హైదరాబాద్: సహజీవనం చేస్తున్న మహిళ నాలుకను కోసేశాడు ఓ వ్యక్తి. కుషాయిగూడ ఎస్‌ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడ, శుభోదయ కాలనీలో నివాసం ఉంటున్న సుజాత దినసరి కూలీ. ఆమె భర్త చనిపోవడంతో అదే కాలనీకి చెందిన నవీన్ అనే వ్యక్తితో కలిసి ఆరు నెలలుగా సహజీవనం చేస్తోంది.
కూలీ పనిచేసే ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఈ నెల 22న మద్యం మత్తులో ఉన్న వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. మాటామాట పెరగడంతో ఆమె నాలుకను నవీన్ కోశాడు. ఇరుగుపొరుగు గమనించి అదే కాలనీలో ఉండే ఆమె కొడుకు డేవిడ్‌కు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న డేవిడ్ ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.


