పనితీరు, ఇష్టమైన నగరాలు, ఫ్యామిలీ బడ్జెట్ వివరాలను ఈ డ్యాష్‌బోర్డ్ ద్వారా రూపొందిస్తున్నారని, భవిష్యత్‌లో ఇవి మరింత కీలకం అవుతాయని ఐటీ రంగ నిపుణుడు చరణ్ సంగుపాటి తెలిపారు. కౌన్సెలింగ్ కేంద్రాలు, కాలేజీలు కూడా వీటి ఆధారంగానే విద్యార్థులను యాజమాన్య కోటా వైపు మళ్లించే వీలుందని తెలిపారు.ఈసారి సూపర్ ర్యాంక్ 5 వేలే..ఏఐ అంచనాలన్నీ ఈ ఏడాది కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ ఉంటుందనే చెబుతున్నాయి. ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సుల ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీఎస్ఈ కోర్సులకు ప్రధాన పది కాలేజీల్లో 5 వేల ర్యాంకు కటాఫ్‌గా ఉండే వీలుందని చెబుతున్నాయి. ఓయూ, జేఎన్టీయూహెచ్ వంటి క్యాంపస్‌లలో 3 వేల వరకూ కటాఫ్ ఉండే వీలుందని చెబుతున్నాయి. టాప్ కాలేజీలు, యూనివర్సిటీలకు ఇతర జిల్లాల్లో ఉండే కాలేజీల్లో ఎస్సీ కేటగిరీకి 10 నుంచి 16 వేల ర్యాంకు వరకూ సీఎస్ఈ సీటు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నాయి. కంప్యూటర్ కోర్సుల తర్వాత ఈసీఈ కోర్సుకు రెండో ప్రాధాన్యత కన్పిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. టాప్ కాలేజీల్లో 8 వేల వరకూ, క్యాంపస్ కాలేజీల్లో 5 వేల వరకూ సీటు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నాయి. -
'ఐటీఐ'నా.. జాబ్ రెడీ
‘నమస్తే సార్..అర్జెంట్‌గా ఫిట్టర్ కావాలి. నెలకు రూ.20 వేలు ఇస్తాం. సార్ ఎలక్ట్రీషియన్ ఉంటే కాస్త పంపండి..ఐటీఐ పూర్తి చేస్తే చాలు. మెకానిక్ కోసం చూస్తున్నాం సర్.. చాలా రోజుల నుంచి అడుగుతున్నాం.’ ఇవీ ప్రతిరోజూ ఐటీఐల ప్రిన్సిపాల్స్‌కు కంపెనీల విన్నపాలు. ఒకప్పుడు చదువు మధ్య లో మానేసినవారు, ఇంటర్ ఫెయిలైన వారు ఐటీఐ చేసేవారు. ఇప్పుడు సీన్ తారుమారైంది. ఇండ్రస్టియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ) నుంచి సర్టిఫికెట్ అందుకోగానే అభ్యర్థులకు జాబ్ రెడీగా ఉంటోంది. సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారితో పోలిస్తే ఐటీఐ స్టూడెంట్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐల అభివృద్ధికి పూనుకోవడం, సామాజిక మాధ్యమాలు, మెరుగైన వేతనంతో ఆఫర్లు వెల్లువెత్తుతుండడం.. వెరసి సాంకేతిక శిక్షణ వైపు యువత మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడూ ఖాళీలే.. ఐటీఐ అభ్యర్థుల కోసం ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు.. వైజాగ్, వరంగల్, తిరుపతి, విజయవాడ, చెన్నై, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, ఢిల్లీలోనూ ఉద్యోగ అవకాశాలు రెడీగా ఉంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఒక్క హైదరాబాద్ నగరంలోనే 2,000 మంది ఐటీఐ అభ్యర్థుల కోసం జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి. 2026 ఆగస్టులో 18,000 మంది తమ కోర్సు పూర్తి చేసుకోనున్నారు. వీరిలో ఇప్పటికే సుమారు 5,000 మంది క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా పలు కంపెనీలకు ఎంపిక కావడం విశేషం. అంతర్జాతీయంగా రూ.లక్షల్లో వేతనాలు.. ఐటీఐ అభ్యర్థులకు అంతర్జాతీయంగా అధిక వేతనంతో ఉద్యోగ ఆఫర్లు పెరుగుతున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే ఔత్సాహికులకు తెలంగాణ ఓవరీŠస్స్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) పూర్తి సహకారం అందిస్తోంది. ఇజ్రాయెల్, యూరప్, జీసీసీ దేశాలు, ఆస్ట్రేలియాలో కనీస ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉంటే చాలు. ట్రేడ్‌ను బట్టి నెల వేతనం జర్మనీలో రూ.2.7 లక్షలు, యూరప్ దేశాల్లో రూ.1.7 లక్షలు, జీసీసీ దేశాల్లో రూ.1.30 లక్షలు ఉంది. నిర్మాణ రంగంలో మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ఇజ్రాయెల్ నెలకు రూ.2.5 లక్షల వేతనం ఆఫర్ చేస్తోంది. తెలంగాణ కార్మిక శాఖ ఈ ఏడాది నుంచే ఎంపిక చేసిన ఐటీఐలలో జర్మన్ భాషను ప్రవేశపెడుతోంది. క్రమంగా ఫ్రెంచ్, జపనీస్‌తోపాటు ఇతర భాషలను పరిచయం చేయనున్నారు. అమ్మాయిలు అతి తక్కువ ఐటీఐ వైపు చూస్తున్న అమ్మాయిల సంఖ్య 1–2 శాతం మించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఫాక్స్‌కాన్ కేవలం మహిళలనే నియమించుకుంటోంది. ఏటా ఈ కంపెనీ 1,000 మందికి జాబ్స్ ఇస్తోంది. కొత్త ఉత్పత్తుల తయారీ తోడైతే ఈ సంఖ్య 5,000 దాటుతుందని అంచనా. ఏటా ఐటీసీ 1,000 మంది, ష్నైడర్ ఎలక్ట్రిక్ 500 మంది మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఐటీఐ పూర్తి చేస్తే మెరుగైన వేతనం ఉంటుందన్నది అధికారుల మాట. – టాటా సహకారంతో 65 ఐటీఐలను అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దారు. మరో 54 కేంద్రాలు ఒకట్రెండేళ్లలో ఏటీసీలుగా మారనున్నాయి. – ప్రస్తుతం 32 రకాల ట్రేడ్స్ ఉన్నాయి. ఏఐ, సోలార్, రోబోటిక్స్, ఏరో నాటికల్, సెమీ కండక్టర్ వంటి 10 ట్రేడ్స్ కొత్తగా రానున్నాయి. ఉపకార వేతనంతో.. మరింత మందిని ఐటీఐల వైపు ఆకర్శించేందుకు నెలకు రూ.2,000 ఉపకార వేతనం ఇవ్వనున్నాం. తద్వారా అయినా అమ్మాయిలు ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాం. జపాన్‌లో కేర్ గివర్స్ జాబ్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇక పారిశ్రామికవర్గాలతో చర్చించి మార్కెట్ డిమాండ్‌ను బట్టి కొత్త కోర్సులను డిజైన్ చేస్తున్నాం. నైపుణ్యం ఉంటే లక్షల రూపాయల వేతనంతో విదేశీ అవకాశాలనూ విద్యార్థులు చేజిక్కించుకోవచ్చు. – ఏ.కాంతి వెస్లీ, డైరెక్టర్, ఉపాధి, శిక్షణ శాఖ. సరఫరా చేయలేం మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా మానవ వనరులను సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఉద్యోగ ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. అభ్యర్థుల కోసం ఈ కంపెనీలన్నీ ఆగస్ట్ వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం శిక్షణలో ఉన్న 18,000 మందికి ప్లేస్మెంట్ ఖాయం. బహుశా ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ఇన్ని అవకాశాలు లేవు. వయో పరిమితి లేకపోవడం, జాతీయ స్థాయి సర్టిఫికెట్ కావడంతో డిగ్రీలున్నవారూ ఐటీఐల్లో చేరుతున్నారు. – కె.శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్, ఐటీఐ, హకీంపేట. -
జీరో కమిషన్, స్థిరమైన చార్జీలు.. భాగ్యనగరంలోకి ‘భారత్ ట్యాక్సీ’
సాక్షి, హైదరాబాద్: దేశంలో యాప్ ఆధారిత క్యాబ్/ఆటో సర్వీసు రంగాన్ని గుప్పిట్లో పెట్టుకున్న కార్పొరేట్ గుత్తాధిపత్యానికి తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మొట్టమొదటి సహకార రవాణా వ్యవస్థ ‘భారత్ ట్యాక్సీ’త్వరలో హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఓలా, ఉబర్, రాపిడో సంస్థలు ఈ రంగంలో ఉన్న విషయం తెలిసిందే. కాగా వీటిల్లో లక్షలాది మంది డ్రైవర్లు సభ్యులుగా ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో మారిన ఆయా సంస్థల విధానాలతో విసిగిపోయిన డ్రైవర్లు, భారత్ ట్యాక్సీ సేవలు వీలైనంత త్వరగా ప్రారంభించాలని తాజాగా సంస్థ నిర్వాహకులను కోరారు. ఈ నేపథ్యంలో వచ్చే ఐదారు నెలల్లో హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించేలా సన్నాహాలు కొనసాగుతున్నాయి. భారత్ ట్యాక్సీకి అధికారికంగా స్వాగతం పలికేందుకు డ్రైవర్ల సంఘం వేదికను సిద్ధం చేస్తోంది. డ్రైవర్లలో అసంతృప్తి హైదరాబాద్‌లో యాప్ ఆధారిత క్యాబ్ సేవలు విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. యాప్ ద్వారా బుకింగ్ సులభంగా ఉండటం, బుక్ చేసిన కొద్ది నిమిషాలకే ట్యాక్సీ అందుబాటులోకి వస్తుండటంతో ప్రయాణికులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం నగరంలో 1.40 లక్షల క్యాబులుండగా, లక్ష వరకు ఈ యాప్ ఆధారిత అగ్రిగేటర్లతో భాగస్వామ్యమయ్యాయి. దాదాపు లక్షన్నర ఆటోల్లో 90 వేలు వీటితో అనుసంధానమయ్యాయి. దీన్ని ఆసరా చేసుకుని నిర్వాహక సంస్థలు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకపోవటంతో చార్జీల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పీక్ అవర్ అని, వర్షం కురుస్తుండటంతో క్యాబ్‌ల కొరత ఉందని, ట్రాఫిక్ జామ్ ఉందని, డ్రైవర్ రావటానికి నిరాకరిస్తున్నాడని... రకరకాల సాకులుతో అప్పటికప్పుడు చార్జీ పెంచేస్తున్నాయి. డ్రైవర్ల నుంచి కమీషన్ కింద ఏకంగా 40 శాతం వరకు తీసేసుకుంటున్నాయి. నగర ట్రాఫిక్‌లో, అననుకూల వాతావరణంలో కష్టపడుతూ వాహనం నడిపే డ్రైవర్లకు 60 శాతమే దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలపై క్యాబ్ డ్రైవర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఈ సమయంలో భారత్ ట్యాక్సీ రానుండటం డ్రైవర్లతో పాటు నగర ప్రజలకు ఊరటనిస్తుందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో.. కేంద్ర గృహ నిర్మాణ, సహకార శాఖల ఆధ్వర్యంలో భారత్ ట్యాక్సీ వ్యవస్థ రూపుదిద్దుకుంది. సహకార స్పూర్తితో ‘సారథి హీ మాలిక్ (నడిపేవాడే యజమాని)‘నినాదంతో ఇది ఏర్పాటైంది. ’సహకార్ సే సమృద్ధి’(సహకారం ద్వారా సంపద) అన్న ట్యాగ్‌లైన్‌తో ఆరునెలల క్రితం మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద ఈ వ్యవస్థ రిజిస్టర్ అయింది. అమూల్, ఇఫ్కో, నాబార్డ్ , క్రిబ్కో తదితర సహకార సంస్థల భాగస్వామ్యంతో ’సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్’దీనిని రూపొందించింది. రెండు నెలలు పైలట్ ప్రాజెక్టుగా పరిశీలించి గత ఫిబ్రవరిలో ఢిల్లీలో అధికారికంగా ప్రారంభించారు. తొలుత ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘాజియాబాద్లతో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్, సోమనాథ్, ద్వారకలలో ప్రారంభించారు. ప్రస్తుతం రెండున్నర లక్షల మందికి పైగా డ్రైవర్లు సభ్యులుగా చేరారు. త్వరలో హైదరాబాద్‌తో పాటు ముంబై, బెంగుళూరు, చెన్నై, కోల్‌కతాలలో ప్రారంభించాలని నిర్ణయించారు. తొలుత ముంబైలో ప్రారంభం కానుండగా..హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్లు ఇక్కడ కూడా త్వరగా ప్రారంభించాలని ఒత్తిడి తెస్తుండటం విశేషం. ఎదురుచూపులు ఎందుకంటే.. – భారత్ టాక్సీ ’జీరో కమీషన్’విధానంలో నడుస్తుంది. ప్రయాణికులు చెల్లించే మొత్తం నేరుగా డ్రైవర్ బ్యాంక్ ఖాతాకే వెళ్తుంది. సంస్థ నిర్వహణ కోసం కేవలం రోజువారీ లేదా నెలవారీ స్వల్ప సభ్యత్వ రుసుము మాత్రమే డ్రైవర్లు చెల్లించాల్సి ఉంటుంది. – ట్రాఫిక్ రద్దీ, పండగలు, క్యాబ్‌ల కొరత, వర్షం, పీక్ అవర్స్... ఇలా కారణాలు చెప్తూ అధిక మొత్తం చార్జీ వసూలు ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన స్థిరమైన, పారదర్శక చార్జీలు మాత్రమే ఉంటాయి. ప్రైవేట్ సంస్థల చార్జీలతో పోలిస్తే 30 – 50 శాతం తక్కువగా ఉండనున్నాయి. – ప్రతి డ్రైవర్‌కు రూ.5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, రూ.5 లక్షల కుటుంబ ఆరోగ్య బీమా ఉంటుంది. రిటైర్మెంట్ సేవింగ్స్ ప్లాన్‌ను కూడా ఈ సంస్థ అందిస్తోంది. – మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా మహిళా డ్రైవర్లతో కూడిన ట్యాక్సీ, బైక్ సర్వీసులను ప్రవేశపెట్టారు. మహిళా ప్రయాణికులు మహిళా డ్రైవర్లనే ఎంచుకునే వెసులుబాటు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయటంతో... రాష్ట్రంలో సొంతంగా టాక్సీ/ఆటో యాప్‌ను అభివృద్ధి చేయనున్నట్టు రెండున్నరేళ్ల క్రితం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత చేతులెత్తేసింది. ప్రైవేటు అగ్రిగేటర్ల ఒత్తిడికి తలొగ్గి సొంత యాప్ హామీని గాలికొదిలేసిందని క్యాబ్ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. సొంత యాప్ సంగతి పక్కనపెడితే, కనీసం క్యాబ్ ధరల నియంత్రించలేని దుస్థితి ఉంది. ఇలావుండగా..గత వారం రోజుల్లో రెండు పర్యాయాలు డీజిల్, పెట్రోలు ధరలు పెంచటంతో తమ చార్జీలు కూడా పెంచాలని క్యాబ్/ఆడో డ్రైవర్లు అగ్రిగేటర్లను కోరుతున్నారు. అయితే మూడు అగ్రిగేట్ సంస్థలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నందున చార్జీల పెంపునకు అంగీకరించడం లేదు. దేని చార్జీ తక్కువుంటే ప్రయాణికులు అటువైపు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణం. -
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
నారాయణఖేడ్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా మనూరు మండలం ఎల్గోయి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ హత్య ఉదంతం తొమ్మిది రోజుల అనంతరం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మనూరు మండల కేంద్రానికి చెందిన కల్పనకు నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన చంబనోళ్ల ముత్యంరెడ్డి (36)తో 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పదేళ్లలోపు కూతురు, కుమారు డు ఉన్నాడు.మృతుడు ముత్యంరెడ్డి నారాయణఖేడ్ పట్టణంలో మోటారు వైండింగ్ మెకానిక్‌గా పనిచేస్తున్నా డు. కల్పన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసి ఈ మధ్య కాలంలో ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా చేరింది. కాగా ఈ నెల 16వ తేదీ నుంచి ముత్యంరెడ్డి కనిపించకుండా పోయాడు. దీంతో తన భర్త కనిపించడం లేదని కుటుంబీకులతో కలిసి కల్పన నారాయణఖేడ్ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 18న ఫిర్యాదు చేసింది.పోలీసులు ముత్యంరెడ్డి కోసం గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో కేసును సవాల్‌గా తీసుకున్నారు. భార్య కల్పన ఫోన్ కాల్స్‌పై నిఘాపెట్టగా 16న తన ప్రియుడైన మనూరు మండలం ఎల్గోయికి చెందిన గైని పండరి అలియాస్ చింటుతో చాలా సార్లు ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా ముత్యంరెడ్డిని హత్యచేసి ఎల్గోయిలోని పండరి చేనులో మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు నేరం అంగీకరించారు. పోలీసులు ఆదివారం గోతిలోంచి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏంటి 'సర్'.. ఇంత 'స్లో'..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– సర్)కు ముందు చేపట్టిన ఓటర్ల మ్యాపింగ్ (ప్రీ సర్) ప్రక్రియ నగర ప్రాంతాల్లో ఆశించిన వేగంతో సాగడం లేదు. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో తక్కువ శాతం మ్యాపింగ్ ఎన్నికల యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 42.82 శాతం మ్యాపింగ్ మాత్రమే జరగడం గమనార్హం. అయితే జిల్లాల్లోని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ గణనీయంగా ముందంజలో ఉంది. ఈ నెల 20వ తేదీ నాటికి రాష్ట్రంలోని 3.39 కోట్ల మంది ఓటర్లలో 2.23 కోట్ల మందిని (65.95 శాతం) మాత్రమే 2002 ‘సర్’జాబితాలతో మ్యాపింగ్ చేయగలిగారు. ఇంకా 1.15 కోట్లకు పైగా ఓటర్లు మ్యాపింగ్ కావాల్సి ఉంది. ఇందులో అర్బన్ ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. ముషీరాబాద్‌లో అత్యల్పం హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47.10 లక్షల మంది ఓటర్లుండగా, ఇప్పటివరకు సుమారు 20.17 లక్షల మందిని మాత్రమే మ్యాప్ చేయగలిగారు. ఇంకా దాదాపు 26.92 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్ జరగాల్సి ఉంది. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5 నియోజకవర్గాల్లో.. ముషీరాబాద్ (34.33 శాతం), నాంపల్లి (37.59 శాతం), జూబ్లీహిల్స్ (38.09 శాతం), సనత్‌నగర్ (39.80 శాతం), సికింద్రాబాద్ (40.12 శాతం)లో అత్యల్పంగా మ్యాపింగ్ జరిగింది. ఈ ప్రాంతాల్లో వలస జనాభా ఎక్కువగా ఉండటం, తరచూ చిరునామాలు మారడం, అద్దె ఇళ్లలో నివసించే వారు ఎక్కువగా ఉండటం, పాత కుటుంబ వివరాలు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు మ్యాపింగ్‌కు ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక మిగతా నియోజకవర్గాల విషయానికొస్తే..మలక్‌పేటలో 41.92 శాతం, అంబర్‌పేట్‌లో 41.40, ఖైరతాబాద్‌లో 46.30, కార్వాన్లో 50.64, గోషామహల్లో 42.45, చార్మినార్‌లో 47.68, చాంద్రాయణగుట్టలో 42.39, యాకుత్‌పురాలో 45.22, బహదూర్‌పురాలో 51.65, కంటోన్మెంట్లో 42.38 శాతం మ్యాపింగ్ జరిగింది. పాతబస్తీ పరిధిలోని బహదూర్‌పురా, కార్వాన్లలో అత్యధికంగా జరగడం విశేషం. మేడ్చల్‌లో మరీ దారుణం క్యూర్ పరిధిలో ఉన్న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ మ్యాపింగ్ కేవలం 35.85 శాతం మాత్రమే నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 51.59 శాతం మ్యాపింగ్ నమోదైనా, రాష్ట్ర సగటుతో పోలిస్తే ఇది కూడా చాలా తక్కువే. ఐటీ ఉద్యోగులు, వలస జనాభా, కొత్తగా ఏర్పడిన కాలనీలు, అపార్ట్మెంట్ సంస్కృతి పెరగడం వల్ల కుటుంబ వారసత్వ ఓటరు వివరాలను గుర్తించడం కష్టమవుతోందని ఎన్నికల సిబ్బంది చెబుతున్నారు. గ్రామీణ జిల్లాలు ముందంజలో.. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉండగా, గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలున్న జిల్లాల్లో మాత్రం మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జనగామ జిల్లా 91.07 శాతంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. మహబూబాబాద్ లో 90.83%, యాదాద్రి–భువనగిరిలో 86.32% మ్యాపింగ్ జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల స్థిర నివాసం, తరతరాలుగా ఒకే ప్రాంతంలో నివసించడం, కుటుంబ సభ్యుల వివరాలు సులభంగా అందుబాటులో ఉండటం వల్ల మ్యాపింగ్ సులభతరమయ్యింది. కుమురంభీమ్ ఆసిఫాబాద్‌లో దాదాపు 78 శాతం, మంచిర్యాల 71, ఆదిలాబాద్ 70, నిర్మల్ 78, నిజామాబాద్ 80, కామారెడ్డి 78, జగిత్యాల 76, పెద్దపల్లి 76, కరీంనగర్ 75, రాజన్న సిరిసిల్ల 77, సంగారెడ్డి 61, మెదక్ 82, సిద్దిపేట 85, రంగారెడ్డి 51, వికారాబాద్ 74, మేడ్చల్ మల్కాజిగిరి దాదాపు 36, హైదరాబాద్ 42, మహబూబ్‌నగర్ 74, నాగర్‌కర్నూల్ 75, వనపర్తి 80, జోగుళాంబ గద్వాల 77, నల్లగొండ 80, సూర్యాపేట 76, వరంగల్ 71, హనుమకొండ 69, జయశంకర్ భూపాలపల్లి 72, భద్రాద్రి 77, ఖమ్మం 70, ములుగు 81, నారాయణపేటలో 83 శాతం మ్యాపింగ్ జరిగింది. జూన్ 25 నుంచి ఇంటింటి ధ్రువీకరణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ¯25 నుంచి జూలై 24 వరకు ఈ ప్రక్రియకు కీలకమైన ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. అంటే బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ) ప్రతి ఇంటికీ వెళ్లి ముందుగానే ముద్రించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తారు. ఇందుకోసం ప్రతి ఓటరును కనీసం మూడుసార్లు సంప్రదించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఓటర్లు స్వయంగా కూడా ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫామ్స్ సమర్పించవచ్చు. నగరాల్లో సవాలే.. ఈ ప్రీ సర్ లేదా మ్యాపింగ్ ప్రక్రియ నగర ప్రాంతాల్లో మందకొడిగా సాగుతుండటం ఎన్నికల సంఘానికి సవాల్‌గా మారుతోంది. జూన్ 25 నుంచి కేవలం నెలరోజుల వ్యవధిలో జరిగే ఈ ప్రక్రియలో ఇంకా భారీ స్థాయిలో ధ్రువీకరణ జరగాల్సి ఉండటంతో, నగరాల్లో అదనపు సిబ్బంది, సాంకేతిక సహకారం అవసరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి హైదరాబాద్‌లో మ్యాపింగ్ ఐదారు నెలలుగా కొనసాగుతోంది. అయినా అంతంత మాత్రంగానే మ్యాపింగ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం నెల రోజుల్లో కీలక సర్వే ఎలా చేయగలుగుతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మ్యాపింగ్ అంటే ఏమిటి? ప్రతి ఓటరును 2002 ప్రత్యేక సమగ్ర సవరణ జాబితాతో అనుసంధానం (లింకింగ్) చేయాల్సి ఉంది. ఓటరు సొంత నమోదు లేదా తల్లిదండ్రులు, అమ్మమ్మ, నాయనమ్మ, తాతల వివరాల ఆధారంగా ఈ లింకింగ్ జరుగుతుంది. ఈ కుటుంబ లింకింగ్ విజయవంతంగా పూర్తైతే అదనంగా పత్రాలేవీ సమర్పించాల్సిన అవసరం ఉండదు. లింక్ కాని ఓటర్లకు తర్వాతి దశలో నోటీసులు జారీ చేసి నిర్దిష్ట పత్రాలు సమర్పించాల్సిందిగా కోరే అవకాశం ఉందని సంబంధిత అధికారి తెలిపారు. -
క్యూర్లో వాటర్ పూర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుండెకాయగా పరిగణించే కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో భూగర్భ జలాలు అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంతోపాటు శివారు ప్రాంతాలు భారీ భవనాలు, సీసీ రోడ్లతో పూర్తిగా కాంక్రీట్ జంగిల్‌గా తయారు కావడం.. చెరువులు, నాలాలు కబ్జాకు గురికావడంతో చుక్క వర్షపు నీరు సైతం ఇంకడానికి జానెడు నేల మిగలలేదు. దీనికితోడు రాతి పొరలతో నిండిన దక్కన్ పీఠభూమి కావడంతో వర్షపు నీరు ఇంకడానికి అవకాశమూ లేదు. దీంతో హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో భూగర్భ జలాల రీచార్జ్ పరిమాణంతో పోల్చితే వాటి వినియోగం మించిపోయింది. ⇒ హైదరాబాద్ జిల్లాలోనే అత్యంత దుర్భర పరిస్థితిలో భూగర్భ జలాలు పడిపోయాయి. జిల్లాలో 16 మండలాలుండగా, 8 మండలాల్లో (50 శాతం) విచ్చలవిడి (ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్)గా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. అంటే, ఒక ఏడాది రీచార్జ్ అయిన భూగర్భ జలాలతో పోల్చితే ఎక్కువ భూగర్భ జలాలను హైదరాబాద్ జిల్లాలో తోడేస్తున్నారు. చార్మినార్, అంబర్పేట్, గోల్కొండ, ఆసిఫ్‌నగర్, సైదాబాద్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, హిమాయత్‌నగర్ మండలాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. మరో 7 మండలాల్లో (43.75%) క్రిటికల్ స్థాయిలో భూగర్భ జలాలు వాడుతుండగా, వీటిలో మారేడ్‌పల్లి, బండ్లగూడ, బహదూర్çపుర, ముషీరాబాద్, నాంపల్లి, షేక్‌పేట్, సికింద్రాబాద్ మండలాలున్నాయి. ఒక్క తిరుమలగిరి మండలం (6.25 శాతం)లో సెమీ క్రిటికల్ స్థాయిల్లో భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలోని ఒక్క మండల పరిధిలో కూడా భూగర్భ జలాలు సురక్షితంగా లేవు. కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని కేంద్ర భూగర్భ జలమండలి రూపొందించిన భూగర్భ జల వనరుల మదింపు నివేదిక–2025లో ఈ అంశాలను వెల్లడించింది. ⇒ మేడ్చల్–మల్కాజ్‌గిరిలోని 15 మండలాల్లో 4 మండలాలు (26.67 శాతం) భూగర్భ జలాలను ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ చేస్తున్నాయి. వీటిలో బాలానగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి మండలాలున్నాయి. జిల్లాలోని మరో 3 మండలాల్లో (20 శాతం) క్రిటికల్ స్థాయిలో భూగర్భ జలాల వాడకం ఉంది. వీటిలో మూడుచింతలపల్లి, కీసర, బాచుపల్లి ఉన్నాయి. అల్వాల్, మేడ్చల్, ఘట్కేసర్ మండలాల్లో (20 శాతం) సెమీ క్రిటికల్ స్థాయిలో వాడకం ఉంది. జిల్లాలోని మిగిలిన 5 మండలాల్లో (33.33 శాతం) సురక్షిత స్థాయిల్లో భూగర్భ జలాల వాడకం ఉంది. ⇒ రంగారెడ్డిలో 27 మండలాలుండగా, 4 మండలాలైన చౌదరిగూడ, హయాత్‌నగర్, శేరిలింగంపల్లి, సరూర్‌నగర్(14.81 శాతం)లో భూగర్భ జలాలను ఓవర్ ఎక్స్ప్లయిటెడ్ చేస్తున్నారు. మరో 9 మండలాలైన ఆమనగల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, కొందుర్గు, తలకొండపల్లి, కొత్తూరు, మొయినాబాద్, కందుకూరు, రాజేంద్రనగర్ (33.33 శాతం)లో సెమీ క్రిటికల్ స్థాయిలో వినియోగం ఉంది. ఈ జిల్లాల్లోని మిగిలిన 14 మండలాల్లో (51.85 శాతం) సురక్షిత స్థాయిల్లో భూగర్భ జలాలను వాడుతున్నారు. ⇒ ప్యూర్, రేర్ రీజియన్ల పరిధిలోని ఇక ఇతర జిల్లాలు పరిశీలిస్తే ఆదిలాబాద్ అర్బన్, ఖమ్మంలోని రఘునాథపాలెం, నల్లగొండలోని మునుగోడు, నిజామాబాద్ దక్షిణ, సంగారెడ్డిలోని పటాన్చెరు, యాదాద్రి భువనగిరిలోని ఆత్మకూరు–ఎం, నారాయణపూర్ మండలాల్లో భూగర్భ జలాల ఓవర్ ఎక్సప్లయిటేషన్ జరుగుతోంది. 774 టీఎంసీల జలాలు రీచార్జ్ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో వర్షాకాలంలో వర్షాలతో 259.2 టీఎంసీలు, ఇతర వనరులతో 382.81 టీఎంసీలు, వర్షాకాలం తర్వాత వర్షాలతో 32.48 టీఎంసీలు, ఇతర వనరులతో 233.07 టీఎంసీలు కలిపి మొత్తం 774.45 టీఎంసీల భూగర్భ జలాలు వృద్ధి అయ్యాయి. అందులో సహజ కారణాలతో 73.8 టీఎంసీలు వృథాగా ప్రవహించగా, మిగిలిన 700.64 టీఎంసీలు వాడుకోవడానికి లభ్యతలోకి ఉన్నాయి. ఇక సాగునీటికి 292.4 టీఎంసీలు, పరిశ్రమలు 14.12 టీఎంసీలు, గృహాలు 20.83 టీఎంసీలు కలిపి మొత్తం 327.01 టీఎంసీల (46.69 శాతం)ను 2025లో రాష్ట్రం వాడుకుంది. భవిష్యత్ అవసరాలకు 376.8 టీఎంసీల భూగర్భజలాల నిల్వలు మిగిలాయి. 2024తో పోలి్చతే 2025లో భూగర్భ జలాల రిచార్జ్ 720.41 టీఎంసీల నుంచి 774.45 టీఎంసీలకు పెరిగింది. 76 మండలాల్లో సురక్షితమే.. రాష్ట్రంలోని 620 మండలాల్లో భూగర్భ జలాల రీచార్జ్ వినియోగంపై మదింపు జరపగా, 23 మండలాల్లో (3.71 శాతం) ఓవర్ ఎక్స్ప్లయిటేషన్, 19 మండలాల్లో(3.06%) క్రిటికల్, 105 మండలాల్లో (16.94శాతం) సెమీ క్రిటికల్, 473 మండలాల్లో (76.29 శాతం) సురక్షితంగా భూగర్భ జలాలున్నట్టు నిర్థారించారు. స్థానికంగా భూగర్భ జలాల రీచార్జ్‌తో పోల్చితే వినియోగ స్థాయి ఆధారంగా ఓవర్ ఎక్స్ప్లయిటేషన్, క్రిటికల్, సెమీ క్రిటికల్, సేఫ్ అనే నాలుగు కేటగిరీలుగా ప్రాంతాలను కేంద్ర భూగర్భ జలమండలి విభజించింది. ఆ వివరాలను పట్టికలో చూడొచ్చు.. -
తాలు, తరుగు పేరుతో కోతలు వేస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: తాలు, తరుగు పేరుతో రైతులకు నష్టం కలిగేలా వ్యవహరిస్తే మిల్లర్లు, కొనుగోలు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ఆదివారం హైదరాబాద్‌లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్ ఆది శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.వివిధ ప్రాంతాల నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటివరకు రూ.8,749 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, కొరత ఉందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మంత్రి పేర్కొన్నారు.రబీ సీజన్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్టు మంత్రి వెల్లడించారు. తాజా అంచనాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండగా, ఇప్పటికే 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్నే కొనుగోలు చేస్తోందని, మిగిలిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. -
మక్కల కొనుగోళ్లకు మాది ‘గ్యారంటీ’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మార్కెట్‌కు తరలివస్తున్న మక్కల కొనుగోళ్లకు అవసరమైన రుణాలు సమకూర్చుకునేందుకు మార్క్‌ఫెడ్‌కు రూ.1867.77 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్ మక్కల కొనుగోళ్లకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న మార్క్‌ఫెడ్‌కు ఇప్పటికే ప్రభుత్వం రూ.4,172.94 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చింది. దీంతో మక్కల కొనుగోళ్ల కోసం మార్క్‌ఫెడ్‌కు రూ.6,040.71 కోట్ల రుణాలు పొందేందుకు ప్రభుత్వం సహకారం అందించినట్టయ్యింది.మక్కలకు క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,400 ఉండగా, మార్కెట్లో రూ.1,700 నుంచి రూ.1,850 గిట్టుబాటు ధర పలుకుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధర కింద రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది. ఇప్పటి వరకు 354 కొనుగోలు కేంద్రాల (పీఏసీఎస్‌లు) ద్వారా 2.33 లక్షల రైతుల నుంచి 12.85 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మక్కల విలువ రూ. 3,100 కోట్ల వరకు ఉంటుంది. అయితే మార్కెట్‌కు భారీ ఎత్తున మక్కలు వస్తుండడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్‌కు అదనపు రుణం పొందేందుకు అవసరమైన బ్యాంకు గ్యారంటీని ప్రభుత్వం సమకూర్చింది. కేంద్రం సహకరించకపోయినా రైతులకు అండగా : మంత్రి తుమ్మలరాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మొక్కజొన్న, జొన్న, పొద్దు తిరుగుడు పంటల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోళ్లపై ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి భారీ స్థాయిలో కొనుగోళ్లు చేపట్టేందుకు సీఎం ఆమోదం తెలిపారన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో మొక్కజొన్న కొనుగోళ్లకు మొత్తం రూ.5,063 కోట్ల మేర మాత్రమే ఖర్చు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ ఒక్క యాసంగి సీజన్లోనే దాదాపు రూ.6,000 కోట్ల మేర వ్యయం చేస్తోందని తుమ్మల స్పష్టం చేశారు.జొన్నల కొనుగోళ్లకు రూ.1,100 కోట్లుజొన్న (హైబ్రిడ్) కొనుగోళ్ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో జొన్న ధర క్వింటాల్‌కు సుమారు రూ.2,000 మాత్రమే ఉండగా, కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ.3,699గా ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.1,100 కోట్లకు పైగా వ్యయంతో జొన్న కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జిల్లాల వారీగా జొన్న కొనుగోళ్ల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.ఆదిలాబాద్ జిల్లాలో 26 కేంద్రాలు, సంగారెడ్డి జిల్లాలో 10 కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో 43 కేంద్రాలు, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జోగుళాంబ గద్వాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా కొనుగోళ్ల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.పొద్దు తిరుగుడు 25 % కొనుగోళ్ల పరిమితి తొలగింపు పొద్దుతిరుగుడు పంట విషయంలో కేంద్ర ప్రభుత్వం కేవలం 25 శాతం కొనుగోలు పరిమితి మాత్రమే అనుమతించిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ పరిమితికి మించి కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించిందని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రస్తుతం పొద్దుతిరుగుడు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,721 ఉండగా, మార్కెట్ ధర రూ.5,376 మాత్రమే ఉండటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి పంపిన ప్రతిపాదనలతోపాటు రాష్ట్ర పూల్ ద్వారా అదనంగా 10,175 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. -
లాయర్ మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
హైదరాబాద్: న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితుల్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబాడిగూడాకు చెందిన వినయ్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టినట్లు గుర్తించారు పోలీసులు. దీనిలో భాగంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఈ హత్య కేసుకు సంబంధించి వినయ్‌తో సహా నలుగుర్ని అరెస్ట్ చేశారు. కాగా, శనివారం(మే 23వ తేదీ) నగరంలోని మాసబ్‌ట్యాంక్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.. ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్‌ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం ఉదయం ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్ చేశారు. ఈ ప్రమాదంలో మొయినుద్దీన్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీని ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అడ్వకేట్ హత్యలో కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: మసబ్ ట్యాంక్ పరిధిలో దారుణహత్యకు గురైన అడ్వకేట్ మెుయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు కీలక ఆదారాలు సేకరించారు. అడ్వకేట్ హత్యలో ఆరుగురు నిందితులు పాల్గొన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆ హత్యకు వాడింది స్కార్పియో వాహనంగా గుర్తించి ఆ యజమానిని ప్రశ్నించారు. అయితే ఆ వాహనాన్ని ఆరునెలల క్రితమే తాను వేరే వ్యక్తులకు అమ్మానని కానీ కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని యజమాని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ వాహనం ఎవరు కొనుగోలు చేసిన వ్యక్తి ఏవరా అనే విషయం పోలీసులు విచారణ చేస్తున్నారు.కాగా నిన్న( శనివారం) మాసబ్‌ట్యాంక్ పరిధిలో ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్‌ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్ చేశారు. ఈ ప్రమాదంలో మొయినుద్దీన్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోకాపేటలో కళ్లు చెదిరే భవనం.. సౌత్ఇండియాకే ‘టాప్’
హైదరాబాద్: నగర రియల్ ఎస్టేట్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తూ కోకాపేట ఐటీ కారిడార్‌లో ‘ది స్కైవెన్’ (The Skyven) పేరిట సరికొత్త లగ్జరీ రెసిడెన్షియల్ టవర్ ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ‘ఈ-ఇన్ఫ్రా’ మరియు ‘పింగ్లే వెంచర్స్ & రియాల్టీ’ (PVR) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్కైస్క్రాపర్ 63 అంతస్తులు, 755 అడుగులు అంటే దాదాపు పావు కిలోమీటరు (233 మీటర్లు) ఎత్తుతో దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనంగా రికార్డు సృష్టించనుంది. కేవలం ఎత్తులోనే కాకుండా, నిర్మాణంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను పొందుపరిచిన దక్షిణ భారత దేశపు మొట్టమొదటి ‘AI-రెడీ’ స్మార్ట్ బిల్డింగ్ కూడా ఇదే కావడం విశేషం.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పెంట్‌హౌస్‌లు, ఆకాశంలో విల్లా అనుభూతినిచ్చే ‘స్కై విల్లాస్’, లగ్జరీ 4BHK నివాసాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇక్కడ సాధారణ ప్రాజెక్టుల లాగా కాకుండా, నివాసాల సంఖ్య పరిమితంగా ఉండటం వల్ల ప్రతి నివాసికి లభించే లగ్జరీ సదుపాయాల వాటా (Amenity-to-Resident Ratio) చాలా ఎక్కువగా ఉంటుంది. భవన నిర్వహణ, విద్యుత్ ఆప్టిమైజేషన్, అత్యాధునిక 24x7 భద్రతా వ్యవస్థలను ఇక్కడి AI నెట్వర్క్ స్వయంచాలకంగా నియంత్రిస్తుంది.భవనం పైభాగంలో ఏర్పాటు చేస్తున్న ‘ది ఎవరెస్ట్’ రూఫ్‌టాప్ క్లబ్ ఈ ప్రాజెక్ట్‌కే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో నగర స్కైలైన్‌తో కలిసిపోయే ‘ఇన్ఫినిటీ పూల్’తో పాటు, హైదరాబాద్ నివాస మార్కెట్లోనే తొలిసారిగా నక్షత్రాలను వీక్షించేందుకు ‘స్టార్ అబ్జర్వేటరీ’, లగ్జరీ క్లబ్‌హౌస్, స్పా, మరియు హెలిప్యాడ్ వంటి ఐదు నక్షత్రాల వసతులను కల్పిస్తున్నారు. స్థిరమైన మార్కెట్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్ గ్లోబల్ ప్రొఫెషనల్స్‌ను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ గగన విహారి రూపుదిద్దుకుంటోంది. -
కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో పాలనను కాంగ్రెస్ గాలికొదిలేసిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆదివారం అంబర్‌పేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. కేటీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో పాలనను కాంగ్రెస్ గాలికొదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పీకల్లోతు కోపం ఉంది. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు. ఉన్న నగరాన్నే సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదు. ఇలాంటి నాయకుడు ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాడంటే నమ్మాలా?. బీఆర్ఎస్లో పనిచేసే వారికే గుర్తింపు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వేల ఆధారంగానే టికెట్లు. బీఆర్ఎస్లో పని చేసేవారికే గుర్తింపు. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్దే గెలుపు. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తాం. ఎస్ఐఆర్పై అందరూ అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాసమస్యలపై పోటారం చేసిన వాళ్లకే టికెట్లు. కొందరి ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది’అని ఆరోపించారు. -
మరో మూడు రోజులు తీవ్ర వడగాలులు
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వడగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణంక కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... దీనికితోడు పడగాలులతో ప్రజలు అక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈనెల 26 వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్ మంచి ర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, అయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబా బాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లాల్లో త్రీవ వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెరిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజె అలర్ట్ జారీ చేసింది.రాత్రిపూట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 30 డిగ్రీల మేర ఉంటాయని వివరించింది. శని వారం రాష్ట్రంలో అత్యవరంగా ధర్మపురి మండలం బుద్ధిశిపల్లిలో 48.3 డిగ్రీల సెల్సియస్ ఇష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రం. లోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు చురుకుగా నైరుతి రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులు శీలిస్తే గరిష్ఠ ఉష్ణోగ్రత అమ్మంలో 44.8 డిగ్రీలుగా నమోదైంది. మరో రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలలోకి విస్తరించమన్నాయి. ఈనెల 26న కేరళలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతా వరణ శాఖ తెలిపింది. నైరుతి బిహార్, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల చక్ర వాహత ఆవర్తనం శనివారం జార్ఖండ్ ఉత్తర రత్తీస్ గఢ్, ఒడిశాల మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. అది, సోమవారాల్లో రాష్ట్రంలోని తూర్పు ఉత్తర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్గాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని కొన్ని కులాల పేర్లు ఇబ్బందికరంగా ఉన్న అంశాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ కులాల పేర్ల మార్పునకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.బీసీ కులాల్లో గ్రూప్–ఏ లోని వరుస సంఖ్య 4లో ఉన్న బుడబుక్కల కులాన్ని శివ క్షత్రియగా మార్పు చేశారు. ఇదే కేటగిరీలోని వన్నార్ను తొలగించి ధోబీగా మార్పు చేసి రజక, చాకలి, ధోబీగా.. ఏదైనా ఒక పేరును వాడుకలోకి తీసుకోవచ్చన్నారు. వరుస సంఖ్య 7లోని దొమ్మర అనే పదాన్ని తొలగించి గడ వంశీయగా మార్పు చేశారు.వరుస సంఖ్య 18లో ఉన్న పిచ్చకుంట్ల పేరును వంశరాజ్‌గా మార్పు చేశారు. వరుస సంఖ్య 23లో ఉన్న వీరభద్రియను వీరముష్టి, నెట్టి కోటల, వీరభద్రియగా మార్చారు. గ్రూప్ డీ, వరుస సంఖ్య 5లో ఉన్న మేర కులం పేరును మేరుగా మార్పు చేశారు. వరుస సంఖ్య 29లో ఉన్న శూద్ర కులం పేరును తొలగించి తమ్మలిగా మార్చారు. -
శంషాబాద్.. విమానానికి బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆమ్స్టర్డామ్ నుంచి శంషాబాద్‌కు వస్తున్న ఓ విమానంలో బాంబు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు చేపట్టారు.వివరాలు ఇలా ఉన్నాయి.. ఆమ్స్టర్డామ్ నుంచి శంషాబాద్‌కు వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్టు ఆదివారం ఉదయం అధికారులకు మొయిల్ వచ్చింది. విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేలోపే ఏ క్షణమైనా పేలుడు సంభవించే అవకాశం ఉందంటూ ఆ ఆగంతకుడు మెయిల్లో పేర్కొన్నాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బంది అత్యవసర చర్యలు చేపట్టారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే అందులోని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు.అనంతరం బాంబ్ స్క్వాడ్, భద్రతా సిబ్బంది విమానాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు. సుదీర్ఘ తనిఖీల అనంతరం విమానంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ బాంబు బెదిరింపు మెయిల్‌పై విమానాశ్రయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విశ్వసనీయత ఉన్న వ్యక్తి ప్రొ.నాగేశ్వర్
ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఆంధ్రప్రదేశ్‌లో కేసులు నమోదు చేయడాన్ని జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకుల మీద కేసులు పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ మండిపడుతున్నారు. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డితోపాటు పలువురు జర్నలిస్టులపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నాగేశ్వర్‌పై జనసేన నేతల ప్రోద్బలంతో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడంపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలి1985–89 కాలంలో బడ్జెట్‌కు సంబంధించిన మంత్రివర్గ నిర్ణయాలు మీడియాకు పొక్కాయి. దీంతో అప్పటి సీఎం ఎన్టీఆర్ మొత్తం కేబినెట్‌ను రద్దు చేశారు. ప్రస్తుత వివాదం నేపథ్యంలో ఎన్టీఆర్‌ను జనసేన నేతలు ఆదర్శంగా తీసుకోవాలి. నాగేశ్వర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిని జనసేన గుర్తించి చర్య తీసుకోవాలి. గుర్తించలేకపోతే మొత్తం కేబినెట్‌నే రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వ సమర్ధకుడు అయిన ఒక మీడియా సంస్థ అధినేత వారం వారం తాను రాసే కాలమ్‌లో ప్రగతి భవన్లో జరిగినట్టుగా కొన్ని వార్తా కథనాలు ప్రచురిస్తే.. అసత్యాలు రాస్తున్నారంటూ ఆ పత్రికాధినేతను బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ‘సోర్సెస్ డెవలప్ చేసుకోవాలి. ఆ సోర్సెస్ ద్వారా సమాచారం సేకరించి వార్తలు రాయాలని మా గురువులు చెప్పారు. సోర్స్ చెప్పింది ఆక్షేపించడానికి వీల్లేదు’అంటూ ఆ పత్రికాధినేత సమాధానం ఇచ్చిన విషయం కూటమి ప్రభుత్వం మరిచిపోకూడదు. –దేవులపల్లి అమర్, సభ్యుడు, స్టీరింగ్ కమిటీ, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ఇతరులకు ఏం పని?విశ్లేషకుడిగా నాగేశ్వర్‌కు మంచి గుర్తింపు, విశ్వసనీయత ఉన్నాయి. ప్రముఖ జర్నలిస్ట్ కూడా. ఆయన వ్యాఖ్యలు నచ్చకపోతే పవన్, నాదెండ్ల మనోహర్ మాత్రమే ఖండించాలి. స్పందించడానికి ఇతరులకు ఏం పని. ఆయన మీద కేసులు పెట్టడం సరికాదు. నాగేశ్వర్ కుటుంబం లేదా ఆయన అభిమానులు కోర్టును ఆశ్రయించాలని నా సూచన. –కె.రామచంద్ర మూర్తి, సీనియర్ పాత్రికేయులుఆ 35 వేల మంది సంగతేంటి?దశాబ్దాలుగా మంచి విశ్లేషకుడిగా ప్రొ.నాగేశ్వర్‌కు పేరుంది. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించినా కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో దుర్భాషలాడటం దుర్మార్గం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేంద్రానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు స్వయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. జగన్ హయాంలో 35 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చేసిన ఆరోపణలకు పవన్ ఇప్పటివరకు ఆధారాలను చూపలేదు. కానీ నాగేశ్వర్ చేసిన ఒక కామెంట్ మీద పలుచోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే కేసుల పేరుతో ఆయనను ఇబ్బంది పెట్టడానికే అని అర్థం అవుతోంది. –వర్దెళ్లి మురళి, సీనియర్ సంపాదకులుఏపీలో జర్నలిస్టుల హక్కులను హరించివేస్తున్నారుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎటువంటి ఆరోపణలు చేయలేదు. తన దృష్టికి వచ్చిన అంశాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా వ్యక్తపరిచారు. జర్నలిస్టులు వారికున్న సోర్స్ ఆధారంగా వచ్చిన సమాచారాన్ని ప్రస్తావిస్తారు. దీనిపట్ల అభ్యంతరం ఉంటే ఖండించాలి. అంతేగానీ వ్యక్తిగత దాడి తగదు. ఏపీలో జర్నలిస్టుల హక్కులను హరించివేస్తున్నారు. వారికి నచ్చినట్లుగానే వార్తలు రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇతరుల వ్యాఖ్యలు ప్రచురించినా కూడా జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం మనజాలదు. ఏపీలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మారాలి. –ఆర్.ధనంజయ రెడ్డి, ఎడిటర్, సాక్షి నచ్చకపోతే కౌంటర్ ఇవ్వాలినాగేశ్వర్ మంచి విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్. ఏ అంశమైనా విశ్లేíÙంచి మాట్లాడతారు. నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా కూడా ఆయనపై కేసులు పెట్టడం తగదు. పలుచోట్ల ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయంటే ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టినట్టు అర్థం అవుతోంది. ఇది సరైనది కాదు. మా అసోసియేషన్ ఇటువంటి చర్యలను సహించదు. ఆయన చేసిన వ్యాఖ్యలు నచ్చకపోతే కౌంటర్ ఇవ్వాలి. కేసు పెట్టి నోరు మూయించాలని అనుకోవడం సరికాదు. –విరాహత్ అలీ, ప్రెసిడెంట్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్కేసులు ఎత్తి వేయాలితాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్టు ప్రొ.నాగేశ్వర్ ప్రకటించారు. అందువల్ల ఆయనపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలి. ప్రభుత్వాలు, పారీ్టలు ఏవైనా మీడియాలో వచ్చిన ఆరోపణలు, భిన్నాభిప్రాయాలపై ఖండనలు, సమాధానాలు చేయొచ్చు. కానీ కేసులు, అరెస్టులు సరికాదు. ఏపీ ప్రభుత్వం నాగేశ్వర్‌పై పెట్టిన కేసులు వెనక్కు తీసుకోవాలే గానీ అరెస్టుల వంటి కఠిన చర్యలు అవాంఛనీయం. –తెలకపల్లి రవి, ప్రముఖ విశ్లేషకులుపోలీస్ స్టేషన్లు చాలవునాగేశ్వర్ వ్యాఖ్యలు తప్పు అని అభిప్రాయం చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. నాగేశ్వర్ అంటే గౌరవం అంటూనే కేసులు పెట్టారు. ఖండించడం, సరిదిద్దుకోవాలని చెప్పడం ప్రజాస్వామ్యం. కేసులు పెట్టడం కొత్త సంప్రదాయం. భావప్రకటనకు భిన్నమైంది. కొమ్మినేని శ్రీనివాస్ మీద మరోసారి కేసు పెట్టారు. ఒక పద్ధతి ప్రకారం కేసులు పెడుతున్నారు. డిజిటల్ మీడియా యుగంలో కేసులు పెట్టుకుంటూపోతే పోలీస్ స్టేషన్లు చాలవు. పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల మీద గౌరవం ఉంటే కేసులు విత్‌డ్రా చేసుకోవాలి. –అల్లం నారాయణ, సీనియర్ పాత్రికేయులు -
ఏ భాషలో ఫిర్యాదు చేసినా చిటికెలో ఎఫ్ఐఆర్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని పోలీసు స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు ఫిర్యాదుల నమోదులో తలెత్తే భాషా సమస్యలను దూరం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ పోలీసులు ఏఐ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల రికార్డర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఐ–కాప్‌రైటర్ పేరుతో ఉన్న ఈ యాప్‌ను హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ శనివారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఆవిష్కరించారు. తక్షణమే రికార్డు చేసి అనువదిస్తూ... బాధితులు మాతృభాషలో చెప్పే ఫిర్యాదుల్లోని అంశాలను ఏఐ–కాప్‌రైటర్ తక్షణమే రికార్డు చేసి లిఖితపూర్వకంగా అనువదిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులు, పర్యాటకులకు ఫిర్యాదు చేసే సమయంలో ఎదురయ్యే భాషా సమస్యలను ఈ యాప్ తొలగిస్తుంది. బాధితుల భాష అర్థం కాకపోవడం వల్ల ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం జరగడం, సమాచారం తప్పుగా నమోదు కావడానికి ఈ యాప్ స్వస్తి పలకనుంది. తొలిదశలో 10కిపైగా ప్రధాన భారతీయ భాషలను గుర్తించేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థతోపాటు పాగ్రో చందు అనే ఇంటర్న్ సహకారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు రూపొందించారు. యాప్‌లోని ప్రధాన అంశాలు బహుభాషా సౌలభ్యం: హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10 భాషల్లో ఫిర్యాదు చేస్తే ఈ యాప్ వెంటనే పోలీసులకు అర్థమయ్యే భాషలోకి లిఖితపూర్వకంగా అనువదిస్తుంది. వేగం–కచ్చితత్వం: గంటల తరబడి పట్టే ఫిర్యాదు నమోదు ప్రక్రియను కేవలం సెకన్లలోనే పూర్తి చేయవచ్చు. అనువాదకుల కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు. పారదర్శకత: ఫిర్యాదు రికార్డ్ చేసిన అధికారి వివరాలు, సమయం వంటివి ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ రూపంలో నిక్షిప్తమవుతాయి. దీనివల్ల రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉండదు. మల్టీ–పార్టీ లేబులింగ్: బాధితుడు, నిందితుడు లేదా సాక్షులు మాట్లాడే మాటలను వేర్వేరుగా గుర్తించి రికార్డ్ చేస్తుంది. శిక్షలు కూడా పెరుగుతాయి హైదరాబాద్ గ్లోబల్ సిటీ కావడంతో తెలుగు, ఆంగ్లం, హిందీ రాని వాళ్లూ కూడా వలస వచ్చి స్థిరపడుతున్నారు. భాష తెలియకపోవడం వల్ల వచ్చే సమస్యలకు ఈ యాప్ చెక్ పెడుతుంది. ఈ సాంకేతికత వల్ల ముఖ్యంగా వలస కార్మీకులు, మహిళలు, వృద్ధులకు పోలీసు సేవలపై భరోసా పెరుగుతుంది. బాధితులు చెప్పే ప్రతి మాటను యథాతథంగా నమోదు చేయడం వల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగి తద్వారా నిందితులకు శిక్ష పడే అవకాశాలు మెరుగుపడతాయి. దీనివల్ల పోలీసు అధికారులకు టైపింగ్ భారం తగ్గడమే కాకుండా రికార్డుల నిర్వహణ పద్ధతి ఏకరీతిగా ఉంటుంది. పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ దేశంలోనే తొలిసారిగా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణం. – వీసీ సజ్జనర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ -
ఎండలకు 40 మంది మృత్యువాత
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు 40 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే శుక్రవారం రాత్రి, శనివారం వడదెబ్బతో 22 మంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 మంది మృతిచెందారు. మహబూబాబాద్‌లోని ఇరిగేషన్ కార్యాలయ ఆవరణలోని చింతచెట్టుపై ఉన్న వందలాది గబ్బిలాలు ఎండ త్రీవ్రతతో మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. మహబూబాబాద్ జిల్లాలో కురవి మండలం బలపాలకు చెందిన రొయ్యలపెద్దరాములు(75), బంగారుగూడెం తండా గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మూడు జాన్వు(38), సీరోలు మండలం బీల్యానాయక్ తండాకు చెందిన బానోత్ కమ్లి(65), డోర్నకల్ యాదవనగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ జానీమియా(43), గూడూరు మండల కేంద్రానికి చెందిన పెసరి వీరమల్లు (70) చనిపోయారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన బండ చిన్నమల్లయ్య(90), కక్కిరాలపల్లికి చెందిన అలువాల నీలమ్మ(80), ఇదే గ్రామానికి చెందిన తాళ్లపెల్లి శాంతమ్మ(90), ఎల్కతుర్తి మండలం పెంచికలపేటకు చెందిన దుగ్యాని కొమురయ్య(101), కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన పొడేటి లచ్చమ్మ (82), పరకాల శ్రీనివాసకాలనీకి చెందిన టైలర్ వెల్దండి వెంకటేశ్వర్లు(48) చనిపోయారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రానికి చెందిన రోజువారీ కూలీ పెద్దమ్మ కుమారస్వామి (60), వరంగల్ 41వ డివిజన్ విశ్వనాథ కాలనీకి చెందిన నాయీబ్రహ్మణుడు సింగారపు కుమారస్వామి (45), రంగశాయిపేట కాపువాడకు చెందిన శెంకేశి భాగ్యలక్ష్మి(60), పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన దొడ్డ సత్యనారాయణ, రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన చిన్నపాక యాకయ్య(50) మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన దుర్గం అంకయ్య(65), కాటారం రేగులగూడెం జీపీ పరిధిలో భూయాన్ వినోద్(35), కాళేశ్వరంలో సరస్వతీనది అంత్య పుష్కరాలకు వచ్చిన గుర్తు తెలియని భక్తుడు(50) శనివారం వడదెబ్బతో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని ఇప్పగూడేనికి చెందిన హమాలీ కార్మికుడు గొడిశాల పరశురాములు(55), జనగామ అంబేడ్కర్ నగర్‌కు చెందిన యాచకురాలు జ్యోతి(58), ములుగు జిల్లా మంగపేట మండలంలోని రామచంద్రునిపేటకు చెందిన రైతు ఊటుకూరి సోమిరెడ్డి(78) వడదెబ్బతో మృతిచెందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో... పెద్దపల్లిలోని ముత్యాల పోచమ్మవాడకు చెందిన దినసరి కూలీ ఫయాజ్ (52), సుల్తానాబాద్ పట్టణం సుభాష్‌నగర్‌కు చెందిన న్యాతరి మొండయ్య (76), ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన గీట్ల మధుసూదన్‌రెడ్డి (53), రామగిరి మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన బుడిగె కమల(65), యైటింక్లయిన్‌కాలనీ వెంకట్రావుపల్లి కేకేనగర్‌కు చెందిన కనుకుట్ల ఐలమ్మ(73), గోదావరిఖని పరుశరాంనగర్‌కు చెందిన ఎం.శంకర్(45), గోదావరిఖనిలోని మధుప్రియ హోటల్లో పనిచేస్తున్న వెల్దండి మహేశ్(52), ఎన్టీఆర్ నగర్‌కు చెందిన మున్సిపల్ కాంట్రాక్టు కార్మీకురాలు గజనవేని మల్లమ్మ(56), రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన మంచాల నరసయ్య(75), మిట్టపల్లి శంకర్(48), కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన ఆటో డ్రైవర్ దామెరశెట్టి మల్లేశం (52) వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో.... ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన బిలాల్ ఫారీక్(40), మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీకి చెందిన రామగిరి పుల్లమ్మ(78), నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గోపాల్‌నగర్‌కు చెందిన సట్వే శంకర్(50), గణేశ్‌నగర్‌కు చెందిన ఎనుపోతుల బాబు(65) వడదెబ్బతో చనిపోయారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో... నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) ఎర్రచెరువుతండాకు చెందిన రైతు ఆంగోతు యుగేంధర్(32), యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెంకు చెందిన కార్పెంటర్ దేవరకొండ శంకరయ్యచారి(65), మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన వరికుప్పల శంకరయ్య(65), ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్‌కు చెందిన చెన్న హరికిషన్ (50) వడదెబ్బ తగిలి మృతిచెందాడు. -
ఈవెనింగ్ కల్చర్ సిటీగా భాగ్యనగరం
వేసవి సంధ్య.. సల్లాపాల సరాగాలకు చిరునామాగా మారింది. హైదరాబాదీలు సరికొత్త రుచుల ఆస్వాదనకు ఆలవాలమైంది. రాత్రి పొద్దుపోయేదాకా ఆనంద విహారంలో మునిగితేలుతున్నారు. నగరంలో సమ్మర్ అంటే పగలు ఓ పరీక్ష. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు.. వేడి, ఉబ్బరం, ట్రాఫిక్... అన్నీ కలిసి నగరవాసులను ఇండోర్‌లోనే ఉండేలా చేస్తున్నాయి. ఆఫీసులు, వర్క్‌ఫ్రం హోమ్, షాపులు, చిన్న వ్యాపారాలు.. ఇలా ప్రతి ఒక్కరూ.. సూరీడు పడమటికి వాలగానే ఆనందాలను ఆస్వాదిస్తున్నారు. చల్లనిగాలి, మైండ్ ఫ్రెష్– పిల్లల ఆహ్లాదం.. సెలీ్ఫలు, వాక్స్, స్ట్రీట్ ఫుడ్ అన్నీ కలిసి సాయంత్రపు షిఫ్ట్‌ను సమ్మర్ ఫీస్ట్‌లా ఫీలవుతున్నారు ప్రస్తుత వేసవిలో సాయంత్రం 6 గంటల నుంచి నగరం రంగులు మార్చుకోగానే.. సిటీజనులు బయటికి వస్తున్నారు. ఈ సీజన్లో హైదరాబాద్ ఈట్ స్ట్రీట్ వ్యాపారం గణనీయంగా పెరిగిందనేది వ్యాపారుల మాట. ముఖ్యంగా ట్యాంట్బండ్ పరిసరాలు, మాదాపూర్–హైటెక్ సిటీ జోన్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు స్ట్రీట్ ఫుడ్‌స్టాళ్లు ఫుల్ బిజీ. వ్యాపార వర్గాల అంచనాల ప్రకారం, సమ్మర్ నెలల్లో ఈవెనింగ్–నైట్ టైమ్ ఫుడ్ సేల్స్ సగటున 25–30 శాతం పెరుగుదల చూపిస్తున్నాయి. పగలు తగ్గిన కస్టమర్ ఫుడ్ఫాల్ను రాత్రి పూర్తిగా కవర్ చేస్తోంది. సామాన్య జనాలకు ట్యాంక్ బండ్, దుర్గం చెరువు, శిల్పారామం వంటి ప్రాంతాలు బెస్ట్ స్పాట్స్‌గా నిలుస్తున్నాయి. సిటీలో సమ్మర్ అంటే పగలు నిశ్శబ్దం, సాయంత్రం సంబరాలు. ఇది ఉపశమనం మాత్రమే కాదు, నగర ఆర్థిక వ్యవస్థకూ ఊపిరి పోస్తోంది. ఆల్ఇన్ వన్..@: ఎగ్జిబిషన్స్ పిల్లలకు వేసవి సెలవులు కావడంతో.. సికింద్రాబాద్, పీపుల్స్ ప్లాజా, కూకట్పల్లి, ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాల్లో సమ్మర్ ఎగ్జిబిషన్లు ప్రధాన ఆకర్షణగా మారాయి. గేమ్స్, షాపింగ్ స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్ ఆల్ ఇన్ వన్ కాన్సెప్‌్టతో ఆకట్టుకుంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సందర్శకులు 20 శాతం వరకు పెరిగారు. దీనివల్ల ట్రాఫిక్ ‘‘ఈవెనింగ్ హెవీ’’గా మారింది. ఇంకో వైపు పెరుగుతున్న వర్కింగ్ కం కేఫ్ కల్చర్‌లో భాగంగా నైట్ షిఫ్ట్ ఐటీ ఉద్యోగులు ల్యాప్‌టాప్‌లతో కేఫ్‌ల్లో పని చేస్తూ కనిపిస్తున్నారు. ఫ్రీ వైఫై, చిల్ ఎని్వరాన్మెంట్తో.. కేఫ్ బిజినెస్‌కు ప్లస్ అవుతున్నాయి. సమ్మర్లో రాత్రి 7 తర్వాత కేఫ్ ఫుట్‌ఫాల్ 15–18 శాతం పెరుగుదల నమోదు చేస్తోంది. ఫుడ్, షాపింగ్, ఎగ్జిబిషన్స్, కేఫ్ వర్క్ అన్నీ కలిసి హైదరాబాద్‌ను ‘‘రాత్రిలోనూ బతికే నగరం’’గా మరోసారి నిరూపిస్తున్నాయి! -
మహిళతో అసభ్యంగా ప్రవర్తించి..సీసీ కెమెరాల్లో చిక్కి
హైదరాబాద్: రోడ్డుపై వెళుతున్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని నార్సింగి పోలీసులు గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈనెల 14న అలకాపూర్ టౌన్షిప్లో ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతోపాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నార్సింగి పోలీసులు.. తీవ్రంగా పరిగణించి బాధితురాలి నుంచి 19న ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. శనివారం పుప్పాలగూడలో ఉంటున్న నిందితుడు నాగరాజు(26)ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నిందితుడు పుప్పాలగూడలో స్థిరపడ్డాడని ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు. -
పైసామే చమురాత్మ!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ సెగతో చమురు సంస్థలు మళ్లీ రోజువారీ ధరల సవరణకు తెరలేపాయి. పైసా.. పైసా చొప్పున పెరుగుతున్న ఇంధన ధరలు.. సామాన్యుడికి గుదిబండగా మారనున్నాయి. కొన్నేళ్లుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరల్లో కదలిక వచ్చింది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత రోజువారీ ధరల సవరణ ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది. చమురు సంస్థలు గత పది రోజుల వ్యవధిలోనే లీటర్ పెట్రోల్‌పై రూ.5.35, డీజిల్‌పై రూ. 5.24 చొప్పున పెంచాయి. అయితే, సవరణ ప్రక్రియ ప్రారంభమైన మొదటిసారి పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ. 3.39, రూ. 3.26 చొప్పున వడ్డించాయి. ఆ తర్వాత నుంచి పైసా–పైసా రూపంలో రోజువారీగా ధరలను సవరిస్తుండటంతో నిరంతరాయంగా పెరుగుతున్నాయి. మధ్యలో రెండుసార్లు నాలుగు పైసల చొప్పున పెంచిన కంపెనీలు మరో రెండుసార్లు నాలుగు పైసల చొప్పున తగ్గించాయి. ధరల పెంపు కేవలం వాహనదారులకే పరిమితం కాకుండా నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపనుంది. డీజిల్ ధర పెరగడం వల్ల లారీ రవాణా చార్జీలు భారమై కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసరాల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. చమురు సంస్థలు తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు మరిన్ని విడతలుగా ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.రోజువారీ సవరణ బాధ్యతకేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించే బాధ్యతను 2017 జూన్ 16 నుంచి చమురు సంస్థలకే అప్పగిస్తూ ‘రోజువారీ ధరల సవరణ’ విధానాన్ని అమలులోకి తెచ్చింది. అంతకుముందు 2010లో పెట్రోల్, 2014లో డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ సగటు ఆధారంగా ధరలను సవరించేవారు. అయితే, 15 రోజులపాటు వేచి చూడటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే ఆకస్మిక హెచ్చుతగ్గుల భారమంతా ఒకేసారి చమురు సంస్థలపై పడటం, లేదా అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఆ తక్షణ ప్రయోజనం వినియోగదారులకు అందకపోవడం జరిగేది. ఈ లోపాన్ని నివారించి, అంతర్జాతీయ మార్కెట్ బ్యారెల్ ధరలో డాలర్‌తో రూపాయి మారకం విలువలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు పారదర్శకంగా ప్రతిబింబించేందుకు ఈ రోజువారీ సవరణ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే, ఈ విధానానికి 2022లో బ్రేక్ పడింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మండిపోయినప్పటికీ, దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి, ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనూ చమురు సంస్థలు రోజువారీ సవరణలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఫలితంగా కొన్నేళ్లుగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి.నష్టాల నుంచి గట్టెక్కేందుకు ..కొన్నేళ్లుగా ఇంధన ధరల రోజువారీ సవరణను నిలిపివేసి, వినియోగదారులపై భారం పడకుండా చమురు సంస్థలే నష్టాలను భరిస్తూ వచ్చాయి. అయితే, ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల మార్కును తాకడంతో నష్టాల భారం తమవల్ల కాదంటూ చమురు సంస్థలు చేతులెత్తేశాయి. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఈ నెల 15 నుంచి మళ్లీ రోజువారీ ధరల సవరణ ప్రక్రియను ప్రారంభించి, వినియోగదారులకు విడతల వారీగా షాక్ ఇస్తున్నాయి. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే స్థానిక పన్నులు (వ్యాట్), రవాణా చార్జీల వ్యత్యాసాలు తోడవడంతో సామాన్యుడికి చమురు వాత గట్టిగానే తగులుతోంది. -
గాంధీలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. గాంధీ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ కోర్సు చదువుతున్న పల్లవిగౌడ్ (19) అనే విద్యార్థిని శస్త్రచికిత్స అనంతరం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మరణించిందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడంతో గాంధీ మార్చురీ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బాధితులు, చిలకలగూడ పోలీసులు తెలిపిన మేరకు.. జియాగూడకు చెందిన పల్లవి గౌడ్ కుడిఛాతీపై వాపు (గడ్డ) రావడంతో ఈనెల 16న గాంధీ ఆస్పత్రికి వచి్చంది. చిన్నపాటి సర్జరీ చేయాలని వైద్యులు చెప్పడంతో 18న అడ్మిట్ కాగా..19న సర్జరీ చేశారు. మరుసటి రోజు వైద్యులు పరీక్షించి మరోసారి సర్జరీ (రీఎక్స్ప్లొరేషన్) చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది.ఇదిలా ఉండగా.. సీనియర్ వైద్యులతో కాకుండా జూనియర్లతో సర్జరీ చేయించి తమ కుమార్తె ప్రాణాలపై ప్రయోగాలు చేశారని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతురాలి తండ్రి వెంకటే‹Ùగౌడ్ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క బాధితులను పరామర్శించి, ప్రభుత్వపరంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ముగ్గురు వైద్యులతో నిజనిర్ధారణ కమిటీ పల్లవి మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని గాంధీ సూపరింటెండెంట్ ప్రొ.వాణి స్పష్టం చేశారు. పల్లవికి సర్జరీ అనంతరం రక్తపుగడ్డలను తొలగించామని తెలిపారు. ఆ తర్వాత బీపీ పడిపోవడం, ఊపిరితిత్తుల సమస్యల కారణంగా వెంటిలేటర్‌పై ఉంచి అత్యుత్తమ వైద్యం అందించామని.. అయినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ ఘటనపై ముగ్గురు వైద్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. -
దోసెలు ఎక్కువగా తింటున్నావని తల్లి మందలింపు
ఫిలింనగర్: దోసెలు ఎక్కువగా తింటున్నావని, దీని వల్ల అన్నం సరిగ్గా తినడం లేదని తల్లి మందలించినందుకు ఓ బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫిలింనగర్‌లోని జ్ఞానీజైల్‌సింగ్ నగర్ బస్తీలో నివసించే కార్తీక్ (15) స్థానికంగా పదో తరగతి చదువుతున్నాడు. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచిస్తూ అతిగా స్పందించడం కార్తీక్ నైజంగా మారింది. ఈ నేపథ్యంలోనే దోసెలు ఎక్కువగా తింటున్నావంటూ అన్నం తినడం లేదని తల్లి చెప్పింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కార్తీక్.. తండ్రి చెన్నప్ప మేస్త్రీ పనికి, తల్లి ఇళ్లలో పనికి వెళ్లిన సమయంలో తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 2.5 లక్షల గృహాలు నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను కేటాయించింది. 2 వేల ఇళ్లలో 1,500 ఇళ్లను ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారులకు గతంలో ఇచ్చిన తరహాలోనే ఇళ్ల నిర్మాణం లెవల్నుబట్టి దశలవారీగా మొత్తం రూ. 5 లక్షలను ప్రభుత్వం చెల్లించనుంది. మిగిలిన 500 ఇళ్లను గతంలో వివిధ గృహనిర్మాణ పథకాల కింద మంజూరై వివిధ కారణాలతో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లను పూర్తి చేయడానికి కేటాయించనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో కలిసి గృహనిర్మాణ, సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. అసంపూర్తి ఇళ్లకు ఇందిరమ్మ అండ... ఉమ్మడి ఏపీలో దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం, గత ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులతోపాటు ఇంకా ఎవరైనా లబ్ధిదారుల ఇళ్లు అసంపూర్తిగా మిగిలి ఉంటే ఈ పథకం కింద ప్రయోజనం కల్పించనున్నారు. పునాదులు పూర్తై గోడలు, శ్లాబు పడని ఇళ్లకు రూ. 3 లక్షలు, గోడలు పూర్తై శ్లాబు నిలిచిపోయిన ఇళ్లకు రూ. 2 లక్షల చొప్పున సహాయం చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. మూడో, నాలుగో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సైతం అసంపూర్తిగా మిగిలిన ఇళ్లకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు ప్రస్తుత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అనర్హులని తొలి విడతలో ప్రభుత్వం చెప్పింది. నాడు సిమెంట్, స్టీల్, నగదు రూపంలో రూ. 25 వేలు తీసుకున్న వారిని రెండోవిడత ఇందిరమ్మ పథకం కింద అర్హులుగా పరిగణించాలని తాజాగా మంత్రివర్గం నిర్ణయించింది. ఆ రూ. 25 వేలను మినహాయించుకొని రూ. 5 లక్షల్లో మిగిలిన మొత్తాన్ని వారికి అందజేయనుంది. గుడిసె లేని రాష్ట్రంగా... రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 14,800 పూరి గూడిసెలున్నట్లు వివిధ దఫాలుగా చేసిన సర్వేల్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రెండో విడత ఇందిరమ్మ పథకం కింద ఆయా కుటుంబాలకు ఇళ్లను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని నిర్ణయించింది. క్యూర్లో లక్ష ఇళ్ల నిర్మాణం.. ఇందిరమ్మ పథకం కింద కోర్ అర్బన్ ఏరియా (క్యూర్) పరిధిలో 6–7 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 18,500 మందికి మాత్రమే సొంత స్థలాలు ఉన్నాయి. వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 5 లక్షలను నెలాఖరులోగా ప్రభుత్వం మంజూరు చేయనుంది. మిగిలిన దరఖాస్తుదారుల్లో సొంత స్థలాలు లేని 3–3.5 లక్షల మంది అర్హలుంటారని ప్రభుత్వం అంచనా వేసింది. క్యూర్ ఏరియాలోని గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గాన్ని యూనిట్‌గా పరిగణించి అల్పాదాయ వర్గాలు (ఎల్ఐజీ), మధ్యతరగతి వర్గాల (ఎంఐజీ)కు లక్ష ఇళ్లను నిర్మించి ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది. ఎల్ఐజీ ఇళ్ల పథకం కింద 400–420 చదరపు గజాల విస్తీర్ణంతో ఫ్లాట్ల నిర్మాణానికి రూ. 5 లక్షలతోపాటు అన్‌డివైడ్ ల్యాండ్ షేర్‌ను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల అదనపు వ్యయాన్ని లబ్ధిదారులు భరించాల్సి రానుంది. నిరుపేదలు జీవనోపాధి కోసం ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఎల్ఐజీ ఇళ్లను నిర్మించనున్నారు. మురికివాడల్లో నివసిస్తే అక్కడే కట్టిస్తామని పొంగులేటి తెలిపారు. వారు ఉండే ప్రాంతంలో ప్రభుత్వ స్థలం లేకుంటే హౌసింగ్ బోర్డు, ఇతర ప్రభుత్వ శాఖల నివాసయోగ్యమైన భూముల్లో వారి కోసం ఇళ్లను నిర్మించనున్నారు. నియోజకవర్గం యూనిట్‌గా ఇప్పటికే కొన్ని స్థలాలను ప్రభుత్వం గుర్తించింది. ఇక క్యూర్ ఏరియాలో నిర్మించనున్న లక్ష ఇళ్లలో 30 శాతం ఇళ్లను ఎంఐజీ లబ్ధిదారులకు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అన్‌డివైడెడ్ ల్యాండ్ షేర్‌తోపాటు ఫ్రీహోల్డ్ నిర్మాణానికి సంబంధించిన వ్యయాన్ని నామమాత్ర లాభంతో ఎంఐజీ వినియోగదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేసి ఆ నిధులను ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని నిర్ణయించింది. ఎల్ఐజీ, ఎంఐజీ పథకాల విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక, లబ్ధిదారులకు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ తదితర వివరాలను ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లతో ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్ల పథకాలకు తేడా ఉందన్నారు. గత ప్రభుత్వం లబ్ధిదారులు జీవనోపాధి పొందుతున్న ప్రాంతానికి 30–40 కి.మీ.ల దూరంలో ఇళ్లను కట్టడంతో ఆ ఇళ్లను లబ్ధిదారులు నిరుపయోగంగా వదిలేశారని తెలిపారు. జూన్ 1న లక్ష గృహ ప్రవేశాలు... తొలివిడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేయగా వాటిలో పూర్తైన లక్ష ఇళ్లలో గృహప్రవేశాలను జూన్ 1న నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ప్రారంభించనున్నారు. ఇదే కార్యక్రమంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేయనున్నారు. గోదావరి పుష్కరాలకు రూ. 1,000 కోట్లు 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. తొలి విడతగా రూ. 300 కోట్లు మంజూరు చేసింది. ఆర్డీఎస్ఎస్లో చేరేందుకు సై.. విద్యుత్ పంపిణీ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం 2021లో ప్రవేశపెట్టిన ఆర్డీఎస్ఎస్ పథకంలో చేరాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సామర్థ్యం పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వ పథకం రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) పథకం కింద చేరాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో చేరడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 జనవరి 2న కేంద్రంతో త్రెపాక్షిక ఒప్పందం చేసుకున్నా అమలు చేయలేదని మంత్రి పొంగులేటి చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగుదల కోసం ఈ పథకంలో చేరాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న త్రైపాక్షిక ఒప్పందంలో మీటర్లు (వ్యవసాయ కనెక్షన్లకు) అమర్చేందుకు అంగీకరిస్తూ సంతకం చేసిందని ఆరోపించారు. తమ నిర్ణయంలో మీటర్లు బిగించే ప్రసక్తే లేదన్నారు. లైఫ్ సైన్స్ పాలసీకి ఆమోదం రాష్ట్రాన్ని 2030 నాటికి ప్రపంచంలోని టాప్–5 లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టడానికి నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30ని మంత్రివర్గం ఆమోదించింది. దావోస్ సదస్సులో ఈ పాలసీని సీఎం ఆవిష్కరించగా కొన్ని మార్పులతో తాజాగా మంత్రివర్గం ఆమోదించింది. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలతోపాటు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మెడికల్ ఇన్నోవేషన్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్ హెల్త్, గ్లోబల్ ఇన్నోవేషన్ రంగాల్లో మంచి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు ఫార్మా ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టగా ఇకపై ఆవిష్కరణలపై ఎక్కువ దృష్టిపెట్టాలని నిర్ణయించింది. ఆర్ అండ్ డీ యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించేలా ఈ పాలసీలో మార్పులు చేసింది. ఇంటర్ విద్యార్థులకూ భోజనం, అల్పాహారం.. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు అన్ని జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అల్పాహారంతోపాటు పాలు అందించనుంది. ‘పాలమూరు’భూసేకరణకు రూ. 587 కోట్లు పాలమూరు–రంగారెడ్డి పథకం మిగులు పనులతోపాటు చివర్లో ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించిన భూసేకరణ కోసం తొలి విడతగా రూ. 587 కోట్లు కేటలాయించాలని కేబినెట్ తీర్మానించింది. ప్రాజెక్టును 21 ప్యాకేజీలుగా విభజించి చేపట్టిన గత ప్రభుత్వం 18 ప్యాకేజీల పనులనే కొంత మేర చేసిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. కాగా, జిల్లా సహకార మార్కెటింగ్ సోసైటీలను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలని, తెలంగాణ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను ‘హాకా’లో విలీనం చేయాలని కేబినెట్ తీర్మానించింది. -
10% ఫీజు చెల్లిస్తే పాత రేట్లే
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు లోపల దశాబ్దాల క్రితం ఏర్పాటైన పారిశ్రామిక ప్రాంతాలను పర్యావరణహితంగా, నివాసయోగ్యంగా (మల్టీ–యూజ్ జోన్స్) మార్చేందుకు తీసుకొచి్చన హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్–పీ)కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. జూన్ 30లోగా 10% అడ్వాన్స్ ఇంపాక్ట్ ఫీజు చెల్లించే దరఖాస్తుదారులకు పాత ఎస్ఆర్ఓ (సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్) రేట్లే వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు హిల్ట్–పీ మార్గదర్శకాలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం జారీ చేశారు.ఇందులో భాగంగా భూమార్పిడి రుసుముల వివరాలను ప్రకటించారు. జీవో 18 ప్రకారం పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. మొత్తం 21 పారిశ్రామిక పార్కులతోపాటు స్టాండ్ ఎలోన్ యూనిట్ల దరఖాస్తులను పరిశీలించడానికి రెండు వేర్వేరు టీమ్‌లను ఏర్పాటు చేశారు. హిల్ట్–పీ పోర్టల్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మే 28 నుంచి భూముల ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. నూతన పాలసీతో ప్రయోజనాలు.. ⇒ ఎస్ఆర్ఓ రేట్ల రాయితీ: 2026 జూన్ 30లోగా 10% అడ్వాన్స్ ఇంపాక్ట్ ఫీజు చెల్లించే దరఖాస్తుదారులకు పాత ఎస్ఆర్ఓ రేట్లే వర్తిస్తాయి. ⇒ తరలింపునకు ప్రోత్సాహకాలు: ఓఆర్ఆర్ వెలుపలికి మారాలనుకునే పరిశ్రమలకు పాత ప్రదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రాయితీలు, సబ్సిడీలు కొత్త చోటుకూ బదిలీ అవుతాయి. ⇒ చార్జీల సర్దుబాటు: విద్యుత్, నీటి కనెక్షన్ల కోసం గతంలో చెల్లించిన చట్టబద్ధమైన ఫీజులను కొత్త లొకేషన్లో సర్దుబాటు చేస్తారు. ⇒ ప్లాట్ల కేటాయింపులో ప్రాధాన్యం: నగరం వెలుపల టీజీఐఐసీ నిర్మించే కొత్త పారిశ్రామిక పార్కుల్లో వారికి ప్లాట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ⇒ ఏడాది గడువు: మల్టీ–యూజ్ జోన్ అనుమతి పొందిన తర్వాత కూడా పరిశ్రమను ప్రస్తుత ప్రాంతంలో ఏడాదిపాటు నిర్వహించుకోవడానికి గడువు ఇస్తారు.పారిశ్రామిక భూమి విస్తీర్ణం - ప్రాసెసింగ్ ఫీజు (రూ. లలో) ఒక ఎకరం వరకు - 20,000 1 ఎకరంపైగా–5 ఎకరాల వరకు - 50,000 5 ఎకరాలకుపైగా–10 ఎకరాల వరకు - 1,00,000 10 ఎకరాలకుపైగా–25 ఎకరాల వరకు - 2,00,000 25 ఎకరాలకుపైగా–50 ఎకరాల వరకు - 5,00,000 50 ఎకరాలకు మించి - 10,00,000 సేల్ డీడ్ ఉంటేనే.. అర్హతలు: రిజిస్టర్డ్ సేల్‌డీడ్ కలిగి ఉండి పూర్తయిన పారిశ్రామిక ప్లాట్లు మాత్రమే అర్హత ఉంటాయి. దరఖాస్తుకు ముందే పాత బకాయిలు (ఈఓటీ, మ్యుటేషన్, ప్రాపర్టీ ట్యాక్స్, సబ్–డివిజన్ చార్జీలు) క్లియర్ చేయాలి. తప్పనిసరి పత్రాలు: సేల్‌డీడ్, ఈసీ, తాజా ఆస్తిపన్ను రశీదు, స్థలం కలర్ ఫొటోలు, సంస్థ రిజిస్ట్రేషన్ (ఉద్యమ్ ఆధార్/ఆర్ఓసీ మొదలైనవి), ఐడీ ప్రూఫ్, ఫీజు చెల్లింపు, మౌలిక సదుపాయాల కోసం అవసరమైతే భూమిని అప్పగించేందుకు రూ. 100 స్టాంప్ పేపర్‌పై నోటరీ అండర్‌టేకింగ్ సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తు: దరఖాస్తుదారులు టీజీఐఐసీ పోర్టల్ ద్వారా 10 శాతం డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వెరిఫికేషన్: జోనల్ మేనేజర్, ఐఏఎల్ఏ కమిషనర్ 4 రోజుల్లోగా పరిశీలించి హెడ్ ఆఫీస్ స్రూ్కటినీ కమిటీకి పంపుతారు. ఆమోదం: స్రూ్కటినీ కమిటీ 3 రోజుల్లో అప్రూవల్ కమిటీకి పంపితే స్పెషల్ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ 7 రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటుంది. బ్యాలెన్స్ ఫీజు: అనుమతి వచ్చిన వెంటనే మిగిలిన 90 శాతం ఫీజు కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తారు. నోటీసు అందుకున్న 45 రోజుల్లో 45% ఫీజు, తొలి వాయిదా చెల్లించిన 45 రోజుల్లో మిగిలిన మొత్తం చెల్లించాలి. ఆలస్యమైతే నెలకు 1 శాతం జరిమానా ఉంటుంది. నెల దాటితే మొత్తం రద్దవుతుంది. చెల్లించిన ఫీజు వెనక్కి ఇవ్వరు. మాస్టర్ ప్లాన్ మార్పు: ఫీజు అందిన 3 రోజుల్లో పురపాలక శాఖ/హెచ్ఎండీఏ రికార్డుల్లో భూ వినియోగ మార్పులు చేస్తారు. ఏమిటీ హిల్ట్–పీ పాలసీ? దాదాపు 50–60 ఏళ్ల క్రితం నాచారం, మల్లాపూర్, జీడిమెట్ల, సనత్‌నగర్, బాలానగర్, కూకట్పల్లి వంటి ప్రాంతాలు నగరం వెలుపల పారిశ్రామిక జోన్లుగా ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం ఇవన్నీ నగర నడి»ొడ్డుకు చేరాయి. ఫలితంగా నివాసాల మధ్య కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ పరిధిలోని 22 పారిశ్రామికవాడల్లో ఉన్న దాదాపు 9,300 ఎకరాల భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు పరిశ్రమల శాఖ జీవో 27 విడుదల చేసింది. నగరంలో ఉన్న రెడ్, ఆరెంజ్ కేటగిరీ కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించి హైదరాబాద్‌ను కాలుష్య ముప్పు నుంచి కాపాడటం, ఖాళీ అయిన పారిశ్రామిక భూముల్లో ఐటీ పార్కులు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మాల్స్, స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వడం ఈ పాలసీ లక్ష్యం. -
స్టేట్ టాపర్లుగా 11 మంది..
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి నిర్వహించిన టీజీ పాలిసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి 82.94 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. బాలురు 79.92 శాతం, బాలికలు 86.38 శాతం క్వాలిఫై అయ్యారు. బాలురతో పోల్చితే బాలికలు 6.46 శాతం అధికంగా ఉత్తీర్ణతను నమోదు చేశారు. ఎంపీసీ విభాగంలో 11 మంది స్టేట్ మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఒకే మార్కు మీద ఉండటంతో వీరికి మొదటి ర్యాంకును కేటాయించారు. గతంలో ఒకరిద్దరు..లేదా ముగ్గురు ఒకే మార్కును సాధించిన సందర్భాలున్నాయి. కానీ ఈసారి ఏకంగా 11 మంది ఒకే ర్యాంకుపై ఉండటం గమనార్హం. అయితే వీరికి స్టేట్–1 ర్యాంకు కేటాయించినా తర్వాత సబ్జెక్టుల వారీగా వచి్చన మార్కులు, పుట్టిన తేదీ ఆధారంగా ఒకటి, రెండు, మూడు, ర్యాంకులను ఖరారు చేస్తారు. ఇక ఎంబైపీసీ విభాగంలో ఇద్దరు విద్యార్థులు స్టేట్ మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. నాలుగో ర్యాంకుపై ఇద్దరు, ఆరో ర్యాంకుపై ముగ్గురు విద్యార్థులున్నారు.ఈ ఏడాది 1,06,439 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 98,029 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 81,307 విద్యార్థులు అర్హత సాధించారు. ఈ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్ డిప్లొమాతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్, కొండా లక్ష్మణ్ బాపూజీ హారి్టకల్చర్, పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీల్లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. డిప్లొమా కోర్సుల సీట్ల భర్తీ షెడ్యూల్ ఇప్పటికే విడుదలయ్యింది. ఈ నెల 27 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.నాన్న కష్టాన్ని చూసే లక్ష్యాన్ని ఎంచుకున్నా.. స్టేట్ ఫస్ట్ సాధించిన ఆటో డ్రైవర్ కుమారుడు ఖిలా వరంగల్: వరంగల్ రుద్రమదేవి కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ నామాల రాజు, రజిత దంపతుల కుమారుడు నామాల లోకేశ్ పాలిసెట్ ఫలితాల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఎంపీసీ విభాగంలో 120/120 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాక్ సాధించాడు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లోనూ 568 మార్కులతో సత్తా చాటాడు. పాలిసెట్ ఎంబైపీసీలోనూ 120 మార్కులకుగాను 119 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారు. కాగా, నాన్న ఆటోడ్రైవర్‌గా పడే కష్టాన్ని చూసి లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడి చదువుకున్నానని, భవిష్యత్తులో ఎల్రక్టానిక్ ఇంజనీర్‌గా స్థిరపడాలనుకుంటున్నానని లోకేశ్ చెప్పాడు. -
‘రాజకీయాలు తాత్కాలికం.. రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతం’
హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక విమర్శలు చేయాలి కానీ అభివృద్దిని అడ్డుకునే వినాశకరమైన ఆలోచనలు చేయకూడదన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. రాజకీయాలు అనేవి తాత్కాలికమని, రాష్ట్ర ప్రయోజనాలు అనేవి శాశ్వతమన్నారు. ఈరోజు(శనివారం, మే 23వ తేదీ) సీఎల్పీ కార్యాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రెస్మీట్లో మాట్లాడారు. దురదృష్టవశాత్తూ బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఎన్నికల ఓటమి తాలూకు నిరాశ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారు. అందుకే... హరీష్ రావు అమెరికా వెళ్లి కూడా పగటి కలలు కంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని రద్దు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. పగటి కలలు కంటూ... ‘చీప్ పాలిట్రిక్స్’... ‘డైవర్షన్ పాలిట్రిక్స్’... ‘బ్లాక్ మెయిలింగ్ పాలిట్రిక్స్’ ప్లే చేస్తున్నారు.మొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకులు మూసీ ప్రక్షాళనను అడ్డుకునే కుట్ర చేశారు. ఇప్పుడు... ఫ్యూచర్ సిటీపై కుట్రలు చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నే మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అనేది కేవలం ఒక ప్రాంతానికో, ఒక ప్రభుత్వానికో పరిమితమైనది కాదు... ఇది తెలంగాణ బ్రాండ్ ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు మేం వేసే ఒక ముందడుగు.రాబోయే రోజుల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌లా మారబోతోంది. దీన్ని రద్దు చేస్తామని పగటి కలలు కంటున్న హరీష్ రావుకి బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.‘ప్రభుత్వం మారితే ఫూచర్ సిటీని రద్దు చేస్తాం’ అనే బాధ్యతారహిత ప్రకటన చేయడం ద్వారా హరీష్ రావు... అంతర్జాతీయ వేదికలపై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను, ఇన్వెస్ట్ మెంట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నారు. ఇది ‘తెలంగాణ’కు చేస్తున్న ద్రోహం కాదా...?’ అని ప్రశ్నించారు. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది (2027) గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనులకు రూ.1000 కోట్లు కేటాయింపునకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. తొలి విడతగా రూ.300 కోట్లు మంజూరు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఆమోదం తెలిపిన కేబినెట్.. అల్పాహారం, పాలు కూడా అందించాలని నిర్ణయించింది.కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని నూతన డిగ్రీ కళాశాలకు 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, ఆరు నాన్ టీచింగ్ పోస్టులు, అవుట్ సోర్సింగ్ పద్ధతిన 3 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం చెప్పింది.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఫైర్ స్టేషన్‌కు 18 పోస్టుల మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెలిది గ్రామంలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్ లో 5 ఎకరాలు, గన్నేరువరం మండలంలో 5 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
హీట్ వేవ్.. తెలంగాణకు హై అలర్ట్
సాక్షి, హైదరాబాద్: వడదెబ్బతో మృతి చెందిన వారికి తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. వడగాల్పులతో 7జిల్లాల్లో 16 మంది మృత్యువాత పడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలపై ఆయన ఇవాళ(శనివారం,మే 23) అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రాణ రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు.రానున్న మూడు రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్ ఉండనుందని.. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజల ప్రాణ రక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని మంత్రి అన్నారు. ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదని.. ఎండ తీవ్రతపై ప్రజలకు గంట గంటకు హెచ్చరికలు ఇవ్వాలి’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ, నిర్మాణ కార్మికులకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. హీట్ వేవ్‌పై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వడదెబ్బ కేసులకు ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలి’’ అని మంత్రి పొంగులేటి సూచించారు. -
పీసీసీ మార్పు హైకమాండ్ నిర్ణయం.. వార్తలపై మహేష్ గౌడ్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక చానెల్ వార్తలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక చానెల్ తనపై రాస్తున్న వార్తలను నమ్మే పరిస్థితి లేదన్నారు. పీసీసీ మార్పు అనేది హైకమాండ్ చూసుకుంటుంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలపై మాట్లాడతానని ఆయన చెప్పుకొచ్చారు.తనపై వస్తున్న వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ..‘గాంధీ భవన్‌ను ట్రస్ట్ మెయింటైన్ చేస్తుంది. ఒక చానెల్ నాపై వార్తలు రాస్తే నమ్మే పరిస్థితి లేదు. నా పనితీరును కేడర్ అంచనా వేస్తుంది. నేను ఈ విషయాన్ని చాలా లైట్‌గా తీసుకుంటున్నాను. 20 నెలలుగా నా పనితీరు ఏంటో మా నేతలకు తెలుసు. నాపై వచ్చిన వార్తలపై నేను స్పందించవద్దని పార్టీ నేతలకు చెప్పాను. కొన్ని మీడియా సంస్థలకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి.. దానికి నేనేం చేయలేను. పీసీసీ మార్పు అనేది హైకమాండ్ చూసుకుంటుంది. ఏఐసీసీ దృష్టిలో తెలంగాణ పీసీసీది బెస్ట్ అని ఉంది. నాపై వ్యతిరేక వార్తలు రాసిన చానెల్.. గతంలో చాలా పాజిటివ్ వార్తలు కూడా ఇచ్చింది. దీనిపై సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుతాను’ అని వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ దేశానికే దిక్సూచిగా మారుతుంది. బీఆర్ఎస్కు దూరదృష్టి లేదు.. హైదరాబాద్ పరిధి పెంచలేదు. సిటీ విస్తరిస్తే అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్ అభివృద్ధి అవసరం లేదని హరీష్ రావు అంటున్నారా?. తెలంగాణపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది. స్టాలిన్‌లా మేము గత ప్రభుత్వ పథకాలు కొనసాగిస్తున్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేమ్స్ ఏఐసీసీకి పంపించాం.. త్వరలో ప్రకటిస్తాం. తెలంగాణలో కేబినెట్ విస్తరణ సీఎం చూసుకుంటారు. నా ప్రమేయం ఏమీ ఉండదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు. -
మాసబ్‌ట్యాంక్‌లో దారుణం.. ప్రముఖ న్యాయవాది మృతి
హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్‌ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం ఉదయం ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్ చేశారు. ఈ ప్రమాదంలో మొయినుద్దీన్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్యూచర్ సిటీ కాదు.. నీ ఫ్యూచరేంటి హరీష్: పొంగులేటి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫ్యూచర్ సిటీ విషయమై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. మాజీ మంత్రి హరీష్ రావుకు కౌంటరిచ్చారు. హరీష్ రావుకు తన ఫ్యూచరే తెలియదు.. ఫ్యూచర్ సిటీని ఆపుతారా? అంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్కు ఫ్యూచర్ లేదు.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..‘ఫ్యూచర్ సిటీ భూములపై అమెరికాలో ఒప్పందాలున్నాయా?. పదేళ్లలో ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టని బీఆర్ఎస్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా కొత్త నగరాన్ని నిర్మిస్తోందంటే అసూయ కలగక మానదు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం ఎక్కడ పడితే అక్కడ ఫాంహౌస్‌లు కట్టుకున్నారు. కాంగ్రెస్.. రాష్ట్రం కోసం, దేశం కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే ఆపుతాం అంటున్నారు. మూసీ ప్రాజెక్ట్‌కు బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తోంది. మూసీని బాగుచేస్తామంటే అడ్డుపడుతున్నారు. లగచర్లలో ఇండస్ట్రీస్ పెట్టి యువతకు ఉద్యోగాలిస్తామంటే కుట్ర చేశారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ఆపుతాం అంటున్నారు. అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్న హరీష్ రావు.. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. హరీష్.. మీ పొలిటికల్ ఫ్యూచర్ లేకుండా కుట్రలు జరుగుతున్నాయి. ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ పార్టీ నుండి పోయి మీ ఫ్యూచర్ కాపాడుకో. బీఆర్ఎస్కు ఫ్యూచర్ లేదు.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసిన పాలిసెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శనివారం అధికారికంగా ఫలితాలను ప్రకటించారు. 82.94 శాతం ఫలితం సాధించినట్లు వెల్లడించారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు.. హాల్‌టికెట్ నంబర్ నమోదు చేసి విద్యార్థులు తమ ర్యాంక్కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ఒక్క క్లిక్‌తోనే అందిస్తోంది. ఫలితాలను చెక్‌చేసుకోవడానికి 👉 క్లిక్ చేయండిఈ ఏడాది మే 13న నిర్వహించిన తెలంగాణ పాలీసెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి అనంతరం ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఈ నెల 27 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ఆప్షన్లు, సీట్ల కేటాయింపు తదితర ప్రక్రియలను దశలవారీగా నిర్వహించనున్నారు. జూన్ మొదటి వారంలో సీట్ల కేటాయింపు పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈసారి కూడా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల కోసం గట్టి పోటీ ఉండే అవకాశముందని విద్యా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, సివిల్ వంటి కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. -
హైదరాబాద్‌లో టెస్లా.. రెడీ అవుతున్న షోరూం!
సాక్షి, హైదరాబాద్: టెస్లా.. ఎలక్ట్రిక్ కారు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు. ఇప్పటికే భారత్‌లో ముంబై, న్యూఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరులో ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను తెరిచిన టెస్లా.. హైదరాబాద్‌లోనూ అడుగు పెడుతోంది. కొండాపూర్‌లో రెండు నెలల్లో సేల్స్, సర్వీస్ సెంటర్ సిద్ధం అవుతోందని సమాచారం.యూఎస్‌కు చెందిన ఈ సంస్థ భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా మోడల్–వై కారును ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఆటోపైలెట్, ఫుల్ సెల్ఫ్–డ్రైవింగ్ వంటి అత్యాధునిక సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లు కంపెనీ కార్ల ప్రత్యేకత. టెస్లా అంటే కేవలం కార్లు మాత్రమే కాదని, ఈ సంస్థ రాకతో హైదరాబాద్ రియల్టీకి పెద్ద బూస్ట్‌నిస్తుందని రియల్టీ రంగ నిపుణుడు కలిశెట్టి నాయుడు ‘సాక్షి’కి తెలిపారు.టెస్లా కార్లకు ఇక్కడి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల విషయంలో బెంగళూరును బీట్ చేశామని, హైనకెన్, లాంజా వంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో కొలువుదీరడానికి ఇక్కడి మౌలిక వసతులు కారణమన్నారు. టాప్–20 ఎన్బీఎఫ్సీలు అన్నీ హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయని, ఒక్క భాగ్యనగరికే ఈ ఘనత సాధ్యమైందన్నారు.మంత్రి శ్రీధర్‌బాబుతో టెస్లా డెవలప్మెంట్ డైరెక్టర్ రజత్, ఇండియా జీఎం శరద్ అగర్వాల్ (ఎడమ నుంచి కుడికి) విస్తరణ చేపట్టండి.. మంత్రి శ్రీధర్‌బాబును టెస్లా బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ రజత్, ఇండియా జీఎం శరద్ అగర్వాల్ శుక్రవారం కలిశారు. హైదరాబాద్‌లో షోరూం ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. దేశంలో ప్రస్తు తం కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా సుమారు 4 శాతం మాత్రమే ఉందని, ఈ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులకు మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, హైదరాబాద్‌ను క్లీన్ టెక్నాలజీ, ఆధునిక మొబిలిటీకి ప్రపంచస్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసే సంకల్పంతో ఉందని పేర్కొన్నారు.తెలంగాణలో టెస్లా అనుబంధ పరిశ్రమల విస్తరణ అవకాశాలను పరిశీలించాలన్నారు. పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభు త్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో ఐటీ సలహాదారు సాయికృష్ణ, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ప్రత్యేక కార్యదర్శి రఘురామశర్మ పాల్గొన్నారు. -
నీకు పెళ్లి చేయాల్సిన చేతులతో తలకొరివి పెడుతున్నా బిడ్డా..
నల్లగొండ: అమెరికాలో ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్‌రెడ్డి–శోభ దంపతుల పెద్ద కుమార్తె నవ్య(24) మృతదేహం ఆరు రోజుల తర్వాత శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వగ్రామానికి చేరుకుంది. నవ్య బీటెక్ పూర్తిచేసి ఎంఎస్ చేసేందుకు రెండున్నరేళ్ల క్రితం అమెరికాకు వెళ్లింది. అక్కడ చికాగో రాష్ట్రంలోని రోజ్‌వెల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. ఈ నెల 16న రాత్రి కారులో వెళ్తుండగా.. వెనుక నుంచి మరో కారు వచ్చి ఢీకొట్టడంతో నవ్య అక్కడికక్కడే మృతిచెందింది. కాగా.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమార్తె విగతజీవిగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. నవ్య మృతదేహానికి ఆమె తల్లి శోభ బొట్టు పెట్టి సొమ్మసిల్లి పడిపోయింది. ‘నీకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపియ్యాలనుకున్న బిడ్డా.. కానీ నీకు తలకొరివి పెట్టే కర్మ పట్టింది.. ఏ తండ్రికి నాలాంటి బాధ రావొద్దు బిడ్డా..’ అంటూ నవ్య తండ్రి గడుసు శ్రీనివాస్‌రెడ్డి రోదించిన తీరు గ్రామస్తులు, బంధువులను కంటతడి పెట్టించింది. అనంతరం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తిచేశారు. నవ్య భౌతికకాయానికి ఆమె తండ్రి తలకొరివి పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. అంతిమయాత్రలో స్థానిక సర్పంచ్ నేతగాని కృష్ణ, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, చెరువుగట్టు ఆలయ చైర్మన్ వరాల రమేష్, మాజీ సర్పంచ్ మల్గా బాలకృష్ణ, నవీన్‌రెడ్డి, పున్నం రాజు యాదగిరి అంతిమయాత్రలో పాల్గొని నివాళులరి్పంచారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారంతో ఆరు రోజుల్లోనే నవ్య మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో ఆయనకు నవ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
పలకరింపు కరువై.. స్మార్ట్ఫోన్లకు బందీలై!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచం ఎన్నడూ లేనంతగా సాంకేతికతతో అనుసంధానమైంది. దాదాపు ప్రతి ఒక్కరి వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లలో నిరంతరం నోటిఫికేషన్ల మోత మోగుతోంది. కానీ విచిత్రంగా పొరుగువారితో, సమాజంతో దూరం మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. ఎంతలా అంటే.. పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా తెలి యని పరిస్థితి నెలకొంటోంది. సోషల్ మీడియాలో వేలాది మంది ‘ఫ్రెండ్స్’ఉంటున్నా అర్ధరాత్రి ఏదైనా ఆపద వస్తే కాపాడేందుకు పక్క ఇంట్లో ఉండే నిజమైన మనిషి దూరమవుతుండటం నేడు ప్రపంచాన్ని సంక్షోభంలా చుట్టుముడుతోంది. ఈ సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే బ్రిటన్‌లో ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించడానికి ఏకంగా జాతీయ సంభాషణ ప్రాజెక్ట్ ప్రారంభించాల్సి వచ్చింది.పాశ్చాత్య దేశాల్లో బంధాలకు బీటలు...బ్రిటన్‌లో సామాజిక ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు మాజీ కన్జర్వేటివ్ చాన్స్‌లర్ సాజిద్ జావిద్, లేబర్ పార్టీకి చెందిన ప్రముఖ నేత జాన్ క్రుడాస్ నేతృత్వంలో ఒక స్వతంత్ర కమిషన్ ఏర్పాటైంది. ‘భవిష్యత్తు బ్రిటన్ ఎలా ఉండాలి? ఏ బంధాలు ప్రజల్ని కలుపుతున్నాయి? పొరుగువారితో అనుబంధం ఎలా పెరగాలి?’అని ప్రజలనే అడుగుతూ ఒక దరఖాస్తు లేదా నిమిషం నిడివిగల వాయిస్ నోట్ ద్వారా ఆగస్టుకల్లా అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నారు.ఆందోళన పరుస్తున్న అధ్యయనాలుబ్రిటిష్ రెడ్ క్రాస్ జరిపిన తాజా అధ్యయనంలో 75% మంది బ్రిటన్ విభజిత దేశంగా మారిందని.. గత ఐదేళ్లలో ఈ దూరం మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అమెరికా పరిస్థితి మరింత ఘోరంగా మారింది. ఏఈఐ అనే అమెరికన్ థింక్ ట్యాంక్ అధ్యయనం ప్రకారం 2012లో 59% మంది అమెరికన్లు వారంలో పలుమార్లు పొరుగువారితో మాట్లాడేవారు. కానీ 2025 నాటికి ఆ సంఖ్య 40 శాతానికి పడిపోయింది. ముఖ్యంగా 18 నుంచి 29 ఏళ్ల మధ్యలోని యువతలో పొరుగు వారితో క్రమం తప్పకుండా మాట్లాడే వారి శాతం 51% నుంచి ఏకంగా 25 శాతానికి తగ్గింది.ఆరోగ్యానికి ముప్పుగా ‘ఒంటరితనం’...ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ ఒంటరితనాన్ని, సామాజిక దూరాన్ని ఒక ప్రజారోగ్య సంక్షోభంగా గుర్తించింది. నిపుణుల అభిప్రా యం ప్రకారం సామాజిక దూరం మానసిక ఒత్తిడిని మాత్రమే కాకుండా గుండె జబ్బులు, డిప్రెషన్, అకాల మరణాల ప్రమాదాన్ని తీవ్రంగా పెంచుతుంది. ప్రపంచంలో ప్రతి ఐదో వ్యక్తి తరచూ ఒంటరితనంతో బాధపడుతున్నాడని.. దీన్ని ఒక నిశ్శబ్ద సామాజిక సంక్షోభంగా పరిగణించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు కుటుంబం, పొరుగిల్లు, మతపరమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను కలిపేవి. కానీ ఇప్పుడు అల్గారిథమ్స్ మనుషుల పరిచయాలను, సంభాషణలను శాసిస్తున్నాయి.హైదరాబాద్ టు వైజాగ్ అంతా కాంక్రీట్ అరణ్యం.. దేశంలో కుటుంబ వ్యవస్థ పశ్చిమ దేశాల కంటే బలంగా ఉందనేది నిజమే అయినా నగరాల వేగం ఈ బంధాలను తుడిచేస్తోంది. హెల్ప్ ఏజ్ ఇండి యా నివేదిక ప్రకారం భారత్‌లో 69% మంది యువకులు, 68% మంది వృద్ధులు వృద్ధాప్యంలో ఒంటరివాళ్లమైపోతామనే భయంతో బతుకుతున్నా రు.ౖహైదరాబాద్, వైజాగ్ వంటినగరాల్లో ఈ సామా జిక దూరం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. కారణాలు, ప్రస్తుత పరిస్థితుల అంచనా... అపార్ట్మెంట్ సంస్కృతి: గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ అపార్ట్మెంట్లలో పక్క ఫ్లాట్‌లో ఎవరుంటున్నారో, ఏ స్థితిలో ఉన్నారో కూడా తెలియని ఉదాసీనత పెరిగిపోయింది. లిఫ్ట్‌లో ఎదురైనా బాగున్నారా అనే పలకరింపు కూడా కరువైంది. ఉద్యోగ ఒత్తిళ్లు: ఐటీ, కార్పొరేట్ ఉద్యోగ వేళలు, వర్క్ ఫ్రం హోం సంస్కృతి కారణంగా యువత గదులకే పరిమితమవుతున్నారు. వినోదం, షాపింగ్, ఆహారం, సలహాలన్నీ మొబైల్ స్క్రీన్‌పైనే లభి స్తుండటంతో పొరుగువారే కాదు.. ఎవరి ఇంటి తలుపులూ తట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. మనస్తత్వంతోనే! సాంకేతికత మనిషిని స్వయంసమృద్ధుడిగా మార్చింది. కానీ సామాజికంగా ఒంటరిని చేసింది. ఆధునిక సమాజంలో సాంకేతికతను వాడుకుంటూనే మనుషులను మళ్లీ ఎలా అనుసంధానించాలనేది ప్రస్తుతం ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద సవాల్. పొరుగువారితో మాట్లాడటం సమయం వృథా కాదు.. అదొక సామాజిక భద్రత అని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. – డేనియల్ కాక్స్, అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ సర్వే సెంటర్ డైరెక్టర్ -
Telangana: వడదెబ్బతో 30 మంది మృతి
సాక్షి, నెట్వర్క్: వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో 30 మంది మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన గిరిజనుడు కిరణ్‌కుమార్ (27), తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ ఆత్రం రాము (44), నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని బొడ్రాయి వీధికి చెందిన గంగాధర శాంతమ్మ (86), నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన కుకుట్ల కృష్ణయ్య (46), సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని ముక్కుడుదేవులపల్లికి చెందిన దాసరి బిక్షం (60) మృతి చెందారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం లింగగూడేనికి చెందిన జనగం రాంబాబు (43), ఖమ్మంలో గుర్తుతెలియని యాచకుడు (65), కొణిజర్లకు చెందిన ఉపాధి కూలీ పాముల శ్రీను (53), భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం ఆజాద్‌నగర్‌కు చెందిన పురోహితుడు ముక్కవరపు వెంకటేశ్వర్లు (65), ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన శానిటరీ పనులతో జీవనం సాగించే యార్లగడ్డ గోవర్దన్‌రావు(70), చర్ల మండలం ఆర్.కొత్తగూడెం జీపీ పరిధి దానవాయిపేటకు చెందిన దాగం సీతమ్మ(60), ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ షేక్ సలీం(42), చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన చింతచిగురు అమ్ముకునే పుట్టపర్తి భద్రమ్మ(60), ఖమ్మం బొక్కలగడ్డ ప్రాంతానికి చెందిన పూల దుకాణంలో పనిచేసే నాగయ్య(55), పరిగిముక్కల కాలనీకి చెందిన అచ్యుత్‌రావు(70) వడదెబ్బతో మృతి చెందారు. మధిర మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన కోట నిరంజన్(60) బంధువుల అంత్యక్రియలకు వెళ్లివచ్చాక వడదెబ్బతో అస్వస్థతకు గురై కన్నుమూశాడు. ⇒ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగన్‌పల్లి గ్రామానికి చెందిన గైని కవిత–సంజీవ్ దంపతులు కొన్నేళ్ల నుంచి హైదరాబాద్‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. వీరి కూతురు కూతురు కీర్తిక (8) వేసవి సెలవుల్లో నానమ్మతో గడిపేందుకు సొంతూరికి వచ్చింది. నాలుగు రోజులుగా తోటి పిల్లలతో కలిసి ఆరు బయట ఆడుకుంటోంది. నీరసం, జ్వరం రాగా, ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. ⇒ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన కొట్టెం భద్రమ్మ (68), డోర్నకల్ మండలంలోని తహసీల్దార్ బంజర గ్రామానికి చెందిన నన్నెబోయిన సత్యం(75), వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ పడమర కోట ప్రాంతానికి చెందిన బండి హరిశంకర్ (58), రంగశాయిపేటకు చెందిన ఆటో డ్రైవర్ విండ్ల సంతోష్‌కుమార్ (49), పర్వతగిరికి చెందిన చిర్రబోయిన అరుణ (45), నల్లబెల్లి మండలం ఆసరవెల్లికి చెందిన గుగులోతు నరసింహ (55), జనగామ జిల్లా కొడకండ్ల మండలం గుమ్ములబండ తండాకు చెందిన గుగులోత్ రామ్‌సింగ్ (75) వడదెబ్బతో మృతిచెందారు. ⇒ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్లకు చెందిన ఆరెల్లి పరశురాములు (62), జగిత్యాల రూరల్ మండలం మోరపల్లికి చెందిన కర్నె లచ్చయ్య (85), పెద్దపల్లి మండలం రంగాపూర్‌కు చెందిన కల్వకోట రామస్వామి (70), గోదావరి ఖనికి చెందిన అబ్బాస్‌ఖాన్(53) వీణవంక మండలం ఇప్పలపల్లికి చెందిన వేల్పుల ఐలయ్య (62), జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్కోత్తూర్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన మేస్త్రీ అండ్ర శ్రీనివాస్ (40) వడదెబ్బతో చనిపోయాడు. ⇒ మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో నిరవధిక సమ్మెలో పాల్గొన్న మెట్పల్లి గ్రామానికి చెందిన వీఓఏ దుగుట సంతోశ్ శుక్రవారం వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయాడు. రహదారిపై స్కూటీ దగ్ధం జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ సమీపాన సీతారామ కెనాల్ బ్రిడ్జి ఎండ తీవ్రతతో ఓ స్కూటీ కాలిపోయింది. పాల్వంచకు చెందిన దంపతులు స్కూటీపై శుక్రవారం ఖమ్మం వెళ్లి తిరిగి వస్తుండగా వినోభానగర్ సమీపాన స్కూటీలో మంటలు మొదలయ్యాయి. దీంతో ప్రమాదాన్ని గుర్తించిన దంపతులు స్కూటీని వదిలేసి పక్కకు వెళ్లిన క్షణాల్లోనే మంటలు ఉధృత రూపం దాల్చి వాహనం కాలిబూడిదైంది. మరో రెండ్రోజులు అధిక ఉష్ణోగ్రతలే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాడ్పుల ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో రెండ్రోజులపాటు రాష్ట్రంలో ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఖమ్మంలో అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్ : 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇది పెద్ద కల అని, రాష్ట్ర ప్రస్తుత వృద్ధి రేటు చూస్తుంటే ఇది కచ్చితంగా సాధ్యమేనని స్పష్టమౌతోందన్నారు. ప్రస్తుతం దేశ సగటు ఊవృద్ధి రేటు 8.2% గా ఉంటే, తెలంగాణ వృద్ధి రేటు 10.7% తో దూసుకుపోతోందన్నారు. దేశ సగటు తలసరి ఆదాయం రూ.2.1 లక్షలుగా ఉంటే, తెలంగాణ తలసరి ఆదాయం రూ.4.18 లక్షలతో దేశంలోనే అగ్రగామిగా ఉందని ప్రకటించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో బ్యాంకుల మొత్తం డిపాజిట్లు దాదాపు రూ.9.43 లక్షల కోట్లకు, అడ్వాన్సులు రూ.12.34 లక్షల కోట్లకు చేరుకుందన్నారు.రాష్ట్రం 130.78 శాతం క్రెడిట్–డిపాజిట్ నిష్పత్తితో ముందుకు సాగడం గొప్పవిషయమన్నారు. వ్యవసాయ రుణాలకు సంబంధించి రూ.1,65,297 కోట్ల లక్ష్యానికిగాను రూ.1,68,401 కోట్లు పంపిణీ చేసి 101.88 శాతం సాధించడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. శుక్రవారం ప్రజాభవన్‌లో 49వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, మహిళ, దళిత, గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు రుణాల పంపిణీపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలని కోరారు. విద్యార్థులకు ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకులు మరింత సానుకూల దృక్ఫథంతో ముందుకు రావాలన్నారు.సౌరశక్తి ప్రాజెక్టులు, రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్ల ఏర్పాటు ఇతర పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు బ్యాంకులు చురుగ్గా రుణ సహాయం అందించాలని సూచించారు. సామాజిక భద్రత, బీమా పథకాల పరిధిలోకి రాష్ట్ర ప్రజలను తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో త్వరలోనే అనేక ఇండస్ట్రియల్ హబ్‌లు, క్లస్టర్లను తీసుకువస్తున్నట్టు భట్టి వెల్లడించారు. ఇందులో భాగంగా ఫార్మా, ఫ్యాబ్ సిటీ, స్టీల్, లెదర్, టెక్స్టైల్ వంటి వివిధ రంగాలను డిజైన్ చేస్తున్నట్టు చెప్పారు. స్వల్పకాలిక రుణాలకే బ్యాంకులు పరిమితం : మంత్రి తుమ్మల ఇప్పటికీ వ్యవసాయ రుణాల్లోఅధిక భాగం స్వల్పకాలిక పంట రుణాలకే బ్యాంకులు పరిమితం కావడం ఆందోళన కలిగించే విషయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయం ఇప్పుడు ఉద్యానవనం, ఆయిల్ పామ్, సమగ్ర వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షిత సాగు, పాడి, మత్స్య, యాంత్రీకరణ వంటి రంగాల వైపు వేగంగా మారుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఇందుకు అనుగుణంగా స్పందించాలని కోరారు. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్ హౌస్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రిప్ ఇరిగేషన్, సోలార్ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ వంటి రంగాలకు దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అందించాలని సూచించారు. 2025–26 లో పంట రుణాల పంపిణీ రూ.75,486 కోట్లకు చేరి, వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంలో 84.34 శాతం సాధించిందన్నారు.మొత్తం వ్యవసాయ, అనుబంధ రంగాలు, మౌలిక వసతుల కింద రూ.1,68,401 కోట్ల రుణాలు పంపిణీ చేసి 101.88 శాతం లక్ష్య సాధన నమోదు కావడం రాష్ట్ర బ్యాంకింగ్ వ్యవస్థ పురోగతిని సూచిస్తోందన్నారు. శుక్రవారం 49వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) త్రైమాసిక సమావేశంలో మంత్రి బ్యాంకింగ్ సంస్థల ప్రతినిధులు, నాబార్డ్ అధికారులు, సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాన రంగ రుణాలు రూ.4.09 లక్షల కోట్లు, వ్యవసాయ రుణాలు రూ.1.87 లక్షల కోట్లకు చేరడం సంతోషకరమన్నారు. పీఆర్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ దాన కిషోర్, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ఫైనాన్స్ ప్లానింగ్ సెక్రెటరీ గౌరవ్ ఉప్పల్, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయ మోహన్, ఎస్బీఐ సీజీఎం నీలేష్ ద్వివేది తదితరులు పాల్గొన్నారు. -
ఇల్లు.. అందుబాటులోనిల్లు
భాగ్యనగరంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల.. కలగానే మిగిలిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. చిన్న ఫ్లాట్ల నిర్మాణం క్రమంగా తగ్గిపోతుండటమే ఇందుకు కారణం. సొంత స్థలంలో ఇల్లు అనేది దశాబ్దాలుగా నగరంలో ఉంటున్న వారికి మినహా వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికి దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలోనే అపార్ట్మెంట్ల కల్చర్ వచ్చింది. తొలినాళ్లలో ఎక్కువగా సింగిల్ బెడ్ రూమ్ (1 బీహెచ్‌కే), డబుల్ బెడ్ రూమ్ (2 బీహెచ్‌కే) ఇళ్లే ఎక్కువగా నిర్మించేవారు. దీంతో సొంతంగా స్థలం కొనుక్కుని ఇల్లు నిర్మించుకోలేని వారు అపార్ట్మెంట్ ఫ్లాట్ల వైపు మొగ్గు చూపేవారు. 600–700 చ.అడుగుల్లో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు అందుబాటులో ఉండేవి. సొంతిల్లు కావాలనుకునే వారు ఈ సింగిల్ లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కొనుగోలు చేసి కల నెరవేర్చుకునేవారు. దాదాపు ఐదేళ్ల క్రితం వరకు కూడా డెవలపర్లు ఈ 1, 2 బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది.1, 2 బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణాలు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. 1 బీహెచ్‌కే ఇళ్లయితే అసలు కనిపించడమే లేదు. మిగతా నగరాలతో పోల్చుకుంటే అత్యధికంగా హైదరాబాద్‌లోనే ఈ తరహా ఇళ్లు (అఫర్డబుల్ హౌసింగ్/సామాన్యులకు అందుబాటులో ఉండేవి) 70 శాతం తగ్గినట్లు ప్రాప్ ఈక్విటీ నివేదిక పేర్కొనడం గమనార్హం. నగరంలో భూముల ధరలు విపరీతంగా పెరగడం, లేబర్ల జీత భత్యాలు పెరగడంతో గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో బిల్డర్లు అఫర్డబుల్ హౌసింగ్‌ను దాదాపుగా మానుకుంటున్నారు. మరోవైపు కొనుగోలుదారులు చాలావరకు అవసరమైతే మరింత అప్పు చేసైనా సరే కాస్త విశాలమైన ఇళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లు, విల్లాల వంటివి గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. కరోనా తర్వాత.. కరోనా కాలంలో చిన్న, ఇరుకైన ఇళ్లలో నివసించడం ఎంత రిస్కో తెలిసొచ్చింది. ఎక్కువ గదుల భావన బలపడింది. దీంతో అప్పటినుంచి అత్యధిక శాతం కొనుగోలుదారులు విశాలమైన ఇళ్ల కొనుగోళ్లకే మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంలో 25–40 శాతం భూమి ధరలదే ఉంటోంది. దీంతో లాభదాయకం కాదనే భావనతో బిల్డర్లు కూడా 1, 2 బీహెచ్‌కే ఫ్లాట్ల నిర్మాణాన్ని తగ్గించారు. 2018లో గృహ విక్రయాలలో మధ్య తరగతి ఇళ్ల వాటా 54 శాతంగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 26 శాతానికి పడిపోవడం గమనార్హం. మధ్య తరగతి గృహాలపై తీవ్ర ప్రభావం.. దేశంలోని ఇతర మెట్రో నగరాలలో కూడా అఫర్డబుల్ గృహాల నిర్మాణం వేగంగా తగ్గుతోంది. ప్రాప్ ఈక్విటీ నివేదిక ప్రకారం మన తర్వాత (70 శాతం) ముంబైలో 60 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 50 శాతం మేర క్షీణించాయి. ప్రత్యేకించి హైదరాబాద్‌లో 2022 నుంచి రూ.కోటి కంటే బాగా తక్కువగానే ధర ఉండే మధ్య తరగతి గృహ నిర్మాణాల అమ్మకాలు భారీగా తగ్గాయి. విశాలమైన, విలాసవంతమైన ఇళ్లలో నివాసం ఉండేందుకు, కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తుండటంతో వారి అభిరుచులకు మేరకు డెవలపర్లు కూడా లగ్జరీ గృహ నిర్మాణాలకు మొగ్గు చూపిస్తున్నారు. మరోవైపు భూముల ధరలు ఆకాశాన్నంటడం, నిర్మాణ సామగ్రి, నైపుణ్య కారి్మకుల వేతనాలు పెరగడం వంటి కారణంగా మధ్య తరగతి ఇళ్ల నిర్మాణం బిల్డర్లకు లాభసాటిగా ఉండటం లేదు. దీంతో ఎక్కువ లాభదాయకంగా ఉండే ప్రీమియం ప్రాజెక్టుల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ధరలు పెరిగే అవకాశం టైల్స్, శానిటరీ, అల్యూమినియం, రంగులు, యూపీవీసీ, పీవీసీ పైపులు, ఎలక్ట్రిక్ వైర్లు వంటి ఉత్పత్తుల తయారీలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ అత్యంత కీలకం. ప్రస్తుతం గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా తగ్గడంతో ఆయా ఉత్పత్తుల తయారీపై తీవ్ర ప్రభావం పడుతోంది. నిర్మాణ రంగంలో సిమెంట్, స్టీల్ తయారీ దేశీయంగానే ముడి పదార్థాలపై ఆధారపడి ఉండటంతో ఆయా ఉత్పత్తులపై పెద్దగా ప్రభావం లేదు.కానీ రవాణా అంతరాయం కారణంగా వీటి ధరలు 10–15 శాతం వరకు పెరిగాయి. దిగుమతి చేసుకునే యూపీవీసీ కిటికీలు, తలుపులు, గ్లాస్లు, శానిటరీ వేర్ వంటి వాటి ధరలు 40 శాతం పైనే పెరిగాయి. నిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయం, కొరత కారణంగా భవన నిర్మాణ వ్యయం 15–20 శాతం మేర పెరిగింది. ఈ భారాన్ని డెవలపర్లు తుదిగా గృహ కొనుగోలుదారులకు బదిలీ చేయక తప్పదు. ఫలితంగా అపార్ట్మెంట్ల ధరలను చ.అ.కు రూ.250–300 వరకు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తగ్గుతున్న అమ్మకాలు భూములు, నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడం, నైపుణ్య కారి్మకుల కొరత, గృహ రుణ వడ్డీ రేట్ల పెరుగుదల సూచనలు.. వెరసి హైదరాబాద్ స్థిరాస్తి రంగం కుప్పకూలుతోంది. 2024తో పోల్చుకుంటే 2025లో ప్రాజెక్టులు, అదే విధంగా ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఇక హైదరాబాద్‌లో 2025 చివరి త్రైమాసికంలో 60 లక్షల చదరపు అడుగులు (చ.అ.) మేర గృహ నిర్మాణాలు పూర్తి కాగా.. ఈ ఏడాది తొలి త్రైమాసికం నాటికి కేవలం 6 లక్షల చ.అ.లకే పరిమితయ్యాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే భారీ స్థాయిలో క్షీణించడం నగరలో నిర్మాణ రంగ పతనాన్ని సూచిస్తోంది. ఇంకోవైపు కనెక్టివిటీ, మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో శివారుప్రాంతాల్లోని 40 శాతం మధ్య తరగతి గృహాలు అమ్ముడుపోకుండా ఉన్నాయి. ప్రభుత్వం చొరవ చూపాలి భూ యజమానులు అత్యాశతో భూముల ధరలను రాత్రికి రాత్రే పెంచేస్తున్నారు. దీంతో అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లు చేపట్టాలంటే బిల్డర్లు పునరాలోచిస్తున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ భూముల లభ్యత విపరీతంగా ఉంది. అయితే సరైన మౌలిక వసతుల్లేవు. ఆ మేరకు ప్రభుత్వం సదుపాయాలు కలి్పస్తే మధ్య తరగతి గృహ నిర్మాణాలు చేపట్టేందుకు వీలుంటుంది. – నరేంద్రకుమార్, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్ (ఫొటో కామన్‌లో నరేంద్ర కుమార్ పేరుతో ఉంది) -
అనాధ గిరిజన చిన్నారులకు అండగా నిలిచిన సీఎం ప్రజావాణి
సాక్షి,ఆదిలాబాద్ : తల్లిదండ్రులు చనిపోయి అనాధలుగా మారిన గిరిజన ‘తోటి’ కులానికి చెందిన ఇద్దరు చిన్నారులకు సీఎం ప్రజావాణి అండగా నిలిచింది. శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్లో జరిగిన సీఎం ప్రజావాణికి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన అనాధ పిల్లలను వారి బంధువులు తీసుకువచ్చారు.రెండేళ్లు, మూడు నెలల చిన్నారుల పోషణ కష్టంగా ఉందని వారి సంరక్షణ చూస్తున్న పెదనాన్న పెద్దమ్మ ఆత్రం సునీత, వెంకటిలు సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకొని చలించిపోయిన చిన్నారెడ్డి ఇద్దరు చిన్నారులకు స్పాన్సర్షిప్ అందించాలని కోరుతూ ఆదిలాబాద్ కలెక్టర్ కు లేఖ రాశారు.ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం రాంజీ గోండు నగర్ గ్రామానికి చెందిన ఆత్రం విఠల్, గంగుబాయి ఆరు నెలల కాలంలో మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. దీంతో ఆ చిన్నారుల బాధ్యతలు వారి పెదనాన్న పెద్దమ్మ చూస్తున్నారు. కనీసం డబ్బా పాలు కూడా కొనలేని దీనస్థితిలో ఉన్నామని వారు చిన్నారెడ్డి దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రతినెల ఆర్థిక సాయంతో పాటు డబ్బా పాలను చిన్నారులకు అందించే బాధ్యత తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్‌కు చిన్నారెడ్డి సూచించారు. -
పెరిగిన ఇంధన ధరలతో వర్కర్లు విలవిల
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు క్యాబ్ డ్రైవర్. ఓలా, ఉబెర్ అగ్రిగేటర్ సంస్థలతో అనుసంధానమై క్యాబ్ నడుపుతున్నాడు. రోజుకు సగటున 150 కి,మీ చొప్పున అతని క్యాబ్ తిరుగుతుంది. రూ.1800 నుంచి రూ.2000 వరకు ఆదాయం వస్తుంది. రోజుకు రూ.1000 డీజిల్ ఖర్చు పోను మరో రూ.800 నుంచి రూ.1000 వరకు మిగులుబాటయ్యేది. ఆ డబ్బులతోనే బండి ఈఎంఐ, ఇంటి కిరాయి, నిత్యావసరాలు, ఫోన్ రీచార్జ్, తదితర అన్ని అవసరాలు తీర్చుకున్నాడు. కానీ.. ఇప్పుడు డీజిల్ ధర పెరగడంతో రోజుకు రూ.1,275 వరకు ఖర్చవుతోంది. ఇంధన ధరల పెంపు కారణంగా 25 శాతం ఆదాయం తగ్గింది. ‘రోజు రోజుకు అన్ని ధరలు పెరుగుతున్నాయి కానీ.. క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు ఇచ్చే పేమెంట్స్ మాత్రం పెరగడం లేదు. ఈఎంఐ కట్టడం కష్టంగా ఉంది’ అని ఆందోళన వ్యక్తం చేశాడు. భారం రూ.30 కోట్లు అంతర్జాతీయ చమురు మార్కెట్లలో వస్తున్న మార్పుల ప్రభావం భాగ్యనగర వీధుల్లో ఆటోలు, క్యాబ్‌లు, బైక్‌లు నడుపుకుంటూ బతుకుదెరువు సాగిస్తున్న సామాన్యుల కుటుంబాలపై తీవ్రంగా పడుతోంది. మే నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా లీటరుకు రూ. 4 పైనే పెరగడంతో నగరంలోని సుమారు 1.25 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు, 4 లక్షల మంది గిగ్ వర్కర్ల (డెలివరీ బాయ్స్, బైక్ టాక్సీ రైడర్స్) ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హైదరాబాద్ నగర రవాణా, డెలివరీ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ రెండు వర్గాలపై నెలకు సుమారు రూ.30 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు అంచనా.ధరలు పెరిగిన ప్రతిసారి ఓలా, ఉబెర్, స్విగ్ని, జొమాటో తదితర సంస్థలు రైడ్ ఛార్జీలు, డెలివరీ ఫీజులు పెంచుతున్నప్పటికీ, పెరిగిన లాభాలను డ్రైవర్లకు, డెలివరీ బాయ్స్‌కు ఆశించిన స్థాయిలో బదిలీ చేయడం లేదు. సుమారు 1.25 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు రోజుకు సుమారు 12.5 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నట్లు అంచనా. పెరిగిన ధరల కారణంగా ఈ ఒక్క క్యాబ్ కమ్యూనిటీపైనే నెలకు ఏకంగా రూ.15.94 కోట్ల అదనపు భారం పడుతోంది. నగరంలోని సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్లను పరిగణనలోకి తీసుకుంటే, వీరంతా రోజుకు 10.68 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తున్నారు.చదవండి: ఒంటి చక్రం సైకిల్‌పై సాహసయాత్ర!గ్రేటర్‌లోని సుమారు 1.25 లక్షల మంది డ్రైవర్ల దయనీయ పరిస్థితి ఇది. కేవలం పెట్రోల్, డీజిల్ కాకుండా సీఎన్జీ, ఎల్పీజీ ధరలు కూడా పెరిగాయి. చాయ్, టిఫిన్ సహా అన్నింటిపైనా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వర్క్‌ఫ్రమ్ హోమ్ మళ్లీ మొదలైంది. క్యాబ్, ఆటోడ్రైవర్లకు ఇది పిడుగుపాటుగా మారింది. మరోవైపు సుమారు 4 లక్షల మందికి పైగా ఉన్న గిగ్అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ (డెలివరీబాయ్స్) కూడా పెరిగిన పెట్రోల్ ధరలతో విలవిలలాడుతున్నారు.చెల్లింపులు పెంచాలిపెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా బండి బయటికి తీయాలంటేనే భయంగా ఉంది. ధరలకు అనుగుణంగా క్యాబ్ సంస్థలు చెల్లింపులను పెంచాలి. – సంతోష్ఆర్డర్లు తగ్గాయి డెలివరీబాయ్స్ బాగా పెరగడంతో ఆర్డర్లు తగ్గాయి. ఆదాయం కూడా తగ్గింది. గతంలో ఒక బుకింగ్పైన రూ.30 నుంచి రూ..40 లభించేది.ఇప్పుడు రూ.10, రూ.20 చొప్పున వస్తున్నాయి. – ఖలీల్ -
IPL 2026: ఆర్సీబీని చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
ఉప్పల్ మైదానం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులకు పరిమితమైంది. బెంగళూరు బ్యాటర్లలో రజిత్ పాటిదార్(56) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కృనాల్ పాండ్యా(41), వెంకటేశ్ అయ్యర్(44) రాణించారు. విరాట్ కోహ్లి మాత్రం కేవలం 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు, షకీబ్, ట్రావిస్ హెడ్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్పాటిదార్ రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన పాటిదార్.. హెడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 185/4ఆర్సీబీ మూడో వికెట్ డౌన్దేవ్దత్త్ పడిక్కల్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన పడిక్కల్.. మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 91/28 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో దేవ్‌దత్త్ పడిక్కల్(20), పాటిదార్(10) ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీఎస్ఆర్హెచ్ విధించిన 256 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ధాటిగా ఆరంభించింది. 4 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. అయితే మరుసటి ఓవర్లోనే వెంకటేశ్ అయ్యర్ (44) ఔట్ కావడంతో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ టార్గెట్ 256 పరుగులుహైదరాబాద్ వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్ భారీ స్కోరు చేసింది. అభిషేక్, ఇషాన్, క్లాసెన్ అర్థశతకాలతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) ఫిఫ్టీలతో మెరిశారు. ఆఖర్లో నితీశ్‌కుమార్ (12 బంతుల్లో 29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఎస్ఆర్హెచ్ 250 పరుగుల మార్క్‌ను దాటింది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 2 వికెట్లు తీయగా, సుయాశ్, కృనాల్ చెరొక వికెట్ తీశారు.16 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్లాసెన్ 23 బంతుల్లో 50 పరుగుల మార్క్ సాధించాడు. కిషన్ 65 పరుగులతో ఆడుతున్నాడు.దంచుతున్న ఎస్ఆర్హెచ్.. 15 ఓవర్లలో 189-2ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ దంచికొడుతుంది. 15 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (50), క్లాసెన్ (47) క్రీజులో ఉన్నారు. అంతకముందు 56 పరుగులు చేసిన అభిషేక్ శర్మ సుయాశ్ శర్మ బౌలింగ్‌లో జోర్డాన్ కాక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.6 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 63-16 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (26), ఇషాన్ కిషన్ (8) పరుగులతో ఆడుతున్నారు.హెడ్ (26) ఔట్.. తొలి వికెట్ డౌన్ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ రసిక్సలామ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 45 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (17) క్రీజులో ఉన్నాడు.టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీపై భారీ విజయాన్ని సాధించి టేబుల్లో రెండో స్థానంలో నిలవాలని ఎస్ఆర్హెచ్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఇప్పటికే టాప్‌లో ఉన్న ఆర్సీబీ విజయంతో లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. మరి భారీ స్కోర్లకు పెట్టింది పేరైన ఉప్పల్ స్టేడియంలో ఎవరిది పైచేయి కానుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ తమ సొంత మైదానంలో ఎస్ఆర్హెచ్తో తలపడింది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించిన ఆర్సీబీ.. యాదృశ్చికంగా లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌ను మళ్లీ ఎస్ఆర్హెచ్తోనే ఆడుతోంది. అయితే ఎస్ఆర్హెచ్ మాత్రం ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 26 సార్లు తలపడితే ఎస్ఆర్హెచ్ 14 సార్లు, ఆర్సీబీ 12 సార్లు విజయాలు సాధించాయి. ఇక సొంత మైదానంలో ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్దే పైచేయిగా ఉంది. ఇక్కడ ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ ఆరింటిలో గెలవగా.. ఆర్సీబీ మూడింట నెగ్గింది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(వికెట్‌కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్.సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్. 🚨Toss update from Hyderabad 🚨@SunRisers won the toss and elected to bat first against @RCBTweets Rajat Patidar returns to lead #RCB Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB pic.twitter.com/izekAMXKnx— IndianPremierLeague (@IPL) May 22, 2026 -
విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నా: ఆకునూరి
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ (TEC) చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎస్‌కు పంపించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. మేము విద్యపై సిఫార్స్‌లతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాము. నాకు అప్పగించిన పనిని పూర్తిచేసినందున తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.తెలంగాణ విద్యా రంగంలో కీలక పాత్ర పోషించిన ఆకునూరి మురళి 2024లో టీఈసీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం రెండు సంవత్సరాలు కాగా ఇవాళ (మే22)సమగ్ర నివేదిక సమర్పించి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.ఆకునూరి మురళి రాష్ట్రంలోని ప్రాథమిక నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టారు. ఆయన కరికులం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బోధన పద్ధతులు మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. దీర్ఘకాలిక విద్యా విధాన రూపకల్పన చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. రాజకీయ ప్రభావం లేకుండా స్వతంత్ర నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలల పనితీరును పర్యవేక్షించారు.ఆయన చైర్మన్‌గా ఉన్న సమయంలో 100 మోడల్ స్కూల్స్ ఏర్పాటు ప్రణాళిక రూపొందించారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పేద కుటుంబాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించే ప్రయత్నం చేశారు. ఆకునూరి మురళి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించి, అప్పగించిన బాధ్యతలు పూర్తి చేసిన తర్వాత స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, విద్యా రంగంలో సేవ చేయడం గౌరవంగా భావించినట్లు తెలిపారు. -
ఫ్యూచర్ సిటీని రద్దు చేసి తీరతాం
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన ప్రకటన చేశారు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారాయన. అలాగే.. ఫార్మాసిటీని మళ్లీ తీసుకొస్తామని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టం ఉంది. రేవంత్ ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోంది. హై కోర్టు లో ఈ మధ్య ఒక కేసు వచ్చింది. మేము ఫార్మా సిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అసలు విషయం ఇదే. రేవంత్ సర్కార్ కేవలం జిమ్మిక్కు చేస్తోందిఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధం గా కనీస సౌకర్యాలు ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలని ప్రయత్నం చేస్తున్నారు. 75 శాతం ఫార్మా సిటీ ఉండి.. మిగతా 25 పర్సెంట్ మిగతావి ఉండాలని చేస్తున్నారు. కానీ 75 శాతం మిగతా వ్యాపారం కేవలం 25 శాతమే ఫార్మా వచ్చేలా చేస్తున్నారు. ఇది చట్ట ప్రకారం చెల్లదు. కానీ కాంగ్రెస్ ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందిమేము ప్రభుత్వం లోకి వచ్చాక ఫ్యూచర్ సిటీ రద్దు వంద శాతం చేస్తాం. ఫార్మా సిటీ నీ రీస్టోర్ చేస్తాం. ఇది నా మాట కాదు. పార్లమెంట్ చట్టం ఇది. ఫార్మా సిటీ వస్తె లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని మేము ప్రారంభించాం. మన దగ్గర నుంచి ఒక్క ఫార్మా కంపెనీ బయటికి వెళ్లొద్దని చేశాం. ఇప్పటికే రెండున్నర ఏళ్లు గడిచిపోయింది. లాస్ట్ వన్ ఇయర్ ఎలక్షన్ ఉంటుంది. రేవంత్ సర్కార్ ఏమీ చేయలేదు. భూములు పంచి పెడితే బ్యాక్ ఎండ్ ఏదో లబ్ది పొందాలని ప్లాన్ చేశారు. ఫార్మా సిటీ అభివృద్ది చెందితే బీఆర్ఎస్కు పేరు వస్తుంది అని ఇలా చేశారు. వాళ్ళు ఏమి చేసినా నడవదు... నిలబడదు.. ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఫార్మా సిటీనే వస్తుంది అని హరీష్‌రావు అన్నారు. “ఫ్యూచర్ సిటీ”, “ఫార్మాసిటీ” రెండూ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన భారీ ప్రాజెక్టులే. కానీ ప్రభుత్వాలు మారడంతో వాటి దిశ కూడా మారిపోయింది. తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో “ఫార్మాసిటీ” పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ పరిశ్రమల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ రావాల్సి ఉంది. దేశ విదేశాల నుంచి పెద్ద పెద్ద ఔషధ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు రూపొందించారు. దీనివల్ల ఉద్యోగాలు పెరుగుతాయని.. తెలంగాణ ఔషధ రంగంలో అగ్రస్థానానికి చేరుతుందని అప్పటి ప్రభుత్వం చెప్పింది.అయితే ఆ ప్రాజెక్ట్‌కు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. భూములు కోల్పోతామన్న భయం ఒకవైపు.. కాలుష్యం పెరిగి నీరు, గాలి దెబ్బతింటాయన్న ఆందోళన మరోవైపు పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. ముఖ్యంగా యాచారం, కందుకూరు ప్రాంతాల్లో రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం “ఫార్మాసిటీ” ఆలోచనను పక్కనబెట్టింది. అయితే.. అదే ప్రాంతంలో “ఫ్యూచర్ సిటీ” అనే కొత్త ఆలోచనను తెరపైకి తీసుకొచ్చింది. ఇది కేవలం పరిశ్రమల నగరం కాదు.. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు సాంకేతికత, కృత్రిమ మేధస్సు, పరిశోధనలు, హరిత వాతావరణం, నివాసాలు, ఉద్యోగ కేంద్రాలు అన్నీ కలిసిన ఆధునిక నగరంగా అభివర్ణిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. -
ఎండల బీభత్సం.. వడదెబ్బతో 22 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో 22 మంది మృతిచెందారు. ఎండదెబ్బ దాటికి ఒక్క వరంగల్ జిల్లాలోనే తొమ్మిది మంది మరణించారు. అయితే మరో నాలుగు రోజుల పాటు ఎండల ప్రభావం తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.కాగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. నిన్న( గురువారం) ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని ముత్తారం, మునగాలలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో పాటు రాష్ట్రంలోని 25 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఎండలు మండుతుండడంతో ప్రజలెవ్వరూ అత్యవసరమైతే తప్ప బయిటకీ రాకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
రైతులను తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతు మరణించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల రాజకీయాలకు పెట్టింది పేరని విమర్శించారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకే కేటీఆర్ బహిరంగ లేఖ రాశారని మండిపడ్డారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక్క రైతు కూడా మరణించలేదన్నారు. రాజకీయ లాభాల కోసం బురదచల్లే ప్రయత్నమే తప్ప.. కేటీఆర్ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. బీఆర్ఎస్ పాలనలో సాగునీటి రంగాన్ని కుంభకోణాల కూపంగా మార్చిన నాయకులు ఇప్పుడు రైతు సంక్షేమంపై మాట్లాడడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి నమోదైందని ఉత్తమ్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో కూడా సరికొత్త రికార్డులు నమోదయ్యాయని చెప్పారు. 2025–26 రబీ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఇప్పటివరకు 54.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరిందన్నారు. అందులో 46.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని వెల్లడించారు. ఇందుకుగాను 6.3 లక్షల మంది రైతులకు రూ.7,841 కోట్ల చెల్లింపులు చేసినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసం 18.3 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేశామని, రవాణా కోసం 13 వేల వాహనాలను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతుండటాన్ని తట్టుకోలేక బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. -
