షాబాద్: కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన రాజు (37) తన కన్న కూతురిపై అక్టోబర్ 12, 2024న లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదవగా, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
కేసు పూర్వాపరాలను పరి శీలించిన ఎల్‌బీనగర్ కోర్టులోని పోక్సో ప్రత్యేక సెషన్స్ న్యాయమూర్తి జి.శ్రీనివాస్ నిందితునికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం మంజూ రు చేశారు. దర్యాప్తు బృందంలోని ఏపీపీ భిక్షప తి గౌడ్, కోర్టు సిబ్బంది ఏండీ హనీఫ్, హెచ్‌జీవీ ప్రభాకర్, అలివేలును సీఐ అభినందించారు.


