సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక చానెల్ వార్తలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక చానెల్ తనపై రాస్తున్న వార్తలను నమ్మే పరిస్థితి లేదన్నారు. పీసీసీ మార్పు అనేది హైకమాండ్ చూసుకుంటుంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలపై మాట్లాడతానని ఆయన చెప్పుకొచ్చారు.
తనపై వస్తున్న వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ..‘గాంధీ భవన్‌ను ట్రస్ట్ మెయింటైన్ చేస్తుంది. ఒక చానెల్ నాపై వార్తలు రాస్తే నమ్మే పరిస్థితి లేదు. నా పనితీరును కేడర్ అంచనా వేస్తుంది. నేను ఈ విషయాన్ని చాలా లైట్‌గా తీసుకుంటున్నాను. 20 నెలలుగా నా పనితీరు ఏంటో మా నేతలకు తెలుసు. నాపై వచ్చిన వార్తలపై నేను స్పందించవద్దని పార్టీ నేతలకు చెప్పాను. కొన్ని మీడియా సంస్థలకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి.. దానికి నేనేం చేయలేను. పీసీసీ మార్పు అనేది హైకమాండ్ చూసుకుంటుంది. ఏఐసీసీ దృష్టిలో తెలంగాణ పీసీసీది బెస్ట్ అని ఉంది. నాపై వ్యతిరేక వార్తలు రాసిన చానెల్.. గతంలో చాలా పాజిటివ్ వార్తలు కూడా ఇచ్చింది. దీనిపై సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుతాను’ అని వ్యాఖ్యలు చేశారు.
ఫ్యూచర్ సిటీ దేశానికే దిక్సూచిగా మారుతుంది. బీఆర్‌ఎస్‌కు దూరదృష్టి లేదు.. హైదరాబాద్ పరిధి పెంచలేదు. సిటీ విస్తరిస్తే అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్ అభివృద్ధి అవసరం లేదని హరీష్ రావు అంటున్నారా?. తెలంగాణపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది. స్టాలిన్‌లా మేము గత ప్రభుత్వ పథకాలు కొనసాగిస్తున్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేమ్స్ ఏఐసీసీకి పంపించాం.. త్వరలో ప్రకటిస్తాం. తెలంగాణలో కేబినెట్ విస్తరణ సీఎం చూసుకుంటారు. నా ప్రమేయం ఏమీ ఉండదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు.