కేబినెట్ మీటింగ్‌లోనైనా కళ్లు తెరవండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అరాచకత్వం పరాకాష్టకు చేరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటను కొనే దిక్కులేక రెండు నెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆర్తనాదాలు చేస్తున్నా సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. ఈ నెల 23న జరిగే కేబినెట్ మీటింగ్‌లోనైనా పంట కొనుగోళ్లలో నెలకొన్న సంక్షోభంపై ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడి పరిష్కారం చూపాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. ‘ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ప్రతీ రోజూ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. పంట అమ్ముకుందామనే కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు పడుతున్న రైతులు గుండె పగిలి కుప్ప కూలుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో దైర్యంతో బతికిన అన్నదాత కాంగ్రెస్ పాలనలో ఆత్మ విశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డాడు. రైతులకు రక్షణగా కేసీఆర్ అమలు చేసిన పథకాలను రేవంత్ ఒక్కొక్కటిగా పాతరేసి రైతుల వెన్ను విరించారు. రైతుభరోసా ఎగవేసినా, యూరియా కష్టాలు అధిగమించి రైతులు పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు’అని కేటీఆర్ మండిపడ్డారు. పంటలు తగులబెట్టుకుంటున్నారు ‘పంట కొనుగోలు చేసే నాథుడు లేక రైతులు తమ పంటలను తగుల పెట్టుకుంటున్నారు. రెండు నెలలుగా నిరసనలో పాల్గొనని రైతు లేడు, రాస్తారోరో జరగని రహదారి లేదు. పగలూరాత్రి ప్రజాసంపదను దోచుకోవడంపై తప్ప పరిపాలనపై సీఎంకు పట్టులేకపోవడం అన్నదాతకు శాపంగా మారింది. రోడ్లపై జరుగుతున్న నిరసనల నుంచి తప్పించుకునేందుకు మంత్రులు హెలికాప్టర్లో షికార్లు కొడుతున్నారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనూ రైతులు రోడెక్కి నిరసన తెలపడం రాష్ట్రంలో నెలకొన్న సాగు సంక్షోభానికి అద్దం పడుతోంది. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత, క్వింటాల్‌కు పది కిలోల తరుగు, గన్నీ బ్యాగులకు రూ.50 డిపాజిట్ వంటి సమస్యలను తీర్చేవారే లేరు. పంట కొనుగోలు కూడా చేయడం చేతకాకపోతే రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు సీఎం క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలి. కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల నుంచి రైతుల పంటను కాపాడుకునేందుకు చివరకు టార్పాలిన్లు కూడా సమకూర్చలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్న రైతులు కాంగ్రెస్‌కు మరణ శాసనం రాసేందుకు సిద్ధంగా ఉన్నారు’అని ఆ లేఖలో కేటీఆర్ హెచ్చరించారు. -
సోలార్ విద్యుత్ నిల్వతో సింగరేణికి లాభాల వెలుగు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ఆశించిన ఫలితాలను ఇస్తోంది. వినియోగం కాకుండా ఉచితంగా గ్రిడ్‌కు వెళ్లిపోయే సోలార్ విద్యుత్‌ను ఇప్పుడు బ్యాటరీల్లో నిల్వ చేసి అవసరమైన సమయంలో వినియోగించుకోవడంతో సంస్థకు ఆర్థిక లాభాలు చేకూరుతున్నాయి. నాలుగు నెలల్లోనే రూ.25.66 లక్షల మేర ఆదా కావడం విశేషం. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ ప్రాజెక్టును సింగరేణి మందమర్రి ఏరియాలో ప్రయోగాత్మకంగా ఏర్పా టు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రూ.2.5 కోట్లను యాజమాన్యం వెచ్చించింది.సింగరేణి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను నిర్వహిస్తోంది. వీటిలో 147 మెగావాట్లను ఓపెన్ యాక్సెస్ ప్లాంట్లుగా, 98.5 మెగావాట్లను ఇన్‌హౌస్ ప్లాంట్లుగా వినియోగిస్తోంది. ఇన్‌హౌస్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను స్థానిక అవసరాలకు వినియోగించిన తర్వాత మిగిలే విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపాల్సి వస్తోంది. అయితే విద్యుత్ ఒప్పందాల ప్రకారం ఆ మిగులు విద్యుత్‌కు ఎటువంటి చెల్లింపులు ఉండవు. దీంతో ప్రతిరోజూ వేల యూనిట్ల విద్యుత్ ఆర్థిక ప్రయోజనం లేకుండానే గ్రిడ్‌లో కలిసిపోతోంది. ఈ నష్టాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచనలతో సింగరేణి మందమర్రి 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌కు అనుబంధంగా బీఈఎస్ఎస్ను ఏర్పాటు చేసింది.3.35 లక్షల యూనిట్ల నిల్వ మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లోని గనులు, కాలనీలకు అవసరమైన విద్యుత్‌ను ఈ సోలార్ ప్లాంట్ సరఫరా చేస్తోంది. మిగిలిన విద్యుత్‌ను ఇప్పుడు బీఈఎస్ఎస్ ద్వారా నిల్వ చేస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 3,35,485 యూనిట్ల విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసి అవసరమైన సమయంలో వినియోగించారు. దీని ద్వారా సంస్థకు రూ.25,66,460 మేర లబ్ధి చేకూరింది. -
ఆ ఉద్యోగ ప్రకటన నకిలీది స్పష్టం చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న దేవాదాయ శాఖ ఉద్యోగ ప్రకటన నకిలీదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు సోషల్ మీడియా, వివిధ వెబ్సైట్లలో వస్తున్న వార్తలను ప్రభు త్వం ఖండించింది. ఈ మేరకు ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.కృష్ణప్రసాద్ గురువారం ప్రకటన విడుదల చేశారు.నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వ ముద్ర, దేవాదాయ శాఖ పేరుతో నకిలీ నోటిఫికేషన్‌ను సృష్టించారన్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామంటూ మే 30 వరకు గడువు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోందని, అయితే తమ శాఖ నుంచి ఎలాంటి ఉద్యోగ ప్రకటన విడుదల కాలేదని స్పష్టం చేశారు. -
ఐటీ @ 11 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ.. ముఖ్యంగా హైదరాబాద్ పేరు చెప్పగానే తొలుత గుర్తొచ్చేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదే. వందలాది అంతర్జాతీ య దిగ్గజ కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 2025 మార్చి నాటికి ఐటీ రంగంలో ప్రత్యక్షంగా 9.39 లక్షల మంది పనిచేస్తున్నారు.గత ఏడాది చివరినాటికి ఈ సంఖ్య 10.2 లక్షలకు చేరినట్టు అంచనా. కంపెనీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) రాష్ట్రంలో కొత్తగా అడుగుపెట్టడం, అలాగే ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థల విస్తరణతో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. దీంతో ఈ ఏడాది డిసెంబరుకల్లా ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య 11 లక్షల మార్కును చేరుకుంటుందని తెలంగాణ ఐటీ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జీసీసీల్లో పనిచేస్తున్న వారి సంఖ్య 3 లక్షల స్థాయికి చేరిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 16.6 శాతం వార్షిక వృద్ధితో.. రాష్ట్రం నుంచి 2024–25లో రూ.3.13 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగాయి. కాగా 16.6 శాతం వార్షిక వృద్ధితో 2025–26లో ఇది రూ.3.6 లక్షల కోట్లకు చేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ‘వేగం, పారదర్శకత’అనే నినాదంతో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తీసుకొచ్చిన సరికొత్త పరిపాలనా సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక మందగమనం, ఐటీ వ్య యాల ఒడిదుడుకులను తట్టుకుని ఎగుమతుల వృద్ధి స్థిరంగా కొనసాగుతోందని తెలిపారు. ఉత్తర అమెరికా మార్కెట్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తూ ఈ యూ, ఏషియా పసిఫిక్ మార్కెట్లలోకి వ్యూహాత్మ కంగా ఎగుమతులు విస్తరించాయని వివరించారు. మూడేళ్లలో కొత్తగా 160 కేంద్రాలు..రాష్ట్రంలో 2023 నాటికి 360 జీసీసీలు కొలువుదీరాయి. దేశంలోని మొత్తం జీసీసీల్లో రాష్ట్ర వాటా 20 శాతంగా ఉందని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. జీసీసీల స్థాపనకు దేశ, విదేశీ సంస్థలు ఆసక్తి కనబరుస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తున్నాయి. అంతర్జాతీయ డిమాండ్, ఇక్కడి మానవ వనరులు, మెరుగైన మౌలిక వసతులతో ఈ ఏడాది మరో 80 సెంటర్లు తోడవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. బెంగళూరు, ముంబైతో పోలిస్తే హైదరాబాద్‌లో అద్దెలు 25–30 శాతం తక్కువ కావడం కంపెనీలకు కలిసి వచ్చే అంశమని చెబుతోంది. -
ఈ శాడిజం ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: ‘పోక్సో కేసులో ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేయాలి. జీరో ఎఫ్ఐఆర్ చేసి పద్ధతి ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమ్మాయి తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డు చేశాం. అమ్మాయిని కోర్టుకు తీసుకెళ్లి సీఆర్పీసీ సెక్షన్ 164 కింద స్టేట్మెంట్ ఇప్పించాం. మా చర్యలను ప్రజలు గానీ, కోర్టులు గానీ తప్పుబట్టలేదు. పోక్సో కేసు వివరాలు చెప్పకూడదు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ దర్యాప్తు అధికారి (ఐఓ) లాగా విచారణ చేసిండు. కేటీఆర్ జడ్జీలాగా శిక్ష వేసిండు. వారిలాగా రోడ్లపై పడి మాట్లాడితే ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటది? ఆ అమ్మాయి, తల్లిదండ్రుల ఫొటోలు పెట్టారు (సోషల్ మీడియాలో). రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు. ఎన్నికల్లో ఓడించు. ఒక మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు ఎందుకు? ఒక మైనర్ అమ్మాయిని అడ్డుపెట్టుకుని రాజకీయాల్లో ఏదో సాధించినట్టు ఈ శాడిజం ఏమిటి? ఇది శాడిస్టిక్ ఆనందం కాదా?..’అని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో విలేకరుల సమావేశం సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. కేటీఆర్ సర్టిఫికెట్లు ఇచ్చే అథారిటీనా? ‘అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టడానికి ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కరీంనగర్లో ఒక కేసు పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్లో అమ్మాయి మేజర్ అనే వివాదానికి తెరలేపారు. అమ్మాయి మైనరా? మేజరా? అనే ప్రభుత్వ రికార్డులు సేకరించాం. అమ్మాయి ఏజ్ ఎంత అని ఎవరు నిర్ధారించాలి? కేటీఆర్ సర్టిఫికెట్లు ఇచ్చే అథారిటీనా? ప్రవీణ్‌కుమార్ ఐఓనా? ఐఓ వెళ్లి స్కూల్లో ఆమె బర్త్ సర్టిఫికెట్, టెన్త్ సర్టిఫికెట్, హాస్పిటల్లో బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకుని మైనర్ అని తక్షణమే నిర్ధారించారు. ప్రవీణ్‌కుమార్‌కు ఉద్యోగం లేదు.. ప్రధాని పర్యటన ఉన్నప్పుడు వారి (బండి సంజయ్) ఇంటిపైకి వెయ్యి మంది పోలీసులను పంపితే తమ పార్టీ (బీజేపీ) ఆకాశమంత ఎత్తు ఎదిగిందని, తెలంగాణలో గెలుస్తుందని, దీనితో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందని ఆయన చెçప్పుకుంటాడు. సున్నితమైన సమస్యను సున్నితంగా పరిష్కరించాం. ఎక్కడైనా సెక్షన్లలో, అరెస్టులో, రిమాండ్‌లో, కోర్టులో వాదనల్లో లోపం ఉందా? కేటీఆర్, బండి సంజయ్‌కి ఏదో పంచాయితీ ఉంది. ఆ పంచాయితీని పిల్లల మీద పెట్టి కేటీఆర్ తీర్చుకోవాలనుకుంటున్నడు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉద్యోగం లేక గాలికి తిరుగుతూ నేనే విచారణాధికారి అనే భ్రమల్లో ఉన్నడు.’అని సీఎం ధ్వజమెత్తారు. కేటీఆర్ బావమరిదికి ఇంకో న్యాయమా? ‘కేటీఆర్ బావమరిదికి కూడా డ్రగ్స్ కేసులో విచారణకు నోటీసులు ఇచ్చాం. పోక్సో కేసులో బండి భగీరథ్‌కి నోటీసులు ఇచ్చాం. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుని తన బావమరిది దొరికితే అతడిని వంగబెట్టి గొట్టండి..కోదండం ఎక్కించండి అని కేటీఆర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎందుకు చెప్పలేదు. మా బామ్మర్ది దీపావళి పండుగ చేసుకుంటున్నడు. చిచ్చుబుడ్లకు బదులు సారాయి బూత్ పెట్టుకున్నడు. బంతిపూలకి బదులు గంజాయి పూలు లేకపోతే కొకైన్ పెట్టుకున్నడు. మీరు ఎట్ల అరెస్ట్ చేస్తరు అని బయటకి వచ్చి మాట్లాడిండు కదా. బామ్మర్ది డ్రగ్స్‌తో ఫామ్‌హౌస్‌లో పట్టుబడితే కేసు కాదట. ఇంకో ఎమ్మెల్సీ కోడిపందాల్లో దొరికితే కేసు లేదట. దుబాయ్‌లో చనిపోయిన కేటీఆర్ మిత్రుడు..ఆర్థిక లావాదేవీలు, వాళ్ల ఎక్స్ ఎమ్మెల్యే గురించి ఇవాళ చెప్తున్న. వాళ్ల ఫామ్‌హౌస్‌లో పోలీసులపై కాల్పులు జరిపి (ఓ వ్యాపారి) డ్రగ్స్‌తో దొరికిండు. మరి ఇంత చట్టాన్ని గౌరవించి సమాజాన్ని ఉద్ధరించే కేటీఆర్ యాడ పండుకుండు? ఎందుకు పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయలేదు ? వాడికి నోటీసు ఇవ్వలేదు. నీతులు చెప్పడానికే ఉన్నయా?. కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ‘కేటీఆర్ ఆరోపణలు నిజమైతే కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే ప్రతిపక్ష నేత యాడ నిద్రపోతుండు? బయటకి వచ్చి మాట్లాడేందుకు శక్తి లేకుంటే ప్రెస్‌నోట్ అయినా ఇవ్వొచ్చు కదా? పక్క పార్టీ వాడు పార్టీలోకి వస్తే జగిత్యాల పోయివస్తడు. ఇంత మేజర్ ఘటన రాష్ట్రంలో జరిగితే ప్రతిపక్ష నేత ఎక్కడికి పోయిండు? ఆ బాధిత కుటుంబానికి అండగా నిలవాలి కదా. అధికారం ఉంటనే బయటకి వస్తావా?..’అని రేవంత్ ప్రశ్నించారు. మా పోలీసులు చెప్పిందే నమ్ముతా.. ‘బండి భగీరథ్‌ను అరెస్టు చేశామని మా పోలీసు సిబ్బంది చెప్పిందే నేను నమ్ముతా. పిల్లవాడిని వారి ఇంట్లో పెట్టుకుని పోలీసులను పిలిపించి సరెండర్ చేయాలి. రోడ్డుపై నాకాబందీ చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ వద్ద పోలీసులకు బండి భగీరథ్ చిక్కిండు. రోడ్డు మధ్యలో పోలీసులు కస్టడీలో తీసుకుంటే సరెండర్ చేశామని చెప్పే రాజకీయ నాయకుల మాటలు నమ్మాలా? పోలీసుల మాటలా? బండి సంజయ్ దగ్గరుండే పంపించవచ్చు. ఐదు రోజులు పరారీలో ఉన్నప్పుడు తండ్రీకొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా? లేరా?..’అని సీఎం నిలదీశారు. రైతు ఆత్మహత్యపై విచారణకు ఆదేశం మెదక్‌లో రైతు ఆత్మహత్యపై విచారణ జరపాలని కలెక్టర్‌కు ఆదేశించినట్టు రేవంత్ తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. చనిపోయిన రైతు కుటుంబానికి గతంలో కొల్లగొట్టిన ధనం నుంచి రూ.2 లక్షలో రూ.5 లక్షలో ఇస్తారనుకుంటే శవం చూసి పళ్లు ఇకిలిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.కొంతమంది బీఆర్ఎస్ అనుకూల మిల్లర్లు ఉన్నారని, వారి మిల్లులకు లారీల్లో ధాన్యం పంపితే దించనీయకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. శవాల మీద పేలాలు ఏరడం ఏమిటి? అని ప్రశ్నించారు. కులగణనను సుప్రీంకోర్టు ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచిందని అన్నారు.మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలులో మోదీ సర్కార్ కుయుక్తులు ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో మళ్లీ ఆ బిల్లు పెట్టాలి: సీఎం రేవంత్‌రెడ్డి లక్డీకాపూల్(హైదరాబాద్): మహిళా రిజర్వేషన్ల బిల్లులో మోదీ సర్కార్ కుయుక్తులు పన్నిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు మహిళా బిల్లుకు డీలిమిటేషన్‌తో లింక్ పెట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం సచివాలయం వద్ద ఉన్న విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్‌గాంధీ అని ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలన్నారు. తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. రాజీవ్‌గాంధీ సరళీకృత విధానాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన గొప్ప దార్శనికుడన్నారు. రాజీవ్ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. సోనియాగాంధీ సాహసోపేత నిర్ణ యంతోనే తెలంగాణ కల సాకారమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలోఎంపీ అనిల్‌యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ పాల్గొన్నారు. -
సభ్యత్వ నమోదుకు ఇన్చార్జిలు
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ పద్ధతిలో పార్టీ సభ్యత్వ నమోదు కోసం బీఆర్ఎస్ చేస్తున్న సన్నాహాల్లో భాగంగా పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 119 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించారు. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులకు జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు సమన్వయ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా నియమితులైన ఇన్చార్జిలు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. ఈ మేరకు 119 నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల పేర్లతో కూడిన జాబితాను కేసీఆర్ గురువారం విడుదల చేశారు. సభ్యత్వ నమోదు ఇన్చార్జిలతో పాటు ప్రతీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఐటీ నిపుణుడికి తెలంగాణ భవన్లో డిజిటల్ పద్ధతిలో నమోదుపై శిక్షణ ఇస్తారు. డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు కోసం రూపొందిస్తున్న డిజిటల్ యాప్‌కు తుది మెరుగులు పూర్తయిన తర్వాత త్వరలో ఇది అందుబాటులోకి రానున్నది.ఇదిలా ఉంటే తెలంగాణ భవన్లో శిక్షణ అనంతరం జిల్లా కేంద్రాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఇప్పటికే నియమితులైన పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్చార్జిల ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కోసం నియోజకవర్గాల్లోని బూత్‌ల సంఖ్య ఆధారంగా ఒక్కో పోలింగ్ బూత్‌కు ఇద్దరు చొప్పున స్మార్ట్ ఫోన్ కలిగిన కార్యకర్తలను ఎంపిక చేసి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత డిజిటల్ సభ్యత్వ నమోదు తేదీని ప్రకటిస్తారు. తొలి రోజున పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో పాటు ముఖ్య నేతలు పాల్గొని తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకుంటారు. సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత గ్రామ స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు సంస్థాగత కమిటీ ఎన్నికల షెడ్యూలును ప్రకటించనున్నారు. -
ఉడుకుతున్న ఊళ్లు
సాక్షి, హైదరాబాద్: అత్యధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత తీవ్ర స్థాయికి చేరి..నిప్పుల కొలిమిలో ఉన్నట్టుగా మండిపోతున్నాయి. గురువారం అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చుంచుపల్లి, కమలాపూర్, ధర్మపురి, మహదేవ్పూర్, గంగధార, కల్లూరు, ఆసిఫాబాద్, మందమర్రి, వెంకటాపూర్, కట్టంగూరు, వేములవాడ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 46.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మరో 10 ప్రాంతాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే అధికంగా నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చురుగ్గా నైరుతి... నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులు తున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రంలోని చాలా ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు మరియు తూర్పు–మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ నెల 26న కేరళను తాకే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. భగ్గుమన్న ఉమ్మడి ఖమ్మం సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సూర్యుడు పంజా విసిరాడు. రికార్డుస్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం ఖమ్మం జిల్లాలోని 42 వెదర్ స్టేషన్లలో 45 డిగ్రీలకుపైగా రెడ్ అలర్ట్ స్థాయిలో నమోదయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 19 ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. – ఖమ్మం జిల్లాలోని కల్లూరు, సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ, వైరా, భద్రాద్రి జిల్లాలోని చుంచుపల్లి మండలం 3 ఇంక్లైన్, పాల్వంచ మండలం యానంబైల్‌లో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. – ఏన్కూరు మండలం తిమ్మారావుపేట, మధిర, కొణిజర్ల మండలం గుబ్బగుర్తి, బోనకల్ మండలం రావినూతల, మధిర మండలం సిరిపురం గ్రామాల్లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. – సత్తుపల్లి, ముదిగొండ, ఖమ్మం అర్బన్ ప్రకాశ్‌నగర్, ఎర్రుపాలెం, ఖమ్మం అర్బన్ ఎన్నెస్పీ గెస్ట్‌హౌస్ ప్రాంతాల్లో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది. కంటెయినర్లో మంటలు....8 కొత్త కార్లు దహనం తూప్రాన్: కంటెయినర్లో మంటలు చెలరేగి అందులో ఉన్న 8 కొత్త కార్లు కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. నాగపూర్ నుంచి కాకినాడకు మారుతి సుజుకి కంపెనీకీ చెందిన ఎనిమిది కొత్త కార్లతో కంటెయిన్ వెళుతోంది. తూప్రాన్ సమీపంలోని నాగులపల్లి చౌరస్తా సమీపంలోకి కంటెయినర్ చేరుకోగా, ఇంజిన్‌లో నుంచి పొగలు రావడం డ్రైవర్ నజీం గమనించాడు. వెంటనే అప్రమత్తమై కంటెయినర్‌ను రహదారి పక్కకకు ఆగి కిందకు దిగాడు. ఈ క్రమంలోనే లారీ మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 8 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో ప్రమాద రహదారిపై ట్రాఫిక్ జామ్ కాగా, వాహనాలను దారి మళ్లించారు. అయితే ప్రమాదానికి అధిక ఉష్ణోగ్రతే కారణమని భావిస్తున్నారు. హార్వెస్టర్ దగ్ధం ముధోల్: నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడా సమీపాన రోడ్డుపై హార్వెస్టర్ కాలిపోయింది. ఎండవేడికి బ్యాటరీలోని వైరింగ్ ఒక్కసారిగా కాలి మంటలు హార్వెస్టర్ మొత్తం వ్యాపించాయి. దీంతో హార్వెస్టర్ పూర్తిగా కాలి బూడిదయింది. రోడ్డుపై అమ్లెట్ నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో గురువారం నర్సంపేట–వరంగల్ ప్రధాన రహదారిపై స్థానికుడు ఎస్కె.రఫీసాఫ్ ఆమ్లెట్ వేశాడు. వడదెబ్బతో 8 మంది మృతి – మృతుల్లో ఇంటర్ విద్యార్థి సాక్షి నెట్వర్క్: వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 8మంది మృతి చెందారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు చెందిన కౌలురైతు పొన్నాల భరత్ (34), మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వలకు చెందిన గాదె కొమురమ్మ(90), బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన కేస లచ్చమ్మ(90), నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్‌తండాకు గుగులోత్ అమృత (54), కురవి మండలం రాజోలుకు చెందిన నల్ల లింగయ్య(70), ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన మాదరి లక్షి్మ(85), జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పోతుగల్ గ్రామానికి చెందిన నాంపల్లి సక్కమ్మ(58) చనిపోయారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన బొమ్మిడి వెంకటేశ్(17) నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవల ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేశారు. వేసవి సెలవులు కావడంతో గ్రామంలోని టెంట్ హౌస్‌లో పనికెళ్తున్నాడు. వడదెబ్బకు గురై చికిత్స నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. -
కోటి ఆశలు నెరవేర్చాం!
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కనీస వేతనాలు నిర్ణయించకపోవడంతో 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌తో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి కార్మిక, పారిశ్రామిక సంఘాలతో చర్చించి ఉభయతారకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం..సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కార్మికులను అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ అనే నాలుగు కేటగిరీలుగా విభజించి వారు పనిచేసే గ్రామీణ/పట్టణ ప్రాంతాల ఆధారంగా వారి వేతనాలను సవరించింది. జూన్ 1 నుంచి ఈ కొత్త వేతనాలు అమ ల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు గ్రామీణ, పట్టణ అనే రెండు జోన్లు ఉండగా, తాజాగా మున్సిపల్ కార్పొరేషన్లు (జోన్–1), మున్సిపాలిటీలు (జోన్–2), గ్రామీణ ప్రాంతాలు (జోన్–3) అనే మూడు జోన్ల ఆధారంగా వేతనాలను ఖరారు చేసింది. స్థానికంగా ఉండే ఇళ్ల అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం ఆధారంగా వేతనాలను పెంచింది. జోన్–1లో అన్‌స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం రూ.12,750 నుంచి రూ.16 వేలకు, సెమీ స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,592 నుంచి రూ.17 వేలకు, స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,772 నుంచి రూ.18,500కు, హైస్కిల్డ్ కార్మికుల వేతనం రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంచినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్‌తో కలిసి గురువారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్మిక వర్గానికి సీఎం ఈ తీపి కబురు వినిపించారు. వారికి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫిర్యాదు చేస్తే చర్యలు ‘కార్పొరేషన్లలో ఇళ్ల అద్దెలు, ధరలు, ద్రవ్యోల్బణం ఎక్కువ కాబ ట్టి అక్కడ ఎక్కువ వేతనాలను, మున్సిపాలిటీల్లో కొంచెం తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకొంచెం తక్కువగా వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. వేతనాల పెంపును మే డే రోజే ప్రకటిద్దామనుకున్నా కొందరి సూచనల కోసం ఆలస్యమైంది. కనీస వేతనాల పెంపు అమలు చేయని పరిశ్రమలపై కార్మీక శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు. కార్మీకశాఖ ను ఇంకా బలోపేతం చేస్తాం. ప్రభుత్వ ప్రోత్సాహకాలు తీసుకున్న పరిశ్రమల్లో 80% ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా నిబంధన పెట్టేందుకు అవకాశం ఉంది..’ అని సీఎం అన్నారు. నైపుణ్యాభివృద్ధితోనే ఉద్యోగ భద్రత ‘ఏఐ వచ్చాక వైట్ కాలర్ జాబ్ ఉద్యోగాలొచ్చే పరిస్థితీ, ఉద్యోగ భద్రతా లేదు. చాలా దేశాల్లో ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి. అమెరికాలో కోట్లాది మంది ఐటీ రంగ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. వారు తిరిగి రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంది. సాఫ్ట్వేర్ చదివితే రూ.లక్ష ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు కానీ సాంకేతిక నైపుణ్యంతో కూడిన చదువులతో రూ.2 లక్షల ఉద్యో గం వచ్చే అవకాశం ఉంది. బ్లూకాలర్ జాబ్స్‌కు ప్రపంచంలో విస్తృత డిమాండ్ ఉంది. ఈ ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేయ లేదు. సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుంటే జర్మనీ, జపా న్, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్‌లో కొన్ని కోట్ల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మీ దగ్గర నైపుణ్యం కలిగిన వారుంటే పంపాల ని ఈ దేశాలు మన ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. నర్సింగ్, సాంకేతిక రంగాల్లో ఎంత మందిని పంపిస్తారని అడుగుతున్నాయి. ఆ దేశాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ స్కిల్స్ వర్సిటీ, ఐటీసీల ఏర్పాటు, పాలిటెక్నిక్ కళాశాలల అప్‌గ్రేడేషన్‌తో ప్రభుత్వం పూర్తిగా బ్లూకాలర్ ఉద్యోగాల మీద దృష్టి పెట్టింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)లో చేరితే నెలకు రూ.2 వేలు స్టైపెండ్ ఇస్తున్నాం. స్కిల్స్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్‌లో చేరేవారి కోసం కూడా మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తాం. యువతకు జపనీస్, జర్మన్, కొరియన్ భాషలను నేర్పడానికి ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాం. జర్మనీ, చైనా, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్‌లో 80 శాతం మందికి ఆంగ్లం రాదు. సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ప్రపంచ అవసరాలన్నీ ఈ నాలుగైదు దేశాలే తీరుస్తున్నాయి. ఈ దేశాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను తీర్చిదిద్దాలని మా ప్రయత్నం. ఏఐ తుపాన్లో అమెరికానే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. బ్లూ కాలర్ స్కిల్ నేర్చుకుంటే 100 శాతం జీవిత భద్రత ఉంటుంది..’అని రేవంత్ అన్నారు. గల్ఫ్ వెళ్లే వారికి శిక్షణ ‘ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాలనుకునే వారికి ప్రభుత్వ మే శిక్షణ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. స్కిల్స్ వర్సిటీలో ఆరు నెలల శిక్షణ నుంచి నుంచి పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ వరకు వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. గతంలో గల్ప్ కార్మీకులు చనిపోతే శవాలను సైతం ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రూ.5 లక్షల బీమా ఇవ్వడంతో పాటు శవాలను తీసుకొస్తున్నాం. గల్ఫ్ ఏజెంట్లు పడగలెత్తి పెద్దపెద్ద పదవుల్లోకి వచ్చారు. కానీ కార్మికులు మోసపోతున్నారు. గల్ఫ్ కార్మీకులకు సంబంధించి త్వరలో మంచి పాలసీతో వస్తాం..’అని సీఎం చెప్పారు. ప్రధాని ప్రతిదీ రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాము కార్మీకుల కోణం చూస్తాం కాబట్టి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సింగరేణిలో స్థానికులకే 80% ఉద్యోగాలు: మంత్రి వివేక్ సింగరేణి సంస్థలో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు కార్మీక శాఖ మంత్రి జి.వివేక్ తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుమతులిచ్చే సమయంలో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని చెబుతున్నామని, హైస్కిల్డ్ ఉద్యోగాల విషయంలో వారిష్టమని అంటున్నామని చెప్పారు. కొత్తగా 56 ఏటీసీలను మంజూరు చేయడంతో మొత్తం సంఖ్య 118కి పెరగనుందన్నారు. -
భగీరథ్ ‘ముందస్తు బెయిల్’ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ‘పోక్సో’కేసులో బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు అతని తరఫు న్యాయవాది దాఖలు చేసిన ఉపసంహరణ లేఖను అనుమతించింది. తనపై పేట్‌బషిరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్‌పై విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఉపసంహరణకు అనుమతించాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది లేఖను పరిశీలించిన న్యాయమూర్తి అంగీకరించారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకునేందుకు అనుమతించారు. -
ధాన్యం కొనుగోళ్లపై వాస్తవాలు..విమర్శలు గుప్పించిన ఉత్తమ్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన రైతుల సంక్షేమంపై లేఖలో ధాన్యం కొనుగోళ్ల సమయంలో పది మంది రైతులు మృతి చెందారని చేసిన ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. ‘ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు ఒక్క రైతు కూడా చనిపోలేదు’ అని స్పష్టం చేశారు.రికార్డు స్థాయి కొనుగోళ్లుఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి నమోదైంది. ఇది దేశ చరిత్రలోనే అత్యధిక దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 8,575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు 5429 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రాలకు చేరగా, ప్రభుత్వం 46.21 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. రైతులకు ఇప్పటి వరకు 7,841 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయి. మొత్తం 6.3 లక్షల మంది రైతులు ఈ ప్రక్రియలో లాభం పొందారు. ధాన్యం తరలింపుకు 13,000 వాహనాలు, నిల్వకు 18.3 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచారు.బీఆర్ఎస్ పాలనపై ఆరోపణలుఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, మిల్లర్లతో లాలూచీ, చెల్లింపుల ఆలస్యం జరిగిందని ఆరోపించారు. మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల పరిస్థితి వారి అవినీతి పాలనకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టుపై శాస్త్రీయ పరిశోధనలు జరుపుతూ, నీటి వనరులను రైతుల భవిష్యత్ కోసం వినియోగించే విధానాన్ని అమలు చేస్తోందని ఆయన తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, సాగునీటి సరఫరా పై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. -
‘బండి భగీరథ్ లొంగిపోలేదు..పోలీసులే అరెస్ట్ చేశారు’
సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసులో తన కుమారుడిని విచారణ నిమిత్తం తానే పోలీసులకు సరెండర్ చేశానని అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు.బండి భగీరథ్ లొంగిపోలేదు. పోలీసులు అరెస్టు చేశారు. అప్పా జంక్షన్లో పోలీసులు వాహనాల తనిఖీ చేసేటప్పుడు భగీరథ్ చిక్కాడు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. రోడ్డు మధ్యలో అతడ్ని కస్టడీలోకి తీసుకున్నామని మా పోలీసులు చెప్పారు. నేను మా పోలీసుల మాట నమ్మాలా.. రాజకీయ నాయకుల మాట నమ్మాలా. సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే సరెండర్ చేశారని అనుకోవచ్చు.ఐదు రోజులు పోలీసులు సోదాలు చేసినప్పుడు తండ్రీకొడుకులు ఎక్కడున్నారు. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ల పిల్లవాడ్ని వాళ్లింట్లో పెట్టుకుని పోలీసులను పిలిపించి అప్పచెబుతారు. సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే.. సరెండర్ చేశారని అనుకోవచ్చు.ఐదు రోజులుగా పోలీసులు సోదాలు చేసినప్పుడు బండి సంజయ్, భగీరథ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మైనర్ బాలిక విషయంలొ రాజకీయాలు చేయడం ఏంటి అని మండిపడ్డారు. -
తెలంగాణలో కార్మికులకు గుడ్‌న్యూస్.. వేతనాలు భారీగా పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పింది. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో కార్మికులను నాలుగు విభాగాలుగా ప్రభుత్వం విభజించింది. కార్మికులకు ఇది తెలంగాణ ఆవిర్భావ కానుక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పెంచిన వేతనాలు జూన్ రెండో తేదీ నుంచి అమలులోకి వస్తాయన్నారుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. యువతకు నా విజ్ఞప్తి. సాంకేతిక నైపుణ్యం పెంచుకోండి. నైపుణ్యం ఉన్న వాళ్లను పంపాలని.. మన ప్రభుత్వాన్ని ఎన్నో దేశాలు సంప్రదిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కార్మికులకు కనీస వేతనం ఎక్కువగా ఉండాలి. కార్మికుల హక్కులను కాపాడటమే మా లక్ష్యం. కార్మికుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గడిచిన 15 ఏళ్లలో కార్మికులకు వేతన సవరణ చేయలేదు. గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసింది. మేము అధికారంలోకి వచ్చాక కార్మికుల కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేశాం.గతంలో అర్బన్, రూరల్.. రెండే జోన్లు ఉండేవి. ఇప్పుడు మూడు జోన్లు చేశాం. నాలుగు కేటగిరిలుగా కార్మికులను విభజించాం. కనీస వేతనాలు సవరించకపోవడం వల్ల కోటీ 11 లక్షల మంది కార్మికులు నష్టపోయారు’ అని చెప్పుకొచ్చారు.వేతనాల పెంపు ఇలా..అన్‌స్కిల్డ్ కార్మికులకు రూ.12వేల నుంచి రూ.16వేలకు పెంపు.హైస్కిల్డ్ కార్మికులకు రూ.14,600వేల నుంచి 20వేలకు పెంపు.సెమీ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం రూ.13590 నుంచి రూ.15వేలకు పెంపు.స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనం రూ.17వేల నుంచి రూ.18వేలకు పెంపు. -
రాజస్థాన్‌లోని కోటా తరహాలో ట్రాఫిక్ ఫ్రీ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను ట్రాఫిక్ సిగ్నల్ రహత నగరంగా మార్చుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో..ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని కోటా నగరంలో ప్రస్తుతం సిగ్నల్ ఫ్రీ రహదారులు ఉన్నాయి. ఆ తరహాలోనే మన నగరంలోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ‘కేబీఆర్’తో మొదలు.. 800 కిలో మీటర్ల రహదారి నెట్వర్క్ ఉన్న గ్రేటర్లో తొలుత జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ఫిల్మ్‌నగర్ వరకు పూర్తిగా సిగ్నల్ రహిత కారిడార్‌ను నిర్మించనున్నారు. రోడ్ నంబరు– 45, ఫిల్మ్‌నగర్, క్యాన్సర్ హాస్పిటల్, ముగ్ధ జంక్షన్‌తో సహా కీలక కూడళ్ల వద్ద గ్రేడ్ సెపరేటర్లను ప్రతిపాదించారు. రెండు వేర్వేరు ప్యాకేజీల కింద జీహెచ్ఎంసీ కేబీఆర్ పార్క్ జంక్షన్, బంజారాహిల్స్ చుట్టూ రూ.1,000 కోట్లకు పైగా వ్యయంతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మిస్తోంది. కేబీఆర్ పార్క్ భూమిని ఆక్రమించకుండా ప్రతిపాదిత ఫ్లై ఓవర్లు, అండర్పాస్లన్నింటినీ ఇప్పటికే ఉన్న రోడ్డు మధ్యభాగాల్లోనే నిర్మించనున్నారు. అలాగే కాంక్రీట్ నిర్మాణాల కంటే స్టీల్ ఫ్లై ఓవర్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలలో 13.6 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల విడుదల నివారణతో వాయు కాలుష్య స్థాయిలను 72 శాతం తగ్గించొచ్చు. ఏటా 40 కోట్ల లీటర్లకు పైగా ఇంధనం ఆదా అవుతుందని అంచనా. సాధ్యమేనా? రాజస్థాన్‌లోని కోటా నగరం తరహాలో గ్రేటర్లో ఈ విధానాన్ని అమలు చేయడం అంత సులువు కాదని, ఈ ప్రతిపాదన ఆచరణలో అనేక సవాళ్లున్నాయని రోడ్డు భద్రతా నిపుణులు అభిప్రాపడుతున్నారు. 2014లో నగరంలో 42.2 లక్షల వాహనాలు ఉండగా.. తాజాగా వీటి సంఖ్య 94.16 లక్షలు దాటింది. నగరంలో సగటున ప్రతిరోజూ 1,500 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఈమేరకు మౌలిక సదుపాయాలు, రహదారుల విస్తరణ లేకపోవడంతో ట్రాఫిక్ చిక్కులు తీవ్రమవుతూనే ఉన్నాయి. ఇలా చేస్తే బెటర్.. నగరం మొత్తాన్ని సిగ్నల్ రహితంగా మార్చడం కాకుండా కీలక కూడళ్ల వద్ద దీర్ఘకాలంగా ఉన్న ట్రాఫిక్ రద్దీని తొలగించడంపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తే ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కెమెరాలు, సెన్సార్లను ఉపయోగించి ఆరి్టఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారిత అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్స్ వినియోగిస్తే కూడళ్లలో ట్రాఫిక్ రద్దీని బట్టి వాహనాల వెయిటింగ్ సమయం ఆటోమేటిక్‌గా మారుతుంది.లాభమేంటంటే? సిగ్నల్ ఫ్రీలతో ప్రధాన కూడళ్ల వద్ద నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాలు ఎక్కడా నిలిచిపోకుండా నిరాటంకంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రతీ లైన్‌కూ ప్రత్యేకంగా రహదారి ఉంటుంది. దీంతో జంక్షన్లో ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్ గానీ, ట్రాఫిక్ పోలీసులు గానీ అవసరం ఉండదు. దీంతో ప్రధాన నగరంలో రహదారి భద్రత మెరుగవడంతో పాటు ట్రాఫిక్ సజావుగా సాగుతుంది. దీంతో ప్రయాణ సమయం, ఇంధన వినియోగం ఆదా అవుతుంది. ధ్వని, వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ‘కోటా’ కథ ఇదీ..15 లక్షల జనాభా ఉన్న కోటా నగరం 2022లో దేశంలోనే తొలి సిగ్నల్ రహిత నగరంగా అవతరించింది. సుమారు రూ.2 వేల కోట్ల వ్యయంతో వందకు పైగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, రౌండ్ అ»ౌట్లు, రోటరీలు, రింగ్రోడ్లను పునరి్నరి్మంచారు. కోటాలోని సుమారు 12 ప్రధాన కూడళ్లలో రోజుకు 7 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. -
HYD: మదీనాలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మదీనాలోని ఎస్‌వైజే వస్త్ర దుకాణంలో గురువారం ఉదయం మంటలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి ఎనిమిది ఫైర్ ఇంజిన్లు చేరుకుని మంటలను అదుపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు చెలరేగిన కాంప్లెక్స్‌లో వందకు పైగా దుకాణాలు ఉండటంతో ఆందోళన నెలకొంది. -
తల్లితో సహజీవనం.. ఆమె కూతురిపై లైంగిక దాడి
మేడ్చల్ జిల్లా: తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై అల్వాల్ పోలీసులు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. మచ్చ»ొల్లారంలో నివసించే ఓ మహిళ (33) మహిళ భర్తకు దూరంగా ఉంటూ 15 సంవత్సరాల కూతురితో కలిసి నివాసముంటోంది. స్థానికంగా ఉండే దుర్గాప్రసాద్ (34) తో సహజీవనం చేస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయలో దుర్గాప్రసాద్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. -
అత్తాపూర్ లో యువతి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్
అత్తాపూర్: రోడ్డుపై అందరూ చూస్తుంగానే అత్తాపూర్‌లో మంగళవారం రాత్రి ఓ యువతిని దుండగులు కిడ్నాప్ చేశారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. నలుగురు యువకులు నెంబర్ లేని థార్ కారులో జాయ్ హాస్పిటల్ వద్ద యువతిని బలవంతంగా తీసుకొని వెళ్లారని స్థానికులు 100 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు కారును అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు వెంబడించే ప్రయత్నం చేయగా పరారయ్యారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. యువతి కిడ్నాప్ అయిందా? లేక వేరే కారణం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. అమ్మాయి ఇంట్లోనే ఉందిదర్యాప్తులో యువతి ఎవరనేది తెలిసిందని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు యువతి మలక్‌పేట్‌లోని ఇంట్లోనే ఉందని తెలుసుకున్నారన్నారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన సందర్భంగా గొడవ పడ్డారన్నారని... ఆ తరువాత క్యాబ్‌లో బయలుదేరగా అత్తాపూర్‌లోని జాయ్ అస్పత్రి వద్ద దిగిందన్నారు. అక్కడినుంచి స్నేహితులే కారులో తీసుకెళ్లారని వివరించారు. స్నేహితుల స్టేట్మెంటును నమోదు చేశామని తెలిపారు.


