లాయర్‌ మొయిజుద్దీన్‌ హత్య కేసులో నిందితుల అరెస్ట్‌ | Suspects Arrested in Lawyer Moizuddin Death Incident | Sakshi
Sakshi News home page

లాయర్‌ మొయిజుద్దీన్‌ హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

May 24 2026 7:23 PM | Updated on May 24 2026 7:46 PM

Suspects Arrested in Lawyer Moizuddin Death Incident

హైదరాబాద్‌: న్యాయవాది మొయిజుద్దీన్‌ హత్య కేసులో నిందితుల్ని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోవాలో నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబాడిగూడాకు చెందిన వినయ్‌ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టినట్లు గుర్తించారు పోలీసులు. దీనిలో భాగంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఈ హత్య కేసుకు సంబంధించి వినయ్‌తో సహా నలుగుర్ని అరెస్ట్‌ చేశారు. 

కాగా,  శనివారం(మే 23వ తేదీ) నగరంలోని మాసబ్‌ట్యాంక్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.. ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్‌ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం ఉదయం ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్‌ చేశారు. 

ఈ ప్రమాదంలో మొయినుద్దీన్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీని ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement