హైదరాబాద్: వీకెండ్‌లో ఐటీ కారిడార్ కార్ రేస్, బైక్ స్టంట్లకు వేదికవుతోంది. రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో కారు రేస్ రేసింగ్ పాల్పడటం పరిపాటిగా మారింది. శనివారం రాత్రి కార్ రేసింగ్ చేస్తున్నారనే విషయం పోలీసులకు తెలిసింది. దీంతో వారు ఘటన స్థలానికి వెళ్లారు. తమపైకే కారు దూసుకురావడంతో వారు కంగుతిన్నారు. రేసింగ్‌కు పాల్పడిన డిగ్రీ విద్యార్థిని అరెస్ట్ చేశారు. ఇన్‌స్పెక్టర్ సీహెచ్ వెంకన్న చెప్పిన వివరాల ప్రకారం..
టీ హబ్, హై హోంభూజ, ఐకియా రోడ్లలో కారు రేసింగ్ చేస్తున్నారని సమాచారం అందడంతో శనివారం రాత్రి 12.30 గంటలకు బ్లూకోల్ట్ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఎం.రమేష్ హెడ్‌కానిస్టేబుల్ అక్కడికి వెళ్లారు. నాలెడ్జి సిటీలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి నిలోఫర్ కేఫ్ వైపు హోండా సిటీ కారు భారీ శబ్దాలు చేస్తూ రోడ్డుపై మితిమీరిన వేగంతో చక్కర్లు కొడుతోంది.
బ్లూకోల్ట్ సిబ్బంది కారును ఆపేందుకు ప్రయత్నించగా అందులోని వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కారు సైడ్ మిర్రర్ తాకడంతో కానిస్టేబుల్ రమేష్ కుడిచేతికి గాయాలయ్యాయి. ఫిరోజ్‌గాం«దీనగర్‌కు చెందిన మహ్మద్ రెహా్మన్ (18) మెహిదీపట్నంలోని ఓ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి కారు రేసింగ్‌కు వచ్చాడు. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసిన రెహా్మన్‌ను పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. కారులోంచి పారిపోయిన ఒయాసిస్, అయాన్, వాసిమ్‌లపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కారు, బైక్ రేసింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.


