హైదరాబాద్: యువత గొంతు నొక్కితే బీజేపీ రాజకీయ పతనం తప్పదని మంత్రి ఉత్తమ్‌కుమార్ మండిపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణాలపై మంత్రి ఉత్తమ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నిర్బంధాలు సరికాదని ధ్వజమెత్తారు.
‘ప్రజాస్వామ్యాన్ని భయపెట్టలేరు... రాజ్యాంగాన్ని అణచలేరు. ఉద్యోగాలు అడిగిన యువతకు లాఠీలు, కేసులే బీజేపీ సమాధానామా?, ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కే. విద్యార్థుల స్వరాన్ని అణచివేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు. యువత భవిష్యత్తుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విద్యార్థుల మధ్య నిలిచిన రాహుల్ గాంధీ నిజమైన ప్రజానాయకుడు. ప్రజల మధ్య ఉండే నాయకత్వానికే దేశం మద్దతిస్తుంది. భయపెట్టి ప్రజల స్వరాన్ని శాశ్వతంగా అణచలేరు. విద్యార్థుల కలలను సంకెళ్లతో బంధించలేరు. యువత ఆశయాలను జైళ్ల గోడల మధ్య నిర్బంధించలేరు
రాజ్యాంగాన్ని ఎవరూ ఓడించలేరు. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ చారిత్రక బాధ్యత. యువత విద్వేషం కాదు... విశ్వాసం కోరుకుంటోంది. అహంకారం కాదు... జవాబుదారీతనం కోరుకుంటోంది. ప్రచారం కాదు... పారదర్శక పాలననే యువత కోరుకుంటోంది. 2029 ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షణకు కీలకం. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అందిస్తుంది. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అందిస్తోంది. ప్రజల గొంతు వినే ప్రభుత్వాలే చరిత్రలో నిలుస్తాయి. భారత్‌ను భయంతో కాదు... ప్రజాస్వామ్యం, రాజ్యాంగంతో నడపండి’ అని సూచించారు.


