కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు : కేటీఆర్‌ | KTR Comments On Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు : కేటీఆర్‌

May 24 2026 1:33 PM | Updated on May 24 2026 3:29 PM

KTR Comments On Congress

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలో పాలనను కాంగ్రెస్‌ గాలికొదిలేసిందని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. ఆదివారం అంబర్‌పేటలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా.. కేటీఆర్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలో పాలనను కాంగ్రెస్‌ గాలికొదిలేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలకు పీకల్లోతు కోపం ఉంది. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు. ఉన్న నగరాన్నే సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదు. ఇలాంటి నాయకుడు ఫ్యూచర్‌ సిటీ నిర్మిస్తాడంటే నమ్మాలా?. బీఆర్‌ఎస్‌లో పనిచేసే వారికే గుర్తింపు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సర్వేల ఆధారంగానే టికెట్లు. బీఆర్‌ఎస్‌లో పని చేసేవారికే గుర్తింపు. 

రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన బీఆర్‌ఎస్‌దే గెలుపు. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తాం. ఎస్‌ఐఆర్‌పై అందరూ అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్‌ పాలనలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాసమస్యలపై పోటారం చేసిన వాళ్లకే టికెట్లు. కొందరి ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది’అని ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement