బైక్‌పై స్టంట్లు.. లైక్‌ల కోసం స్టేటస్‌.. | Police Take Youth into Custody for Performing Dangerous Stunts on Bike | Sakshi
Sakshi News home page

బైక్‌పై స్టంట్లు.. లైక్‌ల కోసం స్టేటస్‌..

May 26 2026 12:50 PM | Updated on May 26 2026 12:56 PM

Police Take Youth into Custody for Performing Dangerous Stunts on Bike

హైదరాబాద్: బైక్‌పై స్టంట్లు చేయడమే కాక లైక్‌ల కోసం స్టేటస్‌ పెట్టిన బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–5 దేవరకొండ బస్తీ యువకుడు షాదాబ్‌ (19)ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. జెప్టో డెలివరీ బాయ్‌గా పనిచేసే ఇతడు ఇటీవల శామీర్‌పేట రోడ్‌లోకి వెళ్లి బైక్‌ను గాల్లోకి లేపి ఫోన్‌ మాట్లాడుతూ విన్యాసాలు చేశాడు. 

దానిని వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. సోషల్‌ మీడియాలోనూ పోస్ట్‌ చేశాడు. సమాచారం అందుకున్న  పోలీసులు.. షాబాద్‌ను అదుపులోకి తీసుకుని బైక్‌ను సీజ్‌ చేశారు. స్నేహితుల్లో తాను ప్రత్యేకత చాటుకోవాలని, తన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలనే స్టంట్లు చేసినట్లుగా నిందితుడు వెల్లడించాడు. షాదాబ్‌పై  చోరీ కేసు నమోదై ఉందని దర్యాప్తులో తేలింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement