ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త | Telangana Government Good News For Employees, Releases ₹2,000 Crore In Employee Dues And First Phase Of ₹6,000 Crore Clearance Begins | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త

May 29 2026 5:17 PM | Updated on May 29 2026 6:04 PM

Telangana Government Good News For Employees

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో తొలి విడత రూ. 2,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన రూ.4000 కోట్లు కూడా త్వరలోనే జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్‌ (GPF) బకాయిలు 100 శాతం ప్రభుత్వం క్లియర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

 


 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement