గుండు శ్రీనివాసుడికి ‘జుట్టు’తోనే మోక్షం! | Face Recognition App Funny Trouble For Workers After Shaving Head | Sakshi
Sakshi News home page

గుండు శ్రీనివాసుడికి ‘జుట్టు’తోనే మోక్షం!

May 29 2026 12:26 PM | Updated on May 29 2026 12:34 PM

Face Recognition App Funny Trouble For Workers After Shaving Head

మహబూబాబాదు జిల్లా: సాఫ్ట్‌వేర్‌కు కళ్లుంటాయి కానీ బుర్ర ఉండదని తేలిపోయింది. మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ శ్రీనివాస్, కొండగట్టు అంజన్నకు తలనీలాలు ఇస్తే.. అటెండెన్స్‌ యాప్‌ మాత్రం అతని కూలీకి ఎసరు పెట్టింది. సిస్టమ్‌లో పాత జుట్టు ఫొటో ఉండటంతో, గుండుతో వచ్చిన శ్రీనివాస్‌ను చూసి ‘నువ్వు డూప్లికేట్‌’అంటూ యాప్‌ మొండికేసింది. కంగుతిన్న కూలీలు సాఫ్ట్‌వేర్‌ తెలివిని సాగనంపడానికి ఒక మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. పక్కనే ఉన్న మహిళా కూలీ తన జుట్టును శ్రీనివాస్‌ గుండుపై ‘విగ్గు’లా పరిచింది. అంతే, ఆ జుట్టు ముసుగును చూడగానే యాప్‌ సలాం కొడుతూ అటెండెన్స్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు మనోళ్లు ‘కృత్రిమ జుట్టు’తో చెక్‌ పెట్టిన ఈ సంఘటన నవ్వులు పూయించింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement